వ్యక్తిగత జీవన లక్ష్యమ | వ్యక్తిగత నైపుణ్యాలు - ఈనాడు
కర్రసాము
కరాటే
యోగ
డ్యాన్స్
25 యోగాసనాలు
Fasting, meditation, semen retention, and lifting weights are extremely dangerous combinations.
It'll turn any ordinary man into a superhuman.
• Maintaining physical fitness is a demonstration of self-respect, reflecting a commitment to one's own well-being and vitality.
ఉపన్యాసం
పాటలు
భజనలు
అభినయ గేయాలు
పద్యాలు
సామెతలు
సందర్భోచిత కథలు
ఏకాత్మత స్తోత్రం 33 శ్లోకాలు కంఠస్థం
భగవద్గీత, రామాయణ శ్లోకాలు
ప్రార్థనలు
దైవభక్తి పాటలు
పురాణ కథలు
ఆధ్యాత్మిక చింతన
తబలా
వంశీ
ఆనక్
శంఖ
చిత్రలేఖనం ఫోటోగ్రఫీ నాటికలు కవితా రచన వ్యాసరచన
Car driving
Spoken Hindi, English
Learning computer skills
*1. శారీరక అంశాలు*
1. దండ
కర్ర సాము
2. నియుద్ధ
3. పదవిన్యాస్
4. యోగాసన్
5. సమత
*2. బౌద్ధిక్*
1. బౌద్ధిక్ (ఉపన్యాస)అంశాలు -
50 కథలు,
50అంశాలపై నోట్స్ తయారీ
2. నీతి పద్యాలు
3. అమృత వచనాలు -
4. సుభాషితాలు -
50 సుభాషితాలు 50 నీతి పద్యాలు
5. దేశభక్తి గీత్ -
50 పాటలు,
20 అభినయ గేయ కథలు
6. దైవ భక్తి గీత్ -
7. భాషలు (తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం)
*3. కళాత్మక అంశాలు*
ఘోష్
ఆనక్ రచనలు
వంశీ రచనలు
సృజనాత్మక వస్తువుల తయారీ
చిత్రలేఖనం
నాటికలు
ఫోటోగ్రఫీ
నృత్యం
కవితా రచన
*4. ఆధ్యాత్మిక అంశాలు*
భజనలు, కీర్తనలు
భగవద్గీత పఠనం
*5. సామాజిక అంశాలు*
అదనపు అంశాలు
ఐదు సంవత్సరాల యోజన
రోజు వారి ప్రణాళిక తయారీ మాస ప్రణాళిక
కార్ డ్రైవింగ్
కంప్యూటర్ కోచింగ్
స్పోకెన్ ఇంగ్లీష్ హిందీ సంస్కృతం
అన్ని గ్రామాలకు చెందిన వ్యక్తులతో పరిచయం
సామాజిక మాధ్యమాల విస్తృత వినియోగం
వ్యక్తిగత పనులు త్వరగా పూర్తి చేయడం
విభిన్న అంశాలపై వీడియో ల తయారీ
టీమ్ ఏర్పాటు
లోపాన్ని గుర్తిస్తేనే.. పరిణతి సాధించినట్లు!
ఈ ప్రపంచంలో చాలామందికి-పని చేయగల సత్తా ఉంటుంది.. కానీ ఏకాగ్రత ఉండదు. అవసరమైన సామర్థ్యాలు ఉంటాయి.. కానీ నిలకడ ఉండదు. వనరులు అందుబాటులో ఉంటాయి.. కానీ వ్యూహాలు ఉండవు. అవకాశాలు ఉంటాయి.. కానీ క్రమశిక్షణ ఉండదు. తమకు లేనిదేదో స్పష్టంగా గుర్తించి, ఆ లోపాన్ని సరిదిద్దుకోగలిగితేనే జీవితంలో పరిణతి సాధించినట్లు.
- శ్రద్ధే కటియార్, వైద్యుడు
నేర్చుకుంటే చేతకానిదంటూ ఉండదు
మీకు వాహనం నడపడం రాకపోతే, ఆ పని మీకు చేతకాదని అర్థం కాదు.
మీరు డ్రైవింగ్ నేర్చుకోలేదని మాత్రమే అర్థం. అలాగే మీకు ఈత రాదంటే, అందుకు కారణం దాన్ని నేర్చుకోకపోవడమే.
నేర్చుకోవాలన్న తపన ఉండాలేగానీ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఏదీ అసాధ్యం కాదు. సాధనతోనే ఏ నైపుణ్యమైనా మీ సొంతమవుతుంది.
కెవిన్ జబో, బ్రాండ్ బిల్డర్
-------------------------------------------------------------------
వాటిని కోల్పోవడమంటే.. నష్టపోవడం కాదు!
కెరీర్లో/జీవితంలో మీరు ఒక మెట్టు ఎదిగిన ప్రతిసారీ ఒక పాత అలవాటు, ఒక స్నేహం, మునుపటి ఆలోచనా విధానం.. ఇలా ఏదో ఒకటి కోల్పోతుంటారు! వాటి గురించి చింతించకండి. ఎందుకంటే వాటిని కోల్పోవడమంటే మీరు నష్టపోవడం కాదు.. సానుకూల రీతిలో పరిణామం చెందడమే!
-నిత్య శ్రీ, కంటెంట్ క్రియేటర్
-------------------------------------------------------------------
ఏకాగ్రత లేకపోతే ఎంత నష్టమో!
పరధ్యానం కారణంగా ఒక్కో వ్యక్తి తన పని దినంలో 28 శాతం సమయాన్ని వృథా చేసుకుంటున్నారని అంచనా. ఈ లెక్కన ఒక్కో ఏడాదిలో 13 వారాలు, కెరీర్ మొత్తంలో ఏకంగా పదేళ్ల విలువైన కాలాన్ని కోల్పోతున్నారు.
దీనివల్ల సంస్థల ఉత్పాదకత దెబ్బతిని ప్రపంచ పురోగతిపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
అందుకే ఏకాగ్రతతో పనిచేయగలిగేవారికే సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి.
మీరు ఆ నైపుణ్యాన్ని సాధన చేయండి.
-ఎరిక్ పార్టకర్, తేర్పారెన్స్ గ్రోత్ మెంటార్
-----------------------------------------------
పెట్టుబడి నాణ్యంగా ఉంటేనే..
స్వీయ ఎదుగుదల కోసం మీపై మీరు పెట్టుకునే పెట్టుబడుల విషయంలో ఎప్పుడూ చవకబారుగా ఆలోచించకండి. మీ కోసం మీరు-నాణ్యమైన దుస్తులు కొనుక్కోండి. రోజూ పోషకాహారం తినండి. మంచి పుస్తకాలు కొనుగోలు చేసి చదవండి. మెరుగైన శిక్షకులున్న జిమ్కు వెళ్లండి. పెట్టుబడుల విషయంలో చవకగా ఆలోచిస్తే.. ఫలితాలూ చవకబారుగా ఉండే ముప్పు అధికమవుతుంది.
-------------------------------------------------------------------
మీరెంత మెరుగ్గా శిక్షణనివ్వాలంటే..
మిమ్మల్ని నాయకుడిగా నిలబెట్టేవి మీ హోదాలు కాదు.. మీరు చేసే పనులు! మీ వద్ద పని చేసే వ్యక్తులకు మీరెంత బాగా శిక్షణనివ్వాలంటే.. వారు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లినా ఆ పని చక్కగా చేసుకోగలగాలి. అదే సమయంలో వారిని మీరెంత బాగా చూసుకోవాలంటే.. ఎంత మెరుగైన అవకాశం ఎదురొచ్చినా వారు మిమ్మల్ని వదిలి వెళ్లకుండా ఉండగలగాలి.
-------------------------------------------------------------------
మీది విధేయతా..? లేక ఆత్మవంచనా?
మీ విధేయత.. మీరు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు దోహదపడాలి. అంతేతప్ప-మిమ్మల్ని బందీగా మార్చేయకూడదు. ఒకరి పట్ల విధేయులుగా ఉండటం మీ శక్తిని, భవిష్యత్ కలలను, ప్రశాంతతను హరించి వేస్తోందంటే.. అది విధేయత కాదు, ఆత్మవంచన! మీరు విధేయత కలిగి ఉన్నారో.. లేక ఆత్మవంచన చేసుకుంటున్నారో సరిగ్గా గుర్తించండి
-------------------------------------------------------------------
నిరంతరం కొత్తగా ఆలోచించండి
ఈ ప్రపంచానికి కావాల్సింది సృష్టికర్తలు, సృజనకారులు.అంతేతప్ప ప్రతి పనినీ విమర్శిస్తూ కూర్చునేవారు కాదు. నిరంతరం ఏదో ఒకటి కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండండి. వినూత్న ఆలోచనలు చేసేవారిని ఎగతాళి చేసేవారిగా మాత్రం మారకండి.
- ఆరెలియో, వ్యాపారవేత్త
----------------------------------------------
మీ లక్ష్యాలను రాసిపెట్టుకోండిజీవితంలో మీరేం సాధించాలనుకుంటున్నారో, ఎలాంటి వ్యక్తిగా ఎదగాలనుకుంటున్నారో ఒకచోట రాసిపెట్టుకోండి. వాటిని తరచూ చదవండి. ఒక లక్ష్యమంటూ లేనివారితో పోలిస్తే.. నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకొని కృషిచేసేవారు జీవితంలో విజయవంతమయ్యే అవకాశాలు 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి. నిర్దిష్ట లక్ష్యాలున్నవారిలో.. వాటిని రాసిపెట్టుకోనివారితో పోలిస్తే, రాసిపెట్టుకొని పనిచేసేవారు విజయవంతమయ్యే అవకాశాలు 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి.
బెన్ మీర్, లైఫ్ కోచ్
-------------------------------------------------------------------
ఏకాగ్రత పెరగాలన్నా.. స్పష్టంగా ఆలోచించాలన్నా..
మీరు స్మార్ట్ గా పని చేయాలనుకుంటున్నారా? అయితే రోజూ మీకు మంచి నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్ర అనేది- ఉత్పాదకతకు సంబంధం లేని విషయం కాదు. ఉత్పాదకతను చాలా రెట్లు పెంచగల సాధనమది! మీరు బాగా నిద్రపోతే- ఏకాగ్రత పెరుగుతుంది. స్పష్టంగా ఆలోచించగలుగుతారు. మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యాచరణలోనూ వేగం పెరుగుతుంది.
షనా మెడలూలి, పర్ఫార్మెన్స్ కోచ్
మీరు ఎన్ని పాఠాలు నేర్చుకున్నారు?
మీరు ఎన్ని పుస్తకాలు చదివారన్నది కాదు, వాటి నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకున్నారన్నదే ముఖ్యం. మీరు ఎంత సంపాదిస్తున్నారన్నది కాదు, ఎంత పొదుపు చేస్తున్నారన్నదే కీలకం. మీకు ఎంత మంది స్నేహితులున్నారన్నది కాదు, మీ కష్టసుఖాల్లో అండగా నిలిచేవారు ఎందరన్నదే ప్రధానం. మీ జీవితపు విలువను పెంచే విషయాల పైనే దృష్టి పెట్టండి
-------------------------------------------------------------------
క్రమశిక్షణలో అదీ భాగమే!
స్వీయ క్రమశిక్షణ అంటే.. చెడు విషయాల పట్ల ఆకర్షితులవకుండా మిమ్మల్ని మీరు నిరోధించుకోవడం మాత్రమే కాదు. విజయం సాధించేందుకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించుకోవడమూ దాని పరిధిలోకే వస్తుంది. మీ ఎదుగుదలకు దోహదపడే వ్యక్తులు, అలవాట్లు, సాధనాలు మీ చుట్టూ ఉండేలా చూసుకోండి. es వాతావరణమే మీకు దాదాపు సగం పనిని పూర్తిచేసి పెడుతుంది.
ఇవి చేయకపోతే పశ్చాత్తాపం తప్పదు
క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, పోషకాహారం తీసుకోవడం, రోజూ 8 గంటలు నిద్రపోవడం, మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం.. ఇవి చేసినందుకు మీరు జీవితంలో ఎప్పుడూ పశ్చాత్తాపపడరు. కానీ వాటిని పాటించకపోతే మాత్రం మీరు భవిష్యత్తులో పశ్చాత్తాపపడక తప్పదు.
- ఒలివర్ అన్వర్, ఫిట్నెస్ కోచ్
ఆ అంతరం.. ధైర్యంతో మాయం!
మీరు ప్రస్తుతం ఉన్న స్థితికి, మీరు చేరుకోవాలని కోరుకుంటున్న స్థితికి మధ్య అంతరం ఏంటో తెలుసా..?
కేవలం మీమాంస! మీమాంస అనుమానాన్ని సృష్టిస్తుంది. అది మీ వృద్ధిని నిరోధిస్తుంది. కానీ ధైర్యం మీమాంసను బద్దలుకొట్టి మిమ్మల్ని కార్యాచరణకు పురిగొల్పుతుంది. కార్యాచరణతోనే విజయతీరాలకు చేరుకోగలుగుతాం.
ల్యూక్ డీటన్, మైండ్ కోచ్
-------------------------------------------------------------------
నిన్నటి కంటే నేడు మెరుగ్గా ఉన్నారంటే..
ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించనప్పుడు చాలామంది ఇట్టే నిరుత్సాహానికి గురవుతుంటారు. అయితే పురోగతి ఎల్లప్పుడూ ఒకే వేగంతో చోటుచేసుకోదు. నిన్నటితో పోలిస్తే, గత వారం కంటే, పోయిన నెలతో పోలిస్తే, ఏడాది క్రితం కంటే ఇప్పుడు మీరు మెరుగైన స్థితిలో ఉన్నారంటే.. మీరు సరైన దారిలో ప్రయాణిస్తున్నట్టే! కాబట్టి నిరాశ చెందకుండా కృషి చేస్తూనే ఉండండి.
-------------------------------------------------------------------
మానసికంగా బలంగా తయారవ్వాలంటే..
మీరు మానసికంగా చాలా బలంగా తయారవ్వాలనుకుంటున్నారా? అయితే-
◆ కఠినమైన పనులు చేయడానికి భయపడకండి. ◆మీ నియంత్రణలో లేనివాటి గురించి ఆలోచించకండి.
◆బాధ్యత తీసుకునేందుకు వెనకడుగు వేయకండి. .
◆ఒంటరిగా ఉండేందుకు వెరవకండి
◆ఇతరులు ఏమనుకుంటారో అని ఆందోళన చెందకండి.
◆ గతం గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురవకండి. వదిలేయకండి.
◆ఏ పనినీ మధ్యలో ఇతరుల విజయాలను చూసి కుళ్లుకోకండి.
- మ్యాట్ గ్రే, కంటెంట్ క్రియేటర్
-------------------------------------------------------------------ఒక అడుగు వేస్తే.. తర్వాతి అడుగుకు దారి కనిపిస్తుంది
విజయానికి ఒక నిర్దిష్ట మార్గమంటూ ఏదీ ఉండదు. గెలవాలన్న తపనతో మీరు ఒక అడుగు ముందుకు వేస్తే.. రెండో అడుగుకు దారి కనిపిస్తుంది. రెండో అడుగు వేశాక.. మూడో అడుగు వేసే మార్గం దొరుకుతుంది. మీ పని మీరు ఏకాగ్రతతో సరిగ్గా చేస్తూ ఉంటే.. అలా ఒక్కో అడుగు వేస్తూ విజయ తీరాలకు చేరుకుంటారు. ఆ క్రమంలో- సరైన వ్యక్తులు మీకు అడుగడుగునా చేయూత అందిస్తారు.
- శ్రద్ధే కటియార్, వైద్యుడు
-------------------------------------------------------------------
మీ ఎంపికే భవిష్యత్తును నిర్ణయిస్తుంది
సౌకర్యం, సవాలు.. రెండూ మీ ముందున్నప్పుడు మీరు దేన్ని ఎంచుకుంటారన్నదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సవాలును దూరం పెట్టి, సౌకర్యాన్ని ఎంచుకుంటే.. మీరు యథాతథ స్థితిలో ఉండిపోతారు. ధైర్యంగా సవాలును స్వీకరిస్తే.. మీరు కలలు కన్న వ్యక్తిగా ఎదుగుతారు.
- విల్ హ్యూజెస్, కంటెంట్ క్రియేటర్
-------------------------------------------------------------------
ఆ భ్రమలతో ఆగిపోకండి
ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించకుండా మిమ్మల్ని నిలువరిస్తున్నదేంటో తెలుసా..?
మీ ప్రతికూల ఆలోచనా ధోరణే!
వ్యాయామశాలలో నన్ను చూసి అందరూ నవ్వుకుంటారేమో.. ఇప్పటికే సమయం మించిపోయింది.. నేను వ్యాయామం చేసినా ఫలితాలు కనిపించవేమో.. అన్న ఆలోచనలతో వెనక్కి తగ్గకండి. అవన్నీ భ్రమలే. వ్యాయామశాలలో మీ గురించి ఆలోచించే తీరిక ఇతరులకు ఉండదు. మీ దేహాన్ని దృఢంగా మార్చుకునేందుకు సమయం ఇంకా మించిపోలేదు. మీ వ్యాయామానికి తగ్గ ఫలితం కచ్చితంగా వస్తుంది.
- జాకబ్ వాగ్దాఫ్, హెల్త్ కోచ్
-------------------------------------------------------------------
మీ ఫిట్నెస్ ఏమేం తెలియజేస్తుందంటే..
ఫిట్గా ఉండే మీ శరీరం ఇతరులకు మీ బలం గురించి మాత్రమే తెలియజేస్తుందనుకుంటే పొరపాటే.
దాంతోపాటు-
◆ మీ క్రమశిక్షణను తెలియజేస్తుంది.
◆ మీపై మీకున్న శ్రద్ధను సూచిస్తుంది.
◆ కష్టపడి పనిచేయడానికి మీరు భయపడరని సంకేతాలిస్తుంది.
-జానీ బ్రౌన్, హెల్త్ కోచ్
------------------------------------------------------------------నచ్చకపోయినా.. ఆరోగ్యం కోసం చేయండి
వ్యాయామం చేయడమంటే మీకు అసహ్యమైనా.. మానకుండా చేస్తూనే ఉండండి. రుచికరంగా లేకపోయినా.. కచ్చితంగా శుచికరమైన ఆహారాన్నే తీసుకోండి. రాత్రిళ్లు త్వరగా నిద్రపోవడం నచ్చకపోయినా.
త్వరగానే నిద్రకు ఉపక్రమించండి. మీరు కోరుకుంటున్నది. కాదు.. మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఏది అవసరమో అది చేయండి.
-------------------------------------------------------------------
వీటిని అస్సలు అలవాటు చేసుకోకండి
మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్నింటిని అస్సలు అలవాటు చేసుకోకండి.
అవేంటంటే..
◆ రోజంతా కూర్చొని నోటితో శ్వాస తీసుకోవడంఉండటం
◆ ఎప్పుడూ ఆన్లైన్లో ఉండటం ఉదయం నిద్ర లేస్తూనే ఫోన్ చూడటం
◆ తరచూ జంక్ఫుడ్ తినడం
- క్రిస్ బోయెచర్, వైద్య నిపుణుడు
-------------------------------------------------------------------
భావోద్వేగాల ప్రభావంతో పెద్ద నిర్ణయాలొద్దు
మీ జీవితానికి సంబంధించిన అతిపెద్ద నిర్ణయాలను దీర్ఘకాలిక విలువల ఆధారంగా తీసుకోండి.
అంతేతప్ప తాత్కాలిక భావోద్వేగాల ప్రభావంతో కాదు! భావోద్వేగాలు మన ప్రస్తుత మానసిక స్థితికి దర్పణం పడతాయి. అవి అన్నివేళలా భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయని చెప్పలేం.
- ఆడమ్ గ్రాంట్, రచయిత
-------------------------------------------------------------------
పట్టించుకోకపోవడం ఎంతో ముఖ్యం!
ప్రతి యుద్ధంలో మీరు పోరాడాల్సిన అవసరం లేదు. ప్రతి వాదనలో మీ వాణి వినిపించనక్కర్లేదు. అవకాశాల ముసుగులో మిమ్మల్ని పక్కదోవ పట్టించే అంశాలెన్నో దాగి ఉంటాయి. జీవితంలో విజయం సాధించేందుకు ప్రతిఒక్కరూ సముపార్జించుకోవాల్సిన నైపుణ్యం ఏంటో తెలుసా..? అనవసర అంశాలను పట్టించుకోకుండా ఉండటం! పనికిరాని విషయాలను పట్టించుకోకపోవడం వల్ల ఆదా అయ్యే శక్తిని, సమయాన్ని.. పనికొచ్చే అంశాలపై వినియోగించొచ్చు.
- చారాఫెడైన్, కంటెంట్ క్రియేటర్
-------------------------------------------------------------------
నిరంతరం ఒకేరకమైన సవాళ్లు ఎదురవుతున్నాయా?
సవాళ్లు లేకుండా జీవితం ఉండదు. మీరు ఎదిగేకొద్దీ వాటి రూపం, తీవ్రత మారుతూ ఉంటాయంతే. మీకు నిరంతరం ఒకే రకమైన సవాళ్లు ఎదురవుతున్నాయంటే.. ఆ అంశం/రంగంలో మీరు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని గుర్తించండి. పరిష్కారం లేని సమస్యంటూ ఉండదు.. మీకు పరిష్కార మార్గం కనిపించకపోతే.. సమస్యను అర్థం చేసుకునే విధానాన్ని మార్చుకోండి.
మాట్ ఇజో, లైఫ్ కోచ్
-------------------------------------------------------------------
మీ విశ్వసనీయతకు ಅಬದ್ಧಾಲು ఉచ్చు బిగిస్తాయ్
అబద్ధం చెప్పడం ద్వారా కొన్నిసార్లు తాత్కాలికంగా ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడొచ్చు! కానీ అదొక బోనులాంటిది. ఇతరులకు చెప్పే, మీకు మీరు చెప్పుకొనే ప్రతి అబద్ధం.. మీ విశ్వసనీయత చుట్టూ బలమైన ఉచ్చును బిగిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో నిజం అసౌకర్యవంతంగా ఉండొచ్చు. కానీ అది మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది.
బ్లజ్కా, లైఫ్ కోచ్
-------------------------------------------------------------------
మీ విలువ పెంచుకోండిలా..
మూడు విషయాల్లో జాగ్రత్త వహిస్తే మీ విలువ పెరిగి ఉత్తమ అవకాశాలు మీ సొంతమవుతాయి:
1. మీ సన్నిహితుల బృందంలో సానుకూల దృక్పథంతో ఆలోచించేవారే ఉండేలా చూసుకోవాలి. నిరాశావాదులు ఉంటే మిమ్మల్ని కూడా ప్రతికూల ఆలోచనలు చుట్టుముడతాయి.
2. మీ మెదడులో వ్యర్థమైన సమాచారాన్ని నింపుకోకుండా రోజూ ఉపయోగకరమైన పుస్తకాలు చదవడం, విజయవంతమైన వ్యక్తులతో సంభాషించడం చేయాలి.
3. ప్రశాంత చిత్తంతో హేతుబద్ధంగా ఆలోచించడం సాధన చేసి మీ మానసిక, భావోద్వేగ స్థితిని మెరుగుపర్చుకోవాలి. జేమ్స్ పీటర్స్, ఎమోషనల్ గ్రోత్ మెంటార్
-------------------------------------------------------------------
భయాన్ని పారదోలే తారకమంత్రం
మీ సామర్థ్యం మీద మీకున్న సందేహం, లక్ష్యసాధనలో ఓడిపోతానేమో అన్న భయం, అసలు ప్రయత్నాలు మొదలుపెట్టాలా వద్దా అన్న సంకోచం.. ఇవన్నీ మాయం కావాలంటే ఒక్కటే తారకమంత్రం.
అనవసర ఆలోచనలను పక్కనపెట్టి ఆచరణలోకి దిగడమే. పని మొదలు పెడితేనే మీ నిజమైన సామర్థ్యం మీకు తెలుస్తుంది. అది మీరు కూడా ఊహించనంత గొప్పగా ఉండొచ్చు.
ప్రయత్నాలు మొదలుపెట్టి విజయం సాధిస్తే ఆనందమే. ఒకవేళ విఫలమైనా అనుభవం వస్తుంది. కానీ అసలు ప్రయత్నమే చేయకపోతే ఏదీ దక్కదు. ఓటమంటే అదే.
డేవిడ్ లవ్ జాయ్, బిజినెస్ గ్రోత్ మెంటార్
-------------------------------------------------------------------
ప్రేరణ ఒక్కటే సరిపోదు
విజేతలను చూసి వారి స్ఫూర్తితో చాలా మంది ఉత్సాహంగా లక్ష్యాలను విదించుకుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధిస్తారు. ఇతరుల నుంచి పొందే ప్రేరణ ఓ పనిని ప్రారంభించే వరకే సాయపడుతుంది. కానీ ఆ పనిని పూర్తిచేయడానికి కావల్సింది లక్ష్యాన్ని సాధించి తీరాలన్న తపన, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పడి లేచిన కెరటంలా నూతనోత్తేజంతో ముందుకుఠికే తెగువ, లక్ష్యంపైన ఎడతెగని ఏకాగ్రత. ప్రేరణకు ఇవి తోడైతేనే మీరు విజేతలుగా నిలుస్తారు.
- అవిజీత్, బ్రాండింగ్ స్ట్రాటజిస్ట్
-------------------------------------------------------------------
రోజుకు 25 గంటల సమయం ఎవరికి ఉంది?
ఈ ప్రపంచంలో రోజుకు 25 గంటల సమయం ఉన్నవారు ఎవ్వరైనా ఉన్నారా? నిద్రను పూర్తిగా త్యాగం చేసిన వారున్నారా? గడిచిపోయిన సమయాన్ని తిరిగి పొందగలిగే వారున్నారా? అందరికీ రోజుకు 24 గంటలే. ప్రతి ఒక్కరూ నిద్రకు సమయం కేటాయించాల్సిందే. గడిచిపోయిన సమయం ఎవ్వరికీ తిరిగిరాదు. అయినప్పటికీ తమకున్న సమయాన్ని సమర్ధంగా సద్వినియోగం చేసుకొని ప్రపంచ విజేతలుగా నిలిచినవారు కొందరైతే, మాకు సమయం సరిపోవడం లేదని చెప్పేవారు ఎంతోమంది. ఏది పనికొచ్చే పని, వేటికి దూరంగా ఉండాలన్నది నిర్ణయించుకోలేనివారే ఇలాంటి సాకు చెబుతుంటారు.
డేనియల్ స్కుటెరి, వెల్నెస్ కోచ్
-------------------------------------------------------------------
ఒత్తిడి దరిచేరకుండా ఉండాలంటే..
మానసిక ఒత్తిడి అనేది కేవలం మనసుపై ప్రతికూల ప్రభావం చూపి ఆగిపోదు. అది క్రమేణా మన డీఎన్బీ దెబ్బతినే మార్గాలను క్రియాశీలం చేస్తుంది. వృద్ధాప్య లక్షణాలను త్వరగా పురిగొల్పుతుంది.
ఆయువును తగ్గిస్తుంది. ఒత్తిడి దరిచేరకుండా ఉండాలంటే- క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
జీవితంలో ఒక లక్ష్యం అంటూ పెట్టుకొని పని చేయండి. సానుకూల ఆలోచనా ధోరణిని కలిగి ఉండండి.
రోజూ రాత్రి 7-8 గంటలు నిద్రించండి. చెడు వ్యక్తులతో సహవాసానికి దూరంగా ఉండండి.
-------------------------------------------------------------------
పిల్లలపై ముద్రలు వేయకండి
పిల్లలతో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పిన మాట వినకుండా మారాం చేసే పిల్లలను నువ్వు మొండోడివి, చెడోడివి అని తిట్టకండి. కొన్ని సందర్భాల్లో వారి ప్రవర్తనను చూసి వారిపై అలాంటి ముద్ర వేయడం సరికాదు. ఆ మాటలను పదే పదే అనడం వల్ల వారు నిజంగానే మొండిగా తయారయ్యే ప్రమాదముంది. అలా కాకుండా వారిని అనునయంగా ప్రశ్నలు అడుగుతూ వారి ప్రవర్తనకు మూలకారణం తెలుసుకొనే ప్రయత్నం చేయండి.
- రెమ్, పేరెంటింగ్ కోచ్
Comments
Post a Comment