పరిచయం ప్రాముఖ్యత

పరిచయం యొక్క ప్రాముఖ్యత

ప్రశ్నలు 

పరిచయం ఎందుకు చేసుకోవాలి?
పరిచయం అంటే ఏమిటి?
పరిచయంలో ఏ విషయాలు / ఏ సమాచారం తెలుసుకోవాలి?
పరిచయం వలన ఉపయోగమేమి?
పరిచయం ఎలా చేసుకోవాలి?

బిందువులు

1. పరిచయం ఎదుటి వ్యక్తిని తెలుసుకోవటం గుర్తించటం
2. స్నేహం చేయాలంటే పరిచయం మొదటి అడుగు.
3. పూర్తి పరిచయం చేసుకోవాలి వ్యక్తిగత విషయాలు / కుటుంబం.... గ్రామం, చదువు, వృత్తి మొ॥
4. పరిచయంకోసం మనమే చొరవతో అవతలివారి దగ్గరకు వెల్లాలి, సిగ్గుపడకూడదు.
5. పరిచయంలేని యెడల కొన్ని సందర్భాలలో ఘర్షణ ఏర్పడుతుంది. ఉదా॥ ప్రయాణాలలో, మహాభారతంలో కర్ణుడు - అర్జునుడి పరిచయంలేదు. శ్రీరాముడు-లవకుశుల ఘర్షణ (యుద్ధం) - పరిచయంలేని కారణంగా.
6. పరిచయంవలన ప్రేమ, ఆప్యాయత, త్యాగగుణం పెరుగుతుంది.
7. పరిచయాల వలన ప్రాంత, భాష లాంటి అనేక సమస్యల నుండి బైటపడవచ్చు.
8. పరిచయంవలన అభద్రతాభావం తొలిగిపోవును. కుటుంబ భావనే సంఘకార్యానికి ఆధారం.
9. అత్యధికమందితో పరిచయం ఉండటంవలన అనేక కార్యాలు సులువుగా సాధించవచ్చు.
10. పరిచయంవలన వ్యక్తిత్వాన్ని నిర్ధారించవచ్చు మానసిక స్థితి అభిరుచులు.
11. మన భావాలను ఇతరులకు తెలియచేయాలంటే పరిచయం ఉండాలి.
12 పరిచయం చేసుకునేటప్పుడు సమయస్ఫూర్తి విచక్షణ, వుండాలి.,
13. పరిచయం వలన మనల్ని మళ్ళీ కలవాలని అనిపించాలి.
14. పరిచయంలో మృదుభాషి, పూర్వభాషి ఉదా॥ రామునితో హనుమంతుని మొదటి పరిచయం, సీతాదే హనుమంతుల పరిచయం
15. సంఘకార్యం సఫలీకృతం కావాలంటే 'పరిచయం చేసుకోవటం మన నిత్యజీవితంలో అలవాటు కావాలి. అలవాటు లేని యెడల ప్రయత్న పూర్వకంగా అభ్యాసం చేయాలి.
16. పరిచయం చేసుకొనేటప్పుడు ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. చులకనగా మాట్లాడకూడదు.
17. పరిచయాన్ని స్వార్థంకోసం ఉపయోగించకూడదు. 
ఉదా॥ నాగపూర్లో న్యాయవాది కూతురు పెళ్ళి సంబంధం కోసం శాఖకు రావటం - అతను ప్రశ్నించడం
18. పరిచయంలో లాభాపేక్ష చూడకూడదు.
19. పరిచయం చేసుకొన్నవారిని గుర్తుపెట్టుకోవాలి, పేరు ఊరు పెట్టి పిలవడం... అత్యవసర పరిస్థితి సమయంలో పరిచయాల కారణంగా మనం విజయం సాధించాం. ఇతర సంస్థలు పనిచేయలేకపోయాయి. అవి రహస్యంగా ఉండటానికి స్థలం కూడా దొరకలేదు.
20. వివిధరకాల పరిచయం
1. వ్యక్తిగత పరిచయం
2. సామూహిక పరిచయం
3. శ్రేణివారి పరిచయం
4. బాధ్యత / స్థాయివారి పరిచయం.
5. పరిచయ పంచాంగం

Comments

Popular posts from this blog

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు