ప్ర&ద్వి : స్వయంసేవక్ కల్పన & స్వయంసేవక్ దృష్టి కోణం, స్వయంసేవక్ గుణగణాలు | కార్యకర్త వ్యవహారం | స్వయంసేవక్ సంకల్పం | పర్యటన కార్యకర్త గుణగణాలు
బౌద్ధిక్
సమాజ కార్యం సంఘంతోనే ప్రారంభం కాలేదు అంతకుముందు ఆ తర్వాత కూడా ఎన్నో సంస్థలు పని చేశాయి ప్రస్తుతం పని చేస్తున్నాయి కూడా..
కోవిడ్ సమయంలో అనేక ధార్మిక సేవా సంస్థలు విస్తృతంగా సేవలు అందించాయి ప్రభుత్వ సహాయం లేకుండానే ఆరోగ్య విద్యాసావనం వంటివే కాక మిగతా అనేక రంగాలలో ప్రజలందరికీ దేశ విదేశాలలో సేవలందించారు ఈ సేవలందించిన వారందరూ కూడా భారతీయ సంస్కృతిలో ఏదో ఒక దగ్గర సంబంధం ఉన్నవారే ఈ సేవా గుణం అనేది సహజంగానే భారతీయ సమాజంలో ఉంది.
ఈ విధంగా ప్రపంచంలో సంకటన పరిస్థితిలో ఎక్కడ ఏర్పడినప్పటికీ సజ్జన శక్తి జాగృతం అవుతుంది. అదేవిధంగా దుర్గం శక్తి కూడా క్రియాత్మకంగానే ఉంటుంది.
సజ్జన శక్తి నిష్క్రియత్వం - దుర్గుణ శక్తి క్రియత్వం ఈ రెండు కూడా సమాజానికి విఘాతాన్ని కలిగిస్తాయి.
ఉదాహరణ : స్వామీజీ కథ సజ్జన శక్తి - దుర్గణ శక్తి.
సంఘం కూడా ఇదే విధంగా సజన శక్తిని విస్తృతం చేయాలని సంకల్పంతోనే సామాజిక పరివర్తనకే విస్తృతంగా పనిచేస్తుంది అనేకమంది సైన్స్ సేకులు స్వప్నతో ముందుకు సాగుతూ దేయంతో ఒక స్పష్టమైన ముందు చూపుతో దేశంలోనే కాక ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో అనేక అవరోధాలు ఎదుర్కొంటూనే వ్యక్తిగత మరియు సామాజిక జీవనాన్ని సంతులనం చేస్తూ స్వయం సేవకులు దేశాన్ని పరమ వైభవ స్థాయికి తీసుకోవడానికి పనిచేస్తున్నారు.
సంఘం సమాజం కోసం ప్రత్యేకంగా ఏమీ చేయరు కానీ సంఘం ద్వారా తయారైన స్వయంసేవలో సమాజం కోసం అన్నీ చేస్తారు. చాలామందికి విచిత్రం అనిపించినప్పటికీ సంఘం చేసే పని వ్యక్తిని నిర్మాణం మాత్రమే.
ఒక స్వయంసేవక్ శేషాద్రి గారిని దేశానికి పరమ వైభవ స్థితి ఎప్పుడు వస్తుంది అని అడిగితే, శాఖ ప్రారంభమైనప్పుడే అని చెప్పారు.
ఈ ప్రక్రియ ఎప్పుడో ప్రారంభమైందని దీనికి ఇప్పుడు అప్పుడే అని మనం వ్యవధిని నిర్ణయించలేము అని తెలిపారు అలా అని ఆ మార్పు మనకు కళ్ళకు కనిపించకుండా ఉండకపోదు మన కళ్ళతోనే దాన్ని చూస్తాం..
సంఘం సమాజం కొరకు పనిచేసే అన్ని సంస్థలు కలుపుకొని పోతుంది మా సంస్థని గొప్పది నేను లేదా మేము మాత్రమే గొప్పనే భవన స్వయం సేవకులకు ఏనాడు కలగదు
స్వయం సేవకుల యొక్క సంకల్పం గొప్పది వారి లక్ష్యం అత్యంత ఉన్నతమైనది కావున దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడానికి నిత్యసంసిద్ధత, స్థితప్రజ్ఞ్యతతో ముందుకు సాగాలి.
1. వాలంటీర్ అంటే ఏమిటి?
2. స్వప్రేరణతో పనిచేసేవారిని ఏమంటారు?
3. స్వప్రేరణతో తన కుటుంబం కోసం పనిచేసేవానికి, స్వప్రేరణతో సమాజం పనిచేసేవానికి తేడా వున్నదా? ఏమిటి?
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ అనే పేరులో స్వయంసేవక్ అనే పదానికి ప్రత్యేక అర్ధము ఉన్నది. స్వయంప్రేరణతో చేసేవాడు అని అర్ధము. వాలంటరీ అనే పదానికి సమాన అర్ధము మాత్రము కాదు.
సంఘం యొక్క ప్రేరణతో దేశము మరియు సమాజము గురించి పనిచేయువాడు. అనగా స్వప్రేరణతో చేసేవాడు. ఎవరో చెప్పితే చేసేవాడు కాదు.
ఉదా|| స్వయంసేవక్ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్వయంసేవకుల పాత్ర.
ఆచరణ :
స్వయంసేవకత్వం యొక్క అభిమానము మరియు ఆచరణ. గంటశాఖ, మిగిలిన 23 గంటలు స్వయంసేవక్ భావన.
స్వయంసేవక్ యొక్క గుర్తింపు స్వయంసేవకుల యొక్క గణవేష్ చూసి / బ్యాడ్జిచూసి // లేదా మరేదైనా బాహ్య గుర్తుల వలన గాదు.
స్వయంసేవక్ ఆచరణ ద్వారానే గుర్తింపు.
ఉదా|| సమయపాలన, నిరాడంబరత, దేశ విషయాలపట్ల స్వాభిమానము పాటించడం | మొదలైన ఆచరణాత్మక విషయాలను చూసి స్వయంసేవక్ అని గుర్తిస్తారు.
నిత్య సాధన
నిత్యసంస్కారాల యందు నమ్మకము వుంటే సరిపోదు. అలా నమ్మకము కలిగి వుండి చెప్పేవారు చాలామంది వున్నారు. వాటిని ఆచరించాలి అంటే ప్రతి దినము అభ్యాసము తప్పనిసరి.
సమర్పణ -
స్వయంసేవకులు తను, మన, ధన రూపేణ సమర్పణాభావంతో జీవించాలి.
అనుశాసనము
క్రమశిక్షణ కన్నా ఉన్నతమైనది అనుశాసనము. ఎవరో అడుగుతారనో / భయముతోనో చేసేది క్రమశిక్షణ. వీటన్నింటికీ అతీతంగా (స్వయంగా) ఆచరించేది అనుశాసనం అనబడుతుంది. ఇది మనసుకు సంబంధించినది.
లోక సంపర్కం
ఎక్కడికి వెళ్ళితే అక్కడికి సంఘాన్ని తీసుకొని వెళ్ళేవారు స్వయంసేవకులు. ఎవరిని కలుస్తామో వారిని సంఘానికి తీసుకొని వచ్చేవారు స్వయం సేవకులు.
ఉదా||తన పని ఏదైతే చేస్తాడో దాంతో పాటుగా ఆ పనిలో సంఘానికి మరియు సమాజానికి హితమైనదిగా చేసేవారు స్వయంసేవకులు.
లోక సంగ్రహం
స్వయంసేవక్ లోకసంగ్రహిగా వుంటాడు.
ఉదా|| డాక్టర్జీ జైలులో వున్నపుడు అనేకమందిని పరిచయం చేసుకోవడం. విడుదలైన తర్వాత ఆ పరిచయాలను ఉపయోగించుకొని శాఖలు ప్రారంభించారు.
యాదరావుజోషిని సంఘానికి తీసుకొని వచ్చిన పద్ధతి.
సమరసతా భావము
అందరితో కలసిమెలసి వుండటం. అందరిని కలుపుకోవడం.
ఉదా|| పూ.శ్రీ బాలాసాహెబీ - బాల్యంలోనే తమ ఇంటికి తనతోటి సేవాబస్తి స్వయంసేవకులు భోజనానికి ఆహ్వానించడము. తల్లిని ఒప్పించి కలసి భోజనం చేయడం. ఆచరించిన తర్వాతనే అంటరానితనం పాపం కాకపోతే మరేదీ పాపం కాదు అని చెప్పారు.
లోకసంపర్క -
సంఘపని జోడించేది లేదా కలుపుకొనేది మాత్రమే. కొత్తకొత్తవారిని కలవాలి. మన ఇల్లు వదలి మరొకరి (వారు ఏ స్థాయి / ఏ వర్గ వారయినా) ఇంటికి వెళ్ళే మానసిక తయారీ కావాలి. ఈపని జరగాలంటే సమయం ఇవ్వాలి. ఇది ప్రతినిత్యము జరగాలి.
సంఘానుకూల జీవనం
తన జీవనాన్ని సంఘానుకూల జీవనంగా మలచుకొనేవారు. కుటుంబాన్ని సంఘ కార్యానికి అన్వయంచేయడం.
ఉదా॥ ముళ్ళపూడి సూర్యనారాయణమూర్తి, మల్లికార్జునరావు.
నలుగురుని కలుపుకొని పనిచేసేవాడు.
ప్రత్యేక గుర్తింపును కాంక్షించకపోవడం
సన్మానము, సత్కారములకు దూరంగా వుండేవాడు. (తల్లి కార్యంకొరకు ఇవన్నీ అవసరంలేదని భావించేవాడు)
ఉదా॥ మంత్రిపదవిని, పద్మభూషణ్ బిరుదుని సవినయంగా నిరాకరించిన స్వర్గీయ నానాజీ.
సామాజిక సిద్ధత
సమాజ కార్యం కోసం తనలో ఏవైనా తప్పులుంటే వాటిని వదలిపెట్టడానికి సంసిద్ధత.
ఉదా॥ సంఘాన్ని ప్రారంభించిన తరువాత డాక్టర్జీ కోపాన్ని వదలిపెట్టడం.
సాంస్కృతిక సిద్ధత
భోగవాద సిద్ధాంతానికి దూరంగావుండటం. మన దృష్టికోణంలో అవసరాన్నిబట్టి లభ్యమయ్యే వస్తువులతోనే తృప్తిపడటం.
శారీరిక, మానసిక దృఢత్వం
శారీరక సిద్ధత, కఠోరపరిశ్రమ, చలి, వేడి, వర్షాన్ని తట్టుకొనేందుకు అభ్యాసము
*#స్వయంసేవక్ గాబతుకుదాం*
*కార్యరూపంలో జీవించుదాం..*
కార్యసాధనలో మన వ్యక్తిగత పేరు ప్రతిష్ఠలు నాశనం అయిపోయినా పర్వాలేదు. జాతి కీర్తి నిరంతరం ఉండాలి. ఆ సమయంలో వ్యక్తిగత పేరు ప్రతిష్ఠలు లేకపోయినప్పటికీ చింతించాల్సిన అవసరం లేదు. మనం కార్యరూపంలో జీవించాలి. నీళ్లలో పడిన ఉప్పురాయి తన అస్థిత్వాన్ని కోల్పోతుంది. కేవలం దాని రుచి మాత్రమే మిగులుతుంది. అదే విధంగా మనం కూడా జాతి జీవనంలో కలిసి పోవాలి.
లక్ష్య సాధన సమయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం:
అహంకారాన్ని పూర్తిగా త్యజించాలి. అహంకారంపై విజయం సాధించక తప్పదు. ఎన్నిరకాల పనులు చేస్తున్నప్పటికీ అహంకారాన్ని మన దరిదాపులకు కూడా రానీయ కూడదు.
ఉదా :
ముల్లోకాలను పీడిస్తున్న రావణుడిని శ్రీరామచంద్రుడు వధించాడు. ధర్మ ప్రతిష్ఠను పెంచాడు. ప్రపంచానికి సుఖ సంతోషాలను పంచాడు. ఆయనను స్తుతించడానికి దేవతలు దిగివచ్చారు. అప్పుడు రామచంద్రుడు 'మీరు నన్ను ఎందుకు పొగుడుతున్నారు. నేను ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం' అని ఎదురుపలికాడు. శ్రీరామచంద్రుడే దేవతలందరికీ నమస్కరించాడు.
ఇలాగే భగవాన్ శ్రీకృష్ణుడు కూడా ప్రజోపకరమైన పనులు నిర్వహించాడు. పసితనంలోనే రాక్షసులను సంహరించాడు. కంసుడిని వధించిన తరువాత మధురలో రాజ్యాధికారాన్ని చేపట్టలేదు. తాను వయసు మీరినవాడిని. రాజ్యభారాన్ని నిర్వహించలేనని చెప్పినప్పటికీ ఉగ్రసేనుడిని మహారాజుని చేశాడు. 'మీరు సింహాసనాన్ని అధిష్టించండి. నా బాహుబలంతో పరిపాలన - కొనసాగిస్తాను. లేదు మీకు సేవ చేసుకుంటాను' అని వినమ్రంగా పలికాడు.
మహాభారత యుద్ధ సమయంలో తన బుద్ధి కౌశల్యాన్ని వినియోగించి పాండవులకు విజయం సాధించి పెట్టాడు. అయినా సింహాసనాన్ని యుధిష్టరుడికి అప్పచెప్పాడు. ఆయనను రాజుగా గుర్తించి నమస్కరించాడు. మనసులో ఏ కోశాన అహంకారాన్ని చేరనీయలేదు. సాధారణంగా అధికారం లభించగానే ఆ వ్యక్తి తనను తాను మిగిలిన వారికంటే ఉన్నతుడు శ్రేష్ఠుడు అని భావించడం మొదలు పెడతాడు. అతడితో మాట్లాడుతున్నప్పుడు లోపల దాక్కున్న అల్పత్వం బయటపడుతుంది. అన్ని పరిస్థితులలోను కీలక పాత్ర పోషిస్తూ పాండవుల కష్టాలు తీర్చిన శ్రీకృష్ణుడు అర్జునుడితో స్నేహాన్ని వదులుకోలేదు. తన చిన్ననాటి మిత్రుడు సహవిద్యార్థి నిరుపేద బ్రాహ్మణుడు అయిన సుధాముడిని కూడా ఆయన మరచిపోలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అహంకార రహితుడు.
మనం జాతి సేవ అనే గొప్ప వ్రతాన్ని స్వీకరించాం.
నిరంతరం జయ సైతంపై నిస్వార్ధంగా పనిచేయడమే స్వయంసేవక్ అనే పదానికి నిజమైన అర్థం.
--------------------------------------------------------------
వార్తాపత్రికలలో పేరు పడుతుంది. వెళ్ళిన చోటల్లా స్వాగతం పలుకుతూ పూలమాలలు వేస్తారు. ఈ రకమైన పనికి రాని ఆలోచనలు వదిలిపెట్టండి. ఉక్కు సంకల్పాన్ని కలిగి ఉన్న యువకుల్లారా ఈ దేశ,ధర్మ రక్షణకై నడుం బిగించి ముందుకు నడవండి. ఇటుక రాళ్ళమై మనం ఈ దేశ పునాదులను దృఢంగా నిర్మించాలి. బ్రహ్మ తేజానికి, క్షాత్ర తేజానికి సంరక్షకులము,ఉపాసకులము కావాలి.
- పరమ పూజనీయ డాక్టర్జీ
--------------------------------------------------------------
ఎవరికీ తన దేశము దేశ సోదరులు తప్ప మరొకటంటే ఎట్టి వ్యామోహం లేదో, ఎవరికీ తన కర్తవ్యం, కర్తవ్యపాలన తప్ప మరొక వృత్తి లేదో, ఎవరికీ తన హిందూ ధర్మం అభివృద్ధి చెంది హిందూ ప్రతాపభానుని నిరంతరం మహా తేజశ్శాలిగా ఉంచాలనే ధ్యేయం తప్ప మరో స్వార్థం లేదో అట్టివాని హృదయంలో భయము, దుఃఖము, నిరుత్సాహం జనింపచేయడం ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు.
- పరమ పూజనీయ డాక్టర్ జి
--------------------------------------------------------------
కార్యకర్త ద్వారానే సమాజానికి సంఘ పరిచయం జరుగుతోంది. సంఘం ఎంత పవిత్రము, విశుద్ధమైనదో నేను అలాగే ఉండాలి. అలాంటి ఏ ఒక అంశమైనా నాలో లేకుంటే అది సంఘ కార్య ఉజ్వలత కొరకు అడ్డంకి అవుతుంది. సమాజ కళ్యాణం కొరకు ఒక మంచి సాధనంగా నేనెలా ఉండాలని అని ప్రతి స్వయంసేవక్ ఆలోచించుకోవాలి.
- మాననీయ మోరోపంత్ పింగల్ జి
--------------------------------------------------------------
తన సహచరులకు తగిన గౌరవం అందించే నేత తాను ఏ సన్మానాన్ని ఆశించకుండా ఇతరులకు ప్రశంశలను అందజేస్తాడు.
- దత్తోపంత్ ఠెంగ్డే జి
--------------------------------------------------------------
మన జాతి యొక్క నిజమైన పునరుజ్జీవనం వ్యక్తిని తీర్చిదిద్దడంతో ప్రారంభం కావాలి. మానవ సహజమైన బలహీనతలను అధిగమించగల శక్తిని వ్యక్తిలో నిర్మాణం చేయాలి. పరంపరాగతమైన ఆత్మ సంయమనం, త్యాగం సేవ, సౌశీల్యం అనే వాటిని అతడు పెంపొందించుకునేటట్లు చేయాలి. హిందూ పురుషార్థానికి ఒక తేజోవంతమైన ప్రతీకగా అతడు నిలబడాలి. మన రాష్ట్రీయ వైభవానికి మూలసూత్రమైన ఇట్టి యోజన వ్యక్తి నిర్మాణం చేస్తుంది మనం ఈ విధంగానే మరల మన ప్రాచీన విశ్వగురుపీఠాన్ని చేరుకోగలం. ఇందుకు సంఘం ఎంచుకున్న మార్గం నిత్య శాఖ.
--------------------------------------------------------------
నేను మరణించినప్పటికీ భారతదేశం యొక్క గౌరవానికి భంగం కలగనీయను. వ్యక్తిగత ప్రతిష్టను ఆశించకుండా, నిష్ఠతో దేశానికి సేవ చేస్తాను అనే భావనయే వ్యక్తిగత శీలం.
సంఘం యొక్క విశాల భావాలను అర్థం చేసుకుని ప్రతి వ్యక్తి సుఖంగా, సంపన్నంగా, విద్యావంతులై ఉండాలని సమాజ హితం కొరకు సంకల్పించడమే జాతీయ శీలం యొక్క అర్థం.
--------------------------------------------------------------
అన్నిరకాల వ్యక్తిగత సమస్యలు, అనుబంధాలు, ప్రేమానురాగాలు, సుఖదుఃఖాలు, వృత్తి, ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ తమ మనసుల్లో సమాజ కార్యం చేయాలనే కోరికతో సంఘ కార్యం చేస్తూ సాధారణ జీవితం గడిపే స్వయంసేవకులే సంఘానికి నిజమైన ఆధారం.
- పరమ పూజనీయ శ్రీ బాలా సాహెబ్ జి
--------------------------------------------------------------
మనం స్వయంసేవకులం. నిప్పురవ్వ ఎక్కడ ఉన్న తన చుట్టుపక్కల వేడిని ఎలా ప్రసరింపజేస్తుందో, అలాగే ప్రతి స్వయంసేవక్ ఒక్కొక్క అగ్నిపుంజం లాగా తన గుణ సంపత్తి చేత ప్రతి క్షేత్రాన్ని ప్రభావితం చేయ గలగాలి. నలుదిశలా సంఘ కార్యానికి ఉపయుక్తమైన వాతావరణం, మిక్కిలి శ్రద్ధాభావన ఉత్పన్నమయ్యేలా చేసేవారై ఉండాలి.
- పరమపూజనీయ శ్రీ గురూజీ
--------------------------------------------------------------
నేను మరణించినప్పటికీ భారతదేశం యొక్క గౌరవానికి భంగం కలగనీయను. వ్యక్తిగత ప్రతిష్టను ఆశించకుండా, నిష్ఠతో దేశానికి సేవ చేస్తాను అనే భావనయే వ్యక్తిగత శీలం.
సంఘం యొక్క విశాల భావాలను అర్థం చేసుకుని ప్రతి వ్యక్తి సుఖంగా, సంపన్నంగా, విద్యావంతులై ఉండాలని సమాజ హితం కొరకు సంకల్పించడమే జాతీయ శీలం యొక్క అర్థం.
- పరమ పూజనీయ
మాధవ సదాశివ గోల్వాల్కర్
( శ్రీ గురూజీ)
*(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వితీయ సర్ సంఘచాలక్)*
--------------------------------------------------------------
*అన్నిరకాల వ్యక్తిగత సమస్యలు, అనుబంధాలు, ప్రేమానురాగాలు, సుఖదుఃఖాలు, వృత్తి, ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ తమ మనసుల్లో సమాజ కార్యం చేయాలనే కోరికతో సంఘ కార్యం చేస్తూ సాధారణ జీవితం గడిపే స్వయంసేవకులే సంఘానికి నిజమైన ఆధారం.*
*- పరమ పూజనీయ శ్రీ బాలా సాహెబ్ జి*
*(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ సర్ సంఘచాలక్)*
--------------------------------------------------------------
*సమాజ సేవకు యోగ్యమైన వ్యక్తిగా తయారు కావడానికి రెండు రకాల ప్రేరణలు అవసరం.*
*సేవ చేయాలని అంతః ప్రేరణ మొదటిది. తదనుగుణంగా కృషి చేసే సంసిద్ధత రెండవది.*
*సేవ చేయడానికి ఉండాల్సిన ప్రేరణ భావత్మకం అయిఉండాలి. అంతేగాని ప్రతిక్రియ వలన ఏర్పడినదిగాని, నిరాశ నుండి పుట్టినది గాని కాకూడదు...*
*- శ్రీ ఏకనాథ్ రనాడే*
*(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సిద్ధాంతకర్త)*
--------------------------------------------------------------
*జాతీయదృష్టిగల ధ్యేయ వ్రతుడు స్వయం సేవక్ . అనేకకారణాలవల్ల గత వేయినంవత్సరాలుగా చిన్నాభిన్నమై పోయిన జాతికి, సంఘటిత పరచడం అనే మహత్తర పథకాన్ని తాను నెరవేర్చాలనే ప్రగాఢ కర్తవ్యతాజ్ఞానంతో అత డుంటాడు; అట్టి చారిత్రక పాత్ర నిర్వహించటానికి సంసిద్దుడవుతాడు;జాతీయ పునర్నిర్మాణ కార్యక్రమానికి తానొక సమర్థ సాధనంగా రూపొందేనిమిత్తమై. సహజసిద్ధమైన తన ఆవేగ సంవేగాలను, ధోరణులను* *సమన్వయ పరచి ఏకోన్ముఖంచేయడం నేర్చుకొంటాడు; తన స్వార్థ ప్రయోజనం, పదవీ*
*పటాటోపం, పేరు ప్రఖ్యాతులు ఇటువంటి వృధా పరమైన ఆలోచనలను దరిచేరనీయకుండా సమాజాన్ని సేవిస్తూ ఉంటాడు.*
--------------------------------------------------------------
*సేవాభావం, స్వావలంబన, పవిత్ర మాతృభూమి పాదాలమ్రోల సర్వస్వార్పణ - ఇట్టి ఉదాత్త భావాలే ఊపిరిగా చేసుకొని జాతీయస్వాభిమానంతో ఉర్రూతలూగే పురుషపుంగవులుగా జీవిద్దాం. ధ్యేయనిష్ఠతో ప్రజ్వరిల్లే యువ బృందం మాత్రమే, దేశం లోపల నుంచి, వెలుపల నుండి, వచ్చే మహా ప్రమాదాలన్నిటినీ నివారించటానికై కార్యోన్ముఖుల్ని చేయగలుగుతుంది.*
--------------------------------------------------------------
*లౌకిక ఆకర్షణలు ఎన్ని ఉన్నప్పటికీ, నిరంతర* *ప్రయత్నంవల్ల తాను స్వీకరించిన జాతీయ పునరుజ్జీవన కార్యం మీద పరిపూర్ణ ఏకాగ్రతను కార్యకర్త సాధించగలుగుతాడు.* *దైవీశక్తుల ముందు అసురీ ఆకర్షణలు నిలువనేరవు; ఎంత చిన్న ప్రయత్నం చేసినాసరే అతనికి దైవీ శక్తులు శ్రీరామరక్షయై, అతని శక్తి సామ్యర్థ్యాలను అధికాధికం చేస్తాయి. అప్పుడు లక్ష్యసిద్ధిలోనే అతని జీవితానికి సంతృప్తి, సార్థక్యం లభిస్తాయి. ఆ ఆనందం ముందు బాహ్యాకర్షణలన్నీ వెలవెల పోతాయి.*
కార్యకర్త వ్యవహారం - 1
సంఘ కార్యం శుద్ధ సాత్విక ప్రేమ అనే కార్యకర్తల మధ్య ఉన్న బంధం చేత నేటి వరకు నిలబడింది.
సంఘటన కుశలత అనేది కార్యకర్తలకు ముఖ్యమైన మరియు కావలసినటువంటి నైపుణ్యం ఈ నైపుణ్యం ద్వారానే కార్యకర్తలు అనేవారు వ్యక్తులను జోడిస్తూ ముందుకు తీసుకెళ్తారు.
కార్యకర్తలు వారు ఉన్న స్థాయిలో వారి వారి నైపుణ్యాలను పెంచుకోవాలి అప్పుడే కార్యకర్త వికాసం కార్య వికాసం జరుగుతుంది.
శీతోష్ణ సుఖదుఃఖాలకు కార్యకర్త చలించకూడదు. నిత్య నూతనోత్సాహంతో ధ్యేయనిష్టను కలిగి లక్ష్య సాధనకై నిరంతరం శ్రమిస్తూ పరిశ్రమించాలి.
సంఘ కార్యకర్తలు వేటి ప్రలోభాలకు లొంగరు. వ్యక్తినిష్ఠతో పని చేయకుండా కేవలం ధ్యేయసాధనకై పరిశ్రమిస్తారు. అందుకే త్యాగ ప్రతీకైన భగవధ్వజాన్ని గురువుగా గా సంఘం భావించడం జరిగింది.
శ్రేష్టమైన వ్యక్తులు సమాజములో ఉన్నప్పటికిని సంఘం నేర్పిన సుగుణాల కారణంచే ధ్యేయానికే తప్ప వ్యక్తిని ఎప్పటికినీ సంఘం గురువుగా భావించదు.
చేసే పనిపై పరిపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించి సంఘ నిర్దేశానుసారం మనం మన కార్య సాధనకై ముందుకు సాగాలి.
సర్వకాల సర్వావస్థల యందు నేను హిందువుని అని భావించాలి.
హిందుత్వం నా యొక్క అస్తిత్వం తెలుస్తూనే ఎవరు హిందువులు అనుకుంటారు మరియు ఎవరిని మన హిందువులు అనుకుంటామో వారిని కలవాలి
సంఘం కొరకు తన స్వభావాన్ని మార్చుకోగలగుతాడు.
ఎదుటివారిలోని మంచిని గుర్తించి ప్రోత్సహిస్తూ లోపాలను గుర్తించి వ్యక్తిగతంగా మాట్లాడుతాడు
సంఘం నిలబడటం కారణం శుద్ధ సాత్విక ప్రేమ
ఈర్ష్య తర్వాత అనవసరమైన మాటలను మాట్లాడకుండా ఉంటాడు
గుర్తింపు కోసం తాపత్రయపడడు.
అందరితో కలుపుకొని కలిసి పని చేస్తాడు.
డబ్బు విషయంలో ప్రామాణికంగా వ్యవహరిస్తారు.
అరచేతిలో వైకుంఠాన్ని చూపడు.
ఎంతటి సుధీర లక్ష్యాన్నైనా ప్రణాళికాబద్ధంగా నెరవేర్చుతాడు.
సంఘంలో మనకు బాధ్యత ఉన్నప్పటికీ మన వ్యవహారంలో సంఘ లక్షణాలు ఎన్ని ఉన్నాయి అని ప్రశ్నించుకుంటాడు.
ఎవరి దగ్గర ఏం విషయాలు ప్రస్తావించాలో వాటిని వారి దగ్గర మాత్రమే ప్రస్తావించాలి.
కార్యక్రమాల్లో సంఘ కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించవద్దు.
సమయం ఇవ్వటం లోతుగా ఆలోచించడం అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించుకోగలగాలి.
అనుకున్న సమయంలో అందరూ కచ్చితంగా కలవగలగాలి.
జట్టును ఏర్పరచగల వ్యక్తులను గుర్తించగలగాలి.
సమాజ సంఘటకుడిగా మనకు ఉండాల్సిన లక్షణాలు మధురమైన సంభాషణ సకారాత్మక స్పందన ఆనందంగా పనిని స్వీకరించడం
సంఘం పని నాది అనుకుని చేయాలి కానీ ఒత్తిడితో చేయరాదు. మనసు శరీరం బుద్ధి లగ్నం చేసి స్థితప్రజ్ఞతతో పని చేయాలి.
ఆలోచించి పనిచేయడం ఎలా ప్రయోజనం కలుగుతుందో పనిచేయడం సమన్వయంతో పని చేయడం ఆలోచనలో వ్యత్యాసం ఉండవచ్చు కానీ ఆచరణలో ఉండకూడదు
కృతి ఆలోచన దృతి పట్టుదల
యోజన బాగా చేసినప్పటికీ నిర్లిప్తత నిర్లక్ష్యం ఉండరాదు
అపనమ్మకం అవిశ్వాసంతో పని చేయరాదు.
అనుశాసనబద్ధం స్వీయ ప్రేరణ
క్రమశిక్షణ బాహ్య ప్రేరణ
కర్తృత్వం
పట్టుదల కచ్చితంగా సాధిస్తాను
విజగిష్ ప్రవృత్తి విజయం పొందాలని గుణం ఉండాలి
యోజన పూర్వ యోజన ప్లస్ పూర్ణ యోజన
తప్పరట సంఘ కార్యం విస్తరించాలని మనోభావన నిత్యం జాగరకతతో ఉండాలి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలగాలి
నేతృత్వం కలసి పనిచేయడం కలిపి పని చేయడం
స్వీ ఆలోచనతో కాలానుగులమైన మార్పులతో స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలి
నేనే కాబట్టి నా వల్లనే నేను లేకపోతే అనే భావనలను వదిలిపెట్టాలి
చెప్తున్న వ్యక్తి మన అవసరం కోసమే చెప్తున్నాడని మనం భావిస్తే వికాసం కలుగుతుంది.
అనుభవజ్ఞుల మాట వినాలి
తండ్రి కొడుకు శిల్పులు
నావల్ల అనికాక మన వల్ల అని భావించాలి
వ్యక్తుల సమీకరణ మన పని దూరం చేసుకోవడం కాదు అమంత్రం అక్షరం నాస్తి
సందేహంతో ఆశించి పనిచేయడం గాక సమర్పణంతో పనిచేయాలి
వక్తృత్వం కర్తృత్వం నేతృత్వం సమాజ్దారి సమర్పణ
నూతన కార్యకర్తలను మనం రూపొందించుటకు శారీరక భౌతిక స్థాయిలను పెంచుకోగలగాలి
సంఘం ఎక్కడ అపేక్షిస్తుందో అక్కడ మనం ఉండాలి ఆపద్ ధర్మం ఉండొచ్చు కానీ అదే నిత్య కృత్యం కావచ్చు
These 5 Guna Every Karyakarta Should have
1. Vision - దృష్టి
2. Efficiency - కార్యకుశలత
3. Accountability - జవాబుదారీతనం
4. Ownership -
5. Character -
Skills
Values
భగవద్గీత
12వ అధ్యాయం భక్తియోగంలో 19వ శ్లోకం.
* "తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేనకేనచిత్ |
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః ||"
"ముక్తసంగోనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః |
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే ||"
ఈ శ్లోకంలో భగవంతుని భక్తుని లక్షణాలు వివరించబడ్డాయి. ఇందులో సంగం, అహంకారం లేనివాడు, వాదనలు చేసేవాడు, ధైర్యసాహసాలు, ఉత్సాహంతో నిండినవాడు అని చెప్పబడింది.
ఈ రెండు శ్లోకాలను కలిపి అర్థం తెలుసుకుందాం:
* తుల్యనిందాస్తుతిర్మౌనీ: నిందను, స్తుతిని సమానంగా చూసేవాడు, మౌనంగా ఉండేవాడు.
* సంతుష్టో యేనకేనచిత్: ఏదో ఒకదానితో తృప్తి చెందేవాడు.
* అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః: నివాసం లేనివాడు, స్థిరమైన బుద్ధి కలిగినవాడు, భక్తి కలవాడు, నాకు ప్రియమైన మానవుడు.
* ముక్తసంగోనహంవాదీ: సంగం లేనివాడు, అహంకారం లేనివాడు, వాది (వాదనలు చేసేవాడు).
* ధృత్యుత్సాహసమన్వితః: ధైర్యం, ఉత్సాహంతో కూడినవాడు.
* సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే: విజయం, అపజయం రెండింటిలోనూ మార్పు చెందనివాడు, కర్మలు చేసేవాడు, సాత్త్వికుడు అని చెప్పబడతాడు.
సారాంశం:
ఈ శ్లోకంలో భగవంతుడు తన భక్తుని లక్షణాలను వివరిస్తున్నాడు. అవి:
* నిందను, స్తుతిని సమానంగా చూడటం.
* మౌనంగా ఉండటం.
* ఏదో ఒకదానితో తృప్తి చెందడం.
* నివాసం లేకపోవడం (సంచార జీవనం).
* స్థిరమైన బుద్ధి కలిగి ఉండటం.
* భక్తి కలిగి ఉండటం.
* బంధాలు, అహంకారం లేకపోవడం.
* వాదనలు చేసేవాడు.
* ధైర్యం, ఉత్సాహంతో నిండి ఉండడం.
* విజయం, అపజయం రెండింటిలోనూ మార్పు చెందకపోవడం.
* కర్మలు చేస్తూ ఉండటం.
ఇలాంటి లక్షణాలు కలిగినవాడు సాత్త్వికుడు, భగవంతునికి ప్రియమైనవాడు అని భగవద్గీత చెబుతోంది.
స్వయంసేవక్ సంకల్పం
డాక్టర్ జి తీవ్రమైన చింతనలో నుండి స్వయంసేవక అనే విలక్షణమైన పదాన్ని ప్రతిపాదించడం జరిగింది
డాక్టర్ జి సంఘ స్వయంసేవక్ యొక్క గుర్తింపు అనేది అతని యొక్క వ్యవహారము భావన ఆలోచన ద్వారా గుర్తించ బడాలి అని అన్నారు
స్వయంసేవక్ వాలింటర్ అనేవి వేరు వేరు అర్థాలు కలవి. వాలింటర్ అనే వారు తాత్కాలికంగా ఫలితాన్ని ఆశించి పని చేస్తే స్వయంసేవక అనే వారు నిరంతరం నిస్వార్థంగా దేశం కోసం పనిచేస్తారు.
శ్రీ గురూజీ తన విద్యార్థులను అన్నీ పక్కన పెట్టి నేను జీవితంలో స్వయంసేవకులు కావడమే గర్వకారణం అని అన్నారు.
స్వయంసేవక్ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకో కూడదు అందరిలో తను ఉండాలి
స్వయంసేవక్ ఒంటరిగా పని చేయడం కాకుండా అందరి భాగస్వామ్యం తో కలిసి పని చేయాలి
స్వయం సేవక్ స్వ ప్రేరణతో పని చేయాలి
పర్యటన కార్యకర్త గుణగణాలు
వ్యక్తిత్వ
మితహారం తీసుకుంటూ ఇతరులకు ఉపకారం చేసేవాడిలా ఉండాలి.
ఆరోగ్యంగా పరిశుభ్రంగా చిరునవ్వులు కలిగి ఉండాలి ఎల్లప్పుడు సంఘ పారాయణం చేయాలి
"సదా ప్రభాస్ నిరోగి భద్రవేశః సూచిస్మితః ఇటకారి వితహారి భవేత్ సంఘ పారాయ నమః
చేయాల్సిన పనిని ఎట్టి పరిస్థితిలోనైనా పూర్తి చేయాలి.
యోజన బద్దంగా పనిచేయాలి.
"అకర్తవ్యం నకర్తవ్యం ప్రాణః కంఠకైరపి కర్తవ్యమేవకర్తవ్యం ప్రాణహ కంటకైరవి
కార్యక్షేత్రం, కార్యకర్త, కార్యం
ఉదాహరణ మార్జాలం తన పిల్లలను తీసుకెళ్లినట్లు
నేతృత్వ
మంచి పని చేస్తూనే ఇతరులను ముందు వరుసలో ఉంచుతూ కార్యానికి జోడించాలి.
స్థితప్రజ్ఞ్యత
ముక్తసంఘోరహం వాది దృత్యుత్సాహ సమన్విత సిద్ధాసిద్ద నిర్వికారో కర్తా సాత్విక ఉత్పత్తి
పాత్రేత్యాగి
గుణేరాగ
శాస్త్రే బౌద్ధ
రణే యుద్ద
Comments
Post a Comment