2.(తృ) మాతృభూమి కల్పన| హిందూ సమాజపు స్వర్ణ యుగం| భారత్ ప్రాచీన హిందూ రాష్ట్రం | అఖండ భారత్ | పుణ్యభూమి భారత్ | భారత్ మృత్యుంజయ రాష్ట్రం

హిందూ సమాజపు స్వర్ణ యుగం
భారతదేశ చరిత్ర చాలా పురాతనమైనది, సుదీర్ఘమైనది. ఏ చరిత్రనైతే నిత్యం సంఘర్షణ ఎదుర్కొన్నప్పటికీ ఆ చరిత్ర సంస్కృతి వారసత్వంగా తర్వాతి తరాల ద్వారా కొనసాగించబడుతుందో అది స్వర్ణ యుగంగా పిలువబడుతుంది. 

భారతదేశ చరిత్ర కాదు పరాక్రమ చరిత్ర. 
మన ముందు ఉంచిన చరిత్ర వర్ణనలు సరైనవి కావు. రాజ్యపాలనంతట ప్రజల సంక్షేమంకై ఆలోచిస్తూ కొనసాగింది. సంస్కృతి వారసత్వం ఒక తరం నుంచి మరో తరం కు అందుతూ సహజ జీవనాన్ని గడుపుతూ పురుషోర్థాన్నీ ఆనాటి ప్రజలు సాధించారు.

విశ్వ విజేత అలెగ్జాండర్ భారతీయ చక్రవర్తి పురుషోత్తమును చేతిలో ఓడిపోయారు. సిల్లీక నాయకత్వంలో గ్రీకులు మరలా దాడి చేయగా చంద్రగుప్తిని సైన్యం ఓడించింది. దాని తర్వాత 1300 నుంచి 1500 సంవత్సరాల వరకు ఐరోపా నుండి ఏ దేశం భారత్ పై దాడి చేసే ధైర్యం లేకుండా పోయింది. 

రెండవ చంద్రగుప్తుడు సకల సామ్రాజ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాడు. మహమ్మద్ గజిని ముందు జరిగిన అన్ని దురాక్రమణలను గుర్జార ప్రతి హర రాజులు ఓడించారు. ఆ సమయంలో ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతలను విధిగా నిర్వర్తించారు‌.

భారత్ ప్రాచీన హిందూ రాష్ట్రం

భారత్ ప్రాచీన హిందూ రాష్ట్రం అనేక శ్రేష్ట వ్యక్తుల విచారాల పరంపర ద్వారా హిందుత్వం నిత్య నూతనంగా ముందుకు సాగుతుంది.

👉హిందుత్వం కూపస్థమండూకస్థితిని కలిగి లేదు. అన్ని రకాల మతాలు ధర్మాలు వాటి విచారాల నుండి మంచిని గ్రహిస్తుంది. ఏకం సత్ బహుద విప్రః

👉 ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అనేక దురాక్రమణదారుల దాడికి గురైన దేశం భారతదేశం కారణం భారత్ సమృద్ధి దేశం కావడమే కేవలం భౌగోళిక దురాక్రమణే కాకుండా ధార్మిక పరివర్తన ద్వారా కొన్ని వందల ఏళ్ల సంఘర్షణను మన దేశం ఎదుర్కొంది.

👉గ్రీకు, హున,శక, కుశాణ, అహొమ్ వంటి దురాక్రమణ జాతులు అన్ని భారతదేశంపై దండెత్తి పరాజయం పాలై ఇక్కడి స్థానిక ప్రజలతో మమేకమై హిందూ జాతిలో విలీనమైనారు.

👉ఇస్లాం , క్రైస్తవం వంటి సెమిటిక్ జాతులు ఒక చేతిలో ఖురాన్ బైబిల్లో చేతబట్టి మరో చేతిలో మారణాయుధాలు చేతబట్టి విశృంఖల చర్యలతో మతమార్పిడులకు దిగారు. హిందువుల శ్రద్ధా కేంద్రాలైన గోమాత, ఆలయాలు స్త్రీలను అగౌరవపరిచారు.

ఇటువంటి సమయంలో సహజంగానే ధర్మ రక్షకులు దేశంలో జన్మించారు.
మాలిక్ కాఫర్ కారణంగా మతం మారిన హరిహర బుక్కరాయలు తిరిగి విద్యారణ్య స్వామి కృషిచేత స్వధర్మంలకు చేరి తురుసుకులను ఓడించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.

👉చత్రపతి శివాజీ మహారాజ్ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురించి హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించారు.

👉 దక్షిణ భారతంలో స్వామి రామానుజాచార్య, ఉత్తర భారతంలో రామానందచార్య భక్తి ఆందోళన కార్యక్రమం చేపట్టి అందరు సమానమేనని  చెప్పి సామాజిక సమరసతకు విశేష కృషి చేశారు.

👉 కబీర్, దారో సూకో, రసఖాన్ లాంటి ఎందరో ముస్లిం సైతం హిందూ ధార్మిక ప్రభావానికి లోని భక్తి ఉద్యమంలో పాల్గొన్నారు.


మన ఇతిహాసాలు, పురాణాలుకూడ మన మాతృభూమి అంతటి వైశాల్యంకలది అనే ప్రకటిస్తున్నాయి. నేటి ఆఫ్ఘ నిస్థానము ఒకనాటి మన ఉపగణస్థానము; మహాభారతంలో శల్యునిస్థానం అదే. నేటి కాబూలు కాందహార్లు ఒకనాటి గాంధార దేశం. ఇచటనే కౌరవుల తల్లియైన గాంధారి జన్మించినది. చివరకు నేటి 'ఇరాను' కూడ వాస్తవానికి ఒకనాటి ఆర్య దేశము. ఆ దేశపుచివరిరాజైన రెజాషాపహ్లవీ ఇస్లాముమతముకన్న ఎక్కువగా ఆర్యులయొక విలువల నేఆదర్శంగాస్వీకరించిఅనుసరించినాడు. పార్శీలపవిత్ర గ్రంథమై న “జెండ్ అవెస్తా ”చాలావరకుఅధర్వణవేదమే. ఇంక తూర్పుదేశాలు
పరిశీలిస్తే నేటి బర్మా ఒకనాటి బ్రహ్మదేశం. నేటి 'ఇరావదీ' లోయ 'ఇరావత్' అను పేరున ఆనాటి కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాల్గొన్నట్లు మహాభారతం చెపుతుంది. సూర్యుడు తొలుత అటు ఉదయిస్తాడు. కాబట్టి అస్సామును 'ప్రాగ్జ్యోతిష' మని మహాభారతం చెప్పుతుంది. దక్షిణాన లంక మనతో అతిసన్నిహిత సంబంధాలు కలిగిఉండేది. అసలది ఎన్నడు వేరయినది అని అనుకోలేదు. పశ్చిమాన ఆర్యన్ (ఇరాన్) వద్ద తూర్పున శృంగపురం (సింగపూర్) వద్ద హిమవంతుడు తన రెండుచేతులు చాచి సాగరంలో ముంచుతున్నాడు. ఆమె పవిత్రపాదాల చెంత దక్షిణ సముద్రం సమర్పించిన పద్మంలాగాశ్రీలంక(సింహళం) ఉంది. మాతృభూమి యొక్క ఈ చిత్రము మనప్రజల మనస్సుల్లో అనేకవేల సంవత్సరాలుగా ఎల్లప్పుడూ ప్రకాశిస్తు నిలచిఉన్నది. హిందువులు ఈనాటికిగూడ నిత్యమూ స్నానంచేస్తూ, గంగ, యమున, గోదావరి, సరస్వతి, సింధు, కావేరి మొదలైన పవిత్రనదులను

గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి 
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు 

అంటూ స్మరిస్తారు. భక్తిభావాన్ని కలిగించడానికి ఇదికూడా ఒకశిక్షణే. దీనివలన, ఈ పవిత్ర నదులలోని ఒక్క నీటిబిందువై నాసరే మన పాపా అన్నిటిని కడిగివేయగలదు అనే విశ్వాసం మనలో కలిగింపబడుతున్నది.
మన ప్రజల ప్రవృత్తిపైన, మన సంస్కృతిపైన చెరగని ముద్రను చేసిన మహోత్కృష్టవ్యక్తులలో శ్రీరామచంద్రుడొకడు.

సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానిచ "
అంటూ ఆయనలోని ప్రశాంతత, ఉదారత, విజ్ఞానం, అనుభూతులవంటి మహాగుణాలను, అంతుదొరకని సముద్రపు గంభీరతా, ప్రశాంతతతోనూ, ఆయన అజేయ పరాక్రమాన్ని, రైర్యాన్ని అందుకోనలవిగాని మహోన్నత హిమాలయాలతోను పోల్చినారు.

ఇతరమతస్థాపకుల జీవితాలను తరచిచూచినపుడు, మన మాతృభూమి కున్న ప్రత్యేక అర్హ తలపట్ల ఇదే అభిప్రాయానికి వస్తాం. తన జీవితకాలంలో సాక్షాత్తు భగవంతుని చూచినట్లు చెప్పే ఆధారాలు మహా తపస్వియైన ఏసుక్రీస్తువిషయంలోగూడ కనిపించవు. ఆయనకు దేవదూతలు మాత్రమే కనిపించినారు; ఒకసారి 'సైతాను' ఆయనకు కనిపించినాడు. సిలువవేసినప్పుడు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ” (ఈ హీబ్రూ మాటలకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యివిడిచితివని యర్థం) అని ఒక్క క్షణం భగవంతుని దయనే సందేహిస్తూ ఆయన వాపోయినాడు.

ఇస్లాము మతప్రవక్తకూడా ఒకమహావ్యక్తి, గొప్ప శక్తిమంతుడు; అంతఃకలహాలతో ఛిన్నాభిన్నమై పోయిన తన అనాగరిక ప్రజలు మానవత్వపు విలువలను గుర్తించేటట్లు చేసి, వారిలో సామ్రాజ్యాలు నిర్మించాలనే కాంక్షను, సంఘటితశక్తిని కలిగించినాడు. కాని అతడుగూడా 'గేబ్రియల్’ను మాత్రమే కలుసుకున్నాడు. కొన్ని దివ్యవాక్యాలను విన్నాడు. అంత మాత్రమే. ఆయన భగవంతుని ప్రత్యక్షంగా దర్శించలేదు.

ఈభూమిలో జనించిన సంతానానికి మాత్రమే భగవంతుని పరిపూర్ణ తేజోమయ రూపాన్ని దర్శించి, ఆత్మానుభూతిని పొందే ఆదృష్టం కలిగింది. ఇతరజాతులు అడవులను, గుహలను విడిచి వెలికిరాని రోజుల్లోనే వైదిక ఋషులు, ఈ మానవజాతిని అమృతసంతానంగా "శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రా : ఆ ఇ దివ్యాధామని తప్సు" అంటూఉద్బోధించినారు.

వేదాహమేతం పురుషం మహాన్తమాదిత్యవర్ణం తమసః పరస్తాత్ / తమేవ విదిత్వా2తిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే౭యనాయ ॥

చీకటి కంతకును ఆవల, తేజోమూర్తియై ప్రకాశించుచున్న ఆ మహాపురు మని నేను దర్శించినాను. ఆయనను దర్శించడం ద్వారా జననమరణ చక్రంనుండి మానవుడు విముక్తుడగుచున్నాడు. మోక్షమున కంతకన్న వేరుమార్గము లేదు.]
అంటూ ఆ మహర్షులు ఘన గంభీర కంఠంతో ఘోషించినారు.
వారిలోని ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మసాక్షాత్కాకాన్ని వ్యక్తంచేస్తున్న ఈ వాక్యములతో తుల్యములయిన వాక్యములు ప్రపంచంలో ఏ ఇతర సాహిత్యంలోనూ లేవు. అంతేగాక, మానవాత్మను మేల్చొల్ఫేటువంటి భగవద్గీత అనే అమరసందేశంతో 'నేనే భగవంతుడ'నని ఉత్తమ పురుషలో చెప్పిన శ్రీకృష్ణునిపోలినవారిని, ప్రపంచంలో వేరెక్కడ చూడలేము.

అఖండ భారత్ సంకల్ప దివాస్
కలియుగాది నాటికి జంబూద్వీపం తొమ్మిది 'వర్షాలు'గా విభక్తమై ఉంది. ఇందులో భరతవర్షం ఒకటి. భరతవర్షం ఇప్పుడు పశ్చిమాసియాగా పిలుస్తున్న ప్రాంతం నుండి దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాల వరకు, తూర్పు ఆసియాలోని అనేక దేశాలవరకు విస్తరించి ఉండేది. భారతవర్షం సాంస్కృతికమైనది! రాజకీయ రాజ్యాంగ వ్యవస్థలపరంగా భిన్న ఖండాలుగా విభక్తమైంది. కానీ సంస్కృతి మాత్రం ఒక్కటే! అది సనాతన సంస్కృతి లేదా వేడ సంస్కృతి. ఇటీవలికాలంలో పాశ్చాత్య చరిత్రకారులు ఈ భారతవర్షాన్ని 'గ్రేటర్ ఇండియా' అని పిలిచారు. ఈ భరతవర్షంలోని భారతఖండం సాంస్కృతికంగా మాత్రమే కాక రాజకీయంగా, రాజ్యాంగపరంగా కూడా వ్యవస్థను కలిగియుండిన ప్రాంతం!!

అఖండ భారతఖండం దాదాపు నాలుగు వేల ఏళ్ల నుండి విభజనకు గురి అవుతూనే ఉంది. ఈ విభజన కలియుగం 5049 వరకు, క్రీస్తుశకం 1947 వరకు కొనసాగింది. ప్రస్తుతం కలియుగంలో 5114 ఏళ్లు పూర్తయినాయి. 5115వ సంవత్సరం నడుస్తోంది. ఇలా 'అఖండ భారతఖండం' రాజకీయ రాజ్యాంగపరంగా ఖండితమైన సహ స్రాబ్దులలో 'భరత వర్షం'లో సనాతన సంస్కృతి ప్రభావం క్రమంగా సన్నగిల్లింది. భారత వర్షం భారతఖండం ఒకదానికొకటి పర్యాయపదాలుగా మారిపోవడం రెండువేల సంవత్సరాలకు ఇటీవలి కానీ పెద్దదైన భారతవర్షంలో భాగం కావడం అనాది చరిత్ర.. కూడా చరిత్ర. భరతఖండం ఒక అందుకే భారతవర్ష మండలి భారతఖండంలో 'భరతవర్షే భరతఖండే" అని ఇప్పటికీ చెప్పుకుంటున్నాం.

భారతవర్షం కలియుగాదిలో ఇప్పటి ఇరాన్, ఇరాక్, మధ్య ఆసియా మొదలుకొని ఇప్పటి ఇండోనీషియా వరకు విస్తరించి ఉంది. అంటే ఈ ప్రాంతమంతటా ఒకటే సంస్కృతి ఉండాలి! అదే సమయంలో ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్, నేపాల్, టిబెట్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, బర్మాలతో కూడిన ప్రాంతమంతా ఒకే కేంద్రీయ రాజకీయ శాఖ ప్రాంతానికి లోబడిన సామ్రాజ్యంగా ఉండేది. ఇలా సాంస్కృతికంగానూ, రాజకీయపరంగానూ ఒకటిగా ఉండిన భూమి 'అఖండ భరత ఖండము.

ఈ భూభాగం విస్తీర్ణం 27,47,115 చదరపు మైళ్ళు! దాదాపు అరవై తొమ్మిది లక్షల చదరపు కిలీమీటర్లు! కాని క్రీస్తుశకం 1947 ఆగష్టు 15వ తేదీనాటికి 'భారతఖండం' వైశాల్యం కేవలం పదమూడు లక్షల చదరపు మైళ్ళు అంటే 32,87,263 కిలోమీటర్లు! అంటే వివిధ దేశాలలో సగానికి ఎక్కువ భారతభూమి విభక్తమైపోయింది. భారతదేశంగా మిగిలిన ప్రాంతం కంటే అఖండ భారతం నుండి విడిపోయిన ప్రాంతాల వైశాల్యం ఎక్కువగా ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్లు మన దేశం నుండి 1947లో విడిపోయాయన్న ధ్యాస మన దేశంలో క్రమంగా తగ్గిపోతోంది. కానీ అంతకు పూర్వమే మిగిలిన భూభాగాలు విడిపోయాయన్న ధ్యాస 1947 తర్వాత అత్యధిక సంఖ్యాకులకు లేనేలేదు. ధ్యాసలేనంతమాత్రాన చారిత్రక వాస్తవం వాస్తవం కాకుండా పోదు! ఈ వాస్తవ ధ్యాసను పదిలంగా ఉంచడం, ధ్యాసను కోల్పోయినవారికి గుర్తు చేయటం 'అఖండ భారత దినోత్సవలక్ష్యం'!

కలియుగాది నుండి
ద్వాపరయుగం చివర మహాభారతయుద్ధ సమయంలో రూపతి అన్న కురువంశం రాజకుమారుడు యుద్ధం చేయడానికి విముఖుడై కైలాస మానస సరోవరప్రాంతానికి వెళ్ళి తపస్సు చేశాడు. కలియుగ ప్రారంభంలో ఈ రూపతి త్రివిష్టప ప్రాంతంగా అప్పటికి అఖండభారతంలో ఉండిన వనసీమను గిరిసీమను పాలించిన మొదటి రాజు! టిబెట్
- త్రివిష్టపంలో అప్పటికి అనేక వనజనసముదాయాలు ఉండేవారు. ఈ వనవాసులందరినీ రూపతి సమైక్యం చేశాడు. కలియుగంలో అలా త్రివిష్టపం భారతఖండంలో రాజకీయంగా కూడా భాగం. వనజనుల మతం వనమతం. వారు ప్రకృతి ఆరాధకులు! ప్రకృతి ఆరాధన వైదిక సంస్కృతి! క్రీస్తునకు పూర్వం పదిహేనవ శతాబ్దిలో మౌర్యవంశ సమ్రాట్టులు, మగధలోని గిరివ్రజం రాజధానిగా అఖండ భారత దేశాన్ని పాలించేనాటికి త్రివిష్టపం వారికి సామంత రాజ్యం! కాని క్రీస్తునకు పూర్వం తొమ్మిదవ శతాబ్ది నుండి క్రీ.శ నాల్గవ శతాబ్ది ఆరంభం వరకు 'ఆంధ్ర శాతవాహనులు' గిరివ్రజం కేంద్రంగా అఖండ భారతదేశాన్ని పాలించిన కాలంలో త్రివిష్టపం - టిబెట్- విడిపోయి స్వతంత్ర దేశమైంది. ఇది మొదటి. దేశవిభజన! 4,72,000 చదరపు మైళ్ళ దాదాపు పదకొండున్నర లక్షల చదరపు కిలోమీటర్లు, టిబెట్ను క్రీస్తుశకం 1959 - కలియుగం 5061లో చైనా దురాక్రమించింది. ఒకప్పుడు టిబెట్ భారత్లో భాగం. ఆ తర్వాత రెండువేల ఐదు వందల ఏళ్ళు స్వతంత్ర దేశం! ఇప్పుడు చైనాలో భాగం!

విదేశీయులకు లొంగక...
బర్మా - మ్యాస్మీర్ - క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్ది నుండి అఖండ భారతం నుండి రాజకీయంగా దూరమైంది. విదేశీయ జిహాదీ పాలకులకు ఉత్తర భారతమంతా వశమైనప్పటికీ నేపాల్, భూటాన్, బర్మా, ఈశాన్య ప్రాంతాలు సింహళ - శ్రీలంక - ప్రాంతాలు వశం కాలేదు. ఈ ప్రాంతాలన్నీ స్వతంత్రంగానే ఉన్నాయి. అందువల్ల క్రమంగా ప్రధానభూభాగానికి దూరమయ్యాయి. క్రీస్తుశకం 1885 కలియుగం 4987వ సంవత్సరం వరకు బర్మా బ్రిటీషువారికి లొంగలేదు. అప్పటి నుండి బ్రిటీషువారు బర్మాను కూడా పాలించారు.*.” కానీ బర్మా ప్రాంతప్రజల అభీష్టానికి విరుద్ధంగా క్రీస్తుశకం 1937 కలియుగం 5039లో ఆ ప్రాంతాన్ని దేశం నుండి విడగొట్టారు. 2,61,000 చదరపు మైళ్ళు అంటే ఆరు లక్షల డెబ్బయి ఆరువేల చదరపు కిలోమీటర్ల భూమి 'అఖండ భారత్'కు దూరమైంది.

బంగ్లాదేశ్ గా ఇప్పుడు కొనసాగుతున్న తూర్పు బెంగాల్ ప్రాంతం క్రీ.శ. 1947 ఆగష్టు 15న విడిపోయింది. అది కలియుగంలో 5049వ సంవత్సరం. ఈ తూర్పు పాకిస్తాన్ విస్తీర్ణం 57,000 చదరపు మైళ్ళు అంటే లక్షా నలభై ఎనమిది వేల చదరపు కిలోమీటర్లు. పోర్చుగీసువారు సింహళ ద్వీపాన్న ఇప్పటి శ్రీలంక - క్రీ.శ. 1505 కలియుగం 4607వ సంవత్సరంలో వశపరచుకున్నారు. అంతకు పూర్వం వేలాది ఏళ్ళుగా 'సింహళం' భారత్లో భాగం! పోర్చుగీసువారు డచ్చివారు పోటీపడి 'సింహళంలోకి జొరబడిన తర్వాత క్రీ.శ. 1948 కలియుగం 5050వ సంవత్సరంలో బ్రిటిషువారి నుండి విముక్తమయ్యేనాటికి 25,000 చదరపు మైళ్ళ అరవై ఆరువేల చదరపు కిలోమీటర్ల సింహళం భారత్ నుండి విడిపోయింది. బ్రిటిషు వారు సిలోన్ అని నామకరణం చేసిన సింహళం ఆ తర్వాత శ్రీలంక అయింది.

శ్రీలంకకు పడమరగా మన లక్షద్వీపాలకు దక్షిణంగా విస్తరించి ఉన్న ద్వీపాల సముదాయం మాల్దీవులు. కేవలం 117 చదరపు మైళ్ళ - రెండు వందల తొంబై ఎనిమిది చదరపు కిలోమీటర్ల ఈ చిన్న దేశం పాశ్చాత్యుల దురాక్రమణకు పూర్వం 8 భారత్లో భాగం! లక్షద్వీపాలు - ఈ మాల్దీవులు ఒకే వరుసగా ఉత్తర దక్షిణంగా వందలాది మైళ్ళ మేర హిందూసాగరంలో విస్తరించి ఉన్నాయి. అందుకే మాలవలె వేలాడుతున్న ఈ ప్రాంతానికి మాలాదీవులు అని పేరు. మాల్దీవులుగా విదేశీయులు పేరు మార్చారు. అనాదిగా మాలాద్వీపాలలో వైదికమతాలు, సంస్కృత భాషా రూపాంతరమైన భాష పరిఢవిల్లాయి. ఆ తర్వాత బౌద్ధమతం ప్రధానమతమైంది. క్రీస్తుశకం 12వ శతాబ్దంలో ఇస్లాం జీహాదీలు చొరబడి మిగిలిన మతాలను ధ్వంసం చేశారు. పోర్చుగీసువారు, డచ్చివారు చొరబడిన తర్వాత బ్రిటిషువారు కలియుగం 4898లో క్రీ.శ. 1796లో మాలా ద్వీపాలను ఆక్రమించారు. భారత్నుండి విడగొట్టారు. క్రీ.శ. 1965- కలి 5067లో మాలాద్వీపాలు మాల్దావులన్న స్వతంత్ర దేశంగా ఏర్పడినాయి.

విషాద గాంధారం
క్రీస్తుశకం 1947 కలి 5049లో పశ్చిమ పాకిస్తాన్ భారత్ నుండి విడిపోయింది. 3,07,000 చదరపు మైళ్ళ -దాదాపు ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్ల పాకిస్తాన్ అఖండ భారత్ నుండి విడిపోయిందన్న ధ్యాస మనలో కొందరికుంది. కాని పాకిస్తాన్కు వాయువ్యంగా ఉన్న అఫ్ఘనిస్తాన్ క్రీస్తుశకం ఒకటవ శతాబ్ది నుండి దశలవారీగా విడిపోయింది. 2,51,000 చదరపు మైళ్ళ - దాదాపు ఆరులక్షల యాభై వేల కిలోమీటర్ల నేటి ఆఫ్ఘానిస్తాన్ ప్రాంతంలో కలియుగాది నుండి మూడు వేల రెండు వందల ఏళ్లపాటు గాంధార, యోన, రామఠ, హార, ఉత్తర జ్యోతిష వంటి రాజ్యాలుండేవి. ఉత్తర బాహ్లికం నేటి మధ్య ఆసియాలో సరిహద్దులలో ఉండేది. కలియుగం 3180 కొత్తశకాన్ని ఏర్పాటు చేసిన శాలివాహన చక్రవర్తి తర్వాత, ఈ గాంధారాది రాజ్యాలన్నీ క్రమంగా దూరమయ్యాయి.

ఇస్లాం జిహాదీలు చొరబడి నేటి ఆఫ్ఘనిస్తాన్లో నాడు జీవించిన బౌద్ధమతం వారిని నిర్మూలించారు. ఈ నిర్మూలన నాలుగు విధాలుగా సాగింది. చంపటం మొదటిది. మతం మార్చడం రెండవది. మహిళలను మానభంగం చేయడం మూడవది. తరిమివేయడం నాల్గవది. అలా భారతీయమైన బౌద్ధమతం నశించిపోవడంతో గాంధారాది ప్రాంతాలు దేశం నుండి విడిపోయాయి. నేపాల్, భూటాన్ ప్రాంతాలు చివరివరకు | బ్రిటిష్వారికి లొంగిపోకుండా స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకున్న అఖండ భారత రాజ్యాలు!

మొత్తం భారతఖండం బ్రిటిషు దురాక్రమణగ్రస్తమైన
సమయంలో నేపాల్, భూటాన్, స్వతంత్ర దేశాలుగా మిగిలి ఉన్నాయి. అలా స్వతంత్ర భారత రాజ్యాలైన నేపాల్, భూటాన్లు బ్రిటన్ దాస్యగ్రస్తమైన మిగిలిన భారతదేశం నుండి విడిపోయాయి. ఈ చారిత్రక వాస్తవం క్రీ.శ. 1947 కలియుగం 5049 తర్వాత చారిత్రక వైపరీత్యమైంది. బ్రిటన్ నుండి విముక్తమైన భారతఖండంతో పూర్వం వలె నేపాల్, భూటాన్లు కలిసిపోలేదు. ఆ రెండు స్వతంత్ర దేశాలుగానే ఉండిపోవడం భారత్ విభజనకు పరాకాష్ఠ!

ధ్యాస మన శ్వాస
ఇలా ఒకప్పుడు ఇరవై ఏడున్నర లక్షల చదరపు మైళ్ల వైశాల్యం కల్గిన అఖండ భారతం క్రీ.శ. 1947 తర్వాత కేవలం పదమూడు లక్షల చదరపు మైళ్ళకు పరిమితమైన ఖండ భారతమైంది. సనాతన సమగ్ర భరతమాత క్షతగాత్రయై ఉండడం వర్తమాన వాస్తవం! ఈ గాయాలను మాన్పి మళ్లీ సర్వసమగ్రంగా భరతమాత భౌగోళిక స్వరూపాన్ని, సాంస్కృతిక స్వభావాన్ని సాక్షాత్కరింప జేసుకోవాలన్న ఆకాంక్ష 'అఖండ భారత దినోత్సవానికి' ఇతివృత్తం! ఇలా సాక్షాత్కరింప జేసుకోవడం, సమీప భవిష్యత్తులో సాధ్యం కావచ్చు, కాకపోనూ వచ్చు! కాని మన భూమి పట్ల, మన సంస్కృతి పట్ల మనలో నిరంతరం నిష్ఠ కనిపిస్తూనే ఉండాలి. ఈ నిష్ఠను హైందవ జాతీయులు ఒకరినుండి మరియొకరికి, అసంఖ్యాక భవిష్యత్ తరాలకు అందజేయగలగాలి! ఈ అనాది ప్రక్రియ నిరంతరం అనంతంగా కొనసాగడానికి 'అఖండ భారత దినోత్సవం' భారతమాత పూజోత్సవం వంటివి దోహదం చేస్తున్నాయి. మన ఇంటిలోని ఒక గది కూలిపోతే మళ్ళీ కట్టుకుంటాం. ఇంటిలోని ఒక భాగాన్ని ఇతరులు ఆక్రమిస్తే మళ్లీ దాన్ని స్వాధీనం చేసుకునేవరకూ నిద్రపోము. వైయక్తికమైన ఈ జీవన వాస్తవాన్ని, జాతీయ కుటుంబానికి వర్తింప జేసినప్పుడు, వైయక్తిక బుద్ధి, ఆత్మ, జాతీయ ఆత్మతో, బుద్ధితో అద్వైతసిద్ధిని సాధించినపుడు 'అఖండ భారత్'ను మళ్లీ వాస్తవం చేయడం అసాధ్యం కాజాలదు. అంతవరకూ ధ్యాస మాత్రం హైందవ జాతీయుల ఎదలో దీపమై వెలగడం 'అఖండ భారత దినోత్సవ' లక్ష్యం!!

పుణ్యభూమి భారత్
*అధర్వణ వేదం భూమిసూక్తంలో* 
*#మాతా #భూమి: #పుత్రోహం #పృధివ్యా.’*
అంటే ఈ భూమి నా తల్లి నేనామె పుత్రుడను. 
*#జాతీయ #సంఘటనకు #అదే #మూల #స్రోతస్సు.*. 
 
భారతదేశంలో,పుట్టిన ప్రతి బాలకుడు తాను *"తల్లి # గర్భం" నుండి మాత్రమే జన్మించినట్లుగా భావించక.... "సంస్కృతి గర్భం" నుండి కూడా జన్మించినట్లుగా భావించబడుతాడు...*
*ఆ గర్భధారిణీ మరెవరో కాదు"#భరతవర్ష" అని పిలువబడే "#భారతమాత".*

भारत मे जन्म बालक केवल अपनी "माँ के गर्भ" से नहीं लेता वो जन्म लेता है एक "संस्कृति के गर्भ" से 
वो गर्भ है *"#माँ #भारती" का जिसे *"#भारतवर्ष" कहते है।*


*#మీరు #గమనిస్తే #భారత్ #ఓ #ప్రాచీన #దేశం. #అది #ఎంత?*
900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి

#మరీ #భారతదేశం #వయసు #ఎంత?

ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం

ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....

ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే

వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి

విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు

ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు

ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
"నా దేశం-భారత దేశం"

ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.

మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
"శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"

ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది

రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది

మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?

శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? 

ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
"హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం

మరీ దేశభక్తుల విషయం...

1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !

మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి

ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.

ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.

జై భారత్ మాత🙏🙏🙏


*#పాక్ #ఆక్రమించిన #లక్ష #చదరపుకిలోమీటర్ల #కాశ్మీర్ #ఏమైంది?*

*(1.07 లక్షల చ.కి.మీ. = 2 కోట్ల 65 లక్షల ఎకరాలు)*

POK విస్తీర్ణం 13 వేల చ.కి.మీ. మాత్రమే. మిగతాది ఏమైంది!? తెలుసుకుందాం...

జమ్మూ కాశ్మీర్ మొత్తం విస్తీర్ణం : 2.22 లక్షల చ.కి.మీ.

 భారత్ చేతిలో మిగిలింది: 1.01 లక్షల చ.కి.మీ.
 పాక్ ఆక్రమించింది: 1.07 లక్షల చ.కి.మీ.
 చైనా ఆక్రమించింది: 0.33 లక్షల చ.కి.మీ.
 (పాక్ చైనాకు గిఫ్ట్ గా ఇచ్చిన 14 వేల చ.కి.మీ. కలిపి)

* * * * * * * * * * * 
"గిల్గిత్ బాల్టిస్తాన్" ను ఖాళీ చేయమని మోడీ పాకిస్తాన్ కు నోటీస్ ఇచ్చే వరకు మనలో చాలా మందికి అది మన (భారత) భూభాగం అనే తెలియదు.

మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సగం చానళ్లకు "బాల్టిస్తాన్", "బెలూచిస్తాన్" వేరు వేరు అని కూడా తెలీదు.

వార్త తెలిసిన వారికి కూడా దాని ప్రాముఖ్యత తెలియదు.

* * * * * * * * * * * 

పాకిస్తాన్ 1948 లో జమ్మూ కాశ్మీర్ పై దాడికి దిగి జమ్మూ కాశ్మీర్ లో సగం ఆక్రమించింది.

భారత పాలకుల లాగా బుద్ధి హీనులు కాదు కదా...

పాకిస్తాన్ వెంటనే ఆ ఆక్రమించిన భూమి లో 
 - 10% ని "ఆజాద్ కాశ్మీర్" గా ప్రకటించింది.
 - మరో 10% భూమిని చైనా కు 
బహుమతి ఇచ్చింది
 - 80% భూమిని "నార్తర్న్ ప్రావిన్స్" గా పేరు మార్చి పాకిస్తాన్ లో కలుపుకుంది. ఇదే "గిల్గిత్ & బాల్టిస్తాన్".

ఇందులో తెలివి చూడండి. 

ఎప్పుడైనా భారత్ ఈ భూమి గురించి అడిగితే చైనాకు కూడా వాటా ఇచ్చింది కనుక అది త్రైపాక్షిక వివాదం అవుతుంది.
చైనా పేరు రాగానే భారత్ భయ పడుతుంది.

అవసరం ఉన్నా లేక పోయినా "కాశ్మీర్" "కాశ్మీర్" అని లొల్లి చేస్తూ..., 
వివాదం కేవలం "కాశ్మీర్" పైనే ఉన్నట్టు.. 
"జమ్మూ భారత్ ది, ఆక్సాయ్ చిన్ చైనాది, గిల్గిత్ & బాల్టిస్తాన్ పాకిస్తాన్ ది".. 
వీటి పై వివాదం లేనట్టు..

సీన్ సెట్ చేసి పెట్టింది.

భారత రాజకీయ నాయకత్వానికి వివరాలు తెలుసుకునే ఓపిక ఎక్కడిది? 

ప్రతి ఏడూ ఎలక్షన్ ల మీదే దృష్టి.

1962 చైనా యుద్ధం లో చైనా 0.33 లక్షల చ.కి.మీ భూమిని ఆక్రమించు కుంది. (పాక్ బహుమతి గా ఇచ్చిన 0.14 లక్షల చ.కి.మీ తో కలిపి)

"చైనా తో ఏం కయ్యం పెట్టుకుంటాం లే. మనకు అంత సీన్ లేదు" అన్నట్టు 60 సంవత్సరాల పాలించిన గత భారత ప్రభుత్వాలూ వదిలేశాయి.

* * * * * * * * * * * 
*ఈ ప్రాంతం ప్రాముఖ్యత ఏమిటంటే...*

5 దేశాలను కలిపే "వూఖాన్ కారిడార్".. 
(ఆసియా దేశాల మధ్య ఎప్పటికైనా రాబోయే రోడ్ / రైల్ / ఆయిల్ / గ్యాస్ కనిక్టివిటీ ఈ కారిడార్ లేకుండా సాధ్య పడదు). 

ఇది ఎవరి చేతిలో ఉంటే వారిని కాదని ముందుకు పోవటం ఇతరుల వల్ల కాదు. 

"భారత్ - ఆఫ్ఘాన్ రోడ్డు మార్గం".., 
- చైనా నిర్మించ తలపెట్టిన CPEC 
ఈ ప్రాంతం లోకే వస్తాయి.
* * * * * * * * * * * 
కట్ చేస్తే, వాజ్ పేయీ ప్రభుత్వ హయాంలో భారత్ ఈ ప్రాంతం లో ఎలాంటి ప్రాజెక్ట్ లకూ లోన్లు ఇవ్వటానికి లేదని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కు నోటీస్ ఇచ్చింది. అప్పటి లోన్ లు కొన్ని ఆపి ఆ ప్రాంతాన్ని తిరిగి వివాదాస్పదం చేయ గలిగింది.

ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పాకిస్తాన్ కు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయమని నోటీస్ ఇవ్వటం వెనుకా వ్యూహాత్మక ప్రయోజనాలు చాలా ఉన్నాయి.

 *#కీలక #నదులపై #ఆధిపత్యం...*

 - CPEC ను పూర్తిగా ఆప లేక పోయినా, దానిపై ఏదో ఒక విధమైన జాప్యం, వివాదం మొదలు పెట్టటం..

 - అదృష్టం బాగుంటే ఆ ప్రాంతాన్ని మళ్లీ మన ఆధీనం లోకి తీసుకోవటం..

 - అక్కడి ఖనిజ సంపద పై ఆధిపత్యం..

 - రానున్న రోడ్ / రైల్ / ఆయిల్ / గ్యాస్ కనెక్టివిటీ పై ఆధిపత్యం

*అందులో కొన్ని* * * * * * * * * 
*మన పిల్లలకు మన ఆస్తి పై కాస్త అవగాహన కల్పించటం* *మన కర్తవ్యం.*




Comments

Popular posts from this blog

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)