17.బౌద్ధిక్(ద్వి). వ్యక్తి నిర్మాణ్ సే రాష్ట్ర నిర్మాణ్ | వ్యక్తిగత శీలం - జాతీయ శీలం
*వ్యక్తి నిర్మాణం ద్వారా హిందూ రాష్ట్ర నిర్మాణం...*🚩
*(రెండవ భాగం - 2)*✍️🕉️
♦️వ్యక్తుల సంఘటనపై ఒక కార్యకర్త తన తోటి వారిని జాగ్రత్త పరిచి మన లక్ష్యం సాధించే దిశగా ముందుకు సాగాలి.. ఎలాగైతే ఒక భవనాన్ని నిర్మించుటకు అనేక రకాల వస్తువులు అవసరం అవుతాయో అలాగే మన సంఘకార్యం ముందుకు సాగుటకు మరియు హిందూ రాష్ట్ర నిర్మాణానికి కూడా అన్ని రకాల వ్యక్తులు అవసరమవుతారు...
♦️డాక్టర్ జి మన దేశ చరిత్రను లోతుగా అధ్యయనం చేసి భారతదేశం యొక్క మహోన్నత శక్తిని గుర్తించారు. వెయ్యి సంవత్సరాల క్రితం మన దేశం యొక్క ఆధ్యాత్మిక జ్ఞానసంపద సమృద్ధిగా తులతూగింది. కాని నేడు మనం ఏనాడైతే మన సాంస్కృతిక పరంపరను ముందుకు కొనసాగించుటకు మన ప్రయత్నం మందగించడం ప్రారంభమైందో నాటి నుండి దేశం తిరోగమనం వైపు పతనం వైపు ప్రయాణించినదని డాక్టర్ జి గ్రహించారు.
♦️గుప్పెడు మంది ముస్లింలు, ఆంగ్లేయులు మనలోని అనైక్యత ఆధారం చేసుకుని దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని 1000 సంవత్సరాలు దేశాన్ని ఆర్థికంగా సాంస్కృతిక పరంగా కొల్లగొట్టడం జరిగింది... మరి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే హిందూ సంఘటిత శక్తి అనేది అత్యంత అవసరం... ప్రతి ఒక్క హిందువు అన్ని రకాల భేదభావాలు పక్కనపెట్టి కలసి ముందుకు సాగితేనే పరివర్తన సాధ్యం అని లేకపోతే మళ్లీ దేశానికి బానిసత్వం తప్పదని డాక్టర్జి సంఘ శాఖ ను ప్రారంభించడం జరిగింది..
*సంఘటిత సమాజానికై సంఘ శాఖ*
♦️దేశాన్ని తిరిగి వైభవం స్థితిలో నిలబెట్టాలంటే ప్రతి వ్యక్తిలో దేశభక్తి, అనుశాసనం, క్రమశిక్షణ, సంఘటిత శక్తి నిర్మాణం చేయాలి
♦️అందుకు సంఘ శాఖ లో నేర్పే ఆటలు, సమత, దండ, సుభాషితాలు, కథ, వంటి శారీరిక, బౌద్ధిక్ కార్యక్రమాలు స్వయం సేవకుల మనసులో లోతైన భావాలు ఏర్పరుస్తాయి.
♦️ఈ కార్యక్రమాల ద్వారా స్వయంసేవకులలో వ్యక్తి నిర్మాణం తద్వారా గుణ వికాసం జరుగుతుంది...
వ్యష్టి నుండి సమష్టివైపుగా జరిగే ప్రయాణంలో కుటుంబం అనేది తొలి అడుగు. *తన తొలి అడుగునే తన గమ్యంగా భావించుకొనేటట్లయితే, ఆ వ్యక్తి యొక్క గతి ఆగిపోతుంది, గమ్యం తప్పిపోతుంది.* ఈ పొరపాటును సరిదిద్ది తన *కుటుంబ బాగోగుల గురించి ఆలోచించినట్లుగానే సమాజం బాగోగులను, మానవాళి మంచిచెడ్డలు గురించి కూడా ఆలోచించాలని, వాటిపట్ల శ్రద్ధ వహించాలని చెప్పి వ్యక్తిని, కుటుంబాలనూ ముందుకు నడిపించటమే సంఘటనా కార్యం.*
శాఖల్లో సమాజంలోని వివిధ వర్గాల వారు వివిధ వృత్తుల వారు ఎలాంటి వారు లేకుండా భారతమాత ఉపాసన చేస్తారు..
📌సంఘ శాఖ ద్వారా స్వయంసేవకులలో సంవేదనశీలత పెరుగుతుంది.
📌సమకాలీన సామాజిక విషయాల గురించి విషయాల గురించి తెలుసుకుంటాడు..
📌జాతి విద్రోహ శక్తుల పట్ల జాగురూకతతో ఉంటాడు.
📌ఈ దేశ ప్రజలంతా నా వారే అనే భావనను నిర్మాణం చేసుకుంటాడు.
📌ప్రతిష్ట కోసం కాక పరివర్తన కోసం పని చేస్తాడు.
📌సమాజ కార్యానికి వ్యక్తులను జోడిస్తూ ముందుకు సాగుతాడు.
శాఖ ద్వారా ఎందరో మేధావులుగా తీర్చిదిద్దబడిన వారు వారు అంతా శ్రేష్టమైన ఆలోచనలు కలిగిన వారు సాత్విక గుణమును కలిగి ఇతరులతో సుహృద్భావంతో పని చేస్తారు.
సమస్యలు అందరు చెప్తారు కానీ వాటికి పరిష్కారాలను సూచించగలరు స్వయంసేవకులు..
స్వయం సేవకులు ఏ పని చేసినా, ఏ రంగంలో ఉన్నా వారు దేశం కోసం పనిచేస్తారు..
యశస్సును అందరితో కలిసి పంచుకుంటారు.. కష్ట సుఖాలకు తాను బాధ్యత వహిస్తాడు.
వ్యక్తి నిర్మాణం కఠినమైన పని.. ఒక్కొక్కరిని గట పనిచేస్తూ శాఖకు తీసుకురావాలి.. వారి స్వభావాన్ని గమనిస్తూ క్రమక్రమంగా మార్పు తేవాలి.. తోటివారి పట్ల వారిలో ఆత్మీయతను పెంచాలి.
వ్యక్తి నిర్మాణం అయిన స్వయంసేవకుల చూసి సమాజం ప్రామాణికంగా తీసుకోవాలి..
అన్ని రంగాలకు స్వయంసేవకులను ఇవ్వగలగాలి.
ఆయా రంగాల సార్వాంగీణ వికాసానికి స్వయంసేవకులు కృషి చేయాలి.
ఈ విధంగా వ్యక్తి వ్యక్తిని కలుపుతూ
మన జాతి యొక్క నిజమైన పునరుజ్జీవనం వ్యక్తిని తీర్చిదిద్దడంతో ప్రారంభం కావాలి. మానవ సహజమైన బలహీనతలను అధిగమించగల శక్తిని వ్యక్తిలో నిర్మాణం చేయాలి. పరంపరాగతమైన ఆత్మ సంయమనం, త్యాగం సేవ, సౌశీల్యం అనే వాటిని అతడు పెంపొందించుకునేటట్లు చేయాలి. హిందూ పురుషార్థానికి ఒక తేజోవంతమైన ప్రతీకగా అతడు నిలబడాలి. మన రాష్ట్రీయ వైభవానికి మూలసూత్రమైన ఇట్టి యోజన వ్యక్తి నిర్మాణం చేస్తుంది మనం ఈ విధంగానే మరల మన ప్రాచీన విశ్వగురుపీఠాన్ని చేరుకోగలం. ఇందుకు సంఘం ఎంచుకున్న మార్గం నిత్య శాఖ.
వ్యక్తిగత శీలం - జాతీయ శీలం
దుర్గుణాలు గల వ్యక్తి సమాజాన్ని కలపలేడు....
వ్యక్తిగత స్వార్థంతో మనిషి పతనమవుతాడు..
అసంఘటిత సమాజాన్ని సంఘటితం చేయాలని అంటే ముందు అందరితో స్నేహం చేయడం రావాలి....
Comments
Post a Comment