పర్యావరణ పరిరక్షణ | గో సేవా

ఏక వృక్షో హి యో గ్రామే భవేత్ పర్ణ ఫలాన్వితః
చైన్యో భవతి నిర్యాతి  రచనీయ సుపూజితః

గ్రామంలో ఎక్కడ చెట్లు పూలు పండ్లతో నిండుగా ఉంటాయో ఆ ప్రదేశం పూజనీయమైనది.

ప్రపంచమంతా ఒకే కుటుంబం అనేది భారతీయ భావన అయితే ప్రపంచమంతా ఒకే వ్యాపార సామ్రాజ్యం అనేది పాశ్చాత్య భావన
అయితే ఈ రెండింటి మధ్య సమన్వయం సాధిస్తేనే ప్రపంచం ప్రగతిపథంలో ముందుకు సాగును లేకపోతే వినాశనం తప్పదు

ఇతర దేశాల్లో అన్ని వృత్తులకు ఒకే ప్రాధాన్యత ఉంటే మన దేశంలో మాత్రం వృత్తితో ఒకరకంగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది ఇది మంచి పరిణామం కాదు

గో సేవ
Andhra Mahabharatam1

ఒకరోజు పశు వధ శాలలో ఒకడు గోవును చంపడానికొచ్చినపుడు.....
గోవు వానిని చూసి నవ్వింది.

దాన్ని చూసి కసాయి అడిగాడు.
నేను నిన్ను చంపడానికి వచ్చాను, అది తెలిసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావ్?
అని అడిగాడు.
.
అప్పుడు గోవు ఇలా చెప్పింది.
.
నేను ఎప్పుడూ మాంసాన్ని తినలేదు.
.
అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతోంది.
ఏ తప్పూ చేయక, ఎవరికీ హాని కలిగించని నన్ను, నువ్వు చంపి, నా మాంసాన్ని తినే 
నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నేను నవ్వాను.
.
పాలిచ్చి మిమ్మల్ని పెంచాను. మీ పిల్లలకూ పాలిస్తున్నాను. కానీ నేను తినేది మాత్రం గడ్డి.

పాలతో వెన్న చేసుకున్నారు.వెన్నతో నెయ్యి చేసుకున్నారు.
నా పేడతో పిడకలు చేసుకుని వంటకు వాడుకున్నారు.
అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకున్నారు.

ఆ డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు. కానీ నాకు మాత్రం కుళ్లిపోయిన కూరలను ఎండి పోయిన గడ్డిని పెట్టారు. నా పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకుని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు.

కానీ నన్ను కసాయివాడిలా చంపడానికొచ్చావ్.....
నా పాలనుంచి వచ్చిన శక్తితోనే నన్ను చంపడానికి ఆయుధాన్ని ఎత్తగలిగావ్.

ఆ ఆయుధాన్ని ఎత్తే శక్తి నీకు వచ్చింది నా నుంచే.
నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావ్.
కానీ నన్ను మాత్రం ఒక గుడిసెలో ఉంచావ్.

నిన్ను కన్న తల్లికంటే నేనే నీకు ఎక్కువ ఆసరాగా నిలిచాను.
శ్రీకృష్ణుని ఇష్టురాల్ని నేను.

నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్న నీ గతి ఏమౌను?

నా సంతతిని ,నా జాతిని ఇలా మీరు చంపుతూ పోతూ ఉంటే 

మీకు ,మీ ముందు తరాలకు మేము సేవ చేసుకునే భాగ్యం ఉండదేమో 

మాకే ... భవిష్యత్తులో ఉనికి లేనప్పుడు ..మీ కెక్కడి మనుగడ,అందుకే  

నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను. అని చెప్పింది.

.***************************************************************************

*అమృతవచనం - 22*

*గావో విశ్వస్య మాతరః*
గోమాత విశ్వానికే తల్లి. గోసేవ, గోపూజ, గోవులతోడి సంబంధం, సహజీవనం గోవు ఇచ్చే పదార్థాలు మన సనాతనధర్మంతో ముడిపడి ఉంటాయి. అందుకే మన శాస్త్రాలు ముందుగా గోవులను రక్షించండి, గో సేవ చేయండి అంటూ స్వస్తి వాచకాలు పలికేటప్పుడు ముందుగా గోవులు శాంతిని పొందుగాక అని చెబుతాయి. గోవు వల్లనే మన సనాతన ధర్మం ఇంకా
ఈ మాత్రమైనా మిగిలి ఉంది. గోవులను గూర్చి కీర్తించని గ్రంధములు మన సనాతన ధర్మంలో బహు అరుదు... గోవు అనేటప్పటికే ఏ ఇతర జంతువు / పశువు పై లేని ఒక ప్రత్యేకమైన ఆరాధనా భావన మనస్సుకి స్ఫురిస్తుంది. కారణం ఒక్కటే తాత్త్వికంగా గోవు పశువు కాదు గోమాత, జగజ్జనని స్వరూపం అమ్మ అన్న పిలుపులో ఉన్న మాధుర్యమే గోమాతలో కూడా ఉంది...

*జై గోమాత...*🚩🚩

Comments

Popular posts from this blog

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు