భజనలు
What is the real spiritual
practice?
Give your best in everything. Accept the relationships, conditions, and situations that God gives you, and surrender yourself fully. Use the gifts God has given you-your mind, calmness, patience, power, strength, love, kindness, humility, and the knowledge gained through your experiences to perform every karma Genuinely remember God. Connect yourself to spiritual positivity, and keep reminding yourself that in every situation, your God is with you. We engage in spiritual practices -like chanting mantras, offering bhog, flowers, and water, not just because they are rituals, but because through them, we connect with the divine. God is truly everywhere, but these spiritual methods help us connect more easily. This is because the world is filled with illusionary, materialistic energies that make it difficult for our minds to focus fully on devotional practice. Keep your heart clean,intentions pure, speaking truth, showing compassion, serving
others selflessly, and staying grateful. It's about walking every step with God in your heart.
1. అఖండ మండలాకారం - వ్యాప్తం యేన చరాచరం
తత్పదం దర్శితం యేన - తస్మై శ్రీ గురవే నమః ||
భావము :- చరాచర సృష్టియందంతటనూ ఆ పరమేశ్వరుడు వ్యాపించి యున్నాడు. అట్టి పరమేశ్వరుని దర్శింప చేసిన శ్రీ గురుదేవులకు నమస్కరించుతున్నాను.
2. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన - తస్మై శ్రీ గురవేనమః
భావము : - మన చుట్టూ అజ్ఞానమనే చీకటి వ్యాపించియున్నది. అజ్ఞానం అను కాటుకను కనురెప్పలకు రాకించి, కనులను తెరిపించి, అజ్ఞానం అను చీకటిలో సైతం చూడగల దృష్టిని ప్రసాదించిన గురుదేవులకు సమస్కరించుచున్నాను.
3. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మః తస్మై శ్రీ గురవేనమః
భావము : గురువే బ్రహ్మా, విష్ణు మహేశ్వరుడు, ఆ త్రిమూర్తులు చేసే స్ృష్టి స్థితి, లయ కార్యములను నిర్వహించు పరబ్రహ్మ స్వరూపలైన శ్రీ గురువేపులకు నమస్యరించుచున్నాు త్వమవ మాతాచ పితా త్వమప - త్వమేవ బంధుశ్చ సభా త్వమేవ
4. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ - త్వమేవ సర్వం మమ దేవ దేవ
భావం :- ఓ దేవ దేవా ! నీవే నాకు తల్లివి, తండ్రివి, బంధువుడవు, మిత్రుడవు, విద్యాస్వరూపడువు ధన స్వరూపుడవు, నాకు సమస్తమూ నీవే ....
5. ఓం పూర్ణమదః పూర్ణమిదం - పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ - పూర్ణమేవా వశిష్యతే ||
భావము : - ఈ సృష్టి అంతయు భగవంతునిచే నిండియున్నది. కాబట్టి ఈ సృష్టికి యేమి కలిపిననూ సృష్టినుండి దేనిని తీసివేసిననూ ఏ విధమైన మార్పు రాదు. నశించునది నశించచుండగా మరోకచోట, మరొకవైపు నూతనముగా స్ృష్టించబడుచుండును. భగవత్ స్వరూపమైన ఈ సృష్టి అనంతమైనది. అవ్యమైనది. అది ఎప్పటికినీ పరిపూర్ణముగానే ఉండును.
1.అందరగూడి భజనలు చేసితే
ఎందుకు రాడా మాధవుడూ
తాళం శబ్దం చెవిలో పడితే
పరగున వచ్చును మాధవుడూ ॥అందరు॥
వరప్రహ్లాదుడు హరియని వేడగ
స్తంబము నందే వెలిసెనుగా
అటువంటి భక్తీ మనలో ఉంటే
ఎందుకు రాడా మాధవుడూ || అందరు॥
ద్రౌపతి దేవీ కృష్ణాయనగా
వలువలొసంగెను మాధవుడూ
అటువంటి భక్తి మనలో ఉంటే
ఎందుకు రాడా మాధవుడూ ॥అందరు॥
అహల్య దేవీ రామా అనగా
రాతిని నాతిగ జేసెనుగా
అటువంటి భక్తి మనలో ఉంటే
ఎందుకురాడా మాధవుడూ ॥అందరు||
కలియుగమందున మానవజన్మము
మనకొక వరమని తెలియండీ
పావననామస్మరణలతోడనే
పరుగున వచ్చును పరమాత్మ ॥అందరు||
2. రామ రామ రామయన్న రామచిలుక ధన్యమూ...
రామ రామ రామయన్న రామచిలుక ధన్యమూ.. రామప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యమూ..
॥రామరామ ||
అభినందనలందుకొన్న కోతిమూక ధన్యమూ ...
ఆశీస్సులు పొందిన ఆపక్షిజాతి ధన్యమూ..
॥రామరామ ||
రేగుపండ్లు తినిపించిన - శబరిమాత ధన్యమూ..
నావనడిపి దరిచేర్చిన గుహుని సేవ ధన్యమూ..
॥రామరామ ||
అత మోసినట్టి భరతుడెంతో ధన్యమూ...
రామభజన చేసినట్టి భక్తులెంతో ధన్యమూ..
॥రామరామ ||
పాదధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యమూ..
వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యమూ
॥రామరామ ||
మధురాతి మధురం రెండక్షరాల మంత్రము..
సత్యధర్మ మూర్తిత్వమురాముని అవతారము
॥రామరామ ||
3. నమః పార్వతీ పతయే హరహర
నమః పార్వతీ పతయే హరహర
హరహర శంకర మహాదేవ
శంభోశంకర మహదేవా ॥2॥
హరహర హరహర మహాదేవా
శివశివ శివశివ సదాశివా
మహాదేవా సదాశివా సదాశివా మహాదేవా
||నమః||
శ్రీశైల వాసా శ్రీమల్లికార్జున భ్రమరాంబా ప్రియ మనోహరా నందివాహనా నాగాభరణా గౌరీమనోహర గంగాధరా
మహాదేవా సదాశివా సదాశివామహాదేవా
||నమః||
ఢమ ఢమ ఢమ ఢమ ఢమరూభజే
గణ గణ గణ గణ ఘంటా బజే
ఢమరూ భజే ఘంటా భజే
గంటా భజే ఢమరూభజే
||నమః||
4. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం
కోసలేశాయ మందహాస దాస పోషణాయ
వాసవాది వినుత సత్యరాయ మంగళం ॥2॥
చారు మేఘరూపాయ చందనాది చర్చితాయ హారకటకశోభితాయ భూరి మంగళం
లలిత రత్నకుండలాయ తులసీ వనమాలికాయ జలజసదృశ దేహాయ చారు మంగళం
దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజాతగురువరాయ భవ్యమంగళం
పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ
అండ జ వాహనాయ అతులమంగళం
విమలరూపాయి విధిత వేదాంత వేద్యాయ
సుముఖ చిత్రకామితాయ శుభ్రమంగళం ॥॥
రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరి వరాయ సర్వమంగళం
5. నీ నామమొకటే నిత్యం రా....!
నీ నామమొకటే నిత్యం రా నీ నామమొకటే ఓసత్యములు
రామ శ్రీరామ జయ రామ రఘు రామ
ఉన్నంతకాలం ఇంత మోహం
ఎన్నడు వీడదు ఈ వింత దాహం
తన వారెవరో పరాయి ఎవరో
తనువు వీడితే తదుపరి ఎవరు
నిలువదు నిలువదు ఈ ప్రాయం
మరో నిమిషంలో మటుమాయం
ఇల్లు మిగలదు ఇల్లాలు మిగలదు
నాది అనుకున్నది ఏది మిగలదు
చివరకు చేసిన భజనలు రా
చివరకు చేసిన సేవలు రా
ఆ పుణ్యం ఒకటే నిలుచునురా
ఆ ధర్మం ఒక్కటే శాశ్వతం రా
6. జగమేలు జనని ఓయమ్మా
మా బ్రతుకు బాట నీవమ్మా
జగమేలు జనని ఓయమ్మా
మా బ్రతుకు బాట నీవమ్మా
కర మందు వీణ దాచావు
తల్లి కమలం బు లోన నిలిచావు
నా హృదయ కమల కుసుమం
నీ చరణాల పాదపీఠం
నీ నామ మధుర గానం
తల్లి ఏనాడు మరువ జాలం
సంగీత కళల జనని
సర్వలోకాలను బ్రోచే వాణి
వేదాల వెలుగు నీ చలవే
తల్లి వెలిశావు ఇలలో మా కొరకై
కవులైన పండితులకు
తల్లి నీవేలే వారి బ్రతుకు
ముక్కోటి దేవతలు లోకం
మొక్కె రూ ముదముతో నిత్యం
7. ఇది మనదేశం - ఇది మనదేశం
ఇది మనదేశం - ఇది మనదేశం.
ఇది మనదేశం రన్నా - ఇది స్వర్గము కన్నా మిన్నా
వేషభాషలు రూపురేఖలు
మతభేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా
1. హుసేను తండ్రి హాషిం - హోయ్ హోయ్
హాషిం తండ్రి కాశీం..
కాశీం తండ్రి లతీఫ్
లతీఫ్ తండ్రి షరీఫ్
షరీఫ్ తండ్రి శంకర్
మతాలు వ్రతాలు మారినా
మన తాతలు తండ్రులు మారరురా
||ఇది మనదేశం - ఇది మనదేశం||
2. జాన్సను ఫాదర్ జేమ్స్ - హోయ్ హోయ్
జేమ్స్ ఫాదరు జిప్సిన్
జిప్పిన్ ఫాదర్ జయపాల్
జయపాల్ ఫాదర్ జయరాం
గ్రాండు ఫాదరు ఒక్కడే
గతమంతా మనది ఒక్కటే
||ఇది మనదేశం - ఇది మనదేశం||
3. మతం పేరుతో ఒకడు - హోయ్ హోయ్
మాతృభూమిని చీల్చే
మారణహోమం చేసే
మానని గాయం చేసే
కారెను కన్నీటి ధారలు
పారెను రక్తపుటేరులు
||ఇది మనదేశం - ఇది మనదేశం||
4. అంటరానితనమన్నా - హోయ్ హోయ్
అది ఒక పాపమురన్నా
లంచగొండి రాజ్యంలో
అంతులేని అవినీతి
కట్నపు చావుకేకలు
కులాల పేరుతో కలతలు
సాంఘిక దుష్ప్రచారంపై
సాగును మన పోరాటము
||ఇది మనదేశం - ఇది మనదేశం||
5. సోదరభావం పెంచి - హోయ్ హోయ్
సమైక్యతను సాధించి
సమతాభావం నింపి
మమకారాలను పంచి
సిరిసంపదలను పెంచి
పేదప్రజలు ప్రేమించుదాం
భారతి పూజించుదాం
||ఇది మనదేశం - ఇది మనదేశం||
6. స్వంతలాభమును మరచి - హోయ్ హోయ్
ప్రాంత విభేదాలు విడిచి
కరువు పీడితులు చూడు
వరద బాధితులు చూడు
నదీజలాలను పెంచు
పాడిపంటలను పెంచు
కలుగును సస్యశ్యామలం
సుజలాం సుఫలాం మాతరం
||ఇది మనదేశం - ఇది మనదేశం||
7. హిమగిరి కొండలు మనవి - హోయ్ హోయ్
హిందుసాగరం మనది
నదీనదాలు మనవి
పచ్చని బంగరు భూములు
లెక్కకు మించిన భాషలు
షిల్లాం, ఢిల్లీ, బాంబే మనవే
మనదీ విశాల భారతం
బోలో వందేమాతరం
||ఇది మనదేశం - ఇది మనదేశం||
శాఖ చిన్నది - హిందువుల కథ పెద్దది
వాళ్ళందరిని మేలుకొలిపి బలం పెంచుతున్నది !!
1.కోట్లమంది వున్నరు -సోయ లేకున్నరు
కేశవుడు పుట్టి,శాఖ పెట్టి,హిందువన్నడు !!
2.గల్లి గల్లి చూడర - జెండను నిలవెట్టిరి
ఆటపాటలాడి దేశభక్తిని చూపెట్టిరి !!
3.దక్ష ఆరమన్నది - దండ తిప్పుతున్నది
దేశమాత సేవచేయ -దండు కదలుతున్నది !!
4.పాక్ చైన దుండగులు - కయ్యానికి కాలుదువ్వె
సరిహద్దుల మన సేనకు పోరులొ తోడుండెరా!!
5.గాలి తుఫానొచ్చినా -వరద ముంచుకొచ్చినా
కట్టుబట్ట లేనివాళ్ళ - కన్నీళ్ళు తుడిచెరా!!
6.ఒంటరితనమొద్దని - కుటుంబాలు ముద్దని
ఇల్లిల్లూ తిరిగి మనం అంతా ఒకటన్నది !!
7.ఏ కులమైతేందిరా -భేదభావమేందిరా
యుగం మారుతోంది -జర బుద్ది మార్చుకొమ్మురా !!
8.రామరాజ్య కాలం -భారత పురాణం
నేటికింక పల్లె జనం నోట్లొ నానుతున్నది !!
9.సింధుతీరమందునా - ఋగ్వేదం వెలిసెనా
వేల ఏళ్ళ జ్ఞానమింక విస్తరించు చుండెనా !!
10.ముక్కోటి దేవతలను మూలకుంచమన్నది
భారతాంబ కంటె మించి దైవం లేదన్నది !!
------------------------
అచ్యుతం కేశవం - భజన
అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం_2 రామ నారాయణం జానకీ వల్లభం||. 2
1. కౌన్ కెహతే హె భగవాన్ ఆతే నహీ 2
తుమ్ మీరా కె జైసే బులాతే నహీ || 2 ||అచ్యుతం||
2. కౌన్ కెహతే హె భగవాన్ ఖాతే నహీ| 2
బెర్ శబరి కె జైసే ఖిలాతే నహీ ||2 ||అచ్యుతం||
3. కౌన్ కెహతే హె భగవాన్ నాచతే నహీ|
గోపియో కి తరః తుమ్ నచాతే నహీ||. 2 2 ||అచ్యుతం||
4. కౌన్ కెహతే హె భగవాన్ సోతే నహీ॥
మా యశోద కె జైసే సులాతే నహీ || 2
||అచ్యుతం||
గోవింద జయ జయ హరి గోపాల్ బోలో 2
రాధా రమణ హరి గోపాల్ బోలో||— 2
గోవింద జయ జయ హరి గోపాల్ బోలో 2 రాధా రమణ హరి గోపాల్ బోలో ||— -3 2
రాధా రమణ హరి గోపాల్ బోలో
-------------------------------------------------------------------
పుడితే పుట్టాలి హిందువుగా...
పుడితే పుట్టాలి హిందువుగా
ఈ భారత దేశపు పౌరుడిగా
కరసేవకుడై కదలాలి.. శ్రీ రాముని గుడిని కట్టాలి
బలి బలి బజరంగి.. జై బోలో జై బోలో భజరంగి.
1.గుండెల నిలపరా రాముని రూపం
అయోధ్యలొ వెలిగించు కర్పూర దీపం
గుడినే కట్టాలిరా రామయ్యది..
రుణమే తీర్చాలి రా జన్మభూమిది
తూటాలు ఎదురైన తల్వారు లెదురైనా
రోషంతో రొమ్ము విడిచి ముందుకెళ్ళారా
శ్రీరాముని గుడి కట్టేదాకా నిదురపోకుర ! పుడితే !
2.కేసరి తిలకం నుదుటన పెట్టు
హనుమంతుని జెండా చేతితో పట్టు
పౌరుషమే చూపించారా తమ్ముడా
హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా తూటాలు ఎదురైన తల్వారులెదురైనా
జైశ్రీరామ్ అంటూ ముందుకురకరా
ఎవరెదు రొచ్చిన రాడ్డు తిప్పి లాతు కొట్టారా..పుడితె
3.ప్రతి ఇంటిలో తల్లి హారతి పట్టే
కొడుకుకు వీర తిలకం పెట్టి
పంపాలి అయోధ్యకు తన కొడుకుని
గుడి గట్టే దాకా రావద్దని తిరిగి ఇంటికి
తూటాలు ఎదురైనా తల్వారు లెదురైన
తల్లి మాట జవదాటని శివాజీ లా
గుడి కట్టి తిరిగి రావాలి చత్రపతిలా.. పుడితే..
రాముని మించిన వారెవరు
లోకములో లేరింకెవరు
బ్రోచేవారు ఇంకెవరు
రామునికి సరి రారెవరు
రామా రామా రఘురామ
జానకి వల్లభ జయ రామా!!
1.
నావను నడిపి నది దాటించిన
గుహుడి సేవలు అపురూపం
అయోధ్యలో రారాజుల ప్రక్కన గుహునికి గౌరవ స్థానం ఇచ్చిన
!!రాముని మించిన!!
2.గురుకులమ్ములో విద్యను పొందె అరుంధతిని తన తల్లిగ తలచి
శాపం పొందిన మాత అహల్యను ఓదార్చి,చైతన్యం నింపిన
!!రాముని మించిన!!
3.విల విల లాడే సీతను జూచే
రావణుని తన ముక్కుతో పొడిచే
ప్రాణమొసంగిన జటాయు పక్షికి
దహన క్రియలే శ్రద్దగ చేసిన
!!రాముని మించిన!!
4.భక్తితో శబరి ఇచ్చిన పళ్ళను ఆనందంతో ఆరగించెను
జై శ్రీరామని వానరులంటే
గుండెనిండుగ కొలువై ఉండెను
!!రాముని మించిన!!
5. లంకను గెలిచి, తిరిగిచ్చేసి విభీషణున్ని రాజుగ చేసి
వాలిని చంపి, రాజ్యం వద్దని
అంగదుడిని యువరాజుగ చేసిన
!!రాముని మించిన!!
6. సీతను అడవుల పంపెను గాని
ఎడబాటున తను విలపించేను
భార్యభర్తల ప్రేమెటువంటిదో లోకానికి చూపించెను రాముడు
!!రాముని మించిన!!
7. ఉత్తర దిశలో జన్మించె ,
దక్షిణ దిశలో పయనించె
భారతీయులం మనమంటూ
తరతమ భేదం తగదంటూ
!!రాముని మించిన!!
Comments
Post a Comment