సందర్భోచిత కథలు
10 12 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు సాహసంతో కూడిన కథలను హావభావాలు, ఉత్కంఠతో సరళమైన భాషలో చెప్పాలి. వీరుల బాల జీవితాలను పరిచయం చేయాలి.
వయస్సు ఆధారంగా కథలు తెలుపగలగాలి.
బాలల హృదయం అద్దంలాంటిది. మనం చెప్పే విషయాలు వారి భవిష్యత్తులో వారి వ్యక్తిగత జీవితం పై ప్రభావం చూపి మరియు ప్రతిబింబించి సమున్నత స్థాయిలో ఉండడానికి ఉపయోగపడుతుంది.
సమాజ హితమే మన స్వార్థం అనే భావనతో కూడిన కథలను ఉద్యోగి తరుణ శాఖలో బోధించాలి.
అనుశాసన ప్రబోధన కథలను బోధించాలి.
1. విర్రవీగే తనం, అహంకారం ఈ సందర్భాల్లో మాట్లాడేటప్పుడు...
(గాడిదపై దేవుని ఊరేగింపు)
2. ఇతరులపై మన ప్రభావం ఉండాలేగానీ ఇతరుల ప్రభావం మనపై ఉండకూడదు...
(ఎద్దు - యజమాని - పశువుల వైద్యుడు)
3. మంచివారు వ్యాప్తి చెందాలి...
(సన్యాసి - రెండు రకాల గ్రామాల ప్రజలు)
4. భగవంతుడు కష్టాలు అనేది సహనాన్ని మరియు మన సామర్థ్యాలను పెంచుటకు కల్పిస్తాడని మనం విశ్వసించాలి.
గొంగళి పురుగులు - విద్యార్థులు
4. సంస్కృతిని అవహేళన చేయకూడదు..
(అక్బర్ - బీర్బల్ కథ)
ఓసారి అక్బర్ బీర్బల్ ఇద్దరూ వ్యాహ్యాళికి వెళ్లారు
దారిలో తులసి చెట్టు కనిపించేసరికి బీర్బల్ వంగి సంస్కారంతో ప్రణామం చేసాడు.
ఎవరది ఏంటది అనడిగాడు అక్బర్!
బీర్బల్ - మాతల్లి తులసీమాత
అక్బర్ వెంటనే అది పీకి పారేసి ఎంతమంది తల్లులు ఉంటారు మీ హిందువులకు అన్నాడు.
దానికి సరైన జవాబు ఇచ్చే అవకాశం కోసం చూస్తూ బీర్బల్ ఓపిగ్గా అక్బర్ వెంట నడుస్తున్నాడు
ఓ చోట దురదగుంటాకు చెట్టు కనపడింది, వెంబడే బీర్బల్ పితృ దేవేభ్యోన్నమః అంటూ నమస్కారం చేసాడు
అక్బర్ కి కోపం వచ్చి రెండు చేతులతో దాన్ని పీకే ప్రయత్నం మొదలు పెట్టాడు. అంతలోనే అతనికి దురద మొదలవడంతో, బీర్బల్ ఏమిటిది అనడిగాడు.
మీరు మా తల్లిని అకారణంగా దండించినందుకు పితృదేవులకు కోపం వచ్చింది అని చెప్పాడు.
అక్బర్ చేతులు శరీరం లో ఎక్కడ పెట్టినా అక్కడ దురద మొదలైంది.
దాంతో, ఏదైనా ఉపాయం చెప్పు బీర్బల్ త్వరగా అన్నాడు
బీర్బల్ - ఉపాయం ఉంది, ఉపశమనం లభిస్తుంది, కానీ అదీ మా ఇంకో తల్లి దగ్గర వేడుకోవాలి చూద్దాము అన్నాడు.
అక్బర్ - ఏదో ఒకటి తొందరగా చెయ్యి అన్నాడు
బీర్బల్ - అదిగో అక్కడ ఉన్న గోమాతని అడగండి, మాతా, తగిన మందుని ప్రసాదించు అని అడగండి అన్నాడు.
అక్బర్ ఆ విధంగా అడగడంతో ఆవు పేడ వేసింది, ఆ లేపనాన్ని పూయాడంతో అక్బర్ కి దురద నుండి ఉపశమనం లభించింది!
కానీ అవతారం చూసుకుని, బీర్బల్ ని అక్బర్ అడిగాడు రాజమహల్ కి ఇలా ఎలా వెళ్ళగలము అని.
బీర్బల్ -
లేదులెండి బాద్షా, మా ఇంకొక తల్లి ఉంది మార్గం చూపిస్తుంది అని చెప్పాడు.
ఎదురుగా గంగానది ప్రవహిస్తోంది.
బీర్బల్ చెప్పాడు - ఇప్పుడు మీరు హర్ హర్ గంగే, జై గంగా మాత అని నదిలోకి దూకండి అని!
ఆవిధంగా స్నానం చేసి హాయిగా ఫీల్ అవుతు గంగకి నమస్కారం చేసుకున్నాడు అక్బర్.
అప్పుడు బీర్బల్ చెప్పాడు, మహారాజా, తులసీమాత, గోమాత, గంగామాత జగత్ జగత్ జననీలు, బేధ భావాలు లేకుండా అందరి శుభానికి మేలు చేస్తుంటారు అని.
ఇది నమ్మేవారిని హిందువులు అంటాము
హిందూ అనేది ఒక సభ్యత, సంస్కృతీ విధానమేగాని మతం కాదు, అంతటి గొప్ప జీవన విధానం అని
గో,గంగా, గీత, గాయత్రి లను గౌరవించడం ముఖ్యం, అవి మన సంస్కృతికి మూలస్థంభాలు.
5. మర్కట నీతి - మార్జాల నీతి
6. నీట మునిగిన వ్యక్తిని కాపాడటం
స్వ ప్రేరణతో పని చేయాలి.
7. స్వయమేవ మృగేంద్రత
మృత సింహం 4 పిల్లలు గొర్రె కాపలాదారు
8. ధ్యేయనిష్ట లోపం
కోతి ఉపవాసం
9.
1. తనకో న్యాయం పరులకో న్యాయం
2.పూలబుట్ట చేపల కథ
3. మనస్సును బట్టే లోకం
4. నేలతల్లి మీద నిండు ప్రేమ
5. ధర్మము అమ్ముకొనే వస్తువు కాదు
6. మనిషిని కలిపితే దేశం కలుస్తుంది
7. ధర్మ వారధి లో ఉడతా
8. శిక్షణ పరమార్థం
9. దండలు ఇచ్చే తల్లి
10. విజయ రహస్యం
11. కుక్క మనసు మనిషి మనసు.
12. బాటసారి కల్పవృక్షం
13. స్త్రీ త్యాగం
14. తిండిపోతు కథ
15. త్రికరణశుద్ధి బుద్ధుడు
16. నీలిరంగు నక్క
17. బద్దకస్తుడు పేలాలు
18. సింహం కుందేలు
19. నూతిలో కప్ప
20. అద్దం చూసి దిద్దుకో
21. పెద్దల మాట పెరుగన్నం మూట
22. భార్య ముంగిస
23. దురాశ నక్క
24. గురు సందేశం
25. శత్రువు మిత్రుడు భావన
26. అన్నదమ్ములు
27.సాధువుగా మారిన దొంగ
28. కోతి నిష్ఠ
29. బెల్లం తీపి సాధువు
30. సీతాకోకచిలుక విద్యార్థి
31. టైరు గాలి బయటగాలి
*ప్రేరణ కథలు - 1*
*(చంద్రశేఖర్ ఆజాద్)*
చంద్రశేఖర్ ఆజాద్ అసలు పేరు చంద్రశేఖర్ తివారీ. ఆయన కాశీలో చదువుకొనే రోజుల్లో 1921లో ఆయన సహాయనిరాకరణోద్యమం సందర్భంగా సత్యాగ్రహంలో పాల్గొన్నాడని బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేసి మెజిస్ట్రేటు ముందు హాజరుపరిచారు...
అప్పుడు *మెజిస్ట్రేట్ నీ పేరేమిటి ?*
అని అడిగాడు.
*14 ఏళ్ళ పిల్లవాడైన చంద్రశేఖర్ చిలిపి గా, గంభీరంగా “ఆజాద్"* అన్నాడు.
*ఆజాద్ అనగా హిందీలో స్వేచ్చ అని అర్థం.*
మెజిస్ట్రేట్ కి కోపం వచ్చి....
*"నీ తండ్రి పేరు ఏమిటి?* అన్నాడు.
*మళ్ళీ అదే గంభీరమైన గొంతుతో చిలిపిగా "స్వాధీనం అని చెప్పాడు. స్వాధీనం అంటే స్వాతంత్రం అని అర్థం.*
వెంటనే...
*మేజిస్ట్రేట్ కోపంతో నిలబడి, బిగ్గరగా మీ దేవూరు ? అని అరిచాడు.*
దానికి ప్రతిగా అంతే బిగ్గరగా ఆ పిల్లవాడు
*"జైలు అని సమాధానం ఇచ్చారు.*
దీంతో ఆవేశం తట్టుకోలేక ఆ మేజిస్ట్రేట్ 16 కొరడా దెబ్బల శిక్షను విధించాడు. పోలీసులు ఆయన్ని కాశీ సెంట్రల్ జైల్లో కొడుతుంటే “వందేమాతరం" అంటూ ఆ నొప్పిని భరిస్తూ నేల మీద పడిపోయాడు. *నాటి నుండి అతని పేరు చంద్రశేఖర్ ఆజాద్ అయ్యింది.*
*ప్రేరణ కథలు - 2*
*(సుభాష్ చంద్రబోస్....)*
అది కలకత్తా మహానగరం. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో ఎఫ్.సి.ఓటెన్ అను ఆంగ్లేయుడు లెక్చరర్ గా పనిచేస్తున్నాడు.
*అతనికి భారతదేశం అన్నా భారతీయులన్నా విపరీతమైన ఏహ్యభావం (అసహ్యం) ఉండేది.*
ఒకనాడు *భారతదేశాన్ని గురించి తరగతిలో విద్యార్థుల ముందు నీచంగా మాట్లాడాడు. అతని నీచపు మాటలను విద్యార్థిగా ఉన్న సుభాష్ చంద్రబోస్ విని తట్టుకోలేకపోయాడు.*
తరగతి గదిలో అందరూ చూస్తూ ఉండగానే...
*నా దేశమంటే నీకెందుకురా అంత చులకనా......" అంటూ అతని మీదకు సింహంవలె దూకి చితకబాదాడు.*
ఈ కారణాన సుభాష్ చంద్రబోస్ గారిని ఆ కాలేజ్ నుండి రెండు సం॥ల పాటు
ఆంగ్ల ప్రభుత్వం బహిష్కరించింది.
*ప్రేరణ గాథలు - 3*
*(స్వామి వివేకానంద....)*
అయిదేళ్ళు రాగానే నరేంద్రుని *(వివేకానందుని చిన్నప్పటి పేరు)* చదివించేదుకు ఒక
ఉపాధ్యాయుడిని నియమించారు. నరేంద్రున్ని ఇంట్లో బిలే అని పిలుస్తుండేవారు. నరేంద్రుడిది చంచల స్వభావం.
అందువల్ల ఒకనాడు ఉపాధ్యాయుడు నరేంద్రుడు ఎటువంటి తప్పు చేయకున్న అతనిని కొట్టాడు. నరేంద్రుని నోటి వెంట తటాలున ఈ మాటలు వెలువడ్డాయి. *నేను మహావీర హనుమాన్ భక్తుడను..మీరు నన్ను దండిస్తే నేను వినను.*
ప్రేమతో బుజ్జగించి చెపితే మీ మాట వింటాను అని పలికాడు..
ఉపాధ్యాయుడికి ఈ చిన్నబాలుని మాటలు విని మతిపోయింది. ఆనాటినుండి బాలుడికి ప్రేమతో చదువు చెప్పటం మొదలు పెట్టాడు.
*ప్రేరణ గాథలు - 4*
*కేశవుని దేశభక్తి.....*
*చిన్న సంఘటన అయినా చాల స్ఫూర్తి కలిగించేది.....,*
1897 నాటికి ఇంగ్లాండ్ రాణి విక్టోరియా రాజ్యాభిషేకం జరిగి 60 సంవత్సరాలు పూర్తి అయింది. ఆ సందర్భంగా ఆమె రాజ్యాభిషేక వజ్రోత్సవాలను చాల వేడుకగా, గొప్పగా చేయాలని ఆంగ్ల ప్రభుత్వం తలపెట్టింది. ఆ సమయంలో మన దేశం మీద ఆంగ్లేయుల పరిపాలన సాగుచున్నందువలన ఈ ఉత్సవాలను ఆడంబరంగా జరపాలని ఆంగ్లేయులు అజ్ఞను జారీ చేశారు. అందుకనుగుణంగా ప్రభుత్వ భవనాలన్నిటినీ మిరుమిట్లు గొలుపునట్లు ప్రకాశవంతంగా అలంకరించారు. పాఠశాలల్లో కూడా లడ్డూలు పంచిపెట్టారు. పిల్లలు అందరు లడ్డు తిన్నారు. కాని బాలకేశవ్ (హెడ్గేవార్) ఆ లడ్డును చెత్తకుప్పలో విసిరేసినాడు. విదేశీ రాణి రాజ్యాభిషేక సంబరాలలో సంతోషాన్ని పంచుకోవడం కేశవునికి ఇష్టం లేదు.
కేశవుడు వెంటనే ఆ మిఠాయిని మురికి కాలువలో పారవేశాడు. కారణమడిగితే చెప్పాడు. 'విక్టోరియా ఆంగ్లేయుల రాణి.....*
*ఆంగ్లేయుల మనల్ని బానిసలుగా చేశారు. ఆమె జన్మదినం నాడు మనం ఎందుకు సంతోషించడం???*
ఇది విన్న ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దవారు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇంత చిన్న బాలుడిలో ఎంతటి స్వదేశాభిమానం ! ఎంతటి స్వాతంత్ర్య కోరిక ! ఈ బాలుడు పెద్దవాడైనాక కేశవ బలిరామ్ హెడ్కేవార్ పేరిట ప్రసిద్ధికెక్కారు. ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని స్థాపించారు. బాల్యం నుండే మిక్కిలి దేశభక్తి మిక్కిలి స్వాభిమానం గలిగిన వ్యక్తి గా ప్రసిద్ధి పొందారు..
ఆ సమయంలో కేశవుని వయసు కేవలం 8 సంవత్సరాలే.
చిన్న వయస్సులోనే అతని హృదయంలో దేశభక్తి అనే జ్యోతి రగులుతూ ఉండేది.
*ప్రేరణ గాథలు - 5*
*కేశవుని బాల్యఘట్టాలు - 2*
విక్టోరియా రాణి మరణానంతరం 1901లో ఏడవ ఎడ్వర్డ్ ఇంగ్లాండ్ దేశానికి రాజు అయ్యారు. అప్పుడు బాలకేశవుని వయసు పన్నెండు సంవత్సరాలు. ఇంగ్లాండ్ రాజు అంటే హిందు దేశానికి సామ్రాట్టుగా నాడు భావించేవారు. వారి రాజ్యాభిషేక కార్యక్రమాన్ని ఇంగ్లాండ్లో సమానంగా మన హిందు దేశంలో కూడా నిర్వహించారు. నాగపూర్లో బట్టలు తయారుచేసే ఇంప్రెస్ మిల్' అనే పరిశ్రమ వుండేది. నేటికీ అది వున్నది. ఈ సందర్భంగా దీనిని పూర్తిగా అలంకరించాలని, రాత్రివేళ టపాకాయలు కాల్చడం, వివిధ రంగులు వెదజల్లే తారాజువ్వలు మొదలైన ఆడంబరాలతో ప్రజలను ప్రభావితం చేయాలని మిల్లు యాజమాన్యం నిర్ణయించింది. ఈ ఆడంబరాలను చూడటానికి జనం గుంపులు గుంపులుగా వెళ్ళారు. పాఠశాల పిల్లలకు ఇది చాల ఆకర్షణీయమైన తమాషాగా అనిపించింది. కనుక పిల్లలు కూడా చాలమంది టపాకాయలు పేలడం చూడటానికి వెళ్లారు. కాని కేశవ్ వెళ్ళలేదు. వారి మిత్రులు అతనిని తమ వెంట తీసుకొని పోవడానికి చాలా ప్రయత్నం చేసారు. కేశవ్ మండిపడుతూ *"వాడెవడో పరాయివాడు మనలను బానిసలుగా చేసినవాడు* *వాడికోసం వేడుకలు* *జరుపుకొంటుంటే మనం*
*వెళ్ళడమేమిటి?"*
అని తిరస్కరించాడు. ఇంత లేతవయసులోనే కేశవునికి దేశాభిమానం ప్రగాఢంగా వుండటం ఆశ్చర్యకరం.
*ప్రేరణ గాథలు - 6*
#కేశవుని #బాల్య #ఘట్టాలు - #3
#భగవద్ #ధ్వజాన్ని #ఎగరేద్దాం
శివాజీ కథను వింటున్నప్పుడల్లా కేశవ్ తన్మయత్వంతో తాను కూడా శివాజీ సైన్యంలోని ఒక సైనికుడిని అనుకునేవాడు
ఒక్కొక్కసారి తాను గుర్రపుస్వారీ చేస్తున్నా ననుకొనేవాడు. మరొకసారి దుర్గాన్ని (కోటను)ముట్టడిస్తున్నాననుకొనేవాడు. రహస్య మార్గం గుండా కోటలో ప్రవేశించి కోటను జయిస్తున్నా అనుకునేవాడు, ప్రత్యక్షంగా ఆ విధంగా చేయాలని రచ్చ వాడు.
నాగపూర్ మధ్యలో ఒక చిన్న కోట ఉంది.
దానిని '#సీతాబర్డీ' అంటుండేవారు. ఆ రోజుల్లో ఆ కోటమీద ఆంగ్లేయుల జెండా ఎగురుతుండేది. అది చూసినప్పుడల్లా కేశవ్ బాధపడుతుండేవాడు. ఆయన తన స్నేహితులతో ఇంగ్లీషువాళ్ళ జెండాను పీకిపారేయ్యాలి. ఆ కోటను మనం జయించాలి. దానిపై మన భగవాధ్వజాన్ని ఎగురవేయాలి.' అన్నాడు
ఒక స్నేహితుడు 'మనం ఎట్లాగైనా కోట లోపలికి చేరగలిగితే, అక్కడి ఆంగ్ల సైనికులను చంపి కానీ తరిమివేసి కానీ కోటను జయించవచ్చు' అన్నాడు.
'మరి లోపలికి పోయేదెలా?' తన అనుమానాన్ని వెలిబుచ్చాడు మరో స్నేహితుడు.
మూడోవాడన్నాడు 'మనం సొరంగం తవ్వుదాం. నేల అడుగు నుంచే కోట లోపలికి పోయే మార్గం ఏర్పడుతుంది.”
పదండి. ఇప్పుడే మొదలు పెడదాం.
మంచిపని చేసేటప్పుడు ఆలస్యం కూడదు.
వారు ఆడుకునే చోటుకి దగ్గరగా వారి మాష్టారు ఇల్లు ఉంది. ఆయన ఇంటి ప్రాంగణం విశాలమైంది. ఆయన ఇంటిలోని వారంతా పొరుగూరు వెళ్లారు. వఝో గారు బడికి పోయిన తర్వాత ఇంట్లో ఎవరూ ఉండరు. అది అనుకూలమైన సమయమనుకున్నారు.
స్నేహితులంతా తమ తమ ఇళ్ల నుంచి పలుగులు, పారలు తెచ్చారు.
బాలురు తమ పనిని రహస్యంగా చేసుకోసాగారు. వఝో గురూజీ ఇంట్లో ఒక పెద్ద గొయ్యి తయారైంది. సాయంత్రం మాష్టారుగారు ఇంటికి వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. ఆయన వారితో ఒకరిద్దరిని పిలిచి అడిగారు. అప్పుడు బాలురు తమ పథకాన్ని వివరించారు. అది విని ఆయనకు నవ్వు వచ్చింది. ఉజ్వలమైన వారి ఆకాంక్షకు సంతోషమూ కలిగింది. ఆయన వారందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని విషయాన్ని వివరించారు. వారందరికీ నాయకుడు కేశవ బలిరాం హెడ్గేవారుకు మరింత శ్రద్ధతో నచ్చజెప్పారు. 'నీవు ముందు ముందు దేశానికి గొప్ప సేవ చేస్తావు' అంటూ ఆశీర్వదించాడు.
✍🕉 🔥హిందూ....
ఒకానొక చక్రవర్తి యుద్ధంలో గెలిచి వచ్చాడు. భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశ యల్లింది. తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, జ్ఞాని, గురువు అయిన మహా మంత్రే ఆయనకా సమయంలో చులకనగా కనిపించాడు. దీన్నే అంటారు కళ్లునెత్తికెక్కాయని.
అతనిలో గర్వంతో బాటు అహంభావం కూడా పెరిగింది. మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మరచిపోయాడు.
'మంత్రివర్యా! మీరెంతో తెలివైనవారు, జ్ఞాన నిధి, గొప్ప వ్యూహ కర్తలు. ఈ తెలివి తేటలతో బాటు అందం కూడా ఉంటే ఎంత బాగుం డును' అన్నాడు.
అసలతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే. కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు.
తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి. ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు. తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తూలనాడలేదు.
దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి 'ఎండ మండిపోతోంది. ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు' అన్నాడు.
పరిచారకుడు స్వర్ణ పాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు.
'ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి. దాహం తీరి ఉండ దు. మట్టి కుండలో నీరు తెచ్చి ఇవ్వు' అన్నాడు మంత్రి మళ్ళీ. ..పరిచారకుడు మట్టి కుండలోనుంచి తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు.
వెంటనే ఆలోచించాడు...
మంత్రి ఒక్క సారిగా నీటిని గురించి ప్రస్తావించడడం, పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర, మట్టి పాత్ర ల్లోని నీటిని తెప్పించడం ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు. వివేకవంతుడు కనుక వెంటనే అర్థమయింది. జ్ఞానోదయమయింది.
వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి, 'గురు దేవా! మన్నించండి. గర్వాతిశయంతో కాని మాట అన్నాను. బంగారు పాత్ర విలువైనదే కావచ్చు. అందంగా ఉండవచ్చు. కాని దానికి నీటిని చల్ల్లపరిచే గుణం లేదు. మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు. అయినా నీటిని చల్ల్లగా ఉంచు తుంది. అందం కాదు గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు బహు చక్కగా బోధించారు. నా అపరాధాన్ని మన్నించండి' అన్నాడు.
ఆ చక్రవర్తి మరెవరో కాదు మౌర్య వంశ వ్యవస్థాపకుడు మౌర్య చంద్ర గుప్తుడు. ఆ మహా మంత్రి మరెవరో కాదు. మహారాజనీతి వేత్త, చతురుడు, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరు గాంచిన చాణక్యుడు.
*నరస్యాభరణం రూపం*
*రూపస్యాభర ణం గుణమ్*
*గుణస్యాభరణం జ్ఞానమ్*
*జ్ఞానస్యాభరణం* *క్షమా*
మానవులకు ఆభరణం రూపమని, రూపానికి ఆభరణం సుగుణమని, సుగుణానికి ఆభరణం జ్ఞానమని, జ్ఞానానికి ఆభరణం క్షమ అని దీని అర్థం.
పై శ్లోకంలో మనిషికి రూపం మంచి ఆభరణమని చెప్పినా గుణం, జ్ఞానం, క్షమ అనేవి రూపం కన్నా అతి ప్రధానమైనవని స్పష్టం చేయబడింది.
అంటే మంచి అంద గాడైనా ఏ వ్యక్తి అయినా ఆ ఒక్క లక్షణం ద్వారా పూజ్యుడు కాడు.
వినయం అనేది మనిషిలో ఎల్ల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ ఉండాలి.
కొందరు ఓటమి చవి చూసి నప్పుడో, బాధలలో మునిగిపోయినప్పుడో తమ బాధలు వెళ్ళబుచ్చుకునేందుకు ఇతరుల ముందు వినయం ప్రదర్శిస్తారు.
అయితే ఇలాంటి వ్యక్తులు గెలుపు సాధించి నపుడు, సంపదలు వచ్చినపుడు, మంచి పదవి ఉన్నపుడు గర్వాతిశయంతో ఇతరులను చిన్న చూపు చూస్తారు. కించ పరుస్తారు. మాటలతో ఎదుటివారిని చులకన చేస్తారు.
అందంగా ఉండడం మంచిదే కాని తను అందంగా ఉన్నానని అందవిహీన మయిన పనులు చేయడం తగనిది.
అన్నీ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నపుడు కూడా హద్దులెరిగి ప్రవర్తించాలన్నది పెద్దల మాట.
Comments
Post a Comment