3.బౌద్ధిక్ (ద్వి) : హిందువులే రాష్ట్రీయులు |నేను హిందువునని గర్విస్తున్నాను | విశ్వవ్యాప్త హైందవం| హిందూ సంస్కృతి విశేషతలు
వేయి సంవత్సరాల నుండి హిందూ రాష్ట్రం పై విధర్మీయుల దాడులు జరుగుతున్నప్పటికీ హిందుత్వం వాటన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారతదేశంలో తన అస్థిత్వాన్ని నిలుపుకుంది. హిందుత్వం అనేది అజరామరం..
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హిందుత్వం ఆధారంగా దేశాన్ని పరమ వైభవ స్థితికి చేర్చుటకు సంకల్పం తీసుకున్నది ప్రపంచంలో వివిధ రకాల సంస్కృతులు మతాలను పరిశీలించినప్పుడు వాటికి ప్రవక్తలు మరియు అవి ప్రారంభమైన కచ్చితమైన సమయం ఉన్నాయి కానీ ఆదియు అంతము లేని మరియు ప్రవక్తలు లేనీ సృష్టి ఆరంభంలో ప్రారంభమైన ధర్మం హిందుత్వం..
పరాయి పాలనలో ఆంగ్ల విద్య వ్యామోహంలో మన దేశంలో కొందరు ధర్మాన్ని హేళన చేసి తూలనాడడం జరిగింది.
కాల పరిణామంలో వివేకానంద లాంటి వాటి ప్రభావంతో నేను హిందువులు అని సగర్వంగా చాటి ఎలా చేశారు
విశాల భావాలు సర్వమానవాళి సకల ప్రాణుల శ్రేయస్సును కోరే హిందూధర్మంలో మనం హిందువుగా జన్మించడం మన అదృష్టం
యోగ వైద్య విజ్ఞాన శాస్త్రాల ద్వారా భారతదేశం ప్రపంచంలోని ఇతర దేశాలకు జ్ఞానభిక్ష ప్రసాదించింది ప్రపంచంలో మిగతా మతంల దేవుని పట్ల విభిన్న భావాలను కలిగి ఉన్నారు కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముని నేనే దేవున్ని జీవాత్మ లో పరమాత్ముని చూపారు
భగవంతుని అంతటా దర్శించే గొప్ప సంస్కృతి హిందుత్వం
కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి తాను చేయు కర్మల ఆధారంగా జీవితం లభిస్తుందని శరీరం శాశ్వతం కాదని ఆత్మ శాశ్వతమని హిందూ పురాణాలు తెలుపుతాయి ఈ ఆలోచనల నుండి పునర్జన్మ భావన ఏర్పడింది
హిందూ జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ ప్రధానమైనది కుటుంబం అనేది మనిషిని వ్యష్ఠి నుండి సమిష్టిగా సమిష్టి నుండి పరమేష్ఠికి చేరుస్తుంది. నేను నాది అనే భావన నుండి మనము మనది అనే భావనను నేర్పుతుంది
వివాహం అనేది రెండు శరీరాల కలయిక కోసం కాదు రెండు మనసుల కలయిక కానీ మన ధర్మం విశ్వసిస్తుంది
Bharat mother of all
విల్ డ్యురాంట్ ప్రముఖ చరిత్రకారుడు
భారతదేశం మాత్రమే సకల సృష్టిని ఒకటిగా చూడగలుగుతాం ది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
ఆత్మ మాత్రమే శాశ్వతం అనుభవం ఉండి కర్మసిద్ధాంతం ఏర్పడింది
జీవాత్మ పరమాత్మ భావం లో నుండే మోక్షసధన అనే భావం ఏర్పడింది
ఈ మోక్ష సాధనకై మన ధర్మంలో చతుర్విధ పురుషార్థాలు అయిన ధర్మార్థ కామ మోక్షాలనే సాధించుటకు గానూ ఒక క్రమపద్ధతి కూర్చబడింది
ధర్మబద్ధంగా అర్థ కామాలు తీర్చుకుని మోక్షం సాధించాలి ఈ ధర్మ భావన నుండి యజ్ఞ త్యాగ భావన వచ్చాయి ఈ విధంగా ఏర్పడిన త్యాగమే అమృతత్వాన్ని అమరత్వాన్ని కలిగిస్తుందని హిందువులు భావించారు ఇదే కర్తవ్య భావనకు ఆధారమైంది
హిందూ సంస్కృతి విశేషతలు
హిమాలయాల నుండి సముద్రం వరకు విస్తరించిన భూమి, వైవిధ్యంతో నిండిన ఇక్కడి ప్రకృతి, ఏకాత్మత సాక్షాత్కారం భారతీయ సంస్కృతికి బలమైన పునాది.
అ) యజ్ఞమయం, త్యాగమయం
'ఇదం న మమ' అంటే ఇది నాకు కాదు, 'సర్వభూతహితేరతా' (జీవులన్నింటి హితంకోసం కృషిచేయాలి) మొ॥ కాబట్టే ఇక్కడ త్యాగులైన మహాపురుషుల పరంపర ఉంది.
ఆ) కర్తవ్య నిర్వహణ చేయాలని కోరుకోవడం-
త్యాగంపై ఆధారపడిన సంస్కృతి. కర్తవ్యపాలన అంటే ధర్మపాలన, ఇతరుల కోసం చేసిన కార్యం. ధర్మాన్ని కోరుకోవడం - పుత్ర ధర్మం, పితృధర్మం, పతిధర్మం, రాజధర్మం, ప్రజాధర్మం, మొదలైనవి.
ఇ) సహిష్ణుత
అన్ని మార్గాలను (పూజాపద్దతి, ఆలోచనలు) సరియైనవేనని గౌరవించడం. “ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి.” (అయితే ఇది అబ్రహాం మతాలైన ఇస్లాం, క్రైస్తవాలకు ర్తించదు)
ఈ) సర్వపంధ సమాదరణ-
'సర్వ సమావేషక సంస్కృతి' అన్ని సంప్రదాయాలకు సమాదరణ, ఏదో ఒక సంప్రదాయం లేదా ప్రదేశం విశేషమైనది అనిగాక కేవలం మానవుడి గురించే ఆలోచించడం.
ఉ) అందరినీ కలుపుకోగల్గిన జీర్ణం చేసుకోగల్గిన సామర్థ్యం
శకులు, హూణులు మొదలగు వారిని కలిపేసుకున్న ఉదాహరణ కొత్తది, నుంచి ఆలోచన ఎక్కడినుండి వచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం. "అనో భద్రాః క్రతవో యస్తు విశ్వతః' (ఇతరులను కూడా మనకు అనుకూలంగా చేసుకుని మనలో కలి పేసుకునే స్వభావం మరియు ప్రపంచంలో ఎక్కడి నుండి వచ్చినా మంచి విషయాలను స్వీకరించడం.)
ఊ) శస్త్రం, శాస్త్రం అంటే శక్తి, భక్తి సమన్వయం
సమర్థరామదాసు మరియు శివాజీ, చాణక్యుడు మరియు చంద్రగుప్తుడు, గురుగోవింద సింహుడు మరియు బందాలైరాగి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద సమన్వయ ప్రయత్నానికి కొన్ని ఉదాహరణలు.
ఋ) పూజాభావన వికాసం-
మాతృదేవోభవ, పితృదేవోధవ, అతిథిదేవోభవ, ఆచార్య దేవోభవ, రాష్ట్రదేవోభవ, భూమిపూజ, వాస్తుపూజ, గోపూజ, గంగాపూజ మొ॥
ౠ) పరివారం, కుటుంబ పోషకం:
కుటుంబం సమాజంలో అతిచిన్న అంశం. కుటుంబంలో సంస్కారాల పరంపర- పుట్టుక నుండి చావువరకు 16సంస్కారాలు (పూర్వం 40 సంస్కారాల గురించి వర్ణన ఉంది.)
ఎ) సమాజం, దేశం పట్ల సమర్పణ
వ్యక్తి జీవనపు సార్ధకత సమాజం, దేశంపట్ల చేసే సర్వస్వార్పణలోనే ఉంది.
* భిన్నత్వంలో ఏకత్వం, ప్రకృతితో సమన్వయం, నిష్కామ కర్మ, సంయమనంతో కూడిన జీవితం, ధర్మాధారిత జీవితానికి గౌరవం.
"మాతృవర్ పరదారేషు పరద్రవ్యేషు లోవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః ప్రశ్యతి సః పండితః|"
"అయం నిజ: పరోవేతి గణానా లఘు చేతసామ్ |
ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకమ్॥"
Comments
Post a Comment