20.బౌద్ధిక్ (ప్ర&ద్వి):ఉద్ఘాటన & శిక్షావర్గ సమారోప్
మనమందరం ఈ శిక్షణ వర్గ పేరిట తపస్సును సాధన చేయడానికి వచ్చాము.
తపస్సు అంటే లక్ష్య సాధనకై తనను తాను మరచి పోవడం... అంటే కళ్ళు తెరిస్తే తన సమాజం గురించి కళ్లుమూస్తే తన గురించి ఆలోచించడం...
లౌకిక వ్యవహారం (సామాన్యమైనటువంటి విషయాలకు) వాటికి కాస్త దూరంగా బతకడమే తపస్సు....
స్వయంసేవక అంటే ఎవరు..??
విశుద్ధ దేశ భక్తి తో కూడిన జాగృత సక్రియ కార్యకర్త..
మనమంతా గత 96 సంవత్సరాలుగా దేశ కార్యంలో నిమగ్నమైనా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలం యుగ ద్రష్ట అయిన డాక్టర్ జి వారసులం..
ఈ శిక్షణ వర్గ ఎందుకు
సంఘ మంత్రాన్ని సాధన చేయుటకు మంత్ర ఉపాసన
సంఘ లక్ష్య వివరణ వ్యాఖ్యానం
సంఘ లక్ష్యంతో తాదాత్మ్యం చెందటం
లక్ష్యంతో మమేకం అయిన వాడు అంతర్ముఖంగా ఆలోచిస్తాడు తన ప్రతి పనిలో సమాజం కొరకై ఆలోచిస్తాడు..
ఉ : కథ వాచస్పతి మిశ్ర
ధ్యేయమూర్తుల సాంగత్యం
సంఘ కార్య పద్ధతి అనేది silent revoluation not a violent revolution....
సంఘ కార్యపద్ధతికీ యంత్రాంగం పునాది రాయిలాంటివాళ్ళు కార్యకర్తలు...
వికాసం అనేది కేవలం ఉపన్యాసాలతో రాదు దానికి శారీరకశ్రమ తోడుకావాలి బలాన్ని శక్తిని ఉపాసన చేయాలి. స్థిరత్వాన్ని కలిగి మనస్సును ఏకాగ్రం చేయాలి అది మనం ఈ శిక్షా వర్గలో సాధన చేస్తున్నాం
ఈ శిక్ష వర్గ ద్వారా...,
మనం సమస్యలకు పరిష్కారాలను కనుగొనే వారిగా మారుతము
యోగాభ్యాసం అనేది పని లేని వారు చేసుకునేది కాదు పని చేస్తూ మరింత వికాసాన్ని పొందుటకై సాధన చేసేది ఇక్కడ ఆ వికాసాన్ని పొందుతాము
భౌద్ధిక మానసిక అంశాలపై పట్టు సాధిస్తారు
నిరంతర పరిశ్రమ సాధన చేయుట
నేను నాది అనే భావన నుండి మనము అనే భావన క రావడం
ప్రతి నిమిషం నేర్చుకోవాలి అవసరమైనప్పుడు ప్రతి నిమిషం నేర్పాలి.
ధ్యేయ సాధన కొరకు నిష్టతో కూడిన నిరంతర కార్య జీవనం కొనసాగించుట
ఇతరులు చూసి నిన్ను నవ్వి సంతోషించిన అప్పుడు నీవు ధన్యుడవు
సజ్జన శక్తిని జాగృతం చేసి వారికి మనం నేతృత్వం వహించాలి.
ఈ విధంగా సమర్థమైన కార్యకర్తగా మనం రూపొందు టకు సర్వస్వాన్ని సంఘానికి సమర్పించి విధంగా నిరంతరం మనం సంసిద్ధులై ఉండాలి.
శిక్షావర్గ సమారోప్
అందరూ నావారు అనే భావన ఉంటే సమాజంలో మార్పు వస్తుంది
యోగ్యులుగా మన యోగ్యతను పెంచుకుంటూ ఆనందంగా పని చేయాలి
చూసే కన్నులు వినే చెవులు స్పందించే హృదయం ఉండాలి కానీ ప్రతీద సాధ్యమే
ఉత్కృష్ట లక్ష్యం పెట్టుకుని పని చేస్తే మనం చేసే ప్రతి పని మనల్ని లక్ష్యం వైపు తీసుకుని వెళుతుంది
జీవితాంతం పనిచేయుటకు కావలసినవ
ధ్యేయనిష్ట£థ,,హ
ధ్యేయానుగుణ జీవనం
జేష్ట కార్యకర్తల సాంగత్యం
సంఘం అనేది అనేక కార్యకర్తల కృషి ఫలితంగా నేడు మనకు ఇలా కనిపిస్తుంది తప్ప ఏదో ఆకస్మికంగా జరిగింది కాదు
సంఘ కార్యాలయము వృద్ధికి సంఘ కార్యం ఏ తపస్సుగా భావించి ముందుకు వెళ్లాలి
సోమరితనాన్ని అలసత్వాన్ని జయించిన వారు కార్యసాధకుడు అవుతారు
సాధకుడు అనేవాడు శారీరక వాంఛలను జయించగల గాలి
సెక్స్ మనము కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడం గాను మన వ్యక్తిగత జీవితంలో సర్దుబాటు చేసుకోవాలి
సంఘ కార్యక్షేత్రం లో జరుగుతున్న అభివృద్ధిని చూసి సంతోషించి గలగాలి
సుఖసంతోషాలను దాటి మనం ఆనందాన్ని పొందగలగాలి ఇది ఎప్పుడు మనం పొందాలంటే సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం నిస్వార్థంగా క్రియాశీలకంగా ఉన్నప్పుడే సాధ్యం
సంఘ కార్యమే సమాజ ప్రగతికి మూలం అనే విశ్వాసాన్ని ప్రతి స్వయంసేవక్ కలిగి ఉండాలి
మనం చేసే పనినే దైవంగా భావిస్తే మనం దైవాన్ని దర్శించి గలుగుతాము సంత రవిదాస్
సమాజ రూపి పరమేశ్వర్ అను విశ్వాసాన్ని సంఘం ప్రగాఢంగా నమ్ముతుంది.
ఆలోచనాపరుడు గా యోధుడిగా చక్కని నిర్వహణ సామర్థ్యాలను కలిగి ఉన్నప్పుడు మనం ఎన్ని పనులైనా చేయగలుగుతాం అప్పుడు మనం కార్యం సుగమమవుతుంది. అప్పుడు కలిగేది ఆనందం
తనకు ఉన్న సమయాన్నంతా సంఘ కార్యాన్ని వెచ్చించి దేశం కోసం పని చేయడం గొప్ప విషయం
తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలిగిన నేర్పు మనకు ఉండాలి.
స్వయంసేవక అనే వ్యక్తికి సంఘ శాఖ నుండి శక్తి లభిస్తుంది
Think globally act locally
ప్రతికూలతలు ఉన్నప్పుడు సంఘం ఆగలేదు అనుకూలంగా ఉన్నప్పుడు సంఘం వేగంగా ముందుకు వెళ్లలేదు సంఘం యొక్క వ్యక్తి అనేది కార్యకర్త క్రియాశీలత పై ఆధారపడి ఉంటుంది
అనుకూలంగానే అంతటా ఉందని భావిస్తే మనలో నిర్లక్ష్యం పెరుగుతుంది. అదే మన పతనానికి కారణం అవుతుంది
సంఘ వ్యాప్తికి శాఖకు వెళ్లడమే సమాధానం పరిష్కారం
మాతృ శాఖ యొక్క గుణాత్మక తను పెంచడానికి
మనం కుటుంబ సంపర్కం చేయాలి. శాఖ ప్రతిష్టితమై విస్తృతంగా పని చేయాలి
శాఖ ప్రభావంతంగా నడిపితేనే శాఖలో సంస్కారాలు అలవడతాయి లేకపోతే ప్రభావం కోల్పోతుంది
నీటి కుండ బొగ్గు కణికలు
స్థాయి గల కార్యకర్తలు శాఖను మరవకుండా ఒకే సమయంలో అనేక పనులను సమన్వయం చేసుకుంటూ చేయగలగాలి
హరిదాసు అనేక పనులు ఒకేసారి చేయగలగడం
శిక్ష వర్క్ పూర్తయిన స్వయంసేవకులకు మండల స్థాయిలో బాధ్యతలు అప్పగించాలి వివిధ క్షేత్రాలకు గతి వీధులలో బృందంగా వారిని ఆయా విభాగాలకు అందించాలి
కార్యకర్తలు క్రియాశీల మై సమాజానికి నేతృత్వం నిర్వహించాలి లేకపోతే సమాజం మనల్ని ప్రశ్నిస్తుంది
సముద్రం నీరు బావిలో నీరు దప్పిక గల మనిషి
మనసులో సంకల్పం గట్టిగా అయితే ఆత్మవిశ్వాసంతో నిరంతరం శ్రమిస్తే అనుకున్న లక్ష్యం సులభంగా నెరవేరుతుంది
సంఘం పెరగడం తగ్గడం అనేది స్వయంసేవక్ పైనే ఆధారపడి ఉండును
మనిషి అద్దం
ఆకర్షణలు నుండి మనల్ని మనం రక్షించుకోవాలి లొంగి పోతే కార్యసాధకులం కాలేము
అట్లాంటా అనే యువతి గ్రీకు పురాణం
లక్ష్య సాధనకై మన రీతి నీతిని వదిలిపెట్టకుండా లక్ష్యాన్ని ఛేదించాలి
మనం చేయి పని వల్ల సంఘం యొక్క మౌలిక సిద్ధాంతం దెబ్బతీనకూడదు
జాగరణ శక్తిని జాగృతం చేసినప్పుడే దుర్జన శక్తిని ఆపగలిగుతాం
ఏ గొప్ప పని కూడా గొప్ప త్యాగం లేకుండా సాధించబడదు
-------------------------------------------------------------------
ద్వితీయ బౌద్దిక్ సమారోప్
సంస్కృతిక పునరుత్థారణ కొరకు సంఘస్థాపన.
ప్రశిక్షణ ఆధారంగా వ్యక్తులు శక్తిగా మలచబడతారు.
విభిన్నమైనటువంటి సామాజిక స్థితిగతులు, వాతావరణ పరిస్థితులు ఉన్న ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈరోజు వ్యక్తి నిర్మాణ కార్యం జరుగుతుంది.
మన పూర్వీకులు అందించిన విలువలు ఆధారంగా మనకు ప్రేరణ లభిస్తుంది.. ఆ ప్రేరణను మనం ఈ ప్రశిక్షణలో పొందుతాము.
దేశాన్ని పరమ వైభవ స్థితిలో ఉంచుటకు.., వివేకానంద గారు సూచించిన విషయాలు
- సంఘటన
- దేశ చారిత్రక అధ్యాయనం
-
100 సంవత్సరాల చరిత్ర తర్వాత భారతదేశ చరిత్రలో ఒక బలమైన హిందూ సంఘటన సంస్థగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ఈరోజు అన్ని ప్రాంతాలలో విస్తరించింది. అంతేకాకుండా 115 దేశాలలో ఈరోజు వివిధ కార్యక్రమాల మాధ్యమంగా
సంఘ పని జరుగుతుంది.
శ్రీరామ జన్మభూమి నిధి సమర్పణ అభియాన్ లో భాగంగా సంఘ్ దేశంలోని ఆరు లక్షల గ్రామాలలోని 12 కోట్ల కుటుంబాలను కలిసి 3300 కోట్ల నిధిని సేకరించి ఈరోజు అయోధ్యలో భవ్యమైన రామ్ మందిరాన్ని నిర్మించుకున్నాం.
జాగృతి సమాజమే దేశ ధర్మాలకు శ్రీరామరక్ష.
శతాబ్దిలో లక్ష గ్రామాలలో సంఘకార నిర్మాణం చేయడమే ప్రస్తుతం మన ముందున్న లక్ష్యం.
-
Comments
Post a Comment