19.బౌద్ధిక్ (ప్ర): సంఘస్థాపనకు పూర్వ రంగం | సంఘ వికాస చరిత్ర | సంఘం సాధించిన విజయాలు | సంఘరీతి - నీతి
సంఘస్థాపనకు పూర్వ రంగం
సంఘం యొక్క పని సమగ్ర హిందూ వికాసంతో పాటు హిందుత్వ విచారణతో విశ్వాన్ని జాగృతం చేయడం
సంఘ కార్యం నేడు సర్వవ్యాపి, సర్వ స్పర్శి.
సంఘ కార్య పద్ధతి అనునది అత్యంత విశేషమైనది. సంగం నిరాకారం కానీ శాఖ ఆకార స్వరూపం కలది మనలోని నిజమైన కల్పన ఉంటే శాఖ ద్వారా సమాజాన్ని అత్యంత ప్రభావితం చేయ వచ్చును.
డాక్టర్ జి దృష్టిలో భారతదేశం రత్నగర్భ నిలయం అలాంటి దేశం బానిసత్వం లోకి వెళ్ళడానికి గల కారణాల గురించి తీవ్రమైన ఆలోచన చేస్తే,
ఆత్మ విస్మృతి లోపం
అనుశాసనం లేకపోవడం
అసంఘటిత సమాజం
అనేక కారణాలు ప్రధానమైనవి అని తెలిపారు
హిందుత్వంలో ఏర్పడిన ఆత్మ విస్మృతి కారణంచే హిందువులు వారి శక్తి సామర్థ్యాలను మరిచిపోవడం జరిగింది.
సింహం మేక కథ
ఆత్మ కేంద్రిత చింతన చే హిందువులలో స్వార్థం పెరిగింది దీని కారణంగానే దాడి చేతిలో మనం బానిసలుగా మారాల్సి వచ్చింది
స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజలలో దేశభక్తి జాతీయ భావాలను వ్యాప్తి జరిగింది కానీ అది ఎలా ఉందంటే మన దేశం నుండి విదేశీయులను తరిమి కొట్టడమే ప్రధాన ధ్యేయంగా ఉండేది కానీ ఇది డాక్టర్ దృష్టిలో మాత్రం సకారాత్మక అనిపించలేదు ఎందుకంటే ఈ భావన దీర్ఘకాలికమైనది కాదు కాబట్టి
దేశ స్వాతంత్రం పై ఉద్యమ వేదిక గా నాడు డాక్టర్ జి కి కాంగ్రెస్ కనిపించింది కానీ అందులో మితవాదులు అతివాదులు గా వర్గాలు ఉండటం మరియు వారిలో నేనొక్కడినే అనే భావన ఉండటం డాక్టర్ దీని కొత్తగా ఆలోచింపజేసింది.
కార్యక్రమం ఘటన
డాక్టర్ జి జైల్లో ఉన్నప్పుడు భారతదేశం యొక్క 1000 సంవత్సరాల చరిత్రను అధ్యయనం చేసినప్పుడు దేశ పతనానికి మూడు ముఖ్యమైన కారణాలు చెప్పారు.
జాతీయత పట్ల భ్రమ ను కలిగి ఉండటం
ఏకత్వం లేకపోవడం
టర్కీ లో జరిగిన ఖిలాఫత్ ఉద్యమం గురించి మన దేశంలోని ముస్లింలు చేస్తున్న ఆందోళనలను సంతృప్తిపరచడానికి గాంధీజీ వారికి వత్తాసు పలకడం మరియు మహ్మద్ అలీ జిన్నా అలాంటిదే వ్యతిరేకులు ఈ దేశ సంస్కృతిని వ్యతిరేకించిన కాంగ్రెస్ వాదులు మాట్లాడకపోవడం డాక్టర్ జి ని ఆలోచింపజేస్తాయి.
డాక్టర్ జి ఈ స్థితిలో వ్యక్తుల్లో బ్రహ్మ క్షేత్ర తేజ నింపాలని అందుకు కొన్ని పరిష్కారాలు సూచించారు
హిందూ సమాజాన్ని జాగృత పరచడం
హిందుత్వం లోని లోపాలను సవరించడం
ఆపదలు ఎదుర్కొనే శక్తిని సమాజంలో నిర్మాణం చేయడం
వ్యక్తి నిర్మాణం ప్రక్రియ నిరంతరం సాధన జరగడం
ఈ విధంగా యోగ్యమైన వ్యక్తి ద్వారా కుటుంబం ఆ కుటుంబం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ జి సంఘ శాఖలను ప్రారంభించారు ఇలాంటి యోగ్యమైన వ్యక్తులు నగరాల్లో 3 శాతం గ్రామాలలో ఒక శాతం ఉండాలని తెలిపారు.
సంఘ్ ప్రారంభించి 100 సంవత్సరాల శతాబ్దికి చేరవుతున్న ఈ సందర్భంలో
సమాజంలో
ఉపేక్ష నుండి స్వీకారం వరకు జరిగిన సంఘ్ ప్రయాణం
హిందూ సమాజ సంఘటనకై పూజనీయ డాక్టర్ జి దూరదృష్టి
సమాజంలోని వివిధ రంగాలలో సంఘ వికాస్ యాత్ర
మనకు స్మరణకు వస్తాయి.
-------------------------------------------------------------------
సంఘ కార్యం రెండు స్వరూపాన్ని కలిగి ఉంటుంది
1. శ్రీ కృష్ణుడి బాల్య క్రీడలు
2. శ్రీకృష్ణుడి లయకారుడీగ క్షమత
పై రెండు విషయాలు సంఘ శాఖ కార్య పద్ధతి విషయంలో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నాయి.
సంఘస్థాన్లో స్వయంసేవకులు పాల్గొనే శారీరిక్, మానసిక కార్యక్రమాల ద్వారా వారి వ్యక్తిత్వ నిర్మాణం చేసే దిశగా , మరియు సమాజంలోని అన్ని రంగాలలో సంఘ ప్రబోధం కలిగిన వ్యక్తులతో నింపడం ఈ రెండు విషయాలను పై రెండు స్వరూపాలు మార్గదర్శనం చేస్తున్నాయి..
ఈ రకంగా విశాల హిందూ సమాజ సంఘటనను డాక్టర్జీ ముందే ఊహించి ఒక నినాదాన్ని విధానంగా మార్చారు..
-------------------------------------------------------------------వీర సావర్కర్, స్వామి శ్రద్ధానంద వంటి అతి గొప్ప హిందువులు కూడా హిందుత్వానికి అనేక సేవలు చేశారు.. కానీ కొన్ని సందర్భాల్లో వారు కూడా హిందూ ఐక్యత అనేది సాధ్యమయ్యే పనేనా అని వారి మనసులో తలచి నిరాశ చెందడం జరిగింది..
కానీ సంఘ్ మాత్రం ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటన్నింటికీ ఎదురొడ్డి నిలిచి హిందూ ఐక్యతను సాధించగలమని నిరూపించినది..
వ్యక్తి నిర్మాణం గురించి స్వామి వివేకానంద ఇలా అన్నారు..
నాకు వంద మంది యువకులు ఇవ్వండి వారిని సౌశీల్యంగా తీర్చిదిద్ది జాతీయ నిర్మిస్తాను.
అలాగే సోదరి నివేదిత జాతీయవాద ఆలోచనలు గల వారితో దేశం అవుతుంది అని తెలిపారు..
కానీ డాక్టర్జీ వీరు గుర్తించిన విధానాలను సమాజంలో ఆచరణీయంగా మార్చడం జరిగింది.
-------------------------------------------------------------------
డాక్టర్ జి పలికారు సంఘ్ సమాజం కోసం ప్రత్యేకంగా ఏ పని చేయదు కానీ సంఘ్ ద్వారా నిర్మితమైన స్వయంసేవకులు మాత్రం సమాజ హితం కోసం పనిచేస్తారు... సంఘం పని మాత్రం కేవలం వ్యక్తి నిర్మాణమే అని శాఖ ఆవశ్యకతను తెలిపారు...
-------------------------------------------------------------------
సంఘ వికాస క్రమం
మూడు ప్రధాన దశలు, కాలఖండాలను దాటి నాల్గవ కాలఖండంలో ఉంది. 1925/40, 1941/50; 1951/77; 1977 2025 వరకు
1925 - 1940
1.1925 సెప్టెంబర్ 27 విజయదశమి రోజున పూజనీయ డాక్టర్జీ ద్వారా ఆయన ఇంట్లో 15-20మందితో కలిసి ప్రారంభమైంది. ఈ బైఠక్లో శ్రీ భావూజీ కావ్ రే, శ్రీ అన్నాసోహనీ, విశ్వనాథ కేల్కర్, బాలాజీ హుద్దార్, బాపూరావు భేడి మొదలగు వారున్నారు. ఈ బైఠక్లోనే డాక్టర్ జీ 'మన మందరమూ కలిసి సంఘాన్ని ప్రారంభించుకుంటున్నాము' అన్నారు. వీరందరితో కలిసి ఆలోచించి కొత్త సంస్థను, కొత్త కార్యపద్ధతిని ప్రారంభించారు. ఆ రోజున సంఘానికి పేరు, రాజ్యాంగం (నియమావళి) పదాధికారులు, కార్యాలయం, నామఫలకం, వార్తాపత్రికలలో ప్రచారం, సభ్యత్వ రుసుము, చందాలాంటి విషయాలపై ఎలాంటి చర్చా జరగలేదు. అందరూ నాగపూర్లోని 'మహారాష్ట్ర వ్యాయామశాల'లోను, ఆదివారం రోజున అందరూ 'ఇతవారీ దర్వాజా పాఠశాల'లోను కలిసేవారు. గురువారం రోజున 'రాజకీయవర్గ' (ఆ తర్వాత రోజుల్లో 'బౌద్ధికవర్గ'గా పిలవడం జరుగుతోంది.) జరిగేది. ఆరునెలల తర్వాతగానీ సంఘానికి నామకరణం జరగలేదు.
2. వార్ధానుండి అప్పాజీజోషీ నాగపూర్ వచ్చినపుడు ఆయనకు డాక్టర్జీ తన ఇంట్లో (నాగపూర్) నడిచే సంఘాన్ని చూపించారు. నాగపూర్ కీ బయట వార్ధాలో మొదటిశాఖ అప్పాజీజోషీయే డాక్టర్ సముఖంలో ప్రారంభించారు.
3. 1926 ఏప్రిల్ 17న సంఘానికి 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్' అని పేరు పెట్టబడింది. రామ్ టెక్లో జరిగే జాతరలో యాత్రీకులకు సహకరించడం కోసం మొదటిసారిగా స్వయంసేవకులు 'రాష్ట్రీయ స్వయంసవక్ సంఘ్' అనే పేరుతో పాల్గొన్నారు.
4. 1926 మే 28 నుండి 'మోహితేవాడ'లో 'దైనందిన శాఖ' ప్రారంభమైంది. సంఖ్య పెరిగిన కారణంగా 'కుశ' మొదలగు గణ (పథక్)లు రూపొందించబడ్డాయి.
5. 1926 డిసెంబర్ 19 నాటికి మాననీయ సంఘచాలకులందరూ కలిసి పూజనీయ డాక్టర్జీని సంఘానికి ప్రముఖ్ (సరసంఘచాలక్)గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
6. 1927లో మొదటిసారిగా ' ' (Officer's Training Camp) పేరుతో సంఘశిక్షావర్గ ప్రారంభమైంది. ఇందులో 17 మంది పాల్గొన్నారు. ప్రారంభంలో వ్యాయామశాలకు వెళ్తుండిన కారణంగా దండ, ఖడ్గ, శూల మొదలగువాటిని ప్రయోగించడం- నేర్పడం జరిగేది. సైన్యంలోని అనుశాసనం మొదలగువాటిని చూసి గణవేష్, సమత, సంచలన్ ప్రారంభమైంది. ఇలా శిక్షణ పొందిన స్వయంసేవకుల ద్వారానే సంస్థ విస్తరించింది.
7. గురుపౌర్ణమి రోజున (1928)లో మొట్టమొదటిసారిగా పరమ పవిత్ర భగవాధ్వజాన్ని గురువుగా స్వీకరించి, పూజించడం జరిగింది. శ్రీ గురుదక్షిణ కార్యక్రమం జరిగింది. 84 రూపాయల సమర్పణ జరిగింది. సంవత్సరం మొదటిసారిగా 'ప్రతిజ్ఞ' కార్యక్రమం కూడా జరిగింది. 99 మంది స్వయంసేవకులు ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. సంవత్సరం చివరి వరకు నాగపూర్ లో 18 శాఖలు ప్రారంభించబడినాయి.
8. 1928లో మొదటి 'చలికాలపు శిబిరం' ఏర్పాటుచేయబడింది.ఇందులో 27 మంది పాల్గొన్నారు. అందులో 'ఝండా హిందూరాష్ట్ర...' అనే సంచలన్ గీత్ పాడబడింది.
అప్పుడు ఘోష్ అంటూ ఏదీ లేదు ఈ దృశ్యాన్ని చూసిన హిందువులలో స్ఫూర్తి కలిగింది. ఆ తర్వాత పత్రికల్లో నాగపూర్ లోని హిందువులలో చైతన్యం కలిగిందని ప్రముఖంగా వార్తలు ప్రచురించాయి.
1928 సంవత్సరంలోనే పరమ పూజనీయ డాక్టర్ జి కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి కలకత్తాలో సమావేశం జరిగింది.
9. 1929 నవంబర్ 19న సంఘస్థాన్లో ప.పూ. డాక్టర్జీకి మొదటిసారిగా సర్సంఘచాలక్ ప్రణామ్ చేయబడింది. ఆ రోజు నుండే అనౌపచారికంగా బాబాసాహెబ్ ఆమ్టే, దాదారావు పరమార్థ్, రాంభావూజామ్డే, గోపాలరావు యరకుంటవార్ ప్రభృతులు ప్రచారకులుగా వచ్చారు.
10. 1930 జులై 21 నుండి ప్రారంభమైన 'అటవీ సత్యాగ్రహం'లో పాల్గొనడానికి నిశ్చ యించుకున్న ప.పూ. డాక్టర్జీ, సరసంఘచాలక్ గా డా॥ పరాంజపేగారిని నియమించారు. కారాగారంలో ఉంటూ కూడా ఆయన అనేకమంది కొత్త కార్యకర్తలను తయారు చేశారు.
11. 1934లో జరిగిన వార్థా శిబిరానికి మహాత్మాగాంధీజీ వచ్చారు. అక్కడ స్వయంసేవకుల మధ్య సమరసతాభావం (అంటరానితనం లేకపోవడం) చూసి ఎంతో ప్రభావితులయ్యారు.
12. 1934 వరకు 'సంఘశిక్షావర్గ' కేవలం నాగపూర్లో మాత్రమే జరుగుతూ ఉండేది. 1934 నుండి పుణెలో ప్రథమ మరియు ద్వితీయవర్ష వర్గలు ప్రారంభమయ్యాయి. 1938లో లాహోర్ (ఇప్పటి పాకిస్థాన్) లో కూడా ప్రథమ మరియు ద్వితీయ వర్ష వర్గలు నిర్వహించడం జరిగింది.
13. 1939లో హైదరాబాదుకు చెందిన నిజాంయొక్క హిందూ వ్యతిరేక ధోరణిని నిరసిస్తూ జరిగిన సత్యాగ్రహంలో స్వయంసేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే సంవత్సరంలో 'సిందీ'లో మొదటి 'చింతన్ బైఠక్' జరిగింది. బైఠక్లో ప్రస్తుతమున్న సంస్కృత ఆజ్ఞలు మరియు ప్రార్ధన నిర్ణయించబడ్డాయి. 1940లో జరిగిన సంఘశిక్షావర్గలో సిందీ బైరకుల నిర్ణయాలు అమలుచేయడం జరిగింది. అప్పటి నుండే నేడున్న సంస్కృత ప్రార్ధన కూడా ప్రారంభమైంది.
14. 1940 జూన్ 20న ప.పూ. డాక్టర్ తన మరణానికి ఒకరోజు ముందు ప.పూ. గురూజీని ద్వితీయ సరసంఘచాలక్గా నియమించారు.
-------------------------------------------------------------------
ఆ) 1941 నుండి 1950వరకు: ఇది రెండవ దశ.
1. 1942లో ప్రభుత్వాదేశం ద్వారా సైనిక కార్యక్రమాలు మరియు వేషధారణపై నిషేధం విధించబడిన కారణంగా పాఠ్యక్రమంలో కొత్త కొత్త ఆటలను పొందుపరచడం జరిగింది. అదే సమయంలో గణవేష్లో కూడా మార్పులు (తెల్లబూట్లు మరియు నీలి మేజోళ్ళు) జరిగాయి. 1945లో మళ్లీ 'పొంగ్లీపట్టి' మరియు 'లాంగ బూట్లు' ప్రవేశపెట్టబడ్డాయి.
2 1947లో దేశవిభజన ఫలితంగా శరణార్థులైన బంధువుల సహాయార్ధం పంజాబులో 'పంజాబ్ రిలీఫ్ కమిటీ' మరియు అస్సాం, బెంగాల్ లో 'బాస్తుహార సహాయతా సమితి'లను ఏర్పాటుచేయడం జరిగింది.
3. సర్దార్ పటేల్ కోరికమేరకు 1947 అక్టోబర్ 17న ప.పూ. గురూజీ కాశ్మీర్ మహారాజైన హరిసింగ్ ను కలవడానికి శ్రీనగర్ వెళ్ళారు. ఫలితంగా మహారాజా హరిసింగ్ భారతదేశంలో కాశ్మీర్ ను విలీనం చేయడానికి సమ్మతించాడు.
4. 1948 ఫిబ్రవరి 4న సంఘంమీద మొదటి నిషేధం విధించబడింది. దాంతో ప.పూ. గురూజీ ద్వారా సంఘ కార్యక్రమాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించబడింది. గురూజీ కారావాసం.
5. 1948 డిసెంబర్ 9న సంఘంపై విధించబడిన నిషేధాన్ని తొలగించాలంటూ మాననీయ సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ దాణీ ద్వారా సత్యాగ్రహం ప్రారంభించబడింది. 1949 ఫిబ్రవరి 21న సత్యాగ్రహం నిలిపివేయబడింది. 1949 జులై 11న ఎలాంటి షరతులు లేకుండా సంఘంపైనున్న నిషేధాన్ని తొలగించారు.
6. గాంధీజీ హత్యను విచారించడానికి ప్రభుత్వం ద్వారా ఏర్పాటుచేయబడిన ప్రత్యేక న్యాయస్థానపు న్యాయమూర్తి ఆత్మచరణ్ ద్వారా 1948 మే 27 నుండి విచారణ ప్రారంభమై 1949 జనవరి 10న నిర్ణయం(తీర్పు) వినిపిస్తూ ఆయన, గాంధీజీ హత్యతో సంఘానికి ఎలాంటి సంబంధమూ లేదు అని ప్రకటించారు. ఇదేవిధంగా పంజాబు హైకోర్టు కూడా 1949 మే 2న విచారణ ప్రారంభించి, జి.డి.కోస్లా నాయకత్వంలోని త్రిసదస్యపీఠం కూడా ఈ విషయంలో సంఘం నిర్దోషి అని ప్రకటించింది. 1969లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి టి.ఎల్.కపూర్ ద్వారా విచారణ జరిపిన కపూర్ కమీషన్ కూడా కూడా ఇదేవిధమైన తీర్పును ఇచ్చారు.
7. నిషేధం తొలగించడంతోబాటు సంఘ రాజ్యాంగం ఆఖరి నియమావళి అస్తిత్వంలోకి వచ్చింది. ప.పూ. గురూజీ ప్రేరణతో సంఘకార్యాన్ని సర్వవ్యాప్తి మరియు సర్వస్పర్శిగా చేయడానికి స్వయంసేవకుల ద్వారా సమాజ జీవనంలోని వివిధరంగాలలో వివిధ సంస్థల పని ప్రారంభమైంది. వివిధ క్షేత్రాల ప్రారంభం. 1949 అ.భా. విద్యార్ధిపరిషత్, 1952లో భారతీయ జనసంఘ మరియు విద్యాభారతి వంటి సంస్థల ప్రారంభం.
8 1950 ఆగష్టు 15న అస్సాంలో భయంకర భూకంపం మరియు బ్రహ్మపుత్రా నదికి భయంకరమైన వరదలు వచ్చాయి. పీడితుల సహాయార్ధం 'భూకంప పీడిత సహాయతా సమితి'ని ఏర్పాటుచేశారు.
ఇ) 1951 నుండి 1977వరకు
1 1951లో బీహార్లో భయంకరమైన కరువు వచ్చింది. పీడితుల కోసం 'అకాల గ్రస్త సహాయతా సమితి' (కరువు పీడిత సహాయతా సమితి)ని ఏర్పాటుచేశారు.
2. 1952లో గోహత్యా నిషేధంకోసం గొప్ప ఉద్యమం ప్రారంభమైంది. మన రాజ్యాంగంలో 48 వ అధికరణ ప్రకారం గో సంరక్షణ చట్టం పొందుపరచబడి ఉంది కానీ మెజార్టీ రాష్ట్రాలు అమలు చేయకపోవడంతో 1952 సంవత్సరంలో నేతృత్వంలో స్వయం సేవకుల ద్వారా సంతకాల సేకరణ చేపట్టి కఠిన చట్టాన్ని అమలు పరిచేలా ఉద్యమం నిర్వహించడం జరిగింది.గోహత్యను నిషేధించాలని ఒక నెలలో దేశమంతటా సుమారు 1.75 కోట్ల సంతకాలను సేకరించి అప్పటి రాష్ట్రపతి దా॥రాజేంద్రప్రసాదుకు 1953లో అందజేయడం జరిగింది.
3.1953 ఆగష్టులో నాగపూర్లో శ్రీ గురూజీ 'ఒకవేళ కాశ్మీరు సమస్య విషయంలో ఏదైనా ప్రజాభిప్రాయాన్ని సంగ్రహించదలిస్తే. అది దేశమంతటా జరగాలి తప్ప కేవలం కాశ్మీరులో కాదు' అన్నారు.
4.1954 ఆగష్టు 2న పుణె మాననీయ సంఘచాలక్ శ్రీ వినాయకరావు ఆష్లే నాయకత్వంలో వందమంది స్వయంసేవకులు దాద్రా నాగర్హౌవేలిని పోర్చుగీసువారి ఆధిపత్యం నుండి విముక్తం చేశారు.
5.1954లో సిందీలో రెండవ చింతన్ బైఠక్ జరిగింది.
6.1960లో (Chekup year) ఇండోర్లో విభాగ్ ప్రచారకులకు అఖిలభారతీయ చైరక్ జరిగింది. అందులో విభాగ్ మరియు ఆపై మాననీయ సంఘచాలకులు కూడా వచ్చారు.
7. 1962లో ప.పూ.డాక్టర్జీ నూతన సమాధికి స్మృతిమందిరానికి ఉద్ఘాటన జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రచారకులందరికీ రాత్రి బస వ్యవస్థ నాగపూర్లోని స్వయంసేవకులు ఇళ్ళలో జరిగింది.
8.1963లో 'స్వామి వివేకానంద శతజయంతి'ని దేశమంతటా నిర్వహించడం జరిగింది.అప్పటి తమిళనాడు ప్రాంత ప్రచారక్ దత్తాజీ డిడోల్కర్ అభ్యర్ధన మీద మాననీయ ఏకనాథ్ రానడేగారిని సర్కార్యవాహ్ బాధ్యత నుండి తప్పించి, కన్యాకుమారిలో 'వివేకానంద శిలాస్మారకం' నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. 1955-1968లో ఈ
శిలాస్మారకం కొరకు ధనసేకరణ జరిగింది.
9. 1971లో 'బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం' సమయంలో పౌరరక్షణ మరియు సహాయంలో స్వయంసేవకులు ప్రముఖ పాత్ర నిర్వహించారు.
10. 1972లో ఠాణెలో అఖిలభారతీయ చింతన్బైఠక్. ఈ సంవత్సరమే సంఘకార్యవిస్తరణ కొరకు మకరసంక్రాంతి పండుగరోజున మండలస్థాయిలో సమాజోత్సవాలు నిర్వహించడం జరిగింది.
11. 1973 జూన్ 5న ప. పూ. గురూజీ మరణం. ఆయన తన మరణానికి ముందే ఏప్రిల్ నెలలో మూడు ఉత్తరాలు వ్రాసి ఉంచారు. ఆ ఉత్తరాల ప్రకారం మాననీయ బాలాసాహెబ్ దేవరస్ ను తృతీయ సరసంఘచాలక్గా నియమించడం జరిగింది.
12. 1973 జూన్ 6న మాననీయ బాలాసాహెబ్ దేవరస్ సంఘానికి తృతీయ సర్ సంఘచాలక్ అయ్యారు,
13. 1975 జులై 4న సంఘంపై రెండవ నిషేధం.
14. నవంబర్ 1975లో 'లోకసంఘర సమితి' ఆహ్వానం మేరకు అత్యవసరపరిస్థితిక వ్యతిరేకంగా సత్యాగ్రహం.
15. 1977 మార్చి 22న సంఘంపై రెండవ నిషేధం ఎత్తివేయబడింది.
ఈ) 1978 నుండి నేటివరకు
1. 1977 తర్వాత జనజాగరణ కోసం వేర్వేరు కార్యక్రమాల యోజన,
2. 1979 విజయదశమి నుండి జనసంపర్క అభియాన్.
3. 1985లో సంఘానికి 60 సం||లు నిండిన (షష్టిపూర్తి) సందర్భంగా విశేష జనజాగరణ అభియాన్.
4. 1988-89లో 'ప.పూ. డాక్టర్ హెడ్గేవార్ శతజయంతి'ని పెద్ద ఎత్తున యోజన చేయడం. నాగపూర్లో మాజీ మరియు ప్రస్తుత ప్రచారకులకు శిబిరం; సేవా కార్య క్రమాలను విస్తరింపజేయాలనే సంకల్పంతో సేవాభారతి స్థాపన, సేవానిధి సేకరణ
5. దేశమంతటా ప్రబలమైన హిందూ జాగరణ మరియు సేవా కార్యక్రమాల కోసం వాతావరణం మరియు ట్రస్టుల ఏర్పాటు.
6. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బానిసత్వ కళంకం (శ్రీరామజన్మభూమిపై బాబరీ కట్టడం) తొలగించిన తర్వాత కోపించిన ప్రభుత్వం సంఘంపై మూడవసారి నిషేధం విధించింది డిసెంబర్ 10న. న్యాయస్థానపు తీర్పుద్వారా జూన్ 4న నిషేధం తొలగించింది. దేశమంతటా 'హిందూచేతనా దివస్'ను సంకల్పించడం జరిగింది. ఇలా ఇది సంఘంపై మూడవ నిషేధం.
7.1994 మార్చి 10న మాననీయ బాలాసాహెబ్ దేవరస్ గారు ప్రొఫెసర్ రాజేంద్ర సింప్ట్గారికి సరసంఘచాలక్ బాధ్యతను అప్పగించారు. రాజేంద్రసింహ గారు నాల్గవ సరసంఘచాలక్ అయ్యారు. వారిని అంతా 'రజ్ఞుభయ్యా' అని ఆత్మీయంగా పిలుస్తారు.
8. మాననీయ రజ్జాభయ్యా, మాననీయ కు.సీ. సుదర్శన్గారికి సరసంఘచాలక్ బాధ్యతఅప్పగించారు. ఆయన అయిదవ సరసంఘచాలక్ అయ్యారు.
9. 2000 సంవత్సరం నాటికి సంఘానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 'రాష్ట్ర జాగరణ అభియాన్'లో భాగంగా విస్తృతంగా జనసంపర్కం చేయడం జరిగింది. దాదాపు 4 లక్షల 25వేల గ్రామాలలో జనసంపర్కం జరిగింది.
10. 2006లో శ్రీ గురూజీ శతజయంతి సంవత్సరం'లో దేశమంతటా విశాల హిందూ సమ్మేళనాలు, సామాజిక సద్భావనా బైఠకులతో సామాజిక సమరసతా సంవత్సరం రూపంలో అనేక రకాల కార్యక్రమాల యోజన. విదేశాలలో కార్యవిస్తరణ. సంఘసిద్ధాంతాన్ని ప్రపంచ మంతటా ప్రచారం చేయడం.
11. 2009 మార్చి 21న మాననీయ సుదర్శన్ మాననీయ మోహన్రావు భాగవత్గారికి ఆరవ సర్ సంఘచాలక్ బాధ్యతను అప్పగించారు.
12. 2010లో కార్యకారీమండల్ ద్వారా అనేక జాతీయ ప్రాముఖ్యతఉన్న విషయాలను తీసుకుని సమాజ జాగరణ కోసం వేర్వేరు స్థాయిలలో రెండు శ్రేణుల (సంఘటనా శ్రేణి మరియు జాగరణ శ్రేణి) యోజన చేయడం జరిగింది.
13. 2010లో కార్యకారీమండల్లో సంఘ గణవేష్లో చర్మంతో తయారైన పట్టా (బెల్టు) ను మార్చడంపై ఆలోచన చేయడం జరిగింది. 2011మార్చిలో అఖిల భారతీయ ప్రతినిధి సభలో పట్టాలో మార్పుచేయడం జరిగింది.
ఈ విధంగా కార్యపద్ధతి వికసిస్తూ పోతున్నది. కార్యక్రమాలు మారాయి, కార్యపద్ధతిలోనూ అవసరాన్నిబట్టి సహజ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఒక గంటసేపు జరిగే శాఖ(ఏకత్రీకరణ) నియమితంగా జరుగుతోంది. మౌళికమైన కార్యం కారణంగా దీంట్లో ఎలాంటి మార్పులేదు. సంఘకార్యపద్ధతి విశేషత ఇదే.
సంఘ రీతి - నీతి
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 సంవత్సరాల ప్రయాణంలో అనేక కష్టాలను ఎదుర్కొని నిత్యనూతనంగా పురాతనంగా ముందుకు సాగుతుంది
వివిధ సంస్థలు వివిధ సిద్ధాంతాలతో ప్రారంభమై క్రమేపీ తన మూలాలను కొనసాగించకుండా కేవలం సంస్థలు గాని మరి ముందుకు సాగుతున్నాయి
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాత్రం గుణ వికాసం చెందే ఏ అంశాల నైనా పునికి పుచ్చుకుని తన ప్రయాణాన్ని సాగిస్తూ వ్యక్తి నిర్మాణాన్ని భావిస్తూ పరమ వైభవ సాధనకై ముందుకు సాగుతుంది
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ పెద్దలు సంఘ వికాసం కై కొన్ని సంఘ రీతులు పద్ధతులు ఆచరిస్తూ వచ్చారు.
వ్యక్తినిష్ఠ - ధ్యేయనిష్ట
వ్యక్తులు రావచ్చు పోవచ్చు కానీ తత్వమే మూలం అన్న భావాన్ని సంఘం విశ్వసిస్తుంది
సంఘపనికి ఆధారం శుద్ధ సాత్విక ప్రేమ
డాక్టర్ జి బాలుని పరామర్శించడం
సమయపాలన
లుధియానా నుండి జలంధర్ కు గురూజీ ప్రయాణం
జీలం నది దాటుట
దత్తోపంత్ ఠెంగ్డేజీ ఇందూర్ పర్యటన
ఎంత కష్టాన్నయినా ఎదురించి పని పూర్తి చేయడం
విజయాన్ని అందరికీ ఆపాదించడం
వ్యక్తిగత లోపాలను ఇతరుల వద్ద ప్రస్తావించకుండా వారిలో మార్పును తీసుకురావడం
మన ఆచరణ ద్వారా ఇతరుల్లో మార్పులు తీసుకురావడం
నియమ ఆజ్ఞా పాలన
శబ్ద సంస్కారం సహనం సంయమనం పాటించడం
Comments
Post a Comment