15.బౌద్ధిక్ (ప్ర): శ్రీ రామాయణం | శ్రీ రామజన్మభూమి
*తోబుట్టువుల విలువ చెప్పిన శ్రీరాముడు*
రామ నామమరమ్యమైనది...,*
*అది మరీ మరీ వింటే మధుర మైనది.....*
ఈనాడు మానవసంబంధాలన్నీ ఆర్ధిక సంబcధాలుగా మారిపోతున్నాయి.
అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు చిన్న చిన్న కారణాలతో, అహంకారంతో, మనస్పర్ధలతో విడిపోతున్నారు.
ఇటువంటి సమయంలో రామాయణం మొత్తం మానవాళికి ఒక ఆశాజ్యోతి.
రాముడు తోబుట్టువుల గొప్పతనం గురించి రామాయణంలో చెప్పిన మాట అందరూ గుర్తించుకోదగినది.
ఇంద్రజిత్తు (మేఘనాధుడు) తో యుద్ధం చేసిన లక్ష్మణుడు అతడు చేసిన అస్త్రప్రయోగంతో మూర్ఛపోతాడు.
రక్తపుమడుగులో ఉన్న తమ్ముడిని చూసిన రాముడికి ఎక్కడలేని దుఃఖం వచ్చి సుశేషునితో ఈ విధంగా అంటాడు.
నా ప్రాణానికి ప్రాణమైన లక్ష్మణుని ఈ స్థితిలో చూసి నా శక్తి క్షీణించిపోతోంది. ఒకవేళ లక్ష్మణుడు మరణిస్తే, నా జీవితానికి, సంతోషానికి అర్దమేముంది? నా వీరత్వం సిగ్గుపడుతోంది. చేతి నుంచి ధనుస్సు పడిపోయినట్టుంది. బాణాలు జారిపోతున్నాయి. కన్నీరుతో కళ్ళు నిండి దృష్టి కూడా కనిపించడంలేదు. నేను మరణించాలనుకుంటున్నాను అని రాముడు ఎంతో ఏడుస్తాడు.
ఓ శూరుడా! లక్ష్మణా! విజయం కూడా నన్ను తృప్తి పరచలేదు. దృష్టి కోల్పోయిన వ్యక్తికి జాబిల్లి (చంద్రుడు) ఏ విధంగా సంతోషాన్ని ఇవ్వగలడు. ఇప్పుడు నేను పోరాడి సాధించేది ఏంటి?
*లక్ష్మణుడు మరణించి ఉంటే, నేను యుద్ధం చేసి లాభం ఏంటి?*
నువ్వు నన్ను ఏ విధంగా వనవాసానికి ముందు అనుసరించావో, అలాగే ఇప్పుడు నేను నిన్ను మృత్యువులో అనుసరిస్తాను.
యముని వద్దకు నీ వెంట వస్తాను.
*దేశే దేశే కళత్రాణి దేశే దేశే* *చ బాంధవాః |*
*తం తు దేశం న పశ్యామి* *యత్ర భ్రాతః* *సహోదరః* ||
భార్యలు ఏ దేశంలోనైన దొరుకుతారు, బంధువులు కూడా అంతే. కానీ ఏ దేశానికి వెళ్ళిన తోబుట్టువులు మాత్రం దొరకరు. వారిని కోల్పోకూడదు అంటాడు శ్రీరాముడు.
నేను ఇక్కడే, ఈ యుద్ధభూమిలోనే మరణిస్తాను, తిరిగి అయోధ్యకు వెళ్ళను, నాకు నీ కంటే ఎవరు ఎక్కువ కాదు అంటూ లక్ష్మణుని చూస్తూ రాముడు రోదిస్తాడు.
ఇది వాల్మీకి రామాయణం యుద్ధకాండ 101 సర్గలో ఉంది.
తోడబుట్టిన వారి విలువ ఎంత చక్కగా చెప్పాడు శ్రీ రాముడు.
అహంకారాలకు పోయి వారిని దూరం చేసుకుంటారా?
శ్రీ రాముడు మనకు ఆదర్శం కావాలి. బంధువులు, బంధుత్వాలు ఎన్నైనా కలుపుకోవచ్చు. కానీ తోబుట్టువులను తీసుకురాలేరు. వారితో కూడా కాలం గడపాలి, ప్రేమను పంచుకోవాలి.
రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులులాగా అప్యాయతతో జీవించాలి.
🌸🌸🌸🌸🌸🌸🌸
*ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.*
🚩🚩🚩🚩🚩🚩🕉
శ్రీ రామాయణం అరణ్యకాండ లో ..
రామలక్ష్మణులు బయలుదేరి మతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు మతంగ మహర్షి యొక్క శిష్యురాలైన శబరి రామలక్ష్మణులను చూసి గబగబా బయటకి వచ్చి వారి పాదాలని గట్టిగా పట్టుకుంది. వారికి అర్ఘ్యము, పాద్యము మొదలైనటువంటి అతిథికి ఇవ్వవలసిన సమస్త సంభారములు చేకూర్చింది. అవన్నీ స్వీకరించాక, రాముడు శబరితో " నువ్వు నియమంగా జీవితం గడపగలుగుతున్నావా, నియమముతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నావా, తపస్సు చెయ్యగలుగుతున్నావా, నీ గురువుల యొక్క అనుగ్రహాన్ని నిలబెట్టుకుంటున్నావా " అని అడిగాడు.
అప్పుడా శబరి " రామ! ఏనాడు నీ దర్శనం చేశానో, ఆనాడే నా తపస్సు సిద్ధించింది. నేను కూడా మా గురువుగారైన మతంగ మహర్షి శిష్యులతో పాటు తపస్సు చేశాను. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉండగా మా గురువులందరూ దివ్యమైన విమానములు ఎక్కి ఉత్తమలోకాలకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతూ నాతో ఒక మాట అన్నారు ' మహానుభావుడైన రామచంద్రమూర్తి ఈ ఆశ్రమం వైపుకి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఆతిధ్యం ఇచ్చాక నువ్వు కూడా మేము ఉన్నటువంటి ప్రదేశానికి రమ్మని ' చెప్పి వెళ్ళారు.
అందుకని నీకోసం నేను ఇక్కడే ఉండిపోయాను " అని చెప్పింది.
అప్పుడా రాముడు శబరితో " నీ యొక్క ప్రభావాన్ని నేను చూడాలి అనుకుంటున్నాను శబరి " అన్నాడు.
అప్పుడు శబరి రాముడిని ఆ ఆశ్రమం లోపలికి తీసుకువెళ్ళి ఒక అగ్నివేదిని చూపించి " రామ! మా గురువుగారు ఈ అగ్నివేది దెగ్గరే అగ్నిహోత్రం చేసేవారు. వృద్ధులైన మా గురువులు వొణికిపోతున్న చేతులతో పువ్వులు తీసి ఆ వేది మీద పెట్టేవారు.
రామ! ఒక్కసారి ఆ వేది మీద చూడు, ఆ పువ్వులు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ అగ్నికార్యం చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆ అగ్నివేదిలో నుంచి వచ్చే కాంతి దశదిశలని ప్రకాశింప చేస్తుంది. మా గురువులు చాలా వృద్ధులు అవ్వడం వలన, నదీ తీరానికి వెళ్ళి స్నానం చెయ్యలేకపోయేవారు. అందుకని వారు అక్కడే కూర్చొని ఒక్క నమస్కారం చేసేవారు. వారు అలా నమస్కారం చెయ్యగానే ఏడు సముద్రముల యొక్క పాయలు ఇటుగా ప్రవహించాయి, అప్పుడు మా గురువులు అందులో స్నానం చేశారు. మా గురువులు స్నానం చేసి తమ వస్త్రములను పిండి, ఇక్కడే తీగల మీద ఆరేసేవారు.
నువ్వు ఆ వస్త్రములను ముట్టుకొని చూడు, అవి ఇప్పటికీ అలానే తడిగా ఉంటాయి. వారు ముట్టుకున్న ప్రతి వస్తువుని వారు ఏ స్థితిలో ముట్టుకున్నారో, అవి ఆ స్థితిలోనే ఉండిపోయాయి తప్ప ప్రకృతి యొక్క పరిణామగతంగా ఆ వస్తువులు మారలేదు. వారు అంతగా ఆత్మగతులై ఆత్మస్వరూపంగా ఉండిపోయారు.
రామ! నీకోసమని చెప్పి నేను ఈ అరణ్యం నుండి చాలా సంభారాలని సేకరించాను, నువ్వు వాటిని స్వీకరించు" అని చెప్పి, ఆ సంభారములని రాముడికి ఇచ్చి " మా గురువులు నీకు ఆతిధ్యం ఇవ్వమన్నారు, నేను ఇచ్చేశాను. అందుకని నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నాను " అని చెప్పి, సంకల్పమాత్రం చేత అగ్నిని రగిల్చి, అందులో చీర క్రిష్ణాంబరాలతో సహా దూకి తన శరీరాన్ని వదిలేసింది.
అప్పుడా అగ్నిలోనుంచి దివ్యమైన అంబరములతో, దివ్యమైన వస్త్రములతో ఆమె శరీరం బయటకి వచ్చి, తన గురువులు ఉన్న లోకాలకి వెళ్ళిపోయింది.
ఆహా, ఏమి ఋషులు, ఏమి తపస్సు అని రామలక్ష్మణులు పొంగిపోయి, అక్కడినుండి బయలుదేరి ఋష్యమూక పర్వతం వైపు బయలుదేరారు.
శ్రీ రామ జయ రామ జయజయ రామ!!
*శ్రీరామనవమి శుభాకాంక్షలతో.....*🚩🚩🚩
*అంతా రామమయం...*
*శ్రీ రామ రామ రామేతి*
*రమే రామే మనోరమే |*
*సహస్ర నామతత్తుల్యం*
*రామనామ వరాననే ||*
*శ్రీరాముడు సర్వవ్యాపి సర్వస్పర్శి*
శ్రీరాముని గురుపత్నీ అరుంధతీమాత మాదిగ స్త్రీ.....
శ్రీరాముని చరిత్ర మనకందించిన వాల్మీకి మహర్షి బోయవారు
శ్రీరాముని కి లోకజ్ఞానం నేర్పింది నిమ్న జాతి సుమంతుడు......
శ్రీరాముని నదిదాటించిన మిత్రుడు గుహుడు నిషాదుడు (జాలరి)..
తన ఆకలి తీర్చిన కోయ జాతి స్త్రీ శబరినీ తల్లిగా భావించాడు శ్రీరాముడు...
క్షుద్ర పక్షి జఠాయువు ని తోడబుట్టినదాన్ని గా స్వీకరించి మోక్షం ఇచ్చాడు శ్రీరామచంద్రుడు......
వనచరులనే (షెడ్యూల్ ట్రైబ్) సహచరులుగా చేసుకుని ధర్మ పరిరక్షణ చేశాడు శ్రీరఘురాముడు......
సేతు నిర్మాణం నిర్వహించిన శ్రీరాముని సలహా దారులు నలుడు,నీలుడు వడ్డెర కులస్థులు......
నీతి తప్పిన బ్రాహ్మణుడి పై యుద్ధ తంత్రం రచించినది శ్రీ రామచంద్ర మూర్తి గురుతుల్యుడు శ్రీ ఆది జాంబవంతుడు మాదిగ జాతి వారు...
యుద్ధం లో లక్ష్మణుడు కి ప్రాణ దానం చేసింది గిరిజనుడైన సుశేనుడు.....
రావణసంహారానికి సహకరించినది రావణబ్రహ్మ సోదరుడు విభీషణుడు బ్రాహ్మణుడు.......
ధర్మ సూక్ష్మం రామునికి గుర్తు చేసినది చాకలి వ్యక్తి.......
పట్టాభిషేకానికి బంగారు సీతను తయారు చేసింది విశ్వ కర్మలు.......
*సనాతన ధర్మం లో ఉన్న సర్వజాతి సమానత్వానికి ఇదే నిదర్శనం.......*
*సర్వజీవులలో మానవత్వాన్ని చూసిన శ్రీరాముని జీవితం నేటి మానవాళికి ఆదర్శప్రాయం, ఆచరణీయం...*
*#రామోవిగ్రహవాన్ధర్మః*
*సాధు సత్యపరాక్రమః!!*
శ్రీరాముడుధర్మస్వరూపుడు, సాధుశీలుడు, సత్యపరాక్రమవంతుడు!!
సత్యధర్మాచరణబాటలో
శ్రీరాముని సేవలో మార్గదర్శకులుగా ముందుండి నడిపించిన త్యాగధనులైన సంతులు సాధువులు పూజ్య ఆచార్యులు నాయకమన్యులు, వారిబాటలో జీవితాల్ని చరితార్థంచేసుకొన్న అసంఖ్యాకమైన హిందువుల రామభక్తుల కృషి ఫలించింది!
*భవ్య, దివ్యమైన శ్రీరామచంద్రుని దేవాలయంతో పాటు శ్రీరాముని ఆదర్శ గుణములైన....*
#గుణవాన్!!
#వీర్యవాన్!!
#ధర్మఙ్ఞశ్చ!!
#కృతఙ్ఞశ్చ!!
#సత్యవాక్యో!!
#ధృఢవ్రతః!!
#చారిత్రేణయుక్తః!! #సర్వభూతేషుహితేరతః!! #విద్వాన్!!
#సమర్థశ్చ!!
#కశ్చైకప్రియదర్శనః!! #ఆత్మవాన్!!
#జితక్రోధః!!
#ద్యుతిమాన్!!
#అనసూయకః!! #జాతరోషస్యకస్యసంయుగేదేవాశ్చబిభ్యతి!!
ఈ షోడష సద్గుణములలో ఏ కొన్ని సద్గుణములనైనా మనం మన జీవితాలలో అలవరచుకుని ఆచరించే ప్రయత్నం చేయాలి!
అట్టి ప్రయత్నం చేయకపోతే మనం మన ప్రాత కోస్మరణీయులకు వారసులంగా అనర్హులం అనే విషయాన్ని ఎన్నటికి మరువరాదు!
*#జయశ్రీరామ!!*🚩🚩🚩🚩
*#హిందూ బంధువులందరికీ #శ్రీరామనవమి #శుభాకాంక్షలతో…..*
*శ్రీరామనవమి ప్రత్యేక కథనం*
*అంతా రామమయం*
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
ఒక దేశానికి , జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి . మనకు అలాంటిది రామాయణం . ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు . మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు . మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు . ధర్మం పోత పోస్తే రాముడు . ఆదర్శాలు రూపుకడితే రాముడు . అందం పోగుపోస్తే రాముడు . ఆనందం నడిస్తే రాముడు . వేదోపనిషత్తులకు అర్థం రాముడు . మంత్రమూర్తి రాముడు . పరబ్రహ్మం రాముడు .
లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు.
*#మన జీవనం రామమయం*
ఎప్పటి త్రేతా యుగ రాముడు ?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?
అయినా మన మాటల్లో , చేతల్లో , ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే .
చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట - శ్రీరామరక్ష సర్వజగద్రక్ష .
బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట - రమాలాలి - మేఘశ్యామా లాలి.
మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష & సర్వ జగద్రక్ష .
మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట- అయ్యో రామా .
వినకూడని మాట వింటే అనాల్సిన మాట - రామ రామ .
భరించలేని కష్టానికి పర్యాయపదం - రాముడి కష్టం.
తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే -రాముడు.
కష్టం గట్టెక్కే తారక మంత్రం - శ్రీరామ .
విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట -శ్రీరామ శ్రీరామ శ్రీరామ .
అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా !
వయసుడిగిన వేళ అనాల్సిన మాట -కృష్ణా రామా
తిరుగులేని మాటకు - రామబాణం.
సకల సుఖశాంతులకు
- రామరాజ్యం .
ఆదర్శమయిన పాలనకు -రాముడి పాలన .
ఆజానుబాహుడి పోలికకు
- రాముడు .
అన్నిప్రాణులను సమంగా చూసేవాడు -రాముడు
రాముడు ఎప్పుడు మంచి బాలుడే . చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా
- రామా కిల్డ్ రావణ ;
రావణ వజ్ కిల్డ్ బై రామా .
ఆదర్శ దాంపత్యానికి
- సీతారాములు .
గొప్ప కొడుకు -రాముడు .
అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు.
గొప్ప విద్యార్ధి
- రాముడు(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ).
మంచి మిత్రుడు - రాముడు(గుహుడు చెప్పాడు ). మంచి స్వామి రాముడు (హనుమ చెప్పారు ).
సంగీత సారం రాముడు (రామదాసు , త్యాగయ్య చెప్పారు ).
నాలుకమీదుగా తాగాల్సిన నామం రాముడు ( పిబరే రామ రసం - సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు ).
కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం -రాముడు .
నోరున్నందుకు పలకాల్సిన నామం -రాముడు.
చెవులున్నందుకు వినాల్సిన కథ -రాముడు.
చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు-రాముడు.
జన్మ తరించడానికి
-రాముడు , రాముడు , రాముడు
*#రామాయణం పలుకుబళ్లు*
మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ , ప్రతిబింబిస్తూ ఉంటుంది .
తెలుగులో కూడా అంతే.
ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్లే ఉంటుంది.
చెప్పడానికి వీలుకాకపోతే - అబ్బో అదొక రామాయణం .
జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే - సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .
ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే- అదొక పుష్పకవిమానం .
కబళించే చేతులు , చేష్ఠలు కబంధ హస్తాలు .
వికారంగా ఉంటే-శూర్పణఖ.
చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).
పెద్ద పెద్ద అడుగులు వేస్తే -అంగదుడి అంగలు .
మెలకువలేని నిద్ర- కుంభకర్ణ నిద్ర .
పెద్ద ఇల్లు - లంకంత ఇల్లు.
ఎంగిలిచేసి పెడితే - శబరి.
ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే -ఋష్యశృంగుడు.
అల్లరి మూకలకు నిలయం-కిష్కింధ కాండ .
విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -అగ్ని పరీక్షలే .
పితూరీలు చెప్పేవారందరూ -మంథరలే .
యుద్ధమంటే - రామరావణ యుద్ధమే .
ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -రావణ కాష్ఠాలే .
కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం ).
సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు .బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు . ఒంటిమిట్టది ఒక కథ .
భద్రాద్రిది ఒక కథ . అసలు రామాయణమే మన కథ .
*#అది #రాస్తే #రామాయణం , #చెబితే #మహా #భారతం .*
*శ్రీ రామచంద్ర భగవాన్ కి జై*🚩🚩🚩🕉
పిల్లలపెంపకం విషయంలో ....రామాయణం ఏం చెపుతున్నది?
.
శ్రీ రాముడు సీతాదేవి నగలను లక్ష్మణుడికి చూపించి ఇవి మీ వొదిన కేయూరాలేగద ! ఒక్కసారి నువ్వు కూడా గురుతు పట్టు అంటే అప్పుడు లక్ష్మణస్వామి అంటారు కదా .......
" నాహం జానామి కేయురే
నాహం జానామి కుండలే
నూపురే త్వభి జానామి
నిత్యం పాదాభివందనాత్ "
.
దీనర్ధం ఏమిటంటే ఓ అన్నా! వొదినగారు భుజానికి పెట్టుకునే కేయూరాలుగానీ గానీ,
చెవులకు పెట్టుకునే కుండలాలు గాని నే నెరుగను,
.
కానీ ఆవిడ పాదాలకు పెట్టుకునే నూపురాలను మాత్రం గుర్తు పట్టగలను.
.
ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్యం నమస్కారం చేస్తాను.పాదాలు మాత్రమే చూసాను.
కాబట్టి
పరస్త్రీ ని కన్నులెత్తి చూడని సంస్కారం!
..
అసలు ఆడువారి ముఖంలో ముఖంపెట్టి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకు మాట్లాడాలి ?
ఈవిధమైన శీల సంపద లక్ష్మణుడికి ఎక్కడనుండి వచ్చింది ?
.
తల్లి సుమిత్రాదేవి పెంపకం!!
రాముడి తో అడవికి వెళ్ళేటప్పుడు ఆ మహాతల్లి కొడుకుకు ఏమని చెపుతుందో తెలుసా !
.
" రామం దశరధం విధ్ధి,
మాం విధ్ధి జనకాత్మజాం,
అయొధ్యాం అటవీం విధ్ధి
గచ్చ తాత యధాసుఖం "
.
రాముణ్ణి దశరధుడనుకో,
సీతను నన్ననుకో
అడవిని అయొధ్య అనుకో
హాయిగా వెళ్ళిరా నాన్నా!
.
ఇంత సంస్కారమున్న తల్లి పెంచింది కాబట్టే లక్ష్మణుడు అంత శీలవంతుడయ్యాడు . చీరతొలగి మత్తులో ఉన్న తారతో మాట్లాడవలసివచ్చినప్పుడు తలవంచుకుని మాట్లాడిన అద్భుత శీలసౌందర్యం లక్ష్మణస్వామిది !
.
నేడు ప్రతి తల్లి తెలుసుకోవలసిన సత్యం ఇది కాదా !
పిల్లలను ఈవిధంగా పెంచితే దేశం లో ఏ ఆడబిడ్డయినా ఎందుకు బాధపడుతుంది?
నిర్భయ లాంటి ఘటనలు ఎందుకు చోటు చేసు కుంటాయి? ప్రియాంకరెడ్డిలాంటి భవిష్యత్తు ఉన్న *బంగారుతల్లుల* జీవితాలు ఎందుకు చిదిమి వేయబడతాయి ?
.
O GOD GIVE US GOOD WOMEN ,
.
SO THAT WE WILL MAKE GOOD NATION !
.
O GOD GIVE US GOOD MOTHERS,
.
SO THAT WE WILL MAKE GOOD CIVILISATION
.
అని రాధాకృష్ణ పండితులు అన్నమాట అక్షర సత్యంకాదా!
.
రామాయణం ,రామకధలు విరివిగా ప్రచారం చేయండి ! పరస్త్రీని ఇష్టం లేకుండా చెరబడితే దండన ఏదో ! స్త్రీలతో ఎలామెలగాలో అన్నీ తెలుస్తాయి !
💐💐నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం.💐💐💐
1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ
2.కాలాత్మక పరమేశ్వర రామ
3.శేషతల్ప సుఖనిద్రిత రామ
4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
5.చందకిరణ కులమండన రామ
6.శ్రీమద్దశరధనందన రామ
7.కౌసల్యాసుఖవర్ధన రామ
8.విశ్వామిత్రప్రియధన రామ
9.ఘోరతాటకఘాతక రామ
10.మారీచాదినిపాతక రామ
11.కౌశిక మఖసంరక్షక రామ
12.శ్రీ మదహల్యో ద్దారక రామ
13.గౌతమమునిసంపూజిత రామ
14.సురమునివరగణసంస్తుత రామ
15.నవికధావితమృదుపద రామ
16.మిధిలాపురజనమోదక రామ
17.విదేహమానసరంజక రామ
18.త్రయంబకకార్ముకభంజక రామ
19.సితార్పితవరమాలిక రామ
20.కృతవైవాహిక కౌతుక రామ
21.భార్గవదర్పవినాశక రామ
22.శ్రీ మాధయోద్యా పాలక రామ
23.ఆగణితగుణగణభూషిత రామ
24.అవనితనయాకామిత రామ
25.రాకాచంద్రసమానన రామ
26.పితృవాక్యాశ్రితకానన రామ
27.ప్రియగుహావినివేధితపద రామ
28.తత్ క్షాళితనిజమృదుపద రామ
29.భరద్వాజముఖానందక రామ
౩౦.చిత్రకూటాద్రినికేతన రామ
31.దశరధసంతతచింతిత రామ
32.కైకేయీతనయార్థిత రామ
౩౩.విరచితనిజపాదుక రామ
34.భారతార్పిత నిజపాదుక రామ
35.దండకవనజనపావన రామ
36.దుష్టవిరాధవినాశాన రామ
37.శరభoగసుతీక్షార్చిత రామ
38.అగస్త్యానుగ్రహవర్ధిత రామ
39.గృద్రాధిపగతిదాయక రామ
40.పంచవటీతటసుస్థిత రామ
41.శూర్పణఖార్తి విధాయక రామ
42.ఖరదూషణముఖసూదక రామ
43.సీతాప్రియహరిణానుగ రామ
44.మరిచార్తికృదాశుగా రామ
45.వినష్ట సేతాన్వేషక రామ
46. గృధ్రాధిపగతిదాయక రామ
47.శబరిదత్తఫలాశన రామ
48.కబంధభాహుచ్చేధన రామ
49.హనుమత్సేవితనిజపద రామ
50.నతసుగ్రివభిష్టద రామ
51.గర్వితవాలివిమోచక రామ
52. వానరదుతప్రేషక రామ
53.హితకరలక్ష్మణసంయుత రామ
54.కపివరసంతతసంస్మృత రామ
55.తద్గతి విఘ్నద్వంసక రామ
56.సీతాప్రాణాదారక రామ
57.దుష్టదశాన ధూషిత రామ
58. శిష్టహనూమద్భూషిత రామ
59.సీతూధితకాకావన రామ
60.కృతచూడామణిదర్శన రామ
61. కపివరవహనశ్వాసిత రామ
62.రావణధనప్రస్థిత రామ
63.వనరసైన్యసమావృత రామ
64.శొశితసరిధీశార్థిత రామ
65.విభిషణాభయదాయక రామ
66. సర్వతసేతునిభందక రామ
67.కుంబకర్ణ శిరశ్చెదక రామ
68.రాక్షససంఘవిమర్ధక రామ
69.ఆహిమహిరావణ ధారణ రామ
70.సంహ్రృతదశముఖరావణ రామ
71.విభావముఖసురసంస్తుత రామ
72.ఖస్థితధశరధవీక్షిత రామ
73.సీతాదర్శనమోదిత రామ
74.అభిషిక్త విభీషణ రామ
75.పుష్పకయానారోహణ రామ
76.భరధ్వజాభినిషేవణ రామ
77.భరతప్రాణప్రియకర రామ
78.సాకేత పురీభుషన రామ
79.సకలస్వీయసమానత రామ
80.రత్నలసత్పీఠాస్థిత రామ
81.పట్టాభిషేకాలంకృత రామ
82.పార్థివకులసమ్మానిత రామ
83.విభీషణార్పితరంగక రామ
84.కీశకులానుగ్రహకర రామ
85.సకలజీవసంరక్షక రామ
86.సమస్తలోకోద్ధారక రామ
87.అగణితమునిగాణసంస్తుత రామ
88.విశ్రుత రాక్షసఖండన రామ
89.సితాలింగననిర్వృత రామ
90.నీతిసురక్షితజనపద రామ
91.విపినత్యాజితజనకజ రామ
92.కారితలవణాసురవధ రామ
93.స్వర్గతశంబుక సంస్తుత రామ
94.స్వతనయకుశలవనందిత రామ
95.అశ్వమేధక్రతుదీక్షిత రామ
96.కాలావేదితసురపద రామ
97.ఆయోధ్యజనముక్తిద రామ
98.విధిముఖవిభుదానందక రామ
99.తేజోమయనిజరూపక రామ
100.సంసృతిబన్ధవిమోచక రామ
101.ధర్మస్థాపనతత్పర రామ
102.భక్తిపరాయణముక్తిద రామ
103.సర్వచరాచరపాలక రామ
104.సర్వభవామయవారక రామ
105.వైకుంఠలయసంస్ఠీత రామ
106.నిత్యనందపదస్ఠిత రామ
107.కరుణా నిధి జయ సీతా రామ
108.రామరామ జయరాజా రామ
రామ రామ జయసీతా రామ.🏹💦💦🌺🌺🙏
Ramanaya is considered to be one of the old, valued scriptures that reflects the Indian culture. It also reflects the ideal way of lifestyle, Lord Rama and Goddess Sita being the epitome of perfection. Having heard many stories and incidents from Ramayana, now is the time to incorporate those life lessons to be more peaceful and happy. Here are 9 important lessons from Ramayana that will help one find the right path of Dharma and Karma.
*Truth triumphs*
The basic teaching fo Ramayana is that no matter how powerful evil is, it will always be defeated by Good. Truth always wins, no matter how vicious or poisonous lie is because even a bitter truth oozes with positivity and the sweetest lie has the darkest agenda behind it. The win of good over evil is a universal fate. A person should always have a noble heart and good values. That is how Lord Rama defeated the most knowledgeable person in history Ravana.
*Unity can overcome any difficulty in life*
Dashratha has three wives and four sons, all of them loved each other immensely and when life put them through tough times, their hearts were united even when they were apart physically. You should always stand by your family because when together a family can win over any difficulty. The fruits of togetherness give the power to sail the ship when the tide seems higher than the sky.
*Be deeply committed to your duty*
Besides being Sita’s husband, Ram was also the King of Ayodhya. And the duty of the king is to keep his subjects happy. And hence, he had to abandon his wife for the sake of the masses after they questioned her chastity. As a husband, he was duty bound towards his wife. But as a King, he had to think of his subjects’ wishes ahead of his personal ones.
*Choose the path of righteousness*
Vibhishana, younger brother of Ravana chose to not support his sibling in the war against Ram. He knew his brother had committed a sin by abducted someone, a married lady.
*Remain humble no matter how powerful you become*
Hanuman could have easily rescued Sita from Ravana’s Ashoka Vatika. He had the power to single-handedly fight against Ravana’s army. But he chose to surrender to Lord Ram’s divinity and let him do the needful.
*Treat everyone equally*
Lord Rama treated everyone equally and that’s how he earned the love and respect among everyone. No matter if a person was younger or elder, poor or rich, he was the same person for everyone. Even when Sabri (the sage’s daughter) offered him the already tasted berry fruits he ate them without giving a second thought. He was always kind and humble to people. We should toe inhere this quality. We should always treat everyone with equality and should not discriminate on the basis of status, sex, age, or cast. We should treat animals equally as the true human being is the one who knows that everyone deserves an equal treatment.
*Always keep good company*
It is said that your company shapes you into a person you are. We have been told to keep good company since childhood and Ramayana too emphasize the relevance of good company. Queen Kaikeyi, the third wife of Dashratha loved Rama more than her own son but her handmaiden, Manthara poisoned her thoughts with negative feed, in result Kaikeyi asked for Rama’s fourteen years of exile. A negative person can brainwash all the good inside you, that is why we should always keep a healthy circle so that we become better with time.
*All that glitters is not gold*
Sita got attracted to a spotted deer that looked incredibly beautiful. She wanted Ram to get the deer for her from the jungle. Actually, it wasn’t a deer, but Mareech, Ravana’s accomplice in disguise of the animal.
*Forgiveness is greater than revenge*
When Ravana learned that Laxman has insulted his sister Supnakha, he went to seek vengeance and abducted Sita. Now he was lured into his own trap of anger and ultimately he signed his death warrant. He was well-versed and knowledgeable but the feeling of revenge cost him his life, therefore, we should always keep a forgiving nature because vengeance and revenge do not bring any good. They bring a downfall in our life. Keeping an attitude of forgiveness brings peace and harmony.
https://www.newsbharati.com/…/2020/4/2/Ramanaya-lessons.html
*మన నిత్యజీవితంలో రామాయణం నుండి నేర్చుకోవలసిన అంశాలు*
ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం
ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత
ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం.
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం.
ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం,
ఇంకో మనిషిలో స్త్రీల పట్ల ఉన్న ఆలోచనలు, ఒకరి ఎదురుచూపులు,
మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు..
అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు..
అదే రామాయణం’.
*అపి స్వర్ణ మయి లంక*
*నమే లక్ష్మణ రోచతే*
*జననీ జన్మ భూమిశ్చ*
*స్వర్గాదపి గరీయసి.*
ఈ లంకా నగరం అంత యు బ
Comments
Post a Comment