అభినయ గేయాలు..

అభినయ గేయాలు..

1. వానదేవుడా
మా పల్లె పాలించు వానదేవుడా. 
మమ్మెల్ల పాలించు వానదేవుడా..

మా పంటలన్ని నిండాలి వానదేవుడా.
మా పంటలన్ని పండాలి వానదేవుడా
మా గుమ్ములన్ని నిండాలి వానదేవుడా 

పేదసాద బతుకాలె వానదేవుడా!
మా గొడ్డు గోద బతుకాలె వానదేవుడా !
మాకు భాగ్యాలు కలుగాలె వానదేవుడా !!

మాకు కూలినాలి దొరకాలె వానదేవుడా !
మా వెతలన్ని తీరాలె వానదేవుడా! 
మా బతుకులన్ని మారాలె వానదేవుడా !! ॥మా పల్లె॥ 

2. కోలాటం పాట 

నల్లా నల్లనివాడు నామములు గలవాడు.
కనులకు కానరాడే గోపాలకృష్ణబాలుడు ||2|నల్లానల్లని|| 

1. మామంద పాలు త్రాగి - యేమంద కేగినాడో 
కనులకు కానరాడే గోపాలకృష్ణబాలుడు ||2|| నల్లనల్లని 

2. యశోద ఇంటిలోన - ఏమూల దాగినాడో ॥ఏమూల॥
కనులకు కానరాడే గోపాలకృష్ణబాలుడు ||2|| నల్లనల్లని 

3. గోవర్ధన గిరినెత్తి - గోవుల కాపాడినాడు ॥ ॥గోవుల|| కనులకు కానరాడే గోపాలకృష్ణబాలుడు ||2|| నల్లానల్ల

3. ఎందుకురా ?

ఎండలు కాసెందెందుకురా ? మబ్బులు పట్టేటందుకురా
మబ్బులు పట్టేదెందుకురా ?వానలు కురిసేటందుకురా
వానలు కురిసేదెందుకురా ?చెరువులు నిండేదందుకురా
చెరువులు నిండేదెందుకురా ?పంటలు పండేటందుకురా పంటలు పండేదెందుకురా ?ప్రజలు బ్రతికేదందుకురా
ప్రజలు బ్రతికేదెందుకురా ?మంచిని పెంచేదందుకురా

4. సత్యం

అనగనగా ఒక ఊరిలో పెద్ద రైతు రాజయ్య అతని కొడుకు లింగయ్యన అల్లరి పిలగాడయ

గొర్రెల మందల తోలుక అయ్యతో అడవికి వచ్చె బుద్ధులు చెప్పిన అయ్య పులి పిలవమనె

నాయనా పులి వచ్చెనంటు అయ్య నాట పట్టించె ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు అట్లచేసె

రాజయ్య కోపగించి రుసరుస మని వెళ్ళిపోయే
రయ్యి మని పులి వచ్చి గొర్రెపిల్లనెత్తుకెళ్లే

వణుకుతూ లబలబలాడుతూ అయ్యను దీనంగ పిలిచే అబద్ధాలు ఆడనని అప్పుడే మనసులో తలచే

5. కొంగ ఎండ్రి

కొండ పక్క చెరువులోన కోటి చేపలుండేరా
చేపలతో సోపతి చేసే కొంగ చూడరా...
మాటలెన్నో చెప్పెరా వాటిని నమ్మించెరా
రోజుకొక్క చేపను కొండపోయి మింగెరా...
మింగగా మింగగా ఒక్క ఎండ్రి మిగిలెరా
దాన్ని కూడా విడువక కొండపోతుండగా ....
బండమీద చేప ముండ్లు ఎండ్రికాయ చూశెరా 
కొంగబావ దొంగ బుద్ధి ఎండ్రికి ఎరుకాయెరా...
ఎండ్రి తెలివి తెచ్చుకొని కొంగ మెడను కొరికెరా... దొంగలతో సోపతి ప్రాణాలతో ఆపతి..

6. కాకి తెలివి

అనగనగా అడవిలోన పెద్ద చెట్టు ఉన్నది 
చెట్టు కింద పుట్టలోని పాము ఒకటి ఉన్నది..

చెట్టు మీద గూటిలోన కాకి ఒకటి ఉన్నది
కాకి గుడ్డు పెట్టింది పాము మింగివేసింది...

కాకి ఎత్తువేసింది రాణి గొలుసు తెచ్చింది 
రాజభటులు చూడగా పుట్టలోన వేసింది...

రాజభటులు వచ్చారు పుట్ట తవ్వి తీశారు 
పాము పారిపోయింది కాకి సంతోషించింది..

7. చీమ - పావురం

చీమ ఒకటి వాగులోకొట్టుకొని పోతుంటే 
పావురం అది చూసి ఆకు విసిరే గురిచూసి 
ఆకు పైకి చీమ ఎక్కి చేరను వాగు ఒడ్డుకి 

ఓసారి పావురం చెట్టుపై నుండగా 
వేటగాడు పదునైన బాణం వేసే దానిపైన 
చిటుక్కన చీమ వచ్చి కటుక్కున కరిసేవాణ్ణి 

బాణము గురి తప్పిపాయె పావురము ఎగిరిపాయే మంచోళ్ళతో సోపతులు తప్పునెప్పుడూ ఆపతులు

8. కాకి దూప

కాకి ఒకటి దూపతో కావు కావు మనుచును
నీటి కొరకు అటుఇటు వెదికి వెదికి చూసెను...

ఎటు చూసినా ఎండలే ఎక్కడ నీరు దొరకలే
వెతకగ ఒక కుండలో ఉండే నీరు అడుగులో...

నీరందక దూపారక ఎట్లా అని ఆలోచించగా...
చూసేను రాళ్ల తెట్టెను కొన్ని రాళ్లు తెచ్చి ఏసెను...

నీళ్లు మెల్లగా వచ్చెనం పైకి 
గుటగుటమని తాగెను కాకి 
ఆపదలో ఉపాయం తప్పెను కాకికపాయం....

9.కిలకిలమను పిల్లలం

కిలకిలమను పిల్లలం తొలకరి చిరుజల్లులం 
అల్లరితో ఎల్లరి ని అలరించే పిల్లలం....

తెలుగు తల్లి తోటలోనా వెలుగులీను పువ్వులం మంచితనం మనసులను పంచిపెట్టు గువ్వలం...

భారతి చిరు పెదవులపై పరవశించు నవ్వులం 
విశ్వమెల్ల వెన్నెలను వెదజల్లే నవ్వులం...

భరతమాత హారంలో మెరియుచున్న మెరుపులం ధగధగలు నలుదిశలా ఎగజిమ్మే రవ్వలం...

భారతమ్మ బొమ్మరింట్లో పాలు పెరుగు బువ్వలం
ఆనందం చేకూర్చే అమృతపు బిందులం...

10.భలే భలే భలే బలే బాలలమండీ

భలే.....
భలె భలె బలే బాలలమండీ 
భలేగా ఆటలు ఆడెదమండి....
దూకుల్లాటలో దూకెస్తాం కుంటుల్లాటలో ముందొస్తాం దస్తీలాట, కుర్చీలాట దాగుడుమూతలు ఆడెస్తాం 

ఊడల ఉయ్యాలలూగేస్తాం 
ఊహల్లో మేం విహరిస్తాం.... 
మంచి పనులే మేం చేసేస్తాం దేశం కొరకు పని చేస్తాం...

సమతా మమతలు పంచేస్తాం సమభావంతో మెలిగేస్తాం  
నేస్తాలతో మేం సర్దుకుపోతాం స్నేహం చక్కగా చేసెస్తాం....

అభినందిస్తే ఆనందిస్తాం ప్రేమను పంచితే స్వాగతిస్తాము స్వేచ్ఛను మాకు మీరు ఇస్తే చంద్రమండలమే చుట్టెస్తాం...

Comments

Popular posts from this blog

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు