శాఖ-సాంఘీక్-వర్గ-బైఠక్-కార్యక్రమాల సూచన పత్రాలు

🚩🚩🚩🚩
*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కామారెడ్డి*

అందరికీ నమస్కారం.
రేపు నగర సాంఘిక్ శాఖ ఉదయం 
6:30 గంటలనుండి 8 వరకు
*స్థలం*:
శ్రీ సరస్వతి విద్యా మందిర్ కామారెడ్డి

*సూచన:* తప్పక మాస్కు ధరించి రాగలరు.

*భవదీయ*
కొత్తోల్ల శివరాజ్
(నగర కార్యవాహ)

*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రాజంపేట ఖండ*

అందరికీ నమస్కారం.
మన రాజంపేట ఖండలో అన్ని గ్రామాలలో శాఖ విస్తీర్ణం దృష్ట్యా 
*రాజంపేట ఖండ బైఠక్ 29 నవంబర్ 2019, శుక్రవారం అనగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ సరస్వతి విద్యా మందిర్ కామారెడ్డి నందు నిర్వహించబడుతుంది.* కావున ఖండ కార్యకారిణి, అన్ని ఉపమండలాల ప్రముఖులు, అన్ని శాఖల ముఖ్య శిక్షకులు, కార్యవాహలు  ఈ బైఠక్ కు ఆపేక్షితులు...

కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ కార్యవాహ శ్రీ దిగంబర్ గారు పాల్గొంటారు.

*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ*
*(ప్రాంత శిబిరం- డిసెంబర్ 24, 25, 26.)*🚩🚩🚩

ఈ సంవత్సరం మన ప్రాంతంలోని ముఖ్య శిక్షక్, ఆపై కార్యకర్తలకు డిసెంబర్ 24, 25, 26 తేదీలలో మూడు రోజుల శిబిరం జరుగనున్న విషయం మనందరికీ తెలిసిందే. పరమపూజ్యనీయ సర్ సంఘచాలక్ పూజ్య మోహన్ భగవత్ జీ సాన్నిధ్యంలో మూడు రోజులు గడపడం స్వయం సేవకులుగా మనందరికీ గొప్ప అదృష్టం. మాననీయ సహా సర్ కార్యవాహలు శ్రీబాగయ్యగారు,శ్రీ ముకుందా జి ఇతర అఖిల భారతీయ మరియు క్షేత్ర అధికారుల మార్గదర్శనం మనకు లభిస్తున్నది.

*సూచనలు*

*ముఖ్య తేదీలు*

2019 డిసెంబర్ 24, 25, 26 మంగళ,బుధ,గురువారాలు.

24 -12 -2018, మంగళవారం ఉదయం 10 గంటల లోపు శిబిర స్థలం చేరుకోవాలి.

26-12-2019, గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల తర్వాత వెళ్లిపోవచ్చును.
పూర్తి సమయం శిబిరంలోనే ఉండాలి.

*ఆపేక్షితులు*
శాఖ ముఖ్య శిక్షక్, కార్యవాహ,
ఆ పై స్థాయి కార్యకర్తలందరూ.
(ఉపమండల, ఖండ, నగర, జిల్లా విభాగ్ మరియు ప్రాంత కార్యకారిణీ)

బస్తీ ప్రముఖులు

ఖండ, ఆ పై స్థాయి గతివిధుల ప్రముఖులు

వివిధ క్షేత్రాలలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు (స్వయం సేవకులు అయిన వారు మాత్రమే)

*గణవేశ*
దండ సహిత గణవేశ అనివార్యం.
(దండ తో పాటు అన్ని గణవేశ భాగాలు తమ తమ క్షేత్రంలోనే పూర్తి చేసుకుని రావాలి. శిబిర వ్యవస్థ నుండి ఏవి అమ్మబడవు.)

*గణవేష్ అనగా*
సంఘ ప్యాంట్, సంఘ చొక్కా, పట్టా, టోపీ, ఖాకి మేజోళ్ళు, పదవేష్, దండ.

*శిబిర శుల్క*
200₹రూపాయలు

మూడు రోజులకు అవసరమయ్యే నిత్యావసర సామాగ్రిని అనగా కంచం, గ్లాసు,ప్రక్క బట్టలు, సబ్బులు తెచ్చుకోవాలి.నిత్యం మందులు వాడే వారు మూడు రోజులకు సరిపడే మందులు తెచ్చుకోవాలి. డిసెంబర్ మాసం చలి అధికంగా ఉండే సమయం కనుక తగిన విధంగా చలి దుస్తులు దుప్పట్లు వెంట తీసుకొని రావాలి.

ఇది కార్యకర్తల శిబిరం కనుక శిబిర వాతావరణంకు ,సంఘ అనుశాసనం కు అనుగుణంగా వ్యవహరించాలి .అందుకు తగిన మానసికస్థితిని కలిగి ఉండాలి.

*శిబిర స్థలం*
హైదరాబాద్ నుండి నాగార్జునసాగర్కు వెళ్లే మార్గంలో మంగళంపల్లి గేట్ దగ్గర ఉన్న భారత్ ఇంజనీరింగ్ కాలేజ్.

*సార్వజనికోత్సవం,పథ సంచలన్:*
25-12-2019, బుధవారం మధ్యాహ్నం పథసంచలనం, సాయంత్రం 5 గంటలకు సరూర్నగర్ స్టేడియంలో సార్వజనికోత్సవం ఉంటాయి.

*భవదీయ*
కాచం రమేష్ 
(ప్రాంత కార్యవాహ)

==================================
.
🚩 *JOIN* *RSS*🚩

అందరికి నమస్కారం. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమయ్యే RSS-ప్రాథమిక శిక్షా వర్గలో మన గ్రామం నుండి యువకులను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రయత్నం చేయగలరు.

స్థలం:
 *శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల*,కామారెడ్డి 

9వ తరగతి ఆపై స్థాయి చదివిన వారు/ చదువుతున్న వారు అలాగే 15సం౹౹ దాటినా ఆపై స్థాయి వారు శిక్షణ తీసుకొనుటకు అర్హులు.
కరాటే ,
కర్రసాము, 
సూర్యనమస్కారాలు, 
యోగాసన్,  
వ్యాయామ యోగ్, 
పదసంచాలన్, 
కవాతు, 
శ్లోకాలు,
ప్రార్థన అభ్యాసాలు, 
వీరుల, ధీరుల పుణ్య కథలు, 
వ్యక్తిత్వ వికాసం 
దేశ భక్తి, మొ౹౹ శిక్షణలో భాగంగా నేర్పబడును.

7 రోజుల శిక్షణ కాలం.
శిక్షణార్థులు ఈ క్రింది వాటిని కొనుక్కోవాల్సి ఉండును.
ప్యాంటు ---₹300
పొడుగు చేతుల తెల్ల చొక్కా-----₹200
టోపీ...........₹ 50
బెల్ట్----------₹ 80
దండ(కర్ర)----₹ 30
పై వస్తువులు ఎప్పటికి మీకు పనికి వచ్చేవి.

ఇవన్నీ వర్గ స్థలంలోని మీకు లభిస్తాయి.

కాబట్టి మిత్రులారా 
మనం, లేదా మన ఇంటి సభ్యులను, లేదా మిత్రులను, తెలిసిన వాళ్ళకు విషయాన్ని తెలియపరచి RSS శిక్షణలో చేర్పించి భవిష్యత్ భారత్ అభివృద్ధికి పాటుపడే  అత్యుత్తమ పౌరులుగా  ఎదగడానికి కృషి చేద్దాం.  
చక్కని వ్యక్తిత్వానికి సహాయపడే RSS ప్రాథమిక శిక్షణ వర్గకు కేటాయించుదాం

*భారత్ మాతాకి జై*

మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఆర్ఎస్ఎస్ ప్రాథమిక శిక్షణ వర్గ లో మన గ్రామం నుండి శిక్షణార్థులు పాల్గొనేలా చూడగలరు.

గణవేశ్ భాగాలకు (ఆర్ఎస్ఎస్ యూనిఫామ్) ₹650.

శుల్క ₹ 250.

==================================


సంఘ కార్య విస్తరణ జరగాలంటే, 
సంఘం యొక్క సైద్ధాంతిక శిక్షణ అత్యంత అవసరం.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎన్నడు సానుభూతిపరులను కోరుకోదు. సంఘ పని కి కావలసింది కేవలం కార్యకర్తలు మాత్రమే..,

 వ్యక్తి నిర్మాణం వారిని దేశ నిర్మాణం జరుగుతుంది అని సంఘం విశ్వసిస్తోంది.

కావున స్వయం సేవకులు అందరూ మన గ్రామాల నుండి, ఈ శిక్షణ వర్గ లో పాల్గొనేలా చూడగలరు.

భారత్ మాతాకీ జై.🙏🙏🙏🚩

*పూర్తిగా పోస్ట్ చదవి మనకూ తెలసిన వారికి సమాచారం ఇవ్వగలరు*🙏🙏
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్* *ప్రాథమిక శిక్షావర్గ-2019*
*సూచన పత్రం*
  
ఆత్మీయ బంధువులందరికీ సప్రేమ నమస్కారములు.🙏🙏🚩

ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన దేశం మన భారతదేశం. ఇలాంటి పవిత్ర భారతదేశంలో జన్మించడం మన పూర్వజన్మ సుకృతం.
ఈ మనదేశాన్ని ప్రపంచంలోనే జగద్గురుస్థానాన్ని తీసుకువెళ్ళడానికి అకుంఠిత దీక్షతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత 94 సంవత్సరాలుగా నిరంతరం శాఖ అనే గంట కార్యక్రమంలో  వ్యక్తి నిర్మాణం అనే తపస్సు తో ముందుకు సాగుతుంది .ఈ విధమైనా శాఖ పని విస్తారణ కోరకై ప్రతి సంవత్సరం దసరా సెలవులలో *ప్రాథమిక శిక్షావర్గ* అనే పేరుతో వ్యక్తిత్వ వికాస శిబిరం ఏడు రోజుల పాటు నిర్వహిస్తుంది.

ఈ శిక్షా వర్గలో,
*శారీరక వికాసం కొరకూ*
*దండ* (కర్రసాము)
*నియుద్ధ* (కరాటే),
*యోగా,* *సూర్యనమస్కారాలు,* *భారతీయ ఆటలు,*
*పథ్ సంచాలన్ (కవాతు)*
మరియు 
*మానసిక వికాసం కొరకూ*
*దేశభక్తి పాటలు, ఆధ్యాత్మిక శ్లోకాలు*
*మహనీయుల చరిత్ర,*
*భారతీయ సంస్కృతి పట్ల అవగాహన,*
*బృందచర్చలు,*
*గోష్ఠిలు*
మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 

ఈవిధమైన శిక్షణనూ పొందడానికి ఎక్కువగా గ్రామాల నుండి కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వివిధ వృత్తుల వారు, వ్యవసాయదారులు, కార్మికులు ఇలా అందరూ పాల్గోనే విధంగా ప్రయత్నించగలరు.

*శిక్షణలో పాల్గోనేవారు క్రింది సూచనలు గమనించగలరు.*

*తేదీ:*
28 వ తేదీ సెప్టెంబర్ 2019, శనివారం నాడు ప్రారంభమవుతుంది. 

*(శిక్షా వర్గలో పాల్గొనేవారు సాయంత్రం 5 గంటల వరకు వర్గ స్థలానికి చేరుకోవాలి.)*

05 వతేదీ అక్టోబర్ 2019 శనివారం సాయంత్రం 5 గంటలకు సార్వజనిక ఉత్సవ కార్యక్రమంతో  పూర్తవుతుంది..

*శిక్షణ వర్గ లో వెళ్లాల్సిన వారు:* 16సం"ల వయస్సు (లేదా) ఇంటర్మీడియట్ ఆపైనా ఎదైనా చదివేవారు పాల్గొనవచ్చును.

(నిత్య శాఖ లో పాల్గొనే 9 మరియు 10 తరగతి విద్యార్థులకు అవకాశం కలదు.)

*స్థలం :*
శ్రీ సరస్వతి విద్యా మందిర్ కామారెడ్డి ( నేషనల్ హైవే పక్కన)
గంగ
*గణవేష్ :*
(యునిఫామ్) పూర్తి చేతుల తెల్ల చొక్కా,సంఘ ప్యాంటు,బెల్టు,టోపీ దండ (కర్ర) ఇవి తప్పనిసరి ఉండాలి.

*ఇతర సూచనలు:*  కంచం,గ్లాసు, దుప్పట్లు, సబ్బులు, నోటు పుస్తకం, పెన్నులు, మరియు వారం సరిపడే వస్తువులు వెంట తెచ్చుకోగలరు.

ఇతర విలువైన వస్తువులు ఏవి వెంట తీసుకురావద్దు.

ఈ శిక్షా వర్గ గురించి చి వారందరికీ సమాచారం ఇవ్వగలిగినట్లైతే మీ ద్వారా ఓక దేశ భక్తి గల కార్యకర్తలు తయారవుతారు.

 భారత్ మాతాకీ జై.🙏🙏🚩🚩🚩


*సేవాభారతి- కామారెడ్డిశాఖ*

*బాల మేధా*
*జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాల స్పర్థ*

73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఈ కింది అంశాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది.
కావున ఆసక్తిగల విద్యార్థులు 20 రూపాయలు రుసుము చెల్లించి పేర్లు నమోదు చేసుకోగలరు.

*ముఖ్య సూచనలు*

*తేదీ :* 
ఆగస్టు12,2019, సోమవారం.
*స్థలం:*
శ్రీ సరస్వతి విద్యా మందిర్
*సమయం*
ఉదయం 10-00గం"నుండి  సాయంత్రం 4:30 గంటల వరకు

పాల్గొనే విద్యార్థులు తమ వెంబడి మధ్యాహ్న భోజనాన్ని వెంట తెచ్చుకోవలెను.

*పోటీల వివరాలు*

*విభాగం -1*

*కేటగిరి 1*
*(6 ,7 ,8 తరగతులు*)

*1)వక్తృత్వం :*

అంశం :భారత్ మాతృభూమి వైభవం
(Bharat : Glory of of our motherland)

*2)చిత్రలేఖనం:*

*అంశం:* నీకు నచ్చిన దేశభక్తుడు

*3)వ్యాసరచన*

*అంశం:* 
చదువు నా కోసం నేను దేశం కోసం
Education is for me I am for the country

*కేటగిరి 2*
(9 ,10 తరగతులు)

*1)వక్తృత్వం :*

*అంశం:* 
విశ్వ గురువుగా భారత్ 
Bharat as a vishwaguru

*2)చిత్రలేఖనం:*

*అంశం*
భారతీయ సాంస్కృతిక వైభవం
Glory of Indian culture

*3)వ్యాసరచన*

*అంశం:* 
స్వాతంత్రానంతరం 370, 35(a) ఆర్టికల్స్ వల్ల మన దేశం ఎదుర్కొన్న సమస్యలు సమస్యాత్మక ఆర్టికల్స్ రద్దుచేసి పరిష్కారాన్ని చూపిన భారత ప్రభుత్వం
Problems faced by our country as a result of articles 370 and 35(a )after independence; The government of India, which has abolished and  solved the problematic articles.

*విభాగం 2*

*1) గీత స్పర్ధ (పాటల పోటీ)*
*2)నృత్య స్పర్థ*

దేశభక్తి, దైవభక్తి, సందేశాత్మక పాటలు సామూహికంగా వైయక్తికంగా పాల్గొనవచ్చు.

*3)నాటికలు*

*అంశం*
స్వాతంత్ర ఉద్యమంలో అమరులైన యువ కిశోరాలు

*వివరాల కై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు*

7416164478
9492474855
9440422840

*భవదీయ*
సేవాభారతి -కామారెడ్డి


🚩🚩🚩🚩🚩🚩🚩🚩
*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్* 
*ఇందూర్ నగరం*
*కేశవ్ శాఖ వార్షికోత్సవ ఆహ్వానం - నాందేవ్ వాడ ఉపనగర్*



*ఆత్మీయ బంధువులందరికీ సప్రేమ నమస్కారములు.*🙏🙏🚩

ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన దేశం మన భారతదేశం. ఇలాంటి పవిత్ర భారతదేశంలో హిందువుగా జన్మించడం మన పూర్వజన్మ సుకృతం.ఈ మనదేశాన్ని జగద్గురుస్థానానికి తీసుకువెళ్ళడానికి అకుంఠిత దీక్షతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత 97 సంవత్సరాలుగా నిరంతరం శాఖ అనే గంట కార్యక్రమంతో  వ్యక్తినిర్మాణం అనే తపస్సు తో ముందుకు సాగుతుంది 

ఇందులో భాగంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇందూర్ నగరంలో కేశవ్ శాఖ వార్షికోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

*ఈ కార్యక్రమంలో స్వయంసేవకుల శారీరక ప్రదర్శనలు మరియు* 
*దేశభక్తి పాటలు, ఆధ్యాత్మిక శ్లోకాలు ఉంటాయి.*

*♦️కార్యక్రమం వివరాలు♦️*🚩

*తేదీ:* 06-02-2022,ఆదివారం
*స్థలం :* 
*సమయం :*
సాయంత్రం 4:30 గంటలకు 

ఇట్టి కార్యక్రమంలో స్వయం సేవక్ స్వయంసేవ పాల్గొనగలరని ఆహ్వానించడం అయినది.

*భారత్ మాతాకీ జై*🚩🚩🚩

*భవదీయ*
తిరుక్కోవళ్ళూరు శ్రీనివాస్
(నగర సంఘచాలక్)

*“సంఘ శాఖ" అంటే కేవలం ఆట లాదుకునే, సంచలన్ చేసే స్థలం మాత్రమే కాదు. మంచివారి సంరక్షణ కోసం పలికిన ఒక ధైర్యవచనంలాంటిది. యువకులను చెదు. వ్యసనాల నుండి దూరం చేసి, వారిలో సంస్కారాన్ని నింపే వేదిక. సమాజానికి అకస్మాత్తుగా వచ్చే ఆపదలు, సంకటాలలో త్వరితంగా, ఏమాత్రం వివక్షత లేకుండా సహాయం అందించే ఆశాకేంద్రం. మహిళల్లో నిర్భయత్వానికి, మంచి ఆచరణకు అభయహస్తాన్నిచ్చేది. దుష్టులపై, దేశద్రోహ శక్తులపై విరుచుకుపడే శక్తి. సమాజ జీవనంలోని విభిన్న రంగాలకు యోగ్యమైన వ్యక్తులు లభించటానికి సరైన శిక్షణనిచ్చే పాఠశాల లాంటిది " సంఘ శాఖ "*
- పరమ పూజనీయ బాలాసాహెబ్ దేవరస్ జీ

🚩🚩🚩🚩
 *Rashtriya Swayamsevak Sangh - Secunderabad Bhag*

*Upasthiti Din - Nagar Wise Sanghik Details*
 
*📌Date :* February 5 2023, Sunday.

*1.Seethaphalamandi Nagar*

*🕖Time :*
 7:30 AM to 9:00 AM

 *⛳Place*: Vedhavyas Sanghasthan - Medibhavi

 *📍Location:*
MEDIBAVI Municipalities Garden
https://maps.app.goo.gl/85NVAByppeVsCVR66

*2.Mallilarjuna Nagar (Kavadi guda)*

 *🕖Time :*
 7:00 AM to 8:30 AM

 *⛳Place*: Devunithota sangathan 

 *📍Location:* Bhoolakapuram
Sri Bhavani Shankar Temple
https://maps.app.goo.gl/v9SwAUJYaefSMuyG8

*3.Prakash Nagar*

 *🕖Time :*
 7:00 AM to 8:30 AM

 *⛳Place*: Margadarshi Ground

 *📍Location:* Rasoolpura 
https://g.co/kgs/kj8et3

*4. Secunderabad Nagar*

*🕖Time :*
 6:30 AM to 8:00AM

 *⛳Place*: Janmabhoomi Shakha 

*Location :*
https://maps.app.goo.gl/8LS7pAXcP1XpFNKZ8
*Ram Mandir D.V. Colony* 

*5.Marredpally Nagar*

 *🕖Time :*
 7:00 AM to 8:30 AM

 *⛳Place*: Sanjeev Housing society Ground 

 *📍Location:* https://maps.app.goo.gl/mshh5dBFMDtaxk7XA

*6. Alwal Nagar*

*🕖Time :*
 7:30 AM to 9:00 AM

 *⛳Place*:St. Alphonsus's School, Surya Nagar 

 *📍Location:*
St. Alphonsus’ High School
https://maps.app.goo.gl/jPv1hZJNTTqoj8vy9

*7. Boloram Nagar*

 *🕖Time :*
 7:00 AM to 8:30 AM

 *⛳Place*: Tulja Bhavani Sanghasthan - Macha Boloram 

 *📍Location:*
https://maps.google.com/?cid=10597215970384902137&entry=gps

 *NOTE:*
 👉 *Can reach Sanghasthan ten minutes before. 📢 Do Gata work before coming to Sangasthan.*

 👉 *All the Swayamsevaks can inform the sangheek instruction to your gata two days in advance.*

 👉 *Must bring Danda along. And can come wearing any short or tracksuit.*

*Dhanyawad*🚩
*Bharat matha ki jai*🕉️

Comments

Popular posts from this blog

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు