భారత రాజ్యాంగం
*🖊📗భారత రాజ్యాంగం- పార్టు - 1* 🖊📘
*రాజ్యాంగం*:- ప్రభుత్వ నిర్మాణం, వాటి అధికారాలు,విధులు మరియు ప్రాథమిక చట్టాల సముదాయమే రాజ్యాంగం.
🔹రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను గురించి చెప్పిన మొదటి వ్యక్తి - ఎం.ఎన్.రాయ్
🔹రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును ప్రతిపాదించింది - క్రిప్స్ మిషన్ ( 1942)
🔹1946 లో క్యాబినెట్ మిషన్ సూచన మేరకు రాజ్యాంగ పరిత్ ఏర్పాటు చేశారు.
🔹రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు - 1946 జూలై నుండి సెప్టెంబరు వరకు.
🔹రాజ్యాంగ పరిషత్ సభ్యులు - 389 ( రాష్ట్రాల నుండి292+ స్వదేశీ సంస్థానాల నుండి 93+ చీఫ్ కమీషనర్ ప్రాంతాల నుండి 4)
🔹దేశ విభజన తరువాత సభ్యుల సంఖ్య -299 (229 ఎన్నిక చేయబడ్డాడు +70 నామినేటెడ్)
🔹రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం- 1946 డిశంబరు 9
🔹రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు - సచ్చిదానంద సిన్హా (2రోజులు)
🔹రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు- డా,, బాబూ రాజేంద్ర ప్రసాద్ (1946 డిశంబరు11)
🔹భారత రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ ఏర్పాటు- 1947 ఆగష్టు 29
🔹రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు- డా,, బి.ఆర్. అంబేద్కర్
🔹 రాజ్యాంగం ఆమోదింపబడిన తేదీ - 1949 నవంబరు 26
🔹రాజ్యాంగ రచనకు పట్టిన కాం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ( 1946 డిసెంబరు 9 నుం డి 1949 నవంబరు26)
🔹రాజ్యాంగ పరిషత్ అమలులోకి వచ్చిన సంవత్సరం - 1950 జనవరి 26.
🔹 మౌలిక రాజ్యాంగంలో 395 అధికరణలు 22 భాగాలు, 8 షెడ్యూల్స్ ఉండేవి.
🔹 ప్రస్తుత రాజ్యాంగంలో ప్రస్తుతం 469 అధికరణలు 25 భాగాలు, 12షెడ్యూల్స్ ఉన్నాయి.(ఫిబ్రవరి 6, 2019 నాటికి)
*ప్రశ్న*:రాజ్యాంగంలో ప్రవేశిక, భాగాలు, షెడ్యూల్స్, ప్రకరణల మధ్య వ్యత్యాసం ఏమిటి?
*జవాబు*
*ప్రవేశిక*:- భారత రాజ్యాంగానికి ఉపోద్ఘాతం వంటిదే *ప్రవేశిక*. భారత రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను,ఆదర్శాలను ప్రవేశిక వివరిస్తుంది.
*భాగాలు*:- పాఠ్యపుస్తకాన్ని వివిధ అధ్యాయాలుగా విభజించినట్లు రాజ్యాంగాన్ని 22 భాఘాలుగా వర్గీకరించారు. అయితే ప్రస్తుతం 25 భాగాలు ఉన్నాయి.
🔹వివిధ ప్రకరణల సముదాయమే భాగాలు.
*ఉదా*:- 1-4 అధికరణలు మొదటి భాగంలో ఉన్నాయి.
*భాగాలు-- విషయం-ప్రకరణలు*
*భాగం:I* కేంద్ర-రాష్ట్రాల భూభాగాలు(1-4)
*భాగం:2*--పౌరసత్వం(5-11)
*భాగం:3*--ప్రాథమిక హక్కులు.(12-35)
*భాగం:4*--ఆదేశిక సూత్రాలు(36-51)
*భాగం:4(ఎ)*-- ప్రాథమిక విధులు(51A)
*భాగం:5*-- కేంద్ర ప్రభుత్వం(52-151)
*భాగం:6*--రాష్ట్ర ప్రభుత్వాలు(152-237)
*భాగం:7*-- ( 1956 లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది)
*భాగం:8*--కేంద్రపాలిత ప్రాంతాలు(239-242)
*భాగం:9*--పంచాయతీకలు( 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు (243A-243 ఓ)
*భాగం:9(ఎ)*-- మున్సిపాలిటీలు. (243P-243ZG ప్రకరణలు).... 1992 లో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
*భాగం:9(బి)*- సహకార సంఘాలు (243 ZH-243ZT)
*భాగం:10*-షెడ్యూల్ తెగల ప్రాంతాలు (244-244A)
*భాగం:11*--కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు(245-263)
*భాగం:12*-విత్తం, ఆస్తి ఒప్పందాలు, వ్యాజ్యాలు (264-300A)
*భాగం:13*--వ్యాపారం, వాణిజ్య సంబంధాలు(301-307)
*భాగం:14*:- కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు (308-323)
*భాగం:14(ఎ)*-- ట్రబ్యునల్స్ (323AB)
*భాగం:15*-- ఎన్నికలు (324-329)
*భాగం:16*-- కొన్ని ప్రత్యేక వర్గాలకు సంబంధించిన నిబంధనలు (330-342)
*భాగం:17*- అధికార భాష (343-351)
*భాగం:18*-అత్యవసర పరిస్థితి (352-360)
*భాగం:19*-మినహాయింపులు, మిశ్రమ అంశాలు(361-367)
*భాగం:20*- రాజ్యాంగ సవరణలు (368)
*భాగం:21*- తాత్కాలిక, ప్రత్యేక సంరక్షణ (369-392)
*భాగం:22*--హిందీలో సాధికార రాజ్యాంగఅనువాదం (393-395)
(22+4A+9A+9B+14A=26 -1(7వ భాగం)=25.
*షెడ్యూళ్ళు*(schedules)* :-- షెడ్యూల్ అనగా రాజ్యాంగం అనుబంధమైన అదనపు సమాచారాన్ని అందించేది.
🔹షెడ్యూల్స్ అనునవి ప్రకరణలలో పొందుపరచలేని అదనపు సమాచారాన్ని అందించే అనుబంధం
🔹 ముఖ్య జాబితాలను ఒకచోట అనగా చివరలో పొందపరచిన అనుబంధమే షెడ్యూల్.
*ఉదా*: భాషల జాబితా, రాష్ట్రాల జాబితా.
🔹మౌలిక రాజ్యాంగంలో 8 షెడ్యూల్స్ ఉండేవి. ప్రస్తుతం రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్ ఉన్నాయి.
*షెడ్యూల్---ప్రాముఖ్యత*
*1వ షెడ్యూల్*:- రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల జాబితా (1-4 ప్రకరణలు)
*2వ షెడ్యూల్*:-రాష్ట్రపతి, గవర్నర్లు, ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జీతభత్యాలు (59,65,75,97,129 ప్రకరణలు)
*3వ షెడ్యూల్*:- ప్రధాని, కేంద్ర-రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు శాసనసభ సభ్యులు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాలు (75,99,124,148,164,219)
*4వ షెడ్యూల్*:- రాష్ట్రాలకు రాజ్యసభలో సీట్ల కేటాయింపు(4 మరియు 80 ప్రకరణలు)
*5వ షెడ్యూల్*:- షెడ్యూల్ ప్రాంతాలు, గిరిజనుల పరిపాలన, నియంత్రణ,(244(1)
*6వ షెడ్యూల్*:- అసోం, త్రిపుర, మిజోరాం మేఘాలయ రాష్ట్రాల గిరిజన ప్రాంతాల పరిపాలన నిబంధన (244(2), 275
*7వ షెడ్యూల్*:- కేంద్రం-రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ (246 అధికరణ)
*మూడు జాబితాలు*
💧కేంద్ర జాబితాలోని అంశాలు (100)
💧రాష్డ్ర జాబితాలోని అంశాలు61
💧ఉమ్మడి జాబితాలోని అంశాలు 52)
*8వ షెడ్యూల్*:-అధికార భాషలు (344, 351 అధికరణలు)
🔹14 భాషలను అదికారి భాషలుగా గుర్తించారు.
🖊 1967లో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ ని చేర్చారు
🖊1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలీ భాషలు చేర్చారు.
🖊2003 లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో,డోగ్రీ,మైథిలీ, సంథాలి భాషలు చేర్చారు.
🔹రాజ్యాంగం గుర్తించిన భాషలు - 22+ హిందీ ( జాతీయ అధికార భాష) + ( హిందీ) ద్వితీయ అధికార భాష = 24
*9వ షెడ్యూల్*:- భూసంస్కరణలు, రిజిస్ట్రేషన్లు (31-B అధికరణ).... 1951 లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
*10వ షెడ్యూల్*:- ఫిరాయింపుల నిరోధక చట్టం (102, 191 అధికరణలు)......1985 లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు
*11వ షెడ్యూల్*:- పంచాయతీరాజ్ వ్యవస్థ ( 243 *A* నుండి 243 *O* ప్రకరణలు)...1992 లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 29 అంశాలపై పంచాయతీరాజ్ శాఖకు అధికారాలు ఉంటాయి.
*12వ షెడ్యూల్*:- పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థల ఏర్పాటు. ( 243 *P* నుండి 243 *ZG*).....18 అంశాలపై అదీకారాలు కల్పించారు.
*ప్రకరణలు( Articles)*:- భారత ప్రభుత్వ శాఖలైన శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ ల అధికారాలు, విధులను, ప్రజలకు ఇవ్వబడిన హక్కులను వారి విధులను వివరించేవే ప్రకరణలు
🔹పుస్తకంలో ఉప విభాగాల వంటివి *ఆర్టికల్స్*
🔹1949 లో 395 ప్రకరణలు ఉండగా 101వ రాజ్యాంగ సవరణ నాటికి 106 అధికరణలు చేర్చబడ్డాయి. (395+106= 501)
🔹మొత్తం 35 ప్రకరణకు తొలగించబడ్డాయి.(501-35=466)
35A ను కలుపుకుంటే 467 ప్రకరణలు
🔹102వ రాజ్యాంగ సవరణ ద్వారా 338 *B*, మరియు34 *A* చేర్చబడ్డాయి.(467+2=469).
*గమనిక*:- భాగాలలో అన్ని అధికరణలు పొందుపరచబడి ఉంటాయి. కానీ షెడ్యూళ్ళలో కొన్ని అధికరణలకు సంబంధించిన ముఖ్యమైన అదనపు సమాచారం పొందుపరచబడి ఉంటాయి.
🌹📚📚📚🌾📚📚📚🌹
Comments
Post a Comment