సంఘటన కౌశల్యాలు & సంఘటన కార్యం
ఓటమిలో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండటం కష్ట సహిష్ణుత
పట్టుదలతో పనిచేయడం నిరంతర ప్రయత్నం నిరంతరం ఔత్సాహికుడు గా ఉండటం
తక్కువ ఎక్కువ తారతమ్యాలు లేకుండా చూడటం వ్యక్తుల మధ్య
మనం ఏ స్థాయిలో ఉన్న అందరితో కలుపుగోలుగా ఉండటం
దాదా రావు పరమార్థ్ చెన్నై కథ శ్రీ గురూజీ
చొరవ కలిగిఉండటం
ధైర్యం సాహసం పరాక్రమం ప్రేమ వాత్సల్యం స్నేహం వంటి భావాలను కలిగి ఉండటం
వ్యక్తులను గుర్తించడం వెతికి వెతికి పట్టుకోవడం
యాదవ్ రావు జోషి సంగీతం
సుధీర్ పడకే డాక్టర్ జి
మంచి గుణాలు కలిగిన వ్యక్తులను సంఘటన కార్యంలో తీసుకురావడం
సచ్ఛీలం ఉన్నంతమాత్రాన చాలదు. కొందరికి విశుద్ధశీలం ఉన్నప్పటికి వాళ్ళు తమ మొరటుమాటలతోనూ, చేతలతోనూ ఇతరులను నొప్పిస్తారు. పైగా తమ మొరటుతనానికి తామే మురిసిపోతారు. 'నేను కుండపగుల గొట్టినట్లు మాట్లాడుతాను, ఎవరైనా భాధపడినా నాకు లెక్ష లేదు' అనిఅంటారు. కాని జాతీయ పునస్సంఘటనకార్యాన్ని చేపట్టినవ్యక్తి, అట్లా ఉండటానికి వీల్లేదు. అతని పలుకుల్లో తేనెలొలికితీరాలి. ఒకరాజు తన ఆయుర్దాయాన్ని గురించి ఎప్పుడూ జ్యోతిష్కులనడుగుతూ ఉండేవాడు. ‘నీవు దీర్ఘాయువువే గాని, నీకండ్ల ముందే నీకొడుకు చనిపోతాడు' అని అందరూ చెప్పేవాళ్ళు. కష్టంకలిగించే ఈమాటకు అతనికి సహజంగా కోపంవచ్చేది; వాళ్ళను దండించేవాడు. చివరకు ఒక వృద్ధజ్యోతిష్కుడు, "రాజా నీవంటి అదృష్ట జాతకుడులేడు. నీ సొంతచేతులతో నీ మనుమడికి పట్టాభిషేకం చేస్తావు" అన్నాడు.దీనితో రాజు ఉబ్బితబ్బిబై, అతణ్ణి ఘనంగా సత్కరించి పంపాడు. ఇతరులవలె అతడు కటువుగా చెప్పక, ఉన్నవిషయాన్నే మరొకపద్దతిలో తీయగా చెప్పాడు. తేడాఅంతా ఇందులోనే ఉంది. అందుకే "సత్యం బూయాత్, ప్రియం బ్రూయాత్" (నిజం చెప్పు; తియ్యగా చెప్పు) అన్నారు.
*అమృతవచనం 32*
*అందరిచేతా మంచివాళ్ళు అనిపించుకోవటం ప్రతి సమస్యగురించి మన వైఖరిని వివరించుతూ ప్రకటనలు జారీచేయటమూ, సమస్య పరిష్కారం కోసం హళాహళి చేయటం, అటూ ఇటూ పరుగెత్తటం ఇలా చేయడం ద్వారా -కొన్ని సందర్భాలలోనైనా ప్రశంసలు లభించవచ్చుగాక...కాని వాటి ద్వారా నిర్మాణమయ్యేదేమీ ఉండదు.వాస్తవికమైన నిర్మాణం జరగాలంటే సమస్యను బట్టి-దానికి అపురూపమైన (తగిన) ఆచరణ, వ్యవహారం చేయవలసి ఉంటుంది.*
తలెత్తిన సమస్య ఏదైనా కావచ్చు. స్వాభావికమైన రీతిలో ఎంతమేరకు ఎదుర్కోగలమో, అంతవరకే పరిష్కారమవుతుంది. సమాజంలో ఘటకులందరినీ (మన తోటి వారందరిని)
మనతోపాటు కదలించి తీసికొనిపోతూ శక్తిని మరింతగా పెంచుకోవడమే అన్ని సమస్యలకు పరిష్కార మార్గమవుతుంది.
*అమృతవచనం - 30*
*ఈ దేశ సమృద్ధి, భవిష్యత్తు హిందువుల తోనే ముడిపడి వున్నది. హిందు అనేది రాష్ట్రం పేరు. హిందువు రాష్ట్రానికి ప్రతిరూపం. (రాష్ట్రం అనే సంస్కృత పదానికి తెలుగులో జాతి అని అర్థం..)హిందువే రాష్ట్రానికి ప్రాణం... అందువలన హిందువుల బలహీనత అంటే రాష్ట్రం యొక్క బలహీనత, హిందువుల శక్తి అంటే రాష్ట్రీయ (జాతీయ) శక్తి అవుతుంది.* *దేశంలో ఏ భాగంలోనైనా హిందువులు అల్పసంఖ్యాకులుగా మారితే ఆ భూభాగం మన మన మాతృభూమినుండి విడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. హిందు సంఘటనయే దేశ సంక్షేమం..*
*అమృతవచనం 42*
*మన సాధనసంపత్తినంతనూ సమీకరించి, దేశంలో ఆంతరిక విద్రోహ శక్తులన్నిటినీ నిర్మూలించి, శత్రుశేషం లేకుండా చేయటానికి పోరాటం కొనసాగించేందుకు,* *భవిష్యత్తులో ఎదురయ్యే*
*ప్రమాదాన్ని నామరూపాలు లేకుండా తుడిచిపారెయ్యటానికి, తగిన శక్తి మనం నిర్మించుకోవాలి. ప్రజల విశుద్ధ జాతీయ శీలసంపదయే అజేయ అక్షయశక్తి భాండారం. అది లేనిదే ఎంతటి బాహ్య సహాయం,సాధన సామగ్రి లభించినప్పటికి ప్రయోజనముండదు.*
*అమృతవచనం - 43*
*''సంఘటితం కావడం వల్లనే శక్తి వస్తుందని గుర్తుంచుకోవాలి. హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన ప్రతి ప్రయత్నం చేయడం హిందువుల విధి.''*
*''దేశంలోని కోట్లాది మంది యువకులు ఈ లక్ష్యం దిశగా తమ జీవిత గమనాన్ని మార్చుకోకపోతే, దేశం భవిష్యత్తును మార్చలేము. యువత ఆలోచనలను ఆ దిశగా మార్చడమే సంఘ్ అంతిమ లక్ష్యం.''*
*అమృతవచనం - 45*
*జాతీయ కార్యాన్ని కొన సాగించటానికి రెండు మార్గాలు న్నాయి. రాజ్యాధికారం ద్వారా చేసేది ఒకటి. ప్రజల మనస్తత్వాలను మార్చటం ద్వారా జరిపించేది రెండవది. సంఘ్ రెండవ మార్గాన్ని ఎంచుకున్నది.*
*- పరమ పూజనీయ శ్రీ గురూజీ*
*(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వితీయ సర్ సంఘచాలక్)*
*అమృతవచనం - 48*
*నిజమైన శాంతి, గౌరవ ప్రతిష్ఠలను పొందడానికి అజేయమైన జాతీయ శక్తిని నిర్మించటమే ఏకైక మార్గమని ఇప్పటికైనా మనం గుర్తించాలి.*
*అప్పుడు మాత్రమే మనం ప్రపంచానికి ప్రబోధించే గొప్ప సిద్ధాంతాలకు విలువా, ప్రతిష్టా ఏర్పడుతాయి. బలహీనుని యొక్క తత్త్వబోధన ఎంతటి ఉదాత్తమైనదైనా ప్రపంచం వినదు.. ప్రపంచం శక్తిని మాత్రమే ఆరాధిస్తుంది.*
*అమృతవచనం - 49*
*ఆచరణయోగ్యంగా, వాస్తవంగా ఉండేట్టు జాతియొక్క ప్రవర్తనను నిర్దేశించే మార్గంలో నడిచినప్పుడే, మహత్తర జాతిగా మళ్ళీ మనం నిలబడగలుగుతాం. అందుచేత మన ప్రయత్నాలన్నీ ఒక అజేయమైన జాతీయ శక్తిగా రూపొందే నిర్మాణమార్గంలో జరగాలి. దానికిగాను జాతీయ చైతన్యం పొంది అనుశాసనబద్ధంగాను, సమన్వయభావంతోను జీవిస్తూ, అజేయము, ప్రబలమైన ఒక జాతిగా రూపొందడానికి కావలసిన శిక్షణ మన ప్రజలకు ఇవ్వాలి. ఈ ప్రపంచంలో వైభవ సంపన్నమైన స్వతంత్ర జాతిగా జీవించే పరమాధికారం పొందడానికి మార్గం ఇదొక్కటే...*
*అమృతవచనం - 64*
*ప్రపంచంలోని ఏ శక్తి కన్నెత్తి చూడజాలనంతటి శక్తిశాలిగా మన హిందూ సమాజాన్ని మనం సంఘటితపరచాలి".*
*అన్నింటినీ మించిన ప్రముఖ కర్తవ్యం ఇది; మహత్తరమైన ఈ సమాజ సంతానం అంతటిమీదా ఈ బాధ్యత ఉంది.*
*- పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ జీ*
(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆద్య సర్ సంఘచాలక్)
*అమృత వచనం - 52*
*"మాతా భూమిః పుత్రోహమ్ పృథివ్యాః"*
*భావార్థం ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను...అని.*
*ప్రతి ధూళికణంలో దివ్యత్వాన్ని నింపుకున్న ఈ భూమి మనకు శ్రద్ధా కేంద్రం మరియు పరమ పవిత్రము..*
*మాతృభూమి పట్ల భక్తి జగన్మాత యెడల ఉదాత్త భక్తి ఒక్కటే అనే తలంపును ఈ భావన ప్రతి హృదయంలో రగిలిస్తుంది.*
*మన దేశం మనకు జీవం లేని ఒక జడ పదార్థం ఎన్నటికీ కాదు కానేరదు... నీచుడు ఉన్నతుడు అనే తేడా లేకుండా మనందరకు ఈ భూమి ఎల్లప్పుడూ చైతన్య పూరితమైన జగజ్జననియే...*
*అమృతవచనం - 66*
*ఆలోచనా పద్దతుల్లో, జీవన మూల్యాలను నిలబెట్టడంలో, వ్యక్తికి పరిపూర్ణ జీవితాన్ని కల్పిస్తూ, తత్ఫలితంగా జాతి కూడా పరిపూర్ణతను సమకూర్చే వివిధాంశాల పరస్పర ప్రాముఖ్యతను తగురీతిగా విశ్లేషణ చేసుకోవటంలోనూ, సమగ్రమైన సింహావలోకనం ఈనాడు అవసరం.*
*ఇది లేకపోవడమే, విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యానికి, మన సాంఘీక దోషాలన్నిటికీ కూడ ముఖ్యకారణం. ఈ ఒక్క సమస్యనూ, మనం మొత్తం నుండి విడదీసిదాన్నే సరిచేయడానికి ప్రయత్నిస్తే ప్రయోజనం ఉండదు. ఇట్టి పునర్నిర్మాణ కార్యక్రమం, మిక్కిలి శ్రద్ధతో, వెనువెంటనే ప్రారంభించకపోతే, ఇతర పరిష్కార మార్గాలు కేవలం, పైపై మెరుగులుగాను, నిష్ప్రయోజకాలుగాను ఉండిపోతాయి.*
*అమృతవచనం - 69*
*సంఘం కృషిచేస్తున్నటువంటి సంపూర్ణ రాష్ట్రీయ పునఃసంఘటన భావన సాక్షాత్కరించుకోటానికి రాజకీయేతర కృషి సహజంగా అవసరమౌతుంది.*
ఇందుకూ, ఒక రాజకీయ పక్షం సమాజంలో ఒక స్వల్పాంశానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించగలదు. అంతేగాక జాతీయ సమైక్య భావన అనేది ఎన్నికల ద్వారా గాని, రాజకీయ ప్రచారాలవల్ల గాని సాధ్యపడదు. రాజకీయ పద్ధతులు ఆ మాటకు వస్తే రాజకీయాధికారం కూడా - ప్రజల్లో భక్తి భావనను, సాహసాన్ని, శీలాన్ని, సామంజస్యాన్ని, త్యాగాన్ని ఏమాత్రం కల్పించలేవు..
*నిజానికి సువ్యవస్థితమై న సమాజజీవితానికి మూలాధారమైన భావనలు లేని రాజకీయ పక్షాలు....* పరస్పర శత్రుత్వానికి దిగజారి జాతివ్యవస్థనే నాశనం చేస్తాయి...
మన జాతి శతాబ్దాల పాటు బానిసత్వంలో మగ్గడానికి ముఖ్య కారణం ఇదే....
*అమృతవచనం - 71*
*హిందువులందరూ సామూహికంగా ప్రతి దినం ఉదయం సాయంత్రం పది నిమిషాల పాటు ప్రార్థన చేస్తే వారు అజేయమైన శక్తిగా రూపొందుతారు.*
*- సోదరి నివేదిత*
*అమృతవచనం - 75*
*సంఘటన కార్యవ్యవస్థకు సంబంధించినంతవరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏ ఒక్క వ్యక్తినీ గురువుగా భావించలేదు. మన శాస్త్రాలు గురువు యొక్క లక్షణాలను ఉజ్వల పదజాలంతో ప్రశంసించాయి. గురువునకు సాక్షాత్తూ దైవంతో సమానమైన స్థానాన్నిచ్చాయి. అట్టి గురువును ఒక మానవునిలో చూడగలగటం దాదాపు అసంభవం. ఏ మానవుడైనా ఏదో ఒక దోషంగానీ, లోవంగానీ లేకుండా పరిపూర్ణుడిగా వుంటాడని మనం ఊహించలేము. మానవునిది అశాశ్వతమైన అస్తిత్వమే. అతని తరతరాలకూ, ఒక జాతికంతకూ శాశ్వతమైన మార్గదర్శకుడు కాలేడు..*
*అందుచేతనే సంఘంలో మనం మన జాతీయ వారసత్వంలోని మహోన్నతమూ,* *మహోదాత్తమూనైనదంతనూ ఒక్కుమ్మడిగా ప్రతిబింబించగల ఒక ప్రతీకను గురువుగా స్వీకరించాం. అదే మన పవిత్ర మైన భగవాధ్వజం.*🚩🚩
*అమృతవచనం - 78*
*హిందూ సమాజాన్ని సమైక్యంగాను, సంఘటితంగా శక్తిశాలిగాను ఉంచవలసిన బాధ్యత ఎప్పటివలెనే ఈనాడు కూడా మన మీదున్నది. మాతృదేవతగా మనం భావించే ఈ హిందూ సమాజాన్ని శక్తివంతము, శ్రేష్ఠము, సౌఖ్యయుతముగా చేయడం మన ధర్మం. మన తోటి హిందువుల పట్ల మన హృదయాల్లో నిండిఉన్న ఈ ప్రేమ, భక్తి భావనలు, మనజాతిమీద మనకుండే విశ్వాసాలే మనకార్యానికి నిరంతర ప్రేరణనిస్తున్నాయి.*
*మనకు ఆధారశిలైన హిందుత్వం ప్రతిక్రియాభావన లేనట్టి స్వచ్ఛం, సర్వగ్రాహకమునైన ప్రేమను మనలో పెంపొందిస్తుంది. ఇట్టి పరంపరలో పుట్టి పెరిగిన సంఘం స్వయంసేవకులమైన మనం క్రియచేస్తామేగాని, ప్రతిక్రియగాదు. క్షణికమైన శీతోష్ణాలకు ప్రతిక్రియను ప్రదర్శించడం ఆల్ప వస్తువులకు సహజం. కాని ఆరోగ్యంగా జీవించే మనుషులు వాతావరణం యొక్క వెర్రివికారాలకు చలించరు.*
*అమృతవచనం - 80*
వ్యక్తిగతమైన మంచితనం, పవిత్రశీలం అనేది జాతీయ కార్యంలో పూర్తిగా వినియోగపడాలి. *పేరు ప్రతిష్టలనుగాని, మరే విధమైన ప్రతిఫలంగాని ఆశించని సర్వస్వార్పణభావంగా మన క్రియాశీలత అనేది రూపొందాలి.*
మనం సేవించే ప్రజలు మనలను ప్రశంసిస్తున్నారా...?? లేదా..??
అని ఆలోచించకూడదు. నిజానికి వాళ్ళు ప్రశంసింపకపోవడమే మేలు. ప్రజల పొగడ్తలు అనే బంధంనుండి అప్పుడే మనం బయటపడగలం. లేకుంటే అదే మనలను ఏదైనా అవాంఛనీయకార్యానికి కట్టిపడేస్తుంది.
*జాతియే మన ఇష్ట దైవం. హిందూ చింతనతో రాష్ట్ర పరమేశ్వరుని ఆరాధిస్తున్నామనే భావనతోనే మన సర్వస్వాన్ని సమర్పించాలి.*
*- పరమ పూజనీయ శ్రీ గురూజీ*
*దేశభక్తి గీత్ - 86*
*సంఘటనా కార్యంలో చేతనాశక్తి ఎవరు అని ఆలోచిస్తే దానికి మనిషి అని తెలుస్తుంది. ఇలాంటి మనిషినే సంఘంలో స్వయం సేవక్' అంటారు. కొన్ని విశేష కారణాల వల్ల స్వయంసేవక్ కే ఇంకొక పదం కూడా చేర్చుతుంటాము. ఆ పదమే "కార్యకర్త"...ఇలాంటి స్వయం సేవక్ కార్యకర్తే మన పనికి చైతన్య శక్తి....*
*- మాననీయ శ్రీ సురేష్ రావు కేత్కర్*
*అమృతవచనం - 93*
*సంఘం అన్నీ చేస్తుంది, సంఘం ఏమీ చేయలేదు-అన్నమాట చెప్పబడుతూ ఉండేది. సంఘం అన్నీ చేస్తుంది అన్నమాటకు అర్థం ఏమిటంటే-తగినంతగా శక్తిని మేల్కొల్పటంద్వారా సంఘం ఈ సంపూర్ణ సమాజంలో అవసరమైన మార్పు తీసికొనివస్తుంది.*
*సంఘం ఏమీ చేయదు అనే మాటను తాత్కలిక పరిస్థితులను బట్టి, మనకు ఉండే హద్దులు, పరిమితులు బట్టీ చెప్పటం జరుగుతుంది.*
*ప్రభావవంతమైన సంఘటనను నిర్మించకుండా, సమాజంలోని వివిధ రంగాలలో సంఘం చేయగలిగింది ఏమీ ఉండదు-ఈమాట చాలా స్పష్టంగా గ్రహించుకోవాలి.*
*అమృతవచనం - 100*
*ఈ భూమికి సంతానమయిన హిందువుల్లో సంఘటితం, సమైక్యమునైన జీవితం లేకపోవటమొకటే-ఆనాడు ఒక వేయి సంవత్సరాలక్రిందట, ఈనాడు వేయిసంవత్సరాల తర్వాతకూడ - మన జాతీయ దురవస్థకు మూలకారణం.* *కార్యకారణ నియమానికి దేశకాల నిబంధనలు లేవు. మన జాతీయ జీవనంలో సంభవిస్తున్న ఇట్టి కఠోర సత్యానికి గత వేయిసంవత్సరాల చరిత్రలోని ప్రతిపుటకూడ *మూగసాక్షిగా నిలిచి ఉన్నది..*
*చరిత్ర నుండి మనం పాఠాలు నేర్చుకోకపోతే తిరిగి మళ్ళీ అదే చరిత్ర పునరావృతమవుతుంది.దేశ కాల సమస్యలన్నిటికీ హిందూ సంఘటనే పరిష్కారం...*
Comments
Post a Comment