ఫిబ్రవరి

*ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితచరిత్ర*
https://www.megamindsindia.in/2020/02/chatrapati-shivaji-maharaj-biography-in.html

*శివాజీ జయంతి దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి?*
https://www.megamindsindia.in/2019/06/hindu-samrajya-diwas-speech.html

*హిందూ పద పాదషాహి ఛత్రపతి శివాజీ*
https://www.megamindsindia.in/2020/06/about-hindu-smrajya-diwas-megaminds.html

*శివాజీ - రాజా ఛత్రసాల్*
https://www.megamindsindia.in/2020/06/about-raja-chatrasaal-in-telugu.html

*అఫ్జల్ ఖాన్ ని శివాజీ ఎలా వధించాడు*
https://www.megamindsindia.in/2020/11/who-killed-afzal-khan-megamindsi.html

*నేతాజీ పాల్కర్ ని పునరాగమనం చేసిన శివాజీ*
https://www.megamindsindia.in/2020/11/about-netaji-palkar-in-telugu-megaminds.html

*రాజా జయసింహునుకి శివాజి లేఖ*
https://www.megamindsindia.in/2020/03/shivajis-letter-to-raja-jayasimha.html

*శివాజీ ఆర్ధికవేత్త పరిపాలనా రహస్యాలు*
https://www.megamindsindia.in/2020/05/about-shivaji-maharaj-ruling-and.html

*శివాజీని హిందూ సమాజానికి దూరంచేసే కుట్రజరుగుతుందా?*
https://www.megamindsindia.in/2020/06/about-shivaji-and-hinduism-megamind.html

*శివాజీ స్వరాజ్యం నుండి సురాజ్యం దాకా*
https://www.megamindsindia.in/2019/04/telugu-books_19.html

*శివాజీ కొడుకు శంభాజీ తండ్రికి తగ్గకొడుకు*
https://www.megamindsindia.in/2020/11/about-chtrapati-sambhaji-in-telugu.html

ఫిబ్రవరి 19
వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ*🚩🚩🚩🚩🚩🚩

*హిందూ సామ్రాజ్యదినోత్సవం*

1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం.
శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన ప్రేమకలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. భారత, రామాయణ గాధలు చెప్పి వీరత్వం మొలకింపచేసింది. తన తండ్రి పొందిన పరాజయాలను అద్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ఠాతుడయ్యాడు. హిందూ సామ్రాజ్య స్థాపన యుద్ధం చేసి బీజాపూర్‌కు చెందిన ‘తోరణ’ దుర్గాన్ని స్వాధీనం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన అధీనంలో ఉంచుకున్నాడు.
శివాజీ మెరపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్దతులు తెలుసుకొన్న అప్జల్‌ఖాన్‌ శివాజీని అంత మొదించటానికి ప్రయత్నించినపుడు వ్యూహాత్మ కంగా తను దర్శించిన పులిగోర్లతో అప్జల్‌ఖాన్‌ పొట్ట చీల్చి సంహరించాడు. శివాజీ విజయాలతో మొఘల్‌ పాలకుడు ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. ఔరంగజేబు తన మేనమామ ‘పహిస్తాఖాన్‌ను శివాజీపై దాడికి పంపినా పరాజయంతో వెనుతిరగవలసి వచ్చింది. 1666లో ఔరంగజేబు కుట్రచేసి శివాజీని ఆగ్రాలో బందించినపుడు చాలా చాకచక్యంగా తప్పించుకొన్నాడు. 1674 నాటికి శివాజీ లక్ష సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు నావికాదళాన్ని ఏర్పాటు చేశాడు. వ్యక్తి నిర్మాణం ద్వారా సామాన్య వ్యక్తులలో అసాధారణ ప్రతిభను జాగృతం చేసి వారిని కుశలురైన నాయకులుగా తీర్చిదిద్దటం ఎలాగో చత్రపతి శివాజీ చూపించాడు. విజయమే మన ఆదర్శం కావాలని శివాజీ జీవితం తెలియజేస్తుంది.
హిందూ జీవన విధానంలో ఏ విషయాన్ని వివరించకుండా వదిలివేయలేదు, అది ఆహారం కావచ్చు విహారం కావచ్చు చివరికి యుద్ధం కావచ్చు. ప్రపంచంలో ఏ జాతికి యుద్ధ నియమాలు లేవు! మూకుమ్మడిగా దాడి చేసి, శత్రువును లొంగదీసు కోవడమే వారికి తెలిసిన ‘నీతి’. కాని కేవలం హిందువులు మాత్రమే సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు యుద్ధం చెయ్యాలి, వెన్ను చూపి పారిపోతున్న వ్యక్తిని చంపకూడదు, ముసలివారు, పిల్లలు, స్త్రీలను చంపకూడదు మొదలైన నియమాలను పాటించారు.

ఐతే ఈ నియమాలను ఎవరి విషయంలో పాటించాలి అన్న అంశంలో స్పష్టత లోపించడం వల్ల పృధ్వీరాజ్‌ చౌహాన్‌ 16 సార్లు ఘోరీని యుద్ధంలో ఓడించినప్పటికీ చంపకుండా వదిలివేసాడు. కానీ ఒకే ఒక్కసారి ఘోరీ గెలిచి నప్పుడు మాత్రం పృధ్వీరాజుని బంధించాడు. అనేక హింసలకు గురి చేసాడు. ప్రజల్ని హింసించాడు, దోచుకున్నాడు.

హిందూ జాతికి తురుష్కుల నుంచి వచ్చిన ఆపదను అర్థం చేసుకోవడం, ఆ ఆపదను ఒక విస్పష్టమైన పద్ధతిలో ఎదుర్కోవడం వల్ల అత్యంత క్లిష్టపరిస్థితులలో శివాజీ కూడా హిందూ సామ్రాజ్యాన్ని విజయవంతంగా నిర్మించగలిగాడు.

ఆలోచనాపరమైన ఈ వ్యత్యాసం నేటికీ హిందూ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏ మతం ఏమి చెపుతోందో, ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో తరచి చూసుకోకుండా అన్ని మంచినే బోధిస్తాయి, అవి అన్నీ ఒకటే అన్న విపరీత ధోరణి వల్ల వాటినుంచి వస్తున్న దాడులను అర్థంచేసుకుని, ఎదుర్కొనడంలో హిందూ సమాజం విఫలమవుతోంది.
ఈ రకమైన వివేచనారహిత ఆలోచనా విధానం స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది. ఐతే రామజన్మభూమి ఉద్యమం తరువాత హిందువులలోని ఈ ఆత్మహత్యాసదృశమైన ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది.దాని ఫలితం మనం చూస్తూనే ఉన్నాము. కాని పూర్తి మార్పు ఇంకా రావాల్సి ఉంది. అది వచ్చిన రోజునే శివాజీకి నిజమైన వారసులమని చెప్పుకోగలం. దీనిని సాధించడానికి ప్రతి వ్యక్తి తనంత తానుగా సమయం, శక్తిసామర్థ్యాలను ఉపయోగించాలి. అప్పుడే ‘స్వరాజ్యం’, ‘సురాజ్యం’ సాధ్యమవుతాయి.

పవిత్ర మహా భారతాన దండెత్తి,
హిందూ స్త్రీలను చంపి,
హిందూ ఆలయాలు కూల్చి
హిందూ ఆస్తులు లూటీ చేస్తున్న
ఆ తురష్క సైన్యంని చూసి
రోధిస్తున్న తల్లి భారతావనిని చూసి
నేనున్నా తల్లి అంటూ రివ్వున యుద్ధ రంగంలో
దూకి శత్రువులను చండాడిన కొదమ సింహం
అదిగో...అదిగో.. హైందవ వీరుడు ఛత్రపతి శివాజీ.....

జిజియా భాయ్ కడుపున పుట్టి
భారత మాత ఒడిలో పెరిగి
చిన్న నాటే కత్తి పట్టి మాతృ దేశ రక్షణకు
పరుగులు తీసిన నడిచే చుర కత్తి
అదిగో అదిగో అదిగో ....మారాట రక్తం వీర శివాజీ

పదిహేడవ ఏట రాజ్య భారం ఎత్తి
తురక పాలకులకి చుక్కలు చూపించి
తొర్న రాజ్ ఘడ్ కోటలను చుట్టుముట్టి
అఖండ హిందూ సామ్రాజ్య శంకుస్థాపన చేసిన
శత్రు భయంకరుడు... విశాల ప్రేమ హృదయుడు
అదిగో అదిగో అదిగో హిందువుల ఊపిరి "వీర్ శివాజీ".

బీజాపూర్ తురకలను - నిజాం షాహీ సుల్తానులంను
తల పొగరు ఢిల్లీ మొగలయిలను
వెంటాడి - వేటాడి రణ రంగంలో తన నెత్తురు
పణంగా పెట్టి భరత మాత కన్నీళ్లు తుడిచిన
నిండు హైందవనికి నిజాస్వరూపం
అదిగో అదిగో అదిగో హైందవ సింహం వీర శివాజీ....

తురస్కుల పాలనలో.. హైందవుల మరణాలకు
హిందూ ఆలయాల ధ్వంసాలకు సోమనాథ నిలువెత్తు సజీవ సాక్ష్యం....

తెల్ల దొరల పాలనలో విదేశాలకు తరలించ బడ్డ
హైందవ జాతి సంపూర్ణ సంపదలకు బ్రిటిష్ రాణి నెత్తినున్న కోహినూరే సాక్ష్యం....

మన జాతి సంపూర్ణ హత్యకు తెల్లోళ్లు పన్నిన కుట్రకు వారి విడకొట్టు పాలించు సిద్దాంతం సాక్ష్యం....

మన సాంప్రదాయ హత్యలకు వారి చేతిలో వక్రీకరించబడ్డ వేద సంపద కు సాక్ష్యం.......

అంతా బానే ఉందా?? 
నువ్వు ఉన్న కాలేజి, స్కూల్ బావున్నాయి.. ఏ గొడవలు లేవు, ప్రశాంతంగా ఉంది!!

నువ్వు ఉన్న ఊరు బావుంది ఏ గొడవలు లేవు!! మతం పేరుతొ!!

నువ్వు ఉన్న కుటుంబం బావుంది ఏ గొడవలు లేవు!! మంచిదే....

కాని నువ్వు చూస్తున్నది! నీకు కనబడుతుంది! దేశంలో ఎంత??

దేశంమొత్తం ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా?? 

నీకు పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తుందా??

నీ కంటి చూపు ఒక కిలో మీటరు లోపే చూపిస్తుంది.. మరి దాని తర్వాత?? ఎం జరుగుతుందో నీకు తెలుస్తుందా???

నువ్వు మీ చుట్టుపక్కల చూస్తున్న ప్రశాంతత ఆకాశం,అది లేదు. 
ఉన్నట్టు భ్రమ పడుతున్నావు..

నువ్వు చూడకుండా ఉన్న సమస్యలు నీ చుట్టూ ఉన్నాయి.. 
అవి గాలి లాంటిది.. 
నువ్వు చూడలేవు..నీ చుట్టూ ఉన్న సరే...
మతం పేరుతొ నీదేశ సంస్కృతిని నాశనము చేస్తున్నాయి..

నేను గమనించా... 
అందుకే అందరికి మనదేశ సంస్కృతి, పూర్వవైభవం గూర్చి చెప్తున్నా...

దేవుడు పేరుతొ, మతం మాయలో భారతీయ సంస్కృతి ని మర్చిన ఓ భారతీయుడా తెలుసుకో..
 నీ జాతి వైభవాన్ని...

దైవం కంటే దేశం గొప్పది...
దేవుడి పేరుతొ నిన్ను నీ దేశం నుండి.. దేశం నుండి నిన్ను వేరు చేస్తున్నారు...

రత్నాలు రాసులుగా పోసిన ఈ నెల నీదే..

ప్రపంచపు మొదటి విశ్వవిద్యాలయం నీదే..

ప్రపంచపు మొదటి రిజర్వాయర్ నీదేె..
విశ్వ విజేత అనుకున్న అలెగ్జాండర్ ని మైమరిపించిన దేశం నీదే...

తెలుసుకో నీ జాతి గొప్పతనం... భారతీయుడా మేలుకో.......

చూడరా ...చూడరా...ఓ హిందువా
ముక్కల చెక్కలైన నిలువెత్తు అఖండ హిందూ భారతం ..... ..

కుల కొట్లాటల్లో మగ్గి మగ్గి
మత మార్పిడీల్లో సర్వం కోల్పోతున్న తల్లి భారతి కన్నీళ్లు చూడు .... ఓ హిందూ సోదరా.....

నాడు కాశ్మీరున రోధిస్తున్న తెగిన తలలు నీ సోదరులవే
కేరళలో చినిగిన దుస్తులతో రోధిస్తున్న ఆ స్త్రీ మూర్తులు --- నీ అక్క చెల్లెల్లె.....

బెంగాలును బీహారున,కేరళ న నేలకోరుగుతున్న ఆ ప్రాణాలు నీ హిందూ రక్తాలవే......

మేలుకో!..
 ఓ హిందూ సోదరా....

నువ్వొక వీరశివాజీ వై
నువ్వొక ప్రియ భారత ముద్దుబిడ్డవై
తిరగబడు తిరగబడు --- నువ్వొక ఛత్రపతి వై.....

నాడు అస్తమించిన ఛత్రపతిని నేడు
నీలోపల ఉదయింపజెసి
తల్లి భారతి కన్నీళ్లు తుడవాల్సిన అత్యవసర సమయం ఇది....

అటు చూడు యరుపుల చేతుల్లో నెల కోరుగుతున్న
నీ భారత జాతి కీర్తి కిరీటం.

ఇటు చూడు ఆ సెక్యులర్ల చేతుల్లో నెలకోరుగుతున్న
నీ హైందవ జాతి చిహ్న ఆలయాలు.

నిండా వక్రీకరించిన భారత జాతి చరిత్రను
తిరగ రాసే వీర శివాజీ నువ్వే ......

బిగిసిన పిడికిలితో
ఉడికిన నెత్తురుతో
కదన రంగాన నిన్ను నువ్వు మరో శివాజీ లా నిలిపే
అత్యద్భుత అవకాశం.....

హిందూ సోదరా.... రా...
నీ కోసం ఎదురుచూస్తుంది భారత మాత.....
ఇంకో శివాజివై దేశ రక్షణ నీ బాధ్యతగా తిరగబడు

హిందూ సోదరా....రా....
ని రాకకై ఎదురు చూస్తోంది అఖండ హైందవ సైన్యం
ఇంకో వీర శివాజీ వై రా...
తల్లి భారతి కోసం... హైందవ జాతి కోసం....

శివాజీ చేతిలో కత్తి- నీ సంకల్పం ఒక్కటే అవ్వాలి...

గుర్తించుకో---->

యుద్ధం బెదిరె శబ్ధం శివాజీ
హిందువు ఒంట్లో రక్తం శివాజీ
ఖడ్గం చివర పదును శివాజీ
హిందుత్వానికి జవాబు శివాజీ
దేశ మాత రక్షణకు తొలి జవాను శివాజీ
ఇప్పుడు తిరగబడ్డ నువ్వే ఒక వీర శివాజీ.....

జై భవాని!... వీర్ శివాజీ!!..... జై భారత్ మాత!!!

*🙏సకల సుగుణాల కలబోత- జన హృదయ నేత- ఛత్రపతి శివాజీ మహారాజ్🚩*

ఉద్యమం సాహసం ధైర్యం బుద్ది శక్తి పరాక్రమా
షడైతే యత్ర వర్తంతే తత్ర దేవేతరో జనా 
అంటే... ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ది, శక్తి, పరాక్రమాలనెడి ఆరు గుణాలు ఎవరికుంటాయో అటువంటి వారికి దేవుడు కూడా సహకరిస్తాడని ఈ సుభాషితం యొక్క అర్థం.
ఈ సుభాషితం లో గల ఆరు సుగుణాలు కలబోసి వీరుడిగా ఎదిగి ఛత్రపతిగా హిందూ హృదయ సామ్రాట్ గా నిలిచాడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్.
శివాజీలో గల ఈ ఆరు గుణాలను ఒకసారి విశ్లేషించుకుంటే...

*ఉద్యమం* 
తను రాజు గాకున్నా తన 14ఏళ్ళ వయసునుండే స్వరాజ్య సాధన కోసం కొండ కోనల్లో నివసించే మావళీలు అనే గిరిజనులను దేశ భక్తులుగా మలచి మొఘలులపై పోరాటానికి ముందు నడిపిన మహా ఉద్యమకారుడు మన శివాజీ.
*సాహసం*
ఆగ్రా కోటలోకి దౌత్యం పేర పిలిచి కుయుక్తి తోడ తనను బంధించిన ఔరంగజేబు ను బోల్తా కొట్టించి దుర్భేద్యమైన కోటనుండి తప్పించుకుని ఆగ్రా నుండి విస్తార మొఘలు సామ్రాజ్య అధినేతల తప్పించుకుని పూణె వరకు చేరుకోవడంలో శివాజీ యొక్క సాహసం మనకు కనబడుతున్నది.
*ధైర్యం*
పూణె కోటను యశ్వంత్ అనే ఉడుము సహాయంతో 125 అడుగుల ఎత్తున్న కోటను ఎక్కి అసమాన ధైర్యంతో శయిస్తాఖాన్ ను ఎదుర్కొని వాడు గోడ దూకి పారిపోతుంటే వాని వేళ్ళు నరకడం శివాజీ ధైర్యానికి నిదర్శనం.
*బుద్ది*
బాహుబలంతో పాటు బుద్దిబలం కూడా తోడైతే అత్యంత బలవంతున్ని సైతం మట్టికరిపించ వచ్చని శివాజీ నిరూపించిన ఉదంతం మనకు అఫ్జల్ఖాన్ వధ ఉదంతం తెలియజేస్తూంది. అఫ్జల్ఖాన్ తన రాజ్యంలోకి చొచ్చుకుని వచ్చి ఎన్నెన్నో రాక్షస కృత్యాలు చేస్తున్నా తనకు అనుకూలమైన చోటుకు అఫ్జల్ వచ్చేదాకా వేచి చూసి, భయపడ్డట్లు నటించి, వానిని పొగిడి, బీజాపూర్ నుండి 1200కిలోమీటర్ల దూరం 28రోజులు ప్రయాణింప జేసి ప్రతాప్ ఘడ దాకా రప్పించి వాని ఎదుటకు నిరాయుధునిగా వెళ్లినట్లు నటించి యుక్తితో అఫ్జల్ఖాన్ ను వధించిన కుశాగ్రబుద్ది శివాజీది.
*శక్తి*
యశాజీ కంక్, తానాజీ మాల్సురే,నేతాజీ పాల్కర్, సూర్యాజీ మాల్సురే,కొండాజీ కంక్,బాజీభీడె వంటి ఎందరెందరో మావళీలను శక్తివంతమైన ప్రమధగణాలుగా మలచిన ధీశాలి మన శివాజీ. 
*పరాక్రమం*
అవసరమైతే మూడడుగులు వెనక్కివేసి శతృవును గురిచూసి వేటాడిన పరాక్రమశాలి శివాజీ.
ఇలా ఈ ఆరుగుణాలు పుణికిపుచ్చుకుని భవానీ మాత ఇచ్చిన ఖడ్గంతో వీరవిహారం చేసి హైందవ సామ్రాజ్య స్థాపన చేసిన మహావీరుడు మన శివాజీ.
ఇవే కాకుండా ఇతర సుగుణాలను కూడా శివాజీలో మనం చూడవచ్చు.
*జట్టుభావన* 
ఒక పని సఫలం కావాలంటే తానొక్కడే కాక అందరినీ కల్పుకపోతే జట్టుభావన తొ విజయం సాధించవచ్చని శివాజీ నిరూపించాడు. అందరిలో స్వరాజ్య భావన జాగృతము చేసాడు. కొండ ప్రాంతాలలోని మావళీలను, కొంకణ తీరంలోని కోలీలను, మైదాన ప్రాంతాల్లోని భండారీలను,సామాన్యులను,సంపన్నులను,అధికార వర్గాల వారిని చేరదీసాడు.ఆధ్యాత్మిక గురువులు రామదాసు, తుకారాం వంటివారి ఆశీస్సులు అందుకున్నాడు.తనను వ్యతిరేకించే సర్దార్లను ఓపికగా తనవైపు తిప్పుకున్నాడు.స్వరాజ్యభావన అందరిలో జాగృతం చేసి భవ్య హైందవ రాజ్య నిర్మాణం గావించాడు.
*ప్రచండ దేశభక్తి* 
చిన్నప్పటినుండి తల్లి ఉగ్గుపాలతో నూరిపోసిన దేశభక్తి కారణంగా తన తండ్రితో బీజాపూరు సుల్తాను కొలువుకు వెళ్ళినపుడు సుల్తానుకు వంగి సలాము చేయకపోవడం, ఎక్కడ కూడా మొఘలులకు లొంగకుండా వారిని జీవితాంతం ఎదిరించి బతకడం, బాల్యంలోనే కోటను ఆక్రమించి భగవాధ్వజం ఎగరేయడం,
ఇంకోసందర్భంలో ... శివాజీ యొక్క స్వరాజ్య నాణాలను తమ టంకశాలలో ముద్రిస్తామని ప్రతిపాదిస్తే దాన్ని తిరస్కరించి రాజ్యంలో నకిలీ నాణాల చలామణి గాకుండా అడ్డుకున్నాడు. ఇలా అణువణువునా శివాజీలో ప్రచండ దేశభక్తి ప్రతిధ్వనిస్తుంది. 
*ఆదర్శ పాలకుడు*
శివాజీ కి తన తండ్రి నుండి మావళ ప్రాంతంలోని ని కేవలం 36 గ్రామాలు మాత్రమే వారసత్వంగా లభించాయి అదే తర్వాత ఒక భవ్య సామ్రాజ్యం గా విస్తరించింది తన పనుల ద్వారా వ్యవహార శైలి ద్వారా అధికారం వ్యవస్థలను ఎలా నిర్వహించాలి అనేది చేసి చూపించాడు బంధుప్రీతి దూరం పెట్టాడు సుమారు మూడు వందల కోటలు తన దగ్గర ఉన్నా ఏ ఒక్క కోటకు కూడా తన బంధువులను అధిపతిగా చేయలేదు తన 30 సంవత్సరాల పాలన కాలం మొత్తం పాలనా వ్యవస్థను సృష్టించి వికసింప చేయడంలోనే గడిపారు ఆయన యుద్ధాలకు ముందు తరువాత సమయాన్ని పాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో వెచ్చించారు అష్ట ప్రధానులు అనే పేర మంత్రులను నియమించి ఆర్థిక శాఖ ఆనాడే ఆర్థిక శాఖ హోం శాఖ వ్యవసాయ శాఖ న్యాయశాఖ విదేశీ వ్యవహారాల శాఖ శాస్త్ర సాంకేతిక శాఖ రోడ్లు సముద్రయాన శాఖ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భాషా సాంస్కృతిక శాఖ రక్షణ శాఖ ప్రజా సంబంధాల శాఖ అడవులు పర్యావరణ శాఖ అంటూ ఇలా వివిధ భాగాలుగా పాలనను వర్గీకరించి సుపరిపాలన అందించి ఆదర్శ పాలకునిగా నిలిచారు

*ఆర్థిక వ్యవహారాలు* *క్రమశిక్షణ* 
శివాజీ ఆర్థిక వ్యవహారాల కు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు ఒక సందర్భంలో వివిధ మంత్రిత్వ శాఖ లా ఆర్థిక వ్యవహారాలను తెలుసుకున్నప్పుడు దేశ్ కులకర్ణి అనే ఆర్థిక అధికారిని ముందరి రోజు లావాదేవీలు లెక్కలు పూర్తయ్యాయా? అని ప్రశ్నించారు దానికి అధికారి లేదు అని సమాధానమిచ్చాడు అంతేకాదు అలా చేయలేక పోవడానికి గల కారణాలు కూడా ఆ అధికారి తెలియజేశాడు శివాజీ ఈ బాధ్యతారాహిత్యానికి కఠిన క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు మరోసారి తన సైన్యాన్ని తనిఖీ చేస్తుండగా ఒక అధికారి ఒక గుర్రం యుద్ధంలో గాయపడి కుంటిది అయిపోయింది అని కాబట్టి దాన్ని అమ్మేందుకు అనుమతి కావాలి అని కోరారు శివాజీ అనుమతిచ్చారు కొద్ది నెలల తర్వాత అధికారి వేరే పనిమీద శివాజీ ని కలిశారు ఆయన్ని చూడగానే శివాజీ ఆ గుర్రాన్ని అమ్మేశారా? అని అడిగారు ఆ అధికారి అమ్మినట్లు చెప్పగానే ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఖాతాల్లో జమ చేశార అని మరో ప్రశ్న వేశారు ఇలా ఆర్థిక రంగంలో అతి చిన్న విషయాలను కూడా పర్యవేక్షించడం ఆయన ఆర్ధిక క్రమశిక్షణ నిజాయితీకి నిదర్శనం

*పన్నుల విధానం*
నేడు ప్రపంచ వాణిజ్యంలో కానీ ఉత్పాదనలను కాపాడేందుకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలను దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అధిక పన్ను విధించడం వంటివి శివాజీ ఆనాడే చేశారు ఒకసారి గోవా నుంచి వచ్చిన పోర్చుగల్ వ్యాపారులు తాము తెచ్చిన ఉప్పును తక్కువ ధరకే రాజ్యంలోని స్థానిక మార్కెట్లలో అమ్ముతున్న విషయం శివాజీ దృష్టికి వచ్చింది తక్షణమే శివాజీ పోర్చుగీసు వారి ఉప్పు పై అధిక పన్ను విధించి స్థానిక ఉప్పు తయారీదారులకు రక్షణ కల్పించారు. అదేవిధంగా స్వరాజ్యం లో భూమిశిస్తు వంటి పన్నుల సేకరణలో ప్రజలను భాగస్వాములుగా చేశాడు ఇలాంటి చర్యల కారణంగా శివాజీ స్వరాజ్యాన్ని ప్రారంభించినప్పుడు అసలు ఖజానా లో డబ్బే లేకున్నా తాను ప్రపంచాన్ని వదిలి వెళ్లే నాటికి ఖజానాలో తొమ్మిది కోట్ల రూపాయల వరకు ఉన్నాయి
గుర్రాల వ్యాపారం నుండి ఉప్పు వ్యాపారం దాకా మందు గుండు నుండి యుద్ధనౌక ల దాకా శివాజీ నైపుణ్యములను, ప్రక్రియలను దిగుమతి చేసుకోవాలని భావించారు కానీ ఉత్పత్తులను పరికరాలను కాదు

*స్వదేశీ తయారీ* 
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్వదేశీ విధానం లోకల్ ఫర్ వోకల్ విధానం నాడే శివాజీ ఆచరించి చూపారు. ఆయన రాజ్యంలో  రాజ్యానికి అవసరమైన పరికరాలు వస్తువుల తయారీ కోసం పద్దెనిమిది ఫ్యాక్టరీలు ఉండేవి ఒకసారి మంచి మందు గుండు సామాగ్రి కోసం ఇంగ్లాండ్ వారి సహాయం అడిగితే జాప్యం చేశారు దాంతో ఫ్రెంచి వారి సహకారంతో పురంధర్ లో లో ఒక ఫిరంగి గుళ్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు ఇందులో తయారయ్యే ఫిరంగి గుళ్ళు స్థానికంగా దొరికే ఇనుము కంచు మిశ్రమ ధాతువులతో తయారయ్యేవి తద్వారా తన రాజ్యంలోని వనరులను తన రాజ్యానికి పరిమితం చేసి అనవసర దిగుమతులను నిరోధించి ఉపాధి కల్పన ను పెంచి స్వావలంబన ఆత్మవిశ్వాసాన్ని పెంచారు.

*విపత్తు సహాయం*
విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల
నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు కు విలక్షణ వ్యవస్థ ఉండేది ఎద్దు చనిపోతే ఇంకొక ఎద్దు ఇచ్చేవారు విత్తనాలు పోతే కొత్త విత్తనాలు ఇచ్చేవారు నాగలి వంటి పరికరాలు పోతే వస్తువులు ఇచ్చేవారు అంతేకానీ ధన సహాయం చేసేవారు కాదు ధన రూపంలో పరిహారం ఇస్తే అనవసర పనులకు ఖర్చు చేస్తారని భావించారు ఆ రోజుల్లోనే శివాజీ ప్రభుత్వ యంత్రాంగం ఇంతటి ఉన్నత స్థాయి ఆర్థిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించింది

స్వయంచాలిత రాజ్యవ్యవస్థ
శివాజీ ఆగ్రా ఖైదులో ఐదు నెలల పాటు గడిపిన, దక్షిణాది దండయాత్ర చేసినపుడు ఆరునెలలపాటు రాజ్యానికి దూరంగా ఉన్నా, మరోసారి దండయాత్రలో రెండేళ్లపాటు రాజ్యానికి దూరంగా ఉన్నా, ఆయన రాజ్య వ్యవస్థ లో పాలన మాత్రం లాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగింది. ఎక్కడ అసంతృప్తి తిరుగుబాటు అయోమయం లేకుండా చక్కగా నడిచింది

గూఢచర్య వ్యవస్థ 
శివాజీ గూడచారి వ్యవస్థ చాలా దూరం వరకు వ్యాపించి ఉండేది తన రాజ్యం సరిహద్దు బయట కూడా చాలా దూరం వరకు ఉండేది దీని కారణంగానే ఔరంగజేబు ఖైదు నుండి  తప్పించుకొని తన రాజ్యానికి చేరుకున్నాడు.

*పునరాగమనం ఘర్ వాపసీ*
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పునరాగమనం ఘర్ వాపసీ కార్యక్రమం శివాజీ అలనాడే చేశాడు తన కుడి భుజం నేతాజీ పాల్కర్ ను ఔరంగజేబ్ పంపిన రాజా జయసింగ్ ప్రలోభపెట్టి కూలి ఖాన్ గా మత మార్పిడి చేయించాడు కులీ ఖాన్ గా మారిన పాల్కర్ ను ఔరంగజేబు ఆఫ్ఘనిస్తాన్లో సైనికాధికారిగా నియమించాడు శివాజీ పట్టాభిషేక సమయంలో దక్షిణాదిపై దండయాత్రకు దిలేరాఖాన్ కు తోడుగా శివాజీని బంధించడానికి కులీఖాన్ గా మారిన పాల్కర్ ను పంపుతాడు. అపుడు అక్కడిదాకా వెళ్ళిన పాల్కర్ మాయమై శివాజీ చెంతకు వచ్చి తనను క్షమించమని విలపిస్తే అతనిని క్షమించి 1676 జూన్19న శుధ్ధీకరణ గావించి తన దగ్గరి బంధువుల అమ్మాయినిచ్చి వివాహం చేసి తిరిగి సేనాధిపతి గా నియమించుకుంటాడు.

*వ్యవసాయం* 
శివాజీ పాటు పశుపాలనకు వ్యవసాయానికి ఆనకట్టకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు పూణేలోని ఓదా జలపాతం వద్ద ఒకటి కొంధ్వా వద్ద మరొకటి ఆనకట్టలు నిర్మించాడు యుద్ధాలు లేని సమయంలో వాన కాలంలో సైనికుల చేత కూడా వ్యవసాయం చేయించాడు 

*న్యాయ వ్యవస్థ*

తల్లి జిజియా మాత, గురువు అయిన దాదాజీ కొండదేవ్ ల నుండి నేర్చుకున్న విలువలను శివాజీ తన తీర్పులో చూపించేవాడు సంఘటనలను పూర్తిగా అవగాహన చేసుకొని సాక్ష్యాధారాలను పరిశీలించి విశ్లేషించి తీర్పులు చెప్పేవాడు దారుణాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించే వాడు.
ఒకసారి గ్రామ పెద్ద అధికార దుర్వినియోగం చేసి మహిళను బలాత్కరిస్తే ఆ గ్రామ పెద్ద యొక్క రెండు చేతులను నరికి వేయమని ఆజ్ఞా పించాడు. 
మరో సందర్భంలో తన తండ్రి మిత్రుని బంధువు ఖండొజీ ఖోప్దా రాజద్రోహానికి పాల్పడి అఫ్జల్ఖాన్ వైపు వెళ్లిపోతే అఫ్జల్ఖాన్ వధ అనంతరం ఖండొజీ యొక్క ఎడమకాలును, కుడిచేతిని నరికేలా ఆజ్ఞ ఇచ్చి తాను ఎటువంటి ఒత్తిడికి లొంగనని నిరూపించాడు.

విదేశీ వ్యవహారాలు
తన పొరుగు రాజ్యాలతో సంబంధాలునెరిపేటపుడు దౌత్యాన్ని, శక్తిని, యుక్తినీ సమపాళ్లలో ఉపయోగించేవారు శివాజీ. 
విదేశీశక్తుల ప్రవర్తనను నిశిత పరిశీలన జేసి అదునుజూసి దెబ్బ కొట్టెవాడు శివాజీ. ఆంగ్లేయులు పన్హాలా యుధ్ధంలో సిద్ధిజౌహార్ కు అనుకూలంగా పనిచేసి యూనియన్ జాక్ ఎగురవేయడం గమనించి తన సమయం రాగానే రాజ్ పూర్లో ఆంగ్లేయుల సరఫరాను ధ్వంసం చేసి వారు పరిహారం అడిగినా ఒక్క చిల్లిగవ్వకూడా చెల్లించలేదు.

*అద్భుత వ్యూహకర్త*
శివాజీ తన పథకాలను తన సైనికాధికారులకు ప్రభావవంతంగా, స్పష్టంగా, సంక్షిప్తంగా అవసరమైతే విస్తృతంగా విడమర్చి చెప్పేవాడు.
శత్రు రాజ్యాలపై దాడి చేసెపుడు అనూహ్యంగా మెరుపు దెబ్బ తీయడానికి అతి తక్కువ దూరం ఉన్న మార్గం ఎంచుకుని, అతి తక్కువ శక్తి ఉపయోగించేవాడు. ఒకసారి వాడిన వ్యూహం మరోసారి వాడక శతృవును అయోమయంలో పడేసేవాడు.

*దౌత్యం*
తన రాజ్య నిర్వహణ లో కూర్చోవడం, నడవడం, దౌత్య చర్చల ప్రారంభం, కొనసాగింపు వంటి ప్రతి చిన్న విషయం లోనూ ఎంతో జాగరూకత ప్రదర్శించేవాడు. ఒకసారి ఇంగ్లీషు ప్రతినిధులు తమ కరెన్సీ చలామణికి అనుమతి కోరితే వారికి అవును, కాదు అనకుండా నారాజ్యం ఏ కరెన్సీ వాడాలన్న విషయం భవిష్యత్ లో నా వ్యాపార వాణిజ్య రంగాలు నిర్ణయిస్తాయి అంటాడు. నొప్పింపక తానొవ్వక తప్పించుకోవడం ఇదే గదా!

*వాణిజ్యం*
శివాజీ తన పొరుగు రాజ్యాలతో బాటు సుదూర దేశాలతోనూ, మస్కట్ వంటి ముస్లిం దేశాలతో కూడా ఆత్మీయ వాణిజ్య సంబధాలు నెలకొల్పుకున్నాడు. వాణిజ్య పర నౌకాదళాన్ని ఏర్పాటు చేసి సముద్ర వాణిజ్యాన్ని పెంపొందించారు. కోట్లాది రూపాయలతో సింధుదుర్గం కోట నిర్మించి నౌకా దళానికి , ఆయుధ సామాగ్రికి కేంద్రంగా మలిచాడు.
శివాజీ తన జీవితకాలంలో పెద్ద వాణిజ్య సదస్సులు నిర్వహించకున్నా అద్భుత వాణిజ్యం కొనసాగించాడు.

*మానవతావాది*
శివాజీ డచ్ వారి పాలనలో ఉన్న భాగాల నుండి బానిసలని తీసుకెళ్లి విదేశాలకు అమ్మరాదని నిబంధన పెట్టేలా ఒప్పందం చేసుకుని రాజశాసనం కూడా జారీ చేయించిన గొప్ప మానవతావాది. ఆనాడు ప్రపంచంలో ఇలా చేసిన ఏకైక రాజు శివాజీయే.

*హేతువాది*
శివాజీ కాలంలో మూఢనమ్మకాల కారణంగా సముద్ర యానానికైనా, మందుగుండును ముట్టుకోవడానికైనా యోధానుయోధులు సైతం జంకేవారు. ఇలాంటి సమయంలో శివాజీ తాను స్వయంగా సముద్రయానం చేసేవారు మరాఠీ వీరులు మందుగుండు ముట్టుకోవడానికి భయపడితే ఆర్టిలరీ విభాగం బాధ్యతను ఇబ్రహీం ఖాన్ గడ్డి అనే వ్యక్తికి అప్పగించాడు ఇలా మూఢనమ్మకాలను వదిలించి శాస్త్రీయ ఆలోచన ముందు పెట్టిన నిజమైన హేతువాది శివాజీ.

*నౌకా విభాగం*
శివాజీ నౌకా నిర్మాణం ఆంగ్లేయుల కు కూడ ఆదర్శంగా నిలిచింది శివాజీ యొక్క సంగమేశ్వరి తరహా యుద్ధ నౌకలను ఆంగ్లేయులు రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించడానికి ఉపయోగించారు.
దౌలతఖాన్, మేనక్ భండారీ వంటి సమర్థులతో నౌకాదళంని తయారుచేసి ప్రత్యర్థులను ఎదిరించి సముద్ర జలాలపై ప్రభావాన్ని చూపించారు.

*కర్తవ్య పాలన*
తల్లి చనిపోయిన దుఃఖంలో ఉండి కూడా కర్మకాండలు నిర్వహిస్తూ కూడా పాలకుడిగా తన విధులను యధావిధిగా నిర్వర్తించిన అద్భుత కర్తవ్య నిష్ఠ పరాయణుడు మన శివాజీ

*భాషాభిమాని*
స్వరాజ్య నిర్మాణంలో పనిలో సొంతభాష లేకపోతే అది స్వరాజ్యమే కాదని ప్రకటించిన మాతృభాషాభిమాని శివాజీ. కేవలం ప్రకటనలకే పరిమితం కాక పండితులతో 1400 పదాల నిఘంటువును కూడా తయారు చేయించిన భాషా సేవకుడు శివాజీ

*రక్షణ శాఖ*
శివాజీ సైన్యం అత్యంత క్రమశిక్షణ తోడ నిబద్దత తో అద్వితీయ సాహసంతో ప్రపంచం లోని అత్యుత్తమ సైన్యంగానిలిచింది.
ఒకసారి పాకిస్తానుకు వెళ్ళిన పూణెకు చెందిన పర్యాటకులు పాకిస్తానీ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ ను కలుసుకొవాలని అనుమతి కోరిన మరుక్షణం అతడే ఎన్నో రోజులుగా నేను స్వయంగా మిమ్మల్ని కలుసుకొవాలనుకుంటున్నాను అంటూ... తాను బ్రిటన్ లొ సైనిక శిక్షణ పొందెటపుడు ప్రతాప్ ఘడ్ లో శివాజీ అఫ్జల్ఖాన్ను వధించిన వైనం తెలుసుకున్నప్పటినుండీ అంతటి గొప్ప యుధ్ధం చేసిన మావళీలు ఎలా ఉంటారో చూడాలనుకున్నాను అని చెబుతాడు. దీన్ని బట్టే శివాజీ సైనిక వ్యూహాలు నేటికీ ప్రపంచంలో ఎందరెందరికొ ఆదర్శమని చెప్పవచ్చు.
ఇవే గాకుండా పర్యావరణం, మహిళా సాధికారిత వంటి అనేక అంశాల్లో శివాజీ వ్యక్తిత్వం నేటికీ అనుసరణీయంగా ఉంటోంది.
సరైన బలమైన పరిపాలన కోరుకునే వారికి శివాజీ పాలన ఒక ఆదర్శం కావాలి. నేటి నేతలు శివాజీలా జన హృదయ నేతలు కావాలి.
*జై భవాని వీర శివాజీ*

ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం

#నిత్య #స్మరణీయులు🚩🚩🇮🇳

#నాగార్జునో #భరద్వాజ
#ఆర్యభట్టో #బసుర్బుధః
#ధ్యేయో #వెంకటరామశ్చ
#విజ్ఞా #రామానుజాదయః

#భారతరత్న
#సర్.#సి.#వి. #రామన్*

మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ తరగతి గది. ఆంగ్ల పద్య భాగమును బోధించు ప్రొఫెసర్ ఇలియట్ తరగతిలో ప్రవేశించి విద్యార్ధలందరినీ ఒక మారు కలయజూచాడు. మూడవ వరుసన కూర్చున్న ఒక విద్యార్ధిని చూచి ఆశ్చర్యంతో ...
'నీవీక్లాసు విద్యార్ధివేనా?' అని ప్రశ్నించాడు. ఆ దినమే అతడు కళాశాలలో చేరాడు.
'ఔను, సర్, నేను ఈ తరగతి విద్యార్ధిని, నా వయసు 13 ఏళ్ళు. ఇంటర్‌మీడియట్ విద్యను వాల్టేర్ కాలేజీలో పూర్తి చేశాను. నా పేరు సి.వి. రామన్' అన్న సమాధానం నిర్భయంగా చెప్పాడు. ప్రొఫెసర్ వేసిన ప్రశ్నలన్నింటికీ ధైర్యంగా చకచకా చెప్పాడు. ప్రొఫెసర్, ఆ బాలుని తెలివితేటలకు ముగ్ధుడయ్యాడు. నాటి నుండి ప్రొఫెసర్ ఇలియట్ ప్రియశిష్యులలో ఒకడయ్యాడు సి.వి. రామన్.
చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. తిరుచినాపల్లి హైస్కూల్‌లో ఉపాధ్యాయుడుగా చేరిన చంద్రశేఖర్ అయ్యర్ స్వయంకృషితో ఉన్నత విద్యనభ్యసించాడు. "పోలనుద్యోగికిని దూరభూమిలేదు" అన్న సూక్తి మేరకు స్వస్థలానికి దూరంగా ఉన్న విశాఖపట్నంలోని, మిసెస్ ఎ.వి.ఎన్. కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేరారు. భౌతిక శాస్త్రం, జ్యోతిష శాస్త్రాలలోనే గాక, వీణ, వాయులీన్ వాదనములలోను నైపుణ్యంగల వాడు చంద్రశేఖర్ అయ్యర్. సివి.రామన్ తల్లి పార్వతి అమ్మాళ్ తండ్రి గొప్ప సంస్కృత పండితుడు. సహనానికి, పట్టుదలకు మారుపేరు ఆమె.
విద్యార్ధి దశలో అనిబిసెంటుగారి అనర్గళమైన ఉపన్యాసాలు రామన్‌ను ఆకర్షించాయి. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ చదువుతున్నపుడే 'హిందూ పురాణములు' అన్న వ్యాసం రాసి ప్రథమ బహుమతి నందుకొన్నాడు. నిరంతరం అధ్యయన శీలి రామన్. బి.ఏ లో ప్రథమ శ్రేణిలో ప్రథముడుగా ఉత్తీర్ణుడై, ఎల్‌ఫీన్‌స్టన్ బంగారు పతకంతో పాటు మరెన్నో విలువైన బహుమతులందుకున్నాడు.
పదార్థ విజ్ఞాన శాస్త్రంతో ఎం.ఏ తరగతిలో చేరాడు. తరగతిలో అధ్యాపకులు, విద్యార్ధులు రామన్ పట్ల అత్యంత గౌరవ భావంతో వ్యవహరించే వారు. ప్రయోగ శాల, గ్రంథాలయం అతనికి ఎల్లవేళలా అందుబాటులో వుండేవి. ధ్వనిశాస్త్ర విషయమున రామన్ ప్రయోగమారంభించాడు. ఇది వరకు ఎవరూ కనుగొనని లక్షణములను కనుగొన్నాడు. ప్రొఫెసర్ జోన్స్‌కు తన ప్రయోగ వివరములను నివేదించాడు. ఆ వివరములను పరిశీలించిన, ప్రొఫెసర్ రెలే రామన్ ప్రయోగాలను ప్రశంసించాడు. రామన్ తన పరిశోధనను వ్యాసరూపంగా సిద్ధపరచి ప్రొఫెసర్ గారికి పరిశీలించమని ఇచ్చాడు. ఆరు నెలలు దాటినా ప్రొఫెసర్ తన కాగితాలను యివ్వలేదు. శుద్ధ ప్రతిని వ్రాసి యిచ్చెదనని చెప్పి, తన వ్యాసాన్ని తీసుకుని, "ఫిలసాఫికల్ మ్యాగజైన్ ఆఫ్ లండన్" అను పత్రికకు 1906లో పంపాడు. ప్రొఫెసర్లు రామన్ ప్రతిభను గొప్పగా శ్లాఘించారు. 1907 లో రామన్ ఎం.ఏ (ఫిజిక్స్) పరీక్షలో మద్రాసు విశ్వవిద్యాలయ చరిత్రలోనే ప్రప్రథమశ్రేణి విద్యార్ధిగా ఉత్తీర్ణుడయ్యాడు.
పెద్దలు, మిత్రులు రామన్‌ను ఇంగ్లండు వెళ్ళి పరిశోధన సాగించమని ప్రోత్సహించారు. కాని రామన్ శారీరకంగా దుర్బలుడైనందున ఇంగ్లండు వాతావరణం అతనికి అనుకూలించదని వైద్యులు చెప్పారు. రామన్ ఆ ప్రయత్నం విరమించుకున్నారు. ఉద్యోగార్థియై, చరిత్ర, అర్ధ శాస్త్రములు ప్రత్యేక విషయములుగా చదివి పోటీ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. "డెప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఆఫ్ ది ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్"గా ఎన్నుకోబడినాడు. అప్పుడు రామన్ వయస్సు 18 ఏళ్ళు.
కలకత్తాలో ఉద్యోగమున చేరకముందే 'లోక సుందరీ'అను నామెతో అతని విహాహం జరిగింది. వారిది శాఖాంతర వివాహం. ఆ రోజులలో అది గొప్ప మార్పు. రామన్ కలకత్తాలో డెప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరాడు. కాని అతని మనసంతా శాస్త్రపరిశోధనపట్ల వుండేది.
ఒకనాడు కలకత్తా వీధిలో ట్రామ్‌బండిలో ప్రయాణం చేస్తుండగా "ది ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్" అను బోర్డు అతని కంటపడింది. వెంటనే ట్రామ్ బండి దిగి, ఆ భవనం ప్రవేశించాడు. శాస్త్రవేత్తలు సమావేశం ముగించి వెళుతున్నారు. ఆ సంస్థ కార్యదర్శి మహేంద్రలాల్ సర్కార్‌ను కలుసుకున్నాడు. మరుసటి దినం నియమిత కాలంలో ఇరువురు సమావేశమయ్యారు. రామన్ తన పరిశోధనలను మహేంద్రలాల్ సర్కార్‌కు వివరంగా చూపించాడు. రామన్ ప్రతిభకు నివ్వెరపోయిన సర్కార్, రామన్‌కు తమ సంస్థలో ప్రవేశం కల్పించి నిరాఘాటంగా, స్వతంత్రంగా ప్రయోగములు సాగించుటకు ప్రత్యేక సౌకర్యములు కల్పించాడు. రామన్ రాకతో సంస్థ ప్రతిష్ట బాగా పెరిగింది. కలకత్తా విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడైన అశుతోష్ ముఖర్జీ రామన్‌ను ఎంతో ఆదరించాడు.
రామన్‌ను ప్రభుత్వం రంగూన్‌కు బదిలీ చేసింది. రంగూన్‌లో ఉన్నపుడే తండ్రి మరణించాడు. ఆరు నెలలు సెలవు పెట్టి మద్రాసు వచ్చిన రామన్ ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రయోగాలు చేయసాగాడు. నాగ్‌పూర్‌కు బదిలీ అయ్యాడు. అక్కడ సహోద్యోగుల ఈర్ష్యాసూయలతో భాదపడినాడు. మరల కలకత్తా బదిలీ కావడం రామన్ కెంతో ఆనందం కలిగించింది.
కలకత్తా విశ్వవిద్యాలయమున భౌతిక శాస్త్రంలో ఆచార్య పీఠం 1915లో నెలకొల్పబడింది. అందుకు భూరివిరాళమిచ్చిన సర్ తారకనాథ్ పాలిట్ దృష్టి రామన్ పై పడింది, ఇంగ్లండులో పెద్ద చదువులు నేర్చివచ్చినవారే ఆపదవికి అర్హులని పేర్కొనబడింది. కాని వైస్ ఛాన్స్‌లర్ అశుతోష్ ముఖర్జీ, అన్ని నిబంధనలను సడలించి సి.వి.రామన్‌ను ఆ పదవికి ఎన్నుకొన్నాడు. ప్రభుత్వంలోని ఉన్నత పదవికి వెంటనే రాజీనామా ఇచ్చిన రామన్ కలకత్తా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా చేరాడు. 1919 లో రామన్ 'ఇండియన్ ఆసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్సు' సంస్థకు కార్యదర్శిగా ఎన్నుకోబడినాడు. 1922 బ్రిటిష్ యూనివర్శిటీ కాంగ్రెస్ సభలో భారతదేశ ప్రతినిధిగా ఎన్నుకోబడినాడు. 1924లో కెనడాలోని 'సైన్స్ కాంగ్రెసు' కు విశేష ప్రతినిధిగా వెళ్ళి విదేశాలలో పలుచోట్ల ఉపన్యాసాలిచ్చాడు. అపూర్వంగా, రాయల్ సొసైటీ, రామన్‌కు 1924లో ఫెలోషిప్ సత్కారమిచ్చి గౌరవించింది. 1924లోనే రామన్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సంస్థను నెలకొల్పాడు. 1925లో రష్యన్ సైన్స్ అకాడమి ఆహ్వానంపై మాస్కో వెళ్ళాడు.
కొన్నేళ్ళు, నిరంతర పరిశోధనా ఫలితంగా 1928లో "రామన్ ఎఫెక్ట్"ను కనుక్కొన్న, సి.వి.రామన్‌కు నోబెల్ బహుమతి లభించింది. ఆసియా ఖండంపై ఆ సత్కారం అందుకొన్న శాస్త్రవేత్తలలో మొట్టమొదటివాడు సి.వి.రామన్.
15 సంవత్సరాలు కలకత్తా విశ్వవిద్యాలయంలో, అపూర్వంగా పనిచేసిన సి.వి.రామన్ బెంగుళూరులోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్' సంస్థ డైరెక్టర్‌గా చేరాడు. 1934లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంస్థ అవతరించింది. 1948 లో రామన్ తమ స్వంత సంస్థ రామన్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ను ప్రారంభించాడు. ఆ సంస్థలో అధ్యయనం చేసిన, రామన్ శిష్యులలో అగ్రగణ్యులు డా. హోమి జె.భాభా, డా.సూరిభగవంతం, డా. విక్రమ్ సారాభాయ్, డా.కె.యస్.కృష్ణన్, డా. రామశేషన్ మున్నగువారు.
స్వతంత్ర భారతావరణంలో శాస్త్రీయ పరిశోధనా రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
రామన్ కీర్తి ప్రపంచమంతటా వ్యాపించింది. బ్రిటిష్ ప్రభుత్వం అతనిని 'సర్' బిరుదంతో సత్కరించింది. ప్రపంచమందలి ప్రముఖ విశ్వవిద్యాలయాలెన్నో అతనిని గౌరవ డాక్టరేట్ బిరుదములతో సత్కరించాయి. 1954లో భారత ప్రభుత్వం అతనిని 'భారత రత్న' ప్రశస్తితో గౌరవించింది. కొన్ని వందల ఘన సన్మాలందుకొన్న మహామనీషి సర్ - సి.వి. రామన్.
రామన్ సంగీత శాస్త్రములో చక్కని ప్రవేశం కలవాడు. మృదంగ వాద్యంపై, శబ్ద తరంగాలపై ప్రయోగాలు సాగించాడు. రామన్ పరిశోధనలు ఫోటోగ్రఫీ, రబ్బర్ ప్లాస్టిక్ పరిశ్రమల కెంతో తోడ్పడింది.
రామన్ విజ్ఞానశాస్త్ర ప్రగతికెంతో కృషి చేశాడు. రాజకీయవాదులు వైజ్ఞానిక రంగంలో ప్రవేశించకూడదని ఆయన అభిప్రాయం.
ప్రతి ఏటా, ప్రధాని నెహ్రూ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలను ప్రారంభించడం రామన్‌కు నచ్చలేదు. ఆయన శిష్యుడైన శ్రీ వి.టి.శ్రీనివాసన్, రామన్‌తో మాట్లాడుతూ ఆ విషయం ప్రస్తావించగా 'ప్రపంచంలో ఏ దేశంలో నైనా, రాజకీయ నాయకులు విజ్ఞాన శాస్త్ర సమావేశాలు ప్రారంభించారా? గత 17ఏళ్ళుగా, సంస్థ నిర్వాహకులు, మన ప్రధానితోనే ఎందుకు ప్రారంభిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఇప్పుడు ఆయన లేరు, ఆయన కూతురితో, ఈ పని చేయిస్తున్నారు. ఇదే మాత్రం సముచితం కాదు.' అందుకే ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అవతరించింది.
రామన్ హాస్య చతురుడు. కొన్ని దశాబ్దాల క్రితం బెంగుళూరులోని ఒక బ్యాంకర్ (ధర్మరత్నాకర గోపాలరావు) గారి వద్ద రామన్ 75వేల రూపాయలు వుంచాడు. కొద్ది కాలం తర్వాత ఆ బ్యాంకర్ దివాలా అయినట్లు తెలిసింది. 'నోబెల్ బహుమతి గ్రహీతకే టోపీ పెట్టిన, ఆ బ్యాంకర్‌కు నోబెల్ పారితోషికం ఇవ్వడం సబబు' అన్నాడు డా.సి.వి.రామన్.
"కార్యసాధకులకు హంగులు ఆర్భాటాలు అనవసరం. నోబెల్ బహుమతి కొరకు నేను సాగించిన ప్రయోగానికి నా పెట్టుబడి కేవలం రెండువందల రూపాయలే!" అన్నారాయన. జాతీయ పరిశోధనాలయాలపై అనవసరంగా విపరీతమైన ధనాన్ని వ్యయపరచడం రామన్ గారికి సరిపడేది కాదు. అందువల్లనే "షాజహాన్ తన ప్రియురాలి శవాన్ని ఖననం చేసేందుకు తాజ్ మహల్ నిర్మించాడు. జాతీయ ప్రయోగశాలలు శాస్త్ర పరిశోధనా పరికరాలను నిక్షేపం చేసేందుకు నిర్మించారు" అన్నారాయన. రామన్ ఎంత గొప్ప శాస్త్రజ్ఞుడో అంత గొప్ప వక్త. అతి క్లిష్టమైన శాస్త్రీయ విషయాలను జనరంజకంగా ఉపన్యసించగల మహామేధావి ఆయన.
మానవతావాది డా.రామన్. శాస్త్రవేత్తల పరిశోధనలు ప్రపంచ ప్రజల క్షేమానికి వినియోగ పడాలని చాటిచెప్పిన మహనీయుడు సర్.సి.వి.రామన్.
జీవితమంతా శాస్త్ర పరిశోధనలో గడిపి, భారతదేశ కీర్తి పతాకను రెపరెపలాడించిన సర్. సి.వి.రామన్ తన 83వ ఏట 1970 నవంబర్ 21 వ తేదీన దివంగతుడయ్యాడు.




Comments

Popular posts from this blog

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు