మే

మే 
మే-  09     మహారాణ ప్రతాప్ జయంతి
మే - 11    జాతీయ వైజ్ఞానిక దినోత్సవం
మే - 22    జీవ వైవిధ్య దినోత్సవం
మే - 28    వీర్ సావర్కర్ జయంతి
మే - 31    పొగాకు వ్యతిరేక దినోత్సవం

*వీర సావర్కార్...*
*భారతదేశ స్వాతంత్య్ర సాధనకోసం పోరాడిన విప్లవ వీరుల వరుసలో అగ్రగణ్యుడాయన.*       *తన కార్యాలద్వారానే కాక, తన కావ్యాలద్వారాకూడా ఆంగ్లేయపాలకులను బెంబేలెత్తించిన కవి వీరుడాయన.*
*స్వాతంత్య్ర వీరసావర్కార్ జీవనం ప్రతి యువకుని హృదయాన్ని ఉర్రూతలూగిస్తుంది. రెండు జీవితఖైదు శిక్షలు, జైళ్ళలో అంతులేని నరకయాతనలు అనేవి దేశం పట్ల ఆయనలో ఉన్న భావోద్వేగాల్నీ ఏమాత్రం నాశనం చేయలేకపోయాయి.* *అగ్నిగుండాలవంటి తన రచనాస్త్రాలను ఆంగ్లేయులపైకి సంధించాడాయన...*
*స్వయంగా జీవితమంతా స్వాతంత్య్ర సాధనకోసం సమిధను గావించడమే కాదు. తనలాంటి వందలాది యువకులను తన జీవితకాలంలోనే నిర్మాణంచేసిన ఆదర్శస్వాతంత్రవీరుడు సావర్కార్.*
#మే28#వీరసావర్కర్#జయంతి #శుభాకాంక్షలతో..........🚩🙏
అపర దేశభక్తుడు, అసలు సిసలు స్వాతంత్ర పోరాట యోధుడు, హిందూరాష్ట్ర సిద్ధాంత కర్త వీర_సావర్కర్ గారి జీవిత విశేషాలు.....
#వీర_సావర్కర్_జననం_నుండి_మరణం_వరకు_క్షణం_క్షణం_కణం_కణం_భారతమాతకే_సమర్పణం.*

👉జననం 1883 మే 28, సోమవారం ఉదయం 10 గంటలకు నాసిక్ లో...
👉తల్లి మరణం... 1892 జులై లో..
👉12 సంవత్సరాల వయసులో మొదటి మరాఠి పాట వ్రాశాడు ..
👉1898లో చేసిన   ప్రతిజ్ఞ.." ఐతే ఛాపేకర్ సోదరుల వలె బలిదానం లేదా ఛత్రపతి శివాజీ వలె హిందూ సామ్రాజ్య ప్రతిష్ఠాపన చేస్తాను ...
👉తండ్రి , పిన తండ్రి ప్లేగు వ్యాధి సోకి మరణం 1899లో ...
👉స్వాతంత్య్రం కోసం రహస్య సంస్థ '#మిత్ర_మేళా' ప్రారంభం 1901లో ,....
👉1902 లో 10th పాస్....
👉#ఆర్యన్_వీక్లీ కొత్త పత్రిక ప్రారంభం 1903లో,
పద్యాల రచన...
1.శివాజీ హారతి పాట 2.స్వాతంత్య్ర రూపక గీతం 

👉1904 లో రహస్య మిత్ర మేళాను అభినవ భారత్ గా మార్పు,...

👉విదేశీ వస్త్రాల దహనం చేయటం సావర్కర్ కి 10 రూపాయల జరిమానా, హాస్టల్ నుండి తొలగింపు, పుత్రుడు జననం, ప్రభాకర్ నామధెయం(1905).

👉LLB చదువుల కోసం పుణే ప్రయాణం బిహారీ అను పత్రికకు ఎడిటర్ గా నియామకం (1906).
👉బాల గంగాధర్ తిలక్ సలహా తో శ్యాంజి క్రిష్ణ వర్మ ఇచ్చే స్కాలర్ షిప్ తో విదేశాల్లో చదువు(1906 మే).
👉భారత్ వదలి ఇంగ్లాండ్ ప్రయాణం,పడవలొనే 'మహాసాగర్'పద్య రచన(9 జులై).

👉ఇటలీ దేశ స్వాతంత్య్రం కోసం పొరాడిన మెజినీ యుద్దవీరుడి కథా రచన(జులై - సెప్టెంబర్).
👉శివాజీ అనుచరుడైన బాజీ ప్రభు దేశ పాండే పై రూపకం రచన...

👉 తన ప్రేరణతో మదన్ లాల్ ధింగ్రా అను యువకుడు లండన్ వెళ్లి కర్జన్ వైలీని హతమార్చాడు(జులై). 
👉జైలులో వున్న ధింగ్రా ను కలిసి వచ్చాడు(జులై 22),ధింగ్రా కు మరణశిక్ష (ఆగష్ట్ 11), మహాత్మా గాంధీ సమక్షంలో విజయదశిమి రోజున  ఉపన్యాసం (అక్టోబర్ 24),
👉తన ప్రేరణతో అనంత లక్ష్మణ కన్హరే అను యువకుడు 'జాక్శన్' ఇంగ్లీష్ అధికారిని చంపివెసాడు(డిసెంబర్ 21).

👉లండన్ లో  ప్రధమ స్వాతంత్య్ర పోరాటం1857,  50 సంవత్సరాల ఉత్సవాలు,
👉లండన్ లోని ఇండియా హౌస్ నిర్వహణ బాధ్యత.
బాంబుల తయారీ వివరాల సేకరణ
(1907)

👉1857 స్వాతంత్య్ర పోరాటం చారిత్రక పుస్తక రచన. విప్లవ వీరులకు ఇది భగవద్గీత.ఈయన పుస్తకం చదివిన వారిని 15 సంవత్సరాలు మరియు అండమాన్ జైలు
లండన్ లో శివాజీ జయంతి ఉత్సవాలు జరిపాడు.
👉"1857 స్వాతంత్య్ర పోరాట గాథలు' పుస్తకం ఇంగ్లీష్ లోకి అనువాదం.

👉21బ్రొనింగ్ పిస్టల్ లు ఒక వంట మనిషి ద్వారా భారత్ కి పంపించారు.
👉పుత్రుడు ప్రభాకర్ మరణం,పెద్దన్నయ్య గణేశ్ సావర్కర్ ని అండమాన్ జైలుశిక్ష (ఆజీవన కారాగారము) విధించి,పంపారు. (1909)

👉తీవ్ర అనారోగ్యం  కారణంగా విశ్రాంతి కోసం ప్యారిస్ ప్రయాణం(1910)
👉ప్యారిస్ నుండి తిరుగు ప్రయాణం లో లండన్ లో అరెస్ట్ అయ్యాడు (మార్చ్13).

👉జులై 1 న మొరియా స్టీమరులో భారత్ ప్రయాణం..
జులై 18న సముద్రంలో దూకి,ఈది ఫ్రాన్స్ సరిహద్దులు చేరి మళ్ళీ అరెస్ట్ అయ్యాడు.
👉జులై 22 నాసిక్  , ఎరవాడ జైళ్లో పెట్టారు.
👉డిసెంబర్ 24 ఆజీవన కారాగార శిక్ష విధించి అండమాన్ జైలుకి పంపారు.ఆయన ఆస్తుల్నీ జప్తు చేశారు.

👉1911, జనవరి 31 రెండవసారి ఆజీవన కారాగార శిక్ష పడింది.జులై 4 అండమాన్ సెల్యులర్ జైల్ కి తీసుకుని వెళ్ళారు.

👉1918 లో అనారొగ్యానికి గురయ్యారు.
👉1919 ఎప్రిల్ లొ  సావర్కర్  వదిన యశువాహిని మరణం 
మే లో తమ్ముడి భార్య మాయి  వచ్చి కలిసింది.

👉1921 రంగస్వామి అయ్యర్ కౌన్సిల్ లో సావర్కర్ అనారోగ్యం గురించి లేఖ వ్రాసి విడుదల చెయమన్నారు.
👉1922 హిందూత్వ అను సైద్దాంతిక పుస్తకం వ్రాశారు.
👉1923 ఎరవాడ జైలు కి పంపారు.

👉1924 లో విడుదల,రత్న గిరి జిల్లా దాట వద్దని నియమాల తో కూడిన బెయిల్ తో విడుదల చేశారు.
👉1924 మహరాష్ట్ర తరఫున 12000రూపాయలు సమర్పించారు.

👉1925 న కూతురు పుట్టింది. ప్రభ అని పేరు పెట్టారు.
జనవరిలో అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు.  హిందూ గణేష ఉత్సవాలు ప్రారంభం చేశాడు.

👉1926 లో 'శ్రద్దానంద' పత్రికలో వ్యాసాలు వ్రాయటం మొదలయ్యింది.
👉1927 లొ మహాత్మా గాంధీ సావర్కర్ ని కలవడానికి రత్నగిరికి వచ్చారు. 
👉అంటరానితనం నిర్మూలన పై నాటకం వ్రాశాడు. 1910 నుండి 1921వరకు అండమాన్ జైల్లో పడ్డ యాతనలు వివరిస్తూ పుస్తకం వ్రాశాడు.

👉1928 కొడుకు విశ్వాస్ జననం.
👉1930లో సామూహిక భోజనాలు 1931 లొ పతిత పావన మందిరం నిర్మించారు. ఆ గుడిలో అన్ని వర్గాల వారికి ప్రవేశం కలిపించబడింది. 

👉1932 లొ  ఎవరిదో హత్య గురించి అనుమానం తో మళ్ళీ అరెస్ట్. 1937హిందూ సభ కు అధ్యక్షుడిగా ఎంపిక.

👉1937 న జైలు నుండి విడుదల.  ఆయన వ్రాసిన 'కాలాపానీ' పుస్తక ప్రచురణ జరిగింది.
👉1938 మరాఠీ సాహిత్య సమ్మేళనం అధ్యక్షుడిగా ఎన్నిక. హిందూత్వ గురించి  దేశమంతటా పర్యటన. 

👉అక్టోబర్లో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్య సమాజం చేసె ఉద్యమాన్ని  సమర్ధిస్తు  భాగ్యనగర సత్యా గ్రహం ప్రసంగం పుణే లో ఇచ్చారు.
👉కలకత్తా,మద్రాస్ బీహార్, అమృతసర్ , నాగపూర్,బిలాస్ పూర్  పర్యటన. 

👉1945 లొ అన్న గణేశ్ సావర్కర్ మరణం 
👉మే 28 న 68వ పుట్టిన రోజు సందర్భంగా  హిందూత్వ కార్యక్రమాలకు 50000 రూపాయలు నిధి సమర్పణ.
👉1946 లో సావర్కర్ వ్రాసిన పుస్తకాలపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన నిషేదం ఎత్తివేత. 

👉1947 లో స్వాతంత్య్ర దినోత్సవానికి స్వాగతం చెపుతూ జాతీయ జెండా తో పాటు భగవా ఝండా ఎగరెసారు. స్వాతంత్య్ర లక్ష్మీ కి జయ్ అంటూ నినాదం ఇచ్చాడు.

👉1948 ఫిబ్రవరి  లో గాంధీజీ హత్యకు సంబంధం లేకున్నా మళ్ళీ అరెస్ట్. 1949 మే 10 న విడుదల 
👉అక్టోబర్ 19 తమ్ముడు్ నారయణ సావర్కర్ మరణం 
1950 లో మళ్ళీ అరెస్ట్ (లియాఖత్ చర్చల పేరుతో).

👉1952లో 10-12 మే లో విప్లవ వీరుల స్మృతి కి చిహ్నంగా దేశం లోనే మొదటిసారి పూణె మునిసిపాలిటీ స్మారక స్తంభం స్థాపన.

👉డిసెంబర్ లో ప్రసంగం 'మతం మారితే జాతీయత ను కూడా మార్చుకున్నట్లె 'అని.

👉1954 లొ క్రైస్తవుల నుండి హిందు మతంలొకీ శుద్ది కార్యక్రమం ద్వారా హిందువుల పునరాగమనం ఏర్పాట్లు.
👉1962 మహారాష్ట్ర గవర్నర్ ద్వారా సావర్కర్ ఇంట్లోనే సన్మానం 

👉1963 లొ 'చరిత్ర లో ఆరు స్వర్ణ పుటలు' పుస్తకం ప్రచురణ 
👉1965 పాకిస్తాను యుద్దం లో భారత సైన్యం లాహోర్ చేరుకొనేసరికి అత్యంత అనందం వ్యక్తం చేశారు.

👉1966 ఫిబ్రవరి  1 న తీవ్ర అనారోగ్యం ఫిబ్రవరి 26 న స్వర్గవాసులయ్యారు. ఫిబ్రవరి 27 న పెద్ద ఎత్తున ఊరేగింపు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు...


#అగ్నికణం #వీరసావర్కర్‌

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌..ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్‌ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్య్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవవీరుడు..
ఎందరో విప్లవకారులకు, స్వాతంత్య్ర సమర యోధులకు స్పూర్తినిచ్చిన వీరుడు.. రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాన్‌ జైలులో 27 ఏళ్లు దుర్భర జీవితం గడిపినా చలించని ధీరుడు వీర సావర్కర్‌.
దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్‌ బ్రిటిష్‌ పాలనపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు. ఒక కవిగా, రచయితగా, వక్తగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని జాగత పరిచారు.

1857 స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్‌ వారు భారత్‌ను స్వాధీనం చేసుకొని పాలనపై పట్టు బిగించారు. భారతీయుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జన్మించే నాటికి దేశం కఠోర బానిసత్వంలో మగ్గుతూ అష్టకష్టాలు పడుతోంది. దీనికితోడు సామాజిక కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలలో మునిగిపోయిన భారత సమాజాన్ని సంస్కరించేందు ఎన్నో సాంఘిక, మత ఉద్యమాలు వచ్చాయి. మరోవైపు బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలకు తోడు రహస్య విప్లవోద్యమాలు కూడా ప్రారంభ మయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో జన్మించిన సావర్కర్‌ స్వాతంత్య్రం కోసం పోరాడే రహస్య విప్లవ యోధుడిగా మారాడు. అదే సమయంలో ఆయన సాహితీవేత్తగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా భిన్న కోణాల్లో సేవలు అందించారు.

#దేశం #కోసమే #జీవితం

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జీవితాన్ని రెండు భాగాలుగా ఆవిష్కరించవచ్చు. ఇందులో ముందుగా ప్రథమార్ధాన్ని చూద్దాం. 1883 మే 28న నాసిక్‌ జిల్లా భాగూరు గ్రామంలో దామోదర్‌ పంత్‌, రాధాబాయి దంపతులకు జన్మించారు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌. సావర్కర్‌ అన్న గణేష్‌ దామోదర్‌ సావర్కర్‌, తమ్ముడు నారాయణ రావు సావర్కర్‌. ఈ ముగ్గురు సోదరులు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు.
ఆనాటి బ్రిటిష్‌ పాలనలో భారతీయులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన సావర్కర్‌ సోదరులు తమ కుల దేవత అష్టభుజాదేవి ముందు దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాన్ని సమర్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆశయ సాధన కోసం *‘రాష్ట్ర భక్త సమూహ్‌,*
*మిత్ర మేళా, *అభినవ భారత్‌’* అనే సంస్థలను స్థాపించారు.

పుణే పెర్గ్యుసన్‌ కాలేజీలో బిఎ పూర్తి చేసుకున్న వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ ‘బార్‌-ఎట్‌-లా’ చదువు కోసం 1906లో లండన్‌ బయలుదేరారు. న్యాయవిద్య పైకి ఒక సాకు మాత్రమే. అప్పటికే సావర్కర్‌కు వివాహమైంది. ఒక కుమారుడు కూడా. తెల్లవారి గడ్డ లండన్‌ నుంచి విప్లవోద్యమం నడపాలనే కృత నిశ్చయంతో అక్కడికి వెళ్లారు. విప్లవ కారులతో కలిసి పని చేశారు. వారందరికీ సావర్కర్‌ రూపంలో ఒక మార్గదర్శి కనిపించాడు.
సావర్కర్‌ లండన్‌లో ఉన్న సమయంలోనే అన్న గణేష్‌ సావర్కర్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వం అండమాన్‌లో కారాగార శిక్ష విధించింది. సావర్కర్‌ న్యాయ విద్య పూర్తి చేసినా, బ్రిటిష్‌ రాణికి విధేయత ప్రకటించడానికి నిరాకరించినందుకు బార్‌ ఎట్‌ లా పట్టా నిరాకరించారు. సావర్కర్‌ కుడి భుజం మదన్‌లాల్‌ ధింగ్రా బ్రిటిష్ ఆర్మీ అధికారి సర్ విలియం హట్ కర్జన్‌ విల్లేని హతమార్చాడు. గణేష్‌ సావర్కర్‌కు శిక్ష విధించిన జాక్సన్‌ అనే అధికారిని అనంత లక్ష్మణ కర్హరే అనే విప్లవ యోధుడు కాల్చి చంపాడు. ఈ రెండు ఘటనల తర్వాత వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై నిఘా పెరిగింది. చివరకు ప్యారిస్‌ నుంచి లండన్‌ వచ్చిన సావర్కర్‌ను రైల్వేస్టేషన్‌లో బంధించారు. స్టీమర్‌లో భారత్‌కు తీసుకొస్తుండగా సముద్రంలో దూకి తప్పించుకునే ప్రయత్నమూ ఫలించలేదు.

#స్ఫూర్తిదాయక #జీవనం

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌కు న్యాయస్థానం అండమాన్‌ జైలులో రెండు యావజ్జీవ కారాగార శిక్షలు (50 ఏళ్లు) విధించింది. న్యాయమూర్తి ఆ తీర్పును ప్రకటిరచగానే. ‘బ్రిటిష్‌ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్నమాట’ అని చమత్కరించారు ధీశాలి అయన సావర్కర్‌. అంతేకాదు *ఆయన యావదాస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి స్పందిస్తూ ‘దేశమంతా నాదైనప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేం’ అని వ్యాఖ్యానించిన మహనీయుడు సావర్కర్‌.* 1911 జూలై 4 నుంచి ప్రారంభమైన అండమాన్‌ కారాగార శిక్ష ఎంతో కఠినంగా సాగింది. కొబ్బరి పీచు వలవడం, గానుగ ఆడించి నూనె తీయడం వంటి కఠిన పనులు చేయించారు.
జైలులో ఉన్న రోజుల్లో సావర్కర్‌ తన రచనా వ్యాసాంగాన్ని సాగించారు. తోటి ఖైదీలకు చదువు చెప్పారు. కులమత బేధాలు పాటించకుండా సంస్కరించారు. దేశంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన వత్తిడి కారణంగా 1923 డిసెంబర్‌లో సావర్కర్‌ను అండమాన్‌ నుంచి మహారాష్ట్రలోని ఎరవాడ జైలుకు తరలించారు బ్రిటిష్‌వారు. అనంతరం 1924 జనవరి 6న రత్నగిరి జిల్లా దాటిపోవద్దు, రాజకీయాల్లో పాల్గొనరాదనే షరతులతో బ్రిటిష్‌ ప్రభుత్వం వీర సావర్కర్‌ను పూర్తిగా విడుదల చేసింది.

#సంఘ #సంస్కర్తగా #పునర్నిర్మాణం

సుధీర్ఘకాలం కారాగార జీవితం తర్వాత ఆంక్షలతో విడుదలైన సావర్కర్‌ జీవితం ద్వితీయార్థమంతా హిందూ సమాజ సంస్కరణలో సాగిపోయింది. నాటి హిందూ సమాజం అనైక్యత, అంటరానితనం, సాంఘిక దురాచారాలతో కష్టాలు పడుతోంది. సమాజంలోని ఈ అసమానతలు రూపుమాపి జాతిని సమైక్యం చేసేందుకు నడుం బిగించారు సావర్కర్‌. సావర్కర్‌ తన గ్రామంలోని హరిజనుడి ఇంట టీ తాగడం సనాతన ఆచార పరాయణులకు ఆగ్రహం తెప్పించింది. అంటరానితనం కారణంగానే మన హిందూ సమాజంలో అనైక్యత, మత మార్పిడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు సావర్కర్‌. హిందువులు అంతా బంధువులేనని చాటి చెప్పారు.

1929లో రత్నగిరిలోని విఠలేశ్వరాలయంలోకి హరిజనులకు ప్రవేశం కల్పించారు వీర సావర్కర్‌. మహారాష్ట్ర అంతటా ఈ కార్యక్రమం ఒక ఉద్యమ రూపంలో కొనసాగింది. పాఠశాలల్లో అన్ని కులాల విద్యార్థులు కలిసి చదువుకునేలా ప్రోత్సహించారు. 1931లో పతిత పావన మందిరాన్ని నిర్మించి శంకరాచార్యులచే ప్రారంభించారు సావర్కర్‌. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యత తీసుకురావడానికి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. హిందూ సమాజం నుంచి కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం అంటే మనకు శత్రువులను పెంచుకోవడమేనని గుర్తు చేసేవారు సావర్కర్‌. అన్యమతం స్వీకరించిన వారిని శుద్ధి ఉద్యమాల ద్వారా తిరిగి హిందూ సమాజంలోకి తీసుకొచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హిందూ సంఘటన కోసం సామూహిక గణేష్‌ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు.

#హిందుత్వం, #జాతీయవాదం

హిందుత్వ పేరు వినగానే ఏదో రూపంలో వీర సావర్కర్‌ గుర్తుకు వస్తారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే హిందువు అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు సావర్కర్‌.

‘ఆసింధు సింధు పర్యంతా యస్యభారత భూమికా
పితభూః పుణ్యభూశ్చైవ
సవై హిందురితి స్మతాః’

‘సింధూ నది మొదలు హిందూ మహా సముద్రం వరకూ ఉన్న ఈ భారత భూమిని మాతృభూమి గా, పితృభూమిగా, పుణ్యభూమిగా భావించిన వారంతా హిందువులే..’ హిందువులు అంటే ఎవరనే ప్రశ్నకు వినాయక దామోదర్‌ సావర్కర్‌ ఇచ్చిన స్పష్టమైన సమాధానం ఇది.

హిందువనే పదం సాంస్కృతిక జీవితానికి సంబంధించినది. దేశంలో నివసించే ప్రతి వ్యక్తి ప్రాంతం, భాష, మతాలకు అతీతంగా తాను భారతీయుడినని భావించాలి. అదే మన జాతీయత అని చెప్పారు సావర్కర్‌. హిందుత్వం అనేది మన జాతీయతను సూచిస్తుంది. దేశంలో మతాలు ఎన్ని ఉన్నా జాతీయత ఒక్కటే. జాతీయత అనే నదిలో అన్ని మతాలు, వర్గాలు సెలయేర్లలా కలిసిపోవాలి అని కోరుకున్నారు సావర్కర్‌. ఏ మతం వారైనా భారతీయులే. వారు ముస్లింలైతే భారతీయ ముస్లింలు, క్రైస్తవులైతే భారతీయ క్రైస్తవులు. అంతేకాని ‘ఏ మతం ప్రత్యేక జాతి కాదు’ అని చెప్పారు సావర్కర్‌.
హిందుత్వాన్ని భారత జాతీయతతో సమానంగా నిర్వచించారు సావర్కర్‌. ప్రపంచంలో ఎన్నో దేశాలు, జాతులు, మతాలు, సాంస్కృతులు ప్రత్యేక అస్తిత్వంతో ఉన్నట్లే హిందూ జాతీయత తనదైన గుర్తింపుతో మనుగడ సాగిస్తుంది. హిందూ సంఘటన అంటే జాతి సంరక్షణ అని చెప్పారు సావర్కర్‌. హిందువుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా ఘర్షణ తప్పదు. ఈ స్వీయ రక్షణ కోసం హిందూ సంఘటనోద్యమాన్ని ప్రారంభించారు వీర సావర్కర్‌. స్వాతంత్య్రంతో పాటు దేశ విభజన కూడా తప్పదని చాలా ముందుచూపుతో గ్రహించారు సావర్కర్‌. ఆనాటి బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో హిందువులు చాలా తక్కువ. అందుకే హిందువులు సైన్యంలో చేరాలని ప్రోత్సహించారు సావర్కర్‌. సావర్కర్‌ ఈ పిలుపు ఇవ్వడాన్ని తప్పు పట్టిన వారంతా, తర్వాత కాలంలో ఆయన దూరదష్టిని అభినందించారు.
1938 నాటికి బ్రిటిష్‌ ప్రభుత్వం వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై అన్ని ఆంక్షలను ఎత్తేసింది. తరువాత హిందూ మహాసభకు ఆయనను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.

#చరిత్రకారుడు, #సాహితీవేత్తగా..

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ స్వాతంత్ర యోధునిగానే కాక చరిత్రకారునిగా, సాహితీవేత్తగా కూడా ప్రసిద్ధులు. ఆయన గ్రంధాలు ప్రజల్లో దేశభక్తిని రగిలించేవి. ఈ కారణం వల్లే బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన రచనలపై గట్టి నిఘా పెట్టింది. చాలా ఏళ్ల పాటు నిషేధం కూడా అమలులో ఉంది. భారతదేశంతో పాటు విదేశీ చరిత్రలను కూడా ఎంతో లోతుగా అధ్యయనం చేసి మనకు సాహిత్య సష్టి చేశారు సావర్కర్‌.
సావర్కర్‌ 1908లో లండన్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ను రాశారు. ఆనాడు జరిగిన ఉద్యమాన్ని బ్రిటిష్‌ చరిత్రకారులు కేవలం సిపాయిల తిరుగుబాటుగా అభివర్ణించారు. కానీ అది స్వాతంత్య్ర సంగ్రామమని స్పష్టంగా లోకానికి చాటి చెప్పారు సావర్కర్‌. దీన్ని ప్రపంచంలోని పలు భాషల్లోకి అనువదించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రచురణకు ముందే ఈ గ్రంధాన్ని నిషేధించింది. దీన్ని ముద్రణ కోసం భారత్‌ లోని తన అన్న గణేష్‌ సావర్కర్‌కు పంపగా, బ్రిటిష్‌ వారు పసిగట్టారు. ఆయన్ను ఆరెస్టు చేసి అండమాన్‌కు పంపింది ఈ కేసులోనే. మహారాష్ట్రలోని అన్ని ముద్రణాలయాలపై ముందు జాగ్రత్తగా దాడులు జరిపారు. అయినప్పటికీ విదేశాల్లో ముద్రించిన ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ రహస్యంగా భారతదేశం చేరింది. ఈ గ్రంథం ఎంతో మంది స్వాతంత్య్ర సమర వీరులకు, విప్లవ యోధులకు స్పూర్తినిచ్చింది.
సావర్కర్‌ అండమాన్‌ జైలులో బందీగా ఉన్నప్పుడు అక్కడ విధించిన కఠిన శిక్షలకు చింతిస్తూ కూర్చోలేదు. చేతులకు, కాళ్లకూ బేడీలు వేసి శరీరాన్ని బంధించారు, కానీ మనసును కాదు అనుకునేవారు. స్వతహాగా ఆయన కవి. శిక్ష సమయంలో జైలు గోడల మీదే కవితలు రాశారు. వీటిని కంఠస్థం చేసి, గుర్తు పెట్టుకొని, తర్వాత కాలంలో గ్రంథస్తం చేశారు. కొద్ది నెలల తర్వాత జైలు సిబ్బంది ఆయనకు కాగితాలు, కలం సమకూర్చారు. అండమాన్‌ జైలులో ఉన్న సమయంలోనే కమల, గోమాంతక్‌, మహాసాగర్‌ తదితర గొప్ప కావ్యాలు వచ్చాయి.
1922లో జైలు గోడల మధ్యే హిందుత్వ గ్రంధ రచనకు పూనుకున్నారు సావర్కర్‌. హిందుత్వకు సమగ్ర నిర్వచనం ఇచ్చిన గ్రంథం ఇదే.
సావర్కర్‌ తన ఆరోగ్యం క్షీణిస్తున్న దశలో కూడా రచనా వ్యాసాంగాన్ని వదిలిపెట్టలేదు. 1963లో ఆయన రాసిన ‘భారత ఇతిహాసంలో ఆరు స్వర్ణపుటలు’ మన చరిత్రలోని ముఖ్య ఘట్టాలను ఉల్లేఖిస్తూ స్వాభిమానాన్ని చాటి చెప్పింది. అండమాన్‌ జైలులో తాను గడిపిన దుర్భర జీవితంపై రాసిన ఆత్మకథ మరాఠా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచి పోతుంది. దీని ఆధారంగా ఎన్నో రంగస్థల నాటకాలు కూడా వచ్చాయి.
ఆధునిక భారతీయ రాజనీతిజ్ఞులలో సావర్కర్‌ ఒకరు. ఆయన మహోన్నత ఆదర్శవాది, మానవతా వాది, హేతువాది కూడా. అభ్యుదయ, వైజ్ఞానిక, శాస్త్రీయ దృక్పథాలు ఆయన రచనలు, ఉపన్యాసాల్లో కనిపిస్తాయి.

#స్వదేశీ #ప్రభుత్వ #నిర్దయం

సావర్కర్‌ జీవితం అంతా సంఘర్షణలతోనే సాగింది. బ్రిటిష్‌ ప్రభుత్వంతో పాటు స్వదేశీ ప్రభుత్వం కూడా ఆయనపట్ల నిర్దయగానే వ్యవహరించింది. మహాత్మాగాంధీ హత్యోదంతంలో ఆయనను అన్యాయంగా అరెస్టు చేశారు. అనంతరం నిర్దోషిగా విడుదల చేశారు. దేశం కోసం జీవితాన్ని అర్పితం చేసిన ఆ మహానీయునికి దక్కాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే 1964లో మహారాష్ట్ర ప్రభుత్వం ‘అప్రతిహతీ స్వాతంత్య్ర వీర’ అనే బిదురుతో గౌరవించింది. జీవిత చివరి దశలో తన 86వ ఏట జీవితం చాలించదలచి ఆహారాన్ని త్యజించారు సావర్కర్‌. 1966 ఫిబ్రవరి 26న ఈ లోకం నుంచి విముక్తి పొందారు. ఆ మహనీయుడు అందించిన స్ఫూర్తి కోట్లాది మంది భారతీ యుల్లో అగ్నికణమై చిరస్థాయిగా నిలిచిపోతుంది.

👉"మిస్టర్ సావర్కర్ నీకు 50 సంవత్సరాల జైళు శిక్ష పడింది, నీవు ప్రాణాలతో బయటికి పోలేవు " -  మిస్టర్ . బారి (అండమాన్ జైళు సూపరిండెంట్ ).
👉సావర్కర్ సమాధానం " 50 సంవత్సరాలు నీ బ్రిటీషు ప్రభుత్వం ఉంటుందని అనుకుంటున్నావా ? మిస్టర్ బారి" . స్వాతంత్ర్య వీర సావర్కర్ దృఢమైన సంకల్ప బలాన్ని ఈ సంఘటన తెలియ జేస్తుంది. 
👉"నాకు బ్రిటీషు వారు మాత్రమే శత్రువులు కాదు సమాజంలో ఉన్న కులతత్వం మరియు అంటరానితనం కూడా నాకు శత్రువులే వాటిపైన కూడా నా పోరాటం" అని స్పష్థంగా ప్రకటించి హిందూ సమాజ ఐక్యత ద్వారా హిందు రాష్ట్ర పునః నిర్మాణం కోసం జీవితమంతా పరితపించిన ఒక మహర్షి వీర సావర్కర్.        
👉ప్రాంతీయ తత్వం దేశానికి దీర్ఘకాలికంగా ప్రమాదమని దీనిని రాజకీయ పార్టీలు గ్రహించాలని 1923 లోనే కాంగ్రెస్ పార్టీకి లేఖ రాసిన సావర్కర్ దూరదృష్టి మనం అర్థం చేసుకోవాలి.          
👉కులతత్వాన్ని నిర్మూలించడానికి pan - Hindu పేరిట దేశంలోనే మొదటి cafe ను 1 మే 1933 లో సావర్కర్ తన ఇంటి ముందు ప్రారంభించి, ఆనాడు అంటరానివారిగా పిలవబడే వారితో హోటల్ నిర్వహించి తనను కలవడానికి వచ్చేవారు ఆ హోటల్లో కనీసం ఛాయి అన్నా తాగి రావాలనే నిబంధన పెట్టి ఆచరణలో జీవించిన మహర్షి ..                  
👉మతమార్పిడులను తీవ్రంగా వ్యతిరేఖించి శుద్ది కార్యక్రమాల పేరిట మతం మారిన వారిని తిరిగి సనాతనధర్మం లోకి తీసుకురావడాన్ని ఒక ఉద్యమంగా నడిపిన హిందూ చైతన్య దీపం సావర్కర్.
👉పేదలకు విద్య,వైద్యం అందడానికి సావర్కర్ నిరంతరం ప్రయత్నించారు. 
👉స్వాతంత్ర్య వీర సావర్కర్ గురించి చెబుతూ పోతుంటే మొత్తం స్వాతంత్ర్యోద్యమాన్ని చెప్పాల్సిందే.                          
👉అండమాన్ సెల్యూలార్ జైళులో అత్యంత ఇరుకైన గదిలో  రెండు జీవిత ఖైదీల శిక్షను అనుభవిస్తూ కూడా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో ప్రజలలో స్వాతంత్ర్య ఆకాంక్షను రగిలించిన భగభగ మండే సూర్యుడు సావర్కర్ .                             
👉నేడు మనం చైనా వూహన్ కరోనా వైరస్ తో పోరాడుతున్నాం -  భారత్ ఆత్మనిర్భరతతో పోరాడుతుంది.
👉మనం గెలుస్తాం... కరోనా ఓడుతుంది.

Tributes to one of the brightest sons of Maa Bharati, Patriot, Freedom fighter, author, poet and visionary Swatantra Veer Savarkar, on his Birth Anniversary.

#అహల్యాబాయి #హోల్కర్ #జయంతి
మే 29
"ఒక సాధారణ భారతీయ మహిళ అసాధారణ పరిస్థితులు ఎదురైనప్పుడు అసమానమైన ప్రజ్ఞ కనబరుస్తూ వీరనారిగా రూపాంతరం చెందుతుంది అనడానికి అహల్యాబాయి హోల్కర్ జీవితం ఒక ఉదాహరణ. 
మహారాష్ట్రలోని చౌండి గ్రామంలో జన్మించిన అహల్యాబాయి హోల్కర్ మరాఠా సర్దార్ అయిన ఖండేరావు ని వివాహం చేసుకున్నారు. 19 సంవత్సరాల తర్వాత ఒక యుద్ధంలో ఆమె భర్త మరణిస్తారు, భర్త మరణానంతరం అహల్యాబాయి మామ గారు యుద్ధ విద్యలు, రాజనీతి, పరిపాలన తదితర అంశాలపై ఆమెకు తర్ఫీదు ఇస్తారు. తర్వాత కొంత కాలానికి ఆమె మామ కూడా మరణిస్తారు, ఆ తర్వాత సంవత్సరం తన ఏకైక కుమారుడు కూడా మృతి చెందడంతో అహల్యాబాయి హోల్కర్ అనూహ్యంగా ఇండోర్ పరిపాలనా బాధ్యతలు స్వీకరించారు. 
ఆమె రాణి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. ఆవిడ ఒక మహిళా సైన్యాన్ని తయారు చేయడంతోపాటు, యుద్ధంలో తన సేనలను ముందుండి నడిపేవారు. తన రాజ్య పరిధిలో లేని అనేక పుణ్యక్షేత్రాలలో ధర్మశాలలు నిర్మించారు. అంతేకాకుండా మహమ్మదీయుల దాడులలో ధ్వంసం కాబడ్డ ఎన్నో దేవాలయాలను ఆవిడ పునః ప్రతిష్ట చేశారు. ముఖ్యంగా సోమనాథ్ లోని ప్రముఖ సోమనాథేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం కాశీ క్షేత్రంలోని విశ్వనాథుని ఆలయం కూడా ఆవిడ నిర్మించినదే, ఇలా మన దేశంలో ఎన్నో తీర్థ క్షేత్రాల సందర్శించినప్పుడు ఆ మహనీయురాలు స్మరణకు రావడం అతి సహజం. భారతీయ సంస్కృతికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట *స్త్రీ శక్తి పురస్కారాన్ని* నెలకొల్పింది. *ఇండోర్లోని విమానాశ్రయానికి కూడా ""దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంగా""* నామకరణం చేశారు. ఇలాంటి మహనీయురాలు జయంతి సందర్భంగా వారి పవిత్ర చరణాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూన్నాము.



Comments

Popular posts from this blog

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు