జూన్
జూన్
జూన్-2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం,
జూన్ - 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం
జూన్ - 12 బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం
జాన్ - 13 మహారాణా ప్రతాప్ జయంతి
జూన్ - 14 ప్రపంచ రక్తదాన దినోత్సవం
జూన్ - 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం
*'మోగా'* *సంఘటన జరిగి రేపటికి ముప్పై ఏళ్ళు..*
*RSS (సంఘ) చరిత్రలో ఒక బాధాకరమైన ఆద్యాయం..*
*25 మంది స్వయంసేవకులు దేశం కోసం బలిదానం అయిన రోజు..*🚩🚩🚩🙏
ఆరోజుల్లో ప్రత్యేక రాజ్యమైన ఖలిస్తాన్ కావాలని కొంతమంది దారితప్పిన సిక్కు యువకులు పాకిస్తాన్ ప్రోద్బలంతో హింసామార్గం ఎంచుకున్నారు.ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. .హిందువుల మీదనైతే దాడులు ప్రారంభించారు కూడా.
అది 1989 జూన్ 25. *పంజాబులోని జిల్లా కేంద్రం మోగా పట్టణంలో నెహ్రూ పార్కు.* ఉదయపు నడక కోసం ఎంతోమంది పార్కులో ఉన్నారు. అదే పార్కులో ఒక చోట ఆరెస్సెస్ ప్రభాత్ శాఖ జరుగుతోంది. పెద్దలు, యువకులు, బాలల కేరింతలతో సందడిగా ఉంది.కొంతమంది పౌరులు వారి ఆటపాటలను చూసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.మరికొందరు అక్కడున్న బెంచీలమీద సేద తీరుతున్నారు. ఉన్నట్టుండి కొందరు ఆయుధదారులైన సిక్కు(ఖలిస్తాన్ ) తీవ్రవాదులు ఆ పార్కులోకి వచ్చారు. సంఘశాఖను చుట్టుముట్టారు.శాఖలో దేశభక్తిపూరిత వాతావరణంలో మునిగిఉన్న స్వయంసేవకులపై ఉన్నట్లుండి కాల్పులు జరపడానికి ఆయుధాలు సిద్ధం చేసుకోసాగారు. . అది గమనించిన స్థానిక నగర మాననీయ సంఘచాలక్ శ్రీ రామావతార్ గారు వెంటనే స్వయంసేవకులందరినీ నేల మీద ఒకరి మీద ఒకరిని పడుకోమని గట్టిగా అరిచారు. ఏం జరుగుతోందో అర్థం కాకపోయినా జ్యేష్ఠ అధికారి సూచనను పాటించడానికి ఉద్యుక్తులయ్యారు. అదే శాఖలో ఉన్న స్థానిక ప్రచారక్ శ్రీ నాగేశ్వర్ స్వయంసేవకులందరికన్నా పైన పడుకోబోయాడు. అయితే ఆయనను స్వయంసేవకుల క్రింద పడుకునేలా చేసి, అందరికంటే పైన శ్రీ రామావతార్ గారు పడుకున్నారు. ఖలిస్తాన్ తీవ్రవాదుల తుపాకులనుండి వెలువడిన తూటాలు ఆయన శరీరాన్ని జల్లెడలా మార్చేశాయి. అక్కడితో ఆగకుండా దాదాపు 25 మంది స్వయంసేవకుల శరీరాల్లోకి దూసుకుపోయి వారి వెచ్చటి నెత్తుటిలో తడిశాయి. శ్రీ నాగేశ్వర్ కు కూడా కాలిలో తూటాలు దిగబడ్డాయి.అయితే ప్రాణాలతో బయటపడ్డాడు.
జరిగిన సంఘటనను ఆ తర్వాత శ్రీ నాగేశ్వర్ గారు ఇలా వివరించారు:
' నేను స్వయంసేవకులపైన పడుకోవడానికి సిద్ధమవుతుంటే మాననీయ నగర సంఘచాలకులైన శ్రీ రామావతార్ జీ ఆపి, సంఘ కార్యవిస్తరణ కోసం సుదూర కర్ణాటక నుండి వచ్చిన మీరు చావకూడదంటూ నన్ను క్రింద పడుకోబెట్టి స్థానిక స్వయంసేవకులను నా మీద పడుకోబెట్టడమే గాక అందరికన్నా పైన ఆయన పడుకుని తమ ప్రాణాలను మొదట భారతమాత పాదాలపై సమర్పణ చేశారు. అందరికీ మార్గదర్శకులుగా ఉండే జ్యేష్ఠ కార్యకర్తగా అందరికన్నా ముందు తూటలకు తమ శరీరాన్ని అడ్డుపెట్టి , కొంతమందినైనా రక్షించి ఆయన మమ్మల్ని వీడి వెళ్ళిపోయారు.'
ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్న ఆ రోజుల్లో సిక్కులు, హిందువుల మధ్య సామరస్యం సాధించాలనే ఉద్దేశ్యంతో ఆరెస్సెస్ వివిధ ప్రాంతాలనుండి తన ప్రచారకులను పంజాబుకు పంపింది. అలా వెళ్ళినవారిలో శ్రీ నాగేశ్వర్ ఒకరు.
సరిగ్గా రేపటికి మోగా లో ఈ దురంతం జరిగి ముప్పై ఏళ్ళవుతోంది. ఇదంతా ఒకెత్తు కాగా ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా మరుసటి రోజే అంటే జూన్ 26 న యథావిధిగా సంఘ శాఖ రెట్టింపు సంఖ్యతో జరగడం మరింత విశేషం. తోటి స్వయంసేవకుల రక్తం చింది తడిసి ముద్దయిన నేలను ఉల్లాసభరితమైన దేశభక్తి నినాదాలతో ,తమ పదఘట్టనలతో మళ్ళీ పొడిపొడిగా మార్చిన స్వయంసేవకుల ధ్యేయనిష్ఠ ప్రశంసార్హమైంది.
రండి ! రేపటి మన మన సంఘశాఖల్లో , మోగా దురంతంలో దేశమాత పాదాలను తమ రక్తంతో అభిషేకించిన ఆ పవిత్రాత్మలకు సద్గతులు ప్రాప్తించేలా చేయమని మరోమారు ఆ సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుని ప్రార్థిస్తూ , మనమూ భారతమాత సేవకు పునరంకితమవుదాం.
*|| భారతమాతాకీ జై ||*
#రాణి__దుర్గావత
రెండు సార్లు మొగలులను ఓడించి, తరిమి కొట్టిన భారతీయ వీరవనిత
చత్రపతి శివాజి, లచ్చిత్ బర్ఫూకన్ లాంటి యోధులతొ సమానంగా మొగలులను తరిమి కొట్టిన వీరనారీమణులు కూడా భారతదేశంలొ ఉన్నారు. చరిత్రలొ కనుమరుగైన ఇటువంటి వారిలొ రాణి దుర్గావతి ఒకరు. 1524 లొ జన్మించిన రాణి దుర్గావతి, బుందేల్‌ఖండు సంస్థానములో ప్రసిద్ధికెక్కిన రాజులలో మొదటివాడైన చందవేల్ రాజుగారి కుమార్తె. చిన్నప్పటి నుండి రాజనీతిలొ, యుధ విధ్యలలొ ఆరితేరిన దుర్గావతి, 1545 లొ గడామండలా సంస్థానాధిపతి అయిన దళపతి ని వివాహం చేసుకున్నారు.
తరువాత దుర్గావతి ఒక కుమారునికి జన్మనిచ్చింది. తన కుమారినికి 10 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి దుర్గవతి భర్త అకాల మరణం చెందారు. దీనితొ రాజ్యభారం తన మీద పడటంతొ దుర్గావతి, తన 10 సంవత్సరాల కుమారినికి పట్టాభిషేకం చేసి, గొండు రాజ్య పరిపాలనా వ్యవహారాలు నిర్వహించసాగింది. సాత్పురా పర్వతాలలొని చౌరాఘర్ ప్రాంతంలొ శత్రు ధుర్బేద్యమైన కొటను నిర్మించి, తన రాజధానిని చౌరాగర్ కు మార్చింది. దుర్గావతి పరిపాలనా సమయంలొ గొండు రాజ్యం వ్యాపార, వ్యావసాయ రంగాలలొ అధుతమైన అభివృధి సాధించింది. ప్రజల ఆర్ధిక స్తితిగతులు గొప్పగా మెరుగు పడ్దాయి.
దీనితొ గొండు రాజ్యం మీద కన్నేసిన మాల్వా రాజు బహదూర్ ఖాన్, పెద్ద సైన్యంతొ దుర్గావతి పై దండెత్తి వచ్చాడు. ఈ యుధంలొ విరొచితంగా పొరాడిన రాణి దుర్గావతి కొద్ది కాలంలొనే బహదూర్ ఖాన్ ను చావు దెబ్బ తీసి, బహదూర్ ను ఓడించి తరిమి కొట్తింది.
దీనితొ రాణి దుర్గావతి పేరు ఉపఖండం అంతటా మార్మొగిపొవడంతొ, మొగల్ రాజు అక్బర్ కూడా రాణి దుర్గావతి రాజ్యమైన గొండు రాజ్యాన్ని ఆక్రమించుకొవాలని పధకం పన్నాడు. దీనితొ 1562 లొ తన సైన్యంలొ అత్యంత గొప్ప వీరునిగా పేరొందిన మాజిద్ ఖాన్ కు పెద్ద మొత్తంలొ సైన్యాన్ని, అధునాతన ఆయుధాలనందించి దుర్గావతి పై పంపించాడు.
అయితే ఏ విధంగా చూసిన మొగల్ సైన్యంతొ పొల్చుకుంటే, తన సైనం ఏ విషయంలొనూ సరి తూగదు. దీనితొ దుర్గావతి ప్యూహాత్మకంగా కొండ ప్రాంతమైన నరాయి ప్రాంతానికి చేరుకుని, మొగల్ సైన్యం అక్కడకు చేరుకొగానే ఒక్కసారిగా గెరిల్లా పొరాటం చేసి, మొగలులను తరిమి కొట్టింది. ఈ విధంగా రెండు సార్లు మొగల్ సైన్యాన్ని ఓడించడంతొ … ఈసారి మాజిద్ ఖాన్ ఊహించనంత పెద్ద మొత్తంలొ సైన్యాన్ని, పిరంగులను తీసుకుని దుర్గావతిపై హఠార్తుగా దందయాత్ర మొదలు పెట్టాడు.
దీనితొ ఊహించని ఈ పరిణామం నుండి తేరుకున్న దుర్గావతి ధైర్యంగా సైన్యాన్ని ముందుకు నడిపి, విరొచితంగా పొరాడసాగింది. ఒక వైపు తన సైనికులు మరణిస్తున్నా, చివరకు తన కుమారుడు కూడా యుధంలొ మరణిచినా దైర్యం కొల్పొకుండా, వెనక్కు తగ్గకుండా పొరాటం కొనసాగించింది. మాజిద్ ఖాన్ స్వయంగా అమెతొ పొరాడాలని వచ్చినప్పటికీ, దుర్గావతి రౌద్రాన్ని చూసి భయపడి దగ్గరకు వచ్చే సాహసం చేయలేక పొయాడు. అయితే పెద్ద మొత్తంలొ కాల్బలం, సైన్యాన్ని కలిగి ఉన్న మొగలుల ధాటికి తన సైనికులంతా మరణించడంతొ, మొగలులకు లొంగి పొవడం ఇష్టం లేక 1564, జూన్ 24 వ తేదీన తన కరవాలంతొ, తన శిరస్సును ఖండించుకుని వీరమరణం పొందారు.
ఇప్పటికీ ప్రతిసంవత్సరం జూన్ 24 వ తేదీను మద్యప్రదేశ్ లొ బలిదాన్ దివస్ గా జరుపుకుంటారు. ఈ రణశూరయైన దుర్గావతి యొక్క సమాధి జబల్పూర్ లొ నున్నది
June9
#బ్రిటిష్ #పాలన #నుండి #విముక్తి #కోసం #పోరాడిన #గిరిజన #వీరుడు #భగవాన్ #బిర్సా #ముండా
(నేడు స్వర్గీయ బిర్సా ముండా 146వ జయంతి సందర్భంగా..)
భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల నుండి విముక్తికై గిరిజన వీరుల పోరాటం గొప్పది మన దేశ స్వాతంత్రం కొరకు ధర్మ సంస్కృతుల రక్షణకై వనవాసుల హక్కుల కొరకు బిర్సా ముండా ఎనలేని కృషి చేశాడు. చోటానాగపూర్ ప్రాంతం అంటే నేటి జార్ఖండ్ మరియు బీహార్ రాష్ట్రాలు. అక్కడి ప్రజలను చైతన్యపరిచి బ్రిటిష్ పాలకుల అన్యాయాలను ఎదిరించి సాయుధ పోరాటం చేశాడు. ఆ కారణంగా అప్పటివరకు గిరిజనులను దోపిడీ చేస్తున్న బ్రిటిష్ పాలకుల తాబేదార్లు అయిన జమీందార్లు మరియు పటేళ్లు వీళ్లందరి పేత్తనాలను తొలగించి జిల్లా కలెక్టర్ల ద్వారా గిరిజనులకు భూమి హక్కులు లభించినవి.
1857 మొదటి స్వతంత్ర సంగ్రామం తరువాత యూరపు క్రైస్తవ మిషనరీలు విరివిగా గిరిజన ప్రాంతాలకు వచ్చి విద్య వైద్యం మరియు భూములకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి గిరిజనులను మభ్యపెట్టి మతం మార్పిడి చేయ పూనుకున్నారు. ఇలా ఆ రోజుల్లోనే ఆరు లక్షల మందిని గిరిజనుల్ని క్రైస్తవుడిగా మార్చారు. ముండా తెగకు చెందిన టువంటి గిరిజనుల పవిత్ర స్థలమైన టువంటి సరనా అనే పూజా స్థలములను క్రైస్తవులు ఆక్రమించ పూనుకున్నారు. ఇది గమనించిన ముండా తెగకు చెందిన పెద్దలైన సర్దారులు దీనిని వ్యతిరేకించి నందున నందున క్రైస్తవ ఫదరెలు కక్ష బట్టి గిరిజన సంప్రదాయాలను, ఆచారాలను, పండగలను మూఢనమ్మకాలుగా ప్రచారంచేసి అవహేళన చేయడం ఆరంభించారు.
1875 వ సంవత్సరంలో గురువారంనాడు అంటే బృహస్పతి వారము నాడు జన్మించిన బిర్సా ముండా భగవంతుని కృపతో ఈ గిరిజనులకు నాయకుడయ్యాడు. జార్ఖండ్లోని పులి హాట్ అనే గ్రామంలో జన్మించిన బిర్సా ఎంతో బీద కుటుంబంలో పుట్టినప్పటికీ తన ప్రతిభతో నిరంతర పరిశ్రమతో గిరిజనులను ప్రభావితం చేశాడు. బాల్యములో గోవులను మేపుతూ పిల్లనగ్రోవిని వాయించేవాడు. ప్రజలంతా ఆ గోపాలకృష్ణుడు తమరికి వచ్చారని అనుకునేవారు. ఆయన తండ్రి విలువ యొక్క విద్యాభ్యాసం కొరకు క్రైస్తవ పాఠశాలలో పంపించి వేశాడు. కానీ అక్కడ గిరిజనుల సాంప్రదాయాలను ప్రతిరోజూ క్రైస్తవులు తు దూల నాడే వారు. ఆ పాఠశాలల్లో చేరిన వారందరూ యొక్క పేరు మార్చి క్రైస్తవ పేర్లు పెట్టేవారు. అలా బిర్సా ముండా ని డేవిడ్ ముండ గా పేరు మార్చారు. ఆయన జంధ్యాన్ని తొలగించారు. పిలకలు కత్తిరించి వేశారు. భోజనము లో గోమాంసం పెట్టడం మొదలెట్టారు. గోవు మాకు తల్లి అని బిర్సా దీనిని పూర్తిగా వ్యతిరేకించాడు. క్రైస్తవ అధ్యాపకుల ప్రవర్తనను నిరసించాడు. అందుకే పాఠశాల నుంచి తొలగించ బడ్డాడు. ఆనంద్ పాండే అనే గురువు వద్ద తాను విద్యాభ్యాసం చేశాడు రామాయణము భారతము మొదలగు ధార్మిక గ్రంథాలను పరిపూర్ణంగా అధ్యయనం చేశాడు. అంతేకాకుండా ప్రకృతి లోని రక రకాల మందులను కనుక్కున్నాడు. ప్రజలకు వైద్యం చేస్తూ మన రోగాలను దూరం చేశాడు వారిలోని దురాచారాలను మూఢనమ్మకాలను దూరం చేశాడు,.
బిర్సా ముండాను ప్రజలు దైవంగా భావించి భగవాన్ బిర్సాగా భావించడం మొదలు పెట్టారు. ఆయన బోధనలలో ముఖ్యంగా
1. ఈశ్వరుడు ఒక్కడే.
2. గోసేవ ప్రాణి సేవ చేయాలి.
3. మత్తుకు బానిస కాకూడదు
4. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి.
5. ఇల్లు శుభ్రంగా ఉండాలి ప్రతి ఇంటి ముందు తులసి తప్పకుండా ఉండాలి.
6. పెద్దల యెడ గౌరవం ఉంచాలి
7. మన ధర్మాన్ని పాటించాలి.
8. మనమంతా కలిసి సంఘటితంగా ఉండాలి.
9. వారంలో ఒక రోజు అందరూ గ్రామ దేవతను పూజించాలి.
10. విదేశీయుల, వి జాతీయుల మోసాలకు బలి కావద్దు. ఇలా గిరిజనుల అందరికీ బోధించాడు
చైతన్యవంతమైన గిరిజనులు బిరసా దర్శనానికి రావడం మొదలుపెట్టారు. ఒకరోజున బిరస భగవాన్ తన శిష్యులను వెంటబెట్టుకొని అడవిలో వెళ్తుంటే అకస్మాత్తుగా పిడుగు పడింది. బిరసం పై వీరేష్ ఆపై బిర్సా పై పిడుగు పడిన విశాఖ ఏమీ కాలేదు పైగా ఆయన శరీరము జగజ్జేగీయమానం వెలుగుతున్నది.
బిర్సా పై పిడుగు పడినప్పటికీ ఆయన శరీరము జగజ్జేగీయమానం గా వెలుగుతున్నది. దీనిని గమనించిన శిష్యుడు గ్రామానికి వచ్చి జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పారు. ప్రజలంతా భూమి యొక్క దేవుడు అనే పేరుతో బిర్సా భగవాన్ అని పిలవడం మొదలెట్టారు అలా అనేక గిరిజన గ్రామాలలో తిరుగుతూ ప్రజలను ధార్మిక నింపుతూ ఆదర్శవంతమైన ఎటువంటి జీవితాన్ని గడపాలని ప్రజలకు చెప్పడం మొదలెట్టాడు. కానీ బ్రిటిష్ పాలకుల యొక్క దురాగతాల్ని భరించలేకుండా పోయారు ప్రజలంతా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురు అని అనుకున్నాడు ప్రజల్లో చైతన్యం తెచ్చి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటమే మనకు నిర్ణయించాడు విజయమో వీరస్వర్గమో ఇదే మనకు మార్గం అని గుర్తించారు మొట్టమొదట 1889 డిసెంబర్ 24వ తేదీన ఉన్న గులాం అని చోటినుండి బ్రిటిషు వారిపై యుద్ధం ప్రకటించారు. ఆ తిరుగుబాటు కారణంగా బ్రిటిష్ పాలకులలో అలజడి మొదలైంది. తెల్లదొరలను భయకంపితులగా కావించారు. రాత్రిపూట దాడి చేసిన గిరిజనులు బ్రిటిష్ వారి యొక్క పోలీస్స్టేషన్లో పైన వారి పాఠశాలలో పైన దాడులు ప్రారంభించారు. అన్ని వైపుల నుండి గిరిజనులు యొక్క బాణాల ధాటికి బ్రిటిష్వారు తట్టుకోలేకపోయారు. భయకంపితులై పారిపోయారు. ఆ తరువాత మూడు వందల అడుగుల ఎత్తున ఉన్నటువంటి డోన్ భారీ అనే కొండను ఆధారంగా చేసుకొని మళ్ళీ యుద్ధాన్ని ప్రకటించారు గిరిజనులు. ఆంగ్లేయులు మోసంతో బిర్సాను బంధించాలని ప్రయత్నం చేశారు రెండు మాసాలు ప్రయత్నించినప్పటికీ కూడా బంధించలేక పోయారు పట్టించిన వారికి బహుమతి ప్రకటించారు చివరికి బంధించి దగ్గర ఉండేటటువంటి హజారీబాగ్ జైలుకు తరలించారు.
ఇది తెలుసుకున్న టువంటి గిరిజనులు ముఖ్యంగా కోల్, సంతాల్, ముండా తెగలకు చెందినటువంటి గిరిజనులు అందరు కూడా హజారీబాగ్ పోలీస్ స్టేషన్పై దాడి చేశారు గిరిజనులు యొక్క ఇచ్చినటువంటి బ్రిటిష్ వారు భగవాన్ బిర్సా ను వదిలి పెట్టారు కానీ మోసంతో మళ్లీ ఆయనను బంధించి రాంచీ జైలులో ఉంచారు. జైలులో ఆయనను అనేక రకాల చిత్రహింసలకు గురి చేశారు చివరికి విష ప్రయోగం చేశారు భగవాన్ బిర్సా ఆవిధంగా మరణించాడు. ఉత్తరాదిన ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, బెంగాల్, ఒరిస్సా మొదలగు రాష్ట్రాలలో ఇప్పటికీ ప్రజలందరితో భగవాన్ గానే పూజింప పడుతున్నాడు. ఆయన చేసిన కృషి కారణంగా బ్రిటిష్ ప్రభుత్వంలో ఎంతో మార్పు వచ్చింది బ్రిటిష్ వారు అప్పటి నుండి గిరిజనులకు సహకరించడం మొదలు పెట్టారు.
అందుకే ఆయన పుట్టినటువంటి నవంబర్ 15వ తేదీన భారతదేశంలో గిరిజనుల యొక్క స్వాభిమాన దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
(నేడు స్వర్గీయ బిర్సా ముండా 145వ జయంతి సందర్భంగా..
Comments
Post a Comment