సెప్టెంబర్
*Happy Teachers day...🙏🙏*
*Teacher and God both are standing before me...whom should I pay obeisance..??*
*I bow to my teacher who guides me to God..*
*-Santh Kabirdas*
*ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం...*
నాలుగు గోడల మధ్య పౌర సమాజాన్ని తీర్చిదిద్దే రూపశిల్పి గురువు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ అయిదో తేదీన మనం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. దేశంలో కేజీ నుంచి పీజీ వరకు 15 లక్షల విద్యాలయాల్లో 32 కోట్ల మంది విద్యార్థులకు జ్ఞానధార ప్రబోధిస్తున్న 95 లక్షలమంది గురువుల పండగ ఇది. ఎన్ని రకాల విద్యా విధానాలున్నా ఉపాధ్యాయుడే విద్యార్థికి విలువైన గ్రంథం.
ఉపాధ్యాయుని గొప్పతనం గురించి కబీర్ దాస్ మాటల్లో..
*Teacher and God both are standing before me.. Whome should I pay obeisance..?? I bow to my teacher who guides me to God..*
యునెస్కో 1994 నుంచి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తోంది. ఏటా అక్టోబర్ అయిదున దీన్ని ప్రపంచమంతటా జరుపుతోంది. సమాజానికి అవసరమయ్యే శాస్త్రవేత్త, వైద్యుడు, ఇంజినీర్, సిపాయి, అధికారి, న్యాయవాది తదితర నిపుణులు తయారయ్యేది గురువుల చేతుల్లోనే. *ఉపాధ్యాయులు మానవ వనరుల సృష్టికర్తలు....* ఉపాధ్యాయ వృత్తి పొట్టకూటి కోసం చేసే సాధారణ ఉద్యోగం కాదు. అది విలువలతో కూడిన సామాజిక బాధ్యత కలిగిన గౌరవప్రదమైన వృత్తి.
పూర్వం విద్య గురుకేంద్రంగా ఉండేది. అంటే గురువు చెప్పిందే విద్య. తరవాతి తరాల్లో విద్య విషయ కేంద్రంగా మారింది. నిర్దేశించిన విషయాన్ని గురువులు ఆకళింపజేసుకుని విద్యార్థులకు బోధించేవారు. ఇక్కడి నుంచే గురువుల ప్రభావం కొంచెం తగ్గింది. కాలానుగుణంగా విద్యా విధానాల్లో అనేక మార్పులు, సంస్కరణలు చోటు చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు శిశు కేంద్ర విద్యావిధానమే నడుస్తోంది. అంటే విద్యార్థి దేనిపై మక్కువ చూపిస్తాడో ఉపాధ్యాయుడు తెలుసుకొని తదనుగుణంగా చదువు చెప్పాలి. నేర్పు, ఓర్పు అంతకుమించి అభిలాష ఉన్నవాళ్లే ఈ వృత్తిలో రాణిస్తారు.
*‘సాధారణ టీచర్ పిల్లలకు బోధిస్తారు, మంచి టీచర్ పిల్లలకు వివరిస్తారు, కానీ ఉత్తమ టీచర్ పిల్లల్ని ప్రభావితం చేస్తారు’ అనేది ఉపాధ్యాయ శిక్షణలో తొలి సూత్రం.*
ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడే బోధనా ప్రక్రియ విజయవంతమవుతుంది. ప్రతి వ్యక్తికీ జీవితంలో ఎవరో ఒక గురువు స్ఫూర్తి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి అత్యంత ఉత్తమమైనదని అరిస్టాటిల్, గాంధీజీ, ఐన్‌స్టీన్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటివారు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. ‘ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలిస్తే సమాజం సుసంపన్నమవుతుంది. గురుశిష్యులకు మధ్య జ్ఞాన ప్రసార సంబంధం ఉన్నతంగా ఉన్నప్పుడే దేశం విలువలతో విలసిల్లుతుంది’ అనేవారు సర్వేపల్లి. బడుల్లో నీతికథలు, పద్యాలు, వాచకాలు, ఉపవాచకాల ద్వారా నైతిక విలువలు అందిస్తూనే ఉన్నా సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతూనే ఉన్నాయి. అంటే విద్యార్థుల్లో నైతిక మార్పునకు కావలసినంత పరిజ్ఞానం అందడం లేదని అర్థమవుతోంది.
చదువులు- ర్యాంకులు, మార్కుల పోటీ పందేలుగా మారాయి. ఎప్పుడైతే గురుభావం సన్నగిల్లిందో విద్యార్థులకు వారిపై భక్తి, గౌరవం తగ్గుతోంది. ఉపాధ్యాయులకు గౌరవం దక్కితేనే విద్యార్థుల్లో విలువలు, సమాజంలో నైతికత ఏర్పడతాయన్నది విద్యావేత్తల అభిప్రాయం.
*సర్వేపల్లి ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశ అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పదవిని అలంకరించగా డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం రాష్ట్రపతి పదవి అనంతరం ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. మన దేశంలో ఉపాధ్యాయ వృత్తికున్న ఔన్నత్యమది.*
*Teacher should update and upgrade burning of the lamp learning of the teacher is must....*
ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వస్తున్న మార్పులు గ్రహిస్తూ, అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొన్నవారే ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతారు. మాతృభాషలో బోధించిన ఉపాధ్యాయులకు అరకొర శిక్షణతో ఆంగ్లమాధ్యమంలో పాఠాలు చెప్పాలనడం పెద్ద సవాలుగా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులూ పిల్లల్లో పరిపూర్ణ మూర్తిమత్వాన్ని కాకుండా కార్పొరేట్ విద్యాసంస్థల తరహాలో మార్కులే ఆశిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు లేకపోవడం పెద్ద అవరోధంగా మారింది.
సామాజిక మాధ్యమాల ప్రభావంతో పిల్లలు విపరీత ధోరణులతో ప్రవర్తించడం ద్వారా బోధనా ప్రక్రియకు అవరోధం కలిగిస్తున్నారు. ఆన్‌లైన్ బోధన, దూరవిద్య విద్యార్థుల్లో గురువులపట్ల గౌరవాన్ని బలహీన పరుస్తున్నాయి. అభిముఖ బోధనలో ఎన్నో విలువలు ఉంటాయి. ప్రత్యక్షంగా గురువును చూసి విద్యార్థి చాలా నేర్చుకుంటాడు. గురువులు పాఠాలతోపాటు విలువలు రంగరిస్తారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచుతారు. నైపుణ్యం అలవడేలా చేస్తారు. పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తారు. అలాంటి గురువు గౌరవానికి పూర్వవైభవం దక్కినప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది..
Comments
Post a Comment