డిసెంబర్
డిసెంబర్ 3
*సాహో వీరా... ఖుదీరామ్ బోస్ జయంతి
సందర్భంగా...*
*(డిసెంబర్ 3, 1889 - ఆగస్టు 11, 1908)*
స్వాతంత్ర సమర యోధుడు, అతి పిన్న వయసులోనే తెల్లవాళ్ళపై తిరగబడ్డ విప్లవవీరుడు, తల్లి భారతి యొక్క బుద్ధుబిడ్డ ఖుదీరామ్ బోస్...
*"నేను పట్టుబడితే మహా అయితే నన్ను ఉరి తీయవచ్చును కానీ ఇది నాకు వరం, నాకు తల్లి , తండ్రి గురువు అన్నీ నా భరతమాతే... ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి నా ప్రాణాలను అర్పించడం ఒక అదృష్టంగా భావిస్తాను, నా కోరిక ఒక్కటే... మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకూ నేను మళ్ళీ మళ్ళీ ఈ గడ్డపైన పుట్టి, నా జీవితాన్ని త్యాగం చేయాలని " అంటూ విప్లవవీరుల రహస్య సమావేశంలో సాయుధ పోరాటంలో రాటుదేలిన యోధులకి సైతం స్పూర్తినిస్తూ .... ముక్కుపచ్చలారని పసివాడు ఖుదీరామ్ బోస్ బాంబుదాడి చేయడానికి వెళుతూ చెప్పిన మాటలు నేను మర్చిపోలేను.*
భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి, భారతీయుల బానిసత్వాన్ని నిర్మూలించడానికి , అంగ్లేయుల అక్రమాలను అంతమొందించడానికి సాయుధ పోరాటానికి నాంది పలుకుతూ బ్రిటీష్ వారిపై మొట్టమొదటిగా బాంబు విసిరిన విప్లవవీరుడు ఖుదీరామ్ బోస్,
వందేమాతర నినాదాన్నే ఊపిరిగా, తెల్ల దొరలను తరిమి కొట్టడమే ధ్యేయంగా , పాఠ్యపుస్తకాలను వదిలి పోరుబాట పట్టి స్వాతంత్ర్య కాంక్షతో అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన దేశభక్తుడు ఖుదీరామ్ బోస్ ,
పాలుగారే పసితనంలో పలక పుస్తకం పట్టి ఆటపాటలతో గడపాల్సిన సమయంలో ఆంగ్లేయుల చేతిలో హింసలకు బలౌతున్న భారతీయలను ఎలా కాపాడగలనని ఆలోచిస్తూ ప్రాణాలు ఇచ్చైనా పోరాటం చేయాలని విప్లవమార్గం పట్టిన దేశభక్తుడు ఖుదీరామ్ బోస్.
వందేమాతర గీతం యొక్క సారాన్ని నిరక్షరాస్యులైన ప్రజలకు అర్ధమయ్యేలా, విద్యావంతులకు స్పూర్తినిచ్చేలా కరపత్రాలను తయారు చేసి స్వయంగా పంచుతూ అడ్డగించిన బ్రిటీష్ సైనికులపై ప్రతిదాడి చేసి బ్రిటీష్ ప్రభుత్వానికి వణుకు పుట్టించిన భారత బెబ్బులి ఖుదీరామ్ బోస్.
.
అత్యంత క్రూరుడైన కింగ్ ఫోర్ట్ పై మొట్ట మొదటి బాంబుదాడి చేసి బ్రిటీష్ దొరలకు ప్రాణభయాన్ని రుచి చూపించిన మొట్టమొదటి భారతీయుడు ఖుదీరామ్ బోస్.
బ్రిటీష్ వారిచ్చే బహుమతికి కక్కుర్తిపడి సాటి భారతీయుడే తనని పట్టిస్తే, ఉరిశిక్ష విధించిన జడ్జీ నీ చివరికోరిక ఏంటని ప్రశ్నించినపుడు ఖుదీరామ్ బోస్ చెప్పిన సమాధానం " మీరు గనుక అనుమతిస్తే ఇక్కడున్న నా భారతీయ సోదరులకు కూడా బాంబుల తయారీ గురించీ, దాని మెళుకువల గురించీ చెప్పాలనుకుంటున్నాను " అని. కోర్టు దానికి అనుమతించకపోవడంతో తన స్పూర్తిని ప్రజల్లో నింపుతూ వందేమాతర నినాదం చేస్తూ, భరతమాతకు జై కొడుతూ భగవద్గీత చేత్తో పట్టుకుని ఉరికంబానికి వేలాడి తన దేశభక్తిని చాటుకున్న గొప్ప దేశభక్తుడు ఖుదీరామ్ బోస్....!!!
ఇలాంటి దేశభక్తుల చరిత్రలు తెలియని మీ మిత్రులకూ, పిల్లలకూ ఇలాంటి వారిని గురించి తెలియచేసి మీ దేశభక్తిని చాటుకుంటారని ఆశిస్తూ.... ఈరోజు ఎందరికో స్పూర్తి నింపి మరెందరికో ఆరాద్యనీయుడైన సుప్రసిద్ద స్వతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి (3/12/1889) సందర్భంగా నివాళులు . .....
#డిసెంబర్ 3
*34 ఏళ్ల క్రితం, భోపాల్ గ్యాస్ దుర్ఘటన గుర్తుందా..?*
*ఆండర్సన్... ఆయన్ను దేశం దాటించిన నాటి ప్రధాని రాజీవ్... వేలకొద్దీ మరణాలు... లక్షలకొద్దీ వికలాంగులు.*
*నేటికీ కూడా ఆ విషవాయువు ప్రభావంతో బతుకీడుస్తున్న అభాగ్యులూ.. వీరందర్నీ క్షమించేయాలట.. ఎందుకంటే ఆండర్సన్ ప్రభువును నమ్మారట, వారు పాపి కాదు అలానే పాపం రాజీవ్ కూడా.. అందర్నీ క్షమించేయండి !!*
*ఎందుకంటే ఆ విషవాయువు వల్ల ఈవిడకి ఏం కాలేదుకదా..!!*
*డిసెంబర్ 3, 1984 ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదాల్లో ఒకటయిన భోపాల్ గ్యాస్ లీక్ ఉదంతంతో దేశం మొత్తం అంతులేని విషాదంలో మునిగిపోయింది. దాదాపు పదివేలమంది ప్రాణాలు హరించి, ఆరు లక్షల మందిని శాశ్వత వికలాంగులను చేసిన ఈ సంఘటన కేవలం ప్రమాదం కాదని యాజమాన్య నిర్లక్ష్యం కూడా ఒక ప్రధాన కారణం అని తరువాత దర్యాప్తులో తేలింది. ఇంతమంది అమాయక ప్రాణాలు రాత్రికిరాత్రి గాల్లో కలిసిపోవడానికి కారణమయిన దోషులను సింపిల్‌గా "క్షమించమని" స్టేట్మెంట్ ఇచ్చేసింది మన మదర్-టి.*
*ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది విన్న టీవి విలేఖరి తను విన్నది నమ్మలేక మళ్ళీ మళ్ళీ అడిగాడట. ఇక ఎటువంటి తప్పు చేసినవారినయిన ఆవిడ నమ్మిన ప్రభువులా క్షమించడం ఈవిడ దయాగుణంకి, గొప్పతనానికి ప్రతీక అని కొన్ని మీడియా వర్గాలు బాగానే బాకా ఉదాయి.*
*ప్రపంచంలో అందరూ ఈవిడలా అతి మంచి వాళ్ళయిపోయి ఎవర్ని పడితే వాళ్ళని క్షమించే గుణం వచ్చేస్తే అసలు ఈ కోర్టులు, కేసులు, పోలీసులు, మిలటరీ అంటూ ఈ దండగ ఖర్చులు అనవసరం కదా..?*
👉 *ఇక్కడ గమనించాల్సిన ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ప్రమాదానానికి కారణమయిన కంపెని అమెరికన్ కంపెనీ కాబట్టి చొక్కాలు చించుకుని పరిగెత్తిన ఏ కమ్యూనిస్టు కుక్కా ఆ నేరస్తులని బహిరంగంగా వెనకేసుకొచ్చిన ఈవిడ గారి మీద మాత్రం మొరగలేదు. ఇక వీళ్ళ దేశభక్తీ గురించి మళ్ళీ మళ్ళీ ఎందుకులెండి.*
~(text courtesy by a senior janavignana vedika volunteer)..
34 years of the BHOPAL GAS TRAGEDY.
0% accountability, No persecution
Justice Denied and how! #LestWeFORGET
.*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ*
*అఖిల భారతీయ ప్రహార్ మహాయజ్ఞం నివేదిక - డిసెంబర్ 16 ,2019, కామారెడ్డి జిల్లా*
*నగర / ఖండ పేరు :* రాజంపేట
*మొత్తం శాఖలు :*
*పాల్గొన్న శాఖల సంఖ్య :*
*ప్రహార్ మహా యజ్ఞంలో పాల్గొన్న స్వయంసేవకుల సంఖ్య :*
*తరుణ :*
*బాల :*
*ప్రౌడ :*.
*మొత్తం ప్రహర్లు:*
*1000 పైన ప్రహార్ల్ చేసిన శాఖ స్వయంసేవకుల సంఖ్య :*
*25+ స్వయంసేవకుల సంఖ్య ఉన్న శాఖలు:*
*45 సంవత్సరాల వయసు లోపు ఉన్న వారి సంఖ్య :*
*సరిఅయిన ప్రహార్లు చేసిన వారి సంఖ్య :*
*ఎక్కువ ప్రహర్లు చేసిన శాఖ పేరు:* శివాజీ శాఖ
*ఎన్ని ప్రహర్లు :*
*ఎక్కువ ప్రహర్లు చేసిన స్వయం సేవక్ పేరు శాఖ పేరు :*
*ఎన్ని ప్రహర్లు :*
*తాగుబోతు దినోత్సవం,తరుముకొంటూ వస్తున్నది*...
*జనవరిలో కెళ్ళేముందే, జాన్వర్ గా మార్చేందుకు*...
*౹౹ తాగుబోతు ౹౹*
*తప్పతాగి ఎంతూగినా, తప్పుండదు ఆనాడూ*...
*తెల్లార్లూ తాగి ఊగు, తెల్లవాడి వారసుడిగ*...
*క్లబ్బుల్లో పబ్బుల్లో, కల్సిమెల్సి తిరుగొచ్చు*...
*సభ్యులైన వాళ్ళంతా, అభ్యుదయ వాదులంట*...
*౹౹ తాగుబోతు ౹౹*
*మనదీ కాకున్ననేమీ, మంచిదైతే బాగుండును*...
*చుక్కల గమణం చెప్పని, తప్పుల క్యాలండరది*...
*అందమైన చంద్రుడి గతి, అందుకోని క్యాలండర్*...
*అమావాస్య పౌర్ణమంటే, అసలేంటో తెల్వదంట*...
*గ్రహణం గతులిందులోన, ఎంతెతికిన దొరుకవంట*...
*౹౹ తాగుబోతు ౹౹*
*బానిసత్వ పాపానికి, బహుమతిగా వచ్చిందోయ్*...
*భారతీయ సంస్కృతిని, బల్లిలాగ పట్టిందోయ్*...
*త్యాగధనులంతకల్సి,ఆంగ్లేయుల తరిమేస్తే*...
*మత్తులోన ముంచివాడు, మళ్ళీవస్తుండు జూడు*...
*౹౹ తాగుబోతు ౹౹*
*మత్తువదిలి చూడు నీవు, మనపండుగ ఉగాదిని*...
*ఏడాదికే కాదు ఆది, యుగానికీ ఆదేనోయ్*...
*ప్రకృతితో పెనవేసిన, పండుగలు మనవండీ*...
*విజ్ఞానం జోడించిన, విలువలతో నిండెనండి*...
*౹౹ తాగుబోతు ౹౹*
*వేలయేళ్ళ కాలగణన, వేళ్ళతోనే లెక్కించిరి*...
*ఖగోళం భూగోళం, కథలతోనే వివరించిరి*...
*పరిణామ క్రమాన్నంత, పురాణాల్లో వర్ణించిరి*...
*ఉగాది పచ్ఛడికే ఊఊఊఊ... కోట్టవోయ్,తాగుబోతు పండుగను ఛీఛీఛీఛీఛీ... కొట్టవోయ్*...
*౹౹ తాగుబోతు ౹౹*
#డిసెంబర్ 22
నిత్య స్మరణీయులు
నేడు గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతి..
నాగార్జునో భరద్వాజ
ఆర్యభట్టో బసుర్భుధ:!
ధ్యేయో వే౦కటరామశ్చ
విజ్ఞా రామానుజాదయ:!!
*శ్రీనివాస రామానుజన్..
*13ఏళ్లకే త్రికోణమితి థియరీలను రాసిన మేధావి*_
_*మహా మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే సమస్యలను అలవోకగా ఎలాంటి పుస్తకాల సాయం లేకుండా సాధించి, ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్.*_
_*ప్రధానాంశాలు:*_
_*20వ శతాబ్దపు మేటి ప్రపంచ గణిత శాస్త్రవేత్తల్లో ఒకరుగా రామానుజన్ గుర్తింపు.*_
_*క్లిష్టమైన త్రికోణమితి సిద్ధాంతాలను ఔపోసపట్టిన దేశం గర్వించదగ్గ మేధావి.*_
_*చిన్న వయసులో అసాధారణ ప్రతిభతో ఔరా అనిపించుకున్న రామానుజన్.*_
_*ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న దశాంశమాన పద్దతిని వేల సంవత్సరాల కిందటే భారతీయులు వినియోగించారు. మూడో శతాబ్దానికి ఈ పద్దతి వినియోగంలో ఉంది.*_
_*అయితే, భారతీయులు దీన్ని ఎలా ఆవిష్కరించారో తెలియదు కానీ నిర్దిష్టమైన గణిత విధానాన్ని మాత్రం రూపొందించారు. ప్రపంచమంతా ఇప్పుడు వినియోగిస్తున్న 1 నుంచి 9 వరకు అంకెలతో పునాదులేసి ఆ తరువాత కొత్తగా సున్నా(0)ను సైతం కనుగొని గణిత ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పారు. అప్పటి వరకు చుక్కానీలేని నావలా ఉన్న గణితానికి భారతీయులు సున్నాను కనిపెట్టి కొత్త రూపునిచ్చారు. తొలిసారి శూన్య భావనకు ఒక అంకెను ఆవిష్కరించిన భారతీయులు ప్రపంచ గణితాన్ని కొత్తపుంతలు తొక్కించారు.*_
_*ఇక, 20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు సాధించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్. తమిళనాడులో ఈరోడ్‌లోని కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు 1887 డిసెంబరు 22 న రామానుజన్ జన్మించారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు. పదమూడేళ్లకే ఎస్ఎల్ లోనీ త్రికోణమితిపై రాసిన పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాదు తను సొంతంగా సిద్ధాంతాలు కూడా ప్రారంభించారు.*_
_*జీఎస్ కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథ్‌మెటిక్స్ అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్‌లోని ప్రతిభను బయటకు తీసుకొచ్చింది. అందులోని ఆల్జీబ్రా, అనలిటికల్ జామెట్రీ లాంటి విషయాలకు సంబంధించిన 6,165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం నానా తంటాలు పడేవారు. అయితే వారు అవగాహన చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్ ఎలాంటి పుస్తకాల సహాయం లేకుండా అలవోకగా పరిష్కరించారు.*_
_*కుంభకోణంలోని ప్రభుత్వ కాలేజీలో చేరిన రామానుజన్ తన దృష్టి కేవలం గణితంపై కేంద్రీకరించడంతో ఎఫ్.ఎ. పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత మద్రాసు లోని వచ్చయ్యప్ప కళాశాలలో చేరిన ఆయన, అక్కడ అధ్యాపకుడు ఎన్.రామానుజాచారి గణిత సమస్యలను కఠినంగా చెప్తుంటే, వాటిని సులభమైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించేవాడు. రామానుజన్ ప్రతిభను గుర్తించిన ప్రొఫెసర్ సింగారవేలు మొదలియార్ ఆయనతో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలపై చర్చించి వాటిని సాధించేవారు.*_
_*1909లో జానకి అమ్మాళ్‌ను రామానుజన్ వివాహం చేసుకున్నారు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ లాంటి విషయాలపై పరిశోధనలు కొనసాగించారు. 1913లో మద్రాసు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ ఈ పరిశోధనలు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధన సిద్ధాంతాలను ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్టీకి పంపాడు.*_
_*మహా మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చూసిన హార్టీ, రామానుజన్‌ను కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్ వెళ్లిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి గౌరవం పొందిన తొలి భారతీయుడిగానూ, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడిగానూ ఆయన చరిత్రకెక్కారు. ఐదేళ్ల అనంతరం బ్రిటన్ నుంచి 1919 మార్చిలో స్వదేశానికి తిరిగి వచ్చారు.*_
_*అపారమైన తన గణిత పరిజ్ఞానంతో భారతీయ ప్రతిభను ప్రపంచానికి చాటిన చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో తన 33వ ఏట 1920 ఏప్రిల్ 26న కుంభకోణంలో కన్నుమూశారు. బ్రిటన్‌లో ఉన్న సమయంలో ఆరోగ్యం గురించి ఏమాత్రం లెక్కచేయకుండా గణిత పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఇండియాకు వచ్చిన ఏడాది తర్వాత అంటే 1920 ఏప్రిల్ 26న అస్తమించారు. జీవిత చరమాంకంలో రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వేర్, ప్యూర్ మాథ్స్‌కు చెందిన నెంబర్ థియరీ, మాక్ తీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి.*_
_*వీటిని ఆధారంగా చేసుకుని కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్‌పై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని 1986-87 రామానుజన్ శతజయంత్యుత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ప్రకటించారు. గణితశాస్త్రంలో రామానుజన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది.*_
_*తీవ్రమైన అనారోగ్యంతో మంచానపడ్డప్పుడు కూడా హార్డీకి 1729 సంఖ్య ప్రత్యేకతను వివరించి ఆశ్చర్యపరిచారు. ఈ సంఘటన గురించి
హార్డీ తన మాటల్లో ఇలా చెప్పారు‘నేనోసారి రామానుజన్‌ను చూసేందుకు ట్యాక్సీలో వెళ్లాను. దాని నెంబరు 1729. ఈ నెంబరు చూడటానికి డల్‌గా కనిపిస్తోంది.. ఇది దుశ్శకునమేమీ కాదుగదా అని అన్నాను. దానికి బదులుగా రామానుజన్ ఇలా అన్నాడు.. ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య.. రెండు సంఖ్యల ఘనాల మొత్తాన్ని రెండు వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నిటికంటే చిన్నదని విశదీకరించారు.. 1729 = 10Cube +9Cube =12Cube+1Cube. వీటిని ట్యాక్సీ క్యాబ్ సంఖ్యలు అని పిలుస్తారు. గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగానికి, అంకిత భావానికి ఇది నిదర్శనం’ అని హార్టీ అన్నారు.*_
_*రామానుజన్ జీవిత చరిత్రను రాసిన మొట్టమొదటి రచయిత ఆయన్ను శుద్ధ సాంప్రదాయవాదిగా పేర్కొన్నారు. ‘తన ప్రతిభాపాటవాలు, సామర్థ్యం అంతా తమ ఇలవేల్పు నామగిరి ప్రసాదించినదేనని రామానుజన్ బలంగా విశ్వసించేవారని.. తనకు ఏ కష్టమొచ్చినా ఆమె సహాయం కోసం ఎదురు చూసేవారు.. ఆమె కలలో కన్పించి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపించగలదని భావించేవారు. భగవంతుడు ప్రాతినిధ్యం వహించని ఏ ఆలోచన కూడా సూత్రం కాదని అప్పుడప్పుడూ అంటుండేవారు’ అని వివరించారు. అయితే, రామానుజన్ అన్ని మతాలు ఒకటిగా నమ్మేవాడని హార్డీ పేర్కొన్నారు. ఆయన ఆధ్యాత్మికతను భారతీయ రచయితలు అతిగా అర్థం చేసుకున్నారని వివరించారు.*_
#డిసెంబర్ 25
*నేడు.... ఈ...#మహనీయుల జన్మదినం...!!*
మొదటివారు === #అటల్_బిహారీ_వాజపేయి (జ.డిసెంబర్ 25 1924)
మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. ఇతను మొదటిసారిగా రెండవ లోక్‌సభకు ఎన్నికైనారు. మధ్యలో 3వ మరియు 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోక్ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికైనారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన #మొరార్జీ_దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. ఆయన అనారోగ్య కారణాలవళ్ళ క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గానూ భారత ప్రభుత్వం డిసెంబర్ 24, 2014లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. #వాజ్‌పేయీ కి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం '#భారతరత్న' మార్చి 27 2015 న ప్రదానం చేశారు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజ్‌పేయీకి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే వాజ్‌పేయీ నివాసానికి తరలి వచ్చారు.
రెండవ వారు === #మదన్_మోహన్_మాలవ్యాా (డిసెంబర్ 25, 1861 - నవంబరు 12, 1946)
భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ"గా కూడా పిలువబడుతున్నారు. ఆయన "మహాత్మా"గా కూడా గౌవరింపబడ్డాడు. మాలవ్యా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1915 లో స్థాపించాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం మరియు ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం. ఇందులో 12,000 లకు పైగా విద్యార్థులు కళలు,విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ లలో విద్యనభ్యసిస్తున్నారు. మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశారు.
మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909 & 1913,1919,1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఆయన హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. మాలవ్యా "భారతీయ స్కౌట్స్ మరియు గైడ్సు"కు ఒక వ్యవస్థాపకుడు. ఆయన 1909 లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక లీడర్ పత్రికను స్థాపించారు. ఆయన 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్కు చైర్మన్ గా ఉన్నారు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగపడ్డాయి.
మాలవ్యా భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన భారతరత్నకు డిసెంబర్ 24,2014 న ఎంపికైనారు. ఈ అవార్డును ఆయన 125 వ జన్మదినం ముందుగా పొందారు.
#డిసెంబర్ 26
*ఉద్దం సింగ్* :
బహూశా ఈయన గురించి చాలా అందికి తెలిసి ఉండదు. ఈయనను ఇతడిని షహీద్-ఎ-అజం అంటారు అంటే #వీరులలో_అగ్రుజుడు అని అర్ధం. 1919లొ తన కళ్లముందే బ్రిటీష్ జనరల్ #డయ్యర్ జలియన్ వాలాబాగ్ లొ 1200 మందిని పిట్టలను కాల్చినట్టు కాల్చడం చూసి చలించిపొయారు. ఇంత మంది రక్తం కళ్లచూసిన డయ్యర్ ను చంపకపొతే నేను భారతీయుడనే కాదు అని అక్కడి శవాలపై శపధం చేశారు. ముందుగా ఉద్దం సింగ్, భగత్ సింగ్ పని చేస్తున్న గద్దర్ పార్టీ లొ చేరారు. అక్కడే షూటింగ్ చేయడం, గూఢచర్యం చేయడం నేర్చుకున్నారు. 1935 లొ బ్రీటీష్ వారు కన్నుగప్పి కాశ్మీరు చేరుకుని అక్కడి నుండి జర్మనీ వెళ్ళారు. అక్కడి నుండి కూలివాడిగా లందన్ చేరుకుని జనరల్ డయ్యర్ పై Spying చేయడం మొదలు పెట్టారు. లండన్ లొ అనేక రొజులు తిండిలేక నీళ్ళు తాగి బతికేవాడు.
1940 లొ జనరల్ డయ్యర్ ఈస్టు ఇండియా కపెనీ Conference కు వెళ్తున్నాడన్ని తెలుసుకుని ముందుగా అక్కడికి చేరుకున్నారు. కాసేపటికి డయ్యర్ రావడంతొ మెరుపువేగంతొ అతనిముందు ప్రత్యక్షమై నా భారతీయుల ప్రాణాలకు నీకు ఇదే శిక్షరా కుక్క అంటూ కుక్కను కాల్చినట్టు కాల్చి చంపాడు. తరువాత 17 రొజులకు ఉద్దం సింగు ని బ్రీటిష్ ప్రభుత్వం ఉరితీసింది. తిండి లేకపొయినా పగతొ బ్రతికేయవచ్చు అని మన సినిమాలలొ ఉపయొగించే డైలాగు ఈయన చెప్పినవే.
ఈ రొజు ఈ మహా వీరుని జయంతి.
పగ కూడా మనిషిని బతికిస్తుంది...కొన్ని సార్లు"
అది 1919 ఏఫ్రెల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ .....అక్కడ ఓ చిన్నతోటలో .... రౌలత్ చట్టానికి వ్యతిరేఖంగా శాంతియుతంగా భారతీయులు సభ జరుపుకుంటున్నారు.
ఇంతలో అక్కడ ఉన్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధర్యంలో ఏ హెచ్చరిక లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరపడం జరిగింది. దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగ్రాతుృలైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటన గా చరిత్రలో మిగిలిపోయింది..
ఆ రోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయడానికి ఒక అనాధశరణాలయం నుండి 19 యేండ్ల కుర్రాడు వచ్చాడు.. జరిగిన దురంతం చూసి చలించిపోయాడు. నేలమీదపరుండి ప్రాణాలు కాపాడుకున్న ఆ కుర్రాడు..శవాల గుట్టలను చూసి కోపంతో వణికిపోయాడు.. కంటినిండానీరు ఉబికివస్తుండగా ఆ తోటలోని రక్తం అంటినమట్టిని తీసుకొని "ఈ దురంతానికి కారకుడైన వ్యక్తులను చంపేదాకా నేను చావను"అంటూ ప్రతిజ్ఞ చేశాడు.
దీనికి కారకుడైన జనరల్ ఓ డయ్యర్ ను వెతుకుంటూ బయలు దేరాడు. తుపాకీ కాల్చుడం నేర్చుకున్నాడు. కొన్నిరోజులు భగత్ సింగ్ తో కలిసి విప్లవకార్యక్రమా లలో పాల్గొన్నాడు..
జనరల్ ఓ డయ్యర్ ను చంపేందుకు ఇంగ్లండ్ పయన మవ్వాలనుకుంటున్న సమయంలో భగత్ సింగ్ తో పాటు ఆయనను అరెష్ట్ చేశారు.తన కళ్ళముందే భగత్ సింగ్ ను ఉరితీయడం చూసి హతాసుడైనాడు..1932లో విడుదలైన తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఇంగ్లండ్ పయన మైనాడు. పేరు మార్చుకుంటూ జనరల్ ఓ డయ్యర్ ను వెంటాడ సాగాడు.. దీనికోసం చాలా కష్టాలు పడ్డాడు. ఆకలితో నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపాడు.
ఆరోజు 1940 జూలై 13....
ఓ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరుకాబోతున్నాడు. ఆ సమాచారం ఆయువకునికి అందింది... వెంటనే అతను ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్ సంపాదించాడు ..
ఒకపుస్తకంలో ఫిస్టల్ పట్టేటట్లు కాగితాలను కత్తించి అందులో ఫిస్టల్ దాచాడు.. అది చేతపట్టుకొని ఏమీ ఎరగనట్లు 9
ఓ డయ్యర్ సభకు వెళ్ళాడు...
సభ ప్రారంభమైంది.. ఓ డయ్యర్ ను వీరుడు, ధీరుడంటూ ఆంగ్లేయులు పొగిడేస్తున్నారు...
అది వింటున్న ఆ యువకుడి రక్తం సలసలా మరిగి పోసాగింది. జలియన్ వాలా బాగ్ లో అమాయకుల ఆర్తనాదాలు గుర్తుచ్చాయి..
రక్తమడుగులో గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలిడుస్తున్న అభాగ్యులు గుర్తుకొచ్చారు.. కానీ ఆధీరుడు తన ముఖంలో ఆచాయలు కనిపించనీయకుండా గంభీరంగా ఉన్నాడు...
ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది...ఆయనను అభినందించాడానికి జనాలు ఆయన దగ్గరకు వెళుతున్నారు.
ఆ యువకుడి కూడా లేచి పుస్తకం చేతబట్టుకొని డయ్యర్ దగ్గరకు వెళుతున్నాడు...
నిశితంగా గమనిస్తున్న ఓ డయ్యర్ ఆ యువకుడి వేషధారణను చూసి ఏదో గుర్తుకొస్తున్నట్లు అనిపించి కంగారు పడుతూ అప్రమత్తమ య్యేందుకు లేచాడు.
అంతే ఆయువకుడు పుస్తకంలోని పిష్టల్ మెరుపువేగంతో తీసి అంతే వేగంతో ఓ డయ్యర్ పై గుళ్ళ వర్షం కురిపించాడు..
భారత్ మాతాకీ జై అంటూ ధైర్యంగా అక్కడే నిలుచున్నాడు....
వేలమందిని చంపి భారతీయులు నా బానిసలు..వారి ప్రాణాలు నేను పెట్టిన బిక్ష అంటూ జలియన్ వాలాబాగ్ కాల్పుల తర్వాత గర్వంగా అన్నాడో... ఆతను జనరల్ ఓ డయ్యర్ నేలకొరిగాడు.. ప్రాణాలు విడిచాడు.
ఓ డయ్యర్ ను చంపిన తరువాత ఈయనను చంపడానికే నేను ఇన్నిరోజులు బతికాను.ఇంక నన్ను ఏమైనా చేసుకోండి అంటూ లొంగిపోయాడాయువకుడు...ఆ విప్లవవీరుడి జయంతి నేడు.
ఇంతకీ ఆ యువకుడి పేరేమిటో తెలుసా????
షంషేర్ ఉద్దామ్ సింగ్ ....
డిసెంబర్ 26 స్వాతంత్ర్య సమరయెాధుడు
"ఉద్దమ్ సింగ్" జయంతి....
"జోహార్ ఉద్దాం సింగ్ ...జోహార్ "💐🙏💐
Comments
Post a Comment