స్వయంసేవక్
🚩!! संघ परिचय !!🚩
"राष्ट्रीय स्वयंसेवक संघ" यह तीन शब्दों का एक समुच्चय है।
(अ) राष्ट्रीय (ब) स्वयंसेवक (स) संघ
(अ) राष्ट्रीय :- जिसकी अपने देश, उसकी संस्कृति, उसकी परम्पराओं, उसके महापुरुषों, उसकी सुरक्षा एवं समृद्धि के प्रति निष्ठा हो, जो देश के साथ पूर्ण रूप से भावनात्मक मूल्यों से जुड़ा हो अर्थात जिसको सुख-दुःख, हार-जीत व शत्रु-मित्र की समान अनुभूति हो वह राष्ट्रीय कहलाता है।
अपने देश में राष्ट्रीयता हेतु सभी आवश्यक तत्वों की पूर्ति हिन्दु समाज के जीवन में हो जाती है। अतः हिन्दु समाज का जीवन ही राष्ट्रीय जीवन है अर्थात "हिंदुत्व🚩 ही राष्ट्रीयत्व है" व्यवहारिक रूप से राष्ट्रीय, भारतीय व हिन्दु पर्यायवाची शब्द हैं। इसलिये संघ ने "राष्ट्रीय" शब्द को संघठन के नाम में प्रथम स्थान प्रदान किया ।
(ब) स्वयंसेवक :- जो स्वयं की प्रेरणा से बिना किसी प्रतिफल व पुरस्कार की इच्छा के, अनुशासन पूर्वक, निर्धारित पद्धति से नित्य, राष्ट्र, समाज, देश, धर्म, संस्कृति की सेवा करने, रक्षा करने और उसकी अभिबृद्धि के लिए प्रमाणिकता व निःस्वार्थ बुद्धि से कार्य करने को उत्सुक हो ऐसे व्यक्ति को स्वयंसेवक कहते हैं। क्योंकि संघ का कार्य राष्ट्रीय समाज में इन गुणों को जागृत व स्थापित करना है इसलिए संघठन का द्वितीय नाम "स्वयंसेवक" रखा गया।
(स) संघ :- संघ का शाब्दिक अर्थ संघठन, समूह तथा समुदाय, समान विचार, समान लक्ष्य को समर्पित एवं परस्पर आत्मीय भाव से युक्त जिनकी पद्धतियां, रीती परस्पर एक दूसरे से पूर्ण रूप से मिलती हैं व जो पूर्ण समर्पण भाव से कार्य करते हैं ऐसे व्यक्तियों के समूह को संघ कहते हैं।
*#స్వయంసేవక్ గాబతుకుదాం*
*కార్యరూపంలో జీవించుదాం..*
శత్రువులెప్పుడూ స్వార్ధపరులను వెదుకుతూ ఉంటారు. స్వార్థపరుల కోరికలను తీరుస్తూ తమ ప్రయోజనాలను సాధించుకుంటారు. కాబట్టి లక్ష్య సాధన ఒక్కటే మన స్వార్థం కావాలి.
కార్యసాధనలో మన వ్యక్తిగత పేరు ప్రతిష్ఠలు నాశనం అయిపోయినా పర్వాలేదు. జాతి కీర్తి నిరంతరం ఉండాలి. ఆ సమయంలో వ్యక్తిగత పేరు ప్రతిష్ఠలు లేకపోయినప్పటికీ చింతించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. మనం కార్యరూపంలో జీవించాలి. నీళ్లలో పడిన ఉప్పురాయి తన అస్థిత్వాన్ని కోల్పోతుంది. కేవలం దాని రుచి మాత్రమే మిగులుతుంది. అదే విధంగా మనం కూడా జాతి జీవనంలో కలిసి పోవాలి.
లక్ష్య సాధన సమయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం: అహంకారాన్ని పూర్తిగా త్యజించాలి. అహంకారంపై విజయం సాధించక తప్పదు. ఎన్నిరకాల పనులు చేస్తున్నప్పటికీ అహంకారాన్ని మన దరిదాపులకు కూడా రానీయ కూడదు.
ముల్లోకాలను పీడిస్తున్న రావణుడిని శ్రీరామచంద్రుడు వధించాడు. ధర్మ ప్రతిష్ఠను పెంచాడు. ప్రపంచానికి సుఖ సంతోషాలను పంచాడు. ఆయనను స్తుతించడానికి దేవతలు దిగివచ్చారు. అప్పుడు రామచంద్రుడు 'మీరు నన్ను ఎందుకు పొగుడుతున్నారు. నేను ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం' అని ఎదురుపలికాడు. శ్రీరామచంద్రుడే దేవతలందరికీ నమస్కరించాడు.
ఇలాగే భగవాన్ శ్రీకృష్ణుడు కూడా ప్రజోపకరమైన పనులు నిర్వహించాడు. పసితనంలోనే రాక్షసులను సంహరించాడు. కంసుడిని వధించిన తరువాత మధురలో రాజ్యాధికారాన్ని చేపట్టలేదు. తాను వయసు మీరినవాడిని. రాజ్యభారాన్ని నిర్వహించలేనని చెప్పినప్పటికీ ఉగ్రసేనుడిని మహారాజుని చేశాడు. 'మీరు సింహాసనాన్ని అధిష్టించండి. నా బాహుబలంతో పరిపాలన - కొనసాగిస్తాను. లేదు మీకు సేవ చేసుకుంటాను' అని వినమ్రంగా పలికాడు.
మహాభారత యుద్ధ సమయంలో తన బుద్ధి కౌశల్యాన్ని వినియోగించి పాండవులకు విజయం సాధించి పెట్టాడు. అయినా సింహాసనాన్ని యుధిష్టరుడికి అప్పచెప్పాడు. ఆయనను రాజుగా గుర్తించి నమస్కరించాడు. మనసులో ఏ కోశాన అహంకారాన్ని చేరనీయలేదు. సాధారణంగా అధికారం లభించగానే ఆ వ్యక్తి తనను తాను మిగిలిన వారికంటే ఉన్నతుడు శ్రేష్ఠుడు అని భావించడం మొదలు పెడతాడు. అతడితో మాట్లాడుతున్నప్పుడు లోపల దాక్కున్న అల్పత్వం బయటపడుతుంది. అన్ని పరిస్థితులలోను కీలక పాత్ర పోషిస్తూ పాండవుల కష్టాలు తీర్చిన శ్రీకృష్ణుడు అర్జునుడితో స్నేహాన్ని వదులుకోలేదు. తన చిన్ననాటి మిత్రుడు సహవిద్యార్థి నిరుపేద బ్రాహ్మణుడు అయిన సుధాముడిని కూడా ఆయన మరచిపోలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అహంకార రహితుడు.
మనం జాతి సేవ అనే గొప్ప వ్రతాన్ని స్వీకరించాం.
నిరంతరం జయ సైతంపై నిస్వార్ధంగా పనిచేయడమే స్వయంసేవక్ అనే పదానికి నిజమైన అర్థం.
Comments
Post a Comment