అక్టోబర్
అక్టోబర్ 26
*మహావీరుడు..హిందూ సాంస్కృతిక జయపతాక కేతన హస్తభూషణ..*
*వీరవిక్రమ రాజరాజ చోళ చక్రవర్తి 1035 వ జయంతి నేడు..కృతయుగంలోని రామాయణ కాలం నుండీ నేటి కలియుగం వరకూ అత్యంత సుధీర్ఘకాలం పాలించిన ' చోళ ' వంశం లోనే ప్రాతః స్మరణీయుడు ..రాజకుల తిలకుడు రాజరాజ చోళుడు ...*
ఆయన పేరుమీద దేశరాజధానిలో కనీసం ఒక్క వీధిపేరు లేదు..
మనల్ని దోచుకొడానికి వచ్చిన మొగల్ దోపీడీదారులు వాళ్ళ వారసులు నెగ్రూ కుటుంబాలు సమాధులు విగ్రహాల పేరుతోనే వేల ఎకరాలు ..యూనివర్సిటీ లు..ఆనకట్టలు..వీధులు..నగరాలు .. మెడికల్ కాలేజీలు..ఇక చిన్నా చితకా కట్టడాలయితే లెక్కేలేదు..అన్నింటికీ వాళ్ళ పేర్లే..
దేశాన్ని దోచుకొడానికి వచ్చిన దోపిడీదార్లకు 5 స్టార్ సౌకర్యాలతో సమాధులు..
కాషాయ ద్వజ పతాకను ఆసియా మొత్తం రెపరెపలాడించిన ' రాజరాజ చోళుని ' సమాధికి కనీసం గోడలు లేవు..
ఇదేనా మన హిందూ వీరులకు మనం ఇచ్చే గౌరవం??..ఇదేనా మన పూర్వ చక్రవర్తులకు మనం అరిపించే నివాళి??
సిగ్గు..సిగ్గు..
మన్నించండి ' రాజరాజ '..
#అక్టోబర్ 28
*చరిత్ర విస్మరించిన మహనీయురాలు సోదరి నివేదిత.....*
*నేడు సోదరి నివేదిత జయంతి*
*భారతీయులు స్వాభిమానాన్ని నింపిన అగ్నిశిఖ సోదరి నివేదిత..*🚩🚩🚩
*మన మహారాణి ఎలిజబెత్ కాదు...*
స్వాతంత్ర్య పోరాటం ఉద్ధృతంగా జరుగుతున్న రోజుల్లో ఓ స్కూల్‌కు వెళ్లిన ఆమె.. భారతదేశానికి రాణి ఎవరని అక్కడున్న విద్యార్థులను అడిగారు. దీనికి అందరూ క్వీన్ ఎలిజబెత్ అన్నారు. వెంటనే ఆమె స్పందిస్తూ.. ఈ దేశానికి ఎప్పటికీ *సీతమ్మ తల్లే రాణి* అని చెప్పారు.
*నేడు సోదరినివేదిత జయంతి*
Home News సోదరి నివేదిత : ఒక అగ్నిశిఖ
NEWSTELUGUTELUGU ARTICLESVIEWS
సోదరి నివేదిత : ఒక అగ్నిశిఖ
By vskteam - October 28, 2022 0
– డా. నివేదితా రఘునాథ్ భిడే
నిజంగా శివుడిని అర్చించాలంటే మనం శివుడు కావాలి – శివో భూత్వా శివం యజేత్. అలాగే ఈ భరత భూమిని ఆరాధించేందుకు సోదరి నివేదిత తానే భారతమాత అయింది. భారతిని సంపూర్ణంగా అర్ధంచేసుకుంది.
స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు తెలిసినవారు, స్నేహితులు ఎవరు లేరు. చేతిలో తగినంత డబ్బు కూడా లేదు. ఇక ఆయన ఎవరో కూడా అక్కడివారికి తెలియదు. హిందూధర్మ జ్ఞానం, అనుభవం మాత్రమే ఆయనకు ఉన్నాయి. 1893లో చికాగో సర్వమత సమ్మేళనంలో హిందూ ధర్మాన్ని గురించి చేసిన ఉపన్యాసం తరువాత ఆయకు గుర్తింపువచ్చింది. అనేకమంది శిష్యులు, అనుచరులు ఏర్పడ్డారు. ఆ తరువాత ఆయన భారత్ కు విశ్వవిఖ్యాతి పొందిన స్వామి గా తిరిగివచ్చారు. ఆయనతో పాటు అనేకమంది విదేశీ శిష్యులు కూడా వచ్చారు. ఈ విదేశీ అనుచరులు, పేరుప్రతిష్టలు భారతీయులపై మానసికమైన ఎంతో ప్రభావాన్ని చూపాయి. హిందూ ధర్మపు ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని వాళ్ళు తిరిగి గుర్తించడమేకాక వారిలో స్వాభిమానం కలిగింది. ఇలా స్వామి వివేకానంద హిందూ ధర్మపు గొప్పదనం తెలియజేస్తూ విదేశాలలో సాగించిన జైత్రయాత్రల సారాంశమే సోదరి నివేదిత.
భారత దేశాన్ని పూర్తిగా దోచుకుని, అన్ని రకాలుగా పతనావస్థకు తెచ్చిన జాతిలోనే మార్గరేట్ నోబుల్ (నివేదిత పూర్వాశ్రమంలో పేరు) జన్మించింది. కానీ నివేదితగా ఆమె ఈ దేశాన్ని మనలాగానే ప్రేమించింది, ఇక్కడ ప్రజలకు సేవ చేసింది, ఇక్కడి ఉన్నతమైన అధ్యాత్మిక సంప్రదాయాన్ని అనుసరించింది. భారతీయ జీవనంలో సర్వత్ర ఆమె సౌందర్యాన్ని దర్శించింది.
ఒక బ్రిటిష్ మహిళ భారతీయ జీవనపు సౌందర్యాన్ని, ప్రత్యేకతను ఎలా చూడగలిగింది? అందుకు ఆమె తనను తాను ఎంతో మార్చుకోవలసి వచ్చింది. వేదాంత సత్యం, సర్వత్ర నిండిఉన్న పరమాత్మను గురించి తెలుసుకున్న తరువాత భారత్ కు రావాలని, అక్కడ ప్రజలకు సేవ చేయాలని ఆమె నిశ్చయించుకుంది. సన్యాస దీక్ష తీసుకుని `నివేదిత’(సమర్పింపబడినది)గా మారింది. పేరు మార్చుకున్నంత మాత్రాన అప్పటి వరకు మార్గరేట్ నోబుల్ గా ఏర్పరచుకున్న అభిప్రాయాలూ, భావాలు ఒక్కసారిగా మాయమైపోవు కదా. ఆమెకు ఉన్న ఈ అభిప్రాయాలూ, భావాలను స్వామి వివేకానంద తన మాటల్లో తీవ్రంగా ఖండించేవారు. కొత్త దేశంలో, ఇతరులెవరు తెలియని చోట స్వామీజీ మాత్రమే ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా తన అభిప్రాయాలను తీవ్రంగా తప్పుపడుతుంటే ఆమెకు ఎలా ఉండి ఉంటుంది? అప్పుడు ఆమె ఎంతో తీవ్రమైన భావోద్వేగాలకు గురయ్యేది. అయినా ఒక్కసారి కూడా తాను గురువుగా అంగీకరించిన స్వామి వివేకానంద పైన కానీ, తాను నమ్మిన తత్వం పైన కానీ నివేదితకు సందేహం రాలేదు. తిరిగి వెళ్లిపోదామనే ఆలోచన రాలేదు. “నేను ఎప్పటికైనా నా గురువు చెపుతున్నదానిని అర్ధం చేసుకోగలనా’’ అన్నదే ఆమె ఆలోచన. లక్ష్యశుద్ది, అవిశ్రాంతమైన కృషి ఆమెను పూర్తిగా మార్చివేశాయి. ఆమె భారతీయ జీవనంలో కలిసిపోయింది. పూర్తి సమర్పణ భావంతో భారతిని సేవించింది. శివుడిని నిజంగా కొలవాలంటే మనం శివుడు కావాలి – శివో భూత్వా శివం యజేత్. అలాగే నివేదిత భరత మాతలో ఏకమైంది. భారత దేశాన్ని పూర్తిగా అర్ధం చేసుకుంది. ఎన్ని దోషాలున్న భారతీయులను ప్రేమించింది.
సంపూర్ణమైన మార్పు
భారతీయ ఆత్మ, తత్వాన్ని ఆకళింపుచేసుకునేందుకు నివేదిత తనను తాను మార్చుకున్న తీరు మెకాలే మానస పుత్రులైన భారతీయులకు పెద్ద పాఠం. బ్రిటిష్ వారసత్వం పట్ల ఎంతో గర్వాన్ని కలిగి ఉన్న ఒక మహిళ (భారత్ గురించి) తన దురభిప్రాయాలను, అపోహలను, పాశ్చాత్య ధోరణిని పూర్తిగా పక్కనపెట్టి భారతీయ సంస్కృతి, సమాజాన్ని అర్ధంచేసుకుని, భారత దేశపు భక్తురాలిగా, నిజమైన భారతీయురాలిగా మారగలిగిందంటే , అలా మనం ఎందుకు చేయలేము? మెకాలే మానసపుత్రులమైన మనం కూడా అలా మన అపోహలు, దురభిప్రాయాలను పూర్తిగా వదిలిపెట్టి నిజమైన భారతీయులుగా మారవచ్చును. భారతీయ తత్వాన్ని ఆమె అర్ధం చేసుకోగలిగినప్పుడు మనం మాత్రమే అందుకు అర్ధం చేసుకోలేము? ఎవరైనా తమ మాతృభూమికి సేవ చేయాలనుకుంటే తమను తాము మార్చుకోవాలి, భగవంతుని కృపను పొందాలి. సోదరి నివేదిత ఈ సమాజాన్ని సేవించాలనుకునేవారందరికి ఒక స్ఫూర్తి.
సోదరి నివేదిత ఇక్కడి సమాజం, ప్రజలతో మమేకమయ్యింది. తాను అర్ధంచేసుకున్న, అనుభూతి చెందిన ఏకాత్మ భావన ఆమె జీవితం, చర్యలు, మాటలలో ప్రతిఫలించింది. నా దేశం, నా ప్రజలు అనే ఈ సమాజాన్ని సంబోధించింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలలో పనిచేసేందుకు వెళ్ళేవాళ్లు `ఈ సమాజం’, `ఇక్కడి ప్రజలు’ అనే మాటలు మాట్లాడుతుంటారు. వారిని `నాగరికులను చేయడానికి’, `అభివృద్ధి చేయడానికి’ అక్కడికి వెళ్ళమని చెపుతుంటారు. తమ అభిప్రాయాలూ, భావాలను సాధారణ జనంపై రుద్దెందుకు ప్రయత్నిస్తారు. తన విదేశీ శిష్యులు అలా వ్యవహరించకూడని స్వామి వివేకానంద అనుకున్నారు. భారత్ ఎలా ఉందో, ఎలాంటిదో అలాగే దానిని అంగీకరించగలగాలని, గౌరవించగలగాలని ఆయన భావించారు. భారత్ నుండి నేర్చుకోవాలని వాళ్ళకు చెప్పారు. వివేకానందుని ఈ సందేశాన్ని సోదరి నివేదిత ఎంతగా జీర్ణించుకున్నదంటే స్వతంత్ర్య సమరయోధుడు బిపిన్ చంద్ర పాల్ ఒకసారి “నివేదిత ఇక్కడకు బోధకురాలిగా రాలేదు, ఒక శిష్యురాలిగా, అన్వేషకురాలిగా వచ్చింది. ఈ భారత దేశాన్ని మనం ప్రేమించినదానికంటే అధికంగా ఆమె ఇష్టపడింది’’ అని అన్నారు.
వేదాంతాన్ని ఆకళింపుచేసుకున్న తరువాత సోదరి నివేదిత ఇలా రాయగలిగింది -“ప్రపంచంలో కనిపించే వివిధత్వం, దాని వెనుక ఉన్న ఏకత్వం ఒకే సత్యానికి చెందినవైతే అప్పుడు కేవలం వివిధ పూజా పద్దతులేకాదు, అన్ని రకాల పనులు, అన్ని సృజనాత్మక పద్దతులు కూడా సాక్షాత్కారానికి మార్గాలే. అప్పుడు ఇహము, పరము అనే తేడా ఏమి ఉండదు. పనిచేయడమే ప్రార్ధించడం అవుతుంది. త్యాగమే విజయం అవుతుంది. అప్పుడు జీవితమే మతం.’’ ఇదీ స్వామి వివేకానంద ఆమెకు బోధించిన మార్గం. అందుకనే ఆయన గురించి ఇలా రాసింది -“ఈ తత్వమే స్వామి వివేకానందను అద్భుతమైన కర్మ ప్రబోధకుడిగా చేసింది. జ్ఞాన, భక్తి యోగాలను ఆయన బోధించారు. ఆయన ప్రకారం పని, అధ్యయనం, పొలం మొదలైన కర్మ క్షేత్రాలన్నీ భగవంతుని సాక్షాత్కారం పొందగలిగిన స్థానాలే. మానవ సేవకు, మాధవ సేవకు తేడా లేదు. నీతికి, ఆధ్యాత్మికతకు తేడా లేదు. ఈ మూల విశ్వాసం నుండే ఆయన చెప్పిన సకల విషయాలు వచ్చాయి.’’ ‘’కళలు, విజ్ఞాన శాస్త్రం, మతం ఒకే పరమ సత్యపు మూడు విభిన్న వ్యక్తీకరణలు. కానీ దీనిని అర్ధం చేసుకోవాలంటే మనకు అద్వైత సిద్దాంతం తెలియాలి.’’ నివేదితకు వేదాంతం అంటే ప్రత్యక్ష కార్య పద్దతి. అందుకనే ఆమె ఆధ్యాత్మికత వివిధ రంగాల్లో ఆమె నిర్వహించిన కార్యాల ద్వారా వ్యక్తమయింది.
స్వామి వివేకానందలోని జాజ్వల్యమానమైన ఆదర్శం సోదరి నివేదితకు లభించింది. భారత దేశం పట్ల ఆమెకు గల ప్రేమాభిమానాలు ఎంత తీవ్రమైనవంటే యోగి అరవిందులు ఆమెను అగ్నిశిఖ అని అభివర్ణించారు. జాతీయ జీవనంలో ఆ అగ్ని స్పృశించని రంగం లేదు. భారత దేశపు అభ్యున్నతి, భారతీయ ఆత్మను జాగృతం చేయడం అనే రెండు లక్ష్యాలతోనే ఆమె పనిచేసింది.
నూతన విద్యా దృక్పధం
“విద్యారంగంలో పనిచేసే వారంతా స్వామి వివేకానందుని లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి’’ అని నివేదిత కోరుకుంది. అది ఎలా జరుగుతుందో ఆమె ఇలా వివరించింది -“పిల్లవాడికి మంచి చేయడంతో పాటు జన – దేశ – ధర్మాలకు మేలు చేసేదిగా ఉండాలని విద్యావేత్తలు గ్రహించాలి. ఈ ప్రధాన అంశం ఆధారంగా రూపొందిందిన విద్య, శిక్షణలో ఎలాంటి స్వార్ధభావన, బలహీనతకు ఆస్కారం ఉండదు. భారత దేశంలో విద్యను జాతీయం చేయడమేకాదు, జాతి నిర్మాణ కారకమైనదిగా తీర్చిదిద్దాల్సిఉంది. మన పిల్లల మనసుల్లో జాతి, దేశం అనే భావాలను నింపాలి. వాళ్ళ ఆలోచన కుటుంబ పరిధిని దాటి విస్తరించాలి. భారత దేశం కోసం త్యాగాలు చేయగలగాలి. భక్తిపూర్వకంగా ఈ దేశాన్ని కొలవగలగాలి. ఈ దేశాన్ని అధ్యయనం చేయాలి. ఈ దేశమే లక్ష్యం కావాలి. భారతి కోసమే భారతం. ఇదే వారి ఊపిరి కావాలి.
… మహాపురుషులు పుడతారన్నది తప్పు. అలాంటివాళ్లు పుట్టరు. తయారవుతారు. ఒక గొప్ప ఆలోచన నుండి రూపొందుతారు. సర్వమానవాళిలో హృదయాంతరాళాల్లో నిండిఉన్నది త్యాగభావనే. దీనిని మించిన లోతైన భావన ఏది లేదు. ఈ విషయాన్ని గుర్తిద్దాం …దీనినే దేశం పట్ల ప్రేమగా మలుద్దాం…ఈ విశ్వం పదార్ధంతో ఏర్పడినది కాదు. మేధస్సువల్ల ఏర్పడినది. 700 మిలియన్ ప్రజల తీవ్రమైన ఆకాంక్షను అడ్డుకోగలిగిన శక్తి ఈ ప్రపంచంలో దేనికైనా ఉందా… అంతా తీవ్రమైన ఆకాంక్షను కలిగించడం ఎలా..అందుకు జాతీయ విద్యావిధానమే మార్గం. మన మహాపురుషుల జీవితాలు మనకు ఆదర్శం కావాలి. అవే మన ఆలోచన కావాలి. భారత దేశ చరిత్ర చుట్టూనే మిగిలిన చరిత్రలు తిరగాలి. ‘’ ఈ ఆలోచనలు, ఆదర్శాల ఆధారంగానే సోదరి నివేదిత ఆడపిల్లలకోసం పాఠశాల నిర్వహించింది. అందుకనే ఆ తరువాత రవీంద్రనాథ్ ఠాగోర్ శాంతినికేతన్ ప్రారంభించినప్పుడు అక్కడ ఉపాద్యాయురాళ్లుగా పనిచేసినవారు ఎక్కువగా సోదరి నివేదిత పాఠశాల పూర్వ విద్యార్ధులే కావడంలో ఆశ్చర్యం ఏమి లేదు.
భారతీయ మహిళ
భారతీయ మహిళ గుణగణాలు సోదరి నివేదితను ముగ్ధురాలిని చేశాయి. కలకత్తా వీధుల్లో తిరుగుతూ, పనిచేస్తున్నప్పుడు ఆమెకు ఎన్నో విషయాలు తెలిసాయి. వాటి గురించి ఆమె ఇలా అంటారు -“భారతీయ మహిళకు లభిస్తున్న శిక్షణ ఎలాంటిది? ఎంత ప్రత్యేకమైనది? ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి పద్దతి కనిపించదు. భారతీయ జీవనపు గొప్పదనం ఎందులోనైనా ఉన్నదంటే అది ప్రధానంగా సామాజిక వ్యవస్థలో మహిళలకు ఇచ్చిన గొప్ప స్థానంలో ఉంది. భారతీయ మహిళలు అజ్ఞానులు, అణచివేయబడినవారని కొందరు అంటూ ఉంటారు. అలాంటివారందరికి ఒకటే సమాధానం – భారతీయ మహిళ ఎప్పుడు అణచివేతకు గురికాలేదు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఘోరాలు ఇక్కడ కంటే మిగతా దేశాలలో చాలా తీవ్రంగా, పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇక మహిళలకు ఇక్కడ లభిస్తున్న సామాజిక గుర్తింపు, సంతోషం, వారి ఉన్నతమైన వ్యక్తిత్వం భారతీయ జీవనపు అత్యంత విలువైన అంశాలు. ఇక ఇక్కడ మహిళలు అజ్ఞానులనే వాదన మరింత అర్ధరహితమైనది. ఆధునికుల దృష్టిలో వాళ్ళు అజ్ఞానులు కావచ్చును. ఎందుకంటే వారిలో కొద్దిమందే రాయగలరు, చదవగలరు. అంతమాత్రాన వారిని నిరక్షరకుక్షులు, అజ్ఞానులు అనగలమా? నిజంగానే వాళ్ళు అలాంటివారైతే మన తల్లులు, బామ్మలు తమ పిల్లలకు చెప్పే రామాయణ భారతాలు, పురాణ కధలు సాహిత్యం కాదా? కేవలం యూరోపియన్ నవలలు, స్ట్రాండ్ పత్రిక మాత్రమే సాహిత్యమా? అలాగని ఎవరైనా అనగలరా? వ్రాయగలగడమే సంస్కృతి కాదు. అది సంస్కృతిలో ఒక భాగం మాత్రమే. ఈ `అక్షరాస్యత’ యుగం ప్రారంభం కావడానికి చాలాకాలం ముందే గొప్ప సాహిత్యం వచ్చింది. భారతీయ జీవనంలో మహిళల పాత్ర గురించి తెలిసిన ఎవరైనా వారికి ఇళ్ళలో లభించే విద్య, గౌరవం, వారి సున్నితత్వం, శుభ్రత, పొదుపరితనం, మత శిక్షణ, సాంస్కృతిక సంస్కారాలు తప్పక గుర్తిస్తారు. ఆ మహిళలు ఒక్క ముక్క చదవలేకపోయిన, రాయలేకపోయినా వారిపై అజ్ఞానులు, అవిద్యావతులు అని విమర్శలు చేస్తున్న వారికంటే చాలా విద్యావంతులే. ‘’
జాతి పునర్ నిర్మాణానికి మార్గదర్శి
సోదరి నివేదిత రచనల్లో భారతీయ వివేకం, సంప్రదాయం కనిపిస్తాయి. భారత్ పట్ల ప్రగాఢమైన ప్రేమ, గౌరవం కనిపిస్తాయి. అలాగే ఆ రచనలు ఆమె చురుకైన బుద్ధికి, భాష నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తాయి. ఆమె వ్యక్తం చేసిన భావాలు ఎంత లోతైనవి, ప్రగాఢమైనవంటే వాటిని ఇతర భాషలలోకి అనువదించడం కష్టం. అందుకనే కాబోలు ఆమె చాలా రచనలు ఇప్పటికీ అనువదింపబడలేదు. ఆ సాహిత్యం చరిత్రాత్మకమైనదే కాదు జాతి నిర్మాణంలో మార్గదర్శకమైనది కూడా. ఉదాహరణకు, ఇతర జాతులతో పోలుస్తూ హిందూ జాతి సాగించిన యాత్ర, ప్రపంచానికి అందించిన జ్ఞానాన్ని గురించి ఇలా రాసింది – “నిజమైన జాతీయ భావం నింపుకున్నవారు, ఈ జాతి ఎదుర్కొంటున్న సమస్యల గురించి చింతించేవారికి ఒక ప్రశ్న ఎదురవుతుంది. అదేమిటంటే, ఈ జాతి గతంలో ఎప్పుడైనా ఇంత గొప్ప కలలు కన్నదా? ఇంత గొప్ప ఆలోచనలు చేసిందా? ఇంత సౌమ్యంగా, పవిత్రంగా ఉన్నదా? ఎలాంటి తప్పటడుగులు వేయకుండా కొత్త మార్గాలను అన్వేషించిందా? మొదలైన ఇలాంటి ప్రశ్నలన్నిటికి హిందువులు మాత్రమే `అవును’ అని గట్టిగా సమాధానం చెప్పగలరు.’’ ఆమె దాదాపు 20 పత్రికల్లో తరచూ వ్యాసాలు రాస్తూండేది. ఆ వ్యాసాలన్నిటి ప్రధాన విషయం ఎప్పుడూ `భారతదేశమే’. భారతీయురాలిగా ఆమె మారిన అద్భుత వైనం మాత్రమే కాదు, ఆమె జీవితాన్ని, రచనలను నేడు ఆంతా, ముఖ్యంగా ఆంగ్ల విద్యావంతులు, తప్పక అధ్యయనం చేయాలి. అప్పుడే మన దేశపు గొప్పదనం, ప్రత్యేకతలు అర్ధమవుతాయి.
పాశ్చాత్య అనుకరణ ఎందుకు?
ప్లేగు, వరదలు మొదలైన ఉత్పాతాలు కలిగినప్పుడు, స్వతంత్ర పోరాటంలో సోదరి నివేదిత సమాజంతో పాటు మమేకమై పనిచేశారు. జాతీయ జీవనపు అన్ని రంగాలలో సాంస్కృతిక విలువల పునర్ స్థాపన, జాతీయ భావాన్ని పెంపొందించడం కోసమే ఆమె పనిచేశారు. “భారత దేశపు జాతీయ కళ పుట్టుకే నా అత్యంత ప్రియమైన కల’’ అని ఆమె అన్నారు. విద్యార్థులు పాశ్చాత్య అంశాల ఆధారంగా కళాప్రదర్శనలు ఇవ్వడం ఆమె అంగీకరించలేదు. భారతదేశానికి ఇంత ప్రాచీనమైన, విస్తృతమైన కళా రూపాలు ఉండగా పాశ్చాత్య కళా రూపాలను అనుకరించడం, అక్కడి విషయాలను ప్రదర్శన అంశంగా తీసుకోవడం ఎందుకని ఆమె ప్రశ్నించేవారు. అబనీంద్రనాథ్ ఠాగోర్, నందలాల్ బోస్ వంటి యువ చిత్రకారులు భారతీయ అంశాలను తమ చిత్రాలకు ప్రధాన విషయాలుగా తీసుకునేట్లు ఆమె ప్రోత్సహించారు. బాగ్ బజార్ లో పురాతన ఇల్లు, పాడుపడిపోయిన దేవాలయాలలోని నిర్మాణ నైపుణ్యం, అందాన్ని ఆమె చూసేవారుకానీ ఈ దేశంలో పాశ్చాత్య శైలిలో అధునాతన భవనాల నిర్మాణాన్ని అంగీకరించేవారుకారు. శాస్త్ర విజ్ఞాన రంగంలో కూడా భారతీయులు చేయగలిగినది ఎంతో ఉందని ఆమె అనేవారు. డా. జగదీష్ చంద్ర బోస్ ఆవిష్కారాలు ప్రపంచానికి తెలియకుండా బ్రిటిష్ వాళ్ళు అడ్డుకున్నప్పుడు ఇలాంటి అడ్డంకులు లేకపోతే భారతీయ శాస్త్రవేత్తలు ఎంత ఉన్నత శిఖరాలనైనా అధిరోహించగలరని ఆమె భావించారు. డా. జగదీష్ చంద్ర బోస్ కు సహాయపడేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఆవిష్కారాలను ప్రపంచానికి తెలియచెప్పడానికి ఆయన ఆరు పుస్తకాలు ప్రచురితమవడానికి సహాయసహకారాలు అందించారు. స్వయంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికి జగదీష్ చంద్ర బోస్ కార్యానికి నిధుల కొరత లేకుండా చూశారు.
విప్లవకారులు జైలుకి వెళ్లినప్పుడు, విదేశాలలో తలదాచుకున్నప్పుడు వారి కుటుంబాల పోషణ భారాన్ని ఆమె వహించారు. ఇలా ఆమె జాతీయ జీవనంలో అన్ని విషయాలలో తనవంతు పాత్ర నిర్వహించారు.
నిరాశ, నిస్పృహలకు ఆమె మనసులో స్థానం లేదు
అవసరమనుకున్నప్పుడు సోదరి నివేదిత రామకృష్ణ మిషన్ కు రాజీనామా చేసి స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందల సందేశాలను ప్రచారం చేయడానికి రామకృష్ణ మిషన్ అవసరం. కానీ జాతీయ భావాన్ని పెంపొందించడం ద్వారా ప్రజలను స్వతంత్ర ఉద్యమానికి సమాయత్తం చేయడం అప్పటి తక్షణ అవసరం. కనుక సోదరి నివేదిత ఆ పనికి పూనుకున్నారు. రామకృష్ణ మిషన్ నుండి రాజీనామా చేసినా ఆ సంస్థతో ఆమె చివరివరకు సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. రామకృష్ణ – వివేకానంద భావ ఉద్యమంలో తాను కూడా ఒక భాగమని ఆమె చెప్పేవారు. ఎప్పుడు అనారోగ్యం బారిన పడిన రామకృష్ణ మిషన్ కు వెళ్ళేవారు. బుల్ అనే మహిళ తన అవసాన దశలో తన యావదాస్తిని సోదరి నివేదితకు దానం చేస్తే, ఆ ఆస్తిని నివేదిత రామకృష్ణా మిషన్ కు రాసిచ్చేశారు. అలాగే తన గ్రంధాలయాన్ని సోదరి క్రిస్టీన్ గ్రీన్ స్టీడెల్ నడుపుతున్న పాఠశాలకు ఇచ్చేశారు. ఆమె మనసులో నిరాశ, నిస్పృహ, అసంతృప్తి మొదలైన నకారాత్మక భావాలకు చోటులేదు. భారత దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరితో పనిచేశారు. కానీ దేశ ప్రయోజనాలకు ఉపయోగపడదని అనుకున్నప్పుడు కొందరికి దూరమయ్యారు కూడా. దేనికైనా దేశ ప్రయోజనమే గీటు రాయి.
ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు శ్రీ. హేమచంద్ర ఘోష్ స్వామి వివేకానంద, సోదరి నివేదితల గురించి తన జ్ఞాపకాలను స్వామి పూర్ణాత్మానందకు తెలియజేశారు. ఆ సంభాషణలు బెంగాలీ భాషలో పుస్తకంగా వెలువడ్డాయి. దానిని ప్రొ. కపిల చటర్జీ ఆంగ్లంలోకి అనువదించారు. `ఐ యామ్ ఇండియా’ అనే శీర్షిక కలిగిన ఆ పుస్తకంలో హేమచంద్ర ఘోష్ ఇలా రాశారు -“స్వామి వివేకానంద ప్రజ్వలింపచేసిన దేశభక్తి భావనను సోదరి నివేదిత అందిపుచ్చుకున్నారన్నది నిజం. అంతేకాదు ఆమె ఆ జ్వాలను దేశంలోని నలుమూలలకు వ్యాపింప చేశారు. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళిన సోదరి నివేదిత తన స్పూర్తివంతమైన ప్రసంగాలు, నినాదాలతో స్వామీజీ ఆదర్శాలు, దేశభక్తి బావనను ప్రజలలో ప్రచారం చేసేవారు. దానితో పాటు సంస్కృతి, భారత దేశ వైభవం, ఆదర్శాలను కూడా ఆమె ప్రజలకు తెలియచెప్పేవారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం స్వామి వివేకానందకు సోదరి నివేదిత సన్నిహిత్యం వల్ల మరింత అబ్బిందని చెప్పవచ్చును. నేను స్వామీజీతో ఉన్నది చాలా తక్కువ కాలం. కానీ సోదరి నివేదితను ఎక్కువ కాలం చూసే భాగ్యం కలిగింది. ఆమె ద్వారా మనకు స్వామీజీ, అలాగే భారత దేశం మరింత బాగా అర్ధమవుతాయి. స్వామి వివేకానంద సందేశాన్ని ప్రచారం చేయడంలో సోదరి నివేదిత రెండు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఒకటి పరమశివుడు, రెండు, భగీరథుడు. ఝంఝామారుతం వంటి తీవ్రమైన స్వామీజీ సందేశాన్ని తనలో ఇముడ్చుకోవడమే కాక ఆ మహా ప్రవాహానికి భగీరథుడిలా ఒక దిశను చూపించింది.’’
భారతదేశంపట్ల అపరిమితమైన ప్రేమ
రాజకీయాలు, విద్య, కళలు, సాహిత్యం, సమాజ శాస్త్రం, ఆధ్యాత్మికత ఇలా అన్ని రంగాలలో సోదరి నివేదితకు భారతదేశం పట్ల ఉన్న అపారమైన ప్రేమాభిమానాలు ప్రకటితమయ్యాయి. ఆమెది బహుముఖీయమైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వం. ఆమె విప్లవకారిణి, అలాగే యోగిని కూడా. ఆమె విద్యావేత్త, కళా విమర్శకురాలు. రచయిత, ప్రజలకు సేవచేసిన సంఘసేవకురాలు. శారదా మాత పాదాలవద్ద కూర్చున్నప్పుడు ఆమె శిష్యురాలు. అలాగే రవీంద్రనాథ్ ఠాగోర్ వర్ణించినట్లు ఆమే లోకమాత, సోదరి కూడా. “ఓ నా భాగ్యమా! భోగభాగ్యాలు కోల్పోయి, వివేకం భ్రష్టమై, పతనమై, పరాజితమై, కలహాలు, కుత్సితాలలో కూరుకుపోయిన ఈ దేశ ప్రజానీకాన్ని ఎవరైనా సంపూర్ణమైన మనస్సుతో ప్రేమించగలిగితే అప్పుడు ఈ దేశం తిరిగి నిలబడుతుంది.’’ అని స్వామి వివేకానంద ఒకసారి అన్నారు. స్వామీజీ కోరుకున్న భాగ్యమే సోదరి నివేదిత. ఆమె భారతీయులను వారి దోషాలతోపాటు మనస్ఫూర్తిగా ప్రేమించింది. ఆమె 150వ జయంతి సందర్భంగా ఆమె జీవితాన్ని, జీవన కార్యాన్ని అర్ధం చేసుకుందాం. ఆమెలాగానే మనమూ ఈ దేశాన్ని, ప్రజానీకాన్ని ప్రేమిద్దాం. భారత మాత కార్యం చేయడంలో సోదరి నివేదిత జీవితం మనకు స్ఫూర్తిని కలిగించుగాక.
(రచయిత వివేకానంద కేంద్ర ఉపాధ్యక్షులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత)
ఆర్గనైజర్ సౌజన్యంతో…
This article was First Published in 2019
TAGS150TH ANNIVARSARYHINDUTVAINDIAINSPIRATIONSISTER NIVEDITASWAMI VIVEKANANDA
Previous article
అస్సాం : మతమార్పిళ్లకు పాల్పడుతున్న ముగ్గురు స్వీడన్ దేశీయులు అరెస్టు
Next article
Swami Ramanand Tirtha: Liberation of Hyderabad State and its annexation into Bharat Rashtra
vskteam
RELATED ARTICLESMORE FROM AUTHOR
News
ప్రతి యువతి ఉత్తమ పౌరురాలు కావాలి – సునీలా సోవనీ జీ
Telugu Articles
సమన్వయంతో కూడిన సంస్కరణవాది భాగ్యరెడ్డి వర్మ
News
హైందవ వీరుడు మహా రాణా ప్రతాప్
LEAVE A REPLY
Comment:
Name:*
Email:*
Website:
Save my name, email, and website in this browser for the next time I comment.
Follow us on Twitter
EDITOR PICKS
Vishwa Samvad Kendra is a well known National Network known for providing news and views of National interest and importance, thus working towards awakening of national consciousness of Bharat.
Contact us: vsktelangana@gmail.com
EVEN MORE NEWS
ప్రతి యువతి ఉత్తమ పౌరురాలు కావాలి – సునీలా సోవనీ జీ
May 23, 2023
సమన్వయంతో కూడిన సంస్కరణవాది భాగ్యరెడ్డి వర్మ
May 22, 2023
హైందవ వీరుడు మహా రాణా ప్రతాప్
May 22, 2023
POPULAR CATEGORY
News3706
Views1977
Telugu1947
Telugu Articles1598
English Articles1129
Rashtriya Swayamsevak Sangh1013
Contact Us Grievance Redressal Mechanism Grievances
© Designed, Developed and Managed by IT Milan Komaram Bheem
*మార్గరేట్ నో
బుల్ ఐర్లాండుకు చెందిన యువతి. స్వామి వివేకానంద- ఆధ్యాత్మిక ప్రభావానికిలోనై తమ దేశం నుండి భారతదేశానికి వచ్చి యిచ్చటి ప్రజల పట్ల సేవా భావాన్ని పట్లు ప్రదర్శించారు. ఆమెకు నివేదిత అని నామకరణం చేసారు. అంటే ఈశ్వరునికి అర్పించబడినదని. చిన్నపిల్లలకు, వారి తల్లులకు విద్యాదానం చేసింది. ప్లేగు, క్షామం, వరదలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేసినప్పుడు, కరుణనిండిన సేవా మూర్తిగా అందరి మన్ననలు పొందినది. త్యాగ సేవా భావాలకు నివేదిత మరణం లేని ప్రతీక..*🙏🚩🚩🚩
ఆమె యూరప్‌లో పుట్టినా.. సనాతన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాల కోసం యావత్ జీవితాన్ని ధారపోశారు. స్వామి వివేకానంద శిష్యురాలిగా గురువు చూపిన బాటలో తరించారు. భారతీయుల మదిలో సోదరిగా నిలిచిన సిస్టర్ నివేదిత జయంతి ఇవాళ. 154వ జయంతి
మంచి రచయిత, వక్త అయిన సోదరి నివేదిత అసలు పేరు మార్గరెట్ ఎలిజిబెత్ నోబుల్. ఐర్లాండ్‌లో 1867 అక్టోబర్ 28న జన్మించారు. తండ్రి శామ్యుల్ రిచ్‌మండ్ నోబుల్, తల్లి మేరి. 17 ఏళ్ల వయస్సులో ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన ఆమె.. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లోని పలు స్కూళ్లలో పని చేశారు. అనంతరం 1892లో వింబుల్డన్‌లో సొంత పాఠశాల స్థాపించారు. రచయితగా పలు సమావేశాల్లో పాల్గొనే సమయంలో విఖ్యాత రచయితలు జార్జ్ బెర్నార్డ్ షా, థామస్ హూక్స్లేలతో ఆమెకు పరిచయం ఏర్పడింది.
1895లో స్వామి వివేకానంద ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా తొలిసారి ఆయనతో పరిచయం కలిగింది. స్వామిజీ వాక్చాతుర్యానికి, భారతీయతకు ముగ్దురాలైన ఆమె.. ఆయన మార్గదర్శనంలో వేదాంత ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అనంతరం 1898లో జూన్ 28న భారతదేశానికి వచ్చారు. ఆమెకు స్వాగతం పలకడానికి స్వామి వివేకానందులే స్వయంగా కలకత్తా నౌకాశ్రయానికి వెళ్లడం విశేషం. మార్గరెట్ పేరును నివేదితగా మార్చింది కూడా ఆయనే. *'సమాజసేవకు అంకితమవ్వడం' అనే అర్థం వచ్చేలా ఆ పేరు పెట్టారు.* భవిష్యత్తులో నివేదిత జీవనయానం సమాజసేవతో ముడిపడనుందన్న విషయాన్ని ఈ పేరు మార్పు ద్వారా వివేకానందుడు చెప్పకనేచెప్పారు.
తొలుత వివేకానందుడి ఆధ్యాత్మిక ప్రచారం కోసం పని చేసిన ఆమె.. స్త్రీల విద్య కోసం ఓ పాఠశాల ప్రారంభించారు. వారికి విద్యతో పాటు చేతివృత్తులు నేర్పించేవారు. 1902లో వివేకానంద మరణం తర్వాత పూర్తిస్థాయిలో సేవాకార్యక్రమాలపై దృష్టిపెట్టారు. *కలకత్తా వరదల సమయంలో, ప్లేగు వ్యాధి నివారణకు ఎంతగానో కృషి చేశారు. స్వాతంత్రోద్యమంలో స్వదేశీ భావజాలాన్ని బలంగా తీసుకెళ్లారు.* ఈ సందర్భంగా రెండు సంఘటనలను కచ్చితంగా గుర్తు చేసుకోవాలి.
*భారతీయుల్లో స్వాభిమానము నింపిన నివేదిత....*
*మనమహారాణిఎలిజబెత్ కాదు*
*స్వాతంత్ర్య పోరాటం ఉద్ధృతంగా జరుగుతున్న రోజుల్లో ఓ స్కూల్‌కు వెళ్లిన ఆమె.. భారతదేశానికి రాణి ఎవరని అక్కడున్న విద్యార్థులను అడిగారు. దీనికి అందరూ క్వీన్ ఎలిజబెత్ అన్నారు. వెంటనే ఆమె స్పందిస్తూ.. ఈ దేశానికి ఎప్పటికీ సీతమ్మ తల్లే రాణి అని చెప్పారు.*
*మరో సందర్భంలో ఓ విద్యార్థిని పుస్తకంలో గీతలు గీస్తుంటే.. ఏం చేస్తున్నావని నివేదిత అడిగారు. లైన్స్ గీస్తున్నానని ఆ విద్యార్థిని తెలిపింది. దీనిపై మాట్లాడుతూ.. ఇంగ్లీషులో చెప్పడం కాదని.. మాతృభాషలో ఏమంటారో అదే చెప్పాలని అడిగారు. అప్పుడా బాలిక లైన్ అనే ఆంగ్ల పదానికి తమ భాషలో (బెంగాలీ) రేఖ అంటారని చెప్పింది. అలా మాతృభాష విశిష్టతను విద్యార్థులకు తెలిసేలా చేశారు.*
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా.. భారతీయ కళలను గురించి సోదరి నివేదిత విశేషంగా ప్రచారం చేసేవారు. నిరంతరాయంగా పని చేయడం వల్ల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మానేశారు. అనారోగ్యానికి గురైన ఆమె 44 ఏళ్ల వయస్సులో 1911 అక్టోబర్ 13న తుదిశ్వాస విడిచారు.
*నిజమైన త్యాగనిరతి, నిజమైన సేవ భావానికి నిలువెత్తు నిదర్శనం.... సోదరి నివేదిత....*
*స్వాభిమాన జీవనానికి మార్గదర్శిని....*
*పరదేశీయ వనిత అయినప్పటికీ చివరికంటూ వరకు తల్లి భారతి ని పూజించి చివరకు ఆ తల్లి లోనే లీనమైన మాతృమూర్తి సోదరి నివేదిత......*
🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
#అక్టోబర్ 30
సరిగ్గా 29 సంవత్సరాల క్రితం ఇదేరోజున (1990 అక్టోబర్ 30 వ తేదీన) అయోధ్యలో ప్రథమ కరసేవ జరిగింది. పురుగును కూడా అయోధ్యలోకి అడుగుపెట్టనివ్వను అంటూ ఆనాటి ఉ.ప్ర ముఖ్యమంత్రి ములాయంసింగు యాదవ్ చేసిన శపథాన్ని లెక్క చేయకుండా వేలాదిమంది కరసేవకులు అయోధ్యానగరంలోకి ప్రవేశించారు. ప్రభుత్వం అమానుషంగా జరిపిన కాల్పులలో వందలాదిమంది అసువులు బాశారు, గాయాలపాలయ్యారు.
అయినప్పటికీ భయపడకుండా వలయంలోకి ప్రవేశించి అభిమన్యుడి వలె పోరాడి దుష్ట బాబరుచే నిర్మించబడిన కళంకిత కట్టడంపై కొఠారీ సోదరులు కాషాయధ్వజాన్ని ఎగురవేశారు. రెండురోజుల అనంతరం పోలీసులు వారిని పట్టుకొని కాల్చి చంపేశారు.
హిందూధర్మ రక్షణకై వీరోచితంగా పోరాడి అసువులుబాసి హుతాత్ములైన ఎందరో బంధువులకు ఘన నివాళి.😥🙏🔥
[31/10, 8:02 pm] P vishrutha Kavitha: 🙏 *ఆధునిక భారతంలో అఖండ భారత పునర్నిర్మాణ రూపశిల్పి, ఖండ ఖండాలుగా 560 సంస్థానాలుగా విడిపోయిన ఉన్న చిన్న చిన్న సంస్థానాలన్నీ తిరిగి భారత దేశంలో విలీనం చేసే క్రమంలో అరాచక పాలన కొనసాగిస్తున్న నిజాం సంస్థాన పై సైనిక చర్య ద్వారా నిజాం ప్రావిన్స్ ను భారత్ లో విలీనం చేసి... నిజాం నిరంకుశ పాలనలో ఉసూర్మంటూ బ్రతుకుతున్న పీడిత తెలంగాణా ప్రజలను కాపాడి అఖండ భారత దేశం ఏర్పాటుకు నిరంతరం కృషిచేసి, ఇండియన్ బిస్మార్క్ గా పేరుగాంచిన లోహపురుషుడు,సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి*
*జాతీయ ఎక్తాధివస్* *సందర్భంగా ఆ మహనీయుని కృతజ్ఞతగా స్మరించుకుంటూ... ప్రియమైన భారత పౌరులందరికీ ప్రేరణాదాయకమైన శుభాకాంక్షలు*...💐
జై భారత్. వందేమాతరం.🌹
అక్టోబర్31
బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం పేరిట మనకు ఖండిత భారత దేశాన్ని మనకు ఇచ్చారు. భారత్- పాకిస్తాన్ పేరిట విభజించడమే కాదు, దేశంలోని 552 సంస్థానాలకు భారత్ లేదా పాక్ లో చేరొచ్చు లేదా స్వతంత్రంగా ఉండొచ్చు అనే అవకాశం ఇచ్చారు. ఇలాంటి దశలో ఒక ఉక్కు మనిషి మనకు తొలి ఉప ప్రధానమంత్రిగా,, తొలి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలోని సంస్థానాధీశులందరినీ ఒప్పించి వారి భూభాగాలను భారత్ లో విలీనం చేశారు. మొండికేసిన హైదరాబాద్, జునాగఢ్ లపై దండోపాయం ప్రయోగించారు. భారత దేశ చిత్ర పటాన్ని మనం ఈ రోజున ఈ రూపంలో చూస్తున్నామంటే అందుకు కారణం ఉక్కు మనిషి.. ఆయనే సర్ధార్ వల్లభాయ్ పటేల్..
దేశ ప్రజలకు అందునా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ ప్రాత:స్మరణీయులు. మనం పీల్చే స్వేచ్ఛా వాయువులు ఆ మహనీయుని పుణ్యమే.. నిరంకుశ నిజాం ప్రభువు పాలన, నరహంతక రజాకార్ పిశాచాల చేతిలో నగిలిపోతున్న హైదరాబాద్ సంస్థానాన్ని పోలీస్ యాక్షన్ ద్వారా లొంగదీసి భారత దేశంలో పూర్తిగా విలీనం చేశారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ తీసుకునే దృఢమైన నిర్ణయాల వెనుక దేశ, సమాజ హితం కనిపిస్తుంది. అందుకే ఆయనను ఉక్కు మనిషి అన్నారు.
1875 అక్టోబరు 31న గుజరాత్ లోని సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వల్లభాయ్ పటేల్ చదువుల్లో చిన్నప్పటి నుంచీ ఎంతో చురుగ్గా ఉండేవారు. ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ అయ్యారు. భారత దేశానికి తిరిగి వచ్చి అహ్మదాబాద్ లో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఒక రోజున పటేల్ కోర్టులో వాదిస్తుండగా టెలిగ్రామ్ అందింది. దాన్ని చదివి జేబులో పెట్టుకొని వాదన పూర్తి చేసి తన క్లయింట్ ను గెలిపించారు. ఆ టెలిగ్రామ్ లో పటేల్ భార్య మరణించిందనే సమాచారం ఉంది. అయినా కుంగిపోకుండా కేసు వాదించి గెలిచారు. వృత్తి పట్ల ఆయనకు ఉన్న నిబద్దతకు ఈ ఉదంతం అద్దం పడుతుంది.
మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంపట్ల ఆకర్శితుడైన సర్వార్ పటేల్ న్యాయవాద వృత్తిని త్యజించి స్వాతంత్ర్య ఉద్యమంలోకి దిగారు. 1928 బార్డోలీ కిసాన్ ఉద్యమంతో వల్లభాయ్ పటేల్ కు సర్దార్ అనే పేరు బిరుదు వచ్చింది. విదేశీ వస్తు దహనంలో భాగంగా తన పాశ్యాత్య దుస్తులను ఆహుతి చేసి జీవితాంతం ఖాదీ వస్త్రాలనే కట్టుకున్నారు. గుజరాత్‌లో మద్యపానం, అస్పృశ్యత, కుల విచక్షణలకు వ్యతిరేకంగా పోరాడారు..
1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా వ్యవహరించిన సర్దార్ పటేల్ క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి హోంశాఖా మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు సర్దార్ వల్లభాయ్ పటేల్. భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా, ప్రాథమిక హక్కుల కమిటీ ఛైర్మన్ గా పని చేశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షునిగా నియమించడంతో పటేల్ పాత్ర చాలా ఉంది..
వాస్తవానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత తొలి ప్రధానమంత్రి కావాలని నాటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో చాలా మంది కోరుకున్నారు. కానీ మహాత్మా గాంధీ మాత్రం జవహర్ లాల్ నెహ్రూ వైపు మొగ్గు చూపడంతో ఆ పదవి ఆయనను వరించింది. పటేల్ దృఢ చిత్తంతో సంస్థానాలన్నీ భారత్ లో విలీనమైనాయి. కానీ జమ్మూ కశ్మీర్ బాధ్యతను మాత్రం నెహ్రూ భుజాన వేసుకున్నాడు. దీని దుష్పలితం ఏమిటో మనం నేటికీ చూస్తూనే ఉన్నాం. సర్దార్ పటేల్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే కశ్మీర్ అంశం ఈనాడు ఒక సమస్యగా ఉండేది కాదు. ప్రధాని నెహ్రూ కశ్మీర్ అంశాన్ని ఐక్య రాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లడాన్ని వ్యతిరేకించారు. అలాగే పాకిస్తాన్ కు రూ.55 కోట్ల చెల్లింపుపై విబేధించారు. అంతే కాదు నెహ్రూ సోషలిజం సిద్దాంతాలు కూడా సర్దార్ పటేల్ కు నచ్చేవి కాదు.
తొలి రాష్ట్రపతి ఎన్నికలలో రాజగోపాలచారి వైపు నెహ్రూ మొగ్గు చూపగా, వల్లబ్ భాయి పటేల్ మాత్రం రాజేంద్ర ప్రసాద్ ను ప్రతిపాదించి సఫలీకృతుడైనారు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కృపలానీని కాదని పురుషోత్తమ దాస్ టాండన్ ను గెలిపించారు. 1947 ఆగస్టు 15న భారత దేశ తొలి హోంమంత్రి పదవి చేపట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కన్ను మూసేవరకూ అంటే 1950 డిసెంబరు 15 వరకూ ఆ పదవిలో ఉన్నారు. పటలే మరికొంత కాలం జీవించి ఉంటూ కశ్మీర్ సమస్యకు ఆనాడే పరిష్కారం దొరికేదేమో..
భారత దేశ సమైక్యత, సమగ్రతకు తొలి రూపం ఇచ్చిన మహానేత సర్దార్ వల్లభాయ్ పటేల్.. పటేల్ ను గౌరవిస్తూ నర్మదా నది తీరంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో 182 మీటర్లు మీటర్ల ఎత్తున ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ రోజున సర్దార్ పటేల్ జయంతి. ఆ మహనీయుని స్పూర్తితో మనమంతా భారత దేశ సమగ్రత కోసం కలిసికట్టుగా పని చేద్దాం..
. ఒకరు కలిపే సూది - మరొకరు విడగొట్టే కత్తెర
---------------------------------------------------------------------
. దేశానికి స్వాతంత్యం వచ్చాక, అప్పటికి దేశంలో వున్న సంస్థానాలన్నిటిని నయానా... భయానా... ఒప్పించి నేటి భారతదేశానికి ఒక నేటి రూపును ఇచ్చిన ధీశాలి... "ఉక్కు మనిషి"గా పేరొందిన "సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ జయంతి" నేడు.
. తన అధికార సుస్థిర కోసం "అత్యాయిక పరిస్థితి"తో పాటు అప్పటి పచ్చటి పంజాబ్ రాష్ట్రంలో రోజుకు బలపడుతున్న అకాలీదళ్ అనే ప్రాంతీయ పార్టీని బలహీన పర్చేందుకు బింద్రేన్ వాలా అనే ఓ మూడున్ని ఎగదోసి, "ఖాళీస్తాన్" అనే ఓ ప్రత్యేక దేశానికి ఊపిరి పోసి, ఉగ్రవాదంతో పంజాబ్ రాష్ట్రాన్ని ఓ అగ్నిగుండంగా మార్చి చలికాచుకోజూస్తే, ఆ తరువాత అదే మంటలకే మాడి మసై పోయిన "ఇందిరా గాంధీ వర్ధంతి" నేడు.
ఎంత యాదృచ్చికం !
ఈరోజు @ 31, అక్టోబర్
సూదిలా కుట్టి కలపాలని చూసిన వ్యక్తి "జయంతి" నేడు @ సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్
కత్తెరలా విడగొట్టాలని చూసిన మరొక వ్యక్తి "వర్ధంతి" కూడా నేడే @ ఇందిరా గాంధీ.
సమాజ హితాన్ని కోరే వ్యక్తి సర్దార్ వల్లబ్ బాయ్ పటేలును ఇష్టపడతాడు.
తన ఒక్కడి హితాన్ని మాత్రమే కోరుకునే వ్యక్తి ఇందిరా గాంధీని ఇష్టపడతాడు.
సర్దార్ హృదయ వైశాల్యం 1947 లో దేశం ముందు సాక్షాత్కారమైంది .తనకు దక్కాల్సిన దేశ ప్రధానమంత్రి పదవినే ఒక *'అసమర్థుడి'* కి అప్పనంగా ఇచ్చేశాడా మహోన్నత నాయకుడు....
దేశంలోని 15 కాంగ్రెస్ ప్రాంతీయ సమితుల్లో 12 సమితులు పార్టీ అధ్యక్ష స్థానానికి సర్దార్ పటేల్ పేరును ప్రతిపాదిస్తే , ఆ స్థానం కోసం చొంగ కార్చుకుంటుండిన నెహ్రూ ను కనీసం ఒక ప్రాంతీయ సమితి కూడా ప్రతిపాదించలేదు. అయినా గాంధీ , నెహ్రూ మొండితనానికి లొంగిపోయి , సర్దార్ పటేల్ ను బలవంతంగా ఒప్పించి నెహ్రూ ను ప్రధానమంత్రిని చేశాడు. గాంధీ అభిప్రాయాన్ని గౌరవించి సర్దార్ పటేల్, ఒక 'అసమర్థుడి 'కి ఆ పదవిని ధారపోశాడు...
దేశం ఇప్పటికి సర్దార్ రుణం తీర్చుకుంటుంది...
*దేశ్ మే ఏకీ నామ్ సర్దార్ సర్దార్....*
భారత్ మాతాకి జై...
ఇది కురియన్ వర్ఘీస్ వ్రాసుకున్న జ్ఞాపకాల నుండి సంగ్రహించడమైనది.
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంత నిజాయితీ పరుడో ఈ దేశం కోసం. దేశ సమైక్యత కోసం ఎంత కృషి చేశారో మన అందరికీ తెలిసిన విషయమే.. వారే కలుగ జేసుకోక పోయి ఉంటే ఈ సువిశాల భారతం ఉండేది కాదేమో అనిపిస్తుంది.వారి కుమార్తె మణి బెన్ పటేల్ కూడా ఎంతో నీతి నిజాయితీలతో తండ్రికి తగ్గ కుమార్తెగా ధైర్యంగా బ్రతికిన మహిళ.
ఇవి నాకు ఆవిడ స్వయంగా చెప్పుకుని బాధ పడ్డ విషయాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చివరి రోజుల్లో మరణానికి చేరువయ్యాక ఓ పెద్ద బ్యాగ్ మరియు ఓ పుస్తకం ఇస్తూ.. వీటిని నెహ్రూ గారికి అందజేయవలసిందిగా కోరారట.. అవి నెహ్రూకి తప్ప వేరెవరి చేతికీ ఇవ్వవొద్దని ఆయన కోరిక. పటేల్ మరణానంతరం కొన్ని రోజులకు తండ్రి చెప్పిన ప్రకారం మణిబెన్ పటేల్ ఆ సంచీ తెరచి చూస్తే అందులో పుస్తకములోని వ్రాత ప్రకారం 35 లక్షల డబ్బు కాంగ్రెస్ పార్టీకి చెందినదిగా తెలిసిందిట. తండ్రి కోరిక ప్రకారం ఆమె వాటిని తీసుకుని నెహ్రూ గారిని కలిసి వాటిని స్వయంగా అందజేసిందిట.
దాని తీసుకుని ధన్యవాదాలు చెప్పి నెహ్రూ గారు మౌనంగా ఉండిపోయారట. ఇంకా అక్కడే ఉన్న మిగతా జాతీయ నాయకులెవరూ కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదట. నెహ్రూ గారు ఇంకేమైన చెబుతారేమో అని అప్పటికే అశక్తురాలైన పటేల్ కుమార్తె చాలా సేపు అక్కడే కూర్చుని ఎదురు చూసిందిట.వారేమీ మాటాడక పోయేసరికి నిరాశగా ఆమె తిరిగి తన ఇంటికి చేరుకుంది.
ఈ విషయం చెబుతున్నపుడు కురియన్ ఆమె కళ్ళలోని ధైన్య స్థితిని కళ్ళారా చూశారట.మీరేమైనా వారి నుండి ఎదురు చూసారా అని కురియన్ గారు అడగగానే గద్గదమైన ఆమె గొంతు, అవును నాన్నగారు పోయాక మా పరిస్థితి క్షీణించింది.కుటుంబం గడవడం కూడా కష్టతరమైంది.వారేమైనా సహాయం చేయడమో కనీసం మాటసాయం అయినా ఉంటుందని భావించాను కానీ వారేమీ మాటాడలేదు. పటేల్ మరణం తరువాత ఆమె పరిస్థితి మరింత క్షీణించింది.. ఒంటరిగానే ఉండేదిట ..
చూపుకోల్పోయి అహ్మదాబాద్ వీధుల్లో అక్కడక్కడా కొందరికి కనబడేదిట. అలా కనబడిన ఆమెను కురియన్ గారు కలసి విషయాలన్నీ తెలుసుకుని ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన చిమన్ భాయ్ పటేల్ గారికి తెలియజేశారట. ఆయన ఉన్నపళంగా ఓ రోజు ఆమె నివాసం ఉండే ప్రాంతానికి మీడియా మరియు ఫొటోగ్రాఫర్స్ తో వెళ్ళి తనకు తోచిన కొంచెం ఆర్థిక సహాయం చేసి ఆమెపక్కన నిలబడి ఫొటోస్ తీసుకున్నారట. అవన్నీ మరుసటి రోజు పత్రికలలో ప్రచురితం కాగానే ఆమెకు సహాయం చేయడానికి చాలామందే ముందుకు వచ్చి ఆమె చివరి రోజులు కాస్త ప్రశాంతంగా గడిచిపోయాయట.దేశం కోసం ఎంతో చేసిన పటేల్ గారి కుమార్తెను అలా కాంగ్రెస్ వారు ఎంత నిర్ధాక్షిణ్యంగా ఆమె తండ్రిపోయాక తోసిరాజారో .. ఈ విషయం చదువుతుంటే చాలా బాధ వేసింది.వారే తలచుకుంటే కనీస సౌకర్యాలు ఆమెకు కలుగ జేయలేరా?
Comments
Post a Comment