సేవా బౌద్దిక్ అంశాలు
సంఘంలో ప్రేరణ అనునది జేష్ఠ్య ప్రచారకుల ద్వారా లభిస్తుంది....
సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అందరికీ ముందు ఏం చేయాలి...? ఎలా చేయాలి...? అనే అవగాహన ఉండాలి
హిందూ రాష్ట్ర పూర్వవైభవాన్ని తీసుకురావడమే మన ధ్యేయవాదం కావాలి.
సమాజ చిత్రాన్ని అవగతం చేసుకున్నప్పుడే మనం సమాజంలో మార్పు తీసుకు రాగలగుతాము.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సేవా విభాగం అది 1989 సంవత్సరంలో డాక్టర్జి శతజయంతి ఉత్సవాల సందర్భంలో ప్రారంభించబడింది.
సేవాభారతి అనునది ఆర్థికపరమైన అంశాలతో సేవా కార్యాలను నిర్వహిస్తుంది కానీ సంఘంలో సేవా విభాగం అనునది శాఖ మాధ్యమంగా తక్కువ ఖర్చుతో లేదా అసలు ఖర్చు లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలోని వ్యక్తులను జోడిస్తూ సంఘటిత పరుస్తుంది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విభాగం ముఖ్య ఉద్దేశం &లక్ష్యం
సంఘ్ భావజాలం అట్టడుగు వర్గాల వారికి చేరేలా చూడటం.
మనం ఎంచుకున్న సేవాకార్యాలు సమాజంలో పెద్ద మార్పును తీసుకు రాలేకపోవచ్చు కానీ మార్పుకు నాంది పలుకుతాయి...
హిందుత్వ పరంగా బలహీన ప్రాంతాన్ని బలోపేతం చేయడమే సేవా విభాగం ముఖ్య లక్ష్యం.
ఆపదలు వచ్చినప్పుడు సేవ చేయడం కాదు ఆపదలో జీవిస్తున్న సమాజాన్ని గట్టెక్కించేందుకు కృషి చేయడమే
సేవా విభాగం ముఖ్య లక్ష్యం.
సేవా విభాగం పనిలో సేవితుడే ప్రయోజనకారిగా మారి సేవా కార్యకర్త గా మారాలి. మన పని సజ్జన శక్తిని జాగృతం చేసి సమీకరించగలిగేలా ఉండాలి.
మిగిలిన ధార్మిక సంస్థలకు మరియు సంఘంలోని సేవా విభాగం గల పనిలో వైరుధ్యాలు కనిపిస్తాయి వాటితో వాటి లక్ష్యాలతో మనం పోల్చుకోవద్దు.
మనది సార్వజనీన స్థాయి...
దేశ వ్యతిరేక శక్తులు పాగా వేసే ముఖ్య ప్రదేశం పేదరికం మన సాంస్కృతిక వైభవాన్ని మాట్లాడే ముందు వర్ధమాన సత్యాన్ని కూడా మాట్లాడాలి. దినసరి కూలీలకు శారీరక, బౌద్ధిక అంశాలు అర్థం కాదు కానీ వారికి కావాల్సింది హృదయ స్పర్శ. కేవలం దీని ద్వారా మాత్రమే వారు సంఘంలో ప్రవేశం పొందగలుగుతారు ఈ పని చేసేది సేవా విభాగం.
【ఊదాహారణకు మహారాష్ట్రలో యాచక వృత్తి చేస్తున్న సిందుతాయి తన జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంది.. తన పోషణే లేని పరిస్థితుల్లో ఆమె ఇతర దీనులను చేరదీసి వారిని పెంచి పోషించింది..
ఇలా సేవా కార్యక్రమం అనేది హృదయ పూర్వకమైన సంవేదన నుండి వచ్చింది తప్ప ఇతరులను ఎలా చేయాలి అని అడగడంతో రాదు.....】
సేవా కార్యాన్ని దిశ
సంఘం దేశభక్తులను తయారు చేసే పరిశ్రమ కాదు. కానీ వారికి కావాల్సిన దిశను అందించే సంస్థ మాత్రమే. ఈ రకంగా సంఘంలో సజ్జనశక్తి నిర్మాణం అనేది ప్రస్తుత స్వయంసేవకులు, కాబోయే స్వయం సేవకులు గా నిర్మాణం అవుతుంది
సేవా కార్యం అనేది ప్రజల మధ్యలో మరియు సమాజంలో లోపల జరగాలి అంతేగాని వెలుపల జరగకూడదు.మన కార్యం సమాజంపై ప్రభావం చూపగలగాలి...
సేవా కార్యం అనేది బయట నుండి వచ్చే నిర్వాహకుల వల్ల నిరంతరం కొనసాగదు మనం నిర్దేశించుకున్న కార్యంలో శిక్షణ పొందిన వారే తిరిగి నిర్వాహకుడిగా మారి సేవాకార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఇది శాశ్వతం.
సేవా కార్యవిస్తృతి అనేది మనం పెంచుకునే విస్తృతమైన సంబంధాలు మీద ఆధారపడి ఉంటుంది
మనిషిలో సేవాతత్పరతను మేల్కొలపడానికి ముఖ్యంగా మన సంఘ శాఖలో సాప్తాహిక్ సేవాదిన్ నాడు మనం చెప్పే సేవాకథ, సేవా అనుభవం లాంటి విషయాలు మానసిక ఉద్వేగం లాంటి అంశాలను ప్రభావితం చేసి సేవాకార్యం వైపు మలుపుతాయి.
ఎవరైనా సేవా కార్యం చేయాలని అనుకుంటే......... మనం ఏమి చేయాలి.?? వారు ఏం అడుగుతారు..?? అన్న సంశయం లో పనిచేయడం పై ఆలోచనలు జరుపుతారు. కానీ విశేషమైన సంస్కారం ప్రతిపాదికగా బాల సంస్కార కేంద్రం పేరిట మనం ముందుకు వెళ్ళగలిగితే మనకు పై సంశయం తగ్గి హృదయ స్పర్శ ద్వారా కుటుంబ సంపర్కం జరిగి సమాజ పరివర్తకులుగా మారుతాము.
సమాజంలో బాధతప్త హృదయాలు సేవా కార్యకర్తలను మాత్రమే కలవగలిగేలా సేవా కార్యకర్తలు స్థాయి రూపొందాలి.
జిల్లా లేదా నగర స్థాయిలో సేవా బస్తి దత్తత కార్యకర్తలకు బైఠక్ నిర్వహించాలి.
హాస్టల్ ను సేవా కేంద్రం గా గుర్తించి నగరంలో కానీ మండల కేంద్రంలో గల సంక్షేమ వసతిగృహాల జాబితాను తయారు చేయాలి కళాశాల విద్యార్థులను వీటికి జోడించాలి.
ప్రధాన రహదారుల వెంబడి సేవా కార్యక్రమాల ద్వారా మనం వెళ్లగలిగే గ్రామాలను గుర్తించాలి.
ఒక స్థలంలో ఐదు సేవా కార్యక్రమాలు జరిగే స్థలాలను గుర్తించి వారికి ప్రాంత స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో అవగాహన కల్పించే బైఠక్ లను ఏర్పాటు చేయాలి అందుకొరకు యోజన చేయాలి.
పది కన్నా ఎక్కువ సేవా కార్యక్రమాలను నిర్వహించగల ఖండల జాబితాను రూపొందించుకోవాలి.
వార్షిక యోజన లో సేవా ప్రముఖులకు నిర్వాహకులకు నిర్వహించగల వర్గల యోజన తయారు చేయాలి.
జరుగుతున్న సేవా కార్యక్రమాల డాక్యుమెంటేషన్ రూపొందించాలి.
ప్రౌఢ స్వయంసేవకులను జిల్లా సేవా టోలిలో భాగం చేయాలి. వీరిచే మహిళల సేవా కార్యక్రమాలను పర్యవేక్షణ చేయించాలి.
సేవ అవగాహన బైఠక్ అపేక్షిత
శాఖలో బాధ్యత లేని స్వయంసేవకులు ఎవరైనా
మనకు పరిచయం గల ఇంటర్ డిగ్రీ విద్యార్థులు
ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు
మహిళా ఉద్యోగినులు విద్యావంతులైన గృహిణులు
సేవా కార్యకర్తలు - పర్యటన
సేవా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు కార్యస్థలం యొక్క పరిస్థితుల గురించి అవగాహన పొందేందుకు ప్రయత్నించాలి.
సేవా ప్రముఖ్ ్
ప్రారంభించిన సేవా కార్య ద్వారా ఆశించిన సామాజిక పరివర్తన జరగాలి పనిని విభజించుకుని కార్యాన్ని విస్తరించే ప్రయత్నం చేయాలి కార్యకర్తలను తయారు చేసుకోవాలి మనం పనిచేస్తున్న క్షేత్రంలో రాబోయే రోజుల్లో ఇలాంటి మార్పులు ఆశిస్తున్నాము కల్పన రూపొందించుకోవాలి పాత నూతన కార్యకర్తలు సంపర్కం ఆలోచనల్లో కొత్తదనం సృజనాత్మకత మొదలైన అంశాల్లో నైపుణ్యాలను పెంచుకోవాలి సేవాతత్పరత కలిగిన వారితో రూపొందించుకోవాలి నడుస్తున్న సేవా కార్యక్రమాలు ఆగిపోతే వాటిని మళ్ళీ పునరుద్ధరించేందుకు కూడా తయారు చేయాలి విజయవంతం కావాలంటే భాగ్య కౌశలం అంతరంగ కౌశల్ అనిపించుకోవాలి పని చేస్తుంటే నీ పని అనుభవం ఏర్పడుతుంది పర్యటనకు వెళ్లే ముందు పని పూర్తి చేసుకోవాలి లేకపోతే అనుకున్న ఫలితాన్ని పొందలేము.
పర్యటన కార్యకర్త ఆత్మీయత పూర్వక వ్యవహార శైలిని కలిగి ఉండాలి ఒకే విషయాన్ని విస్తారంగా కాకుండా తగిన విధంగా మోతాదులో చెప్పగలగాలి.
కన్నడ నగర దుబ్బ మండల శాఖ స్థాయిలలో సేవా ప్రముఖులు నీతి చేయుటకు గాను సేవా కార్యాలు పెంచుటకు నెల రోజుల వ్యవధిలో కార్యక్షేత్రం లో విస్తృతంగా పర్యటనలు చేయాలి సేవా ప్రముఖులు గా ఉపయోగపడే వ్యక్తుల సూచి తయారు చేయాలి ప్రతి శాఖ ద్వారా సులభమైన సేవా కార్యక్రమాలు నిర్వహించుటకు గాని స్వయంసేవకులకు ప్రశిక్షణ వర్గ ఏర్పాటు చేయాలి ఒక సేవా కార్యక్రమం ఆధారంగా మరో సేవా కార్యక్రమం ప్రారంభించుటకు ప్రయత్నం చేయాలి.
సేవాకార్యం ఆవశ్యకత
స్వయంసేవ గా మనకు శాఖ పని ఎంత ముఖ్యమో దానికి కొనసాగింపుగా ఒక సేవ ప్రముఖంగా మన సేవా కార్యక్రమాలు యోజన మరియు కార్య అమలు పట్ల అంతే నిబద్ధతతో మన వ్యవహారం ఉండాలి
శేషాద్రి గారి మాటల్లో సంఘ భావజాల విస్తరణ సమాజంలో సంఘ శాఖ ఆవశ్యకత శీఘ్రగతిన అట్టడుగు ప్రజల వారికి చేరాలంటే సంఘంలో సేవా విభాగం ప్రారంభించిన అత్యంత ఆవశ్యకం దేశ ప్రజల మధ్య పనిచేస్తున్నాయి ఇలాంటి స్థలం ఏ విధంగా వారికి అర్థమయ్యే భాషలో మనం నిరంతరం పనిని నిర్వహించే సేవా విభాగం ఈ విధంగా ఒక బాధ్యత ఉంది శాఖ ద్వారా నిర్మాణమైన వ్యక్తి తన వ్యక్తిత్వం ద్వారా తన వ్యవహారం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలి ఆ మార్పు మన ఆశయాలకు అనుగుణంగా ప్రభావితం చేయాలి ప్రస్తుత పరిస్థితుల్లో శాఖ ఆధారంగా సేవా కార్యక్రమాలు నిర్వహించుట అనేది తగ్గడం జరిగింది
శాఖ ఆధారిత సేవా కార్యక్రమాలు జరగకపోతే వ్యక్తి నిర్మాణంలో లోపం జరిగినట్లే సేవ యొక్క మౌలిక లక్షణాలు వ్యక్తుల జీవితంలో మార్పులు తీసుకురావడం వ్యక్తుల సంఘటన ద్వారా సజ్జన శక్తిని పెంచడం స్వయం సేవకులలో సేవాభావాన్ని పెంచడం..
రతన్టాటా గారు ఒకసారి పూజనీయ మోహన్ జి భగవత్ గారిని కలిసినప్పుడు స్వయం సేవకులలో ఇంత మందిని ప్రామాణిక మనుషులుగా మారుస్తున్నారు అది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు మీరు మా సంఘ శాఖలు దర్శించండి మా కార్యకర్త మా కార్యకర్తల వికాసానికి ఆధారం అని తెలిపినారు శాఖ సేవ అత్యంత క్లిష్టమైనది మరియు అత్యంత సులభమైనది అనగా మన ఆలోచన విధానం పై మన కార్యాచరణ ఆధారపడుతుంది శాఖా సేవా నిర్మాణాత్మకంగా జరగాలంటే ప్రతి స్వయంసేవక్ సేవా బస్తీ లను సందర్శించాలి జిల్లా నగర ఉప మండల మండల శాఖా స్థాయిలో సేవా ప్రముఖులను నియుక్తి చేయాలి.
స్థానిక అవసరాల దృష్ట్యా సేవా కార్యక్రమాలను రూపొందించాలి సమాజ సేవ ద్వారా అపరిమితమైన ఆనందం లభిస్తుంది ఆత్మీయతతో కూడిన పలకరింపు సేవా కార్యానికి కి మూలాధారం.
జిల్లా స్థాయి సేవా టోలీల లో ఉండాల్సిన వారు
నగర ఖండ స్థాయిలలో నైపుణ్యం గల సేవా ప్రముఖులు
జిల్లా కార్యవర్గ సహ కార్యవాహ
సేవా కార్యాల ప్రశిక్షణ ఇవ్వగల సంఘ బాధ్యత లేని కార్యకర్తలు
హాస్టల్ సేవా బస్తీ పాఠశాల కేంద్రంగా పని చేయువారు
*సేవా భారతి - కామారెడ్డి*
*మానవ సేవే మాధవ సేవ*
సమాజ సేవనే పరమావధిగా భావించి ఏర్పడినటువంటి సేవా సంస్థ సేవాభారతి. "మానవసేవే మాధవ సేవగా" అభివర్ణించిన స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక మార్గదర్శనం ఆధారంగా సేవాభారతి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
అఖిల భారత స్థాయిలో 1989 సంవత్సరంలో రాష్ట్రీయ సేవ భారతి సంస్థ స్థాపన జరిగింది స్థాపించిన అనతికాలంలోనే దేశవ్యాప్తంగా ఒక 175000 సేవా కార్యక్రమాలతో సమాజ ఉన్నతికి సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన మన తోటి సహోదరులు సముద్ధరణకు వారి జీవన ప్రమాణాలను అభివృద్ధి చేయటానికి విద్య ఆరోగ్యం సామాజిక రంగంలో విశేషమైన సేవా కార్యక్రమాలను సేవాభారతి నిర్వహిస్తుంది ఈ విధంగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో నలుమూలలా విస్తరించి సేవా భావంతో కృషి చేస్తూ, భారత మాత విశ్వ స్థానంలో నిలుపుటకు తనవంతు పాత్రను పోషిస్తుంది.
*వివిధ రంగాలలో సేవాభారతి నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు....*
విద్యా సంబంధిత
ఆరోగ్య సంబంధిత
సామాజిక సంబంధిత
స్వావలంబన సంబంధిత
వివిధ
సంస్కారం అను అంశం ప్రధానంగా తీసుకుని మన సేవా కార్యక్రమాలను నిర్వహించాలి.
ప్రజల మధ్యలో బస్తీల మధ్యలో కేంద్రాల నిర్వహణ జరగాలి.
సమాజ జీవనం ఎలా ఉంటుందో అలాగే మనం దర్శించుకోవాలి. మన జ్ఞానంతో సమాజాన్ని పోల్చి విభేదించ వద్దు జోడించగలగాలి.
మనం విషయ నిపుణత కలిగిన వారం కావచ్చు కానీ సమాజానికి మనం అలా అనిపించకూడదు.
స్వయంసేవకుల లో సంవేదన శీలత ను నింపి వారి ద్వారా సేవా బస్తీలలో పరివర్తన తీసుకురావడమే సంఘంలో సేవా విభాగం యొక్క లక్ష్యం.
*అ. విద్యా సంబంధిత సేవాకార్యక్రమాలు*
*1. బాల సంస్కార్ / బాలగోకులం*
నగరాలలో గ్రామాలలో చిన్న వృత్తులతో తక్కువ ఆదాయం కలిగిన వారి పిల్లలు వారి తల్లిదండ్రుల జీవనశైలి కారణంగా సరైన ఆలనా పాలన సాధ్యపడక చిన్నారులు బాల్యంలోనే అనేక చెడు అలవాట్లకు లోనవుతున్నారు. మరోపక్క స్థితిమంతులు పిల్లలు వాస్తవాలకు దూరంగా ఊహాలోకంలో విహరిస్తూ సమాజంపై దురభిప్రాయాన్ని పెంచుకుంటున్నారు... ఇట్లాంటి పరిస్థితుల్లో ఆటపాటలు నీతి కథలు బోధనల ద్వారా బాలల్లో మానవీయ విలువలను పెంపొందిస్తూ స్నేహాన్ని సంస్కారాన్ని బాల సంస్కార బాలగోకులం ద్వారా అందించే ప్రయత్నం సేవాభారతి చేస్తుంది.
దేవాలయ ప్రాంగణం పాఠశాల సత్రం లేదా ఏదైనా ఎంపిక చేసుకున్న ఒక ఇంటిలో నిశ్చితమైన సమయంలో వారంలో ఒక రోజు గంట లేదా గంటన్నర సమయం కేటాయించి ఈ సంస్కార కేంద్రం ను నిర్వహించడం జరుగుతుంది.
*బాలల జీవన శైలిలో క్రమపద్ధతి, అనుశాసనము, పెద్దలను, అతిధులను గౌరవించే సభ్యత, అందరితో కలిసి మెలసి ఉండే క్షమత, మంచివిషయాలలో జట్టు భావనలతో కూడిన పోటీ, నేను నుండి మనము మనందరము అనే అమృత భావం సహజంగా అలవడుతుంది. సద్భుద్ధి, స్వాభిమానం, మంచి హృదయం, కష్ట సుఖాలను తెలుసుకునే మనసు, తల్లిదండ్రులపైన, పరిసర సమాజం పైన ప్రేమ, గౌరవం కలిగినవారిగా తీర్చిదిద్దబడతారు.*
*రండి | విషపూరిత పాశ్చాత్య ప్రపంచం నుండి మన న బాలబాలికలను కాపాడుకుందాం. పూలను కోసేవారు, చూసేవారు చాలామంది ఉన్నారు. నేడు కావలసినది వేళ్ళకు నీరు పోయ్యాలి. పదండి పోదాం. ఆనందంగా ఆ చిన్నారుల ప్రపంచంలోకి....*
*2. కిశోరి వికాస్*
మహిళా సాధికారికత విషయంలో విశేషంగా సేవా కార్యక్రమాలను నిర్వహించి మహిళలను విద్య, ఆరోగ్యం, సంస్కారం వంటి విభిన్న రంగాలలో చైతన్యపరిచి స్వాభిమానంతో జీవించే విధంగా 10 - 18 సంవత్సరాల వయస్సు
గల బాలికలకు వృత్తి విద్య, యోగా, కంప్యూటర్ శిక్షణ, ఆత్మరక్షణ విద్యలు, కుట్లు-అల్లికలు వంటి అంశాలే గాక ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తూ సంస్కారం దేశభక్తి నింపుతూ.... *"నేను నా దేశం అందుకొరకే నా సేవలు" అనే భావన పెంపొందిస్తూ వీర కిశోరాలు మా బాలికలు "* అని వారి తల్లిదండ్రులు చెప్పుకునే విధంగా దూసుకుపోతున్నవి కిషోరి వికాస కేంద్రాలు...
గ్రామీణ మరియు వెనుకబడిన ప్రదేశాల్లో విద్యనభ్యసించే బాలికలు వారి సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడిన కేంద్రాల్లో స్థానికంగా ఉంటున్న విద్యావంతులై సామాజిక స్పృహ కలిగిన గృహిణిలచే వారంలో ఆరు రోజులు గంటన్నర పాటు చదువులో సహకరిస్తూనే, వివిధ అంశాల్లో బాలికలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
అనేక మంది బాలికలు భావి జీవితంలో స్వీయ ఉపాధిని పొందుతూ తమ సొంత కాళ్లపై నిలబడుగలుగుతున్నారు.. తాము స్వతహాగా నిర్వాహకులుగా మరి వేరు వేరు స్థలాలలో నూతన కిషోరి వికాస్ కేంద్రాలు ప్రారంభిస్తున్నారు... సేవా ఫలాలను ఇతరులకు అందిస్తున్నారు.
*3.అభ్యాసిక (ఉచిత బోధన తరగతులు)*
సమాజంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారు ప్రభుత్వ ప్రైవేటు విద్యా పొందినప్పటికీ పోటీ ప్రపంచం దృష్టిలో ఉంచుకుని వారి విద్యా నాణ్యతను పెంపొందించడానికి మరింత శిక్షణ అవసరం.. ఇందు కొరకు
సేవాభారతి అర్హత గల నిర్వాహకుల చేత వారానికి ఆరు రోజుల పాటు...., రోజు రెండు గంటల ఉచిత ట్యూషన్ కేంద్రాలను నిర్వహిస్తూ ఎక్కువ మంది విద్యార్థులకు సేవలను అందిస్తూ వారి నైపుణ్యాలను తీర్చిదిద్దుతుంది.
ఈ ఉచిత బోధన తరగతుల వలన అనేక మంది బాల బాలికలు పోటీ పరీక్షల్లో చక్కని ఫలితాలు సాధించగలుగుతున్నారు. తమ ఇళ్లల్లో సరైన సదుపాయాలు లేని విద్యార్థులకు ఈ అభ్యాసికలు ఒక ఆశాదీపంగా మారాయనడం లో ఎలాంటి సందేహం లేదు.
*ఆ. ఆరోగ్య సంబంధిత సేవా కార్యక్రమాలు*
*1. హోమియో ప్రథమ చికిత్స కేంద్రాలు*
సేవాతత్పరత కలిగిన వైద్యుల సహాయంతో శిక్షణ పొందిన వాలంటీర్ల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ కేంద్రాల ద్వారా ప్రథమ చికిత్స మరియు అత్యవసర వైద్య సహాయక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అత్యంత సహాయకారిగా ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి.
*2. రక్తదాన చైతన్య కార్యక్రమాలు & రక్త గట సూచీ*
ప్రజలలో రక్తదానం ఆవశ్యకత గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే, అత్యవసర సమయంలో రక్తదానం చేయుటకై ఎవరైతే రక్త దాతలు సిద్ధంగా ఉంటారో వారి వివరాలు సేకరించి అవసరమైన సందర్భాల్లో వారి సహాయం కోరడం జరుగుతుంది. ఇలా అనేక మంది రక్తదాతలు స్వచ్ఛందంగా తమ పేరు నమోదు చేసుకుని అవసరమైన వారిని ఆప్తుల్లా ఆదుకుంటున్నారు.
*3. అంబులెన్స్ సౌకర్యం*
మారుమూల గ్రామీణ ప్రాంతాలలో, తాండాల్లో అత్యవసర సమయాల్లో తక్షణ వైద్య సహాయం అందని కారణంగా అనేకమంది సామాన్య ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు... ఈ పరిస్థితుల్లో సేవా భారతి వారికి చేయూతను అందించడానికి గాను అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
*ఇ. సామాజిక సేవా కార్యక్రమాలు*
*1.మాతృ మమండలి*
*"మాత నిర్మాత భవతి"*
బిడ్డలను చక్కగా నిర్మాణం చేయడం వల్లనే ఆమెకు మాత్రం శబ్దం అన్వయిస్తుంది.
ఆరోగ్యవంతమైన సమాజానికి మూలకేంద్రం కుటుంబ వ్యవస్థ.
భారతీయ కుటుంబ వ్యవస్థను లోతుగా పరిశీలిస్తే మన సంస్కృతిని పరిరక్షించి, నిలిపి ఉంచినది స్త్రీలేనన్న విషయం నిర్ధారణ అవుతుంది. భార్యలుగా, తల్లులుగా, సోదరీమణులుగా, వదినలుగా, అమ్మమ్మలుగా వివిధ పాత్రలలోవాళ్లు వ్యవహరించి మన సాంస్కృతిక మూల్యాలను సజీవంగా ఉంచారు. ప్రతి ఇల్లూ ఒక గుడిగా, పాఠశాలగా అయింది, ఒక సంస్కృతి కేంద్రమైంది, తల్లే మొదటి గురువైంది. మౌలికమైన నైతిక మూల్యాలను, దేశభక్తిని ప్రాథమిక విద్యాభ్యాసానికి ముందే పిల్లలు ఇళ్ళలో మౌఖికంగా నేర్చుకున్నారు. సేవాభావాన్ని, త్యాగశీలతను కూడా వంట బట్టించుకున్నారు. కుటుంబం కొరకు, దేశం కొరకు స్త్రీలు నిర్వహించిన పాత్ర కష్టాలతోను, త్యాగాలలోను నింపినది. మన సంస్కృతి యొక్క విలువను కాపాడి, నిలబెట్టి, అందించడంలో స్త్రీలు నిర్వహించిన మహోదాత్త, వీరోచిత పాత్ర గురించి చరిత్ర వేనోళ్ళ వర్ణిస్తోంది. మన సంస్కృతి అవినాశియై అపరాజితయై నిలచి ఉండడం వెనుకగల కారణం ఇదే.
ఇంతటి ఘన నేపథ్యం ఉన్న భారతీయ మాతృమూర్తి నేడు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసే సీరియల్స్, అశ్లీల టీవీ షోల ప్రభావంలో, సెల్ఫోన్ వాడకంలో అధిక సమయం గడుపుతున్నారని తెలుపుటకు ఎంతో బాధ కలుగుతుంది.
దీని ప్రభావం యావత్తు కుటుంబం పై చూపుతుంది.
ఏ దేశంలో స్త్రీ జాతి పతనమైన ఆదేశం పతనం వైపు వెళ్తుంది. ఏ దేశంలో స్త్రీ జాతి ఉన్నతంగా ఉత్తమంగా ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కావున ఈ పరిస్థితులలో మహిళలలో జాతీయ భావనలను పెంపొందిస్తూ నే భారతీయ సంస్కారాలు అందించాలనే ఉద్దేశంతో మాతృమండలి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది.. వారంలో ఒక గంట పాటు నిర్వహించే కార్యక్రమాల్లో మాతృమూర్తులు పాల్గొంటూ అనేక విషయాలు నేర్చుకుంటూ వారి పిల్లలకు నేర్పిస్తున్నారు.
2.భజన మండలి
3.సంచీ గ్రంథాలయం
*ఇ. స్వావలంబన కార్యక్రమాలు*
కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు
వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు
*వివిధ విపత్తుల సమయంలో సేవాభారతి నిర్వహించిన సేవా కార్యక్రమాలు....*
*ఇతర కార్యక్రమాలు.....*
సేవా కార్యాల ప్రశిక్షణ
శిక్షకులు అంశాలు
పిల్లలు ఎలా నేర్చుకుంటారు
నమూనా
ఇలా సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాలి
కావలసిన నైపుణ్యాలు ఏమిటి
Sustaining system
మాదిరి అంశాలు
వార్షిక ప్రణాళిక
ప్రత్యేక కార్యక్రమాలు
శిక్షకులు ఉపయోగార్థం
balagokulam అనగానేమి
ఏ వయసు బాలబాలికలకు బాలగోకులంలో అనుమతి ఉంటుంది
బాలగోకులం నిర్వహణకు ఉపయోగించాల్సిన భాషా నైపుణ్యాలు ఏమిటి
నేను సేవా కార్యకర్త అవ్వాలంటే
నా చుట్టుపక్కల ఇంకెవరైనా సేవా భావం కలిగిన వ్యక్తులు ఉన్నారా
ఒకవేళ నా చుట్టుపక్కల సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి
అభ్యాస వర్గ బయటకు శిక్షణ శిబిరం సంపర్క్ అంటే ఏమిటి
బాలగోకులం ప్రారంభించాలంటే నేను ఎంత సమయం తీసుకోవచ్చును
బాలగోకులం లో ఉండే ఇతర శిక్షణా అంశాలు ఏమిటి
బాలగోకులం లో బాధ్యతలను పెంచుకోవడం ఎలా
బాలగోకులం యొక్క మిగతా ప్రాజెక్టు కృత్యాలు ఏమిటి
ఈ balagokulam యొక్క శిక్షణ ద్వారా సామాజిక సమర్థత నైపుణ్యం ఎలా పెరుగుతుందో చెప్పగలరా
బాల సంస్కారాలను మిగతా సంస్థలు కూడా నిర్వహిస్తాయి వీటి మధ్య పోలికలు వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా
ఈ మహత్తర కార్యక్రమానికి నేను ఎలా సహాయ పడగలను
గ్రామ/బస్తీలలో నిర్వహించదగు సేవా కార్యాలు
బాల సంస్కార కేంద్రాలు
బాల గోకులాలు
అభ్యాసికలు
బోధనా తరగతులు
భజన మండలిలు
సంచీ గ్రంథాలయాలు
భగవద్గీత పఠన కేంద్రాలు
కిశోరి వికాస్ కేంద్రాలు
మాతృ మండలి
యోగా శిక్షణ కేంద్రం
ప్రథమ చికిత్స కేంద్రం
వ్యాయామశాల
శ్రమ సేవ
వృత్తి నైపుణ్య కేంద్రాలు
హనుమాన్ చాలీసా కేంద్రం
ఉపక్రమాలు అప్పుడప్పుడు నిర్వహించేవి
మొక్కలు నాటుట
స్వచ్ఛభారత్
వైద్య పరీక్ష కేంద్రం
రక్తదాన కేంద్రం
ఆరోగ్యం సూచి శుభ్రత
పర్యావరణం పట్ల అవగాహన మరియు చైతన్యం సామాజిక ఉత్సవాల్లో వ్యవస్థ
పేద విద్యార్థులకు రాత పుస్తకాల పంపిణీ
నారాయణ పాత్ర
స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు
మహాపురుషుల జయంతులు
భారతమాత పూజ
రైతులకు నీటి యాజమాన్య తరగతులు
యోగా శిబిరాలు
సామూహిక వ్రతాలు పారాయణాలు
విద్య అవగాహన తరగతులు
సేవా డాక్యుమెంటేషన్
- కార్య కీ ప్రేరణ
- యోజన
- కార్యకర్త
- ప్రశిక్షణ
- ప్రత్యక్ష కార్యవిస్తార్
- కార్య్ కా ప్రభావ్
సేవా అమృత వచనాలు
1.తమ కనీస మానవ హక్కుల ను సైతం ఉపయోగించుకోలేని కోట్లాది మంది మానవులు నేడు దేశంలో ఉన్నారు ఆకలితో నిరక్షరాస్యత దారిద్ర్యంతో కనీస వసతులు లేని ప్రజలు మనకు నారాయణులు నేడు వారిని మనం సేవించాలి అదే మన సామాజిక ధర్మం మరియు మానవ ధర్మం కూడా....
- పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ
2. నా సంపూర్ణ జీవితం భగవంతుని సేవలో దేశ సేవలో మీ సేవలో అంకితం అవ్వాలి భగవంతుని సేవించడానికి ఉత్తమమైన మార్గం మానవసేవే అని నా భావన నా ప్రియమైన మరియు నాకు మంచి పట్టు ఉన్న విషయం గణితం దీనిని నేను వేలాదిమందికి నేర్పిస్తాను దీని ద్వారా ద్వారా భగవంతుని సేవిస్తాను
- స్వామి రామతీర్థ
13. సమాజ సేవకు యోగ్యమైన వ్యక్తిగా తయారు కావడానికి రెండు రకాల ప్రేరణలు అవసరం సేవ చేయాలని అంత ప్రేరణ మొదటిది కృషి చేసే సంసిద్ధత రెండవది సేవ చేయడానికి ఉండాల్సిన ప్రేరణ భావాత్మక కావాలి ప్రతి ప్రియ వలన ఏర్పడిన ది గాని నిరాశ నుండి పుట్టినది గాని కాకూడదు.
14. సేవా కార్యానికి పరమార్థ సాధనకు కొంత సమయాన్ని కేటాయించి తీరాలి సేవ అనే అగ్నిలో ఇదే ఇదే జీవితం పవిత్రము పరిపూర్ణం విదేశీయులు మన దేశం నిర్మింపబడిన విలువలు ఆదర్శాలు ఊడదీసి సమాజాన్ని విధ్వంసం చేశారు దాని నిర్మాణానికి మనం మన సంస్కృతి వైభవం మళ్లీ పూర్వ స్థితికి చేరుకుంటుంది.
- పండిత శ్రీరామ శర్మ ఆచార్య జి
15. ఒకసారి మన జీవితం నిజమైన సేవాభావంతో నిండితే మన యొక్క వ్యక్తిగత సంసారిక సంపదలు ఎంత అధికంగా ఉన్నా సరే నిజానికి అవి మనకు చెందినవి కావు అనే భావన మనలో కలుగుతుంది అవన్నీ సమాజ రూపంగా ఉన్న సర్వేశ్వరుని పూజించే వస్తుంది అప్పుడు మన జీవితం సమాజ సేవకు అంకితం అవుతుంది.
- పరమ పూజనీయ శ్రీ గురూజీ
6. ఏ వ్యక్తి ఇతరుల సుఖం కోసం తాను కష్టాలను భరిస్తూ అవసరమైన వారికి సేవ చేస్తాడో....
దీనులను భగవంతుని గా భావించి వారి కొరకు తన సర్వస్వం అర్పిస్తాడో....
అతడు శ్రేష్ఠుడు పవిత్రుడు....
- వందనీయ మౌసి జి
7. *అమృతవచనం - 39*
*వ్యక్తులలో సంస్కారాలను కలిగించడమే సంఘశాఖ లక్ష్యం. శాఖకి వచ్చేవారిలో సమాజం సంక్షేమానికై పాటుపడాలనే భావనను నిర్మించటానికే గంటసేపు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం వ్యక్తులను సంస్కార వంతులుగా తీర్చిదిద్దే ప్రక్రియగా సంఘ శాఖ ఎప్పుడూ ప్రాధాన్యత ఉంది.ఐతే స్వయంసేవకులకు శాఖ అనేది అంతిమ లక్ష్యం కాకూడదు.*
*శాఖ ద్వారా పొందిన సంస్కారాలతో స్వయం సేవకులు వివిధ సేవా కార్యక్రమాల ద్వారా సామాజిక పరివర్తన కృషి చేయాలి. స్వయంసేవకులలో ఇటువంటి అవగాహన కలిగించడం చాలా అవసరం. ఒక గ్రామంలో శాఖ కార్యక్రమాలు ఎంతకాలం పాటు నిరంతరంగా సాగాయన్నది ముఖ్యమైన విషయమే అయినా శాఖ ఉండడం వల్ల అక్కడి సమాజంలో వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన, సహకారం, స్వావలంబన ఎంతమేరకు పెరిగాయన్నది ప్రధానమైన విషయం . ఇవే శాఖ కార్యక్రమాలు, ప్రభావానికి కొలబద్ధ. సంఘం శాఖ ద్వారా వ్యక్తులలో వస్తున్న సంస్కారాల ప్రభావాన్ని సమాజంలోని ప్రతి వ్యక్తి అనుభవించాలి.*
సేవా కార్యక్రమాలు సమయసారిణీ :
సులభంగా చేయదగు కొన్ని సంస్కార కార్యక్రమాలు బాల సంస్కార కేంద్రం :
సేవా బస్తీ / గ్రామంలోని బాలబాలికలకు, కిశోర్-కిశోరీలకు నిర్వహించే నైతిక బోధనా
తరగతులే బాల సంస్కార కేంద్రం కేంద్రాన్ని నియమితంగా, ఏదైనా ఒకరోజు ఉదయం లేదా సాయంత్రం నిర్వహించాలి
కార్యక్రమం యోజనాబద్ధంగా, ఉత్సాహంగా, ఆనందంగా, సంస్కారవంతంగా ఉండాలి కొందరు చురుకైన బాలబాలికలను ఎంపిక చేసి వారు నియమితంగా, నిరంతరంగా వచ్చునట్లుగా చూసుకోవాలి. 6.సంవత్సరాలు దాటినవారినే తీసుకోవాలి, ఉపస్థితి పట్టికలో
హాజరు వేసుకోవాలి.
కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా బాలబాలికలలో, శుభ్రత, ఆరోగ్యం, విద్యాస్థాయిలో ప్రగతి మరియు పెద్దలను, తల్లిదండ్రులను, గురువులను గౌరవించుట, తోటివారితో ప్రేమానురాగాలతో మాట్లాడడం అలవడాలి
6. బాల సంస్కార కేంద్రం ఆధారంగా క్రమంగా బస్తీలో అభ్యాసిక, బోధనా తరగతులు, సంచీ గ్రంథాలయం, మహాపురుషుల జయంతులు, వార్షికోత్సవం నిర్వహించాలి.
ప్రభుత్వ వసతి గృహాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో బాల సంస్కార కేంద్రం, బోధనా తరగతులు ఏర్పాటు చెయ్యాలి
8. బస్తీ పెద్దలను, తల్లిదండ్రులను, యువకులను కనీసం నెలలో ఒకసారి కలుసుకోవాలి వారికి సమావేశం ఏర్పాటు చేసి, వారిలో హిందుత్వ భావనను నిర్మాణం చెయ్యాలి.
:: బాల సంస్కార కేంద్ర సమయ సారిణి ::
0.05
0.10
0.05
0.05
0.10
2010
0.05
లు ఓంకారం, ధ్యాన శ్లోకాలు, మాతృవందన్
ఆటలు (నినాదాలు
ఉపవిష్ట వ్యాయామ్ / యోగాసన్ / అమృతాసన్
సుభాషితమ్ / నీతిపద్యం
ఆరోగ్య విషయాలు / లోకజ్ఞానం / ప్రశ్నవేదిక పాట / అభినయగేయం / భజన
సూచనలు / శాంతి మంత్రం
1.00 గంట కార్యక్రమం
2 అభ్యాసిక / బోరనా తరగతులు :
1. సేవా బస్తీ / గ్రామంలోని పేద విద్యార్థులను ప్రతిరోజు ఒక ప్రదేశంలో చదివించే / చ చెప్పే ఏర్పాటు చెయ్యాలి.
2 కేంద్రం ప్రతిరోజు సాయంత్రం / రాత్రి లేదా రాత్రి పడుకొని, ఉదయం చదివించే వ
చెయ్యాలి
బక్తీ/గ్రామంలోని గుడి, పాఠశాల, కమ్యూనిటీ హాలు మొదలగు ఏదేని ఒక పరిశుభ్ర
స్థలాన్ని నిర్ణయించుకోవాలి
4. స్థలాన్ని బట్టి సంఖ్యను, తరగతులను నిర్ణయించుకోవాలి 5. బాలికలు ఉన్నచో తగు వ్యవస్థ, జాగ్రత్త వహించాలి
ఈ సందర్భానుసారంగా పండుగలు, మహాపురుషుల జయంతులు, వార్షికోత్సవం నిర్వహిం
క్రమంగా... విద్యార్థులు శ్రమసేవ, సంఘతాఖ / సేవికాసమితి కార్యక్రమాలలో పాట
విధంగా ప్రోత్సహించాలి
- అభ్యాసిక సమయ సారిణి
0.05 ఓంకారం, ధ్యాన శ్లోకాలు, మాతృవందన్ ఉపవిష్ట వ్యాయామ్ / యోగానన్ / అమృతానన్
0.05
0.05 పాట / నీతిపద్యం / సుభాషితమ్
పరక/ బోధన / సందేహనివృత్తి 0.10 నీతికథ | లోకజ్ఞానం / ప్రశ్న వేదిక
130
0.05
సూచనలు / శాంతి మంత్రం
200 గంట కార్యక్రమం
సంచీ గ్రంథాలయం
ఒక సంచీలో, కొన్ని పుస్తకాలతో ఇంటింటికీ / పాఠశాలకు / వసతి గృహానికి వెళ్ళి పుస్తకాలు ఇచ్చుట, వారానికి ఒకసారి పుస్తకాలను మార్చి కొత్త పుస్తకాలు ఇచ్చుట చేస్తుంది మహా పురుషుల జీవిత చరిత్రలు, వీరనారీమణుల చరిత్రలు, దేశభక్తుల గాధలు, సామా సంస్కర్తలు, వైజ్ఞానిక వేత్తలు, బాలల సాహిత్యం మొదలగు పుస్తకాలు ఉండాలి మాసాలకు ఒకసారి బస్తీలో, గ్రామంలో, పాఠశాలలో, వసతి గృహంలో పాఠః సమావేశాలు, అందులో సమీక్ష, పుస్తక సంస్కరణ, ప్రేరక ప్రసంగాలు, ప్రశ్న వేదిక, ఆటపాట వివిధ విషయాలలో పోటీలు నిర్వహించాలి
పుస్తకాల సేకరణ, వితరణ, సమావేశాలు, ఉత్సవాలలో... విద్యార్థులను యువకులను, ప్రముఖులను భాగస్వాములను చెయ్యాలి. సందీ గ్రంథాలయంలో వయస్సును బట్టి సభ్యత్వం మరియు గ్రంథాలయానికి ఒక జాతీయ
ఏకుని పేరు పెట్టుకోవాలి. నిర్వహించే కార్యకర్త వద్ద ఒక సంచీ వయస్సుకు తగిన పుస్తకాలు, పుస్తకాల వివరాలు ల వివరాలు, కలము ఉండాలి
నమూనా
ది గ్రంథాలయ పుస్తకాల వివరాలు
సం
పుస్తక క్రమాంక్
పుస్తకం పేరు
పుస్తక | పుస్తకంలోని వివరాలు
రచయిత పేరు
నమూనా - 2
కాలు చదువుతున్న సభ్యుల వివరాలు
పుస్తక క్రమాంక్
ఇచ్చిన పుస్తకం పేరు
జన మండలి
పుస్తకం ఇచ్చిన తేది
పుస్తకం తీసుకున్న సభ్యుని పేరు
| పుస్తకాల ధర (రూ.)
పుస్తకం సేకరించిన తేదీ
| తీసుకున్న సభ్యుని సంతకం
తరిగి ఇచ్చిన
స్వీకరించిన తేదీ కార్యకర్త పేరు సంతకం
గ్రామంలోని ఏదైనా ఒక దేవాలయం / చిన్నగుడి / మందిరం వద్ద వారానికి
నియమితంగా భజన జరగాలి
కు అన్ని వర్గాల పేద ప్రజలకు సౌకర్యంగా ఉండే సమయాన్ని నిర్ణయించుకోవాలి వరసాయదారులు, రైతుకూలీలు, కులవృత్తులవారు, గుమాస్తాలు, ముఖ్యంగా యువకులు
ల సాల్గొనేట్లు చేయాలి
జనలో దైవభక్తి, దేశభక్తి, సామాజిక చింతన, సమరసతను ప్రబోధించే పాటలు, విషయాలు -లి. తమ బస్తీ / గ్రామం బాగోగుల గురించి చర్చించుకోవాలి.
యువకులకు ఉత్సాహం కలగవిధంగా అడుగులు వేస్తూ, ఎగురుతూ, దూకుతూ
పారవశ్యంలో నాట్యం చేస్తూ భజన చెయ్యాలి
6. భజన మండలి సభ్యులు ప్రతి నిత్యం గుడిలో సుప్రభాత గీతాలు, శుభ్రత, సామూ హారతి, తీర్థం, ప్రసాదం మొదలగు విషయాలు పట్టించుకోవాలి. గుడిలో మొక్కలు పెంచ స్ఫర్తి వాక్యాలు వ్రాయుట, గుడిని శోభాయమానంగా తీర్చిదిద్దుట చేయాలి
గుడిలో కనీసం వారానికి ఒకసారి సామూహిక హారతి నిర్వహించి, ఆ సందర్భంగా
గ్రామంలోని అత్యధిక ప్రజలు పాల్గొనేట్లు ప్రయత్నించాలి. తద్వారా హిందూ ఐంధువుల సంఘ శక్తిని ప్రదర్శించాలి.
భజన మండలి సభ్యుల చొరవతో బస్తీ / గ్రామ ప్రజలందరిలో హిందూధర్మం పట్ల ఆ విశ్వాసాన్ని కలిగించాలి. అన్యమత ప్రచారాలు జరగకుండా అడ్డుకోవాలి.
- భజన మండలి సమయ సారిణి ::
0.05 0.05 ఓంకారం, ప్రార్ధనా శ్లోకాలు, ధ్యాన శ్లోకాలు, మాతృవందన్
పాట / సుభాషితమ్
1.00 భజన, నీతి పద్యాలు
0.15
0.05
చర్చ / గోష్ఠి / లోకజ్ఞానం / పుణ్యభూమి భారత్
మంగళహారతి, శాంతి మంత్రం, తీర్థం, ప్రసాదం
1.30 గంటల కార్యక్రమం
5. శ్రమసేవ :
శ్రమసేవ ఒక అద్భుతమైన కార్యసాధనాశక్తి, స్వయంసేవకులు తమ బస్తీ / గ్రా కోసం శ్రమించి, ప్రాథమిక అవసరాలు తీర్చుకొనుటే శ్రమసేవ. శాఖ ద్వారా నిర్వహింప సాప్తాహిక్ సేవా దిన్ సందర్భంగా, వారానికి ఒకసారి శాఖా సమయంలో, శాఖ తర్వాత సౌకర్యంగా ఉండే సమయంలో కనీసం గంట సేపు శ్రమ సేవ చెయ్యాలి. ఇంద స్వయం సేవకులతో పాటు, తమ కుటుంబ సభ్యులను, బస్తీ / గ్రామంలోని యువకుల సోదరీమణులను కలుపుకొని చెయ్యాలి. ప్రతి చిన్న పని కోసం ప్రభుత్వం పై ఆధారపడరా
• శ్రమసేవ' ద్వారా చేయదగు కొన్ని పనులు :: సంఘస్థాన్, పరిసర ప్రదేశాలను శుభ్రం చేయుట
దేవాలయాలు, గ్రామదేవతల వద్ద శుభ్రం చేయుట
ప్రభుత్వ పాఠశాలలో
ఎధులను, సామాజిక స్థలాలను
ధులలోని మురికి కాలువలను
ఎంచినీటి ప్రదేశాలను
టల మైదానం, వ్యాయామ శాలను
ప్రభుత్వ ఆసుపత్రిలో
రు నిలచిన స్థలాలలో
ఇంకుడు గుంతలు నిర్మాణం చేయుట
దేవాలయ జీర్ణోద్ధరణ / మరమ్మతులు చేపట్టుట. ప్రతి ఇంటిలో తులసి మరియు మొక్కలు పెంచుట
దేవాలయాలు, మందిరాల వద్ద
ప్రభుత్వ పాఠశాలలో
వీధులలో, సామాజిక స్థలాలలో
తమ తోటివారికి, పేదవారికి ఉచిత రీతిలో సహకరించుట
*రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ - కామారెడ్డి*
*సేవావిభాగం*
*(సేవా ప్రముఖుల పనులు)*
*★స్వయం సేవకులందరిలో సేవాభావం జాగృతం చేసి* *సేవాకార్యం (ప్రేరేపించుట,*
*శిక్షణనివ్వడం మరియు సేవా కార్యాలతో జోడించడం*
*★దీనికొరకు నాలుగు విషయాలు అపేక్షించబడుతున్నాయి*
*1.సాప్తాహిక్ సేవాదిన్ :*
తరుణ, ప్రౌఢ స్వయం సేవకులకు ప్రతి గురువారం శాఖ 60 నిమిషాల కార్యక్రమంలో భాగంగా సేవాగీత్,
సుభాషితం,
అమృతవచనం అభ్యాసం (10 ని నుండి 15 ని॥) చేయించాలి. మిగిలిన 20-25 నిమిషాలలో ప్రతి గురువారం ఒక అంశం పూర్తిచేయాలి.
*1వ గురువారం- సేవాకథ,*
*2వ గురువారం - సేవా విషయంపై చర్చ*
*3వ గురువారం - మహాపురుషుల జీవితంలోని సేవా సంఘటనలు*
*4వ గురువారం అనుభవ కథనం*
*గురువారం శాఖ సమయసారిణీ*
శాఖ ప్రారంభం, ముగింపు - 10ని"
అనివార్య కార్యక్రమాలు - 15ని"
గీత్, సుభాషితం, అమృతవచనం -10ని"
సేవా బౌద్దిక్ అంశాలు - 25ని"
*ఆ.సేవాబస్తీ సంపర్కం :*
కనీసం వారానికి ఒకసారి మన వీలును అనుసరించి శాఖ అనంతరం శాఖ క్షేత్రంలోని లేదా శాఖ క్షేత్రానికి పక్కనున్న సేవాబస్తీని స్వయంసేవకుల ద్వారా సంపర్కం చేయాలి. ఆవిధంగా మనం నియమితంగా ప్రతివారం కలవడం ద్వారా ఆ బస్తీలోని అవసరాలు లోపాలను గుర్తించి వాటిని పూర్తిచేసేవిధంగా ఏదైనా సేవాకార్యక్రమం లేదా సేవా ఉపక్రమం ప్రారంభించాలి.
*ఇ. దృశ్యానుభూతి కొరకు సేవా పర్యటన :*
కనీసం సంవత్సరానికొకసారి శాఖా క్షేత్రంలోని స్వయంసేవకుల మరియు సంఘ అభిమానుల కుటుంబాలతో సేవా ప్రకల్పాలను దర్శింపజేయుట..
*ఈ.శ్రవణానుభూతి :* సంవత్సరంలో కనీసం రెండుసార్లు స్వయంసేవకుల కుటుంబాల మిలన్ (కార్తీక పౌర్ణమి, దీపావళి మొదలగు సందర్భాల) లో సేవా ప్రకల్పాన్ని నడుపుచున్న (పురుషుడు / మహిళ) వారిని పిలిచి సేవా ప్రకల్పం గురించి తెలియజేయడం, సి.డి. చూపించడం జరగాలి.
*2. సేవా ప్రశిక్షణ వర్గ*
స్థిరపడిన స్వయంసేవకులు, కళాశాల విద్యార్థుల కొరకు ప్రశిక్షణ వర్గ నిర్వహించాలి. ఇందులో అభ్యాసిక, సంచి గ్రంధాలయం, భజన మండలి, బాల సంస్కార కేంద్రం మొదలగు విషయాలలో ప్రశిక్షణ ఇవ్వాలి. సేవాబస్తీ దర్శనం, సర్వే ఎలాచేయాలో నేర్పించడం, ప్రత్యక్షంగా సర్వే చేయించడం కూడా వర్గలో భాగంగా నిర్వహించాలి.
*3. సేవా ఉపక్రమం :* *సేవాబస్తీలోని అవసరాలను పూర్తిచే సేవిధంగా సామాన్య బస్తీలో సేవాభావాన్ని జాగరణ చేయుట కొరకు చిన్నచిన్న సేవాఉపక్రమాలను ప్రారంభించాలి.* సేవాబస్తీలో ఆరోగ్య / వైద్య శిబిరం, సంస్కార కేంద్రం, అభ్యాసిక, పాఠ్య / నోట్ పుస్తకాలు అందించుట, చికిత్సా కేంద్ర, (వారానికొకసారి) మొదలగునవి
*4. సేవా సాప్తాహం / పక్షం /మాసము :*
కనీసం ప్రతి నగరము, ఖండకేంద్రం, జిల్లా కేంద్రం లో సంవత్సరంలో ఒకసారి సమయం నిర్ణయించుకోవాలి. ఇందులో సంఘంలోని బాధ్యత కలిగిన కార్యకర్తలు, ఇతర స్వయంసేవకులందరూ పాల్గొనాలి. ఆ వారం / పక్షం / నెలరోజులు రోజు సేవాబస్తీ కెళ్ళి పరిచయాలు చేసుకొని, పూర్తిస్థాయిలో సేవాకార్యక్రమాలు ప్రారంభించగలగాలి.
*స్వయంసేవకులలో సేవాభావం పెంపొందించడం దీని ఉద్దేశ్యం.*
*5.సేవా సమన్వయం :*
అ. ప్రాంతంలో / జిల్లా కేంద్రంలో సంఘ యోజనతో పనిచేస్తున్న ప్రాంతస్థాయి / జిల్లాస్థాయి మాతృ సంఘటన యొక్క సేవాసంస్థల కార్యకర్తలతో సంవత్సరంలో ఒకసారి *సేవాసమన్వయ బైఠక్* జరగాలి. ఆ బైఠక్ లో సేవాకార్యంలేని స్థలాలకు ఏదో ఒక సంస్థ ద్వారా పని ప్రారంభించే యోజన చేయాలి
1. విశ్వహిందూ పరిషత్,
2 వనవాసీ కళ్యాణ ఆశ్రమం,
3. భారత వికాస పరిషత్,
4. సేవికాసమితి
5. సరస్వతీ విద్యాపీఠం,
6. సేవాభారతి,
7.నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్, 8.ఆరోగ్యభారతి, దీనదయాళ్ పరిశోధనా సంస్థ,
10. సక్షమ ఈ పదింటిని మాతృసంస్థలుగా పిలుస్తాము.
ఆ. స్వయం ప్రేరణతో, స్వీయ యోజనతో సేవాకార్యం చేస్తున్న ఇతర సంస్థలతో కూడా పరిచయాలు పెంచుకొని సంవత్సరంలో ఒకసారి వారితో బైఠక్ నిర్వహించాలి. *ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చొప్పున సేవాసంగమం, గోసేవా సంగమం, గ్రామవికాస సంగమం ఆధ్యాత్మిక సేవాసంగమం జిల్లాస్థాయిలో జరపాలి.*
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ - సేవా విభాగ్
*(శాఖా ఆధారంగా చేయదగు కొన్ని సేవా కార్యక్రమాలు)*
*సేవా అంటే ఏమిటి*
సేవాహి వరమోధర్మః (సేవయే పరమధర్మం.... ధర్మమనగా బాధ్యత, కర్తవ్యం, తప్పక చేయాల్సిన పని..
*★★మన తోటి సర్వ సాధారణ, బలహీన, నిరుపేద, నిరక్షరాస్య, నిర్భాగ్య బంధువుల కష్టసుఖాలలో పాలుపంచుకోనుటే సేవ,*
*★★ఆత్మీయతను, సాన్నిహిత్యాన్ని, స్నేహాన్ని, సమరసతను, ప్రేమామృతాన్ని పంచుటే సేవ..*
*★★సంస్కారాన్ని, జ్ఞానాన్ని, స్వావలంబనను, స్వాభిమానాన్ని నిర్మాణం చేయుటే సేవ...*
*★★ప్రతిఫలాన్ని, ధనాన్ని, పదవిని, కీర్తి ప్రతిష్టలను ఆశించక... బలహీన వర్గాల ఉన్నతి కోసం పని చేయుటే సేవ...*
*★★మన తల్లులకు, సోదరీమణులకు, భర్తలను కోల్పోయిన అభాగిణులకు, తల్లిదండ్రులను కోల్పోయిన నిరాశ్రితులకు, వికలాంగులకు అండగా ఉండుటే సేవ...*
*★★కన్నతల్లివలె, గోమాతవలె వాత్సల్యాన్ని మరియు ఒక నదివలె, ఒక వృక్షము వలె పరోపకారం చేయుటే సేవ...*
*★ సేవ ఎందుకు చెయ్యాలి?*
మన తోటి నమాజంలో అట్టడుగు ప్రజల కనీస అవసరాలు తీర్చటానికి, వారిలో సామాజిక చింతనను, హిందుత్వ వాతావరణాన్ని కలిగించటానికి, సంఘటిత సమాజం, ఆదర్శ సమాజ నిర్మాణం ద్వారా మనదేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకువెళ్ళుటే సేవా కార్యక్రమాల ఉద్దేశ్యం.
*★ సేవ చేయకుంటే నష్టమేమిటి?*
సేవా కార్యక్రమాలు చెయ్యనిచో మన సమాజంలోని పేదవర్గాల వారి బాగోగులు కష్టసుఖాలు, సమస్యలు, కనీస అవసరాల గూర్చి ఆలోచించే అవకాశం ఏర్పడదు. మనం కూడా వారి వద్దకు వెళ్లలేనిచో, వారికి మన దేశంపట్ల, ధర్మంపట్ల, హిందుత్వం పట్ల సరియైన అవగాహన కలిగించే వాళ్లు మరెవ్వరు ఉండరు. ఆ కారణంగా అట్టడుగు ప్రజలు హిందూ జీవన స్రవంతి నుంచి దూరమైపోతారు. కావున, దేశ సమగ్రతను కాపాడుట కోసం సేవా కార్యక్రమాలు తప్పక చెయ్యాలి.
*★ సేవ ఎవరు చెయ్యాలి?*
శాఖకు వచ్చే స్వయంసేవకులలో సేవాభావాన్ని నిర్మాణం చేసి, వారి ద్వారా సేవ కార్యక్రమాలు ప్రారంభం చేయాలి. స్వయం సేవకుల కుటుంబాలు, మన సానుభూతిపరులు సమాజంలో సేవాభావన కలిగిన పెద్దలు, మాతలు, ఉద్యోగస్తులు, రైతులు, యువతీయువకులు సేవా కార్యక్రమాలు చేయునట్లుగా ప్రోత్సహించాలి
*★ సేవ ఎక్కడ చెయ్యాలి?*
నగరాలు, పట్టణాలు, పెద్ద గ్రామాలలోని సేవా (పేదలు) బస్తీలు, చిన్న గ్రామాలు పల్లెలు, గిరిజన తాండాలలో సేవా కార్యక్రమాలు చెయ్యాలి. సేవా బస్తీలతోపాటు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, అనుపత్రులు, కర్మాగారాలు, కారాగారాలలో సేవా కార్యక్రమాలు
చేపట్టాలి
*★ సేవ ఎవరికి చెయ్యాలి?*
ఉపేక్షకు గురైన బంధువులు, నిరుపేదలు, కూలీలు, పేద కార్మికులు, సాధారణ స్థితిలో ఉన్న చేతి వృత్తుల వారు, పేద విద్యార్థిని, విద్యార్థులు, వికలాంగులు, నిరాశ్రితులు, రోగులు, అభాగ్యులైన మహిళలు, ఉపేక్షకు గురియైన చిట్టచివరి వ్యక్తికి మన సేవలందించాలి
*★ సేవ ఏ విషయాలలో చెయ్యాలి?*
*ఆరోగ్యం, సంస్కారం విద్య, సామాజిక సమరసత, స్వావలంబన, గ్రామ వికాసము, బస్తీ వికాసము మొదలగు విషయాలలో సేవా కార్యక్రమాలు చేపట్టాలి.*
"సులభంగా చేయదగు సేవా కార్యక్రమాలు ఏవి...?? వాటి నిర్వహణలో గమనించాల్సిన విషయాలు...*
1.బాల సంస్కార కేంద్రం
2 అభ్యాసిక
3. బోధనా తరగతులు
4.భగవద్గీత పఠనం
5. అనియత విద్యా కేంద్రం
6. వయోజన విద్యా కేంద్రం
7. సంచీ గ్రంథాలయం
8. క్రీడా కేంద్రం
9.యోగా కేంద్రం
10. వ్యాయామ శాల
11. శ్రమసేవతో పారిశుధ్యం, మొక్కలు పెంచుట మొదలగునవి
12. ఆరోగ్యం, పరిశుభ్రత, మంచినీరు, పోషకాహారం, ప్రతి ఇంటిలో తులసి, పర్యావరణం మొదలగు విషయాలను గూర్చి గ్రామాలలో, బస్తీలలో అవగాహన పెంచి ప్రజలలో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టుట,
*★★★సేవా కార్యక్రమాల నిర్వహణలో గమనించాల్సిన విషయాలు★★★*
1. ప్రతి సేవా కార్యక్రమం నడుపుటకు ఒక నిర్వాహక్ / ప్రముఖ్ మరియు అవసరమగుచో సహాయగులు ఉండాలి. సమాజంలోని సేవాభావన గల కొత్తవారిని తీసుకోవాలి
2. నిర్వాహకులకు సంవత్సరంలో కనీసం 4 ప్రశిక్షణ వర్గలు నిర్వహించాలి
3. సేవా కేంద్రం నడుపుట కోసం శుభ్రమైన స్థలం (గుడి, బడి, కమ్యూనిటీ హాలు, మంచినీడ ఉండే చెట్టు) నిర్ణయించుకోవాలి
4. ఉచిత స్థానంలో భారతమాత చిత్రపటాన్ని ఉంచి అలంకరణ, అగర్బత్తి ఏర్పాటు చేసుకోవాలి
5. కార్యక్రమంలో పాల్గొనే సేవితులు (బాలబాలికలు, కిశోరీలు, మహిళలు, పురుషులు) శుభ్రంగా తల దువ్వుకొని, బొట్టు పెట్టుకొని, వరుసలలో లేదా అర్థమండలాకారంలో కూర్చోవాలి.
6. సంస్కార కేంద్ర ప్రారంభంలో ఓంకారం, ధ్యాన శ్లోకాలు, మాతృవందన్ మరియు ముగింపులో శాంతి మంత్రం ఉండాలి
7. కార్యక్రమంలో ప్రతిసారి సంస్కారాన్ని కలిగించే ఆటలు, పాటలు, భజన, కథ లేక చర్చ
తప్పక ఉండాలి
8. కార్యక్రమంలో క్రమంగా దీపం వెలిగించుట, ముగింపులో సామూహిక హారతి, తీర్థం "ప్రసాదం ఉండాలి
9. సంస్కార కేంద్రానికి ఒక పాలక్ లేదా పాలక మండలి ఏర్పాటు చేసుకోవాలి.
*10. కిశోరీలు, మహిళల కార్యక్రమాలను మహిళా కార్యకర్తలు లేదా గృహస్థ కార్యకర్తలు మాత్రమే నిర్వహించాలి*
11. ప్రతి శాఖ నుంచి ఇద్దరు సేవా కార్యకర్తలను ఎంపిక చేసి, వారి ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహింపజేయాలి
*గమనిక*
1. సేవా కార్యం కోసం సంఘంలో "సేవా విభాగ్' పనిచేస్తున్నది
2 సేవా కార్యక్రమాలను జన సామాన్యంలోకి తీసుకెళ్ళుట కోసం "సేవాభారతి' మరియు గ్రామీణ వికాసం కోసం 'గ్రామ భారతి' మొదలగు సంస్థల పేరుతో మనం పని చేస్తున్నాము
Comments
Post a Comment