జనవరి

ఈ మెసేజ్ జనవరి ఒకటి కంతా తెలుగు వారికందరికీ అందిద్దాం.

అసలీ జనవరి 1 కథ ఏంటి? 

నాకు చాలా మంది మిత్రులు జనవరి ఒకటిన "విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ " అని అభిమానంగా, సంతోషంగా చెబుతారు. 

అది వారి ప్రేమకు తార్కాణం.

ఇలా విషెస్ చెప్పే వారిది ఏ తప్పూ లేదు. 

ఎందుకంటే మనకెవ్వరికీ జనవరి ప్రారంభం న్యూ ఇయర్ కాదని తెలియదు. 

ఇక ఎంజాయ్ ఎంజాయ్ అని త్రాగి తిరిగే వాళ్ల కథ నాకు తెలియదు. 

ఇక పై ప్రశ్నలకు సమాధానం చూద్దాం.

ఇప్పుడు మనం అనుసరించే క్యాలెండర్‌ గ్రెగేరియన్ క్యాలెండర్. 

ఇదంతా తప్పులతడక, లోపాల పుడక.

క్రీశ 1582 లో పోప్ గ్రెగేరియన్ సరిచేసిన క్యాలెండర్ ఇది.

ఈ క్యాలెండర్ ప్రకారం మనం యదార్థ సంవత్సరం కంటే 24.6 సెకన్ల ఎక్కువ సమయాన్ని లెక్కించుకుంటున్నాము. 

ఆప్రకారం 3,513. సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. 

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త JOHN VERSHAL. ఈ లోపాన్ని సవరించటానికి ఒక ఉపాయం చెప్పాడు.

అదేంటంటే, క్రీశ 4,000 సంవత్సరంను లీప్ ఇయర్ గా లెక్కించకుండా వదిలేయడం.

ఈ క్యాలెండర్ లోని లోపాలను సరిచేయడం అవసరమని సూచనలు చేస్తూ "నానాజాతిసమితి" ఒక కమిటీ ఏర్పాటుచేసింది. 

ఆ కమిటీ 185 రకాల ప్కాన్లను పరిశీలించి, క్రీశ 1926 లో ఒక రిపోర్టు ఇచ్చింది. 

ఇప్పటి దాకా అది ఎటూ తేలలేదు లెండి. 

ఇంకా ఇలాంటి చిన్నచిన్న చిక్కులు చాలానే ఉన్నాయి. 

మంచిది...

ప్రపంచమంతా ఒకప్పుడు నూతన సంవత్సరం ఉగాదినాడు ప్రారంభమయ్యేది. 

బైబిల్ లోని ""ఎజ్రా "" పుస్తకం 10:17 వ వచనం సంవత్సరం లోని మొదటి నెల మార్చి - ఏప్రిల్ లో ప్రారంభమౌతుందని సాక్ష్యం పలుకుతోంది. 

ఫ్రాన్స్‌ లో క్రీశ 1582 వరకూ, ఇంగ్లాండులో క్రీశ 1752 వరకూ నూతన సంవత్సరం మార్చి 25 న ప్రారంభం అయ్యేదని చరిత్ర చెబుతూంది. 

అయితే, కాలగమనంలో ఇది ఎప్పుడు మారిందో తెలియదు కానీ, అది ఏప్రిల్‌ కు మారింది. 

అయితే నూతన సంవత్సరం మార్చి లో ఉంచాలా, ఏప్రెల్ లో ఉంచాలా అనేది వారికి కొంత సమస్యగా మారింది. 

సంవత్సరం ఆరంభం ఎప్పుడూ ఒకే నెలలో ఒకే తేదీన వస్తే బాగుంటుంది అని వారు ఆలోచించసాగారు. 

ఆ సమయం లో క్రీశ 15 శతాబ్ది చివరి కాలంలో ఫ్రాన్స్‌ చక్రవర్తి " చార్లెస్ "అంతవరకూ 11 వ నెలగా ఉన్న జనవరి ని ఒకటవ నెలగా నూతన సంవత్సరం గా ప్రారంభించాడు.

ఈ విధంగా నేటి మన నూతన సంవత్సరం ప్రారంభమైంది. 

ఇందుకు ఎలాంటి శాస్త్రీయ, ప్రకృతి పరమైన, ఆధారమూ లేదు. 

ముందుగా ఫ్రాన్స్‌, ఇటలీ, పోర్చుగీసు, స్పెయిన్ దీనిని అంగీకరించాయి. 

క్రీశ 1699 లో జర్మనీ, 

క్రీశ 1752లో ఇంగ్లండు, 

క్రీశ 1873 లో జపాన్‌, 

క్రీశ 1912 లో చైనా, 

క్రీశ 1916 లో బల్గేరియా, 

క్రీశ 1918 లో రష్యా లు 

ఈ క్యాలెండర్ ను అంగీకరించాయి. 

17,18 శతాబ్దంలో తమ ఆధీనంలో ఉన్న అన్ని దేశాలలో బ్రిటిషు వాడు దీన్ని ప్రవేశపెట్టాడు.

కానీ భారతీయ క్యాలెండర్ ఋషులచే తయారుచేయబడింది. 

ఆర్యభట్టు, భాస్కరాచార్య వంటి మహాన్ శాస్త్రజ్ఞులచే పరిశోధించబడింది. 

కొన్నివేల సంవత్సరాల తర్వాత ఏ సంవత్సరం లో, ఏ నెలలో, ఏ రోజున ఏ గ్రహణం వస్తుందో, వారం వర్జ్యము తో సహా చెప్పగలిగేంతగా శోధించబడింది.

ప్రకృతి కి అనుగుణంగా, వసంత ఋతువు చైత్రశుద్ధ పాఢ్యమి రోజున ఉగాది ప్రారంభ మవుతుంది.

(కొన్నిచోట్ల వసంత ఋతువు మేశరాశి లో సూర్యుడు ప్రవేశించటాన్ని ఉగాదిగా చేస్తారు.) 

ప్రపంచమంతా మొదటి నుంచీ అనుసరిస్తున్న ఉగాదిని కాదని, 

వాడెవడో ఫ్రాన్స్‌ వాడు ఏ ఆధారమూ లేకుండా ప్రతిపాదించిన నూతన సంవత్సరం ను ఫాలో అవడం కంటే, 

ఆత్మాభిమానం కలిగి భారతీయుల మందరమూ మన సాంప్రదాయక ఉగాది నూతన సంవత్సరం ను ఫాలో కావటం ఉత్తమము 

మరియు మన కర్తవ్యము. 

ఏ లోపాలు లేని మన కాలమానం గొప్పతనాన్ని ప్రచారం చేయటమే మన తక్షణ కర్తవ్యం. 

ఈ మెసేజ్ జనవరి 1 లోగా తెలుగు వారికంతా వెళ్లేలా చేస్తే, సగం పని జరిగినట్లే.

భారత్ మాతా కీ జయ్.


తాగుబోతు దినోత్సవం,తరుముకొంటూ వస్తున్నది*...

*జనవరిలో కెళ్ళేముందే, జాన్వర్ గా మార్చేందుకు*...

        *౹౹ తాగుబోతు ౹౹*


*తప్పతాగి ఎంతూగినా, తప్పుండదు ఆనాడూ*...

*తెల్లార్లూ తాగి ఊగు, తెల్లవాడి వారసుడిగ*...

  *క్లబ్బుల్లో పబ్బుల్లో, కల్సిమెల్సి తిరుగొచ్చు*...

*సభ్యులైన వాళ్ళంతా, అభ్యుదయ వాదులంట*...

        *౹౹ తాగుబోతు ౹౹*


*మనదీ కాకున్ననేమీ, మంచిదైతే బాగుండును*...

*చుక్కల గమణం చెప్పని, తప్పుల క్యాలండరది*...

*అందమైన చంద్రుడి గతి, అందుకోని క్యాలండర్*...

*అమావాస్య పౌర్ణమంటే, అసలేంటో తెల్వదంట*...

*గ్రహణం గతులిందులోన, ఎంతెతికిన దొరుకవంట*...

        *౹౹ తాగుబోతు ౹౹*


 *బానిసత్వ పాపానికి, బహుమతిగా వచ్చిందోయ్*...

*భారతీయ సంస్కృతిని, బల్లిలాగ పట్టిందోయ్*...

*త్యాగధనులంతకల్సి,ఆంగ్లేయుల తరిమేస్తే*...

*మత్తులోన ముంచివాడు, మళ్ళీవస్తుండు జూడు*...

          *౹౹ తాగుబోతు ౹౹*


*మత్తువదిలి చూడు నీవు, మనపండుగ ఉగాదిని*...

*ఏడాదికే కాదు ఆది, యుగానికీ ఆదేనోయ్*...

*ప్రకృతితో పెనవేసిన, పండుగలు మనవండీ*...

*విజ్ఞానం జోడించిన, విలువలతో నిండెనండి*...

       *౹౹ తాగుబోతు ౹౹*


*వేలయేళ్ళ కాలగణన, వేళ్ళతోనే లెక్కించిరి*...

*ఖగోళం భూగోళం, కథలతోనే వివరించిరి*...

*పరిణామ క్రమాన్నంత, పురాణాల్లో వర్ణించిరి*...

*ఉగాది పచ్ఛడికే ఊఊఊఊ... కోట్టవోయ్,తాగుబోతు పండుగను ఛీఛీఛీఛీఛీ... కొట్టవోయ్*...

          *౹౹ తాగుబోతు ౹౹*


*ఈరోజు క్రాంతి జ్యోతి , హిందూ ధర్మ సంస్కర్త ,చదువుల తల్లి సావిత్రి బాయి పూలే జయంతి*🙏🙏🙏🙏🙏

*సావిత్రి బాయిపూలే జయంతి జనవరి 3 ను భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆమె గొప్పతనం మనం తెలుసు కోవలసిందే...*

మనదేశంలో మొదటి మహిళా  ఉపాధ్యాయురాలు, మహిళలకు మొదటిపాఠశాల స్ధాపించిన, సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే.  

అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన  ఆనాటి సమాజపు కట్టుబాట్లను, వలస పాలనలో సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా  పాఠశాలలు ప్రారంభించి,12 మే 1848న దేశంలో అట్టడుగు వర్గాల వారి కోసం మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించిన సంస్కర్త సావిత్రిబాయి ఫూలే  .

ఈమె భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి.

ఆమె సామాజిక సమానత్వం కోసం సమాజ అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులేభార్య.

కుల భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.

ఆమె ఆధునిక విద్య  ద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి  భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.

కుల వ్యవస్థకు వ్యతిరేకంగా,
వ్యతిరేకంగా అస్పృశ్యుల, 
మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ  సామాజిక  బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. 

నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు.

 సావిత్రి బాయి మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో 1831 జనవరి 3 న జన్మించింది. ఆమెది రైతుకుటుంబం. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లా లో బోధన్ నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో , అదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. 

సావిత్రి బాయి తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలెను 1840లో వివాహమాడారు. ఆ దంపతులకు స్వంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు) ను దత్తత తీసుకున్నారు.

సావిత్రి బాయి "జ్యోతీరావు ఫూలె" ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. 

సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. 

కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారు. 

1848 లోనే దేశంలొ విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళ ఉపాద్యాయురాలు , స్త్రీల విద్యా  వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. 

వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను  ఎదుర్కొంది.

ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీబాయి దంపతులను గృహ బహిష్కారానికి గురిచేశారు. 

ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘన్ని కూడా స్థాపించింది. 

జెండర్‌ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. 

మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే. అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో "సత్యాన్ని" శోధించడానికి 1873 లో తన భర్త మహత్మా పూలేతో కలసి "సత్యశోధక్ సమాజ్ "ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూడనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేఖంగా మరియు వితంతువు పునఃర్వివాహల కొరకు అసమాన  వ్యవస్థకు వ్యతిరేఖంగా బలమైన ఉధ్యమం నడిపారు.

బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు.

గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దేవదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు.యశ్వంత్ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు.

వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. 

తరువాత 1873 సెప్టెంబరు 24న ‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యసోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యసోధక్‌ సమాజ్‌ మహిళా విభాగం సావిత్రీబాయి నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ kiకార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 

1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యసోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యన సావిత్రీబాయి వివాహం జరిపించారు.

1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 

1870లో ఒకసారి 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం. కరువువాతపడిన కుటుంబాలలోని  అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు.

 తమ పాఠశాలల్లో లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించినారు. 

సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 

1854లోనే ఆమె తన కవితాసంపుటి ‘కావ్యఫూలే’ను ప్రచురించింది. 

మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుభోధ్‌ రత్నాకర్‌’ను 1891లో ప్రచురించింది. 

ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తకరూపంలో వచ్చాయి.

జ్యోతీరావుపూలే. 1890 నవంబరు 28న మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. 

ఈ దుఃఖంలోనుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది. 

ఫూలే మరణాంతరం సత్యసోధాక్ సమాజ్ భాద్యతనీ స్వీకరించి నడిపించింది.

 1897 లో ప్లేగు వ్యాధి, పూణేనగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రీబాయి పూలే కొడుకు యశ్వంత్ తోకల్సి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు.

ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి జాతికి చెందిన  చిన్నపిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడింది. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకి సోకి మార్చి 10, 1897 లో కబళించింది. 

ఆమె దత్తపుత్రుడు యశ్వంత్‌ అంత్యక్రియలు జరిపించిండు.

సావిత్రి బాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము.


జనవరి 5

దేశం ధర్మం కోసం ఇంట్లో ఒక్కరో ఇద్దరో వీరమరణం పొందడం సహజం.. కానీ తన నలుగురు కుమారులను ధర్మరక్షణకోసం సమర్పించి తనుకూడా   ఆహుతి అయిన యుగపురుషుడు హిందూధర్మరక్షణ కోసం ఖాల్సపంథా ప్రారంభించిన భారతమాత ప్రియ పుత్రుడు "గురుగోవిందసింగ్"జన్మదిన శుభాకాంక్షలు.*💐💐

"సకల జగత్ మే ఖాల్స పంథ్ గాజే! 
జగే ధరమ్ హిందూ తురక ఖిండ భబే" 

ప్రపంచమంతా ఖాల్సఫంథ్ ను ప్రస్తుతించాలి!  
తురకల దురాగతాలకు అంతం పలకాలి! 
"హిందూ ధర్మం జాగృతం కావాలి" 
అన్న సందేశంతో హిందూ ధర్మ రక్షణకై పాటుపడిన మహానీయుడు "గురు గోవింద్ సింగ్"! 

ఔరంగజేబు అత్యాచారాలకు అంతం పలకడానికి మార్గం ఏదైనా ఉంది అని అడిగితే....
గురు గోవింద్ సింగ్ 9సం. వయసులో ' 
"ఎవరో ఒక మహాత్ముని బలిదానంతో కానీ ఈ సమస్య పరిష్కారం కాదు అని తన తండ్రి తో అన్నాడు..
దాంతో తండ్రి "గురుతేజ్" అడిగాడు. అంతటి మహా వీరుడు ఎవరున్నారు. అని అడిగితే "మిమ్ములను మించిన వీరుడు మహా పురుషుడు వేరోకరేవరు...!"  
ఢిల్లీలో "గురుతేజ్" బహదూర్ యొక్క అమరమైన బలిదానం కొత్త చరిత్రను సృష్టించింది! 
 
27/12/1704  ఆ రోజూలో వంట మనిషిగా పనిచేసినా గంగారమ్ ఇంటికి చేరుకున్నారు. (గ్రామం; చెమ్మ కేర్) గురు గోవింద్ సింగ్ భార్య మరియు కొడుకులు అజిత్ సింగ్, జుజార్ సింగ్ గంగారమ్  విశ్వాసఘాతకుడై పిల్లలిద్దరినీ సర్ హిందీ సబేదార్ వజిర్  ఖాన్ కు అప్పగించాడు.
వాడు వీరిద్దరిని సజీవ సమాధి చేశాడు.
ఈ వార్త విని గురుగోవింద సింగ్ తల్లి బాధతో ప్రాణాలు విడిచింది.

వారిని సజీవ సమాధి చేసే ముందు నవాబు వారిని ఇస్లాం మతం స్వీకరించండి. మీరు కోరిదేదైనా ఇస్తానని ఆశ చూపాడు.

"మా ధర్మం మాకు ప్రాణల కంటే కూడా ప్రియమైనది.
మేము మా చివరి శ్వాస వదిలే దాకా దీనిని వదలము." 
మేము "గురుగోవింద్ సింగ్ పుత్రులం" 
మా తాత "గురుతేజ్ బహుదూర్ ధర్మ రక్షణకై అహుతయ్యారు." 

'అన్నయ్య కళ్ళలో నీరు కారడం చూసి తమ్ముడు అడిగాడు. అన్నయ్య నీ కళ్ళలోంచి  నీరేమిటి...??
నువ్వు బలిదానం చేయడానికి బాధపడుతున్నావా ? 
అని అడిగాడు..
దీనికి సమాధానం నీవు చాలా అమాయకుడివి నేనుమృత్యువును చూసి భయపడను
మృత్యువే నన్ను చూసి భయపడుతోంది..
అందుకే అది ముందుగా నీ వైపు సాగుతుంది.
చిన్నవాడవైన నీవు ముందు బలిదానము చేయవలసి వస్తున్నందుకే నేను దుఖస్తున్నాను అన్నాడు .

చమకేర్ కోటలో మరో ఇద్దరు కుమారులు చనిపోయారు.
7/10/1708 గురు గోవింద్ సింగ్ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పటన్  సైనికుడు కత్తితో దాడి చేశాడు.
గోవిందు తన పక్కనే ఉన్న కత్తిని తీసి పటాన్ సైనికుడిని  అంతం చేశాడు. 
తరువాత "గురు గోవింద్ సింగ్"  చివరిగా "వాఘేగురుజికి  పతే" 
అంటూ ప్రాణాలు విడిచాడు.


Today we celebrate the 158th birth anniversary of Swami Vivekananda. A strong pillar in the contribution and growth of dharma. May his inspiration cont7inue to always guide us.                                                                

'Arise, awake and don't stop until the goal is reached', a vision that which we can all  continue to strive in our day to day lives. 

#247sevika #hssuk #swamivivekanandaji #SVquotes2021



*#స్వామివివేకానంద  #క్రైస్తవమతాన్ని #పొగిడారు అనే వారికి ఇది #కనువిప్పు అవుతుంది...*😎
*గొర్రెల తో ఎలా ఆడుకన్నారో చూడండ స్వామీజీి* 😀

స్వామి వివేకానంద ఒక గొప్ప వ్యక్తి. వాస్తవానికి, ఈ మహానుభావుడు లాంటి వారు ఒకేసారి పుడతారని చెప్పుకోవచ్చు. 1863 జనవరి 12న జన్మించిన స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త.
1902 జూలై 4వ తేదీన బ్రిటీషు పరిపాలనలోని బెంగాలు ప్రెసిడెన్సీ లోని బేలూరులోని రామకృష్ణ మఠంలో వివేకానందుడు మరణించారు. అప్పుడు ఆయన వయస్సు 39 ఏళ్లు.ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినం జనవరి 12వ తేదీని.. 1984వ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తోంది. 

చ‌రిత్ర‌పుట‌ల్లో నిలిచిన‌ స్వామి వివేకానంద గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా..?

స్వామీ వివేకానంద.. ప్ర‌తీ భార‌తీయుడు విని తెలుసుకోవాల్సిన గొప్ప దేశ‌భ‌క్తుడి చ‌రిత్ర‌. తన అద్భుత ప్రసంగంతో పాశ్చాత్యుల హృదయాలను సైతం చూరగొన్న భారతీయ తత్వవేత్త, గొప్ప మేధావి స్వామి వివేకానందుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. 1902 జూలై 4వ తేదీన బ్రిటీషు పరిపాలనలోని బెంగాలు ప్రెసిడెన్సీ లోని బేలూరులోని రామకృష్ణ మఠంలో వివేకానందుడు మరణించారు. అప్పుడు ఆయన వయస్సు 39 ఏళ్లు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినం జనవరి 12వ తేదీని.. 1984వ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తోంది. 

 నరేంద్ర నాథుడు కలకత్తా, బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశంలో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వివేకానందునికి చిన్నప్పటి నుంచే రోజూ ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. నరేంద్రుడు ఆటలలోనూ, చదువులో కూడా ముందుండేవాడు. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్ష మరియు ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. అలా చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగినాయి.
అలా మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. ఈ స‌మ‌యంలోనే న‌రేంద్రుడుకి రామకృష్ణ పరమహంసతో ద‌గ్గ‌ర పరిచయం ఏర్ప‌డింది. అయితే నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పుడు అతను బి.ఎ పరీక్షకు తయారవుతున్నాడు. ఇక 1884లో బి.ఎ పాసయ్యాడు. దీంతో అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా ఓ పిడుగు లాంటి వార్త తెలిసింది. 

 అదే అత‌ని తండ్రి మరణించాడని. దీంతె ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది కోర్డును కూడా ఆశ్రయించారు. ఈ క్ర‌మంలోనే నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. అలాంటి స‌మ‌యంలో రోజుకొకపూట భోజనం దొరకడం కూడా గగనమైంది. ఈ క్ర‌మంలోనే నరేంద్రుడు చాలారోజుల పాటు పస్తులుండి మ‌రీ తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టేవాడు. ఇంత దురదృష్టం తనను వెన్నాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. ఇక ఆ త‌ర్వాత నరేంద్రుడు కొద్దిరోజులపాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. 

ఇంత‌లోనే గురువు రామ‌కృష్ణ ఆరోగ్యం క్షీణించింది. దీంతో రేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండు మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. అయితే రామ‌కృష్ణ క్యాన్సర్ వ్యాధితో మ‌ర‌ణంచాడు. రామ‌కృష్ణ చివ‌రి కోరికాగా.. ఆయ‌న శిష్యులందరూ కలిసి బరనగూర్‌లోమి ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. అక్కడున్న యువసన్యాసులకు రెండే లక్ష్యాలు ఉండేవి. ప్రజలకు సేవ చేయడం , ముక్తిని సాధించడం. ఈ క్ర‌మంలోనే నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశం అతని గృహమైంది. ఇక్కడి ప్రజలు అతని సోదర, సోదరీమణులయ్యారు. 

ఈయనకు చిన్నతనం నుండే ఎంతో ధైర్యం, ఏకాగ్రత ఉండేవి. ఒకానొక సందర్భంలో అతను ధ్యానం చేస్తున్నపుడు ఒక పెద్ద పాము అతడి చుట్టే తిరగసాగింది.. దాంతో వివేకానంద స్నేహితులు పాము, పాము అంటూ గగ్గోలు పెట్టినప్పటికీ అతను మాత్రం కొంచెం కూడా చలించకుండా అలానే ధ్యానం కొనసాగించారు. ఇది అతని ఏకాగ్రతకు నిదర్శనం. ఇంకా కొన్ని అద్భుతమైన సంఘటనను కింద చదివి తెలుసుకుందాం.

సంఘటన-1

ఒకరోజు పీటర్ అనే ఒక తెల్లజాతి ప్రొఫెసర్ బల్లమీద కూర్చొని భోజనం చేస్తుంటాడు. అప్పుడు స్వామి వివేకానంద తన ఆహారాన్ని ఒక ప్లేట్ లో పట్టుకొని వచ్చి పీటర్ పక్కన కూర్చుంటారు. వివేకానంద తన పక్కన కూర్చున్నందుకు ద్వేషిస్తూ పీటర్ ఇలా అంటాడు...' మిస్టర్. వివేకానంద మీకు ఒక విషయం అర్ధం కావట్లేదు. ఒక పంది, ఒక పావురం కలిసి కూర్చోకూడదు', అని అంటాడు.

దాంతో స్వామి వివేకానంద స్పందిస్తూ... 'మీరేం బాధపడకండి, ప్రొఫెసర్. నేను ఎగిరిపోతానులే', అంటూ వేరే బల్ల వద్దకి వెళ్లి అక్కడ కూర్చోంటారు. దీంతో, నన్నే పంది అంటావా నువ్వు అని కోపంగా స్వామి వివేకానంద వైపు చూస్తూ అతనిపై పగబడతాడు పీటర్.

మరుసటి రోజు క్లాస్ జరుగుతున్నపుడు స్వామి వివేకానందాని ఏదో ఒక రకంగా అవమానించాలని అతనిని ఇలా ప్రశ్నిస్తాడు... 'మిస్టర్. వివేకానంద.. మీరు ఒక వీధిలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక సంచిలో డబ్బులు ఉండి.. మరొక దాంట్లో జ్ఞానం ఉంటే.. ఆ రెండిటిలో కేవలం ఒక్కటే తీసుకోవాలంటే.. మీరేం తీసుకుంటారు? అని ప్రశ్నిస్తాడు.

'నేను డబ్బుల సంచి తీసుకుంటాను, ప్రొఫెసర్', అని వివేకానంద సమాధానమిస్తారు.

'నీ ప్లేస్ లో నేనుంటే జ్ఞానం ఉన్న సంచిని తీసుకుంటా', అని నవ్వుకుంటూ చెబుతాడు పీటర్.

'ఎవరికి ఏది లేదో అదే కావాలని కోరుకుంటారు. నీకు జ్ఞానం లేదు కాబట్టి', అంటూ వివేకానంద సూపర్ పంచ్ విసురుతారు. దాంతో, క్లాసులో ఉన్నవారంతా పకపకా నవ్వుతారు. అప్పుడు పీటర్ కి కోపం విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని రోజుల తరువాత పరీక్షల ముగుస్తాయి. అందరి విద్యార్థులను పిలిచి ఎక్సమ్ పేపర్స్ ఇస్తుంటాడు పీటర్. ఈ క్రమంలోనే వివేకానందాని పిలిచి అతడికి ఆన్సర్ పేపర్ ఇస్తాడు పీటర్. ఆ పేపర్ లో మార్కుల స్థానంలో 'ఇడియట్' అని రాసి ఉంటుంది. వివేకానంద కోసేపు ఆగి.. తరువాత పీటర్ దగ్గరకు వెళ్లి... 'ప్రొఫెసర్, మీరు మీ సంతకం పెట్టారు కానీ మార్కులు వేయడం మర్చిపోయారు', అంటూ ఎంతో మర్యాదపూర్వకంగా చెబుతారు. దాంతో, పీటర్ నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. 

భగవంతుడు అన్నిటా వున్నానని చెప్పినప్పుడు హిందువులు విగ్రహారాధన ఎందుకు చేస్తారు?

ఒకసారి వివేకానందుడు ఇప్పుడు రాజస్తాన్ లో వున్నా అల్వార్ సంస్థానాధీశుని దగ్గరకు వెళ్ళాడు.

విగ్రహారాధానని వెక్కిరించడానికి ఆ రాజు వివేకానందునితో ‘నాకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు, రాయినీ, రాప్పనీ, కర్రనీ, లోహాన్నీ ఎవరయినా ఎలా ఆరాధిస్తారు? ప్రజలు అపోహలో వున్నారు, కేవలం సమయం వృధా చేసికుంటున్నారు’ అన్నాడు.

స్వామీజీ నవ్వుతూ స్పందించారు.

రాజు సహాయకుడిని అక్కడ గోడకి వ్రేలాడుతూ వున్న రాజు చిత్ర పటాన్ని క్రిందకు దించమన్నారు.

అయోమయం లో పడిన ఆదేశించారు.

నిర్ఘాంత పోయిన సహాయకుడు రాజు వైపూ, స్వామీజీ వైపూ చూస్తూ ఉండిపోయాడు.

స్వామీజీ మళ్ళీ, మళ్ళీ ఆదేశించారు. ప్రతీ సారీ మరింత తీవ్రంగా ఆదేశించ సాగారు.

రాజు ఆగ్రహోద్రకుడవుతున్నాడు, సహాయకుడు 
చివరికి సహాయకుడు ‘నేను ఈ పటం పై ఎలా ఉమ్మగలను? పటం లో వున్న చిత్రం  లో మా రాజు వున్నారు అంటూ అరిచాడు.

అప్పుడు స్వామీజీ ‘రాజు నీ ఎదురుగా వ్యక్తిగతంగా కూర్చుని వున్నారు. ఆ పటం లో వున్నది ఒక కాగితం మాత్రమె. అది మాట్లాడలేదు, వినలేదు, కదలలేదు. కానీ నువ్వు ఆ పటం పై ఉమ్మి వేయనంటు న్నావు, ఎందుకంటే నువ్వు ఆ పటం లో నీ రాజు ని చూసికుంటున్నావు కాబట్టి ఉమ్మి వేయనంటు న్నావు. ఆ పటం మీద ఉమ్మితే నీ రాజు మీద ఉమ్మినట్లని నువ్వు అనుకుంటున్నావు’ అన్నారు.

స్వామీజీ ని చూసిన రాజుక సామీజీ ముందర సాష్టాంగ పడ్డాడు, స్వామీ చెప్పదలుచుకున్నది తనకి పూర్తిగా అర్ధమయిందని ఆ రాజు చెప్పాడు.

ఇదే విగ్రహారాధన యొక్క సారము.

భగవంతుడు అన్నిచోట్లా వున్నాడు. కానీ మనం ఆయనని పూజించాలనుకుంటాము, కోరికలను కోరాలనుకుంటాము, నివేదన చేద్దామను కుంటాము, కధలు చెప్పాలని అనుకుంటాము, స్నానం చేయించాలని అనుకుంటాము, ఆడుకోవాలనుకుంటాము,

మనం మన జీవితాలతో ఏమి చేస్తామో అన్నీ భగవంతునితో చేయించాలని అనుకుంటాము.

విగ్రహం రూపంలో వున్న భగవంతుని ఆకారాన్ని మనం మన సహచరుడు గానూ, మార్గ దర్శకునిగానూ, స్నేహితుని గానూ, రక్షకునిగానూ, ప్రసాదించే వానిగానూ, సాటి మనిషి గానూ భావించుకుంటూ ఉంటాము. 

విగ్రహము మనం చూడగలిగే యదార్ధ  ప్రతినిధి. 

నేను ఆ విగ్రహపు కన్నులలోనికి చూస్తున్నప్పుడు, నాకది రాయిలాగానో, లోహం లాగానో కనిపించదు. మరొక జత కన్నులు  ప్రేమతో నన్ను  నవ్వుతూ  చూస్తున్నట్లు అనిపిస్తుంది.
ఇంకా, ఇలాంటి సంఘటనలు స్వామి వివేకానంద జీవితంలో జరిగాయి.


వివేకానందుడు చెప్పిన సూచనను గౌర విద్దాం. ఆచరిద్దాం జీవితకాలం బాగుపడదాం.

*‘‘దేనికీ భయపడవద్దు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకూ పనికి రాకుండా పోతారు. ఈ ప్రపంచంలో దు:ఖానికి మూలకారణం భయమే. నిర్భయమే మనకు సర్వాన్ని ప్రసాదించగలదు. భయరాహిత్యమే అనిర్వచనీయమైన మనశ్శాంతికి మార్గం.* 
– వివేకానంద

వివేకానందుని జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారు ఇచ్చిన సందేశాలను, పాటించ డానికి అందరూ తమ వంతు కృషి చేయాలని కోరుకుంటూ….....

*స్వామి వివేకానంద జయంతి 2020*

స్వామి వివేకానంద
పుట్టినరోజును ప్రతి సంవత్సరం జనవరి 12 న జాతీయ యువ దినోత్సవంగా జరుపుకుంటారు . 1984 లో భారత ప్రభుత్వం ఈ రోజును జాతీయ యువ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది.


*స్వామి వివేకానంద జయంతి 2020 యొక్క ప్రాముఖ్యత*

స్వామి వివేకానంద తన బోధనలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యువకులను ప్రేరేపించారు. 1893 వ సంవత్సరంలో చికాగోలో అంతర్జాతీయ సర్వమత సమ్మేళనంలో  వక్తగా మరియు మన దేశ ప్రతినిధిగా వెళ్లారు. 

భారతదేశం యొక్క ఆధ్యాత్మికత-ఆధారిత సంస్కృతి మరియు దృక్పథం పైన  చరిత్రపై స్వామీజీ చేసిన ప్రసంగం అమెరికన్ల నుండి, ముఖ్యంగా మేధో వర్గం నుండి ప్రశంసలను పొందింది. 

స్వామీజీ బలమైన వ్యక్తిత్వం,   వేదాంతాలలో ఇమిడి ఉన్న సైన్స్ అపారమైన జ్ఞానం మరియు మానవ, సకల జీవుల పట్ల వారి చింతన, ఆధ్యాత్మిక  జీవితం పట్ల తాదాత్మ్యం, సనాతన ధర్మము యొక్క విశిష్టత పై వారి బోధనలు ఒక్కసారిగా ప్రపంచం యొక్క దృష్టిని భారతదేశం వైపు గామార్చాయి.

స్వామీజీ  మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా మరియు మతం పట్ల  అనుసరించిన విధానం శాస్త్రీయ అధ్యయనాలు మరియు వేదాంతాల సమ్మేళనం.    వివేకానంద బోధలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయిఆ సహాయకుడు స్వామీజీ చెప్పినట్లే చేసారు.

అప్పుడు స్వామీజీ ఆ పటం పై వుమ్మివేయమని రాజు సహాయకుడిని . 

*స్వామివివేకానంద 160 జయంతి శుభాకాంక్షలతో....*

*స్వామి వివేకానంద‌… సాంస్కృతిక జాతీయవాదానికి స్ఫూర్తిదాత....*🚩🕉️

*ప్రపంచంలో ఏ మహాపురుషుడి జీవితాన్నయినా, ఆయన సాధించిన విజయాలనైనా అర్థం చేసుకోవాలంటే ఆ మహాపురుషుడు జన్మించే నాటికి ఆ దేశంలో ఉన్న పరిస్థితులను మనం అవగాహన చేసుకోవాలి. అప్పుడే ఆ మహాపురుషుడు అప్పటి పరిస్థితులను చక్కదిద్దేందుకు చేసిన ప్రయత్నాలను మనం అవగతం చేసుకోగలం. మన దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో ఒక మహాపురుషుల పరంపర జన్మించింది. వారంతా ఒక్కో విషయంలో ఒక్కో పరివర్తన తీసుకొనివచ్చేందుకు తమౄ జీవితాలను సమర్పించారు.*

కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు

నీ వెనక ఏముంది.. ముందు ఏముంది.. అనేది నీకనవసరం .. నీలో ఏముంది అనేది ముఖ్యం

ప్రపంచంలో ఏ మహాపుఠుషుడి జీవితాన్నయినా, ఆయన సాధించిన విజయాలనైనా అర్థం చేసుకోవాలంటే ఆ మహాపురుషుడు జన్నించే నాటికి ఆ దేశంలో ఉన్న పరిస్థితులను మనం అవగాహన చేసుకోవాలి. అప్పుడే ఆ మహాపురుషుడు అప్పటి పరిస్థితులను చక్కదిద్దేందుకు చేసిన ప్రయత్నాలను మనం అవగతం చేసుకోగలం. మన దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో ఒకౄ మహాపురుషుల పరంపర జన్మించింది. వారంతా ఒక్కో విషయంలో ఒక్కో పరివర్తన తీసుకొనివచ్చేందుకు తమ జీవితాలను సమర్పించారు.

స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ వారు మన దేశం గురించి అనేక అపోహలను వ్యాపింపజేశారు. భారత్‌లో వందల ఏళ్ల నుంచి ఉన్న సామాజిక, మతపరమైన సమస్యల పరిష్కారానికి బ్రిటిష్u వారి ఆలోచనలే అభ్యుదయమైనవన్న ఆలోచనలతో పనిచేసే సంస్కరణ వాదులు దేశంలో తయారయ్యారు. 1857 సంవత్సరం తర్వాత మన దేశానికి సంబంధించిన మూలాలకే ప్రమాద ఘంటికలు మోగటం ఆరంభమైంది. భారత్ వేలాది సంవత్సరాలుగా సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఒకటిగా ఉన్నది. దేశం ఎప్పుడైనా ధర్మం ఆధారంగానే వికసించింది. ధర్మం ఆధారంగానే నిలబడింది. బ్రిటిష్ వారి పాలన మొదలయ్యాక ‘రాజ్యశక్తే సర్వస్వం’ అన్న వాతావరణం ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో ధర్మశక్తే సర్వస్వం, ధర్మమే ఆధారం, మన జాతీయత స్థిరంగా నిలబడాలని కొందరు మహాపురుషులు పనిచేసుకుంటూ వచ్చారు. వారిలో బంకిమ్‌చంద్ర చటర్జీ, దయానంద సరస్వతి, అరవింద మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటివారు అగ్రగణ్యులు. సమకాలీన సామాజిక పరిస్థితులను అర్థం చేసుకున్న వివేకానందుడు ఈ దేశంలోని యువతకు ప్రేరణగా నిలిచాడు. మన గురించి బయటివారు చెప్పేదే నిజమని భావించే వాతావరణం అప్పట్లో ఎక్కువగా ఉండేది. ఆ పరిస్థితులను చక్కదిద్దాలన్న సంకల్పంతో వివేకానందుడు దేశంలో ‘సాంస్కృతిక జాతీయవాదాని’కి బలమైన పునాదులు వేశాడు. ‘నేను హిందువును’ అని అనుకోవడమే మహా పాపంగా భావిస్తున్న రోజుల్లో- ‘నేను హిందువునని గర్వంగా చెప్పుకోవాల’ని ఆయన పిలుపునిచ్చాడు.

కలకత్తాలో 1863 జనవరి 12న జన్మించిన వివేకానందుడికి- ‘భగవంతుడ్ని దర్శించాల’నే ఆకాంక్ష చిన్నతనం నుంచి ఉండేది. ఆ ఆకాంక్షను తీర్చుకునే అనే్వషణలో ఆయన రామకృష్ణ పరమహంసకు దగ్గరయ్యాడు. రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్లాక ఆయన వేసిన మొదటి ప్రశ్న- ‘మీరు భగవంతుడ్ని చూశారా?’ అని. దానికి పరమహంస- ‘నేను నిన్ను ఎట్లా చూస్తున్నానో భగవంతుడ్ని అలాగే చూశాను’ అని బదులిచ్చారు. ఆ క్షణంలోనే ‘భగవంతుడు సర్వాంతర్యామి’ అని తెలుసుకున్న వివేకానందుడు రామకృష్ణ పరమహంస ప్రేరణతో సన్యాసిగా మారాడు. పరమహంస పరమపదించాక వివేకానందుడు ‘భారత పరిక్రమ’కు బయలుదేరాడు. దేశమంతా అపరిచితుడిగా తిరిగాడు. దేశంలోని సామాజిక సమస్యలు, ఆధ్యాత్మిక రంగంలో సంఘర్షణలు, సంస్కరణ వాదంతో తలెత్తిన సరికొత్త సమస్యలను ఆయన అవగాహన చేసుకొన్నారు. అప్పటి పరిస్థితులను, అస్పృశ్యత వంటి సామాజిక సమస్యలను చూసి దుఃఖించడమే కాదు, వాటినిఖ చక్కదిద్దాలని సంకల్పించాడు.

1893లో చికాగోలో ఉపన్యాసం ఇవ్వడానికి ముందే దేశంలోని సమస్యలను, సంక్షోభాలను చూసి వాటిపై ఎంతోమంత్రి ప్రముఖులతో వివేకానందుడు చర్చించాడు. అప్పట్లో ఆయన ఆవేదనను కొంతమంది గుర్తించలేదు. చికాగో ఉపన్యాసం తర్వాత వివేకానందుడి గొప్పతనాన్ని తిలక్ వంటి నేతలు అర్థం చేసుకున్నారు. చికాగోలో ఉపన్యాసం ఇచ్చిన తొలిరోజే ప్రపంచమంతా ఒక్కసారి వివేకానందుడి ఆలోచనల వైపుమళ్లింది. చికాగోలో జరిగిన ‘మత మహాసమ్మేళనం’లో ఆయన చేసిన సింహగర్జనకు యావత్ ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. అప్పటి ఉపన్యాసంలో ఆయన చెప్పిన మాటలు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లోనూ మననం చేసుకోవాల్సి ఉంది. ‘నేను చెప్పిందే సత్యం అనే మూర్ఖవాదనే ప్రపంచ మానవక నాగరికత వికాసానికి అడ్డంకి ఉంది’ అంటూ ఆయన అన్న మాటలు ఎప్పటికీ అక్షరసత్యాలు. నేటి ఆధునిక యుగంలో మతాల ఆధిపత్య పోరాటంలో ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. వీటి నుంచి బయటపడాలంటే హిందూ తాత్విక చింతనే ఆధారం. ఈ విషయానే్న అప్పట్లో చికాగో ఉపన్యాసం తర్వాత వివేకానందుడు దేశదేశాలు తిరిగి చెప్పాడు. చికాగో నుంచి తిరిగి వచ్చాక ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలను జాగృతం చేశాడు.

భారత్‌లో సంస్కరణవాదులు జాతికి మేలు కంటే కీడు చేస్తున్నారని వివేకానందుడు విస్పష్టంగా ప్రకటించారు. ఆదిశంకరాచార్యులు వంటి మహాపురుషుల ప్రయత్నాల కారణంగా దేశంలో పెద్ద మార్పు వచ్చిందని, వారికంటే సంస్కరణవాదులు గొప్పవారా? అని ఆయన ప్రశ్నించేవారు. మహాపురుషులు చూపిన మార్గంలో ప్రయాణించడమే దేశానికి శ్రేయస్కరమన్నారు. భగవంతుడ్ని చేరేందుకు అనేక మార్గాలున్నాయని, ఆ మార్గాలేవీ సంఘర్షణలకు కారణం కావన్నారు. అన్ని మతాలూ ప్రపంచశాంతినే బోధిస్తాయని, ఆ దిశగానే అందరూ ఆలోచించాలన్నారు. దేశాన్ని సంఘటితం చేసేందుకు మనం పూజించే దేవతలను కూడా పక్కకుపెట్టి ఆ స్థానంలో భరతమాతను పూజించాలని వివేకానందుడు పిలుపునిచ్చారు. మనమంతా భరతమాత సంతామనమని, అందరం బంధువులమేనని, ఈ ఆలోచనలతో దేశాన్ని శక్తివంతం చేసుకోవాలన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రం లాంటి హృదయం కలిగిన వందమంది యువకులు తనకు దొరినట్టయితే ఈ దేశ పరిస్థితులను మార్చేస్తానని ఆయన అనేవారు. వేదాంత తత్త్వాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడమే కాదు, సామాజిక సమస్యల పరిష్కారానికి కూడా ఆయన ప్రయత్నించారు. ఈ దేశం జాగృతం కావాలంటే అట్టడుగు వర్గాల నుంచి యువకులు ముందుకు రావాలన్నారు. ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ మనకు అనుసరణీయం. ప్రస్తుత పరిస్థితుల్లో జాతికి సరైన దిశానిర్దేశం చేయగలిగేది ఆయన ఆలోచనలే. ఆయన బోధించిన వ్యక్తి నిర్మాణం, సాంస్కృతిక జాతీయ వాదం,ఋ సామాజిక సమస్యల పరిష్కారం వంటి అంశాలు మన మనుగడను నిర్దేశిస్తాయి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఆయన ఆలోచనలు మనకు శిరోధార్యం. జాతీయవాదిగా,క దార్శనికుడిగా, సంస్కరణవాదిగా, ఆధ్యాత్మిక చింతకునిగా వివేకానందుడు మనకు చిరస్మరణీయుడు. ఆయన ఆలోచనలే ఈ దేశానికి శ్రీరామరక్ష.



*హిందూ బంధువులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో....*

🚩🚩🚩🕉

*మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి? *

*ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి?*

ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.

ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.

ముగ్గులు రోజు వేయలేక పేంట్ పెట్టస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.

నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.

ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.

జై సనాతన హిందూ ధర్మ🚩🚩🚩✊


Today is Makar Sankranti the Hindu festival which honours Surya Dev, and signals the end of winter in the Hindu calendar and the beginning of longer days, bringing an auspicious spring and an abundant harvest period.

The day marks the commencement of the Sun’s northern course in the Heavens – the Uttaraayana path. This turn in the Sun’s course takes place at the point of time when it enters the sign of Makara or Capricorn. From this day the day-duration increases and the night decreases. 

Wishing you all a Shubh Makar Sankranti !

#247sevika #hssuk #happypongal #happylohri #HappyUttarayan



*నేడు భారత జాతీయ సైనిక దినోత్సవం* 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 15 న ఆర్మీ డే జరుపుకుంటారు. 
ఫీల్డ్ మార్షల్ కోడండేరా ఎం. కారియప్ప (అప్పటి లెఫ్టినెంట్ జనరల్) భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుట్చేర్ నుండి బాధ్యతలు స్వీకరించారు. చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ 15 జనవరి 1949 న. ఈ రోజు దేశ రాజధాని న్యూఢిల్లీలో మరియు అన్ని ప్రధాన కార్యాలయాలలో కవాతులు మరియు ఇతర సైనిక ప్రదర్శనల రూపంలో జరుపుకుంటారు .
జనవరి 15, 2020 న, భారతదేశం తన 72 వ భారత ఆర్మీ దినోత్సవాన్ని న్యూ ఢిల్లీ నీలో జరుపుకుంది.దేశం మరియు దాని పౌరులను రక్షించడానికి ప్రాణాలను అర్పించిన వాలియంట్ సైనికులకు నమస్కరించడానికి ఆర్మీ డే ఒక రోజును సూచిస్తుంది.


:1948 అప్పటి తాత్కాలిక ప్రధాని నెహ్రూగారు మిలిటరీ అధికారులను ఉద్దేశించి ,డియర్ ఫ్ర్రెండ్స్ "మన మిలిటరీలో అనుభవిజ్ఞులైన అధికారులు లేనందున కొన్ని సంవత్సరాలపాటు ఆంగ్లేయులలోనే ఒకరిని ఫీల్డ్ మార్షల్ గా నియమిద్ధామనుకుంటున్నాను..మీ అభిప్రాయం చెప్పండి అని అందరి మొహాలలోకి చూసేడు..అందరూ అలవాటు ప్రకారం వినయంగా తలలూపేశారు. కానీ నాథూసింగ్ రాథోడ్ అనే అధికారి లేచి వినయంగా రెస్పెక్టెడ్ సార్ "మనదేశంలో ప్రధానిగా పనిచేసిన అనుభవం ఎవరికీ లేదు..కొన్నాళ్ళు ఆంగ్లేయులలోనే ఒకరిని ప్రధానిగా నియమించుకుంటే బాగుంటుంది కదా?? అన్నాడు.
అంతే ఆ అధికారులంతా నిశ్చేష్టులైపోయారు..ఊహించని ప్రశ్నకు నెహ్రూగారు కూడా నిర్ఝాంతపోయారు..పిన్ డ్రాప్ సైలెన్స్ ...ముందుగా నెహ్రూగారే తేరుకొని"డియర్ సర్ మీరు సైన్యాదక్షుడిగా వుంటారా అని రాధోడ్ తో అన్నారు..అందుకు ఆయన వినయంగా ,సార్ నాకంటే ఎంతో అనుభవం,నైపుణ్యం,ప్రతిభాపాటవాలు కలిగిన అధికారులున్నారు"వారిని నియమించండి అన్నాడు నెహ్రూగారితో...మీరే చెప్పండి సార్ అని నెహ్రూగారు అడగగా"సార్ మేజర్ కరియప్ప గారు అందుకు అర్హులు వారిని నియమించండి అనగానే అక్కడ అధికారులందరూ చప్పట్లతో అంగీకారం తెలపడం,కరియప్ప గారిని సైనాధ్యక్షునిగా నియమించడం జరిగిపోయింది..ఆయనను మిలటరీ జనరల్ గా నియమించిన రోజును పురస్కరించుకొని జనవరి15 సైనికదినోత్సవంగా మనదేశం జరుపుకుంటుంది.
 కరియప్పగారు రెండో ప్రపంచయుద్దంలో ,1947 పాక్ యుద్ధంలోనూ పాల్గోని తన వ్యూహ చతురతను చాటుకొన్నారు..మంచి యుద్ధవ్యూహ రచనా పరుడిగా పేరుతెచ్చుకున్నారు..మనమంతా నిర్భయంగా బతకగలుగుతున్నామంటే సరిహద్దులలో అనుక్షణం అప్రమత్తంగా కాపలా కాస్తున్న మన సైన్యుకుల చలువే...సైనికులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియచేద్దాం!!!

జనవరి19 మహారాణ ప్రతాప్ వర్ధంతి



*జనవరి 23 - దేశ్ ప్రేమ్ దివాస్ (నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి)*🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🔥

*అన్ని పాఠశాలల్లో ప్రార్థన సమయంలో ప్రత్యేకంగా నేతాజీ జీవిత విశేషాలను విద్యార్థులకు తెలియజేద్దాం...*

నేతాజీ గొప్ప స్వాతంత్ర్యసమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. నేతాజీ మరణం పై అనేక రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి 

బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు.

బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ మరియు జపానుతో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.
*జయంతి తప్ప వర్ధంతి లేని ఏకైక భారత హీరో బోస్*
ఒక్క సారి ఆయనను స్మరించుకుందాం🙏🚩
*జై హింద్*
*భారత్ మాతాకీ జై*


*నేతాజీ జీవితం సదా ఆచరణీయం*🇮🇳🇮🇳🙏

భారతదేశ స్వాతంత్ర్య సమరంలో అహింసా మార్గంలోనే కాదు వీర మార్గంలెనూ బ్రిటిషర్ల పై పోరాడుదామని,
"మీరు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తానని", జై హింద్ అని పిలుపిచ్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు...

ఒడిషా రాష్ట్రంలోని ఖాట్గాలో 1879, జనవరి23న ప్రభావతి దేవి, జానకినాథ్ బోస్ దంపతులకు  నేతాజీ జన్మించారు. నేతాజీ తండ్రి అడ్వకేట్. జాతీయవాది కూడా అయిన ఆయన బెంగాల్ లెజిస్టేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. చిన్నతనం నుంచి చురుగ్గా ఉండే నేతాజీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందల ప్రభావంతో సన్యాసం స్వీకరించారు. మానవసేవే మాధవసేవ  అన్న రామకృష్ణుడి ఉపదేశంతో దేశసేవకు నడుంకట్టారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి పలు పోరాటాల్లో భాగస్వామి అయ్యారు.

*1920లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు ఎంపికైనప్పటికీ తృణప్రాయంగా ఉద్యోగాన్ని వదులుకొని దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడమే తనప ప్రధమ కర్తవ్యం అని ఉద్యమంలోకి అడుగుపెట్టారు.* 

స్వాతంత్ర్యం రావాలంటే సొంత సైన్యంతో పాటు ఇతర దేశాల సహకారం కూడా అవసరమని భావించాడు. ఆజాద్ హిందూ ఫైజ్ ను స్థాపించి భారత్ కు స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలకపాత్ర వహించాడు. 

అయితే నేతాజీ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇంకా వీడలేదు.1945, ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించిన యుద్ద విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం నేతాజీకి సంబంధి వంద సీక్రెట్ ఫైళ్లను విడుదల చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీలానే మిగిలిపోయింది.


నేతాజీ' సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) అతను గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు.

బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ మరియు జపానుతో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.
*జయంతి తప్ప వర్ధంతి లేని ఏకైక భారత హీరో బోస్*
ఒక్క సారి ఆయనను స్మరించుకుందాం🙏🚩
*జై హింద్*



*భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో....*🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩

*భారత గణతంత్ర దినోత్సవం*

*(భారత దేశం యొక్క రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజు)*

భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు.

ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. 

భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని ఆదేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే "జాతీయ పండుగ" రోజు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవము మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 దినానికి గౌరవంగా జరుపు కుంటారు.ఈ రోజున బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది.

*జనవరి 26 నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది.*

1930లో భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు.

1950 జనవరి 26 న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు. 1946 నుంచి 1949 వరకూ ఈ బృందం భారత పార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకొన్నారు . ఐతే దేశ స్వాతంత్ర్య దినం బ్రిటీషర్లు స్వయంగా నిర్ణయించడంతో  జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ గణతంత్ర దినోత్సవంగా చేశారు.

భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యము వచ్చింది. దేశానికి రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అధ్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29 న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఛైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధానంగా రూపుదిద్దారు. అనేక సవరణల అనంతరము 1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలము పట్టింది. ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగముగా గుర్తించబడింది. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచడంతో భారతదేశము సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రo రాజ్యముగా రూపొందడంతో పరిణామ దశ పూర్తయింది.

*భారత్ మాతాకీ జై*
*జై హింద్*


భారత్ గణతంత్ర దినోత్సవంనాడు *మాతలకు మాత*
*సకల సంపత్సమేత భారతమాతను పూజిద్దాం..*

తనను ముక్కలు చేయాలని చూసే దేశద్రోహులను సైతం భరించే భరతమాత సహనాన్ని పూజిద్దాం...

తనను నిరంతరం కాపాడే
తన సంతానం సైనికుల, స్వయంసేవకుల పాదాల కింద 
తన బిడ్డల కాళ్ళు కందకుండా తన అరచేతులు ఉంచే మన తల్లికి పూలతో వందనసమర్పణ చేద్దాం.. 
భరతమాతను పూజిద్దాం.. 

తన చుట్టుపక్కల మన ఇరుగు పొరుగు దేవాలయం లో 
భరత మాత పూజలను నిర్వహిద్ధం
హిందూ బంధువులందరికీ ఆహ్వానిద్దాం..

సంఖ్య తో పనిలేదు...,
ఎంత మంది వస్తే అంత మంది...,
వారు పిల్లలు అయినా పెద్దలు పెద్దలైన....🚩🚩🚩🚩🚩🚩🔥

Comments

Popular posts from this blog

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)