ఆధ్యాత్మిక చింతన

సంస్కారాలు శాశ్వతంగా హత్తుకుపోవడానికి మార్గమేంటి? 

ఒక ఆదర్శానికి అనుగుణంగా వ్యక్తి శీలాన్ని తీర్చిదిద్దాలంటే మూడంశాలు అవసరమని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పారు. 

- సంస్కారంగా రూపొంద వలసిన ఆదర్శాన్ని గురించి నిరంతర ధ్యానం, 
- ఆ ఆదర్శానికి అంకితులైన వ్యక్తుల యొక్క సంతత సాంగత్యం, 
- ఆ ఆదర్శానికి అనుగుణమైన క్రియాకలాపాల్లో శరీరా వినియోగం-ఇవే ఆ మూడంశాలు.

ఉభయసంధ్యల్లోనో, రాత్రివేళనో, లేదా ఎప్పుడో ఒకప్పుడు రోజులో ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకుని, ఆ సమయంలో క్రమబద్ధంగా, నియమపూర్వకంగా, వేళ తప్పకుండా తన శరీరం, మనస్సు, బుద్ధి - వీటి యొక్క శక్తులనూ, కార్యకలాపాలన్నిటినీ తానెంచుకొన్న ఆదర్శం పై లగ్నంచేయాలనీ, రోజూ కనీసం కొంత సమయాన్ని
తనవంటివారి సాహచర్యంలో గడపాలనీ ఈ పద్ధతి సూచిస్తుంది.

సంస్కారప్రదమైన ఈ కాలామోదిత పద్ధతిని అనుసరించియే సంఘం కూడా నేటి శాఖ పద్ధతిని రూపొందించింది. జాతీయ పునన్సంఘటనారాదర్శానికి
అనుగుణంగా "రాష్ట్ర దేవోభవ" అనే భావనతో ప్రేరితమైన నిత్యసంస్కార పద్ధతి శాఖ కార్యక్రమాల్లో కొనసాగుతూ ఉంది. 

పై పైకి చిన్న విషయాలుగా తోచే ఆటలు, పాటలు, కర్రసాము, సంచలనం వంటివి ఇదే భావనతో అనుప్రాణితాలై సంఘటితం, శక్తివంతమైన జాతీయ
జీవనానికి కావలసిన ప్రగాఢ సంస్కారాలను నిర్మించగల్గుతాయి.

గత అనేక శతాబ్దాల కాలంలో మనలో పెరుగుతూవస్తున్న చెడుఅలవాట్లు, మనస్తత్వాలు ఒక్కరోజులో ప్రక్షాళితంకావు. కాబట్టి ప్రతిదినం సంస్కారాలను కల్గించటం తక్షణావసరం.. దేహాన్ని ప్రతినిత్యం ఎలా శుభ్రం చేస్తామో; అటువంటప్పుడు, మరింత తేలికగా కలుషితం కావడానికి అవకాశమున్న మనస్సును, మరింత శ్రద్ధతో నియమబద్ధంగా పరిశుద్ధం చేయాలి.
చుట్టూ ఉండే వాతావరణం లోని వివిధ దుష్ట ప్రవృత్తుల నిరంతర సంపర్కంలో అది ఉంటుంది. కాబట్టి  మరింత ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.

ఆత్మసాక్షాత్కారం పొందిన వారు కూడా, నిత్య సంసారాన్ని క్రమంగా ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నా"రని శ్రీరామకృష్ణునకు అద్వైతాన్ని ప్రబోధించిన తోతాపురిని అడిగితే, నీళ్లు త్రాగే చెంబును ప్రతినిత్యం శుభ్రపరచడం ఎట్లా అవసరమో, అట్లాగే ఈ ప్రపంచంలో జీవించి ఉన్నంత కాలం మనస్సును ప్రతినిత్యం సంస్కరించడం అవసరమని ఆయన
సమాధానం చెప్పారు.

#జీవిత #సత్యం

#జీవితం #పరమానంద #స్థితిని #చేరుకునేందుకు, #మోక్షాన్ని #సాధించేందుకు #మార్గమేమిటి?

ఆందోళన పడే మనస్సు అనందాన్నెన్నటికీ పొందలేదు. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే వ్యక్తి ఆనందం అనుభవిస్తారు. మనస్సు అట్టి ప్రశాంతమై న నిశ్చలస్థితిని పొందాలంటే, రకరకాల కోరికలు మన మనస్సులో తల ఎత్తకుండా చేయటం అవసరం. 

నిశ్చలమైన కుండలో  నీటిని చెదిరినప్పుడు అడుగున ఏమున్నది కనిపించినదు. మన ప్రతిబింబాన్ని కూడా అందులో చూడలేం. అలలు అణగారిపోయి, నీరు నిశ్చలంగా నిలబడినప్పుడే ప్రతీదీ మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
అలాగే..,
మనస్సు నిశ్చలమై నప్పుడే, మానవుడు తన మనస్సులోని అంతరాంతరాలలోని సత్య స్వరూపాన్ని గుర్తించగలుగుతారు. మనస్సున నిశ్చలత ఏర్పడనంతవరకూ, యదార్థతను గుర్తించగలిగినప్పటికీ  ఆనందం  లభించదు. అందుకని మానసిక  మైన ఆరాటపు అలలను పూర్తిగా ఆపగలిగితే, బాహ్యమై న ఏ భోగ వస్తువు యొక్క  సహాయం అక్కర్లేకుండానే వ్యక్తి ఆనందాన్ని అనుభవించగలడనేది సుస్పష్టం.

#అంతిమ #లక్ష్యం

నిజమైన ఆనందం బాహ్యవ వస్తువులలో గాక, తనలోనే ఉంటుందనే నిజాన్ని గుర్తించినప్పుడు మనిషి దృష్టి అంతర్ముఖమవుతుంది. అప్పుడు బాహ్యవస్తువుల యొక్క ఆకర్షణలు క్రమంగా సమసిపోతాయి. ఆ విధంగా
బాహ్య వస్తువుల ఆకర్షణల బంధనాల నుంచి విముక్తుడు అయినప్పుడు పూర్తిగా మోక్షాన్ని పొందుతాడు.అట్టి వ్యక్తి బాహ్య ప్రపంచంలో ఆనందాన్వేషణకై అర్రులు చాచి పరుగులు పెట్టడు. తనలో అలజడిని రేపే భౌతిక వాంఛల ఆరాటాలు అతనికి ఉండవు. యదార్ధ మైన శాశ్వత సుఖసంతోషాల కేంద్రం తనలోనే ఉందని కనుగొన్న అతడు సంపూర్ణమైన సంతృప్తినీ, పొందుతాడు. అట్టి ఆనందమే శాశ్వతం. అది అనంతమైనది
దాంతో పోల్చినపుడు, బాహ్య వస్తువుల ద్వారా పొందే సుఖసంతోషాలు నామమాత్రాలు.   అదే తుదకు చేరుకోవలసిన అత్యున్నత స్థితి. 'మోక్షం' అన్నా ముక్తి అన్నా అదే.

🙏ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో... ముఖ్యంగా మూడు అర్దంకాని ప్రశ్నలు మెదడును తోలుస్తూ ఉన్నాయి. 🙏
అవి... 

#1.దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? 
#2.దేవుడు ఎక్కడ ఉంటాడు? 
#3.దేవుడు ఏం చేస్తాడు? 

ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు ఎంత యోచించినా  సరైన సమాధానం దొరకలేదు.

తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై... పండితులను, 
శాస్త్రకారులను, 
మేధావులను ఆహ్వానించాడు.
తాను మూడు ప్రశ్నలు వేస్తానని, 
వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. 
సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. 
దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది.

ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు.
రాజాస్థానం చేరుకొన్నాడు. 
రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు.

పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు.... రాజుకో విషయం నిర్దేశం చేసాడు.
‘చెప్పేవాడు గురువు, 
వినేవాడు శిష్యుడు. 
గురువు పైన ఉండాలి, 
శిష్యుడు క్రింద ఉండాలి’ 
అని కండీషన్ పెట్టాడు . 

దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు. 
పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు. 

‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు పశువుల కాపరి. 

మొదటి ప్రశ్న
దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? 
దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు.

వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు.

మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు.
‘అన్నివైపులకు చూస్తుంది’ అని జవాబిచ్చాడు రాజు.

ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు.... పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మే.

మరి ఇక రెండవ ప్రశ్న.... 

దేవుడు ఎక్కడ ఉంటాడు? 
అన్నాడు రాజు.

‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’ అన్నాడు పశువుల కాపరి. 
పాలు తెచ్చారు.
‘మహారాజా ! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’ అని అడిగాడు.

‘పాలను బాగా మరుగబెట్టాలి. 
వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. 
పెరుగు సిద్ధం అవుతుంది. 
దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’ అన్నాడు రాజు.

‘సరిగ్గా చెప్పారు మహారాజా! 
అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, 
మనస్సు అనే తోడు వేసి, 
స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును, 
సాధన అనే కవ్వంతో చిలికితే 
జ్ఞానం అనే వెన్న వస్తుంది.
ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’అన్నాడు కాపరి.
సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.

ఇక చివరి ప్రశ్న. 
దేవుడు ఏం చేస్తాడు? అని.

నేను పశువుల కాపరిని, మీరు మహారాజు.
క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు. 
పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల.
సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, 
దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు.

సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. 
పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు.  

శుభం భూయాత్! 

మంచిని ఎక్కడ ఉన్న గ్రహిద్దాము..
మంచిని నేర్చుకుందాము..  
మంచిని
ఆచరించుదాము... 
మంచిని అందరికి పంచుదాము... 
మంచి పేరుతో మరణిద్దాము...🙏

#భారతీయులుగా #మనమందరం #ఆలోచించాల్సిన #మూడుప్రశ్నలు

1.ప్రపంచంలో అందరికన్న మన దేశంలో #లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు కదా మరి అటువంటప్పుడు ప్రపంచంలో అందరికన్న మనదేశం ఎక్కువ ధనవంతమైన దేశంగా ఉండాలి కదా అని. 

2. ప్రపంచంలో అందరికన్న మన దేశంలో #సరస్వతీ #దేవిని ఎక్కువగా పూజిస్తారు కదా మరి అటువంటప్పుడు ప్రపంచంలో అందరికన్న మనదేశం ఎక్కువ విద్యావంతమైన దేశంగా ఉండాలి కదా అని. 

3.ప్రపంచంలో అందరికన్న మన దేశంలో #పార్వతీ (శక్తిని) #దేవిని ఎక్కువగా పూజిస్తారు కదా మరి అటువంటప్పుడు ప్రపంచంలో అందరికన్న మనదేశం ఎక్కువ శక్తివంతమైన దేశంగా ఉండాలి కదా అని 

పై మూడు ప్రశ్నలు నిజమే అనిపిస్తుంది వరికైనా.
వాటికి సమాధానాలు చూద్దాము. 
 మొగలులు,అరబ్బులు,సుల్తానులు,బ్రిటిషువారు,పోర్చుగీసువారు మొదలైన విదేశీయులు, మన దేశాన్ని పాలించక ముందు మన దేశమే ప్రపంచం లో అన్నింటిలో గొప్పది గా ఉండేది.విదేశీ దండయాత్రల తర్వాత మన దేవాలయాలు, మన సంస్కృతి సంప్రదాయలు,ఆచారాల పైన  దాడులు చేసి మన అస్తిత్వాన్నే దెబ్బ తిసారు. అప్పటి నుంచే మన దేశం తన ప్రాభవాన్ని కోల్పోతూ వెనుక బడిన దేశంగా మారింది.     

1.అసలు #విదేశీయులు #మన #దేశానికి #ఎందుకు #వచ్చారు? 

మన దేశం లోని సంపద చూసి దోచుకోవడానికే అనేది జగమెరిగిన సత్యం. గజనీ మొహమ్మద్ గుజరాత్ లొని సోమనాధ మందిరాన్ని ధ్వంసం చేసినప్పుడు వాడు దోచుకున్న సంపదను వందలకొలది ఏనుగుల పైన గుర్రాల పైన బంగారం వజ్రాలు విలువైన రత్నాలుమొదలైనవి తరలించుకెల్లాడనేది చారిత్రక సత్యం.పూర్వం మనదేశంలో రత్నాలు వజ్రాలు అంగల్లలో రాసులుగా పోసి అమ్మేవారు. ఇప్పటికి చాలా దేవాలయాల లో అపారమైన సంపద ఉన్నట్టుగ మనకు తెలుసు.ఇప్పటికీ చాలా చోట్ల లంకె బిందెలు దొరుకుతూనే వున్నాయి.మీరు అలోచించితే ఇంకా ఎన్నో ఆధారాలు మీకు దొరుకుతాయి...
ఇది సరి పోతుందిగా ఒకప్పుడు ప్రపంచంలో మనదేశమే సంపదలో నంబర్ వన్ అని చెప్పాడనికి.    

2.#రెండువేలసంవత్సరాలకు పూర్వమే మన దేశం లో నలంద, తక్షశిల అనే #విశ్వవిద్యాలయాలు ఉండేవి అనేది జగమెరిగిన సత్యం.విదేశాలనుండి ఎందరో విద్యార్థులు భారత్ కు విద్యనభ్యసించడానికి వచ్చేవారు.
ఇప్పుడు ఉన్న రామాయణము,మహాభారతం,వేదాలు,అష్టాదశ పురాణాలు,సహస్రనామ స్త్రోత్రాలు ఇవన్ని ఎన్నివేల వేల  సంవత్సరాల క్రితంవో మీరు చెప్ప గలరా?.మీరు అలోచించితే ఇంకా ఎన్నో ఆధారాలు మీకు దొరుకుతాయి...
ఇది సరి పోతుందిగా ఒకప్పుడు ప్రపంచంలో మనదేశమే విద్యలో నంబర్ వన్ అని చెప్పాడనికి.

3.ప్రపంచం లో అత్యంత శక్తివతమైన దేశం మనదే.కాదా? #ప్రపంచాన్నే #జయించిన #అలెక్జాండెర్ చివరికి మన #పురుశోత్తముని #చేతిలో #ఓడిపోయి అవమాన భారం తో ఆత్మహత్య చేసుకున్నాడు కదా.విదేశీయులు మన దేశంపై   దండెత్తినపుడు  వారి శక్తి సరిపోక మన రాజుల మధ్యనే విభేదాలు సృష్టించి కొందరు మన రాజులను వారివైపుకి తిప్పుకొని దేశాన్ని ఆక్రమించినది నిజం కదా?
 భారత యుద్దంలో ఉపయోగించిన అస్త్ర శస్తాలు వజ్రాయుధం,పాశుపతాస్త్రం,బ్రహ్మాస్త్రం ఆగ్నెయాస్త్రం,వారుణాస్త్రం ఇంకా ఎన్నో రకాల అస్త్రాలు ఉపయోగించారు. కురుక్షేస్త్ర యుద్దం,రామ రావణ యుద్దం జరిగిన చోట ఇప్పటికి గడ్డి కూడ మొలవక పోవడానికి కారణం అక్కడ అణ్వస్త్రాలు ఉపయోగించారని అని తేల్చారు.మీరు అలోచించితే ఇంకా ఎన్నో ఆధారాలు మీకు దొరుకుతాయి...ఇది సరి పోతుందిగా ఒకప్పుడు ప్రపంచంలో మనదేశమే శక్తిలో నంబర్ వన్ అని చెప్పాడనికి..... 
 
ఇంకా వేలవేల సంవత్సరాల క్రితమే పుష్పక విమానాలు, అద్భుత నిర్మాణాలు,పట్టు వస్త్రాలు,బంగారు  ఆభరణాలు,ఆయుర్వేదం,మంత్ర తంత్రాలు,ఖగోల(జ్యోతిష) శాస్త్రం ఏవిధంగా చూసినా ఒకప్పుడు మన భారత దేశం  ప్రపంచం లోనే నంబర్ వన్....

మరి ఇప్పుడు మనం మన నిజచరిత్రను తెలుసుకొని మన  సంస్కృతిని కాపాడుకుంటూ చైనా,పాకిస్తాన్,విదెశీ మత సంస్థల(వీరి అనుయాయులు మన దేశం లో చాలామంది ఉన్నారు)  భారత దేశ విచ్చిన్న కుట్రల కు మోసపోకుండా ఉంటే మన దేశం అతి త్వరలోనే తిరిగి ప్రపంచం లోనె అన్ని రంగాలలో నంబర్ స్థానానికి చేరుకుంటుంది.
#భారత్ #మాతా #కి #జై.
#జై #హింద్.



#త్యాగ #భావనే #హిందుత్వం
దుర్లభం త్రయమేవాత్ర 
దైవానుగ్రహ హేతవః
మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః

సృష్టిలో అత్యంత దుర్లభమైనవి మూడు విషయాలు – అవి 
#మానవజన్మ, 
#మోక్షప్రాప్తి, 
#మహాపురుషులసాంగత్యం.  
– ఆదిశంకరాచార్య

మానవ జన్మ సర్వశ్రేష్ఠమైనది. ఆత్మ 84 జీవరాశుల గుండా ప్రయాణించి ఎప్పుడో ఒకప్పుడు మానవ శరీరంలో చేరుతుంది. బుద్ధిజీవి అయిన మానవుడు ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. సుఖ శాంతులతో జీవించాలి. అందుకే ఈ ప్రపంచంలోని మేధావులు మానవ సంక్షేమం కోసం అనేక రకాలుగా శోధించారు. అందులో నుండే వివిధ మతాలు, సిద్ధాంతాలు, తత్వాలు, సంపద్రాయాలు పుట్టు కొచ్చాయి.

#ధర్మమే #శాశ్వతం

ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద సిద్ధాంతాలైన #కమ్యూనిజం, #క్యాపిటలిజం కూడా సుఖశాంతుల కోసం వ్యక్తి స్వేచ్ఛను, భౌతికవాదాన్ని గురించి చెప్పాయి. అయితే అవి విఫలం అయ్యాయి. జీవితానికి సంపదలు, సుఖశాంతులే కాదు, అరుదైన ఈ మానవజన్మకు సార్థకత కావాలి. మానవ జన్మ అరుదైనది కనుక అన్ని సుఖాలు ఈ జన్మలోనే పొందాలని పాశ్చాత్యులు అనుకుంటారు. కానీ మనం
చలం చిత్తం చలం విత్తం చలే జీవన యౌవనే
చలా చలే హి సంసారే ధర్మ ఏకో హి నిశ్చలః
చిత్తం (మనస్సు), విత్తం (ధనం), యవ్వనం, జీవితం చివరికి ప్రపంచం కూడ శాశ్వతం కాదు. ధర్మం మాత్రమే శాశ్వతం అని భావించాము. అందుకే సంపన్నులను, ధనవంతులను గొప్పవారిగా మనం భావించలేదు. ధనం శాశ్వతం కూడా కాదు. అందుకే అలెగ్జాండర్‌ ‘తాను మరణించాక, తన శవపేటికకు రెండు రంధ్రాలు చేసి తన ఖాళీ చేతులు బైటికి కనపడే విధంగా ప్రపంచానికి చూపండి’ అన్నాడు’. ‘అంతపెద్ద రాజు అయుండి కూడా మరణించాక ఖాళీ చేతులతోనే వెళుతున్నాడు కానీ, ఒక్క పైసా కూడా పట్టుకుపోవడంలేదు’ అని దానర్థం.
యయాతి అనే రాజు విలాస జీవితం కోసం తన కుమారుని యవ్వనాన్ని కూడా అడిగి తీసుకున్నాడు. కానీ చివరికి ఆనందం పొందలేక పోయాడు. కనుక యవ్వనం కూడా శాశ్వతం కాదు.
జీవితం కూడా బుద్బుధ ప్రాయం. ‘రేపు’ అనేది ఎలా ఉంటుందో తెలియదు. ధర్మరాజు జీవితంలోని ఒక సంఘటన మనకు అదే చెబుతుంది. తన దగ్గరకు వచ్చిన భిక్షకునికి దానం ఇవ్వడానికి మరుసటి రోజు రమ్మని ధర్మరాజు చెప్పాడు. అది విని భీముడు ఆశ్చర్యపోతాడు. ‘అన్నా ! రేపటి వరకు నీవు మృత్యువును జయించావా?’ అని అడగడంలోని అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి.

#త్యాగానికి #ప్రతీక

అందుకే భారతీయులు భోగమయ జీవనం కోరలేదు. త్యాగమయ జీవనాన్ని స్వీకరించారు. ప్రతి సమాజానికి తనదంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆంగ్లేయులు క్రమశిక్షణకు, జర్మన్లు యుద్ధ నిపుణతకు ప్రతీకలు. మన భారతీయులు త్యాగం, సమర్పణ భావాలకు ప్రతీకలు. మన జీవన తత్త్వంలోనే త్యాగం, సమర్పణ సహజంగా కనిపిస్తుంటాయి.
న ప్రజేయా న కర్మణా న ధనేన
త్యాగేనైక అమృతత్వ మానశుః
అనేది ఉపనిషత్తు వాక్యం. జీవితం అమృతమయం కావడమంటే, త్యాగ మయం కావడం తప్ప మరేది కాదు.

మన జీవన పరంపర యజ్ఞభావనతో ముడిపడి ఉంది. యజ్ఞం అంటే సమర్పణ. సమ-అర్పణ. ఇతరులకు అర్పించడం. యజ్ఞం అదే నేర్పిస్తుంది. సమిధలన్నింటిని అగ్ని దేవునికి ఆహుతి ఇస్తూ ‘ఇదం న మమ. ఇదం స్వాహా’ ‘ఇది నాది కాదు, ఇది నీకు అర్పిస్తున్నాను) అంటుంటారు.
‘తేన త్యక్తేన భుంజీతాః’ అనేది మన ఉపనిషత్తులలో చెప్పిన మరొక విషయం. ఈ సృష్టి సమస్తం ఈశ్వరత్వం వ్యాపించి ఉన్నది. నాదంటూ ఏమీ లేదు. నాకు అవసరమైనంత మేరకు మాత్రమే నేను అనుభ విస్తాను. అది కూడా త్యాగమయ భావనతోనే. అంతకన్నా ఎక్కువగా స్వీకరించడం తగదు. ఈ త్యాగం, సమర్పణ అనేవి అత్యుత్తమ సంస్కారాలు. హైందవ జీవనంలో అతి సహజంగా ఇవి అలవడేలా వ్యవస్థ రూపుదిద్దుకుంది.
మన దేశంలో అత్యంత విశేషమైనది కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఒకరి కోసం ఒకరు జీవిస్తారు. ప్రతి ఒక్కరు ఇంకొకరి సంక్షేమం ఆకాంక్షిస్తారు. తమకు లేకున్నా కుటుంబంలోని ఇతరులు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ”నా ఇల్లు’ నుండి ప్రారంభించి నా బస్తి, నా గ్రామం, నా దేశం, ఈ ప్రపంచం’ అంతా ఒక్కటనే భావన వికసించాలనేది మన ఆకాంక్ష. అందుకే ‘ఈ భూమి అంతా ఒక్కటే కుటుంబం (వసుధైక కుటుంబం)’ అని ధ్యేయవాక్యంగా ఉపయోగిస్తాం.
ధర్మరక్షణార్థం తన వెన్నెముకను ధారపోసాడు ధధీచి. ఒక పక్షి కోసం తన శరీరం మొత్తం అర్పించాడు శిబి చక్రవర్తి. ప్రాణుల బాధలు తొలగించడానికి సర్వస్వార్పణ చేసాడు మహారాజు రంతిదేవుడు. తనదంతా సమర్పించడానికి సర్వదక్షిణ యాగం చేశాడు రఘుమహారాజు. స్వధర్మ సంరక్షణకు రాజ భోగాలను వదిలి అడవులపాలై కష్టాలను సహించాడు రాణాప్రతాప్‌. సమస్త రాజ్యానికి తాను కేవలం ప్రతినిధిని అని, తన గురువైన సమర్థ రామదాసు రాజు అని ప్రకటించిన ఛత్రపతి శివాజీ, ఐసిఎస్‌ చదువును స్వతంత్ర సమరం కోసం తృణప్రాయంగా త్యజించిన నేతాజీ, యౌవ్వనాన్ని వందేళ్ళ జీవితంగా భావించి తనను తానుగా అర్పించుకొన్న భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, మదన్‌లాల్‌ ధీంగ్రా, ఖుదిరాంబోసు; అతి పేదరికంలో వైద్య విద్యను చదివి, తన గురించి ఆలోచించ కూండా జీవితాన్ని గంధపు చెక్కలా అరగదీసిన యుగద్రష్ట డాక్టర్‌ హెడ్గేవార్‌.. ఇలా రాస్తూ పోతే మనదేశంలో ఇటువంటి త్యాగధనుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.

#అదే #హిందుత్వం

స్వభావరీత్యా మనుషుల్ని 4 రకాలుగా భావించవచ్చు. మొదటివారు రాక్షసులు. వీరికి అన్నీ ఉంటాయి. అవి ఇతరులకు ఉంటే సహించలేరు. ఇతరులు ఎదుగు తూంటే పీడిస్తూ ఆనందిస్తారు. రెండవవారు పశుప్రవృత్తి కలిగినవారు. ఈ వర్గంవారు తమకు తాము సంపాదించు కొని జీవిస్తారు. ఇతరుల దగ్గర లాక్కొని తాము బ్రతుకుతూ ఉంటారు. మూడవ వారు మానవులు. తాము జీవిస్తూ ఇతరులకు సహకరిస్తారు. నాలుగవారు నారాయణులు. తమకు ఏమీ లేకున్నా, ఎన్ని కష్టాలున్నా, ఇతరులకు మేలుచేసి, వారు సుఖంగా ఉంటే వీరు ఆనందిస్తారు.
మనుషులలో రాక్షస, పశు ప్రవృత్తులు ప్రబలకుండా, మానవత్వం వైపు నడిపించి, అక్కడి నుండి నారాయణ స్వరూపులుగా మార్చే ప్రయత్నమే హిందుత్వం.

#సమర్పణ

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘం ఈ హిందుత్వం ఆధారంగా జాతి వైభవాన్ని పునర్నిర్మాణం చేయడానికి పరిశ్రమిస్తున్నది. అందుకు వ్యక్తి వ్యక్తిని కలిసి, స్వయంసేవకులుగా తయారు చేస్తూ, వారిలో త్యాగం, సమర్పణ భావాలను పెంపొందిస్తున్నది. దానికి మార్గమే గురుదక్షిణ కార్యక్రమం.

వ్యక్తి శాఖకు రావడంతోనే త్యాగం, సమర్పణ అలవడటం ప్రారంభం అవుతుంది. 24 గంటలలో 23 గంటలు తనకు, ఒక గంట సమాజం కొరకు అనే ఈ భావన స్వయంసేవకులను ఎలాంటి త్యాగానికైనా సంసిద్ధం చేస్తుంది. అలా ఒక గంటతో ప్రారంభించి అనేక గంటలు, రోజులు, సంవత్సరాల తరబడి సమాజ సేవలో స్వయం సేవకులు మునిగి తేలుతుంటారు. నవ యువకులు విద్యాభ్యాసం పూర్తిచేసుకొని తమ జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని కేటాయించి ప్రచారకులుగా పని చేస్తుంటారు. అలా యవ్వనంలో భవిష్యత్‌ గురించి ఆలోచించకుండా, వివాహం, కుటుంబం వంటి సౌకర్యాలు లేకుండా, ఏ కీర్తినీ ఆశించకుండా, పేరు ప్రతిష్ఠలు కోరకుండా, ఎలా అంటే అలా, ఎక్కడ అంటే అక్కడ పనిచేస్తుంటారు. ఇది ఒక అద్భుతం. వెను తిరుగకుండా సంపూర్ణ జీవితం సమర్పించేవారు కూడా ఉన్నారు. సమాజంలో అన్నింటి మధ్య జీవిస్తూ, సన్యాస జీవితం గడపడంకన్నా త్యాగం ఏముంటుంది ?
అలాగే అనేకమంది గృహస్థు కార్యకర్తలు తమ వృత్తి, వ్యవహారాలు చూసుకొంటూ సమాజం కోసం అధిక సమయం ఇస్తూ పని చేస్తుంటారు. ఎట్టి అవకాశాలు కోరుకోకుండా ఉన్నదాంట్లోనే సరిపెట్టుకుంటారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇరుగు పొరుగు వారు అధికంగా సంపాదిస్తూ ముందుకు పోతున్నా వారిని చూసి చలించిపోరు. కుటుంబం కోసం తగినంత సమయాన్ని కేటాయిస్తూ, గృహస్థాశ్రమాన్ని సమర్థంగా నిర్వహించుకొంటూ, సంఘ కార్యానికి ఏ మాత్రం తగ్గకుండా సమయం కేటాయించి పనిచేసే లక్షలాది కార్యకర్తలు ఉన్నారు.
‘ధనం, సంపద మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ కాలం మళ్ళీరాదు’ అనుకొంటూ స్వయం సేవకులు ధనంతోపాటు అత్యంత విలువైన సమయం కూడా సమర్పిస్తారు. సమాజం కోసం తమ ఇష్టాలను పక్కనపెట్టి, నిష్కామంగా సంపూర్ణ మనస్సుతో అన్ని పనులు చేస్తారు. దీనినే తను, మన, ధన సమర్పణ అంటాం.

#గురుదక్షిణ

గురుదక్షిణ ఉత్సవం వ్యక్తిలో ఇటువంటి ఉన్నత భావాలు నిర్మాణం చేస్తుంది. ప్రతి సంవత్సరం స్వయంసేవకులు తను, మన, ధన పూర్వకంగా సమర్పణ చేస్తూ, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంత ముందుకెళ్ళామనేది సమీక్షించు కుంటూ ఉంటారు.
గురుదక్షిణ అనేది చందానో, సభ్యత్వమో, దానమో కాదు. అది సమర్పణ. స్వయంసేవకులు దానిని త్యాగం కన్న కర్తవ్యంగా భావిస్తారు. నిరహంకారంతో, నిస్వార్థ బుద్ధితో, నిజాయితీతో, భక్తి శ్రద్ధలతో, పరమ పవిత్ర భగవాధ్వజం ముందు మోకరిల్లి తమను తాము సమర్పించుకుంటారు. ‘పతత్వేష కాయో’ అంటూ చిట్టచివరి శ్వాస వరకు ఈ భాగ్యం కలగాలని కోరుకుంటూంటారు.
స్వయంసేవకులు గురుపూజలో ఇలా ఆకాంక్షిస్తారు..
తన్‌ సమర్పిత మన్‌ సమర్పిత
ఔర్‌ యహ జీవన్‌ సమర్పిత
ఛాహతా హు దేశ్‌ కే ఔర్‌ భీ కుచ్‌ దూఁగా
ఓ భారతమాత ! నా తనువు, మనస్సు, ధనము మరియు సంపూర్ణ జీవితం నీకే అంకితం. ఓ భగవంతుడా నాకింకా తృప్తి లేదు. ఈ దేశమాతకు ఇవ్వడానికి నాకు మరికొంత ఇవ్వు.



Comments

Popular posts from this blog

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు