ఉపాధ్యాయ దినోత్సవం


*ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం...*

నాలుగు గోడల మధ్య పౌర సమాజాన్ని తీర్చిదిద్దే రూపశిల్పి గురువు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్‌ అయిదో తేదీన మనం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. దేశంలో కేజీ నుంచి పీజీ వరకు 15 లక్షల విద్యాలయాల్లో 32 కోట్ల మంది విద్యార్థులకు జ్ఞానధార ప్రబోధిస్తున్న 95 లక్షలమంది గురువుల పండగ ఇది. ఎన్ని రకాల విద్యా విధానాలున్నా ఉపాధ్యాయుడే విద్యార్థికి విలువైన గ్రంథం. 

ఉపాధ్యాయుని గొప్పతనం గురించి కబీర్ దాస్ మాటల్లో..

*Teacher and God both are standing before me.. Whome should I pay obeisance..?? I bow to my teacher who guides me to God..*

యునెస్కో 1994 నుంచి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తోంది. ఏటా అక్టోబర్‌ అయిదున దీన్ని ప్రపంచమంతటా జరుపుతోంది. సమాజానికి అవసరమయ్యే శాస్త్రవేత్త, వైద్యుడు, ఇంజినీర్‌, సిపాయి, అధికారి, న్యాయవాది తదితర నిపుణులు తయారయ్యేది గురువుల చేతుల్లోనే. *ఉపాధ్యాయులు మానవ వనరుల సృష్టికర్తలు....* ఉపాధ్యాయ వృత్తి పొట్టకూటి కోసం చేసే సాధారణ ఉద్యోగం కాదు. అది విలువలతో కూడిన సామాజిక బాధ్యత కలిగిన గౌరవప్రదమైన వృత్తి.
పూర్వం విద్య గురుకేంద్రంగా ఉండేది. అంటే గురువు చెప్పిందే విద్య. తరవాతి తరాల్లో విద్య విషయ కేంద్రంగా మారింది. నిర్దేశించిన విషయాన్ని గురువులు ఆకళింపజేసుకుని విద్యార్థులకు బోధించేవారు. ఇక్కడి నుంచే గురువుల ప్రభావం కొంచెం తగ్గింది. కాలానుగుణంగా విద్యా విధానాల్లో అనేక మార్పులు, సంస్కరణలు చోటు చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు శిశు కేంద్ర విద్యావిధానమే నడుస్తోంది. అంటే విద్యార్థి దేనిపై మక్కువ చూపిస్తాడో ఉపాధ్యాయుడు తెలుసుకొని తదనుగుణంగా చదువు చెప్పాలి. నేర్పు, ఓర్పు అంతకుమించి అభిలాష ఉన్నవాళ్లే ఈ వృత్తిలో రాణిస్తారు. 

*‘సాధారణ టీచర్‌ పిల్లలకు బోధిస్తారు, మంచి టీచర్‌ పిల్లలకు వివరిస్తారు, కానీ ఉత్తమ టీచర్‌ పిల్లల్ని ప్రభావితం చేస్తారు’ అనేది ఉపాధ్యాయ శిక్షణలో తొలి సూత్రం.*

ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడే బోధనా ప్రక్రియ విజయవంతమవుతుంది. ప్రతి వ్యక్తికీ జీవితంలో ఎవరో ఒక గురువు స్ఫూర్తి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి అత్యంత ఉత్తమమైనదని అరిస్టాటిల్‌, గాంధీజీ, ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వంటివారు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. ‘ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలిస్తే సమాజం సుసంపన్నమవుతుంది. గురుశిష్యులకు మధ్య జ్ఞాన ప్రసార సంబంధం ఉన్నతంగా ఉన్నప్పుడే దేశం విలువలతో విలసిల్లుతుంది’ అనేవారు సర్వేపల్లి. బడుల్లో నీతికథలు, పద్యాలు, వాచకాలు, ఉపవాచకాల ద్వారా నైతిక విలువలు అందిస్తూనే ఉన్నా సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతూనే ఉన్నాయి. అంటే విద్యార్థుల్లో నైతిక మార్పునకు కావలసినంత పరిజ్ఞానం అందడం లేదని అర్థమవుతోంది. 

చదువులు- ర్యాంకులు, మార్కుల పోటీ పందేలుగా మారాయి. ఎప్పుడైతే గురుభావం సన్నగిల్లిందో విద్యార్థులకు వారిపై భక్తి, గౌరవం తగ్గుతోంది. ఉపాధ్యాయులకు గౌరవం దక్కితేనే విద్యార్థుల్లో విలువలు, సమాజంలో నైతికత ఏర్పడతాయన్నది విద్యావేత్తల అభిప్రాయం. 

*సర్వేపల్లి ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశ అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పదవిని అలంకరించగా డాక్టర్‌ ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం రాష్ట్రపతి పదవి అనంతరం ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. మన దేశంలో ఉపాధ్యాయ వృత్తికున్న ఔన్నత్యమది.*
*Teacher should update and upgrade burning of the lamp learning of the teacher is must....*

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వస్తున్న మార్పులు గ్రహిస్తూ, అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొన్నవారే ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతారు. మాతృభాషలో బోధించిన ఉపాధ్యాయులకు అరకొర శిక్షణతో ఆంగ్లమాధ్యమంలో పాఠాలు చెప్పాలనడం పెద్ద సవాలుగా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులూ పిల్లల్లో పరిపూర్ణ మూర్తిమత్వాన్ని కాకుండా కార్పొరేట్‌ విద్యాసంస్థల తరహాలో మార్కులే ఆశిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు లేకపోవడం పెద్ద అవరోధంగా మారింది. 

సామాజిక మాధ్యమాల ప్రభావంతో పిల్లలు విపరీత ధోరణులతో ప్రవర్తించడం ద్వారా బోధనా ప్రక్రియకు అవరోధం కలిగిస్తున్నారు. ఆన్‌లైన్‌ బోధన, దూరవిద్య విద్యార్థుల్లో గురువులపట్ల గౌరవాన్ని బలహీన పరుస్తున్నాయి. అభిముఖ బోధనలో ఎన్నో విలువలు ఉంటాయి. ప్రత్యక్షంగా గురువును చూసి విద్యార్థి చాలా నేర్చుకుంటాడు. గురువులు పాఠాలతోపాటు విలువలు రంగరిస్తారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచుతారు. నైపుణ్యం అలవడేలా చేస్తారు. పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తారు. అలాంటి గురువు గౌరవానికి పూర్వవైభవం దక్కినప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది.

*ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో......*🙏🙏🙏🙏🙏🙏

*Kabir:* 
Teacher and God both are standing before me.
Whom should I pay obedience? I bow to my teacher who guides me to God.

*"గురుభావం, శిష్య వాత్సల్యం నిండి నప్పుడే జాతికి ప్రగతి"*  అని చాటిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నేడు.
దేశ ప్రథమ ఉప రాష్ట్రపతిగా రెండు రాష్ట్రపతిగా దేశానికి అమూల్య సేవలందించిన సర్వేపల్లి అచ్చమైన  గురుత్వానికి ప్రతీక.

సామాజిక వాస్తవాల్ని తెలియజేసేదే చదువు.దాన్ని బోధించే వ్యక్తి నేర్చుకునే శిష్యుడికి ఆదర్శంగా ఉండాలి. చెప్పేది ఒకటి చేసేది మరొకటి గా ఉంటే ఏ ఉపాధ్యాయిని ఏ విద్యార్థి నమ్మడు.

రెండో ప్రపంచ యుద్ధంలో హీరోషిమా,నాగసాకి ప్రాంతాలపై బాంబు దాడి జరిగింది. జపాన్ దేశం అత్యంత నష్టానికి గురైంది. తదనంతరం జపాన్ అధికార యంత్రాంగం తమ దేశ పునర్నిర్మాణం గురించి ప్రణాళికలను తయారు చేసింది. ఆ దేశం మేధావుల్లో 25 శాతం మంది నీ ఉపాధ్యాయ వృత్తికి తరలించడం ఆ ప్రణాళికలో ఒక భాగం. *భవిష్యత్తు తరాల నిర్మాణానికి జపాన్ ప్రభుత్వం ఉపాధ్యాయ వృత్తికి ఇచ్చిన ప్రాధాన్యత ఈరోజు మనమందరం ఆలోచించదగినది.*

ఉపాధ్యాయులు అనేవారు నెల నెల జీతాల కోసం మాత్రమే పనిచేసే వారు కాదు....,
దేశభవిష్యత్ తరాల అవసరాలకు కావాల్సిన విధంగా జీవితాలను రూపొందించే దేశ నిర్మాతలు.

వైద్యుని ద్వారా పొరపాటు జరిగితే
మరింత ఆధునాతనమైన చికిత్స ద్వారా పూర్తి చేయవచ్చు. 
లాయర్ ద్వారా పొరపాటు జరిగితే అప్పీలు చేసుకోవచ్చు. 
కానీ....,
ఉపాధ్యాయుల ద్వారా జరిగే పొరపాట్లు భవిష్యత్తు సమాజానికి హాని కలిగిస్తాయి దీనిని ఎవరు భర్తీ చెయ్యలేరు.

అందుకే,
*Teacher should update and upgrade. Burning of the lamp learning of the teacher is must.*

బోధకుడు కి ఉండాల్సిన తొలి లక్షణం ముందుగా తాను చదవడం. 

*the teacher can never teach truly... unless he is still learning himself.*

చదివిన వాటిని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడం మరో సుగుణం.

*హార్వర్డ్ వర్సిటీ స్థాపక లక్ష్యం సత్య పరిరక్షణ*
*హిడెల్ బర్గ్ విశ్వవిద్యాలయ నినాదం నిత్య చైతన్య*

జ్ఞానాన్ని ఎంతవరకు పుస్తకాన్ని నేర్పుతాయి.కాని ఆ జ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకోవడం నేర్పాల్సినది ఉపాధ్యాయుడే...,
దేశంలో  విజ్ఞానానికి లోటు లేదు దాన్ని జీవితానికి అన్వయించుకోవడ మే అసలైన తెలివి.

నేటి కాలంలో ప్రతి ఒక్కరం ఆత్మ విమర్శ చేసుకోవాలి..., హక్కుల కోసం మన పోరాటం ఎంత ముఖ్యమో, విధుల నిర్వహణలో కూడా మన బాధ్యతను గుర్తెరిగి మసలుకోవాలి. 

సమీక్షించుకోవాలి అనే పదాన్ని ఇష్టపడని వారు ఎంతోమంది ఉంటారు.అలాంటివారు తెలుసుకోవాల్సింది తెలిసి ఆచరణకు చేయాల్సింది ఒక్కటే నిబద్ధత.
అది అంటూ ఉన్నప్పుడు ఉపాధ్యాయ వృత్తిని మించింది ప్రపంచంలో మరేదీ కనిపించదు.

రంగు, రూపము, వాసన అనే మూడు సుగుణాలున్న మకరందము లేని కారణంగా సీతాకోకచిలుక  సంపెంగ పువ్వు వద్దకు రాదు.
అలాగే 24 విద్యలు, 64 కళల్లో మంచి పాండిత్యం ఉన్న  మనసులో వృత్తిపట్ల నిబద్ధత లేకపోతే మంచి ఉపాధ్యాయుడు కాలేడు.
సాక్షాత్తు చదువుల తల్లి  సరస్వతీ మాత కూడా అధ్యాయాన్ని ఆపలేదు చేతిలో పుస్తకమే అందుకు తార్కాణం.

అందుకే సమాచారంతోపాటు స్ఫూర్తిని కూడా అందజేసే వాడే సరి అయిన ఉపాధ్యాయులు.

ఆధునిక ప్రపంచం విసురుతున్న సవాళ్లను దీటుగా విద్యార్థులను సన్నద్ధం చేయాలంటే అన్ని విషయాలపై అవగాహన ఉన్న పరిపూర్ణ గురువు కావాలి. ఏ దేశ సర్వతోముఖ వికాసం అయినా ఆ దేశ యువతరం మీదే ఆధారపడి ఉంటుంది.దారి దీపాలు గా మారి యువతరాన్ని చేయిపట్టుకుని సరైన దారిలో నడిపించే గురువులు ఏ దేశానికైనా వెలకట్టలేని ఆస్తి..,
ఇలాంటి మహోన్నత వ్యక్తిత్వాన్ని పొందిన కారణంగానే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని మనం ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.

*సంప్రదాయ పాఠ్యాంశాలు ,పాత చింతకాయ పచ్చడి పద్ధతులతో ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం కుదిరే పని కాదు.*

కంప్యూటర్ ప్రాథమిక వినియోగంపై శిక్షణ వంటి పురాతన విధానాల కే పరిమితం కాకుండా 
సమస్య పరిష్కారం, భావవ్యక్తీకరణ,
సమన్వయ సాధన 
సృజనాత్మకత వంటి కొత్త తరం నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పించాలి. 

ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రధాన సమస్య నిరుద్యోగిత అయితే అర్హతల కంటే తక్కువ స్థాయి ఉద్యోగాలు చేసుకునే వారి సంఖ్య పెరగడం నేడు ఆందోళన కలిగిస్తుంది. మారుతున్న అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు ఉన్న యువత కనుచూపుమేర  కనిపించకపోవడమే సంక్షోభానికి కారణం.

ఉపాధికి నైపుణ్యాలకు మధ్య విస్తరించిన ఈ అగాధాన్ని మార్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది.
ఆచరణాత్మక విద్య నేటి ప్రాథమిక అవసరం.

కుర్చీలకు మాత్రమే పరిమితమై పుస్తకాల్లోని విషయాలను బట్టి పట్టించే చదువులకు స్వస్తి పలకాలి. ఏ ప్రశ్నకైనా ఒకే జవాబు ఉంటుంది అన్న ధోరణిలో ఇన్నాళ్లు విద్యార్థులకు పాఠాలు చెప్పారు.., చెప్పాము.కానీ ఒకే సమస్యకు అనేక పరిష్కారాలు అన్వేషించ గల సామర్థ్యం విద్యార్థుల్లో పెరగాలంటే విమర్శనాత్మక, విశ్లేషణాత్మక దృక్పథం పెంపొందాలి.అందుకు తరగతి గదుల్లోనే పునాది పడాలి.

అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా, ఘాటుగా వ్యక్తం చేయడం ఆధునిక ప్రపంచ మౌలిక అవసరంగా మారింది. సరైన సాధన శిక్షణ తో ఎవరైనా అద్భుతమైన వక్తలుగా తమను తాము మలుచుకోవచ్చు. విద్యార్థుల 
భావవ్యక్తీకరణ సామర్థ్యాలకు సాన పట్టడం పై ఉపాధ్యాయులు గట్టి కృషి చేయాలి.

సమాచారం కోసం అంతర్జాలంలోని కోట్ల సంఖ్యలో వెబ్సైట్ల వలలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి కాకుండా సూటిగా నిర్దిష్టంగా తమకు కావాల్సిన విషయం రాబట్టు కోళ్ల ఓడుపు నేర్పించాలి. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం పైన ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.

అపారమైన సృజనాత్మకత పిల్లల సొంతం కానీ విద్యార్థుల్లో ఆసక్తి కలిగించే స్థాయిలో మన విద్యావిధానం ఉండడం లేదు
పిల్లల్లోని తెలుసుకోవాలన్న తపన సృజనాత్మకతను పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత టీచర్ల పైన ఉన్నది.

చదువు ముగించుకుని బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టాక ఎదురయ్యే సమస్యలను ధీటుగా ఎదుర్కొనే ధైర్యాన్ని విద్యార్థులకు ప్రసాదించిన బాధ్యత గురువుల మీదే ఉంది.

అదేవిధంగా చదువులతో పాటు విద్యార్థుల శారీరక మానసిక వికాసం పై దృష్టి పెట్టిన అప్పుడే పరిపూర్ణమైన భారతం ఆవిష్కృతమవుతుంది.

*కాలం మారుతుంది అంటారు కానీ మనుషులే మారుతున్నారు.., కాలం మారడం ప్రకృతి స్వభావం...*
*సమాజ హితానికి ఉపయోగపడేదే మంచి మార్పు. దాన్ని ముందుగానే గమనించగలం ప్రజ్ఞ..,*
*ఈ ప్రజ్ఞను కలిగి ఉండడమే ఉత్తమ ఉపాధ్యాయుడిగా  పరిగణన పొందడానికి ఉండాల్సిన ప్రధాన అర్హత*

*లేకపోతే ఉత్త ఉపాధ్యాయుడు గాని ఉండిపోవాల్సి వస్తుంది*

*నేటి ప్రపంచంలో విధానాలు ఉన్నాయి వాటి స్థాయిలో విలువలు లేవు.సాంప్రదాయాలను పోగు పడ్డాయి వాటిలోని గుణగణాల్ని తూకం చేసే శక్తిని మాత్రం కొరవడ్డాయి. ఇది నిజంగా వైపరీత్యమే.*

*దీన్ని అడ్డుకునే సత్తా, సత్తువ విద్యకే ఉంది.అందుకే గురువులు పాఠాలు చెప్పాల్సింది పుస్తకాల నుంచి కాదు జీవితాల నుంచి.*
*విలువలు నేర్పితే ఆ క్రమంలో పుస్తకాలని నేస్తాలు గా మారిస్తే చదువులు వర్ధిల్లుతాయి.*

విద్యార్థులను నాణ్యమైన మానవ వనరులుగా తీర్చి దిద్దే క్రమంలో ఉపాధ్యాయులు చేసే కృషి దేశానికి అసలైన పెట్టుబడి.

*భారత్ మాతాకీ జై*

✍✍🕉

Teacher should update and upgrade burning of the lamp learning of the teacher is must

A guru teach lessons from the past reveals the present and shape the future

A good education can change anyone a good teacher can change everything

Tell me and I forget
Show me and I remember
Involve me and I understand

The world's should speak and the stones should sing

The teacher can never teach truly unless he is still learning himself.

Teacher and got both are standing before me. Whom should I pay obeisience?
I bow to my teacher who guides me to God.




Comments

Popular posts from this blog

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)