తెలంగాణ విమోచన దినోత్సవ ప్రత్యేక వ్యాసాలు
తెలంగాణ విమోచన దినోత్సవ #ప్రత్యేక #వ్యాసాలు..
"నిజామనగ #ఎంతరా ...
వాడి #తహతెంతరా...
అంతగలసి #తంతెమల్ల వాడి #అంతులేదురా.......
నవయుగంబున నాజీ #నగ్ననృత్యమింకెన్నాళ్ళు ......
హింసపాపమని యెంచు దేశమున #హిట్లరిత్వమింకెన్నాళ్ళు."
- కాళోజి
తెలంగాణ విమోచనోద్యమం - 1
◆నిజాం సంస్థానం
◆నిజాం పాలనలో సామాన్య జనాల పై ఆకృత్యాలు
◆నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు..
#నిజాంనిరంకుశత్వపాలననుండి #విముక్తిపొంది
#స్వాతంత్ర్యభారతావనిలో #కలిసిమోగింది
#నా #రతనాల #వీణ...
#సెప్టెంబర్17 #తెలంగాణ #విమోచనదినోత్సవ #శుభాకాంక్షలు.
హైదరాబాదు సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధపోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామికవాదుల, రచయితల, ప్రజల సంఘటిత క్రమ-పరిణామపోరాటమది. హైదరాబాదు సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగలబెట్టడం నానా అరాచకాలు సృష్టించారు. అతని మతోన్మాద చర్యలు కోరలాల్చి వెయ్యి నాల్కలతో విషంకక్కాయి.హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. దీనితో రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, సామాన్య ప్రజలు ప్రారంభించిన సాయుధపోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది. రావి నారాయణరెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, షోయబుల్లాఖాన, సురవరం ప్రతాపరెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాటయోధులు వారికి స్ఫూర్తినిచ్చే కవులు, రచయితలు మూలంగా 1948లో ఉధృతరూపం దాల్చి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 18న భారత్ యూనియన్‌లో విలీనం చేసుకుంది.
*తెలంగాణ విమోచన దినోత్సవ ప్రత్యేక వ్యాసాలు - 2*
*సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.*
*ఈ వ్యాసంలో....*..
*తెలంగాణ విమోచనోద్యమంలో*
*-నిజాం పాలనలో దురాగతాలు*
*-ప్రపంచంలోనే అత్యంత క్రూరులు రజాకార్ ల చరిత్ర*
గురించి తెలుసుకుందాము
నీ బాంచన్ కాల్మొక్త అంటూ బతుకులీడ్చిన ప్రజలు నిజాం పాలనపై ఎదురు తిరగడానికి అంతులేని దురాగతాలే కారణం. నిజాం పాలన చివరి దశలో మానవరక్తాన్ని తాగే రాకాసి మూకలైన రజాకారు దళాల దురాగతాలకు అంతు ఉండేదికాదు. రైతులు పండించిన పంటలకు కూడా వారికి దక్కనిచ్చేవారు కాదు. *నాడు వేలమంది మహిళలు మానభంగాలకు గురయ్యారు.*
*హిందూ మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించేవారు.*
నిజాం పాలకులు ఉద్యమాలను ఆపడానికి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసేవారు. గోళ్ళ కింద గుండుసూదులు, బ్లేడ్లతో శరీరంపై కోసి గాయాలపై కారం పోసేవారు. సిగరెట్లతో కాల్చేవారు. బొటనవేళ్లకు తాళ్ళు కట్టి తలకిందులుగా వేలాడదీసేవారు.చెవులకు బరువులు కట్టడం, ఛాతీపై పెద్దబండలు పెట్టడ, కాగే నూనెలో వేళ్లు ముంచడం ఆనాడు సాధారణమైన శిక్షలు ప్రజల వద్ద నుంచి ముక్కుపిండి పన్నులు వసూలుచేసేవారు. ధాన్యాలను బలవంతంగా లాక్కొనేవారు. ప్రజలు తిండిలేక అలమటిస్తే పట్టించుకొనేవారు కాదు. నిజాంచే ఉసిగొల్పిన రజాకార్లు విచ్చలవిడిగా గ్రామాలపై పడి ఇండ్లు తగలబెట్టి, అందినకాడికి దోచుకొనేవారు. ఈ భయంకర పరిస్థితిని చూసి వందేమాతరం రామచంద్రరావు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నిజాం దుర్మార్గాలపై లేఖ అందించాడు.
తమ జల్సాలకు విలాస జీవితానికి సరిపోయే విధంగా 90 రకాల పన్నులు విధించారు. ప్రజల బతుకు అధ్వాన్నమైంది. పన్నుల కట్టలేని పరిస్థితిలో గోళ్ళూడగొట్టారు. లెవీ కొలువకపోతే ఊరి మీద పడి రైతులు తినడానికి ఉంచుకున్న ధాన్యాన్ని దోచుకెళ్ళిన సంఘటనలనేకం. ఎదిరించినందుకు బైరాన్‌పల్లిలో 108 మందిని కాల్చి చంపారు, నిర్మల్‌లో వెయ్యిమందిని ఉరితీశారు, గాలిపెల్లిని తగులబెట్టారు. ఇలాంటి సంఘటనలు లెక్కలేనివి. శవాలను కూడా బూటుకాళ్ళతో తన్నిన నరహంతకులు, కిరాతకులు రజాకార్లు.
నిజాం రాజుల దృష్టిలో ప్రజలంతా ‘బాంచె’లు(బానిసలు). సామాజికంగా 'వెట్టి' అనే బానిసత్వ పద్ధతి అమల్లో ఉండింది.
*యార్‌జంగ్ నేతృత్వంలోని మజ్లిస్ ఇత్తెహాదుల్ బైనుల్ముస్లమీన్ సంస్థ బలవంతంగా హిందువులను ముస్లింమతంలోకి మార్పిడి చేసేది.*
*ఎదురు తిరిగిన వారిపై అరాచకంగా ప్రవర్తించేవారు. రజాకార్ స్త్రీలను మానభంగాలకు గురిచేసి, వివస్త్ను చేసి ఎత్తుకుపోయేవారు.*
*చెట్లకు కట్టేసి కింద మంటలు పెట్టేవారు, జనాన్ని వరసగా నిలబెట్టి తుపాకులతో కాల్చేవారు, బహిరంగంగా సామూహిక మానభంగాలు జరిపేవారు.*
దోపిడీ దృష్టి తప్ప స్థానిక ప్రజల పట్ల గౌరవం ఏమాత్రంలేదు. సంస్థాన ఉద్యోగాల్లో స్థానిక ప్రజల్ని పెట్టుకోకుండా ఉత్తర భారతం నుండి అపాకీలను రప్పించి నియమించారు. స్థానిక భాషల్ని, సంస్కృతులను అన్ని దశల్లోనూ నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు.
‘అరబ్బీ-అమృతం, పారశీ-తేనె ఉర్దూ-కండశర్కర, తక్కిన భాషలన్నీ ఒంటికాలికింది దుమ్ము’ అని ఈసడించుకున్నారు. స్థానిక ఉర్దూను సైతం హీనంగా చూశారంటే తెలుగు పరిస్థితికి దిక్కులేదు.
తుర్రేబాజ్ఖాన్ , బందగి, షోయబుల్లాఖాన్ లాంటి అనేక మంది ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనలో హత్యచేయబడ్డారు.
1942లో షేక్ బందగి విస్నూర్ రాపాక రామచంద్రారెడ్డి అనే భూస్వామికి చెందిన గూండాలు హత్యచేశారు.
*ప్రపంచంలోనే అత్యంత క్రూరుడు రజాకార్ ల చరిత్ర*
*ప్రస్తుతం భాగ్యనగరంలోAIMIM పార్టీ పేరుతో కాసిం రజ్వీ ఆశయాలను కొనసాగిస్తుంది.., దేశంలో మత కల్లోళ్లకు కారణమవుతుంది*
సయ్యద్ ఖాసిమ్ రజ్వి నేతృత్వంలోని రజాకార్ల, హింసాత్మక, "స్వయంసేవకుల" సంస్థ, రజాకార్లు MIM కోసం "తుఫాను దళాల"గా పనిచేశారు.
కాసిం రిజ్వీ జన్మస్థం లాతుర్ లో జన్మించాడు మరియు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో లా చట్టాన్ని అభ్యసించారు. హైదరాబాద్ నగరంలో మొహమ్మద్ అలీ ఫజైల్తో కలిసి అతను పట్టభద్రుడైన తర్వాత హైదరాబాద్కు వలస వచ్చారు. తరువాత అతను ఓస్మానాబాద్ జిల్లాలోని లాతూర్లో ఒక న్యాయవాదిగా స్థిరపడ్డాడు, ఇక్కడ అతని మాజీ అప్పటి డిప్యూటీ సూపరింటెండెంట్ అయిన అతని అత్తగారు అబ్దుల్ హై ద్వారా పరిచయాలు ఉన్నాయి.
మాజీ హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగి మొహమ్మద్ హైదర్ కథనం ప్రకారం మజ్లిస్-ఇ-ఇతిహాడుల్ ముస్లైమీన్ (ఇత్తెహాద్) లో చేరిన తరువాత, రజ్వి తన ఆస్తి మొత్తాన్ని పార్టీకి విరాళంగా ఇచ్చినట్లు చెబుతారు, ఇది అతనిని ప్రముఖంగా చేసింది మరియు అతనిని సిద్దిక్-ఎ-డెక్కన్ పేరుతో సంపాదించింది.1944 లో నవాబ్ బహదూర్ యార్ జంగ్ యొక్క అకాల మరణం తరువాత, ఇతిహాడ్ పార్టీ వినాశకరమైన తీవ్రవాదానికి గురైంది. ఇతిహాద్ సభ్యత్వానికి వారు సానుకూలంగా లేనప్పటికీ, రాజకీయ సంస్కరణలను సమర్ధించడం ద్వారా రజ్వి తన వైవిధ్యతను స్థాపించడానికి ప్రయత్నించారు. అప్పుడు లాతూర్లో తన సొంత సంఘాన్ని ఏర్పాటు చేశాడు, మజ్లిస్-ఎ-ఇస్లా నజ్మ్-ఓ-నస్క్ అనే పేరు పెట్టారు, సంస్కరణలను తీసుకురావటానికి, పార్టీ యొక్క ప్రధాన స్రవంతి నుండి తన సొంత స్వతంత్రాన్ని స్థాపించటానికి ఎక్కువ అవకాశం ఉంది.
ఫిబ్రవరి 1946 లో, అబ్దుర్ రెహమాన్ రాయ్స్ నాయకత్వంలోని పార్టీలో తీవ్రవాదులు ఒక మసీదు పునర్నిర్మాణం మీద హింసాత్మక నిరసన ప్రదర్శించారు, ఛత్రా యొక్క ప్రధాన మంత్రి నవాబ్ మరియు సర్ విల్ఫ్రిడ్ గ్రిగ్సన్, రెవిన్యూ మరియు పోలీసుల మంత్రి. సంఘటన ఇథిహాడ్ నాయకుడు రాజీనామాకు దారితీసింది. నూతన అధ్యక్షుడి కోసం జరిగిన పోటీలో కాసిమ్ రజ్వి రైట్ను ఇతిహాడ్ నాయకుడిగా వెలుగులోకి తెచ్చాడు. అతని తీవ్రవాదం రైస్ మరియు పార్టీలో ఉన్న మితవాదులు రెండూ అభ్యర్థుల నుండి దూరమయ్యాయి. నిజాం పాలన కొనసాగింపు మరియు పాకిస్థాన్కు వెళ్లడానికి నిజాంని ఒప్పిస్తున్నట్లు ముస్లిం వేర్పాటువాదులు ఉన్నారు.రజ్వి కఠినంగా ఉన్న దృక్పధాన్ని తీసుకోవటానికి నిజామ్ను ప్రోత్సహించాడు మరియు కొత్తగా ఏర్పడిన భారతదేశ ప్రభుత్వానికి హైదరాబాద్ లో ప్రవేశపెట్టడానికి రజకర్లను ఆదేశించాడు.రజ్వి యొక్క రాజాకర్లను ఖండిస్తూ మరియు భారతదేశంతో విలీనం చేయమని వాదించిన షూబూల్లా ఖాన్ వంటి దేశభక్తి ముస్లింల హత్యలో అతను కూడా చిక్కుకున్నాడు. రజ్వి హిందూ జనాభాపై క్రిమినల్ దాడులను ప్రారంభించాడు, భారతదేశానికి పోలీస్ యాక్షన్కు దారితీసింది.ఆపరేషన్ పోలో తర్వాత, భారత సైన్యం రజకర్లను ఓడించి, భారత దేశంలో హైదరాబాద్ను స్వాధీనం చేసుకున్న తరువాత, రజ్వీని గృహ నిర్బంధంలో ఉంచారు మరియు భారతీయ చట్టాలపై తిరుగుబాటు కార్యకలాపాలకు ప్రయత్నించారు మరియు మత హింసను ప్రేరేపించారు. అతనికి 1948 నుండి 1957 వరకు జైలు శిక్ష విధించబడింది.1957 సెప్టెంబరు 11న జైలు నుంచి విడుదలయ్యాక ఖాసిం రజ్వీ పాకిస్తాన్కి వెళ్లిపోయాడు. సరిగ్గా హైదరాబాద్ సంస్థానానికి విమోచనం లభించిన రోజునే రజ్వీ పాకిస్తాన్కి వెళ్లడం మరో విషయం. అతను 1970 లో అనాధాలా మరణించాడు. హైదరాబాద్ నుండి వెళ్లి, 1949 లో నుంచి అతని కుటుంబం పాకిస్తాన్ కు వెళ్లి అక్కడ నివసిస్తున్నది.
O
*మన కొంపలార్చిన , మన స్త్రీల చెరిచిన ........*
*కండకండలుగా కోసి కాకులకు వేయాలె, కాలంబు రాగానె కాటేసి తీరాలె*
- కాళోజి
*నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా.......*
*గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరి కడతాం కొడుకా నైజాము సర్కరోడా*
- యాదగిరి
*ఖాసింరజ్వీ ఎంతరా, వాడి బిసాదెంతరా?*
*అందరం కలిసి తంతే, అంతు దొరక కుందురా!
-కొండేపూడి లక్ష్మీనారాయణ
*నైజాం విముక్త స్వాతంత్ర్య అమృత్యోత్సవాలు - సికింద్రాబాద్ బాగ్ 🚩(సెప్టెంబర్ 17, 2022 - సెప్టెంబర్ 17, 2023 వరకు)*
*##యువ సమ్మేళన కార్యక్రమం##*
*తేదీ : నవంబర్ 27, ఆదివారం*
*సమయం:* ఉదయం 9:30 గంటలకు
*స్థలం :*
Sardar Patel College, Padma Rao Nagar, Secunderabad.
https://maps.app.goo.gl/f4GmcANKM7MA6Fan6
*కార్యక్రమంలో పాల్గొనుటకై కింది గూగుల్ ఫామ్ లో వివరాలను నమోదు చేసుకోగలరు...*👇👇
*https://forms.gle/oJRDctH2G2ps47y98*
♦️♦️♦️♦️♦️♦️♦️♦️
*తెలంగాణ ప్రజల యాస, భాష, సంస్కృతి మరియు సాంప్రదాయాలపై నిజాం చేసిన దమనకాండకు ఎదురొడ్డి పోరాడి గెలిచిన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ విమోచన దినోత్సవం.*
*నిజాం నిరంకుశ పాలన ముగిసి హైదరాబాద్ సంస్థానం స్వాతంత్ర్య భారతదేశంలో కలిసి 75 సంవత్సరాలు పూర్తయిన వేళ.....,*
*హైదరాబాద్ సంస్థానం విముక్తిలో పాల్గొన్న త్యాగధనుల చరిత్రను తెలుసుకుందాం...*
~*_"వేటాడబడే జీవులు తమకథ గురించి తాము చెప్పుకుంటే తప్ప, వేట గురించి రాయబడిన కథ ఎప్పుడూ వేటగాడి గురించి గొప్పగానూ, వేటాడబడిన జీవుల గురించి నీచంగా రాయబడుతుంది."_*~
*అందుకే....,*
*మేమింకా నిజాం రజాకార్ల #అరాచకాలు మరవలేదు. పేరు మార్చి జరపినంత మాత్రాన #చరిత్ర దాగదు. #రాజకీయ కారణాలతో చరిత్రను దాచలేరు.*
*నైజాం పాలనలో....,*
*హిందు స్త్రీలతో #దిగంబరంగా బతుకమ్మ ఆడించిన రోజులవి*
*#మందిరాలు కూల్చి, సంపదను దోచిన రోజులవి....*
*తెలంగాణ స్త్రీలను చరచి సామూహికంగా చంపేసిన రోజులవి...*
*సామాన్య తెలంగాణ పౌరులను క్రూరంగా హింసించి ఊచకోత కోసిన రోజులవి...*
*ఈ ధమనకాండ నుండి*
*నిజాం రాజును, రాక్షస రజాకార్ల సైన్యాన్ని #పటేల్ సాబ్ తన్ని తరీమేసి స్వాతంత్ర్య #భారతావనిలో యావత్ తెలంగాణను కలిపిన రోజిది ....*
*రండి.....,నైజాం విముక్త స్వాతంత్ర అమృత్యోత్సవాల్లో భాగమవుదాం.... మరుగునi పడేసిన మన వీరుల చరిత్రను ప్రపంచానికి తెలియజేద్దాం....*
*ఆహ్వానించువారు :*
*నైజాం విముక్త స్వాతంత్ర అమృత్యోత్సవ సమితి - సికింద్రాబాద్ బాగ్*
Comments
Post a Comment