విజయ విపంచి Quotes
పల్లవి :
ప్రతిన బూనుట ఇలను సులభము - సఫలతా సంప్రాప్తి కఠినము సాధకా
నీ నిత్య జీవిత సమరమున నిది గురుతెరుంగుము
చరణం :
శలభమై ప్రేమాగ్ని జ్వాలలు - సమసిపోవుట సులభమేయగు నీదు జీవిత మొక్కరీతిగ - మలచి వెలుగుల నొసగ కష్టము
|| ప్రతిన బూనుట ||
చరణం:
కాలవాహిని అలల వాలున- కదలిపోవుట సులభతరమే ఎదను ధర్మము మెదలుచుండగ - ఎదురు నీదుట పరమ కఠినము
|| ప్రతిన బూనుట ||
చరణం:
విధి విలాసము హృదిని చీల్చగ - కనుల నీరిడి కుముల సులభము ఆపదలతో నాటలాడుచు మందహాసము చేయ కష్టము
|| ప్రతిన బూనుట |
చరణం :
ఇంద్రియమ్ముల నిగ్రహించి - ఇంద్ర పదవిని పొందినప్పుడు స్వర్గ సౌఖ్యములందు తేలుచు - మద విహీనత మనుట కష్టము
||ప్రతిన బూనుట ||
పతనము చెందిన హైందవ జాతి పరమ వైభవము పొందవలె
అఖండ భారత అజేయ శక్తిని ప్రపంచానికే చూపవలె
ఆ పవిత్ర ధ్యేయము సాధించుటకై సర్వస్వార్పణ సలుపవలె
కల్లోలపు జగత్తునకు శాంతినొసగు సందేశం
కూలుతున్న లోకానికి విలువలొసగు వివేకం
దరినెరుగని భువిజనులకు దారిచూపు దర్శనం
లోకహితం కర్తవ్యం అనితలచిన భారతం
యుగయుగాల అనుభవమే పునాదిగా కదలుదాం
సత్యం శివ సుందరములు జీవితమున చూపిద్దాం
చైతన్యపు అడుగులతో అవనిని సేవించుదాం
వసుధైవ కుటుంబకమును ఈ కన్నుల కాంచుదాం
లేదు పూలమాల వలపు
కలదాత్మార్పణపు తలపు
ధ్యేయ శిఖల మా స్వార్ధము
ఆహుతిగా నగుగదయ్య
సృష్టికర్తయౌ బ్రహ్మ సృజించిన వేద వాఙ్ఞ్మయపు పుట్టిల్లు
నారాయణుడే నరుడై పుట్టి నడయాడిన ఈ నట్టిల్లు
హిమశైలమ్మున ఇల్లరికమునకు ఈశుని దించిన అత్తిల్లు
లోక బాంధవుల ప్రియ బాంధవిగా వాసికెక్కినది మన ఇల్లు
అట్టి దివ్య థామమ్మును పొందిన మన జన్మాంతర సౌభాగ్యానికి !! అర్పణ సయేగా||
భారతీయ యువకుడా బయలుదేరవోయ్
భారతీయ ప్రజావళిని మేలుకోల్పవోయ్
భావదాస్య పారతంత్ర భావాలను పారద్రోలి
భారతీయ జనతలోన జాతీయత రగుల్కొల్పి ||
నీవాడు నావాడని లేనేలేదోయ్
దేశమంత ఒక్కటని విస్మరించకోయ్
కులము మరచి హిందువునని చాటిచెప్పవోయ్
కలసి మెలసి కర్మణ్యత నాశ్రయించవోయ్
విజయశీల సంఘటనా కార్య శక్తితో
హిందుధర్మ రక్షణకై ప్రతినబూనవోయ్
మాతృ దేశ వైభవమును సాధించుటలో
సర్వస్వార్పణ చేయుట ఒకటే మార్గమోయ్
P
పాడరా ఎలుగెత్తి భవ్య భారతి గీతి
చాటరా చెయ్యెత్తి జాతి వైభవ కీర్తి
చూడరా కనులెత్తి జనని సుందరమూర్తి
ఆడరా శివమెత్తి అరి భయంకర దీప్తి
శ్రీరామచంద్రుడే మా ధర్మ ప్రభువని
శివాజీ మహారాజు స్ఫూర్తి ప్రదాతయని
ధీర కేశవ వాణి దివ్య మంత్రమ్ముగా
మరల హైందవ జాతి మహిని వేలుగొందునని
పరమ వైభవ సిద్దికొరకై - దీక్షగైకొని సాగుదాం
తనుమనోధన అర్పనలుగా - తల్లి సేవలు చేయుదాం
! పరమ వైభవ !
తల్లడిల్లుతూ తల్లి భారతి సుతుల రమ్మని పిలుస్తుంటే
ముగలై కూర్చుండలేమోయి - మృత్యుశిలలై మ్రగ్గలేమోయి
రుద్రులై శివమెత్తి లేచి విక్రమించే వీరులవుతాం
క్షుద్ర శక్తుల కుల్చివేసి తల్లి ఋణమును తీర్చుదాం
! పరమ వైభవ !
అలలవాలుకు తలలు వాల్చము - ఏటిగతి కెదురీదగలమోయి
మొహభందన కటిన పాశము తునాతునకలు చేయగలమోయి
సుఖములందు ఆసక్తి లేదు - కష్టమంటే వెరపులేదు
వీర రాణ కేశవాదుల అడుగు జాడలు ముందు కలవోయ్
! పరమ వైభవ !
సంఘ శాఖా పుణ్య గంగను నిత్య స్నానములనాచరించి
ఇహ పరమ్ముల ప్రగతి కొరకై జీవితపు మార్గమ్ము నెంచి
పూర్ణ వికసిత శుద్ధ జీవన పుష్పములతో పూజ చేద్దాం
రాష్ట్ర వైభవ యజ్ఞ వేదిని స్వీయ జీవన సమిధ వేద్దాం
! పరమ వైభవ !
కర్మశీలి ధన్యజీవి జయము నీదేలే జయము నీదేలే
పూలమాలకు తలను వంచవు
పొగడ్తలు విన చెవుల నీయవు
జాతి వైభవ సౌధమడుగున, పునాది రాయిగ నిలచెదవులే
కణ కణమున కంఠమిదే అణువణువున నాదమిదే
మాతృభూమి మనల చూచి కోరుచున్న కోర్కె ఇదే , కోరుచున్న కోర్కె ఇదే
విలాసాలు విడిచిపెట్టి కులాసాలు కట్టిపెట్టి
వీరవ్రతం స్వికరించి ధ్యేయనిష్ఠ దీక్షబూని
సంఘటనా సూత్రముతో ధర్మరక్ష లక్ష్యమును
సాధించగ రారమ్మని మాతృభూమి పిలుపు ఇదే
బానిసలమై బ్రతుకులీడ్చిన ఫలితమే ఈ నాటి దుస్థితి
నివురు మరుగున దాగినదిరా నిప్పులా మనలోని శక్తి
నివురు తొలగనిదెట్లు కలుగును పరమ వైభవము || 2
Comments
Post a Comment