స్వయంసేవక్ | సమరసత | హిందుత్వ | సంస్కారము- విద్య | HSS | పుణ్యభూమి భారత్ |దేశభక్తి | ధ్యేయనిష్ట అమృత వచనాలు
1. శత్రువు ముందు తల వంచడం నాకు సహింపరాని విషయం.ఒక నిస్సహాయురాలై ఏడుస్తూ చదవడం కన్నా నేను నా లక్ష్యం కోసం పోరాడుతాను.
- ఝాన్సీ లక్ష్మీబాయి
2. ఏ జాతి నాయకుడికైనా అంకితభావం, కార్యకుశలత అనే రెండు లక్షణాలు ఉండి తీరాలి. ఏమి జరిగినా సరే తన ధ్యేయం మార్గం నుండి వైదొలగరాదు. మనం నాశనం అయిన పర్వాలేదు. కానీ మన భారత జాతి యొక్క సమున్నత గౌరవాన్ని కాపాడేందుకు తన చివరి శ్వాస వరకు పోరాడాలి.
- లాల్ బహుదూర్ శాస్త్రి
3. ఒక వ్యక్తిని రూపు దిద్దడంలో మంచిచెడులు సమానంగా పాలు పంచుకుంటాయి. ఈ ప్రపంచం సృష్టించిన మహోన్నత వ్యక్తిత్వాలను పరిశీలిస్తే పేదరికమే ఎక్కువ పాఠాలు నేర్పిందని, పొగడ్తల కన్నా ఎదురు దెబ్బలే వ్యక్తిలోని ఆవేశాన్ని రగిలించి పట్టుదలను పెంచాయని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను.
- స్వామి వివేకానంద
4. వార్తాపత్రికలలో పేరు పడుతుంది. వెళ్ళిన చోటల్లా స్వాగతం పలుకుతూ పూలమాలలు వేస్తారు. ఈ రకమైన పనికి రాని ఆలోచనలు వదిలిపెట్టండి. ఉక్కు సంకల్పాన్ని కలిగి ఉన్న యువకుల్లారా ఈ దేశ,ధర్మ రక్షణకై నడుం బిగించి ముందుకు నడవండి. ఇటుక రాళ్ళమై మనం ఈ దేశ పునాదులను దృఢంగా నిర్మించాలి. బ్రహ్మ తేజానికి, క్షాత్ర తేజానికి సంరక్షకులము,ఉపాసకులము కావాలి.
- పరమ పూజనీయ డాక్టర్జీ
5. ఎవరికీ తన దేశము దేశ సోదరులు తప్ప మరొకటంటే ఎట్టి వ్యామోహం లేదో, ఎవరికీ తన కర్తవ్యం, కర్తవ్యపాలన తప్ప మరొక వృత్తి లేదో, ఎవరికీ తన హిందూ ధర్మం అభివృద్ధి చెంది హిందూ ప్రతాపభానుని నిరంతరం మహా తేజశ్శాలిగా ఉంచాలనే ధ్యేయం తప్ప మరో స్వార్థం లేదో అట్టివాని హృదయంలో భయము, దుఃఖము, నిరుత్సాహం జనింపచేయడం ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు.
- పరమ పూజనీయ డాక్టర్ జి
6. కార్యకర్త ద్వారానే సమాజానికి సంఘ పరిచయం జరుగుతోంది. సంఘం ఎంత పవిత్రము, విశుద్ధమైనదో నేను అలాగే ఉండాలి. అలాంటి ఏ ఒక అంశమైనా నాలో లేకుంటే అది సంఘ కార్య ఉజ్వలత కొరకు అడ్డంకి అవుతుంది. సమాజ కళ్యాణం కొరకు ఒక మంచి సాధనంగా నేనెలా ఉండాలని అని ప్రతి స్వయంసేవక్ ఆలోచించుకోవాలి.
- మాననీయ మోరోపంత్ పింగల్ జి
7. తన సహచరులకు తగిన గౌరవం అందించే నేత తాను ఏ సన్మానాన్ని ఆశించకుండా ఇతరులకు ప్రశంశలను అందజేస్తాడు.
- దత్తోపంత్ ఠెంగ్డే జి
8. మన జాతి యొక్క నిజమైన పునరుజ్జీవనం వ్యక్తిని తీర్చిదిద్దడంతో ప్రారంభం కావాలి. మానవ సహజమైన బలహీనతలను అధిగమించగల శక్తిని వ్యక్తిలో నిర్మాణం చేయాలి. పరంపరాగతమైన ఆత్మ సంయమనం, త్యాగం సేవ, సౌశీల్యం అనే వాటిని అతడు పెంపొందించుకునేటట్లు చేయాలి. హిందూ పురుషార్థానికి ఒక తేజోవంతమైన ప్రతీకగా అతడు నిలబడాలి. మన రాష్ట్రీయ వైభవానికి మూలసూత్రమైన ఇట్టి యోజన వ్యక్తి నిర్మాణం చేస్తుంది మనం ఈ విధంగానే మరల మన ప్రాచీన విశ్వగురుపీఠాన్ని చేరుకోగలం. ఇందుకు సంఘం ఎంచుకున్న మార్గం నిత్య శాఖ.
- పరమ పూజనీయ శ్రీ గురూజీ
9. నేను మరణించినప్పటికీ భారతదేశం యొక్క గౌరవానికి భంగం కలగనీయను. వ్యక్తిగత ప్రతిష్టను ఆశించకుండా, నిష్ఠతో దేశానికి సేవ చేస్తాను అనే భావనయే వ్యక్తిగత శీలం.
సంఘం యొక్క విశాల భావాలను అర్థం చేసుకుని ప్రతి వ్యక్తి సుఖంగా, సంపన్నంగా, విద్యావంతులై ఉండాలని సమాజ హితం కొరకు సంకల్పించడమే జాతీయ శీలం యొక్క అర్థం.
- పరమ పూజనీయ శ్రీ గురూజీ
10. అన్నిరకాల వ్యక్తిగత సమస్యలు, అనుబంధాలు, ప్రేమానురాగాలు, సుఖదుఃఖాలు, వృత్తి, ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ తమ మనసుల్లో సమాజ కార్యం చేయాలనే కోరికతో సంఘ కార్యం చేస్తూ సాధారణ జీవితం గడిపే స్వయంసేవకులే సంఘానికి నిజమైన ఆధారం.
- పరమ పూజనీయ శ్రీ బాలా సాహెబ్ జి
11. మనం స్వయంసేవకులం. నిప్పురవ్వ ఎక్కడ ఉన్న తన చుట్టుపక్కల వేడిని ఎలా ప్రసరింపజేస్తుందో, అలాగే ప్రతి స్వయంసేవక్ ఒక్కొక్క అగ్నిపుంజం లాగా తన గుణ సంపత్తి చేత ప్రతి క్షేత్రాన్ని ప్రభావితం చేయ గలగాలి. నలుదిశలా సంఘ కార్యానికి ఉపయుక్తమైన వాతావరణం, మిక్కిలి శ్రద్ధాభావన ఉత్పన్నమయ్యేలా చేసేవారై ఉండాలి.
- పరమపూజనీయ శ్రీ గురూజీ
12.*అమృత వచనం*
నేను మరణించినప్పటికీ భారతదేశం యొక్క గౌరవానికి భంగం కలగనీయను. వ్యక్తిగత ప్రతిష్టను ఆశించకుండా, నిష్ఠతో దేశానికి సేవ చేస్తాను అనే భావనయే వ్యక్తిగత శీలం.
సంఘం యొక్క విశాల భావాలను అర్థం చేసుకుని ప్రతి వ్యక్తి సుఖంగా, సంపన్నంగా, విద్యావంతులై ఉండాలని సమాజ హితం కొరకు సంకల్పించడమే జాతీయ శీలం యొక్క అర్థం.
- పరమ పూజనీయ
మాధవ సదాశివ గోల్వాల్కర్
( శ్రీ గురూజీ)
*(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వితీయ సర్ సంఘచాలక్)*
13.*అమృత వచనం - *
*అన్నిరకాల వ్యక్తిగత సమస్యలు, అనుబంధాలు, ప్రేమానురాగాలు, సుఖదుఃఖాలు, వృత్తి, ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ తమ మనసుల్లో సమాజ కార్యం చేయాలనే కోరికతో సంఘ కార్యం చేస్తూ సాధారణ జీవితం గడిపే స్వయంసేవకులే సంఘానికి నిజమైన ఆధారం.*
*- పరమ పూజనీయ శ్రీ బాలా సాహెబ్ జి*
*(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ సర్ సంఘచాలక్)*
14.*అమృతవచనం - 19*
*సమాజ సేవకు యోగ్యమైన వ్యక్తిగా తయారు కావడానికి రెండు రకాల ప్రేరణలు అవసరం.*
*సేవ చేయాలని అంతః ప్రేరణ మొదటిది. తదనుగుణంగా కృషి చేసే సంసిద్ధత రెండవది.*
*సేవ చేయడానికి ఉండాల్సిన ప్రేరణ భావత్మకం అయిఉండాలి. అంతేగాని ప్రతిక్రియ వలన ఏర్పడినదిగాని, నిరాశ నుండి పుట్టినది గాని కాకూడదు...*
*- శ్రీ ఏకనాథ్ రనాడే*
*(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సిద్ధాంతకర్త)*
*అమృతవచనం - 44*
*జాతీయదృష్టిగల ధ్యేయ వ్రతుడు స్వయం సేవక్ . అనేకకారణాలవల్ల గత వేయినంవత్సరాలుగా చిన్నాభిన్నమై పోయిన జాతికి, సంఘటిత పరచడం అనే మహత్తర పథకాన్ని తాను నెరవేర్చాలనే ప్రగాఢ కర్తవ్యతాజ్ఞానంతో అత డుంటాడు; అట్టి చారిత్రక పాత్ర నిర్వహించటానికి సంసిద్దుడవుతాడు;జాతీయ పునర్నిర్మాణ కార్యక్రమానికి తానొక సమర్థ సాధనంగా రూపొందేనిమిత్తమై. సహజసిద్ధమైన తన ఆవేగ సంవేగాలను, ధోరణులను* *సమన్వయ పరచి ఏకోన్ముఖంచేయడం నేర్చుకొంటాడు; తన స్వార్థ ప్రయోజనం, పదవీ*
*పటాటోపం, పేరు ప్రఖ్యాతులు ఇటువంటి వృధా పరమైన ఆలోచనలను దరిచేరనీయకుండా సమాజాన్ని సేవిస్తూ ఉంటాడు.*
*అమృతవచనం - 51*
*సేవాభావం, స్వావలంబన, పవిత్ర మాతృభూమి పాదాలమ్రోల సర్వస్వార్పణ - ఇట్టి ఉదాత్త భావాలే ఊపిరిగా చేసుకొని జాతీయస్వాభిమానంతో ఉర్రూతలూగే పురుషపుంగవులుగా జీవిద్దాం. ధ్యేయనిష్ఠతో ప్రజ్వరిల్లే యువ బృందం మాత్రమే, దేశం లోపల నుంచి, వెలుపల నుండి, వచ్చే మహా ప్రమాదాలన్నిటినీ నివారించటానికై కార్యోన్ముఖుల్ని చేయగలుగుతుంది.*
*అమృత వచనం - 55*
*లౌకిక ఆకర్షణలు ఎన్ని ఉన్నప్పటికీ, నిరంతర* *ప్రయత్నంవల్ల తాను స్వీకరించిన జాతీయ పునరుజ్జీవన కార్యం మీద పరిపూర్ణ ఏకాగ్రతను కార్యకర్త సాధించగలుగుతాడు.* *దైవీశక్తుల ముందు అసురీ ఆకర్షణలు నిలువనేరవు; ఎంత చిన్న ప్రయత్నం చేసినాసరే అతనికి దైవీ శక్తులు శ్రీరామరక్షయై, అతని శక్తి సామ్యర్థ్యాలను అధికాధికం చేస్తాయి. అప్పుడు లక్ష్యసిద్ధిలోనే అతని జీవితానికి సంతృప్తి, సార్థక్యం లభిస్తాయి. ఆ ఆనందం ముందు బాహ్యాకర్షణలన్నీ వెలవెల పోతాయి.*
*అమృతవచనం - 38*
'ఒక గొలుసు బలం దాని
బలహీనమైన భాగం పైనే ఆధారపడి ఉంటుంది. *విధర్మీయుల కుట్రపూరిత పాలనలో మొదలైన అస్పృశ్యత, అంటరానితనం వంటి మొదలైన దురాచారాల వల్ల హిందూ సమాజం బలహీనమయింది.* హిందూ సమాజాన్ని తిరిగి శక్తివంతంగా చేయాలనుకుంటే సమాజంలోని బలహీన వర్గాలను మిగతా సమాజం స్థాయికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి. *అస్పృశ్యతని పూర్తిగా రూపుమాపకపోతే సామాజిక ప్రగతి సాధ్యపడదు.*
*హిందూ సమాజంలో అనేక సంవత్సరాలుగా కనపడుతున్న దురాచారాల పట్ల పశ్చాత్తాప భావన కలగాలి. అది ఆయా వెనుకబడిన వర్గాల ప్రగతి కోసం స్వచ్ఛమైన మనసుతో పనిచేయడంలో వ్యక్తం కావాలి.* *అహంకారంతో, ఆధిక్య భావనతో కాకుండా స్వచ్ఛమైన మనస్సుతో, వినమ్ర భావనతో చేసేదే నిజమైన సేవ.... గతంలో చేసిన తప్పులకి సమాజంలో అందరూ బాధ్యత వహించి, ఆ తప్పులను సరిచేయడంలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి.*
- శ్రీ యాదవ్ రావ్ జోషి
*(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రథమ సహ సర్ కార్యవాహ మరియు ప్రథమ అఖిల భారతీయ సేవా ప్రముఖ్)*
*అమృతవచనం - 46*
*అవిభాజ్యమైన ఏకతాభావంతో హిందూ సమాజమంతా సంఘటితంగా వుండాలనే లక్ష్యసాధనకై 'స్పృశ్యత', 'అస్పృశ్యత' వంటి ధోరణులు, విశ్వాసాలు కారణంగా హిందూ సమాజంలో ఎట్టి విభజన జరగకూడదు.*
*కాబట్టి, విశ్వవ్యాప్తంగా వున్న హిందువులందరూ తమ పరస్పర ఆచార వ్యవహారాల్లో సమైక్యత, సమానతా భావ చైతన్యం తప్పక నిలుపుకోవాలి.*
*అమృతవచనం - 57*
*కుల, మత, విశ్వాసాల ప్రసక్తి లేకుండా. భారతదేశం *'హిందూ రాష్ట్రం' అనే సత్యాన్ని నిస్సంకోచంగా ప్రకటించటమూ, దానినీ శక్తిమంతమూ,* *సమృద్దమూ, చైతన్యపూర్ణమూ, సార్వభౌమంగానూ చేయటం, ఇచటి ప్రజలందరి ముఖ్య కర్తవ్యమని ఉద్ఘోషించాలి.*
*ఈ హిందూ రాష్ట్రం పట్ల ప్రగాఢ భక్తిని ప్రతి ఒక్కరిలోనూ జాగృతం చేయాలి..*
సమరసత - అమృత వచనాలు
*అమృతవచనం - 59*
*"నీవు హిందువువైతే చాలు.., స్వయంసేవకులు ఇంకేది పట్టించుకోరు... హిందువు అన్నదే సంఘ కార్యకర్తల ఆలోచనలలో ముఖ్య విషయం.. కులం కాదు, తెగ కాదు, ఇంకేదీ కానే కాదు....." అని బాహాటంగా ప్రకటించగలిగేట్లుగా, సంఘం స్వయంసేవకుల మనస్సులను తీర్చినందువల్లననే నేడు ఈ విధమైన, విశిష్టమైన విజయ సిద్ధి సంఘానికి లభించింది.*
*అమృతవచనం - 82*
*సామాజిక అసమానతలను నిర్మూలించే లక్ష్యం మనందరి మనస్సుల్లో ఉండాలి. మన సమాజంలో అసమానత, బలహీనత మరియు విచ్ఛిన్నత అనేవి ఏవిధంగా ప్రవేశించాయో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. వాటిని అధిగమించడానికి చర్యలు ఉపదేశించటంతో పాటు వాటి నిర్వహణకు ఉపక్రమించాలి. మరియు ప్రతి వ్యక్తి ఈ ప్రయత్నంలో సహకరించాలి.*
- పరమ పూజనీయ మధుకర్ దత్తాత్రేయ దేవరాస్ (బాలాసాహెబ్ దేవరాస్ జీ)
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ సర్ సంఘచాలక్
హిందుత్వం అమృత వచనాలు
ఆదర్శాన్ని సుదృఢం చేసుకోండి
మన సోదరులు జాతీయ జీవితంలోని వివిధ రంగాల్లో, అంటే, విద్యార్ధుల్లో, కార్మికుల్లో, రాజకీయాల్లో, ఇంకా అనేకవాటిల్లో కృషి చేస్తు న్నారు. వారు మన వాటికన్న విభిన్నములై వట్టీ, ఆయా రంగాలకు సంబంధించిన నియమ నిబంధనల కనుగుణంగా కృషి చేస్తుంటారు. ఏది ఏమై నా స్వయం సేవకులు హిందురాష్ట్రంపట్ల తాము సంఘంలో అలవరుచు కొనిన మౌలికమైన విశ్వాసంతోనే ఆయా రంగాల్లో కృషి చేయవలసి ఉంటుంది. ప్రాణప్రదమైన అట్టి భావనతో, ఆయా రంగాల్లో చొచ్చుకు పోవటానికీ వానిని ప్రభావితం చేయటానికీ ప్రయత్నించాలి.
మన యొక్క హిందురాష్ట్ర భావనను ప్రజలందరూ ఒప్పుకోక పోవచ్చునని కొందరు భావించవచ్చు. మనం ప్రతిపాదించే సత్యాన్ని కొందరు అంగీకరిస్తారా? తిరస్కరిస్తారా? అన్నది ముఖ్యంగాదు. మన భావనలు స్పష్టంగానూ, వాటి పట్ల మన విశ్వాసం ఆచంచలంగానూ వుండి తీరాలి. అప్పుడు మాత్రమే ఆ సత్యాన్ని అంగీకరించటానికి ప్రజలు సుముఖులు కాగలుగుతారు. తుదకు ప్రజలంతా దానిని విశ్వసిస్తారనే నమ్మకం. మన మన రంగాల్లో, మన మన ఆలోచవలను స్పష్టంగా పదే పదే ఎందరెందరికో వివరించి చెపితే, వారు క్రమంగా మన సహచరులుగా మారి, మన భావనలను అంగీకరించగలుగుతారు. అంతేగాని, మనం, మన హృదయాల్లోనే బెరుగు పెట్టుకొని, ప్రజల వద్దకు పోయి, నీరు గారిపోయినట్లు మెతకమాటలు మాట్లాడితే పనంతా పాడై పోతుంది. మనకు బలమైన సహాయకారిగా వుంటుందని ఆశించినది కూడా, అట్లాకాక, మన ఆదర్శ పథంలో మరొక అడ్డంకిగా గూడా తయారవుతుంది.
*అమృతవచనం - 25*
*ఆనాటి హిందువులలో ఒక దోషముండింది. వారిలో స్వాభిమానము, బలమూ ఉండేవి. అన్ని రకాల సద్గుణాలు ఉండేవి. కాని అందరి హృదయాలు ఒక్కటి కాలేదు.అందరు కలిసి ఒక్కటిగా నిలబడాలనే ఆలోచన రాలేదు.*
ఒకవేళ అప్పుడే ఆసేతు హిమచలమంతా *జాగరణ తరంగాలు ఉప్పొంగి ఉంటే* మన చరిత్రే మారిపోయింది.
*ఇప్పుడైనా మేలుకొని హిందూ సంఘటన శక్తి ని దృఢపరచాలి.. దేశ కాల సమస్యలన్నింటికీ ఇదియే పరిష్కారం.*
*-మాన్యశ్రీ బాలాసాహేబ్ ఆప్టేజీ*
*అమృతవచనం - 26*
*రాష్ట్రీయ స్వయంసేవక సంఘం హిందూ సమాజం యొక్క జాతీయ స్వరూపాన్ని గుర్తించి ప్రతి వ్యక్తి హృదయంలో రగులుతున్న భారత భక్తిని జాగృతం చేసి, దేశ సేవ కొరకు సర్వస్వార్పణం, సచ్చిలం, మంచి నడవడి తో కూడిన జీవితం గడపడానికి, అలాగే ఆసేతు హిమాచలం సామరస్యపూర్వకమైన ఏకాత్మ సమాజ జీవనంను పునః ప్రతిష్ట చేయుటకు విశేషమైన ప్రయత్నం చేస్తుంది.*
*-పరమ పూజనీయ శ్రీ గురూజీ*
*(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వితీయ సర్ సంఘచాలక్)*
*అమృతవచనం - 27*
“సంఘ కార్యం ఒకరికో, ఐదు-పదిమందికో, యాభై మందికో పరిమితమైన పనికాదు. ఒక వ్యక్తి తన పనిపట్ల ఎంత శ్రద్ధ కలిగినవాడు, ఎంతగా శ్రమించే వాడైనా, ఎంతటి బలశాలి అయినా, అతనికి, అతని సామర్థ్యానికి పరిమితులు ఉంటాయి. యావత్తు దేశానికి సంబంధించిన బాధ్యతలను ఒక వ్యక్తి తన నెత్తికెత్తుకోలేడు. బరువును కొండపైకి ఎక్కించటం వంటి కష్టసంభరితమైన ఈ పనిని నెరవేర్చడానికి దేశంలో ఉన్నవారందరూ కష్టపడి పనిచేయాలి. బలహీనులైనవాళ్ళు ధర్మాన్ని రక్షించజాలరు. అందుకని సంఘం సమాజాన్ని సంఘటితపరచి, దానిని బలోపేతం చేసే కార్యాన్ని స్వీకరించింది. అందుచేత ఇది ధర్మకార్యం. దీనికి తోడుగా ఇతర లక్ష్యాలు ఏవన్నా ఉన్నా - అవి దీని తర్వాతవి మాత్రమే.
(పుణే ప్రసంగం నుండి)
*- పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ జీ*
(రాష్ట్రీయ స్వయంసేవక్ వ్యవస్థాపకులు)
*అమృతవచనం - 28*
వ్యష్టి నుండి సమష్టివైపుగా జరిగే ప్రయాణంలో కుటుంబం అనేది తొలి అడుగు. *తన తొలి అడుగునే తన గమ్యంగా భావించుకొనేటట్లయితే, ఆ వ్యక్తి యొక్క గతి ఆగిపోతుంది, గమ్యం తప్పిపోతుంది.* ఈ పొరపాటును సరిదిద్ది తన *కుటుంబ బాగోగుల గురించి ఆలోచించినట్లుగానే సమాజం బాగోగులను, మానవాళి మంచిచెడ్డలు గురించి కూడా ఆలోచించాలని, వాటిపట్ల శ్రద్ధ వహించాలని చెప్పి వ్యక్తిని, కుటుంబాలనూ ముందుకు నడిపించటమే సంఘటనా కార్యం.*
- పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ జి
*(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆద్య సర్ సంఘచాలక్)*
*అమృతవచనం - 29*
*రాష్ట్రం అనగా ప్రజలు అని అర్థం..ఈ దేశాన్ని తమ మాతృభూమిగా, ఈ దేశ చరిత్రను తమ చరిత్ర గా భావించి గర్వపడేవారితో రాష్ట్రం ఏర్పడుతుంది. వందేమాతరం అనడంలో గర్వం తొణికిసలాడే వారు,ఇక్కడి సంస్కృతిని *తమదిగా భావించేవారు మాత్రమే హిందువులు. అందువలన ఇది హిందు రాష్ట్రం. అనగా రాష్ట్రీయ పదానికి అర్థం హిందువు. మన* *సంఘటన, మన సంస్కారం, మన త్యాగం, మన పరిశ్రమ అన్ని రాష్ట్రం కొరకే అనగా హిందుత్వం కొరకు...*
*అమృతవచనం - 30*
*ఈ దేశ సమృద్ధి, భవిష్యత్తు హిందువుల తోనే ముడిపడి వున్నది. హిందు అనేది రాష్ట్రం పేరు. హిందువు రాష్ట్రానికి ప్రతిరూపం. (రాష్ట్రం అనే సంస్కృత పదానికి తెలుగులో జాతి అని అర్థం..)హిందువే రాష్ట్రానికి ప్రాణం... అందువలన హిందువుల బలహీనత అంటే రాష్ట్రం యొక్క బలహీనత, హిందువుల శక్తి అంటే రాష్ట్రీయ (జాతీయ) శక్తి అవుతుంది.* *దేశంలో ఏ భాగంలోనైనా హిందువులు అల్పసంఖ్యాకులుగా మారితే ఆ భూభాగం మన మన మాతృభూమినుండి విడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. హిందు సంఘటనయే దేశ సంక్షేమం..*
*అమృతవచనం - 31*
*ఏ సమాజం స్వభావసిద్ధంగా శక్తిశాలి, సాహసి అయివుంటుందో, ఆ సమాజం తనను తాను సురక్షితంగా ఉంచుకోగలదని చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎప్పటివరకైతే, ఇది సమాజం యొక్క స్వాభావిక వ్యవస్థగా రూపుదిద్దుకోదో, అప్పటివరకు అంతర్, బాహ్య సమస్యలను పరిష్కరించుకోవటం సాధ్యంకాదు...*
*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యం యొక్క కల్పనకూడా ఇదే. ఏదేశం (జాతి-రాష్ట్రము) యొక్క గొప్పదనమైనా (పెద్దరికం) ఆ దేశం యొక్క నాయకులు ఎంతటి మేధావులు, ఎంతటి శ్రేష్ఠులు అనే అంశంపై ఆధారపడి ఉండదు.ఆ దేశం (జాతి, రాష్ట్రం) లోని సాధారణ ప్రజలు ఎంతటి ధైర్యవంతులు, ఎంతటి సామర్థ్యశీలురు అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. వారి ఆచార విచార వ్యవహారాలు ఎలా ఉంటున్నవనే అంశంపై ఆధారపడి ఉంటుంది. అందుకొరకు సామాన్య మానవుల లో సైతం అసామాన్య గుణాలను తీర్చిదిద్దేందుకు సంఘం ఎంచుకున్న నిత్య సాధన స్థలి సంఘ శాఖ..*
*అమృతవచనం - 33*
*ఏ జాతికి తన గత చరిత్ర గురించి వాస్తవికమైన జ్ఞానం ఉండదో ఆ జాతికి భవిష్యత్ కూడా ఉండదు. అయితే ఈ సత్యంతో పాటు మరో మహా సత్యం కూడా వుంది. ఏ జాతి అయినా తన గౌరవపూర్ణ గత చరిత్రలో తన్మయత్వం పొందితే సరిపోదు. తన భవిష్యత్ ను తీర్చి దిద్దుకోవడంలో ఆ గతచరిత్రను ఉపయోగించుకొనే క్షమతను సంపాదించుకోవడం కూడా అత్యంత ఆవశ్యకం*
*- స్వాతంత్ర్య వీర సావర్కర్*
*అమృత వచనం - 37*
*"ఇది నాహిందూరాష్ట్రం ఇది నా ధర్మం; ఇది నా తత్వం ; ఈ ప్రకారం నేను జీవించాలి. నన్ను చూసి ఇతరజాతులు అనుసరించేటంత ప్రామాణికంగా నేను నిలబడాలి"అనే భావనయే హిందువులను సంఘటితం చేసేందుకు కావలసిన గట్టి పునాది...*
కేవలం *"రాజకీయ హిందూ ప్రాణి"గా* గాని *"ప్రతి క్రియాత్మక హిందువుగా"* గాని కాకుండా ఉండాలంటే, *"భావ నిష్ఠ చేత హిందువులుగా"* మనం జీవించి తీరాలి. *మన దైనందిన జీవితంలోని అన్ని అంశాలలోను, అట్టి భావనను, భావ నిష్ఠను వ్యక్తం చేయగలగాలి.*
*కేవలం సాహిత్యంలోనూ, వార్తాపత్రికల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోను హిందుత్వ భావనను ప్రచారం చేసినంత మాత్రాన ప్రయోజనం లేదు.*
*అమృతవచనం - 41*
*"హిందూ రాష్ట్రీయత" అనే తరతరాలసత్యానికి ప్రోద్బలంగా పవిత్రము, ఉదాత్తము, అజేయమునైన హిందూ సమాజ శక్తిని నిర్మించే బాధ్యత ప్రతి హిందువుది.*
*ఆత్మ విస్మృతి (స్వాభిమానాన్ని కోల్పోవడం)అధర్మమని, ఆత్మసాక్షాతారమే ధర్మమని మన శాస్త్రాలు చెపుతున్నాయి..*
*ఆ విధంగా వైభవోపేతం, ఉజ్జ్వలమునైన హిందూరాష్ట్రీయత అనే తమ జాతీయ ఆత్మను హిందూ సమాజం గుర్తించినట్లు చేయటమే మన ప్రాచీన మహా మపురుషులందరూ మనకు సూచించిన ధర్మ పున ప్రతిష్టాపనామార్గం.*🚩🚩🚩
*అమృతవచనం - 47*
*"హిందుత్వం అంటే సత్యాన్వేషణలో అవిశ్రాంత ప్రయత్నం . ఈ రోజున అది మృతప్రాయంగా అకర్మణ్యతతో వికాసానికి విముఖమై ఉందంటే, దానికి కారణం మనం అలసిపోవడమే...*
*భావదారిద్ర్యంతో పేరుకుపోయిన ఈ అలసటను మనం అధిగమించి మరల అన్వేషణను ప్రారంభిస్తే హిందుత్వం బహుశ మున్నెన్నడూ కనీవినీ ఎరుగనంతటి తేజస్సుతో ప్రపంచంలో వెల్లివిరుస్తుంది."*
*అమృతవచనం - 49*
*ఆచరణయోగ్యంగా, వాస్తవంగా ఉండేట్టు జాతియొక్క ప్రవర్తనను నిర్దేశించే మార్గంలో నడిచినప్పుడే, మహత్తర జాతిగా మళ్ళీ మనం నిలబడగలుగుతాం. అందుచేత మన ప్రయత్నాలన్నీ ఒక అజేయమైన జాతీయ శక్తిగా రూపొందే నిర్మాణమార్గంలో జరగాలి. దానికిగాను జాతీయ చైతన్యం పొంది అనుశాసనబద్ధంగాను, సమన్వయభావంతోను జీవిస్తూ, అజేయము, ప్రబలమైన ఒక జాతిగా రూపొందడానికి కావలసిన శిక్షణ మన ప్రజలకు ఇవ్వాలి. ఈ ప్రపంచంలో వైభవ సంపన్నమైన స్వతంత్ర జాతిగా జీవించే పరమాధికారం పొందడానికి మార్గం ఇదొక్కటే...*
*అమృతవచనం - 54*
*మానవజాతి మొత్తంలో ఒకే పరమేశ్వర శక్తి వ్యాపించి ఉందని గుర్తించేది, అన్ని రకాల ఆరాధనా విధానాలు, విశ్వాసాలు, అభివృద్ధి చెంది తమదైన పరిపూర్ణవికాసాన్ని సాధించుకునేట్లుగా ప్రోత్సహించేది, గౌరవించేదీ, నంరక్షించేదీ ఈ విశాల విశ్వంలో హిందూభావన ఒక్కటే. ఈ మాతృభూమి సంతానం ఏ రకంగా అయితే స్వాభిమానంతో, స్వేచ్ఛగా జీవిస్తున్నదో అలాగే అల్పసంఖ్యాక వర్గాలు కూడా జీవించగలగాలి. అందుకు శక్తిమంతం,పునరుజ్జీవితమూనైన హిందురాష్ట్రం మాత్రమే హామీ కాగలదు...* 🚩🚩
*అమృతవచనం - 56*
*ఈ భూతలం పైన హైందవజాతి అతి ప్రాచీనం, సంస్కృతి సభ్యతల్లో సంస్కారాల్లో సాటిలేనిది కూడా" అని శతాబ్దాల క్రితమే పాశ్చాత్యవాదులు అంగీకరించారు..*
*కానీ దురదృష్టవశాత్తూ అటువంటి ప్రాచీనమూ, మహోన్నతమైన జాతి సంతానమే, విదేశీ ప్రచారానికెరయై, తమ ప్రాచీన చరిత్ర, సంప్రదాయాన్ని మరచిపోయారు...*
*వేళ్ళు తెగి, తన గతం నుంచి, స్ఫూర్తిని పొందలేని సమాజం... ఊహలలో నైనా ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోజాలదు.*
*అమృతవచనం - 60*
*అతి ప్రాచీనము, వైభవోపేతమునైన రాష్ట్రీయత యొక్క భావాత్మకమైన పునాదిపై ఆధారపడి త్యాగపౌరుషభావాలు అనే ఊపిరి నింపుకొని స్వచ్ఛము, పరమ పవిత్రం, కళ్యాణ ప్రదము, సుసంఘటితమైన జీవితాన్ని మన ప్రజల్లో నిర్మించటానికి అంకితమయిన సంఘంవంటి సంస్థమాత్రమే మన జాతిని సంరక్షించి పునర్జీవింపచేయడానికి ఏకైకాధారం.*
*నేటివరకు నెరవేరని ఈ జీవన లక్ష్యం ఒక్కటే....,దినదిన ప్రవర్ధమానమై సర్వత్ర వ్యాపిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘకార్యానికి మూలాధారమైన ప్రేరణశక్తిగా ఉంటుంది.*
*అమృతవచనం - 61*
*మన జాతీయ అస్తిత్వం పట్ల, ప్రతిక్రియారహితమూ, భావాత్మకమునైన సుధృడ విశ్వాసం ఉన్నందువల్లనే సంఘం, బాహ్య వాతావరణంలో ఏర్పడే తాత్కాలికమైన మార్పులకు చలించక, ప్రశాంతంగా క్రమక్రమంగా తన శక్తిని వృద్ధిచేసుకొంటున్నది. స్వార్ధచ్ఛాయైనా సోకకుండా సంఘ కార్యాన్ని తన జీవనకార్యంగా స్వయం సేవక్ చేపట్టేందుకు శాశ్వతమైన స్ఫూర్తి స్రోతస్సు కాదగిన ఏది....?*
*శాశ్వతము, శక్తివంతమైన సంఘటిత సామాజిక జీవన స్థితి మాత్రమే అట్లాంటిది స్రోతస్సు కాగలదు.*
*అమృతవచనం - 81*
*సుధృడమూ,పునఃసంఘటితము, సమైక్యమునైన జాతీయ జీవితాన్ని నిర్మించటమనే, తన పవిత్ర కార్యంపై అచంచల విశ్వాసంతో అనేక సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కృషి చేస్తూ వుంది. ఈ మార్గాన్ని ఒక పవిత్ర కర్తవ్యదీక్షగా స్వీకరించింది. సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుని కృపచే అది ఈ పనిని అలాగే నిరంతరం కొనసాగిస్తోంది. ఈ కృషిలో అచిరకాలంలోనే విజయాన్ని కూడా పొంది తీరుతుంది.*
*- పరమ పూజనీయ శ్రీ గురూజీ*
*అమృతవచనం - 38*
*హిందూ అన్నది ఏ సంప్రదాయం యొక్క పేరు కాదు. అది ఉదారము, వ్యాపకము అన్న అర్థాన్నిచ్చే శబ్దము. హిందూ అన్న శబ్దం లో భారతదేశంలోని అన్ని సంస్కృతుల మానస వికాస్ చరిత్ర, అలాగే ఆరాధన పద్దతులు, సంప్రదాయాలు అన్ని మిలితమై ఉన్నాయి. హిందూ అన్న శబ్దము అనంతసాగరం లాంటిది.*
*ఇందులో అనేక నదులు అనేక పేర్లతో నీటిని తెచ్చి సముద్రంలో కనిపిస్తాయి అవన్నీ సముద్రంలో తాదాత్మ్యం చెందుతాయి.*
*- స్వామి వివేకానంద*
*అమృతవచనం*
*రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ హిందూ సమాజం యొక్క జాతీయ స్వరూపాన్ని గుర్తించి ప్రతి వ్యక్తి హృదయంలో రగులుతున్న భారత భక్తిని జాగృతం చేసి, దేశ సేవ కొరకు సర్వస్వార్పణం, సచ్చిలం, మంచి నడవడి తో కూడిన జీవితం గడపడానికి, అలాగే ఆ సేతు హిమాచలం సామరస్యపూర్వకమైన ఏకాత్మ సమాజ జీవనంను పున ప్రతిష్ట చేయుటకు విశేషమైన ప్రయత్నం చేస్తుంది.*
*-పరమ పూజనీయ శ్రీ గురూజీ*
మనది హిందూ రాష్ట్రం. మన రాష్ట్రం యొక్క సర్వాంగీణ ఉన్నతి గురించి మనం ఆలోచించినప్పుడు,.. హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజము యొక్క సంరక్షణ చేస్తూ ఉంటేనే అది సాధ్యమవుతుంది. దీని పట్ల పట్టుదలను సడలించినట్లయితే మన రాష్ట్రముగా చెప్పుకోవడానికి మిగిలేది ఏమీ ఉండదు. ఇక్కడ కేవలం ద్విపాద పశువుల సమూహం మాత్రమే మిగిలి ఉంటుంది. రాష్ట్రం పేరున మన విశిష్ట స్వభావానికి ఒక రూపాన్ని వ్యక్తీకరింపజేయడానికి ఆధారం ' హిందూ ' భావనయే. మనం ఈ విషయంలో గట్టి పట్టుదల గలవారమై ఉండాలి. ఈ విషయంలో తన మనస్సులో సందేహం ఉండే వ్యక్తి యొక్క గొంతులో శక్తి ఉండదు, ఆకర్షణ ఉండదు, అందువల్ల మనం పరిపూర్ణమైన నిశ్చయంతో 'అవును మనం హిందువులం ' అని ప్రకటించవలసి ఉంది. హిందూ అనేది మన ధర్మం, మన సంస్కృతి, మన సమాజం... వీటితో కూడినదే మన రాష్ట్రం. హిందూ రాష్ట్రం యొక్క భవ్యమైన, దివ్యమైన, స్వతంత్రమైన, సమర్థవంతమైన జీవనం రూపుదిద్దడం కోసం , నిలబెట్టడం కోసం మనం జన్మించాం.
-- పరమ పూజనీయ శ్రీ గురూజీ
సంస్కారము- విద్య అమృత వచనాలు
🚩✍️✍️🕉
*నేటి సమాజంలో కొరవడింది చత్రపతి శివాజీ లాంటి బాలలు కాదు...*
*శివాజీ నీ అలా తీర్చిదిద్దిన అతని తల్లి జిజియా మాతా, గురువు సమర్థ రామదాసు లాంటి వాళ్ళు...
*సకల విద్యల సారం సంస్కారం* అని తెలుసుకునేదాకా,
*బాలల శారీరక,మానసిక ఎదుగుదలకు మరియు వారి అభిప్రాయాలకు స్వేచ్ఛనివ్వనంతకాలం దేశం సమాజం బాగుపడది.*
*ఎందుకంటే జాతి భవితను తీర్చిదిద్దేది పార్లమెంటు మాత్రమే కాదు, కుటుంబము, పాఠశాల, మరియు సమాజము కూడా...*
*మన దేశంలో నెలకొన్న సకల సమస్యలకు పరిష్కారాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖ ద్వార పరమ పూజనీయ డాక్టర్ జి కనుగొన్నారు....,*
సంఘ శాఖలను విస్తృతం చేసినప్పుడే, భారతాంబిక పునర్వైభవం తిరిగి సిద్ధిస్తుంది.
*భారత్ మాతా కీ జై*
*#సకల #విద్యల #సారం #సంస్కారం*
*#శ్రీ #సరస్వతి #శిశుమందిరాలు*
*#సంస్కృతి #సాంప్రదాయాలకు #నిలయాలు*
విద్య యొక్క అసలు లక్ష్యం పదాలకు అర్థాలను వివరించడం కాదు, జీవితాంతం జ్ఞాన సంపాదనకు సమాయత్తం చేయడం...
రెండు అణాలు విలువచేసే ఇనుము సంస్కారం చే 300 రూపాయలు విలువగల గడియారం గా మారుతుంది..
కావున సంస్కారమునకు మాత్రమే విలువగాని పదార్థమునకు కాదు..
నేటి సమాజంలో చదువు కంటే సంస్కారం గొప్పది శాస్త్ర జ్ఞానం కంటే లోకజ్ఞానం గొప్పది.....
ఎందుకంటే సంస్కారం, లోకజ్ఞానం ఉన్న వ్యక్తి ఏ విధమైన విద్యను అయినా పొందగలుగుతాడు...
బాలగంగాధర్ తిలక్ గారి మాటల్లో జాతికి రూపు రేఖలు దిద్దేది పార్లమెంట్ మాత్రమే కాదు పాఠశాలలు కూడ అని అభిప్రాయం వ్యక్తం చేశారు...
దీన్నిబట్టి పాఠశాల నిర్వహణ ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు...
ప్రపంచంలో అన్ని దేశాలలో అన్ని రకాల సంపదలు ఉన్నప్పటికీ, మానవ వనరుల కొరత మాత్రం తీవ్రంగా ఉంది ఆ లోటును తీర్చగలిగేది ఉపాధ్యాయులు మాత్రమే...
సదాచారము, సంస్కృతి జ్ఞాన పరీక్ష, ప్రార్థన, కీర్తన, విజ్ఞానము, వినోదము, యోగ, ఆసనాలు, ఆత్మ రక్షణ విద్య, ఆట, పాటలు వంటి సమగ్ర విద్యా ఆధారిత విషయాలు పాఠశాలలో నిర్వహించగలగాలి...,
అప్పుడే విద్యార్థులలో వ్యక్తి నిర్మాణం జరుగుతుంది
కేవలం సంస్కారంతో కూడిన విద్య నే సామరస్య సమాజాన్ని నిర్మిస్తుంది.
భారతజాతి తరతరాలనుండి తన సంతతికి మహోన్నత సాంస్కృతిక, సాహిత్య కళా రూపాలను వారసత్వంగా అందిస్తూ వస్తుంది. అధ్యయన అధ్యాపకాల మీర అపార గౌరవ ప్రతిపత్తి కలిగిన ఋషి సంతతి, ఆచార్య సంతతి పల్ల ప్రాకృతిక స్పందన ద్వారా లభించిన విజ్ఞానం నేటి వరకూ నిలువగలిగింది. వర్ధిల్లగలిగింది. ఈ అధ్యాయన ఉద్దేశ్యం పారంపర్యంగా వస్తున్న ఆచారాలను విచక్షణారహితంగా, గ్రుడ్డిగా అనుసరించవలెనని కాదు. మేధస్సుకు దీప్తి కలిగించడం, సమాజానికి ఉపయుక్తంగా ఉండే విధానాన్ని రూపకల్పన చేసుకోవడం, విజ్ఞాన స్వరూప స్వభావాలను విశ్లేషించుకొని అవసరమైన మార్పులు చేసుకోవడం ఈ అధ్యయన ఉద్దేశ్యం.
ఈ రోజుల్లో యువతరంలో పఠనాసక్తి తగ్గిపోయింది. దీనికి కారణాలు ఎన్నో. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో సాధించిన ప్రగతి యువతరంలో పఠనాసక్తిని తగ్గించింది. ఉదాహరణకు టెలిఫోన్లు విస్తృతంగా రావడం వల్ల ఉత్తరాలు వ్రాసే అలవాటు చాలా మందికి తగ్గిపోయింది. రెండవది టి.వి. రంగం, ఎంటర్టైన్మెంట్ పేరుతో మానవ మేధస్సును బండబార్చే వివిధ టి.వి. చానల్స్ మధ్య యువతరం | బంధీ అయింది. మత్తులో ముంచే మధ్యపానం, లైంగిక విశృంఖలత, వీటి వల్ల జాతిలో స్తబ్దత ఫలితం ఆపార శక్తియుక్తులు గలిగిన యువతరం మర మనుషులుగా, యాంత్రికంగా, జీవచ్ఛవాలుగా బ్రతుకులీర్చేందుకు అలవాటు పడుతుంది. ఇది ప్రగతిపథంలో పయనించవలసిన జాతికి ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. గ్లోబలైజేషన్ పేరుతో కలగూరగంపగా మారుతున్న సంస్కృతిలో ఆర్థిక సంస్కరణలు : యువతరంలో నిర్లిప్తతను నింపుతున్నాయి. ప్రకటనల రూపంలో అన్ని అవకాశాలను ఉపయోగించుకొని లాభాపేక్షతో మాత్రమే సమాజంలోకి చొచ్చుకొస్తున్న అన్ని వర్గాలు యువతరాన్ని పెడత్రోవ పట్టిస్తున్నవి. వివిధ ఛానల్స్లో వచ్చే చెత్త కార్యక్రమాలతో యువత, గృహిణులు తను అమూల్య సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అంతేకాకు ఆపారమైన తమ మేధోశక్తిని నిర్వీర్యం చేసుకుంటున్నారు. ఫలితం సృజనాత్మక శక్తి కొఱవడి కమ్మని కలగా భావించి ప్రగతి సాధించాల్సిన జీవితాలు నిస్తేజంగా, అసంతృప్తితో నిండిపోతున్నాయి.
నిశ్చేతనత్వం, బుద్ధిహీనత్వం వ్యక్తులనే కాదు సమాజాన్ని కూడా భ్రష్టు పట్టిస్తుంది. నరకాసురుడు తమ కుమార్తెలను బలవంతంగా తీసుకొని పోతున్నపుడు రాజపుత్రులమనుకున్న వారందరూ చూస్తూ ఉండిపోయారు. నరకుడిని ఎదిర్చే ధైర్యం లేకుండా నిశ్చేతులైనారు.
అలాగే కృష్ణుడు నరకాసురుని సంహరించి రాకుమార్తెలను విడిపించాక తమ తమ కుమార్తెలను తీసుకొని వెళ్ళేందుకు ఏ రాజూ రాలేదట. అలాంటి తల్లిదండ్రులు-బంధువులది బుద్ధిహీనత్వం. ఈ విశ్చేతనత్వం, బుద్ధిహీనత్వం వల్ల జాతి భ్రష్టుపడుతుంది.
మనిషి మనసులో నిరంతరం చెలరేగే సంఘర్షణయే క్షీరసాగరమధనం. మానవ సమాజ శ్రేయస్సుకు తపించే తత్త్వమే అమృతం, మానవ సమాజ నాశనానికి ప్రోత్సాహించే తత్త్వమే హాలాహలం.
ఉదాసీనమైన యువతలో చైతన్యాన్ని నింపేందుకు సామాజిక స్పృహ కలిగిన ఎంతో మంది కృషి చేసారు, చేస్తున్నారు. ఎవరెంత కృషి చేసినా మారవలసిన యువతలో చైతన్యం రావాలి. తమంత తాముగా ఉదాత్తమైన లక్ష్యం వైపు పయనించేందుకు సిద్ధపడాలి. అలా వారికి ప్రేరణ కలిగించే విధంగా సాహిత్యం సృష్టింపబడాలి. ఆ సాహిత్యం వ్యక్తిత్వ వికసాన్ని కలిగించాలి. యువతను ప్రగతి పథం వైపు నడిపించగలగాలి.
ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. మానవుడు సహజంగానే చైతన్యవంతుడు. ఆ చైతన్యాన్ని నిర్లిప్తత, నిరాసక్తత, నైరాశ్యత, బద్ధకం, వాయిదా వేసుకునే లక్షణం, అసమర్ధుడననే భావన, ఆత్మ విశ్వాసం కోల్పోవడం, ఏదో ఒక ఇజానికి లొంగిపోవడంలాంటి ముసుగులతో కప్పివేసుకుంటున్నాడు. దానితో సహజ
లక్షణమైన చైతన్యం మరుగున పడుతుంది. ఒకసారి ఈ ముసుగును తొలగించుకుంటే, ప్రతి వ్యక్తి చైతన్యరూపుడే అవుతాడు. సహజ లక్షణం సంతరించుకున్న వ్యక్తి ప్రగతి పథంలో మా ప్రగాఢ విశ్వాసం.
రాకెట్గాదూసుకుపోగలుగుతాడు. తమ ముసుగును తొలగించుకొని సహాజ లక్షణాన్ని సంతరించుకోవాలని తపించేవారికి ఈ పుస్తకం ఉపయుక్తం అవుతుందని.
-------------------------------------------------------------
✍🕉☀🔥🚩
*అమృతవచనం - 40*
*నవీన భావనలో 'విద్య' అనే పదానికి గల సంకేతార్థం ఏమిటి??* అన్న ప్రశ్నతో మన ఆలోచన ప్రారంభిస్తే... *"మానవునిలో అంతర్నిహితంగా ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీయడం విద్య యొక్క పరమార్థం".* కేవలం విషయ పరిజ్ఞానాన్ని, కాస్తకాస్తగా మెదడులోనింపడం విద్య కానేరదు. మానవుని మెదడు ఒక సామానుల గది కారాదు. మానవునిలోని వివిధ శక్తులను, ప్రతిభను గుర్తించి వెలికి తీసుకురావటమే విద్య యొక్క మౌలిక లక్ష్యం...అట్టి విద్య
గణనీయమైన ఫలితాలనిచ్చింది కూడా...
*"జీవితం కేవలం కొన్ని కోరికలు మూట కాదు... మనలోని ఒక పరమ సత్యం ఇమిడి ఉన్నదని మనం అంటాం". అట్టి పరమ సత్యాన్ని సాక్షాత్కరించుకొని సాకారం చేయడమే మన ప్రాచీన హైందవ విద్యా విధానం యొక్క మౌలిక లక్షణం*🚩🚩
*అమృతవచనం - 63*
*మానవుల మధ్య పరస్పర వ్యవహారానికి భాష ఒక సజీవమైన సాధనం.అందుచేత విదేశీ భాష అయినా ఆంగ్లం తనతో పాటుఆంగ్ల సంస్కృతిని; ఆంగ్ల జీవన పద్ధతిని కూడ వెంట తెస్తుంది. విదేశీ జీవనపద్ధతులను ఇక్కడ వేళ్ళూననియ్యటం, మన సంస్కృతీ ధర్మాలకు గోతులు త్రవ్వడమే..*
మన సాంస్కృతిక వారసత్వాన్ని మన భాషల మాధ్యమంలో మన పూర్వీకులు సంరక్షించుకొన్నందువల్లనే శతాబ్దాలపాటు సాగిన విదేశీ పాలన *శ్రేష్టమైన మన జాతిని నాశనం చేయలేకపోయింది.* ఆంగ్ల భాషను స్వీకరించటం మన జీవ శక్తి యొక్క మూలాధారాన్ని సంపూర్ణంగా నాశనం చేయడమే..
*పరభాషను నేర్చుకోవడం లో తప్పులేదు... కానీ దాని పై మోజు పెంచుకుని మాతృభాషను అపహాస్యం చేయడం మానసిక దాస్యానికి చిహ్నమేగాక, ప్రపంచ దృష్టిలో మన జాతీయ ప్రతిష్ఠకు మచ్చగూడా అవుతుంది.*
*అమృతవచనం - 65*
*జాతీయత గురించి సుధృఢమైన పునాది లేకుండా మానవత్వం,అంతర్జాతీయతత్వం, వంటివి మాట్లాడటం రెండింటిలోనూ వైఫల్యాన్నే కలిగిస్తుంది.*
*మన జాతీయతత్వం, వారసత్వాలలో సర్వమానవాళి యొక్క అత్యుత్తమ సంక్షేమభావన ఎల్లప్పుడూ ఇమిడే వుంది. కాబట్టి మన విద్యా విధానంలో జాతీయభావాన్ని ఎంతటి తీవ్రస్థాయిలో బోధించినప్పటికీ, అవి మనపిల్లల మనసులను మానవ సంక్షేమ మహత్వ ప్రమాణాల నుండి ఎన్నడూ పెడ త్రోవ పట్టించదు. పైగా ఇట్టి మానవతా మూల్యాలను అది బలపరుస్తుంది.*
*అమృతవచనం - 66*
*ఆలోచనా పద్దతుల్లో, జీవన మూల్యాలను నిలబెట్టడంలో, వ్యక్తికి పరిపూర్ణ జీవితాన్ని కల్పిస్తూ, తత్ఫలితంగా జాతి కూడా పరిపూర్ణతను సమకూర్చే వివిధాంశాల పరస్పర ప్రాముఖ్యతను తగురీతిగా విశ్లేషణ చేసుకోవటంలోనూ, సమగ్రమైన సింహావలోకనం ఈనాడు అవసరం.*
*ఇది లేకపోవడమే, విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యానికి, మన సాంఘీక దోషాలన్నిటికీ కూడ ముఖ్యకారణం. ఈ ఒక్క సమస్యనూ, మనం మొత్తం నుండి విడదీసిదాన్నే సరిచేయడానికి ప్రయత్నిస్తే ప్రయోజనం ఉండదు. ఇట్టి పునర్నిర్మాణ కార్యక్రమం, మిక్కిలి శ్రద్ధతో, వెనువెంటనే ప్రారంభించకపోతే, ఇతర పరిష్కార మార్గాలు కేవలం, పైపై మెరుగులుగాను, నిష్ప్రయోజకాలుగాను ఉండిపోతాయి.*
*అమృతవచనం - 79*
*మన మహాపురుషులందరూ సమాజంలో కర్తృత్వ భావనను, పురుషకారాన్ని ఉద్భుద్దం చేయటానికి నిర్విరామంగా కృషి చేశారు. జీవితంలోని వివిధ రంగాల్లో ప్రయత్నానికి, సాఫల్యానికి ఉజ్జ్వలమైన ఉదాహరణలుగా వారు మన కన్నుల ముందు నిలిచి ఉన్నారు. అట్టి కర్మ వీరుల యొక్క సంతానం మనం.. వారి రక్తం మన నర నరాల్లో ప్రవహిస్తున్నది. వారెవరూ పుట్టుకతో మహాపురుషులై స్వర్గం నుండి ఊడి పడలేదు. ప్రయత్నం , మేధ, ధైర్యం, త్యాగం, మొదలైన పురుషోచితమైన సద్గుణాల సామర్థ్యం చేత అట్టి ఉన్నత శిఖరాలను వారు అందుకున్నారు.*
*కనీసం కొంతమేరకైనా అట్టి సుగుణాలను మన జీవితంలో సాక్షాత్కరించుకోగలమని ఎందుకు విశ్వసించరాదు? మనమొక శ్రేష్టమైన జాతిగా ఉన్నతిని పొందాలంటే ప్రాచీన మహాపురుషుల జీవితాలను, కార్యాలను పరికించినప్పుడల్లా యిటువంటి సరియైన దృష్టిని పెంచుకోవటం అత్యవసరం..*
మహర్షులు అందించిన సనాతన ధర్మం మనది. ఇతర మతాల వారు పిల్లలని బాల్యం నుండి వాళ్ళ మతాలపై మంచి అవగాహనతో పెంచుతారు. కానీ సనాతన ధర్మమైన హిందూమతంలో పిల్లలు మాత్రం సరైన అవగాహన లేకుండా పెరుగుతున్నారు. యుగాల క్రితమే ఙ్ఞానం, విఙ్ఞానం, అంతులేని నైతికత ఇలాంటివన్నీ నేర్పింది మన మతం. కానీ దాని స్వరూపంపై పెద్దలకే సరైన అవగాహన లేదు. అందువల్ల పిల్లలకు లలిగించలేకపోతున్నారు.
సనాతన ధర్మం అంటే ఆలయాలకి వెళ్ళి దండం పెట్టుకోవడమే అనుకుంటున్నారు. ఈమధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. అందుకే వివరణ ఇవ్వడం జరుగుతోంది.
మన మతానికి ప్రవక్త ఎవరు? దేవుడు ఎవరు? గ్రంథం ఏమిటి?
ఇవీ పిల్లలు అడిగేవి. ఎందుకంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క దేవుడు, గ్రంథం, ప్రవక్త కనబడుతున్నారు. మనకి అలా లేదేమిటి అని అడుగుతున్నారు. దీనినిబట్టి చూస్తుంటే ఇతర మతములు ఎలాగో ఇది కూడా అలాంటిదే అనుకుంటున్నారు. మరి ఒక మతానికి ఒక గ్రంథం ఉంది. కనుక అన్ని మతాలకు ఉండాలని, ఒక మతానికి ఒక ప్రవక్త ఉన్నాడు కనుక మన మతానికి కూడా ఉండాలని చెప్పడానికి లేదు. ఒక్కొక్క మతస్వరూపం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎక్కువ తక్కువలు దేనికీ లేవు. అన్ని మతాలనీ మనం గౌరవిద్దాం.
హిందూమత గ్రంథాలు
కానీ మన మతంపైన అవగాహన కలగాలి. మన మతం పేరు సనాతన ధర్మమని, హిందూధర్మమని, ఆర్ష ధర్మమని పేరు. అయితే విశేషించి ఈ సనాతన ధర్మంలో ఒక గ్రంథం అంటూ ఉండదు. ఙ్ఞానం ఉంటుంది. అయితే ఙ్ఞానం గాలిలోంచి వచ్చినట్లుగా కాకుండా దీనికీ ఏదైనా గ్రంథం చెప్పుకోవాలి అంటే సనాతన ధర్మానికి ఆధార గ్రంథం వేదం.
“వేదోక్తేన ధర్మమిదం” అని చెప్పుకోవాలి. వేదము యొక్క భాష కానీ, అందులో వచ్చిన అంశములు కానీ సామాన్య జనులకి ఉపదేశించే నీతి వాక్యాల్లా ఉండవు. మంత్రాలు ఉశుల సమాధి స్థితిలో దర్శించిన దివ్య శబ్దాలు. పరమ సత్యం సమాధి స్థితికి అర్థం అవుతుంది. కానీ మామూలు మనుషుల ఊహ, తర్కానికి, ఆలొచనకి గొప్ప ధర్మాలు అర్థం కావు. అది తపస్సు చేత వికసించిన అతీంద్రియ ప్రఙ్ఞ కలిగిన ఋషులు ఏ సత్యాన్ని దర్శించారో ఆ సత్యాల సమాహారమే వేదము.
కనుక వాటిలోని అంతర్యాలని, అవి మనకు చూపిస్తున్న జీవన విధానాన్ని మనకి అందించడానికి మహర్షులు మరొక పనిచేశారు. అవే పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు. కనుక వేదాలు మొదలుకొని పురాణ, ఇతిహాస, ధర్మ శాస్త్రముల ద్వారా మన సనాతన ధర్మం వర్ధిల్లింది. కనుక పిల్లలు అడిగితే మనం చెప్పవలసింది సనాతన ధర్మానికి ఆధారం వేదం అని. వేదములలోని లోతైన భావాలు సామాన్యులకు అందజేయడానికై ఆ వేద ఋషుల్లో కొందరు మనకు పురాణాల్ని, ఇతిహాసాల్ని అందించారు. వారిలో వాల్మీకి, వ్యాసుడు, అగస్త్యుడు ఇలా ఎంతోమంది చెప్పబడుతూ ఉంటారు. వారందరూ ఇటు పురాణాల్లోనూ, అటు వేదాల్లోనూ తెలియబడుతూ ఉంటారు.
అంటే వేదాలలో ఉన్న మహర్షులే మనకి పురాణ, ఇతిహాసాల్లోని ఙ్ఞానాన్ని అందించారు.
ఇది సామాన్యులకు కూడా చేరడానికి వారు చేసిన ప్రక్రియ. అందుకే హిందూమతం అత్యంత సామాన్య జనుల్లోకి కూడా చొచ్చుకుపోయింది.
ఇవి హిందూమతానికి గ్రంథాలు అని తెలుసుకోవాలి.
హిందూమతానికి ప్రవక్తలు ఎవరు?
ఇక హిందూ మతానికి ప్రవక్త ఎవరు? అంటే పరమేశ్వరుడే. “యస్య నిశ్వసితం వేదాః” అంటే పరమాత్మయొక్క ఊపిరియే వేదములు. పరమేశ్వరుడు ప్రవక్త అయినప్పటికీ కూడా పరమేశ్వర స్వరూపమైన వేదాలను మహర్షులు దర్శించారు.
కనుక మహాత్ములు అందరూ ప్రవక్తలే అని చెప్పుకోవాలి. ఈ మహర్షులు వేల సంఖ్యలో ఉన్నారు. ఇది ఒక ప్రవక్త ఇచ్చిన విఙ్ఞానం కాదు. అనేకమంది మహర్షులు ఇచ్చిన విఙ్ఞానం. సాధారణంగా ఇద్దరు, ముగ్గురు మూడు మాటలు చెప్తేనే ఒక మాటకి ఇంకొక మాటకి పొంతన కుదరదు. ఒక వ్యక్తికీ, మరొక వ్యక్తికీ పొంతన కుదరదు. ఇంతమంది మహర్షులు ఇంత విఙ్ఞానం ఇచ్చినా ఎక్కడా పరస్పర విరుద్ధంగా లేవు. ఇది మనం తెలుసుకోవలసిన గొప్ప అంశం.
ఎవరియొక్క విఙ్ఞానం వారిదే అయినా ఒకరి విఙ్ఞానానికి ఇంకొకరి విఙ్ఞానానికి వైరుధ్యం లేదు. ఇవన్నీ కలిపి సనాతన ధర్మం అనిపించుకుంటుంది. అది మన మతం యొక్క ప్రత్యేకత. ఈవిషయాన్ని పిల్లలకు తెలియజేయగలగాలి.
"బాల సంస్కారకేంద్రాలు"
మన సమాజం బాగుపడాలి అన్న తపన ఉన్న ప్రతివారు వెంటనే ఆచరణలో పెట్టగల సత్వర కార్యం!
వారినికో రోజు;ఒకగంట! దూరం పోనవసరంలేదు! ఏ వీధికా వీధి! ఏ అపార్ట్ మెంట్ కి ఆ అపార్ట్ మెంట్! విశ్రాంత ఉద్యోగులు;గృహిణులు; పెద్దలు;ఇలా!..వారానికొకరోజు తమ టీవీ చూసే సమయంలో ఒక గంట వెచ్చించి , ఒక పదిమంది బాలబాలికల్ని పోగేసి మన సంస్కృతి పట్ల అవగాహన కల్పిస్తే చాలు!"
👆🚩🚩🚩
సనాతన ధర్మాన్ని స్వీకరించిన పాశ్చాత్య దేశాల్లో తమపిల్లలకు చిన్నతనం నుంచే దైవ భక్తి ధర్మ రక్షణ పట్ల ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
అదే మన దేశంలో పాశ్చాత్య సంస్కృతి పై మోజు సంస్కారం నేర్పని చదువులు, దేవుడంటే ఎగతాళి సమాజం పట్ల బాధ్యతారాహిత్యం .. మన పిల్లల జీవితం మనపైనే ఆధారపడి ఉంటుంది.దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? అని the...
చిన్నపిల్లలే కాదు ..నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.
మనవాళ్లు వెంటనే చెప్పే సమాధానం.. " అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని .
మనకు భవవంతుని గురించి అవగాహనలేనప్పుడు... చెప్పడం చేతగానప్పుడు
... మనం వాడే మాట అదే!.
కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్ కాదు గదా !.
మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు.
తెలియని వారికి అలా చెప్పడం వల్ల ...వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి.
పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, . మనసుతో చేసే వ్యాయామం.
మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి ....మన మెదడుని మనమే ట్యూన్ చేసుకునే ప్రక్రియ.
దీప ప్రజ్వలనం అనేది..... త్రాటకం అనే యోగ ప్రక్రియ.
రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.
ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు.
అది నాలికకు ఎక్సర్‌సైజ్. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది
ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే...స్టేజ్ ఫియర్ కూడా పోతుంది.
పూజ అంటే చాదస్తం కాదు .మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి.
మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి.
అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరం గా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది.....
🙏🌷🙏🚩🚩🚩🚩🚩🚩
*అందరికీ నమస్తే,*🙏
*పిల్లలకి కింద తెలిపిన అంశాలు నేర్పిస్తే , మరియు వాటి పట్ల సమయం తీసుకొని ఆలోచిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది .*
*1) *సంఘ ప్రార్థన (బాలలకు) & సేవిక సమితి ప్రార్థన (బాలికలకు) నేర్పండి*
*2) *ఎవరైన ఇంటికి వస్తే రెండు చేతులు జోడించి నమస్కారం/జై శ్రీరామ్/జై హింద్ చెప్పమని నేర్పిస్తే బాగుంటుంది.🙏*
*3) *ప్రతి రోజు నుదుట బొట్టు పెట్టుకోవడం నేర్పండి. బొట్టు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేస్తే ఇంకా బాగుంటుంది*
*4) *శివాజీ,వివేకానంద లాంటి మహనీయుల గురించి చెప్పండి. వారి చిత్రపటాలు మన ఇండ్లలో ఉండేలా చూసుకోవాలి*
*5) *మనం హిందువులం(భారతీయులం) అనే మాట పదే పదే చెప్పండి. అంతేగాని మనం ఫలానా కులం వాళ్లని , మన కుల చరిత్ర ఇంత గొప్పదని సంకుచిత భావాలు నాటకండి*
*6) *మీ గ్రామం లో RSS శాఖ ఉంటే ప్రతి రోజు శాఖ కి పంపండి.*
*7)*పండగలు,పబ్బాల సమయంలో సామూహికంగా జరుపుకునే విధంగా చూడాలి.*
*8)*పిల్లలు చదువుకునే పాఠశాలలో చదువుతోపాటు , సాంస్కృతిక కార్యక్రమాలలో ఏలాంటి శిక్షణ వుంటుందో తెలుసుకొని అవి మన సంస్కృతిని , సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉన్నాయా??? ఉంటే వాటిలో పాల్గొంటున్నారా?? అని*
*తెలుసుకొనాలి. లేకుంటే కొన్ని ప్రమాదకర శక్తులు కాచుకొని కూర్చున్నారు వారి మెదళ్ళలో విషబీజాలను నింపడానికి.*
*భారత్ మాతా కీ జై*
*జై శ్రీరామ్🙏*
(HSS)Amrutvachan
Through the process of introspection, we must rid ourselves of all weaknesses.
We should acquire such attributes as may contribute to the enhancement of our
work and due to which we can attract other people towards us.
- Dr. Hedgewar
The secret of Shivaji’s success lay particularly in motivating the people to
strive and sacrifice for the establishment of a free Hindu State and not for the sake
of any individual king or chieftain. He transformed the idea of personal loyalty to
some particular chieftain into one of loyalty to the entire nation and its liberty.
- Shri H.V. Sheshadri
Man has realised, from his experience, that the success of a great venture,
is the result of putting together many small efforts, to produce a powerful force.
Similarly, success is secured, even in a work considered to be very difficult, when
millions of people gather for an hour every day, in a disciplined and dedicated
manner.
- Shri Guruji Golwalkar
The grace of the Guru is like an ocean. If one comes with a cup he will only
get a cupful. It is no use complaining of the niggardliness of the ocean. The bigger
the vessel the more one will be able to carry. It is entirely up to him.”
- Ramana Maharshi
The test of true friendship is the ability to remain unoffended in face of
adverse comments. Even if a person says or does something which in the eyes of
others appears to harm or insult him and still he does not in the least feel its prick,
then alone can he claim true friendship with that person.
- Shree Guruji Golwalkar
We are to take care of ourselves-that much we can do-and give up attending
to others for a time. Let us perfect the means; the end will take care of itself. For
the world can be good and pure, only if our lives are good and pure. It is an effect,
and we are the means. Therefore, let us purify ourselves. Let us make ourselves
perfect.
- Swami Vivekananda
The Sanskrit meaning of Yoga is 'unite' or 'connection' in the sence of physical, mental and spiritual wellbeing. Let's harness these elements to make ourself a better person for the service of the samaaj (society) and be united.
May all be healthy and happy!
పుణ్యభూమి భారత్ అమృత వచనాలు
*అమృతవచనం : 21*
*భారతదేశ చరిత్ర పరాజయ చరిత్ర కాదు..*
*గౌరవశాలియైన సంఘర్షణ చరిత్ర, ధర్మము, సంస్కృతుల పరిరక్షణ కోసం భారతీయ సాధుసంతులు వీరనారీమణులు చేసిన సుదీర్ఘమైన, త్యాగమయ సఫల సంఘర్షణ వంటిది...., ప్రపంచంలోని మరే దేశంలో జరగలేదు. ప్రపంచంలో గొప్ప గొప్ప సంస్కృతి వెల్లివిరిశాయి. కాలం విసిరిన దెబ్బల దాటికి శతాబ్దాల కాలంలోనే అవన్నీ ధ్వంసమై పోయాయి. కాని హిందూసంస్కృతి మాత్రం వేలాది సంవత్సరాల భీకరమైన దాడులను తట్టుకుని కూడా జీవించియున్నది.*
*- డాక్టర్ నిత్యానంద జి*
*అమృత వచనం - 52*
*"మాతా భూమిః పుత్రోహమ్ పృథివ్యాః"*
*భావార్థం ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను...అని.*
*ప్రతి ధూళికణంలో దివ్యత్వాన్ని నింపుకున్న ఈ భూమి మనకు శ్రద్ధా కేంద్రం మరియు పరమ పవిత్రము..*
*మాతృభూమి పట్ల భక్తి జగన్మాత యెడల ఉదాత్త భక్తి ఒక్కటే అనే తలంపును ఈ భావన ప్రతి హృదయంలో రగిలిస్తుంది.*
*మన దేశం మనకు జీవం లేని ఒక జడ పదార్థం ఎన్నటికీ కాదు కానేరదు... నీచుడు ఉన్నతుడు అనే తేడా లేకుండా మనందరకు ఈ భూమి ఎల్లప్పుడూ చైతన్య పూరితమైన జగజ్జననియే
దేశభక్తి అమృత వచనాలు
*చైతన్య సహిత దేశభక్తి*
*చైతన్య సహిత భక్తి అంటే మాతృదేశ కణకణం యొక్క స్వాతంత్ర్య గౌరవాల సంరక్షణార్ధం సర్వస్వార్పణ చేయడానికి నిత్యసంసిద్ధతను దైనందిన జాతీయజీవనంలోరూపొందించుకోవడమే.వ్యవహారప్రధానమైన నేటి ప్రపంచంలో ఇట్టి భక్తికే తావుంది.*
*తన శ్రద్ధాకేంద్రానికి, తన మాతృదేశానికి జరిగే చిన్న విసమెత్తు అవమానాన్నైనా, ఇట్టి భక్తి భావం ప్రజ్వరిల్లే హృదయం సహించలేదు. వెంటనే ఒక మహా భయంకర రూపాన్ని దాలుస్తుంది మాతృ దేవిని అవమానించిన దురాక్రమణ శక్తులు మరొకసారి తలెత్తకుండా నాశనం చేయందే విశ్రాంతినొందదు.*
*జరిగిన అవమానాలు అంతకుమొందేదాకా ఆ హృదయంలో అసంతృప్తి జ్వాలలు ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి.*
----------------------------------------------------------
దేశభక్తి: అర్థము మరియు వ్యవహారము
* ఆంగ్లేయుల పాలనాకాలంలో నిషేధాత్మక వ్యతిరేకత రైళ్ళను పడగొట్టడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే' దేశభక్తి.
.దేశభక్తి పట్ల మన కల్పన 'సకారాత్మకం', 'ప్రతిక్రియాత్మకం' కాదు. దేశభక్తి అంటే అర్థం కేవలం భూమిపట్ల ప్రేమ మాత్రమే కాదు. మన మనస్సులో ఇక్కడి జలచరాలు, భూచరాలు, ఆకాశచరాలు, ప్రకృతి, సంస్కృతి, చరిత్ర, మహాపురుషులు, కళలు, విజ్ఞానం మొదలగు వాటన్నింటినీ తనవిగా భావించడం మరియు వాటిని రక్షించడంలో తీవ్రమైన కోరిక, వాటి అభివృద్ధి కోసం అన్నింటినీ వదలుకోవడానికి కూడా సిద్ధపడటం.
దేశభక్తి ప్రకటీకరణం
* మనసా, వాచా, కర్మణా దేశభక్తి భావన ప్రకటీకరించబడాలి. మనసా పుట్టుకతోనే దేశభక్తి, స్వాభావికమైన ప్రక్రియ. ప్రమాదవశాత్తు కాదు. ఉదా॥ సుభాష్ చంద్రబోసు, గాంధీ మొ॥ మహాపురుషుల జీవితాల్లోని అనేక సంఘటనలు మరియు జలియన్వాలాబాగ్ దురంతానికి వ్యతిరేకంగా రవీంద్రనాథ ఠాగూర్ 'సర్' బిరుదును తిరిగి ఇచ్చేయడం. ప. పూ. డాక్టర్జీ పుట్టుకతోనే దేశభక్తికి సాక్షాత్కార మూర్తిరూపం.
వాచా విడగొట్టడానికి కాదు కలిపి ఉంచడానికి భాష. ఏ వర్గం, సంప్రదాయం- పట్ల వ్యతిరేకత లేదు. వివేకానంద, గురూజీ, దీనదయాళ్ ఉదాహరణ.
కర్మణా - ఖండోబల్లాల్, దుర్గాదాస్, బందాబైరాగి, గురుతేగ్బహదూర్ ఉదా||
** కామం, క్రోధం, లోభం, మోహం, భయం, ఈర్ష్య, ద్వేషం, స్వార్ధం లాంటి వాటిద్వారా దేశం మరియు సమాజానికి ఎంతో నష్టం. కాబట్టి మనసా, వాచా, కర్మణా దుర్గుణాల వల్ల మన సమాజం, దేశం నష్టపోకూడదు. దీనికోసం స్వయంగా అన్నివేళలా తయారుగా ఉండాలి, సమాజాన్ని కూడా దీనికోసం స్వయంగా సిద్ధం చేయాలి.
* మన దేశంలో ధర్మం, సంస్కృతి పట్ల స్వాభిమాన భావన అంటే దేశభక్తి.
(To be proud of Dharma, Sanskriti to be proud of being a Hindu)
Swami Vivekananda
----------------------------------------------------------
*ఆచరణపూర్వకమైన దేశభక్తి భావనలో ప్రజలకు నేడు శిక్షణ ఇవ్వవలసి ఉంది. దేశ క్షేమం ఆశించినంత మాత్రాన చాలదు; జాతీయ సంక్షేమాన్ని గురించిన ఆకాంక్షలను మన ప్రవర్తన లో ఎంత ఉత్తమంగా వ్యక్తం చేయగలమో ప్రతి ఒక్కరము తెలుసుకోవాలి.*
*- పరమపూజనీయ శ్రీ గురూజీ*
----------------------------------------------------------
క్షాత్రధర్మాన్ని అపార్థం చేసుకొన్నందువల్లనే ఆత్మ బలిదానం కోరుకుంటూ అనేక మంది వీరులంతా తమను తాము నాశనం చేసుకున్నారు. అది కూడా
ఒక విధమైన బలహీనతే... పరిస్థితుల తీవ్రత తట్టుకొని నిలువలేక మూకుమ్మడిగా కోపోద్రిక్తులై దాని ఒత్తిడికి నలిగిపోవటం మన ఆదర్శం కానేరదు. *పెడద్రోవ పట్టించే పరిస్థితుల్లో చలించనీయక, అంతిమవిజయం సమకూర్చగల ప్రశాంతము, సమీకృతమునైన ఇచ్ఛాశక్తి ఉన్నప్పుడే అంతిమవిజయం సాధ్యమౌతుంది.* అది తీవ్ర ఉద్రేకాలకు లోనయ్యే వాళ్ళలో ఉండజాలదు.. అందుకే పరిస్థితుల పట్ల ప్రతి క్రియ కాదు క్రియ కావాలి.
----------------------------------------------------------
*మన తరానికి చెందిన నాయకులు భారతజాతియందు గల భక్తి, విశ్వాసం నేడు పరీక్షకు గురి అయ్యాయి. ప్రాచీనము, అమరమైన మన జాతి పట్ల ప్రగాఢ ప్రేమను, దృఢ నిశ్చయాన్ని, ధైర్యాన్ని చూపవలసిన నేటి ఈ చారిత్రక సమయంలో వారు ప్రదర్శించే కార్యాన్ని బట్టి, వారు తీసుకునే చర్యలను బట్టి, వారు పదహారువన్నెల బంగారమా లేక నకిలీ బంగారమో తెలిసిపోతుంది.*
*ప్రేమ పూర్ణమైన ఏకత్వంలో ప్రజలందరూ కలిపి ఉంచే సవ్యమైన ధర్మపథంలో సర్వదా ఈ హిందూరాష్ట్రానికి తన దివ్యమైన జ్ఞానప్రబోధంచేత మార్గదర్శనం చేస్తున్నటువంటి సర్వశక్తిమంతుడు పరమేశ్వరుడు, ఈ సమయంలో మన నాయకులకు మార్గదర్శనంచేసి, వారికి సవ్యమైన అవగాహనతో కూడిన స్ఫూర్తి నొసగి, మహత్తరమైన మన సమాజం యొక్క మహోజ్వల పునరుజ్జీవనం కొరకు సరియైన మార్గం అనుసరించజాలిన ధైర్యాన్ని కలుగజేయునుగాక...!!*
*- పరమ పూజనీయ గురూజీ*
----------------------------------------------------------
*మన మాతృసమాజాన్ని ప్రగాఢమైన జాతీయ చైతన్య భావనతోను, సమన్వయంతోను ఉప్పొంగజేసి మరొకసారి సమైక్యం, సంఘటిత, జాగరూకం చేయడం ద్వారా, జాతికి పట్టిన మౌలికజాడ్యాన్ని నిర్మూలించడానికి మనమందరం కృతనిశ్చయం కావాలి. ఈ లక్ష్యసాధనకై మాతృభూమి సంతానమైన ప్రతి ఒక్కరికి సమైక్య జాతీయత సందేశాన్ని అందించి వారందరినీ పరస్పర ప్రేమానుశాసనాల సూత్రాలతో బంధించి, ఒక మహత్తరమైన సుసంఘటితరూపంగా తీర్చిదిద్దాలి. అటువంటి జాగరూకం, సువ్యవస్థితమ్ము, అజేయశక్తి సంపన్నమునైన జాతీయ జీవనమొక్కటే యుద్ధ ప్రమాదాల్లో మునిగితేలే నేటి కల్లోలిత ప్రపంచంలో మనం తలెత్తుకొని జీవించేటట్లు చేయగలదు.*
----------------------------------------------------------
*ఆత్మవిస్మృతికిలోనైన ఈ విశృంఖల సమాజమే దేశ తిరోగమనాని కి కారణం.*
*సమాజం యొక్క విస్మృతిని దూరంచేయాలి. నా మాతృభూమి, సమాజమంతా నాదే, ఇది నాదేశం; ఈ భూమిలో సర్వ సమర్థమైన, వైభవ సంపన్నమైన, సుస్థిర ప్రభుత్వం గల స్వాభిమానపూర్వకమైన జాతి జీవనాన్ని స్థాపించాలనే అనుభూతిని ప్రతి ఒక్కరి అంతరంగంలో నిర్మాణం చేయాలి. ఈ జాగృతి, మన నిత్య వ్యవహార బలంపై సమగ్ర సమాజాన్ని ఆత్మవిశ్వాసమనే త్రాటిపై నిలబెట్టాలి. అందరికీ అనుశాసనం అలవాటు చేసి ఆసేతు హిమాచలం, అన్ని సమస్యలను ఎదుర్కో గల్గిన యోగ్యమైన సంఘటిత జాతీయ శక్తి రూపంలో మన సమాజాన్ని నిలబెట్టాలి. ఇది తప్ప ఇంకే మార్గమూ లేదు.*
- పరమ పూజనీయ గురూజీ
----------------------------------------------------------
ధ్యేయనిష్ట
*అమృతవచనం - 8*
*ఒక వ్యక్తిని రూపు దిద్దడంలో మంచిచెడులు సమానంగా పాలు పంచుకుంటాయి. ఈ ప్రపంచం సృష్టించిన మహోన్నత వ్యక్తిత్వాలను పరిశీలిస్తే పేదరికమే ఎక్కువ పాఠాలు నేర్పిందని, పొగడ్తల కన్నా ఎదురు దెబ్బలే వ్యక్తిలోని ఆవేశాన్ని రగిలించి పట్టుదలను పెంచాయని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను.*
*- స్వామి వివేకానంద*
*అమృతవచనం - 9*
*ఎవరికీ తన దేశము దేశసోదరులు తప్ప మరొకటంటే ఎట్టి వ్యామోహం లేదో, ఎవరికీ తన కర్తవ్యం, కర్తవ్యపాలన తప్ప మరొక వృత్తి లేదో, ఎవరికీ తన హిందూ ధర్మం అభివృద్ధి చెంది హిందూ ప్రతాపభానుని నిరంతరం మహా తేజశ్శాలిగా ఉంచాలనే ధ్యేయం తప్ప మరో స్వార్థం లేదో అట్టివాని హృదయంలో భయము, దుఃఖము, నిరుత్సాహం జనింపచేయడం ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు.*
*- పరమ పూజనీయ డాక్టర్ జీ*
*(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆద్య సర్ సంఘచాలక్)*
*అమృతవచనం - 13*
*దేశంలోని హిందువులందరూ కలసి ఉదయం, సాయంత్రం 10నిమిషాల పాటు సామూహిక ప్రార్థన చేస్తే హిందూ రాష్ట్రానికి (భారతదేశానికి ) అపజయమే ఉండదు.*
*- సోదరి నివేదిత*
Comments
Post a Comment