పుణ్యభూమి భారత్ - సుభాషితాలు
1. "ఆసింధు సింధు పర్యంతా యస్యభారత భూమికా
పితృభూః పుణ్యభూశ్చైవ స వై హిందురితి స్మృతాః"
భావం : ఉత్తరాన సింధూనది నుంచి దక్షిణాన సముద్రం వరకుగల ఈ విశాల భారత దేశాన్ని ఎవరు పితృభూమిగా, పుణ్యభూమిగా భావిస్తారో వారే హిందువులు..
-వీరసావర్కర్.
2.*ఆగస్టు 14*
*అఖండ భారత్ సంకల్ప దివాస్*🚩🚩🚩🚩
*అఖండ భారతస్తుతి*
*అఖండం భారతం నౌమి*
*నవద్వీప సంచితమ్*
*నానాచార విచారాఢ్యం*
*నానాజాతి సమన్వితం*
*భావం:*
నవద్వీపాలతో కూడినది అనేక జాతులతో, వివిధములైన ఆచారాలతో, తత్వవిచారలతో కూడినది అయిన అఖండమైన భారతదేశమును స్తుతించెదను.
*వివరణ:*
నవద్వీపములు :
1.ఇంద్ర, 2. శ్వేత, 3. తామ్రపర్ణి, 4. గభస్తి 5.నాగర్, 6. సౌమ్య, 7.గాంధర్వ, 8. వారుణ, 9. జంబు
*శ్లోకం*
3. యావత్ర్పోన్నత సాను భిర్ హిమగిరిః రక్షత్యయమ్ మేదినీం యావత్ శంకర శేఖరా ద్వహతివై గంగా ప్రవాహో భువిః
యావత్ చంద్ర దివాకరౌ
గగనతో యాతో న చాధస్థలం హిందునామియ మార్య భూరితి భవేత్ తావన్మనోనిశ్చియః
*భావము :*
*ఎప్పటివరకైతే ఎత్తైన హిమగిరి శిఖరాలు ఈ భూమిని రక్షిస్తూ ఉంటాయో, ఎప్పటివరకు శంకరుని యొక్క జటాజుటం నుండి భూమిపైకి గంగానది ప్రవహిస్తూ ఉంటుందో, ఎప్పటివరకు సూర్యచంద్రులు గర్వమును వీడి (అధఃతలానికి) భూమిపైకి రారో, అప్పటివరకు హిందువుల యొక్క ఈ భూమి భరత భూమియే అని మనస్ఫూర్తిగా నిశ్చయం కలిగి యుండవలెను.*
4. హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందూస్థానం ప్రచక్షతే ॥
హిమాలయ పర్వతముల నుండి హిందూ మహాసముద్రం వరకు గల ఈ విశాల దేశము దేవతలచే నిర్మింపబడిన స్వతస్సిద్ధమైన దేశము. ఇదే హిందుస్థానము, లేదా హిందూదేశంగా ప్రసిద్ధి చెందింది.
5. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తత్ భారతం నామ భారతీ యత్ర సంతతిః ॥
హిందూ మహాసముద్రానికి ఉత్తరాన హిమాలయాలకు దక్షిణా గల భూభాగాన్ని భారతవర్షం అంటారు. దీని సంతానమే భారతీయులు.
భారతదేశం స్వతస్సిద్ధమైన దైవదత్తమైన దేశం. భరతుడు పాలించిన దేశం కాబట్టి భారతదేశం. అంతేగాకుండా భా అంటే జ్ఞానము, రతః అంటే ఆసక్తి కలిగి ఉండుట అనగా జ్ఞానమునందు ఆసక్తి కలిగిన దేశం కాబట్టి ఇది భారతదేశం అయింది. దీనినే హిందూ దేశం అంటారు. అందుకే ఈ దేశంలో పుట్టినవారిని భారతీయులు లేదా హిందువులు అంటారు.
6. గాయంతి దేవాః కిల గీతకాని
ధన్యాస్తు యే భారత భూమి భాగే
స్వర్గాపవర్గాస్పద హేతు భూతే:
భవంతి భూయః పురుషాః సురత్వాత్ ॥
భారత భూభాగంలో జన్మించి నివసించే వారెంతో ధన్యులని భారత భూభాగము స్వర్గమునకు అపవర్గము (మోక్షము)నకు కారణ భూతమగుచున్నదని, ఆ దేశంలోని మనుష్యులు కూడ దేవతలవుతూ ఉంటారని, దేవతలు గానం చేసుకుంటూ ఉంటారట.
7. కాయేన మనసా వాచా ధనేనాపి జనేన చ ।
స్వదేశ రక్షణార్థాయ యతేత మతిమాన్ జనః॥
శరీరం, మనస్సు, మాట, పని, ధనము, జనము వీటన్నింటి ద్వారా బుద్ధిమంతులు స్వదేశరక్షణ కొరకు ప్రయత్నిస్తారు.
8. అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ।।
లక్ష్మణా! ఈ లంక స్వర్ణమయమై ప్రకాశిస్తోంది. అయినప్పటికీ నాకు ఇది రుచించదు. ఇక్కడ నివసించడం నాకు ఇష్టం కాదు. ఎందు కంటే జనని, జన్మభూమి రెండూ స్వర్గము కంటే గొప్పనైనవి. (ఇవి రావణవధ తరువాత శ్రీరాముడు లక్ష్మణునితో పలికిన మాటలు).
Comments
Post a Comment