బౌద్దిక్ - 3 మన గురువు భగవద్ధ్వజం


                       బౌద్ధిక్  -1.                      
#మన #గురువు #భగవాద్‌ధ్వజం  
🚩🚩🚩
*అమృత వచనము*

*దేనిని చూస్తే మనకు ప్రేరణ, స్ఫూర్తి లభిస్తాయో, ఆదర్శం, జీవన లక్ష్యం యొక్క జ్ఞానం కలుగుతుందో, శ్రేష్ఠమూల్యాలను రక్షించడానికి పోరాడేటపుడు తమ వ్యక్తిగత జీవితాలను సమర్పిస్తూ సంతోషం పొందగలుగుతారో వాటన్నింటికి ప్రతీకయే ఈ భగవాధ్వజం..*

*-  పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ* 

శ్రీ గురుపూర్ణిమ అనీ, వ్యాస పూర్ణిమ అనీ వ్యవహరించే ఈరోజు మనకు ఎంతో ప్రముఖ పవిత్ర పర్వం. అనంత విజ్ఞాననిధులైన వేదాలను విభజించి, సువ్యవస్థితం చేసి మనకు అందించినవారు మహామహులైన వ్యాసమహర్షియే. 

అష్టాదశపురాణేషు వ్యాసస్య వచనం ధృవం|
పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం||

యుగయుగాలుగా భరత వర్షంలో వికసించిన ఉత్తమమైన సద్గుణ సంపత్తిని ప్రపంచానికి ప్రకటించినదానిలో అంతర్లీనమై యున్న ఆలోచనకు, ఆదరణకు నడుమగల మనోహర సమన్వయాన్ని ఆయన మనకు అందించారు. ఆయన కృషి మనకు మాత్రమేగాక మానవ జాతి కంతకు కూడ మార్గదర్శనం చేసే దీపస్తంభం లాంటిది. కాబట్టి వేదవ్యాసుని జగద్గురువు అంటే ప్రపంచ ప్రబోధకుడని చెప్పటం సముచితం. ఇందుచేతనే గురుపూజని, వ్యాసపూజ అని కూడా చెప్పుకుంటున్నారు.

ఈ రోజున మనం మన గురువునకు- వారెవరైనప్పటికీ అర్చన చేసి, వారి పాదాలవద్ద ఆశీస్సులు కోరి మన వినయపూర్వక సమర్పణ చేస్తాం. వారి ఆశీస్సులను కోరి, వారి మార్గదర్శకత్వపు వెలుగుల్లో మన జీవన లక్ష్యసాధనా మార్గంలో ముందడుగు వేసేందుకు దృఢనిశ్చయం చేసుకుంటాం.

సాధనా మార్గంలో ముందడుగు వేసేందుకు దృఢ నిశ్చయం చేసుకుంటాం....

#రాష్ట్రీయ #స్వయంసేవక్ #సంఘ్ #కార్యపద్ధతికి సంబంధించినంతవరకూ సంఘం ఏ ఒక్క వ్యక్తిని గురువుగా భావించలేదు.
వ్యక్తి ఆరాధన కంటే ధ్యేయ నిష్ఠయే  సంఘ కార్య పద్ధతికి మూలం..
మన శాస్త్రాలు గురువు యొక్క లక్షణాలను ఉజ్వల పదజాలంతో ప్రశంసించాయి.గురువులకు సాక్షాత్తు దైవం తో సమానం అయిన స్థానాన్ని ఇచ్చాయి. అట్టి గురువును ఒక మానవునిలో చూడగలగడం దాదాపు అసంభవమే. ఏ మానవుడైనా ఏదో ఒక దోషం గానీ ,లోపం గానీ లేకుండా పరిపూర్ణుడిగా ఉంటాడని మనం ఊహించలేము. మానవునిది అశాశ్వతమైన అస్తిత్వమే. అతడు తరతరాలకు ఒక జాతికంతకు శాశ్వతమైన మార్గదర్శకుడు కాలేడు.

అందుచేతనే సంఘంలో మనం మన జాతీయ వారసత్వం లోని మహోన్నతమైన మహోదాత్తమైన ఉమ్మడిగా ప్రతిబింబించేలా ఒక ప్రతీకను గురువుగా స్వీకరించాము అదే మన పవిత్ర మైన భగవాన ధ్వజం...🚩🚩

#యజ్ఞభావనకు #ప్రతీక #భగవత్ ధ్వజం

యజ్ఞము అంటే త్యాగం భావన - మన సాంస్కృతిక వారసత్వం లో కీలకమైన స్థానం కలిగి ఉంది. యజ్ఞం పదానికి అనేక అర్థాలున్నాయి.

సమాజ పునరుజ్జీవన కార్యంలో తన వ్యక్తిగత జీవితాన్ని సమర్పణ చేయటమే యజ్ఞం. 
సద్గుణాలనే అగ్నిజ్వాలల్లో, మనలోని అయోగ్యమూ అవాంఛనీయమూ, అపవిత్రం ఐనవన్నీ ఆహుతులుగా సమర్పించడం గూడా యజ్ఞమే. 

అలాగే జ్వాజ్వల్యమానమైన భక్తి, సమర్పణ, సేవ తపస్సు మార్గానికంకితం కావటమే యజ్ఞం యొక్క పరమ తత్వం..

యజ్ఞానికి అధిదేవత అగ్ని. అగ్నిజ్వాలలు అగ్నికి ప్రతీకలు. పవిత్ర మైన భగవాధ్వజం- అరుణారుణ కాంతుల యజ్ఞజ్వాలలకు ప్రతీక...

#భగవాధ్వజం

👉మనం శ్రద్ధ భావనను ఆరాధించేవారమేగాని- మౌఢ్యాన్ని కాదు..
👉మనం విజ్ఞానపు భక్తులమేగాని అజ్ఞానానికి కాదు..
👉మన మునులు, ఋషులు అజ్ఞానాన్ని తొలగించుకొని సత్యము, చిరంతనమూనైన విజ్ఞాన సముపార్జనకై తీవ్రమైన తపస్సు చేసారు. 
చీకటి అజ్ఞానానికి గుర్తు.సూర్యుడు జ్ఞాన జ్యోతికి గుర్తు. మన ప్రాచీన సాహిత్యంలో సూర్యుడు, సూర్యనారాయణుడు ఏడు గుర్రాలు లాగే రథం మీద కూర్చుండినట్లు వర్ణింపబడింది. ఆయన ఉదయించటానికి ముందే- ఆయన రథంపై ఎగురుతున్న కాషాయ ధ్వజం తూర్పు దిక్కున రంగుల కాంతులు విరజిమ్ముతూ కనిపిస్తుంది. చీకటిని చీల్చుకుంటూ, ఉదయకాంతుల ఆగమనాన్ని ప్రకటిస్తూ సూర్యోదయ సమయంలో తూర్పు దిక్కు విరజిమ్మే అరుణకాంతులకది ప్రతీక. సూర్య భగవానుని ఆ ధ్వజమే భగవానుని ధ్వజం.....🚩🚩🚩 భగవాధ్వజం అయింది.

మానవ జీవన వికాసంలోని అత్యున్నత స్థాయి- 
బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస 
వీటిలో
నాలుగవది చివరదీ అయిన ఆశ్రమంలో అంటే- పరిపూర్ణ త్యాగం, సేవ భావాలు అవసరమైన సన్యాసం ఇందు ప్రతిబింబిస్తుంది. 'సన్యాసి' ఆత్మార్పణమనే అగ్నిజ్వాలల మార్గంలో తొట్రుపాటు లేకుండా పయనించాలి.. అందుకొరకు అతనికి సదా త్యాగమయ జీవితాన్ని గుర్తు చేసేదిగానే కాషాయవస్త్రాన్ని సన్యాసి ధరిస్తారు...

ధర్మం ( ధర్మం ), సంపద (అర్థం), కోరిక (కామ) మరియు అంతిమ విముక్తి (మోక్షం) అనేవి భారతీయ (భారతీయ) సంస్కృతి ప్రకారం మానవ జీవితంలోని నాలుగు సాధనలు (పురుషార్థం). వైదిక మతంలో వివరించబడిన 'జీవిత దశ' (ఆశ్రమాలు) వ్యవస్థ వాటిని సాధించడానికి ప్రధాన సాధనం. జీవితంలోని వివిధ దశలలో చేయవలసిన విధులను వివరించేటప్పుడు, మనిషి యొక్క జీవితకాలం 100 సంవత్సరాలుగా పరిగణించబడుతుంది మరియు నాలుగు భాగాలుగా విభజించబడింది. ప్రతి ప్రదర్శన ఒక వేదిక ( ఆశ్రమం ) అంటారు .

#నిజమైన #గురు #ఆరాధన

గురువు ఆరాధించే టప్పుడు మనం ఎట్టి మన స్థితిని పెంపొందించుకోవాలి...???

పూలు, గంధం సమర్పించటం, హారతులీయటం, కేవలం బాహ్యాచారాలు మాత్రమే. గురువులో రూపుకట్టిన సద్గుణాలను మన జీవితంలో అలవరచుకునేందుకు ప్రయత్నించటంలోనే నిజమైన పూజా సాఫల్యం వున్నది. కాబట్టి, సాక్షాత్తు గురువుతో మరింత తాదాత్మ్యం చెందటం నిజమైన ఆరాధన. 

"పుష్పమాలలు పత్రదళములు పుణ్య జల అభిషేక కర్మలు....
చందనము కర్పూర హారతి తృప్తినీయవు మాతృమూర్తికి....
సింహ విక్రములై చెరించేడు లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తుల....
కర్మమయ జీవనము నెగిసేడు తపోజ్వాలలు హారతియగా....."

శివుడవై శివుని పూజించుకోవాలి
"శివో భూత్వా శివం యజేత్" అని ప్రకటించే ప్రాచీన ప్రబోధం ఒకటుంది..
కేవలం ధనసంపాదనను మాత్రమేగాక మన సంపూర్ణ భద్రత, సౌఖ్యములు కూడా సమాజమే మనకు సమకూరుస్తోంది. ఆ విధంగా సమాజ రుణాన్ని, మనకు వీలైనంత అధికంగా తీర్చుకోవటం మన విధి. 

నిజానికి సమాజ ఋణాన్ని తీర్చుకునేందుకు మన శరీరాన్ని, మనస్సునూ, బుద్ధిని సమర్పిస్తూ మనలో సంవేదన శీలత నిర్మాణం చేసేది రోజూకొక గంట సమయం మనం వెచ్చించే దైనందిన శాఖ కార్యక్రమం...
శాఖలో స్వయం సేవకులు అందరూ నిత్యం భగవత్ ధ్వజ ఛాయలో శిక్షణ పొందుతూ సర్వస్వాన్ని దేశహితం కొరకు సమర్పించే విధంగా నిర్మాణం అవుతారు.
#భారత్ #మాతాకీ #జై
 
                          బౌద్ధిక్ -2

#త్యాగ #భావనే #హిందుత్వం....

దుర్లభం త్రయమేవాత్ర 
దైవానుగ్రహ హేతవః
మనుష్యత్వం ముముక్షుత్వం 
మహాపురుష సంశ్రయః

సృష్టిలో అత్యంత దుర్లభమైనవి మూడు విషయాలు – అవి 
#మానవజన్మ, 
#మోక్షప్రాప్తి, 
#మహాపురుషులసాంగత్యం.  
– ఆదిశంకరాచార్య

మానవ జన్మ సర్వశ్రేష్ఠమైనది. ఆత్మ 84 జీవరాశుల గుండా ప్రయాణించి ఎప్పుడో ఒకప్పుడు మానవ శరీరంలో చేరుతుంది. బుద్ధిజీవి అయిన మానవుడు ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. సుఖ శాంతులతో జీవించాలి. అందుకే ఈ ప్రపంచంలోని మేధావులు మానవ సంక్షేమం కోసం అనేక రకాలుగా శోధించారు. అందులో నుండే వివిధ మతాలు, సిద్ధాంతాలు, తత్వాలు, సంపద్రాయాలు పుట్టు కొచ్చాయి.

#ధర్మమే #శాశ్వతం

ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద సిద్ధాంతాలైన #కమ్యూనిజం, #క్యాపిటలిజం కూడా సుఖశాంతుల కోసం వ్యక్తి స్వేచ్ఛను, భౌతికవాదాన్ని గురించి చెప్పాయి. అయితే అవి విఫలం అయ్యాయి. జీవితానికి సంపదలు, సుఖశాంతులే కాదు, అరుదైన ఈ మానవజన్మకు సార్థకత కావాలి. మానవ జన్మ అరుదైనది కనుక అన్ని సుఖాలు ఈ జన్మలోనే పొందాలని పాశ్చాత్యులు అనుకుంటారు. 
కానీ మనం...'

-----------------------------------------------
"చలం చిత్తం చలం విత్తం చలే జీవన యౌవనే
చలా చలే హి సంసారే ధర్మ ఏకో హి నిశ్చలః"

చిత్తం (మనస్సు), విత్తం (ధనం), యవ్వనం, జీవితం చివరికి ప్రపంచం కూడ శాశ్వతం కాదు. ధర్మం మాత్రమే శాశ్వతం అని భావించాము. 

అందుకే సంపన్నులను, ధనవంతులను గొప్పవారిగా మనం భావించలేదు. ధనం శాశ్వతం కూడా కాదు. 
ఉదా:1
అందుకే అలెగ్జాండర్‌ ‘తాను మరణించాక, తన శవపేటికకు రెండు రంధ్రాలు చేసి తన ఖాళీ చేతులు బైటికి కనపడే విధంగా ప్రపంచానికి చూపండి’ అన్నాడు’. ‘అంతపెద్ద రాజు అయుండి కూడా మరణించాక ఖాళీ చేతులతోనే వెళుతున్నాడు కానీ, ఒక్క పైసా కూడా పట్టుకుపోవడంలేదు’ అని దానర్థం.

ఉదా:2
యయాతి అనే రాజు విలాస జీవితం కోసం తన కుమారుని యవ్వనాన్ని కూడా అడిగి తీసుకున్నాడు. కానీ చివరికి ఆనందం పొందలేక పోయాడు. కనుక యవ్వనం కూడా శాశ్వతం కాదు.
జీవితం కూడా బుద్బుధ ప్రాయం. ‘రేపు’ అనేది ఎలా ఉంటుందో తెలియదు. 

ఉదా:3

ధర్మరాజు జీవితంలోని ఒక సంఘటన మనకు అదే చెబుతుంది. తన దగ్గరకు వచ్చిన భిక్షకునికి దానం ఇవ్వడానికి మరుసటి రోజు రమ్మని ధర్మరాజు చెప్పాడు. అది విని భీముడు ఆశ్చర్యపోతాడు. ‘అన్నా ! రేపటి వరకు నీవు మృత్యువును జయించావా?’ అని అడగడంలోని అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి.

#త్యాగానికి #ప్రతీక

అందుకే భారతీయులు భోగమయ జీవనం కోరలేదు. త్యాగమయ జీవనాన్ని స్వీకరించారు. ప్రతి సమాజానికి తనదంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. 
"ఆంగ్లేయులు క్రమశిక్షణకు, జర్మన్లు యుద్ధ నిపుణతకు ప్రతీకలు. మన భారతీయులు త్యాగం, సమర్పణ భావాలకు ప్రతీకలు. మన జీవన తత్త్వంలోనే త్యాగం, సమర్పణ సహజంగా కనిపిస్తుంటాయి."

న ప్రజేయా న కర్మణా న ధనేన
త్యాగేనైక అమృతత్వ మానశుః
అనేది ఉపనిషత్తు వాక్యం. 
జీవితం అమృతమయం కావడమంటే, త్యాగ మయం కావడం తప్ప మరేది కాదు.

మన జీవన పరంపర యజ్ఞభావనతో ముడిపడి ఉంది. యజ్ఞం అంటే సమర్పణ. సమ-అర్పణ. ఇతరులకు అర్పించడం. యజ్ఞం అదే నేర్పిస్తుంది. సమిధలన్నింటిని అగ్ని దేవునికి ఆహుతి ఇస్తూ ‘ఇదం న మమ. ఇదం స్వాహా’ ‘ఇది నాది కాదు, ఇది నీకు అర్పిస్తున్నాను) అంటుంటారు.
‘తేన త్యక్తేన భుంజీతాః’ అనేది మన ఉపనిషత్తులలో చెప్పిన మరొక విషయం. 

ఈశావాస్యమిదం సర్వం, యత్కించ జగత్యాం జగత్|
తేన త్యక్తేన భుంజీథాః, మా గృధ: కస్య స్విద్ధనం||

ఈ సృష్టి సమస్తం ఈశ్వరత్వం వ్యాపించి ఉన్నది. నాదంటూ ఏమీ లేదు. నాకు అవసరమైనంత మేరకు మాత్రమే నేను అనుభవిస్తాను. అది కూడా త్యాగమయ భావనతోనే. అంతకన్నా ఎక్కువగా స్వీకరించడం తగదు. ఈ త్యాగం, సమర్పణ అనేవి అత్యుత్తమ సంస్కారాలు. 

హైందవ జీవనంలో అతి సహజంగా ఇవి అలవడేలా వ్యవస్థ రూపుదిద్దుకుంది.
మన దేశంలో అత్యంత విశేషమైనది కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఒకరి కోసం ఒకరు జీవిస్తారు. ప్రతి ఒక్కరు ఇంకొకరి సంక్షేమం ఆకాంక్షిస్తారు. తమకు లేకున్నా కుటుంబంలోని ఇతరులు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ”నా ఇల్లు’ నుండి ప్రారంభించి నా బస్తి, నా గ్రామం, నా దేశం, ఈ ప్రపంచం’ అంతా ఒక్కటనే భావన వికసించాలనేది మన ఆకాంక్ష. అందుకే ‘ఈ భూమి అంతా ఒక్కటే కుటుంబం (వసుధైక కుటుంబం)’ అని ధ్యేయవాక్యంగా ఉపయోగిస్తాం.

👉ధర్మరక్షణార్థం తన వెన్నెముకను ధారపోసాడు ధధీచి. 
👉ఒక పక్షి కోసం తన శరీరం మొత్తం అర్పించాడు శిబి చక్రవర్తి. 
👉ప్రాణుల బాధలు తొలగించడానికి సర్వస్వార్పణ చేసాడు మహారాజు రంతిదేవుడు. 

నత్వహం కామయే రాజ్యం.
న స్వర్గం, నా పునర్భవం.
కామయే దుఃఖ తప్తానాం
ప్రాణినా మార్తి నాశనం.

క:-కోరను రాజ్య సుఖంబును.
కోరను స్వర్గంబు నిజము. కోరను ముక్తిన్.
కోరెద దుఃఖార్తుల దరి
చేరి, తపన బాపి, రక్ష సేయుండనుచున్.
భావము:- రంతి దేవుడు తన హృదయములో ఇలా అనుకొంటున్నాడు. నేను రాజ్య సంపద కోరను. స్వర్గము ప్రాప్తింప జేయమని కోరను. జన్మ రాహిత్యము వాంఛింపను. సంసార దుఃఖ సంతప్తులైయున్నవారికడనుండి వారి ఆర్తిని బాపి, వారి దుఃఖమును పోగొట్టమని మాత్రము కోరుదును.

👉తనదంతా సమర్పించడానికి సర్వదక్షిణ యాగం చేశాడు రఘుమహారాజు. 
👉స్వధర్మ సంరక్షణకు రాజభోగాలను వదిలి అడవులపాలై కష్టాలను సహించాడు మహారాణాప్రతాప్‌. 
👉సమస్త రాజ్యానికి తాను కేవలం ప్రతినిధిని అని, తన గురువైన సమర్థ రామదాసు రాజు అని ప్రకటించిన ఛత్రపతి శివాజీ, 
👉ఐసిఎస్‌ చదువును స్వతంత్ర సమరం కోసం తృణప్రాయంగా త్యజించిన నేతాజీ, 
👉యౌవ్వనాన్ని వందేళ్ళ జీవితంగా భావించి తనను తానుగా అర్పించుకొన్న భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, మదన్‌లాల్‌ ధీంగ్రా, ఖుదిరాంబోసు; 
👉అతి పేదరికంలో వైద్య విద్యను చదివి, తన గురించి ఆలోచించకుండా జీవితాన్ని గంధపు చెక్కలా అరగదీసిన యుగద్రష్ట డాక్టర్‌ హెడ్గేవార్‌.. ఇలా రాస్తూ పోతే మనదేశంలో ఇటువంటి త్యాగధనుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.

#అదే #హిందుత్వం

స్వభావరీత్యా మనుషుల్ని 4 రకాలుగా భావించవచ్చు. 
మొదటివారు రాక్షసులు. 
వీరికి అన్నీ ఉంటాయి. అవి ఇతరులకు ఉంటే సహించలేరు. ఇతరులు ఎదుగుతూంటే పీడిస్తూ ఆనందిస్తారు. 

రెండవవారు పశుప్రవృత్తి కలిగినవారు. ఈ వర్గంవారు తమకు తాము సంపాదించుకొని జీవిస్తారు. ఇతరుల దగ్గర లాక్కొని తాము బ్రతుకుతూ ఉంటారు. 

మూడవ వారు మానవులు. తాము జీవిస్తూ ఇతరులకు సహకరిస్తారు. 

నాలుగవారు నారాయణులు. తమకు ఏమీ లేకున్నా, ఎన్ని కష్టాలున్నా, ఇతరులకు మేలుచేసి, వారు సుఖంగా ఉంటే వీరు ఆనందిస్తారు.

మనుషులలో రాక్షస, పశు ప్రవృత్తులు ప్రబలకుండా, మానవత్వం వైపు నడిపించి, అక్కడి నుండి నారాయణ స్వరూపులుగా మార్చే ప్రయత్నమే హిందుత్వం.

#సమర్పణ

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘం ఈ హిందుత్వం ఆధారంగా జాతి వైభవాన్ని పునర్నిర్మాణం చేయడానికి పరిశ్రమిస్తున్నది. అందుకు వ్యక్తి వ్యక్తిని కలిసి, స్వయంసేవకులుగా తయారు చేస్తూ, వారిలో త్యాగం, సమర్పణ భావాలను పెంపొందిస్తున్నది. దానికి మార్గమే గురుదక్షిణ కార్యక్రమం.

వ్యక్తి శాఖకు రావడంతోనే త్యాగం, సమర్పణ అలవడటం ప్రారంభం అవుతుంది. 24 గంటలలో 23 గంటలు తనకు, ఒక గంట సమాజం కొరకు అనే ఈ భావన స్వయంసేవకులను ఎలాంటి త్యాగానికైనా సంసిద్ధం చేస్తుంది. అలా ఒక గంటతో ప్రారంభించి అనేక గంటలు, రోజులు, సంవత్సరాల తరబడి సమాజ సేవలో స్వయంసేవకులు మునిగి తేలుతుంటారు. నవ యువకులు విద్యాభ్యాసం పూర్తిచేసుకొని తమ జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని కేటాయించి ప్రచారకులుగా పని చేస్తుంటారు. అలా యవ్వనంలో భవిష్యత్‌ గురించి ఆలోచించకుండా, వివాహం, కుటుంబం వంటి సౌకర్యాలు లేకుండా, ఏ కీర్తినీ ఆశించకుండా, పేరు ప్రతిష్ఠలు కోరకుండా, ఎలా అంటే అలా, ఎక్కడ అంటే అక్కడ పనిచేస్తుంటారు. ఇది ఒక అద్భుతం. వెనుతిరుగకుండా సంపూర్ణ జీవితం సమర్పించేవారు కూడా ఉన్నారు. 
👉సమాజంలో అన్నింటి మధ్య జీవిస్తూ, సన్యాస జీవితం గడపడంకన్నా త్యాగం ఏముంటుంది ?
👉అలాగే అనేకమంది గృహస్థు కార్యకర్తలు తమ వృత్తి, వ్యవహారాలు చూసుకొంటూ సమాజం కోసం అధిక సమయం ఇస్తూ పని చేస్తుంటారు. ఎట్టి అవకాశాలు కోరుకోకుండా ఉన్నదాంట్లోనే సరిపెట్టుకుంటారు. 
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇరుగు పొరుగు వారు అధికంగా సంపాదిస్తూ ముందుకు పోతున్నా వారిని చూసి చలించిపోరు. కుటుంబం కోసం తగినంత సమయాన్ని కేటాయిస్తూ, గృహస్థాశ్రమాన్ని సమర్థంగా నిర్వహించుకొంటూ, సంఘ కార్యానికి ఏ మాత్రం తగ్గకుండా సమయం కేటాయించి పనిచేసే లక్షలాది కార్యకర్తలు ఉన్నారు.

‘ధనం, సంపద మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ కాలం మళ్ళీరాదు’ అనుకొంటూ స్వయంసేవకులు ధనంతోపాటు అత్యంత విలువైన సమయం కూడా సమర్పిస్తారు. సమాజం కోసం తమ ఇష్టాలను పక్కనపెట్టి, నిష్కామంగా సంపూర్ణ మనస్సుతో అన్ని పనులు చేస్తారు. దీనినే తను, మన, ధన సమర్పణ అంటాం.

#గురుదక్షిణ

గురుదక్షిణ ఉత్సవం వ్యక్తిలో ఇటువంటి ఉన్నత భావాలు నిర్మాణం చేస్తుంది. ప్రతి సంవత్సరం స్వయంసేవకులు తను, మన, ధన పూర్వకంగా సమర్పణ చేస్తూ, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంత ముందుకెళ్ళామనేది సమీక్షించు కుంటూ ఉంటారు.
గురుదక్షిణ అనేది చందానో, సభ్యత్వమో, దానమో కాదు. అది సమర్పణ. స్వయంసేవకులు దానిని త్యాగం కన్న కర్తవ్యంగా భావిస్తారు. నిరహంకారంతో, నిస్వార్థ బుద్ధితో, నిజాయితీతో, భక్తి శ్రద్ధలతో, పరమ పవిత్ర భగవాధ్వజం ముందు మోకరిల్లి తమను తాము సమర్పించుకుంటారు. ‘పతత్వేష కాయో’ అంటూ చిట్టచివరి శ్వాస వరకు ఈ భాగ్యం కలగాలని కోరుకుంటూంటారు.
స్వయంసేవకులు గురుపూజలో ఇలా ఆకాంక్షిస్తారు..

"తన్‌ సమర్పిత మన్‌ సమర్పిత
ఔర్‌ యహ జీవన్‌ సమర్పిత
ఛాహతా హు దేశ్‌ కే ఔర్‌ భీ కుచ్‌ దూఁగా"
ఓ భారతమాత ! నా తనువు, మనస్సు, ధనము మరియు సంపూర్ణ జీవితం నీకే అంకితం. ఓ భగవంతుడా నాకింకా తృప్తి లేదు. ఈ దేశమాతకు ఇవ్వడానికి నాకు మరికొంత ఇవ్వు.

బౌద్ధిక్ -3

డాక్టర్ జి సంఘ కార్య పద్ధతుల గురించి తన మనసులో రకరకాల భావాలు ఉన్నప్పటికీ అవి ఏవీ కూడా తన ఇష్టానుసారం సంఘంలో ప్రవేశపెట్టలేదు కార్యకర్తల అభీష్టం మేరకే తన నిర్ణయాలను సంఘంలో ప్రవేశింప చేసేవారు
1928వ సంవత్సరంలో వ్యాస పూర్ణిమ నాడు డాక్టర్ జి కాషాయ ధ్వజాన్ని భగవత్ విధంగా సంఘానికి ఒక గురువుగా అందించారు దీని వెనుక మర్మాన్ని సంఘ కార్యకర్తలకు వ్యక్తి కంటే తత్వమే గొప్పదని చెప్పి వారిని అంగీకరించేలా చేశారు

♦️హిందూ సమాజ వికాసానికి గడిచిన 98 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విశేష కృషి చేస్తుంది. హిందూ సమాజం ముఖ్యంగా నలుగురుని జంగమ దేవతలుగా ప్రభలంగా విశ్వసిస్తుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ...

♦️గురువు అనేవారికి హిందూ సంస్కృతిలో విశేష స్థానం ఉన్నది గురు అనగా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వారు..

♦️సృష్టిలో ప్రతి జీవి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటుంది ప్రతి జీవి దానికదే విశేషతను కలిగి భిన్నత్వాన్ని కనబరుస్తుంది.
వాటి యొక్క స్వభావాన్ని గుణాలను పెంచుకోవడానికి బుద్ధి వికాసాన్ని కలిగించుకోవడానికి ప్రత్యేక శిక్షణ అంటూ వాటికి ఏమీ ఉండదు.
కానీ మనిషి అపార మేధో సంపత్తిని కలిగి ఉన్నప్పటికీ చంచలమైన మనస్తత్వం కలిగి ఉన్న కారణంగా బుద్ధి స్థిరత్వాన్ని పొందలేక పోతున్నాడు.

ఆహారం నిద్రా భయ మైథునుంచ సామాన్యమేతత్ పశుభిర్ణరాణాం
ధర్మోహి తేషా మధికో విశేషో 
ధర్మేణా హీనాః పశుభి సమానాః

ఆహారం తినడం, నిద్ర, భయం, సంతానోత్పత్తి అనేవి మనుషులకు జంతువులకున్న సమానమైన లక్షణాలు.. కానీ మనిషికున్న ప్రత్యేకత ఏమిటంటే ధర్మాచరణ.....
ఎప్పుడైతే ఈ ధర్మాన్ని మనిషి విడిచిపెడతాడో అప్పుడు మనిషి అనేవాడు జంతువు కన్నా గొప్పవాడు ఏం కాదు.... తాను జంతువుతోనే సమానం..

♦️అన్నమయ్య కోశం, ప్రాణమాయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయా కోశం అనే ఈ ఐదు పంచకోషాలు మన ఆత్మను నిత్యం చైతన్యవంతంగా ఉంచుతాయి.
ఈ నిత్య చైతన్యం కోసం నిరంతర సాధన అనేది అవసరం.

తల్లిదండ్రులు మనకు శరీరం ద్వారా ఒక రూపాన్ని ప్రసాదిస్తే అందులో ఆత్మను జ్ఞానాన్ని నింపేవాడు గురువు.

♦️మానవుడు తన బుద్ధిని స్థిరపరచుకోవాలనుకుంటే దానికి నిత్యం సాధన చేయాల్సిన అవసరం ఉంది.
ఈ విషయంలో
మనకు రామాయణంలో చక్కటి ఉదాహరణ కనబడుతుంది

రాక్షస స్త్రీ అయిన సూర్పనఖ తన రూపాన్ని మార్చుకొని రాములవారిని మోహించినప్పుడు, రాముల వారి మనసు సూర్పనాక వైపు దృష్టి సారిస్తుంది. అప్పుడు రాములవారి బుద్ధి, వారి మనస్సును నిలువరిస్తుంది.
మనస్సుని తన అదుపులో ఉంచుతుంది......
అదే సమయంలో శ్రీరాముల వారు బుద్ధితో నీకు నేను తగినవాడిని కానని నా తమ్ముడు లక్ష్మణుడే సరైనవాడని పంపుతాడు....
ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే...

కానీ సూర్పనఖ తన అన్న రావణుని దగ్గరికి వెళ్ళినప్పుడు, జరిగిన విషయం చెప్పకుండా నిజాన్ని దాచి, ప్రపంచంలోనే అత్యంత సుందరి అయినా ఒక స్త్రీ నార వస్త్రాలు ధరించిన ఒక అనామకునితో ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్....??? అని రావణున్ని ఉసిగొలిపింది.....

సకల శాస్త్ర పారంగతుడైన రావణుడు చెల్లెలి మాట విని, తన మనస్సును బుద్ధిని నియంత్రించుకోలేక సీతాపహరణ గావించాడు.....

ఆ తర్వాత మనందరికీ తెలిసిందే.....మిగిలింది రావణ కాష్టం మాత్రమేనని.......

కాబట్టి ఎప్పుడైనా మనసు అనేది చంచలమైనది.... అది ఎప్పుడు కోరికల ప్రవాహంలో కొట్టుకుపోతుంది.. బుద్ధి అనేది ఆ ప్రవాహాన్ని నియంత్రించకపోతే జరగబోయే అనర్థాలు తీవ్రంగా ఉంటాయని మనకు ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది.

♦️జ్ఞాన, అజ్ఞాన విచక్షణ ద్వారానే బుద్ధి, మనస్సు అను ఈ రెండు అంశాల మధ్య మనకు తారతమ్యం తెలుస్తుంది.... ఈ విషయాన్ని తెలియజేసే వారే మనకు‌ గురువు అని పిలువబడుతారు..

♦️సంత్ కబీర్ దాస్ ఒక సందర్భంలో ఇలా అంటాడు....
నీ ముందు భగవంతుడు మరియు గురువు ప్రత్యక్షమైతే ముందు నువ్వు ఎవరికి నమస్కరిస్తావు...? అంటే నేను ముందు నా గురువుకు నమస్కరిస్తాను...అంటాడు ఎందుకంటే ఆ భగవంతున్ని నాకు ప్రత్యక్షం చేపించినవారు నా గురువు కాబట్టి నేను ముందు నా గురువుకే నమస్కారం చేస్తానని అంటారు.
ఈ విధంగా గురువు యొక్క ప్రాశస్యాన్ని సంతు కబీర్దాస్ తెలిపారు..

♦️ఎవరో అనామకులు మనకు ఏదో ఒక సందర్భంలో సాయం చేస్తే మన కృతజ్ఞతలు చెప్తాము మరి మనము ఉన్న అజ్ఞానాన్ని తొలగించి బుద్ధిని ప్రసాదించి మనల్ని ఒక ప్రయోజకులుగా తీర్చిదిన్న మన గురువులకు మనం ఎంత రుణపడి ఉండాలి ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు ఆలోచించాలి.

♦️వేల ఏండ్లుగా గ్రీకు,హుణ,శక,కుషాన,మొగలుల వంటి విధర్మీయ, విదేశి దాడులని తిప్పుకొడుతూ హిందూ సమాజం తన అస్తిత్వాన్ని నిలుపుకుంటూ వస్తుంది.
కానీ చివరగా బ్రిటిష్ వాళ్లు వ్యాపారం కై వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు మన హిందూ సంఘర్షణ చరిత్రను అధ్యయనం చేసి హిందూ జాతి యొక్క పోరాట పటిమను మరియు సాంస్కృతిక వారసత్వ పరంపరను చూసి ఆశ్చర్యపోయారు. దీనికి మూలం ఎక్కడ ఉందని అన్వేషణ ప్రారంభించారు.

♦️ఈ దేశంలో భారతీయ విద్యా వ్యవస్థ అనేది అత్యంత పకడ్బందీగా అమలవుతుందని ఇది కేవలం వారినీ భావి జీవితంలో
నిలదొక్కుకోవడానికే గాక సాంస్కృతిక వారసత్వాన్ని ఒకతరం నుండి మరో తరానికి అందించడానికి విద్యావ్యవస్థ ఒక వారధిగా ఉంటుందని బ్రిటిష్ వాళ్ళు భావించారు.

♦️బ్రిటిష్ విద్యావేత్త లార్డ్ మెకాలే కుటిలోపాయంతో భౌతికంగా హిందువులను జయించడం సాధ్యమయ్యే పని కాదని హిందుత్వను, భారతీయతను సమూలంగా నాశనం చేయడానికి ఉన్న ఏకైక మార్గం భారతీయ విద్యా వ్యవస్థను నాశనం చేయడం 
మాత్రమే ఒకే ఒక పరిష్కారమని భావించి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు.

దీని కారణంగా భారతీయులు మానసికంగా ఆంగ్లేయులుగా శారీరకంగా మాత్రమే భారతీయులుగా ఉంటారని తెలిపాడు.....

♦️ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి మనం ఇప్పుడు ఆజాదికి అమృత మహోత్సవాలు నిర్వహించుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ మనలో బానిస భావాలు ఇంకా పూర్తిగా పోలేవు.

♦️మన నిత్యజీవిత వ్యవహారాల్లో, మన కుటుంబ పద్ధతుల్లో, మన వేష భాషల్లో ,మన కట్టు బట్టల్లో ఇప్పటికీ బానిసత్వమే కనబడుతుంది.

*ఉదాహరణకు..*
🚫పుట్టినరోజు వేడుకల్లో దీపాలనర్పడం...
🚫ఇతర దేశస్తుల వస్త్రధారణను గుడ్డిగా అనుకరించడం...
🚫విదేశీ భాషల పట్ల మోజు
🚫మన ప్రాచీన సాహిత్యం పట్ల చిన్నచూపు
🚫 చివరాకరుకు మన పేర్లను కూడా మరిచిపోయి విదేశాలలో కుక్కలకు పెట్టుకునే పేర్లను ఈరోజు మనం మన ఇంట్లో పిల్లలకు పెడుతున్నాము.

♦️ ఎప్పుడైతే మనలోపల భారతీయత లోపించిందో, అప్పటినుండే మనలోపల స్వాభిమానం, స్వావలంబన అనేవి చచ్చిపోయినవి.

♦️ అఖండ భారత్ గా ఒకప్పుడు వెలసిల్లిన భారతదేశం...,ఎక్కడెక్కడ అయితే ఈ దేశం యొక్క ఆత్మ అయిన హిందుత్వం కనుమరుగుతూ వచ్చిందో ఆ ప్రాంతాలన్నీ ఈరోజు అన్యాక్రాంతమై దేశద్రోహులకు ఆశ్రయ కేంద్రాలు అయ్యాయి.

మన ఇంటి రక్షణకే చుట్టూ ప్రహరీ గోడలు కట్టే మనము, ఈరోజు దేశంలో అనేక భూభాగాలు అన్యాక్రాంతమైతే మనకేం పట్టనట్లు ఉంటున్నాం ఏమి...???
మన ఇల్లు ఈ దేశంలో లేదా...??
ఈ దేశం సురక్షితంగా ఉంటేనే గా నువ్వు నేను మనము ఇక్కడ ఉండేది......

♦️ దేశం, ధర్మం సురక్షితంగా ఉండేంతవరకే మనమందరం ఇక్కడ ఉంటాము... ఇప్పుడైతే దేశ ధర్మాలకు ఆపదలస్తాయో వాటిని ఎదుర్కోవడానికి మన శక్తి సరిపోకపోతే మీరు సంపాదించిన ఆస్తులు అంతస్తులు అవన్నీ కూడా విదర్మీయుల సొంతమవుతాయి...
కావున నిత్య హిందూ చైతన్య జాగృతం అనేది అవసరం..

♦️ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ వ్యక్తిని గురువుగా ఎన్నడు భావించలేదు... సంఘము తత్వాన్ని మాత్రమే ఆరాధిస్తుంది.... ఆ తత్వాన్ని పరంపరాగత చరిత్రకు, త్యాగానికి సాక్షాధారమైనటువంటి పరమ పవిత్ర కాషాయ ధ్వజాన్ని సంఘం గురువుగా భావించింది....

♦️చైతన్యవంతమైన సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించేందుకు గురువు అవసరం.. హిందూ సమాజానికి అనాదిగా ప్రతీకగా నిలుస్తున్న ఈ కాషాయ పతాకం భగవధ్వజ్ ను గురువుగా స్మరిస్తూ మనం ప్రతి సంవత్సరం గురుపూజ నిర్వహిస్తాం.
ఈ గురు పూజ ద్వారా స్వయంసేవకులలో సమర్పణ అనే సంస్కారాన్ని పెంపొందించడం జరుగుతుంది. 

♦️ ప్రతి స్వయంసేవక్ తను మను ధన పూర్వకంగా తమ గురువు అయినటువంటి పరమ పవిత్ర భగవద్ ధ్వజానికీ సమర్పించడం జరుగుతుంది.

బౌద్ధిక్ -4
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘము భగవాధ్వజాన్ని తన గురువుగా స్వీకరించింది. గురుపూర్ణిమ సందర్భంగా దేశమంతటా గురుదక్షిణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అయితే సంఘం భగవాధ్వజాన్ని గురువుగా ఎందుకు స్వీకరించిందన్న ప్రశ్న ఉదయిస్తుంది.?

గురుదక్షిణ : 

సంఘము తన  ప్రతి శాఖలో  వ్యాసపూర్ణిమ /గురుపూర్ణిమ రోజున గురుపూజ, కార్యక్రమాన్ని నిర్వహించే యోజన చేస్తుంది. ఇందుకు రెండు ముఖ్య కారణాలున్నాయి. మొదటిది-ప్రాచీన భారత దేశానికి సంబంధించిన గురు – శిష్య పరంపరను కొనసాగించుట. శిక్షణ పూర్తి చేసుకొన్న శిష్యులందరు సాదరంగా, కృతజ్ఞతాపూర్వకంగా యథాశక్తితో గురు దక్షిణ సమర్పిస్తారు. దీనిలో ధనరాశే కాకుండా కృతజ్ఞతా భావన నిండిఉంటుంది. గురుపూజా  కార్యక్రమాన్ని చాలా నిష్ఠతో చేస్తారు.

గురుపూజా కార్యక్రమం కూడా శాఖా కార్యక్రమం వలే ఏదైనా గది లేదా సభా మందిరంలో భగవాధ్వజం ఎగురవేయడంతో  ప్రారంభమవుతుంది. కానీ ఆ రోజు కేవలం ధ్వజపూజ, బౌద్దిక్ కార్యక్రమం మాత్రమే ఉంటుంది. పూజించే ధ్వజం దగ్గర దూప, దీపాలు పెట్టి అక్కడ సంఘ సంస్థాపకులైన డాక్టర్ హెడ్గేవార్, రెండో సర్ సంఘచాలక్ మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ (గురూజీ), భారతమాత  చిత్రపటాలను ఉంచుతారు. ధ్వజానికి పూజ చేయడానికి వాటి దగ్గర పుష్పాలనుంచుతారు.

కార్యక్రమ సూచన అందరికి ఇస్తారు. ఒక్కసారి శాఖకు వచ్చిన స్వయంసేవకున్ని కూడా గురుపూజలో తప్పకుండ ఉండేలా చూస్తారు. క్రొత్త స్వయం సేవకులను  ఈ సంఘటనములో కలుపుటకు చేసే ఈ పని ఎంతో మహత్వపూర్ణమైనది.

గురుదక్షిణ కార్యక్రమం చాలా నిష్టతో  కూడి ఉంటుంది. గురువు పట్ల శ్రద్ధ, కృతజ్ఞత లాంటి ఆధ్యాత్మికత నిండిన వాతావరణం ఏర్పడుతుంది. ఇది కొత్త స్వయంసేవకుల పైన ఎంతో  ప్రభావం చూపుతుంది. ఈ సందర్భంగా స్వయం సేవకులు దేశభక్తి గీతాలు సామూహికంగా పాడుతారు.

ఈ కార్యక్రమములో ప్రత్యేకంగా ఆహ్వానించబడిన విశిష్ట వ్యక్తి లేదా సంఘ పెద్దఅధికారి ఉపన్యాసం స్వయం సేవకులనుద్ధేశించి ఉంటుంది. శాఖ ఉన్న ప్రాంతములోని డాక్టర్లు, లాయర్లు, లెక్షరర్లు, సైన్యములో పదవీ విరమణ పొందిన పెద్ద  అధికార్లు లేదా మరెవరైనా పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిని ముఖ్యవక్తగా ఈ గురుదక్షిణ కార్యక్రమానికి రావాలని సంఘం కోరుకొంటుంది. ఇలా రాష్ట్రీయ స్వయం సేవకసంఘంతో ఇతరులను కలుపుట ద్వారా వారి  మద్దత్తు సంఘానికి లభిస్తుంది. ఇప్పటి వరకున్న అనుభవమేమనగా, గురుదక్షిణ కార్యక్రమం రోజు ముఖ్యవక్తగా మొదటిసారి వచ్చిన వ్యక్తి ఎంత ప్రభావితం చేయబడతాడంటే, ఆయన స్వయంసేవకుడు కానప్పటికిని, ఆయన జీవనపర్యంతం సంఘాన్ని ప్రశంసించే వ్యక్తిగా, మిత్రునిగా ఉంటాడు.

రోజువారి శాఖా కార్యక్రమం వలె ఈ గురుదక్షిణ కార్యక్రమం కూడా ప్రార్థనతో ముగుస్తుంది. 

ఈ గురుదక్షిణ  పద్దతి సంఘం ప్రారంభదినములలోనే చేశారు. 

మొదటిది-సమాజాన్ని సంఘ‌టితం చేయుట,  ఈ సంఘ‌టితం ద్వారా కేవలం సంఘం లోపలనే సంఘం నడపడానికి కావలసిన ధన వ్యవస్థను ఏర్పరచుకొనుట. 

రెండవది-సంఘానికి సర్వోన్నతమైన గురువు భగవధ్వజమనే భావాన్ని స్థాపనచేయుట.

కాలాంతరములో రోజూ నియమిత రూపములో శాఖకురాని స్వయంసేవకులను కూడా కనీసం ఒకసారి సంఘానికి కలుపాలనే ఉద్ధేశ్యముతో గురుదక్షిణ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. వీరు సంవత్సరంలో కనీసం ఒకసారైనా  అందరిని  పరస్పరం కలువగలరు. కాలానుగుణంగా అనేక మంది స్వయంసేవకులు విభిన్న క్షేత్రాలలో సమాజాన్ని సంఘ‌టితం చేయుటలో దేశమంతటా వ్యాపించి ఉన్నారు. అటువంటి స్వయం సేవకులకు సంఘకార్యాలయము గాని లేదా మరేదైన సభామందిరములో  గురుదక్షిణ కార్యక్రమం ప్రత్యేకంగా చేయవలసి ఉంటుంది. ఇందులో రోజు నియమిత రూపంలో శాఖకు రాని స్వయం సేవకులు ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వాధికారులకు, విలేకరులకు, వైద్యవృత్తి సంబంధిత విశిష్ట వృత్తులవారికి గురుదక్షిణ కొరకు వీలును బట్టి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలి. సంవత్సరంలో ఒకసారి మాత్రమే గురుదక్షిణ చేస్తారు. సాధారణంగా నెలలో గురుదక్షిణ కొరకు ఒకసారి లేదా రెండుసార్లు తేదీలను ఏర్పాటు చేస్తారు. శాఖ, దానికి సంబంధించిన ఇతర క్షేత్రాలవారి సౌలభ్యం కొరకు ఈ కార్యక్రమ తేదీలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రీయ స్వయంసేవ‌క్సం సంఘ్‌లో కార్యకర్తలు ఎన్నడు కూడ ఈ పరంపరను  ఉల్లంఘించరు. ఇది అన్నిటికన్న ఉన్నతమైనది, పునీతమైన కార్యక్రమమని వారు భావిస్తారు. (అరుణ్ ఆనంద్ –సంఘం గురించి తెలుసుకోండి. డిల్లీ – ప్రచురణ – 2017,పేజీ 41-51)

 భగవాధ్వజమే గురువుగా ఎందుకు ? : 

అడ్వాన్స్  కలర్ థెరపీ (రంగులచికిత్స) ప్రకారం కాషాయన్ని  సమృద్ధికి, ఆనందానికి ప్రతీకగా గౌరవిస్తారు. ఈ రంగు కండ్లకు శాంతినివ్వడమే కాకుండా, మానసిక సంతులనాన్ని కలిగించడంతో బాటు క్రోధాన్ని నియంత్రించి సంతోషాన్ని పెంచుతుంది.

జ్యోతీష్యములో కాషాయము బృహస్పతి గ్రహం రంగు. ఇది జ్ఞానాన్నిపెంచి ఆధ్యాత్మికతను ప్రసరింపచేస్తుంది. కాషాయం పవిత్రమైన రంగు. ఇది ఎన్నో యుగాల నుండి మన ధార్మిక కార్యకలాపాలలో, సాధుసంతుల వేశధారణలో ఇమిడి ఉంది. మన పూర్వీకులు భగవాధ్వజం ముందు  శిరస్సు వంచి నమస్కరించారు. సూర్యునిలో ఉన్న అగ్ని, వైదిక యజ్ఞములో సమిధలద్వారా వెలుబడే అగ్ని రంగు కూడా కాషాయపు రంగే.

భరతవర్షములో విదేశీ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా చేసిన యుద్ధాలన్నీ ఈ భగవాధ్వజం ఛాయలోనే జరిగాయి. ఈ కాషాయం ప్రకృతితో కూడా పెనవేసుకొంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలలో ప్రకృతి పునర్జన్మించినట్లు భావన కలుగుతుంది. సూర్యుని ఎరుపు రంగు నకారాత్మక తత్వాలను కడిగివేస్తుంది.

ప్రాచీన ఇతిహాసం: 

లంకా నగరం పైన రావణునితో చేసిన యుద్ధంలో భగవాన్ రాముడు రఘువంశపు ధ్వజమైన కాషాయపు నీడలో చేసాడు. స్కందపురాణం ప్రకారం రఘువంశపు ధ్వజం పైన మూడు రేఖలు ఉంటాయి. దానిపైన వారి కులదేవత అయిన సూర్యుని చిత్రం ముద్రించి  ఉంటుంది. దాని వెనక భాగం ఎరుపు రంగులో ఉంటుంది. (ధ్వజ మనుష్యు శీర్షం రామాయణ్ యుద్ధ కాండ- 100.14). యుద్ధభూమికి వెళ్ళే సమయములో యోధులు తమ చేతులతో స్వయంగా రథంపైన ధ్వజాన్ని అలంకరిస్తారు. మహాభారత కాలంలో అర్జునుడు తన రథం “నందిఘోష్ “చుట్టు తిరిగి ,కవచాన్ని ధరించిన తరువాత తన చిహ్నమైన కపి ధ్వజాన్ని రథంపై ఎగురవేసేవాడు. అర్జునుని ధ్వజంపైన భగవాన్ హనుమంతుని చిత్రం ముద్రించి ఉండేది.

మొగలులకు వ్యతిరేకంగా భగవాధ్వజం : 

మహారాణా ప్రతాప్ హల్దీ ఘాటీ యుద్ధములో ఈ భగవాధ్వజాన్ని ఉపయోగించాడు.

 17 వ శతాబ్దములో బికనీర్ రాజ్యం రాజపతాకం కూడా కాషాయం, ఎరుపు రంగులో ఉండేది. దానిపైన గ్రద్ద ఆకారం ముద్రించి ఉంది. ఈ  గ్రద్ద దేవీ దుర్గామాతకు ప్రతీక. జోద్ పూర్ రాజ్యం ధ్వజం ఐదు రంగులు కలిసి ఉండేదట. దీనిలో కాషాయం, గులాబీ, తెలుపు, ఎరుపు , పసుపు రంగులు ఉండేవి. నాగపూర్ బోంస్లే రాజులు కూడా ఈ భగవాధ్వజాన్ని ఉపయోగించారు. మహారాజు ఛత్రపతి శివాజీ కూడా ఈ భగవాధ్వాజాన్ని ఉపయోగించాడు. అలాగే ఝాన్సీ  మహారాణీ లక్ష్మీబాయీ కూడా  యుద్ధంలో ఈ భగవాధ్వజాన్ని ఉపయోగించింది.

బ్రిటిష్ కాలంతో భారతదేశంలో భగవాధ్వజం :

మిస్ మైక్లియోడ్ గారికి సోదరి నివేదిత 5 ఫిబ్రవరి 1905 రోజున ఒక ఉత్తరం ఇలా వ్రాసింది “మేము జాతీయ జెండాకు రూపకల్పన చేయవలసి ఉంది. దానిపైన ఓ వజ్రాయుధ ముద్ర ఉండాలి. కాని ఒక జెండా తయారు చేసాము. మా అజ్ఞానం వలన చైనా దేశపు జెండాను ఆదర్శముగా చేసికొని నల్లని రంగును ఎన్నుకొన్నాము. నల్లని రంగును భారత దేశములో ఇష్టపడరు. కావున తర్వాత తయారు చేసే జెండాలో సిందూరపు , పచ్చని రంగు ఉంటుంది”. (ప్రవాజ్యుల ఆత్మప్రాణము – సోదరి నివేదిత, రామకృష్ణ వివేకానందులు-1961, పేజీ 189)

1905లో సోదరి నివేదిత ఇంద్రుని వజ్రాయుధమున్న ఒక ధ్వజాన్ని తయారు చేసింది. దీని రంగు ఎరుపు, పచ్చ రంగు కలిగి ఉంది. 1906లో కలకత్తా నగరంలో కాంగ్రేస్ పార్టీ మహాసభలలో సోదరి నివేదిత తయారుచేసిన జెండాను ప్రదర్శించారు. ఆ మహాసభలకు దాదాబాయీ నౌరోజీ అధ్యక్షత వహించారు. సోదరి నివేదిత తయారు చేసిన జెండా చతురస్రాకారంగా ఉండి ఎరుపురంగుతో నిండి ఉంది. దాని చుట్టు 108 జ్యోతులున్నాయి. పచ్చని రంగులో వజ్రాయుధము, కుడివైపు ‘వందే’ అని ఎడమ వైపు ‘మాతరం ‘అని ముద్రించబడి ఉంది.

భారత జాతీయ కాంగ్రెస్‌ ద్వారా భగవాధ్వజాన్ని ఉపయోగించుట : 

జాతీయ జెండా మితి 1931లో తన రిపోర్టు ఇచ్చింది. 2 ఏప్రిల్ 1931లో భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభలు  కరాచీలో జరిగాయి. దానిలో ఓ ప్రస్తావన  చేసారు. ఏడుగురు సభ్యుల సమితి సిద్ధముగానున్న జెండా పైన ఉత్పన్నమవుతున్న సమస్యలకు జవాబు వెతుకుతూనే కాంగ్రెస్‌ పక్షాన ప్రస్తావించబడిన కొత్త జెండా పైన తమ అభిప్రాయాలను తెలిపే బాధ్యతను ఆ కమిటీకి అప్పగించారు. అన్ని రుజువులతో 31 జులై 1931 వరకు రిపోర్టు ఇవ్వాలని కమిటీకి  అధికారాలను అప్పగించారు. ఆ సమితిలోని సభ్యులు 1.సర్దార్ వల్లబ్బాయి పటేల్, 2.మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్, 3.మాస్టర్ తారా సింహ్, 4. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, 5.ఆచార్య డి.బి.కాలేల్కర్, 6.డాక్టర్ ఎన్.ఎస్.హార్దికర్, 7.డాక్టర్ బి,పట్టాభి సీతరామయ్య, (సమన్వయ కర్త)

దీని తర్వాత వెంటనే సమితి ద్వారా కింద  తెలిపిన ప్రశ్నలు త‌యారు చేసింది. వీటిని అన్ని ప్రాంతాలకు పంపిణి చేసారు.

1. మీ ప్రాంత ప్రజల సమూహము లేక సముదాయము దగ్గర జాతీయజెండా రూపకల్పన గూర్చి ఏమైనా సమాచారం ఉందా? ఉన్నచో మీ అభిప్రాయాలను సమితి దృష్టికి తీసుకురండి.

2. జెండాను ప్రజామోదం చేయడానికి మీ దగ్గర ఏమైనా సలహాలు, సూచనలున్నవా?

3. ప్రస్తుతమున్న జెండా రూపంలో ఏమైనా అనుచితమైనవి గానీ లేక లోటుపాట్లు గానీ కనిపిస్తే వాటిపట్ల శ్రద్ధ కనబర్చగలరని కోరుతున్నాము.

రిపోర్టు సారము : 

 జాతీయ జెండాకు ఏ రంగు ఉపయుక్తముగా ఉంటుందో సమితి నిర్ణయం చేయవలసి ఉంటుంది. మన ఆలోచనా ఏమిటనగా జెండా గొప్పగా, కళాత్మకముగా. నియమాలు కలిగి, సాంప్రదాయకముగా ఉండాలి. అందరి ఏకాభిప్రాయము ఏమనగా మన జాతీయజెండా ఒకే రంగు కలిగి ఉండాలి. ఒకవేళ ఒకే రంగైతే ఎక్కువ మంది భారతీయులు స్వీకరించేదై ఉండాలి.అది ప్రాచీన సనాతన పరంపరతో మిళితమై ఉండాలి. అది కేసరి లేదా కాషాయం రంగు మాత్రమే అవుతుంది. జెండా రంగు కాషాయమే ఉండాలని అనుభవపూరకంగా చెప్పారు. జెండాతో బాటు లోపలి యంత్రము రంగు ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. దీనికోసం సర్వసమ్మతితో చెరఖా(రాట్నము)ను ప్రస్తావించారు. దీనికి బదులుగా ఇతర యంత్రాలైన నాగలి, కమలంపువ్వు, మొదలైన వాటిపైన చర్చ జరిగింది. కాని  రాట్నానికే అంతిమ ముద్ర వేశారు. ఎందుకనగా వాస్తవానికి స్వాతంత్ర పోరాట సమయంలో రాట్నమే మహత్వపూర్ణమైన ఆయుధమైంది. దీని స్థానాన్ని మరే ఇతర యంత్రము తీసుకోలేదు. మనమిప్పుడు రాట్నము రంగును నిర్ణయించాలి. మొత్తానికి సమితి రాట్నము రంగు నీలిరంగులో ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందుచేత మనం జాతీయజెండా కేసరి రంగులో ఉండాలని కోరుకొంటాము. అలాగే దానికి ఎడమ వైపు, రాట్నము పై అంచు వరకు నీలిరంగు ఉండాలి. ఝండాను ఎగురవేయడానికి పొడవు వెడల్పుల నిష్పత్తి 3*2లో ఉండాలి.

రాష్ట్రీయ స్వయంసేవక  సంఘము – భగవాధ్వజము : 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం, స్వయంసేవకులు ఏ వ్యక్తిని గాని లేదా ఏ గ్రంథాన్ని గాని కాకుండా   భగవాధ్వజాన్ని మాత్రమే  తమ మార్గదర్శకుడిగా   గురువుగా గౌరవిస్తారు. ఎప్పుడైతే డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రవచించారో అప్పుడే చాలామంది స్వయంసేవకులు సంఘాన్ని స్థాపించినందుకు డాక్టర్జీనే సంఘ‌ట‌న‌ గురువుగా ఉంటారని  ఊహించారు. ఎందుకనగా వారందరికి డాక్టర్ హెడ్గేవార్ వ్యక్తిత్వము అత్యంత ఆదరణీయము, ప్రేరణదాయకము కూడా. ఇది ఒత్తిడిగల కోరికే అయినప్పటికి డాక్టర్ హెడ్గేవార్ హిందూ సంస్కృతి, జ్ఞానము, త్యాగము, సన్యాసానికి ప్రతీక అయిన భగవాధ్వజాన్ని(కాషాయపు ధ్వ‌జం) గురువు రూపములో ప్రతిష్ఠించడానికి నిర్ణయించారు. హిందూ పంచాంగము ప్రకారము ప్రతి సంవత్సరము వ్యాసపూర్ణిమ (గురు పూర్ణిమ) రోజున సంఘస్థానములో ఒకచోట చేరి స్వయంసేవకులందరు భగవాధ్వజానికి నియమపూర్వకంగా పూజచేస్తారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రతి సంవత్సరము నిర్వహించాలని యోజన చేసిన ఆరు ఉత్సవాలలో గురుపూజా ఎన్ని విధాలుగా చూసినా మహత్వపూర్ణమైనదే.

సంఘము స్థాపించిన మూడు సంవత్సరాల తర్వాత 1928 లో గురుపూజా యోజన చేసారు. అప్పటినుండి ఈ పరంపర నిర్విఘ్నంగా నడుస్తున్నది. భగవాధ్వజము స్థానము సంఘములో సర్వోన్నతము చేయబడింది. ధ్వజప్రతిష్ఠ సర్ సంఘచాలక్ (సంఘ ప్రముఖ్) కంటే ఉన్నతమైనది.

కాషాయపు జెండాకు అంత ఉన్నతమైన స్థానమెందుకిచ్చారు? ఈ ప్రశ్న చాలామంది మనసుల్లో మొదట ఉత్పన్నమవుతుంది. భారతదేశము ఇతర దేశాలలో ఇలాంటి ధార్మిక, ఆధ్యాత్మిక ఏకీకరణలు ఎన్నో జరిగాయి. వాటన్నింటిలో స్థాపకున్నే గురువుగా భావించి, అతనిని పూజించే పరంపర కొనసాగింది. భక్తి ఉద్యమములో ఈనాటికి కూడా ఏ వ్యక్తినైనను గురువుగా స్వీకరించడములో ఎలాంటి అడ్డంకులు లేవు. ఇలాంటి ప్రాచుర్యములో ఉన్న ఆనవాయితీని కాదని డాక్టర్ హెడ్గేవార్ తన స్థానములో భగవాధ్వజాన్ని గురువుగా గౌరవించాలని చేసిన  ఆలోచన ప్రపంచములోని సమకాలీన చరిత్రలోనే అద్భుతమైనది, మొదటిది కూడా. ఏ సంఘ‌ట‌న అయితే విశ్వములోనే అన్నిటికన్న ఉన్నతమైన స్వయంసేవకుల సంఘ‌ట‌నగా తయారైందో దాని సర్వోన్నతమైన పదవి ఒక ధ్వజానికి లభించడం ఆలోచించవలసిన విషయం. సంఘము గొప్ప నాయకులందరు ఈ విషయము మీద ధ్వజం గొప్పతనాన్ని వ్యక్తపరచడానికి ప్రయత్నించేవారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం పరిశీలకుడు  హెచ్.వీ.శేశాద్రి ప్రకారము ” భగవాధ్వజము శతాబ్దాలనుండి భారతీయ సంస్కృతి  పరంపరలో శ్రద్ధాపూర్వకమైన ప్రతీకగా ఉంది. ఎప్పుడైతే డాక్టర్ హెడ్గేవార్ సంఘాన్ని ప్రారంభించాడో అప్పటినుండి ఆయన ఈ ధ్వజాన్ని స్వయం సేవకుల ముందు సమస్త జాతీయ ఆదర్శాల కంటే ఉన్నతమైన ప్రతీకగా చెప్పినాడు. ఆ తర్వాత వ్యాసపూర్ణిమ రోజు ధ్వజాన్ని గురువు రూపంలో పూజించే పరంపరను ఆరంభించాడు “.

అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ (ABVP), భారతీయ మజ్దూర్ సంఘ్(BMS), వనవాసీ కళ్యాణాశ్రమం (VKA), భారతీయ కిసాన్ సంఘ్ (BKS), విశ్వహిందూ పరిషద్(VHP) లాంటి ఎన్నో సంస్థలు ఈ భగవాధ్వజాన్ని స్వీకరించాయి. ఈ విధంగా దేశమంతటా సంఘశాఖలన్నింటిలో ప్రత్యేకాకారం కలిగిన భగవాధ్వజాన్ని ప్రతిదినము ఎగురవేస్తుంటారు. సంఘము ద్వారా ప్రేరణ పొందిన ఎన్నో సంస్థలు తమ సార్వజనిక ఉత్సవాలలో కాషాయపు జెండాను ఎగరవేయడం చాలా  ధశాబ్దాలనుండి వస్తున్నది. ఈ కాషాయపు రంగు జాతీయ ప్రతీక రూపములో భారత దేశంలోని కోట్లాదిమంది మనస్సుల్లో విశిష్టమైన స్థానాన్ని ఏర్పరచుకొంది.

 శేశాద్రి గారు ఈ విషయములో చర్చిస్తూ రాష్ట్రీయ స్వయం సేవకసంఘం కార్మికుల మధ్య పని చేస్తూ కాషాయధ్వజం నాయకత్వం పైన  జనసమ్మతిని తెలుపుట ఎంతో కొనియాడదగినది. ఎందుకనగా ఈ కార్మిక క్షేత్రములో దీర్ఘకాలము ప్రపంచమంతటా సామ్యవాద ఆందోళన దాని ఎర్రజెండా ప్రభావం చాలా ఉంది. భారతీయ మజ్దూర్ సంఘ్ తమ కార్మికుల చేత విశ్వ కళ్యాణానికి ప్రతీక అయిన కాషాయధ్వజాన్ని స్వీకరించేలా చేసింది. ఎన్నో సంవత్సరాల సంఘర్షణ తరువాత శ్రామిక ఐక్యతకోసం భారతీయ మజ్దూర్ సంఘ్ తమ విభిన్న కార్యక్రమాలతో కాషాయధ్వజాన్ని గొప్పగా ఎగరవేసే స్థాయికి చేరుకొంది. ఎప్పుడైతే 1981  మార్చిలో భారతీయ మజ్దూర్ సంఘ్ తమ ఆరవ జాతీయ మహాసభలను సామ్యవాదపు ప్రభావమున్న  కలకత్తా నగరపు వీధులకుండా పెద్ద ఊరేగింపు నిర్వహించిందో, అప్పుడే ఎర్రజండా పట్టిన  వేలమంది కార్మికుల చేతులలో కాషాయపు  జెండా చూసి పుర  ప్రజలు ఆశ్చర్యచకితులైయ్యారు. కలకత్తా నగరపు ప్రముఖ పత్రికలన్నీ ఆ సమయములో కార్మికులలో వచ్చిన ఈ కొత్త కాషాయపు అనుభూతిని కొనియాడినవి.

సంఘ‌ మహారాష్ట్ర ప్రాంతపు కార్యవాహ (కార్యదర్శి) ఎన్.హెచ్.పాల్కర్ గారు భగవాధ్వజం పైన ఒక మనసును రంజింపచేసే పుస్తకం వ్రాసారు. మరాఠీ భాషలో వ్రాసిన ఈ పుస్తకం 1958లో ముద్ర‌ణ అయింది. తరువాత ఇది హిందీలోకి అనువాదం అయింది. 76పేజీల ఈ పుస్తకం ప్రకారం సనాతన ధర్మములో వైదికకాలంనుండి భగవాధ్వజం ఎగురవేసే ఆచారం ఉంది. పాల్కర్ ప్రకారం “వైదిక సాహిత్యములో వర్ణింపబడిన” అరుణకేతువు “అనే కాషాయపు జెండా హిందూ జీవనశైలిలో ఎల్లప్పుడు ప్రతిష్ఠాత్మకమైన  స్థితిని పొందింది. ఈ ధ్వజము హిందువులను అన్ని కాలాలలో  విదేశీ ఆక్రమణల నుండి పోరాడుటకు, విజయము పొందుటకు  ప్రేరణ ఇస్తూ వచ్చింది. ఇది హిందువులలో జాతీయతను రక్షించడానికి ,పోరాటపటిమను జాగృతము చేయడానికి చక్కగా  ఉపయోగపడుతూ వస్తుంది.” పాల్కర్ గారు భగవాధ్వజానికి  జాతీయచరిత్రను  సిద్ధింపచేయుటకు ఎన్నో చారిత్రక సంఘటనలను ఉల్లేఖించారు.  వాటిలో కొన్ని ఘటనలు ఈవిధంగా ఉన్నవి.

సిక్కుల‌ పదవ గురువు గురు గోవింద్ సింగ్ హిందూధర్మాన్ని రక్షించడానికి వేలమంది సిక్కు వీరుల సేనకు నేతృత్వము వహించాడు. అప్పుడు ఆయన కాషాయపు ధ్వజాన్నే ఉపయోగించాడు. ఈ ధ్వజం హిందువులలో కలిగిన  పునఃజాగరణకు ప్రతీక. ఈ జెండా ప్రేరణతో మహారాణా రంజిత్ సింగ్ పరిపాలనాకాలములో  సిక్కు సైనికులు అఫ్ఘనిస్తాన్ రాజ్యము కాబూల్ వరకు విజయం సాధించారు. ఆ సమయంలో సేనాపతి హరిసింహ్ నల్వా సైనికులకు నేతృత్వము వహించాడు.

పాల్కర్ ఇంకా ఈ విధంగా వ్రాసాడు. ఎప్పుడైతే రాజస్థాన్ పైన మొగలుల ఆక్రమణ జరిగిందో అప్పుడు రాణా సంగ్రామ్ సింహ్  మహారాణా ప్రతాప్ నాయకత్వములో విదేశీఆక్రమణదారులను ఆపుటకు రాజపుత్రవీరులు భగవాధ్వజము ప్రేరణ తీసికొని చారిత్రక యుధ్ధమే చేసారు. ఛత్రపతి శివాజీ  వారి మిత్రులు కూడా  మొగల్ రాజుల పరిపాలన నుండి విముక్తి పొంది హిందూ రాజ్య స్థాపన చేయుటకు భగవాధ్వజం నీడలోనే నిర్ణయాత్మకమైన యుద్ధాలను చేసారు.

పాల్కర్  గారు మొగల్ ఆక్రమణదారుల దాడులను విఫలము చేయుటకు దక్షిణ భారతదేశములో విజయనగరరాజుల సేన చేసిన ప్రతిఘటనలో భగవాధ్వజం నేర్పిన శౌర్యము బలిదానాల ప్రేరణను  కూడ ఉల్లేఖించారు. మధ్యకాలంలో ప్రసిద్ధి పొందిన భక్తి ఉద్యమంలో గాని, హిందూధర్మంలోని లోటుపాట్లను సరిచేసి పునః జాగృతం చేయడంలో  గాని, భగవాధ్వజం లేదా సాధువులు ధరించే కాషాయపు రంగే ప్రధానమైన భూమిక పోషించింది. భారతదేశపు అనేక మఠాలపైన, మందిరాలపైన భగవాధ్వజాన్ని శౌర్యానికి, త్యాగానికి ప్రతీకగా భావించి ఎగురవేస్తారు.

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857లో భారతదేశపు మొదటి స్వాతంత్ర సంగ్రామంలో ఈ కాషాయపు జెండా ఛాయలోనే విప్లవకారులు ఏకత్రితమైయ్యారు. పాల్కర్ గారు పుస్తకము ముగింపులో “భగవాధ్వజం సంపూర్ణ చరిత్రను అధ్యయనం చేయగా స్పష్టమైన విషయమేమనగా హిందూ సమాజాన్ని వేరుచేయడం సాధ్యము కాదని, ఈ ధ్వజము హిందూ సమాజానికి, హిందూ రాజ్యానికి సహజసిద్ధమైన ప్రతీక”. అని వ్రాసారు.

సంఘశాఖల్లోగాని, శిక్షణా శిబిరాలలో గాని భగవాధ్వజం గొప్పతనం పై ఉపన్యాసం ఇచ్చే సమయంలో పాల్కర్ గారు తన పుస్తకములో  ఉల్లేఖించిన ముఖ్యవిషయాలనే స్వయం సేవకులకు చెప్పుతారు. రచయిత సంక్షిప్తంగా హిందూ దేశము, హిందూ సమాజము, హిందూ సంస్కృతి, హిందూ జీవన విధానము,  హిందూ దర్శనము మొదలైన  వాటిలో కూడా భగవాధ్వజం పెనవేసుకున్నట్లు చూసారు. ఈ ధ్వజం త్యాగము, బలిదానము, శౌర్యము, దేశభక్తి, మొదలైన వాటికి ఎల్లప్పుడు ప్రేరణ ఇస్తుంది. ఈ ధ్వజము హిందూ సమాజపు నిరంతర సంఘర్షణకు, విజయలక్ష్మీలకు సాక్షీగా ఉంది.
హిందూ సంస్కృతి, హిందూ దేశము అనే భావాన్ని భగవాధ్వజం లేకుండా హిందూ ధర్మాన్ని ఊహించ లేము. (ధర్మ శబ్దము హిందూ పండితుల ప్రకారము నిర్వచించబడింది. ధర్మమనగా జీవన విధానము. ఇది ఆచారవ్యవహారాలు,కర్మకాండల వరకే పరిమితం కాదు). సంస్కృతి దేశము  జీవన విధానము. హిందూ సంస్కృతి మన దేశపు జీవన విధానము. భగవాధ్వజమే హిందూ సంస్కృతి ప్రతీక. పాల్కర్ ఇచ్చిన సాక్ష్యాలు  అత్యంత మహత్వపూర్ణమైనవి. భగవాధ్వజానికి శాసనపరమైన గౌరవమిచ్చారా లేదా అనేదానిపై ఆధారపడి ఉండదు. ఈ కారణంగానే ఇప్పుడు కూడ సామాజిక, రాజకీయ ఏకీకరణ జరిగినప్పుడు  గాని, జాతి ఉపజాతులకు కూడా భగవాధ్వజం ఆదరణీయమైనది.

ఇది హిందూ సమాజపు ఆకాంక్షలకు ప్రతీక. దానిలో ఆ ఆకాంక్షలను సాకారం చేయడానికి సమాజాన్ని ప్రేరితము చేసే శక్తి కూడ ఉంది. ఈ శక్తి మనకు కనిపించనప్పటికి సంఘ‌టిత‌మై హిందూ సమాజంలో ఆ శక్తిని తప్పకుండా మనం చూడగలం.

భగవాధ్వజాన్ని గురువు రూపములో ప్రతిష్ఠించడం వెనక సంఘం దార్శనికత ఏమనగా ఏ వ్యక్తినైనా గురువుగా ప్రకటించినప్పుడు ముందే ఆయనలో కొన్ని బలహీనతలుండి ఉండవచ్చు లేదా కాలాంతరములో ఆయనలోని సద్గుణాలు తగ్గిపోవచ్చు. కాని ధ్వజం మాత్రం నిర్ధిష్టముగా శ్రేష్ఠగుణాలను అందిస్తుంది.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముఖ్యముగా మూడు కారణాలచేత భగవాధ్వజాన్ని గురువుగా స్వీకరించింది.

1. ధ్వజంతో బాటు చరిత్ర కూడ జోడింపబడిఉంది.ఈ చరిత్ర ఎవరినైనా  ఏకం చేసి వికసింపచేయుటకు సహాయపడుతుంది.

2. భగవాధ్వజంలో సంఘ స్థాపనకు మూలాధారమైన సాంస్కృతిక జాతీయవాదపు ఆలోచనా ధార ఎక్కువగా ప్రతిబింబిస్తుంది.

3. వ్యక్తి స్థానంలో సాంస్కృతిక జాతీయవాదానికి ప్రతీక అయిన భగవాధ్వజానికి సర్వోన్నత స్థానమిచ్చారు.
ఎందుకనగా  సంఘము సఫలము కావాలంటే వ్యక్తి కేంద్రిత సంగఠన జరగకూడదు.ఈ ఆలోచన చాలా సఫలమైంది. ఫలితంగా గత 98సంవత్సరాల సంఘ జీవనకాలంలో విభిన్న క్షేత్రాలలో సంఘ‌ట‌న‌ చాలా విస్తరించింది. సంఘములో సర్వోన్నత పదవి తీసికొన్నను ఎలాంటి వివాదాలు రాలేదు. ఇలాంటి సంఘ‌ట‌న‌లో భావిఅధికారపు  అగ్రనాయకత్వము కొరకు ఎలాంటి పోటీలు  లేకపోవడం ఆశ్చర్యజనకము. చాలా పరిమితులను దృష్టిలో ఉంచుకొని డాక్టర్ హెడ్గేవార్ భగవాధ్వజాన్ని గురువుగా స్వీకరించాలని నిర్ణయించారు.

సంఘ సర్వోన్నత అధికారి (సర్ సంఘ‌చాల‌క్‌) నుండి మొదలుకొని స్వయం సేవకులందరు భగవాధ్వజానికి సాదరపూర్వకంగా నమస్కరిస్తారు. సంఘము అనేక శాఖలలో సంవత్సరమంతా ప్రతిదినమూ ఎగరవేసే భగవాధ్వజం ధశాబ్దాలనుండి సాంస్కృతిక జాతీయవాదానికి ప్రేరణ ఇస్తుంది.ఈ కారణంగానే సంఘ స్వయంసేవకులు లోతైన ఆలోచనాధారను కలిగి ఉంటారు.

బౌద్ధిక్ -5*

ఆత్మసాక్షాత్కారం పొందిన గురుపరంపరను పూజించే రోజు ఆషాఢ పౌర్ణమి, గురుపౌర్ణమి. వేద వాజ్మయాన్ని, బ్రహ్మసూత్రాలను, మహాభారతాన్ని, భగవద్గీతను, అష్టాదశ పురాణాలను సమస్త మానవాళికి అందించిన వేదవ్యాసుల వారిని, తమతమ సంప్రదాయాలను అనుసరించి గురుపరంపరను పూజించుకునే రోజు ఆషాఢ పౌర్ణమి. అదే గురుపౌర్ణమి.

గుశబ్దస్త్వం ధకారః స్యాత్‌ – ‌గుశబ్దస్తన్నిరోధకః అంధకార నిరోధిత్వాత్‌ – ‌గురురిత్యాభిధీయతే (16)

అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వారిని గురువు అంటారని అద్వయ తారక ఉపనిషత్‌లో పేర్కొన్నారు.

జ్ఞానసంపన్నమై గురుపరంపర వేలాది సంవత్స రాలుగా సమస్త హిందూ సమాజానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్త్తున్న కారణంగా సనాతన ధర్మం శాశ్వత ధర్మంగా కొనసాగుతోంది. త్రిమతాచార్యులు ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వా చార్యుల నుంచి మార్గదర్శనం చేస్తున్న ఎందరో గురువుల అనుగ్రహంతోనే భారతీయ సంస్కృతి పరిఢవిల్లుతోంది.

వ్యక్తి జీవితంలో లభించే మార్గదర్శనమే కాకుండా యావత్‌ ‌సమాజాన్ని సాంస్కృతిక విలువలతో జోడించడంతోపాటు సమాజం బలహీన మైనప్పుడు దిశానిర్దేశం చేసే బాధ్యతను రుషులు, ఆచార్యులు, గురువులే స్వీకరించారు. వాల్మీకి, వేదవ్యాసుడు, భీష్మపితామహుడి గురువైన పరశురాముడు, అర్జునుడి గురువు ద్రోణాచార్యుడు, వసిష్ఠుడు, గాయత్రీ మంత్రాన్ని అందించిన విశ్వామిత్రుడు తదితరులు అందరూ వందనీయులు, నిత్యస్మరణీయులు.

సిక్కు గురుపరంపర, సమర్థ రామదాసు, విరజానంద, రామానంద, రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్య, రమణ మహర్షిలాంటి వారు గత నాలుగైదు వందల సంవత్సరాల్లో సమాజానికి రక్షణనిచ్చే నేతృత్వాన్ని అందించారు. హిందూ సమాజ సంఘటనను, సాంస్కృతిక విలువలను, ధర్మాచరణను పెంపొందించి, హిందూ రాష్ట్ర వైభవాన్ని పునః స్థాపించేందుకు విశిష్టమైన గురు పరంపరే ఆధారమని సంఘస్థాపకులు పరమపూజ్య డాక్టర్‌జీ భావించారు. ‘సంఘకార్యం కానీ, దాని ఆలోచనా ప్రవాహం కానీ మనం కొత్తగా రూపొందిం చినది కాదు. మన పవిత్ర హిందూ ధర్మం, ప్రాచీన సంస్కృతి, హిందూ రాష్ట్రం, అనాదిగా వస్తున్న పరమపునీత భగవధ్వజం… వీటిని సంఘం అందరి ముందు ఉంచింది. పైన పేర్కొన్న విషయాల్లో నూతన చైతన్యాన్ని ప్రసరింప చేసే పరిస్థితికి అనుగుణమైన నూతన కార్యపద్ధతి సంఘానికి అవసరమౌతుంది. దీనిని సంఘం అంగీకరిస్తుంది’ అని డాక్టర్‌జీ తెలియజేశారు.

తదనుగుణంగానే ‘పరమపవిత్ర భగవధ్వజమే సంఘంలో గురువు స్థానంలో ఉంటుంది’ అని 1928లో మొదటి గురుపూజ కార్యక్రమంలో డాక్టర్జీ ప్రకటించారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘం ఏ వ్యక్తినీ గురువుగా స్వీకరించదు. పరమ పవిత్ర భగవధ్వజమే తన గురువు. ఎంత గొప్ప వ్యక్తి అయినా శాశ్వతం, పరిపూర్ణుడు కాడు. కాలం వ్యక్తిని బంధిస్తుంది. కానీ తత్వం శాశ్వతమైనది. భగవధ్వజం శాశ్వత తత్వానికి ప్రతీక. దానిని ధరించిన మాత్రంతోనే జాతి సంపూర్ణ ఇతిహాసం, ఉత్కృష్టమైన సంస్కృతి, సంప్రదాయాలు మనసును స్పృశించి నూతన ప్రేరణ కలుగుతుంది.

కర్మతో, సంతానంతో, ధనం’తో కాకుండా త్యాగ సమర్పణ భావనతోనే అమృతత్వాన్ని సాధించాలని సన్యాససూక్తం తెలియజేస్తుంది. అందుకే స్వామి వివేకానందుల వారు Sacrifice and Renunciation are twin ideals of Indian Culture అని తెలియజేశారు. సన్యాస ధర్మానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది కాబట్టి ఆశ్రమ ధర్మాలలో గొప్పదైన సన్యాస ధర్మానికి కాషాయ వర్ణం కల్పించారు.

త్యాగ సమర్పణ భావాన్ని రుషులు, మహర్షులు, ఆచార్యులు, గురువులు నిరంతరం సమాజానికి అందించారు కాబట్టే గొప్ప వీరులు, రాజులు, త్యాగ ధనులు, సమాజ సంస్కర్తలు, దేశభక్తులు ఆవిర్భ వించారు. ఛత్రపతి శివాజీ, రాణాప్రతాప్‌, ‌గురు గోవిందసింగ్‌, ‌వివేకానంద తదితరులు దేశం కోసం సర్వస్వాన్నీ త్యాగం చేసి భావితరాల దేశభక్తులకు ఆదర్శంగా నిలిచారు.

త్యాగం, సమర్పణ విలువలను విస్మరిస్తే మిగిలేది స్వార్థమే. పరమపూజ్య డాక్టర్‌జీ, పరమపూజ్య గురూజీ జీవితం త్యాగం, సమర్పణలతో కూడినది. పరమపవిత్ర భగవధ్వజ ఛాయలో వారు ఆ ఆదర్శాన్ని ముందుంచి ధర్మాన్ని, సంస్కృతిని రక్షించే లక్షలాది వ్యక్తుల నిర్మాణం చేయగలిగే కార్యపద్ధతిని వికసింపచేశారు. ‘రాష్ట్రాయ స్వాహా ఇదం న మమ’ అనే భావనే గురూజీ జీవన సందేశం.

ఇలాంటి త్యాగ, సమర్పణ భావన సూచించ డానికి, అలాగే జీవితంలో ప్రత్యక్ష ఆచరణగా మారటానికి గురుపూజోత్సవంలో గురుదక్షిణ కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. సముపార్జించిన విలువైన డబ్బులో దేశధర్మాల కోసం సమర్పించే గుణం స్వయంసేవకుల జీవితంలో గురుదక్షిణ ద్వారా నిర్మితమైనది. ధన సమర్పణతో లభించిన ప్రేరణతో జీవితాంతం దేశం కోసం జీవించారనేందుకు ఉదాహరణే నేతాజీ వద్ద గూఢ•చారి విభాగంలో పని చేసిన సరస్వతీ రాజామణి జీవితం.

1944లో నేతాజీ ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌నిధి సేకరిస్తున్నప్పుడు 16 సంవత్సరాల వయసున్న రాజామణి తన ఇంటిలో బంగారాన్ని, వజ్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. నేతాజీ నమ్మలేక ఆమె తండ్రికి తెలియ చేయగా, ఆమె తండ్రి కూడా కూతురు నిర్ణయాన్ని సమర్థించారు. ఆమె పట్టుదల, దేశభక్తిని చూసిన నేతాజీ ఆమెను తన ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌లోకి తీసుకోవడానికి ఒప్పుకొని బంగారం, వజ్రాలను తిరిగి ఇచ్చేశారు. ఆ రాజామణి తరువాతి కాలంలో సరస్వతీ రాజామణిగా మారి ‘ఫౌజ్‌’ ‌గూఢ•చారిగా ఉంటూ తన స్నేహితురాలు దుర్గతో కలిసి యుద్ధ సమయంలో మారువేషంలో ఎన్నో రహస్యాలు చేరవేసేది. ఆ క్రమంలోనే దుర్గను జైలు నుంచి విడిపించడానికి నర్తకిగా మారి రక్షకభటులకు మత్తుపదార్థం ఇచ్చి స్నేహితురాలితో జైలు నుంచి పారిపోతున్న క్రమంలో జరిగిన కాల్పులలో గాయపడింది. గాయాలతోనే 2 రోజులు అడవిలో గడిపి క్షేమంగా బయటపడింది. ఆమె సాహసానికి మెచ్చిన నేతాజీ ‘భారత మొదటి గూఢ•చారి’ అనే బిరుదు ఇచ్చారు. ఆస్తి సర్వస్వాన్ని సుభాష్‌ ‌చంద్రబోస్‌కు సమర్పించి స్వాతంత్రానంతరం బర్మాలోని ఆస్తిని అమ్ముకుని స్వస్థలం చెన్నైకి చేరారు. 30 సంవత్సరాల వయస్సు నుంచి 2018లో తను మరణించే వరకూ కటిక బీదరికాన్ని అనుభవించారు.

ధన సమర్పణ అనేది త్యాగ భావనను, సమర్పణ భావనను పెంపొందిస్తుంది. కాబట్టి లక్షలాది స్వయంసేవకులు దేశం కోసం తమ శక్తియుక్తులను, విలువైన సమయాన్ని కేటాయిస్తారు. ప్రచారకులుగా జీవితాలను సమర్పిస్తారు. అవసరమనుకుంటే దేశం కోసం బలిదానానికి సిద్ధపడతారు. 1980-90 కేరళతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు అనేక మంది కార్యకర్తలు ప్రచారకులుగా వెళ్లారు. ఉల్ఫా తీవ్రవాదం, క్రైస్తవ, ముస్లిం తీవ్రవాదం తారస్థాయిలో ఉన్నది. అస్సాంలో నవగాంగ్‌ ‌విభాగ్‌ ‌ప్రచారక్‌గా బాధ్యత స్వీకరించిన మురళీధర్‌కు ఉల్ఫా తీవ్రవాదులు చీటీ పంపి బెదిరించారు. కేరళ తిరిగి వెళ్లాలని హెచ్చరించారు. అయినా మురళీధర్‌ ‌భయపడలేదు,అక్కడే కొనసాగారు. కొద్ది మాసాల తర్వాత ఆయనను అపహరించి, చంపి మృతదేహానికి అంత్యక్రియలకు కూడా అవకాశం లేకుండా బ్రహ్మపుత్ర నదిలో పడేశారు. మృత్యువునైనా ఆహ్వానించాడు కానీ కార్యక్షేత్రం వదలని ఆ ప్రేరణ పరమ పవిత్ర భగవధ్వజ ఛాయలో లభించినదే.

ఆగస్టు 1,2005లో మనోజ్‌ ‌చౌహాన్‌ అనే 17 సంవత్సరాల తరుణ స్వయంసేవక్‌కు మరణానంతరం నేషనల్‌ ‌బ్రేవరీ అవార్డును భారత ప్రభుత్వం 2006-2007 సంవత్సరానికిగాను ప్రకటించింది. మనోజ్‌ ‌సాయంత్రం శాఖ ముఖ్య శిక్షక్‌. ‌తండ్రి దివ్యాంగుడు. చదువుకోని తల్లి. వయసులో ఉన్న అక్క, తమ్ముడున్నారు. చాలా పేద కుటుంబం. మనోజ్‌కు గుండెకు సంబంధించిన వ్యాధి ఉండేది. తాము ఉంటున్న కాలనీలో ఆకస్మాత్తుగా వచ్చిన వరద నీటిలో ఇళ్లు మునిగిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా బయటకు రాలేని పరిస్థితుల్లో మనోజ్‌ ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ ఖాళీ డబ్బాలతో, టైర్ల ట్యూబ్‌లతో 30 మంది ప్రాణాలను కాపాడాడు. మరుసటి రోజు నుంచి మనోజ్‌ ‌చౌహాన్‌కు న్యుమోనియా సోకి చనిపోయాడు. జీవితంలో అన్ని ప్రతికూలతల మధ్య కూడా సమాజ, దేశ బాధ్యతలను గుర్తెరిగి, ప్రాణాలు సైతం లెక్కచేయని వేలాది మంది స్వయంసేవకులు నిర్మాణం కావడానికి త్యాగం, సమర్పణ భావనలే మూలం. ప్రతినిత్యం పరమపవిత్ర భగవధ్వజం ఎదురుగా ప్రార్ధన చేసి త్యాగం, సమర్పణ భావనలను ప్రసాదించమని భగవంతున్ని కోరుకోవడమే ప్రధాన కారణం.

కరోనా సమయంలో దేశమంతా ఆశ్చర్య చకితులైన సంఘటన ముంబైలో జరిగింది. నారాయణ దబాడ్‌కర్‌ అనే 85 సంవత్సరాల వయసు కలిగిన స్వయంసేవక్‌ ‌త్యాగభావన ప్రజలందరికీ తెలిసిందే. ఆయన తనకు లభించిన ఆక్సిజన్‌ ‌సిలిండర్‌ను తన కన్నా చిన్న యువకుడి ప్రాణాలు కాపాడటానికి స్వచ్ఛందంగా ఇచ్చి, ఆ తర్వాత ఆక్సిజన్‌ ‌లభించక చనిపోవడం అందరినీ కలచివేసింది. అన్ని పత్రికలూ ఆయన త్యాగాన్ని కొనియాడాయి. ముంబై హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌దీపాంకర్‌ ‌దత్త ఆ విషయాన్ని కోర్టులో ప్రస్తావిస్తూ, ఈ దేశ ప్రజలు ఆ పెద్దమనిషి ముందు నతమస్తకమవుతారని తెలియజేశారు. ఇలాంటి భావనను సంఘం తన కార్యపద్ధతి ద్వారా నిర్మించింది. అలాంటి ప్రేరణ గురుదక్షిణ ద్వారా లభిస్తుంది. గత 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న సంఘ కార్యపద్ధతి ఫలితాలనిస్తోంది. లక్షలాదిమంది కరసేవకుల త్యాగం, సంఘర్షణ ఫలితమే రామజన్మభూమి నిర్మాణం. 450 సంవత్సరాల్లో నాలుగు లక్షల మంది బలిదానాలకు ముగింపును సంఘటిత హిందూ శక్తి సాధించింది.

త్యాగం, సమర్పణ భావాల ప్రతిరూపమే పరమ పూజ్య డాక్టర్‌జీ, గురూజీల జీవితం. వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని పరమపవిత్ర భగవాధ్వజ ఛాయలో జరిగే సాధనయే విశాల హిందూ సంఘటన కార్య నిర్మాణానికి ఆధారమవుచున్నది. స్వామి వివేకానంద చెప్పినట్లు, హిందూ సమాజం జాగృతావస్థలోకి అడుగిడుతున్నది. జాతీయ స్పృహతో హిందూ సమాజం ఆలోచిస్తున్నది.

గురుదక్షిణ కార్యక్రమంలో లభించే స్ఫూర్తే స్వయంసేవకుల జీవితంలో ఎప్పటికీ స్ఫురించాలి. ఆదర్శానికి అనుగుణంగా జీవించే ప్రేరణ లభించాలని ప్రతి సంవత్సరం గురుదక్షిణ సమర్పిస్తాం. దీనిని లక్షలాది మంది స్వయంసేవకులు వ్రత దీక్షగా భావిస్తారు. బృహత్తర కార్యం దేశమంతా కొనసాగటానికి అవసరమైన నిధిని ఈ కార్యక్రమం ద్వారా సమకూర్చుకోవటం సంఘం ప్రత్యేకత. సంఘ దైనందిన కార్యం కోసం అవసరమైన నిధిని స్వయంసేవకులే సమకూర్చుకోవడం వారి మనసులలో దేశ కార్యం పట్ల గల దృష్టి కోణాన్ని సూచిస్తుంది. సంఘ కార్యాన్ని, దేశ కార్యాన్ని దైవ కార్యంగా భావిస్తాం కాబట్టి డబ్బును చందాలాగా కాకుండా సమర్పణ, ఆధ్యాత్మిక భావనతో సమర్పిస్తాము. అది ఒక దైవీ గుణంగా, జీవన సంస్కారంగా మారుతుంది.

గుజరాత్‌ ‌రాష్ట్రంలోని జామ్‌నగర్‌ ‌తరుణ శాఖలో గురుదక్షిణ ఉత్సవం నిర్వహిస్తుండగా, ఒక తల్లి నడుచుకుంటూ వచ్చి ధ్వజం ముందు తన చేతిలోని కవర్‌ను పెట్టి గురుదక్షిణ సమర్పించారు. శాఖ కార్యకర్తలు ఆ తర్వాత వెళ్లి ఆమె గురించి అడుగగా, తన కుమారుడు చిన్న పనులు చేసుకుని బతికే వాడని, తను సంపాదించిన దానిలో సంఘం కోసం దాచేవాడని తెలిపారు. అతను అనారోగ్యంతో మరణించిన తర్వాత అతని వస్తువులు సర్దుతున్నప్పుడు ఈ డబ్బు లభించిందని ఆమె తెలియజేశారు. అత్యంత పేదరికం అనుభవిస్తున్నా కూడా ఆ డబ్బును ఆ తల్లి గురుదక్షిణగా సమర్పించారు.

కెన్యా దేశంలోని ముంబాసా శాఖకు చెందిన రతన్‌ అగర్వాల్‌ అనే యువ స్వయంసేవక్‌ ‌గుండెపోటుకు గురై ఆసుపత్రిలో ఉన్నప్పుడు తాను గురుదక్షిణ కార్యక్రమం వరకు జీవించి ఉండకపోవచ్చునని భావించి తోటి కార్యకర్తలతో తన తరపున గురుదక్షిణ చేయమన్నాడు. అలానే జరిగింది. బర్మింగ్‌హామ్‌లోని గురుగోవింద్‌ ‌శాఖకు చెందిన శ్యామ్‌ అనే తరుణ స్వయంసేవక్‌ ‌దివ్యాంగుడు. తన 6వ ఏట నుండి సోదరునితో కలిసి వీల్‌చైర్‌పై రోజూ శాఖకు వెళ్లేవారు. 2003లో పెద్ద శస్త్రచికిత్స జరిగి శరీరం అంతా కట్లు ఉన్నాయి. అయినా డాక్టర్‌ను బతిమాలి వీల్‌ ‌చైర్‌లో వచ్చి గురుదక్షిణ సమర్పించడం ఒక ఉదాత్త ఆధ్యాత్మిక భావనను సూచిస్తుంది.

పరమపూజ్య డాక్టర్‌జీ ఒక మిత్రుడి ఇంటికి వెళ్లినప్పుడు ఒక చిత్ర పటంపై ‘దేశ్‌ ‌కే లియే మరనా సీఖో’ అనే వాక్యాన్ని చూసి అదే చిత్రపటంపై ‘దేశ్‌ ‌కేలియే జీనా సీఖో’ అని రాశారని మనందరం విన్నాం. రుషిరుణం, సమాజ రుణం మానవ జీవితంలో చెల్లించాల్సినవి కాబట్టి స్వయంసేవకులు అదే భావనతో రాష్ట్రం కార్యం జీవితాంతం చేస్తారు.

‘అఖండమండలాకారం వ్యాప్తమ్‌ ‌యేన చరాచరమ్‌

తత్పదమ్‌ ‌దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః’

వ్యక్తి, సమష్టి, సృష్టి, పరమేష్టి అన్నీ అఖండ మండలాకారంలో అనుబంధంతో పెనవేసుకున్నాయి. అంటే ఈ సృష్టిలో వ్యక్తి, సమాజం, ప్రకృతి (పర్వతాలు, నదులు, కొండలు, కోనలు, వృక్ష సంపద) పశుపక్ష్యాదులు భగవంతుడు మధ్య ఉన్న ఈ సంబంధాన్ని ఎవరి పాదాల దగ్గర కూర్చొని తెలుసుకొని అనుభూతిని పొందుతున్నామో ఆ గురు చరణాలకు నమస్కరిస్తున్నాము. ఈ సృష్టి అంతా కూడా ఒకే దైవీశక్తి నుండి ప్రకటిత మయిందనేది సత్యం. ఈ సత్యాన్ని దర్శింప చేసేవారే గురువు.

‘‘అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానంజన శలాకయచక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః’’

అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుతురును ప్రసరింపజేసేవాడే గురువు. ఇది భారతీయ గురు పరంపర. పూజ్యశ్రీ వ్యాస భగవానుడు మన సమాజానికి ఆది గురువు. ఆషాడ పూర్ణిమను గురుపూర్ణిమ పేరుతో వేలాది సంవత్స రాలుగా మన సమాజం పండుగలా జరుపుకుంటున్నది.

‘‘వ్యాసాయ విష్ణు రూపాయ – వ్యాస రూపాయ విష్ణవే’’ అని విష్ణు సహస్ర నామం చెప్పింది. వ్యాస మహర్షిని శ్రీ మహావిష్ణువు అవతారంగా భావిస్తారు.ఆషాడమాసంలో వచ్చే పౌర్ణమిని గురుపూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా పరిగణిస్తారు. ఇది వేదవ్యాసుని జన్మదినం. ఇతడు పరాశర మహర్షికి, సత్యవతికి, కృష్ణ వర్ణం ( నల్లరంగు)తో ఒక ద్వీపంలో జన్మించాడు. కనుక కృష్ణ ద్వైపాయనుడిగా ఖ్యాతిగాంచాడు. తన తండ్రి పరాశర మహర్షి సంకల్పించి, పోగుచేసిన వేద రాశులను, జ్ఞానాన్ని నిత్య కర్మలలో, క్రతువులలో వాటి వాటి ఉపయోగాన్ని బట్టి ఋగ్‌,‌యజుర్‌, ‌సామ, ఆధర్వణ అను నాలుగు వేదాలుగా ఏర్పరచినందువల్ల వేద వ్యాసుడు అనే పేరుతో సార్థక నామధేయుడైనాడు. తదుపరి బ్రహ్మ ఆశీస్సులతో, సరస్వతి కటాక్షంతో విఘ్నాధిపతి గణేశుడు రాయగా చతుర్వేదాలలోని సారం ప్రతిబింబించే విధంగా ఘనతకెక్కిన మహా భారత ఇతిహాస కావ్యాన్ని రచింపజేశాడు. అందుకే మహాభారతం పంచమ వేదం అయింది. వీటితోపాటు అష్టాదశ పురాణాలను మరెన్నో పురాణేతిహాసలను ప్రసాదించిన పూజ్యుడు.

గురు అన్న రెండు అక్షరాలలో ‘గు’ అనగా తమస్సు లేదా చీకటి. ‘రు’ అనగా చీకటిని తొలగించే వాడు. గురువు వ్యక్తిలోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి, జ్ఞానం అనే జ్యోతితో వెలుగు నింపేవాడు అని అర్థం.భారతదేశంలో గురుపరంపర అనాదిగా వస్తున్నది. త్రిమూర్తులు, నారద ముని నుండి ఈ పరంపర ప్రాంభమైనదని చెప్తూ ఉంటారు. శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలలో కూడా ఈ పరంపర కొనసాగింది.

ఆధునికయుగంలో గురుశిష్య పరంపరలోని త్యాగం, సమర్పణను ఆధారంగా తీసుకొని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘం ఒక సంస్థగా సంఘటిత సమాజ నిర్మాణం కోసం కాషాయ జెండా (భగవాధ్వజం)ను గురువుగా స్వీకరించింది. ఇది ఒక పవిత్రమైన, వినూత్నమైన పద్ధతి. కాషాయ జెండా మన భారతీయ సంస్కృతిలోని త్యాగం, సమర్పణలకు ప్రతీక. భారతదేశ చరిత్రలోని ఉత్థాన, పతనాలకు సాక్షి. దేశ సౌభాగ్యానికి ఆధారం సంఘటిత సమాజమే. సంఘటిత సమాజానికి ఆధారభూతమైన వాడు సాధారణ వ్యక్తి. అందుకే సర్వసాధారణ వ్యక్తులలో త్యాగం, నిస్వార్థ భావన నిర్మాణం చేసేందుకు భగవాధ్వజాన్ని గురువుగా స్వీకరించింది సంఘం. ఇదే సృష్టి వికాసానికి ఆధారం.

తేల్‌ ‌జలే బత్తీ జలే – లోగ్‌ ‌కహే దీప్‌ ‌జలే.

నూనె, ఒత్తి మండుతున్నాయి. కాని ఆ కాంతిని చూసేవారు దీపం మాత్రమే వెలుగుతున్నదని అంటుంటారు. ఇది ప్రకృతి నియమం. కాని వాస్తవానికి వెలుతురును ప్రసాదిస్తున్న నూనె, ఒత్తి రెండూ పేరుకు కూడా నోచుకోకుండా సర్వోన్నత సమర్పణాభావాన్ని ఆకళింపు చేసుకొన్నాయి. విత్తనం నుండి చెట్టు మొలకెత్తుతుంది. అది మహా వృక్షంగా విస్తరిస్తుంది. కాయలు, పండ్లు వస్తాయి. అందులోనుండి విత్తనం లభిస్తుంది. ఇందులో విత్తనం మట్టిలో కలిసిపోయి నష్టపోయిందని ఒక దృష్టికోణం. కానీ విత్తనం తనకు తాను సమర్పించుకొని ఒక చెట్టుగా వికసించి తన జీవితాన్ని సార్థకం చేసుకుందని ఇంకో దృష్టికోణం. అసలు సృష్టి అంతా కూడా ఈ సమర్పణ భావం మీదనే ఆధారపడిందని చెప్పవచ్చు. సృష్టిలో చెట్లు చేమలు, సూర్యరశ్మి సహకారంతో మానవ సమాజం అంతా ఉత్పత్తి చేస్తున్న బొగ్గుపులుసు వాయువును తీసుకొని తమ ఆహారాన్ని తయారుచేసుకుంటాయి. దాని ద్వారా మానవ సమాజానికి అత్యంత అవసరమైన ప్రాణవాయువును అందజేస్తున్నాయి. ఇలాంటి సమర్పణ భావం ప్రతి వ్యక్తిలో నింపడమే గురుపూజ విశిష్టత.

‘శివోభూత్వా, శివం త్యజేత్‌’ ‌శివుడిని పూజించడం అంటే తాను స్వయంగా శివునిగా తయారుకావడమే. గురుపూర్ణిమ రోజున కాషాయ ధ్వజాన్ని పూజిస్తూ ప్రతి వ్యక్తి తన శరీరాన్నీ, బుద్ధినీ, మనస్సునీ, తన సంపూర్ణ సంపత్తిని (తనకు అవసరమైనమేరకు మాత్రమే వాడుకుంటూ మిగిలిన దానిని) సమాజ సేవకు సమర్పణ చేయడమే నిజమైన గురుపూజ. తాను సంపాదించిన శారీరక శక్తికి, బుద్ధిపరమైన శక్తికి, ధనశక్తికి తాను యజమాని కాడు, కానీ కేవలం ధర్మకర్త మాత్రమే అనే భావన ప్రతి హిందువుకి ఉండాలి. అందుకని వ్యక్తి తన నిత్యజీవితంలో త్యాగం, అహంకార సమర్పణయే నిజమైన గురుపూజ.

ఒక స్వామీజీకి ధనికుడైన శిష్యుడు ఉండేవాడు. ఒకసారి ఆ శిష్యుడు స్వామిజీ దగ్గరకు వచ్చి స్వామీజీ! నేను నా ధనాన్ని మొత్తం సమాజానికి దానం చేసేసాను అని అన్నారు. యావత్‌ ‌ధనాన్ని దానం చేశావా? అని ఆశ్చర్యంగా స్వామీజీ అనడంతో వారిని తమ వెంట తీసుకెళ్లి దానం చేసిన తన ఇల్లు, బంగారం మొదలైన ఆస్తినంతా చూపెడుతున్నారు. అపుడు స్వామీజీ ‘‘నిజమే నీ సంపదనంతా దానం చేసావని పదేపదే చెప్పు కొంటున్నావు. దానివలన నీలో నేనే దానం చేసాను అనే భావన పెరిగి సమర్పణ భావం లోపిస్తున్నది. కనుక నేను ఇదంతా దానం చేసాననే భావనను మనసులో నుండి తొలగించుకో. ఎందుకంటే నీకున్న సంపద అంతా భగవంతుడు నీకు ప్రసాదించినదే. నీవు ఆ సొమ్మును సంపా దించడంలో భగవంతునికి ఒక ఉపకరణంగా మారావు. ఈ భావన తోనే నీకు మోక్షం లభిస్తుంది’’ అని శిష్యునికి ఉద్బోధించారు.
స్వయంసేవకులలో ఈ సమర్పణ గుణాన్ని నిర్మాణం చేయడం ద్వారా సమాజంలో కూడా ఈ భావనను నింపడమే గురుపూజ పరమార్థంగా సంఘం భావిస్తున్నది.

గురుపూజ వలన వ్యక్తి జీవితం సార్థకమవు తుంది. వ్యక్తి సమర్పణ భావన వల్ల సమాజం సంఘటితం అవుతుంది. సంఘటిత సమాజం వలన సత్యం, న్యాయం, ధర్మాలకు రక్షణ చేకూరి మన జాతి శక్తిమంతమవుతుంది. భారతదేశం శక్తిమంతవుతుంది. శక్తిమంతమైన భారతదేశమే ప్రపంచశాంతికి ఆధారం అని యోగి అరవిందులు అన్న మాట ఎప్పటికీ స్మరణీయం. ఆచరణీయం కూడా.

राष्ट्रीय स्वयंसेवक संघ

गुरू पूर्णिमा उत्सव

मान्यवर

सनातन काल से ही परम पवित्र भगवाध्वज हिंदू संस्कृति का आदर्श एवं प्रेरणास्त्रोत रहा है। भगवाध्वज हमारा गुरु व मार्गदर्शक है।

गुरु पूर्णिमा के अवसर पर हम प्रतिवर्ष गुरू पूजन सहित गुरुदक्षिणा अर्पण करते है।

अपने क्षेत्र का गुरू पूर्णिमा उत्सव दिनांक 27 जुलाई 2018, शुक्रवार को सूचनानुसार आयोजित होगा । आपकी उपस्थिति सादर अपेक्षित है।

समय :

भवदीय

शाखा कार्यवाह

स्थान :

 "The Sacred Dhwaj: Embodiment of Sacrifice and Knowledge"

These excerpts are divided into **70 numbered sections** [1-70] and discuss various topics, including:
* The significance of the Bhagwa Dhwaj (Saffron Flag) as a symbol of inspiration, ideals, and the goal of life [1].
* The importance of Guru Purnima or Vyasa Purnima, honoring great sages like Vyasa Maharshi, who compiled the Vedas and provided guidance for humanity [1, 2].
* The concept that the Rashtriya Swayamsevak Sangh (RSS) does not consider any single individual as its Guru, prioritizing 'Dhyeya Nishtha' (dedication to the goal) over individual worship [3].
* The Bhagwa Dhwaj as a symbol of national heritage and the concept of 'Yajna' (sacrifice), embodying dedication, service, and self-surrender [4]. It is described as a symbol of the sacrificial flames and the dawn's reddish glow, representing the light of knowledge dispelling ignorance [5].
* The four stages of human life (Brahmacharya, Grihastha, Vanaprastha, Sanyasa) and the significance of the saffron robe worn by a 'Sanyasi' as a reminder of a life of sacrifice [6].
* The true meaning of Guru worship, which involves internalizing the virtues of the Guru rather than mere external rituals [7].
* The Indian philosophy of life, where values like 'Dharma' (righteousness) are considered eternal, unlike transient wealth, youth, or life itself [10, 11].
* The emphasis on a life of sacrifice and dedication in Indian culture, exemplified by historical figures like Dadhichi, Sibi, Rantideva, Maharana Pratap, Chhatrapati Shivaji, Netaji Subhas Chandra Bose, Bhagat Singh, and Dr. Hedgewar [12, 15, 16, 56].
* A classification of human nature into four types: Rakshasas (demonic), Pashu (animalistic), Manava (human), and Narayana (divine), with Hindutva aiming to transform individuals towards the Narayana स्वरूप (divine form) through virtues like selflessness [17].
* The RSS's efforts to rebuild national glory based on Hindutva principles, fostering sacrifice and dedication among its volunteers (Swayamsevaks) through activities like the daily 'shakha' and the 'Gurudakshina' program [18, 20].
* The unique practice of the RSS in adopting the Bhagwa Dhwaj as its Guru, rather than an individual, emphasizing that a person is impermanent while a 'Tattva' (principle/essence) is eternal [21, 31, 32, 42, 55]. This choice reflects a focus on collective ideals and avoids potential weaknesses or limitations of an individual guru [50].
* The historical connection of the Bhagwa Dhwaj to various Indian rulers and freedom fighters, including Lord Rama, Maharana Pratap, Chhatrapati Shivaji, and Rani Lakshmibai [37, 38, 47, 48].
* The role of British education, specifically Lord Macaulay's policy, in attempting to destroy Indian culture and identity [28, 29].
* The Gurudakshina festival is a means for Swayamsevaks to offer their 'Tanu, Mana, Dhana' (body, mind, wealth) as an act of surrender and a review of their progress in the past year, fostering a sense of duty rather than charity [20, 32, 33, 57]. It also serves to connect non-regular volunteers with the Sangh and its ideals [35].
* The philosophical meaning of a 'Guru' as one who removes darkness (ignorance) and imparts knowledge [22, 53, 66].
* Examples of extreme sacrifice and dedication by Swayamsevaks, such as Muralidhar, Manoj Chauhan, and Narayan Dabhadkar, inspired by the ideals of the Sangh and the Bhagwa Dhwaj [58-60].
* The idea that true worship involves becoming like the divine one worships ("Shivo Bhutva Shivam Yajet"), and that real Gurupuja means dedicating one's physical, intellectual, and financial resources to society [68].
* The ultimate aim of Gurupuja is to build a sense of surrender within individuals and society, leading to a strong and united nation that contributes to world peace [70].

Beyond the Individual: The Eternal Spirit of the Sangh

Namaste everyone,

On this special occasion of Guru Pooja, I would like to share three inspiring incidents that beautifully reflect the strength and spirit of our Sangh tradition.


---

1️⃣ A Sangh beyond one personality

If the RSS had been centered around a personality cult, it would have collapsed in 1940 itself — the year when our founder, Dr. Keshav Baliram Hedgewar, passed away.

But that did not happen. In fact, we see the opposite.

No Swayamsevak ever said, “The Sangh cannot survive without me.”

When Dr. Hedgewar’s health declined, some respected people suggested that he form a trust or committee to preserve the organization. But he didn’t agree.

Instead, Swayamsevaks themselves took charge of shaping the Sangh’s future.

The creator departed — but the creation thrived.
The Sangh has not only survived — it has steadily grown, restructured, and reached every part of Bharat.
This is the power of selfless dedication — not to any personality, but to a national vision.


---

2️⃣ Dr. Hedgewar’s view on spiritual Gurus

Once in a casual moment, Dr. Hedgewar asked a Swayamsevak:
“Have you taken any spiritual Guru? Received a mantra or initiation?”

The Swayamsevak replied, “No.”
Dr. Hedgewar smiled and said, “That’s very good.”

He was not against traditions. He respected them deeply.
But he believed: “Charms and rituals often weaken a person’s inner strength. We must not give up our self-effort in the name of devotion.”

He observed that some people, in the name of spirituality, become self-satisfied and disconnect from national responsibilities.
They chase personal liberation — but forget their Rashtra Dharma.

That is why the Sangh does not promote spiritual escapism — it promotes spiritual discipline through seva and samarpan.


---

3️⃣ The meaning behind ‘Daksha’ (Attention)

Whenever we visit a Shakha, the first command we hear is Daksha — Attention!

No matter what our mood or surroundings, every Swayamsevak immediately becomes still, alert, and focused.

Why is this small act important?

Because it builds self-control.

There’s no need for a second command. Daksha is enough to bring unity, focus, and readiness.
This small practice trains us to approach every task — with seriousness and perfection.

Daksha is not just a posture… it is a lifestyle of discipline.


---

🔚 Conclusion

From these three memories of Dr. Hedgewar, we learn:

The Sangh is greater than any one person

Swayamsevaks do not depend on rituals — they depend on conviction

Discipline in small things builds strength for big responsibilities


Let us absorb these lessons and take a firm Sankalp this Guru Pooja —
To not just remember the Guru, but to live his vision, with full commitment as true Swayamsevaks.

Bharat Mata Ki Jai!
Jai Shri Ram!


Comments

Popular posts from this blog

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)